మారుతీ కొత్త సియాజ్ - అప్‌డేటెడ్ వెర్షన్
న్యూఢిల్లీ : సరికొత్త హంగులతో మారుతీ సుజుకీ కొత్త సియాజ్ 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ బుకింగ్స్‌ను కంపెనీ రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఎంఎస్‌ఐ నెక్సా నెట్‌వర్క్ నుంచే ఈ మోడల్‌ను విక్రయించబోతుంది. తొలుత 11 వేల రూపాయలను కట్టి ఈ కొత్త సియాజ్‌ను బుక్ చేసుకోవచ్చు. 319 నెక్సా షోరూంలలో దీని బుకింగ్స్‌ను చేపడుతున్నామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెక్సా వెబ్‌సైట్ నుంచి కూడా దీన్ని ఈ-బుక్ చేసుకోవచ్చు. ఈ వాహనం అనధికారిక బుకింగ్స్‌ను డీలర్లు రెండు వారాల కిందటే ప్రారంభించారు.
మారుతీ సియాజ్ భారత్‌లోకి లాంచ్ చేసి నాలుగేళ్లకు పైగా అవుతుంది. గత ఆరు నెలల నుంచి సియాజ్ విక్రయాలు పడిపోతూ ఉన్నాయి. ఈ అమ్మకాలను పెంచడానికి సరికొత్త హంగులతో కొత్త సియాజ్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెడుతోంది. ఈసారి సియాజ్ ఫ్రంట్ ఎండ్ లుక్స్, ఇంటీరియర్స్‌తో పాటు ఇంజిన్‌లోనూ మార్పులు చేశారు. హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్, టయోటా యారిస్‌లకు ఇది పోటీగా నిలువొచ్చన్నది అంచనా.
ఇవీ హంగులు...
- సియాజ్ ఫ్రంట్ లుక్స్ గతాని కన్నా షార్ప్‌గా ఉన్నాయి.
- 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది.
- ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్
- కొత్త ఎల్‌ఈడీ రియర్ కాంబినేషన్ టైల్‌ల్యాంప్స్
- స్లీకర్ గ్రిల్, క్రోమ్ గార్నిషింగ్, అప్‌డేటెడ్ బంపర్, బ్రో షేప్ హెడ్‌లైట్స్‌తో కాస్త విభిన్నంగా కనిపిస్తుంది.
- ఇంజిన్ పరంగా మార్పులు బాగానే చేశారు. సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. గతంలో ఇది 1.4 లీటర్ ఇంజిన్‌గా ఉండేది. నూతన ఇంజిన్ 103 బీహెచ్‌పీ శక్తిని, 138 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.
- వెనుక భాగంలో పెద్దగా మార్పులేవీ లేవు. అయితే ఇంటీరియర్స్‌లో కొత్తగా లైట్ కలర్డ్ ఫాక్స్ ఉడ్ ఇన్‌లేస్, టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి హంగులద్దారు.
- నెక్సా బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్ కలర్స్‌తో పాటు మరికొన్ని వేరియంట్స్ ఉండవచ్చని అంచనా.
- ధర రూ.7.8 లక్షల నుంచి ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment