Ciaz
-
మారుతీ కార్లపై అదిరిపోయే ఆఫర్స్!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్ జోష్‌ను కొనసాగించి, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్‌లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్, వ్యాగన్-ఆర్ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఆల్టో కే10: పాపులర్ మోడల్ ఆల్టో కే10పై అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. మారుతీ సుజుకి సియాజ్: మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. సెలేరియో: సెలేరియో బేసిక్ మేన్యువల్ వేరియంట్, సీఎన్జీ వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్, జెడ్ ప్లస్ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్సైట్లో గానీ చూడవచ్చు. -
‘‘అంత్యక్రియలకు కూడా అందంగా తయారవ్వాలా?’’
Karanvir Bohra Arriving Sidharth Shukla Home In A Ciaz: బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. ‘‘ఇక స్నేహితుడు మృతి చెంది.. బాధలో ఉంటే.. పాపరాజీలు ఏ మాత్రం జాలి, దయ లేకుండా తాము ఎలాంటి కార్లలో వచ్చాం.. అందంగా ముస్తాబయ్యామా లేదా వంటి అంశాలపై తమని విమర్శిస్తూ వార్తలు రాస్తున్నారని.. వారి నీచ మనస్తత్వానికి జాలి పడుతున్నాను’’ అన్నారు నటుడు కర్ణవీర్ బోహ్రా. విషయం ఏంటంటే సిద్ధార్థ్ శుక్లా మరణం అనంతరం కర్ణవీర్ బోహ్రా అతడిని తల్లిని పరామర్శించేందుకు సిద్ధార్థ్ నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో కర్ణవీర్ సియాజ్ కార్లో సిద్ధార్థ్ నివాసానికి వచ్చాడు. ఇది చూసి పాపరాజీలు సియాజ్ కారులో వచ్చాడు.. పేదవాడిగా మారాడు అంటూ కామెంట్ చేయసాగారు. ఇందుకు సంబంధించిన వీడియోని కర్ణవీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?) దీనిలో అతడు ‘‘కుమారుడిని కోల్పోయి కుంగిపోతున్న తల్లిని చూడటానికి మేం వెళ్లాం. ఇలాంటి విషాద సమయంలో కొందరు పాపరాజీలు చాలా దారుణంగా మాట్లాడారు. ఇంత బాధలో కూడా మేం ఫైవ్‌స్టార్ అప్పియరెన్స్‌తో కనిపించాలా.. కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా.. సియాజ్ కారులో వచ్చినందుకు నేను పేదవాడిని అయ్యానా.. ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలరు’’ అంటూ ఘాటుగా విమర్శించాడా కర్ణవీర్ బోహ్రా. (చదవండి: సిద్దార్థ్‌పై జోక్ చేసిన సల్మాన్, పాత వీడియో వైరల్) View this post on Instagram A post shared by Karenvir Bohra (@karanvirbohra) కర్ణవీర్ బోహ్రా తన భార్యతో కలిసి సిద్ధార్థ్ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాక.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్ధార్థ్ మరణంపై స్పందిస్తూ కర్ణవీర్ ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను చాలా షాక్‌లో ఉన్నాను. ఇది ఎలా జరిగింది. దేవుడు మనతో ఇలాంటి జోక్‌లు చేయడం దారుణం. అతడి కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. (చదవండి: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?!) View this post on Instagram A post shared by Karenvir Bohra (@karanvirbohra) -
రూ.11 వేలకే కొత్త సియాజ్ బుకింగ్
న్యూఢిల్లీ : సరికొత్త హంగులతో మారుతీ సుజుకీ కొత్త సియాజ్ 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ అప్డేటెడ్ వెర్షన్ బుకింగ్స్‌ను కంపెనీ రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఎంఎస్ఐ నెక్సా నెట్వర్క్ నుంచే ఈ మోడల్‌ను విక్రయించబోతుంది. తొలుత 11 వేల రూపాయలను కట్టి ఈ కొత్త సియాజ్‌ను బుక్ చేసుకోవచ్చు. 319 నెక్సా షోరూంలలో దీని బుకింగ్స్‌ను చేపడుతున్నామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెక్సా వెబ్సైట్ నుంచి కూడా దీన్ని ఈ-బుక్ చేసుకోవచ్చు. ఈ వాహనం అనధికారిక బుకింగ్స్‌ను డీలర్లు రెండు వారాల కిందటే ప్రారంభించారు. మారుతీ సియాజ్ భారత్‌లోకి లాంచ్ చేసి నాలుగేళ్లకు పైగా అవుతుంది. గత ఆరు నెలల నుంచి సియాజ్ విక్రయాలు పడిపోతూ ఉన్నాయి. ఈ అమ్మకాలను పెంచడానికి సరికొత్త హంగులతో కొత్త సియాజ్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెడుతోంది. ఈసారి సియాజ్ ఫ్రంట్ ఎండ్ లుక్స్, ఇంటీరియర్స్‌తో పాటు ఇంజిన్‌లోనూ మార్పులు చేశారు. హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్, టయోటా యారిస్లకు ఇది పోటీగా నిలువొచ్చన్నది అంచనా. ఇవీ హంగులు... సియాజ్ ఫ్రంట్ లుక్స్ గతాని కన్నా షార్ప్‌గా ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కొత్త ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ టైల్ల్యాంప్స్ స్లీకర్ గ్రిల్, క్రోమ్ గార్నిషింగ్, అప్డేటెడ్ బంపర్, బ్రో షేప్ హెడ్‌లైట్స్‌తో కాస్త విభిన్నంగా కనిపిస్తుంది. ఇంజిన్ పరంగా మార్పులు బాగానే చేశారు. సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. గతంలో ఇది 1.4 లీటర్ ఇంజిన్‌గా ఉండేది. నూతన ఇంజిన్ 103 బీహెచ్పీ శక్తిని, 138 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో పెద్దగా మార్పులేవీ లేవు. అయితే ఇంటీరియర్స్‌లో కొత్తగా లైట్ కలర్డ్ ఫాక్స్ ఉడ్ ఇన్లేస్, టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి హంగులద్దారు. నెక్సా బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్ కలర్స్‌తో పాటు మరికొన్ని వేరియంట్స్ ఉండవచ్చని అంచనా. ధర రూ.7.8 లక్షల నుంచి ప్రారంభం -
విక్రయాల్లో పడిపోయిన మారుతి
పండుగ సీజన్లో కార్ల విక్రయాలు జోరు కొనసాగుతుండగా.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మాత్రం ఈ అక్టోబర్ నెల విక్రయాల్లో స్వల్పంగా పడిపోయింది. గతేడాది 1,34,209 యూనిట్లగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది 1,33,793 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా విక్రయాలు మందగించినప్పటికీ, దేశీయ అమ్మకాల్లో మారుతి మెరుగైన పెరుగుదలనే నమోదుచేసింది. దేశీయంగా 2.2 శాతం అమ్మకాలు పెంచుకుని 1,23,764 యూనిట్లగా నమోదుచేసినట్టు ఎంఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 అక్టోబర్‌లో ఈ విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకీ ఉత్పత్తులకు డిమాండ్‌గా బలంగానే ఉందని కంపెనీ పేర్కొంది. సియాజ్, ఎస్ క్రాస్, ఎర్టిగా, బ్రిజా, బాలెనో రిటైల్ విక్రయాలు అత్యధికంగా నమోదైనట్టు ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కాల్సి తెలిపారు. నెలవారీ కంపెనీ విక్రయాలు, పనిదినాలు, స్టాక్ ప్లాన్ వంటి స్వల్పకాలిక కారకాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఫెస్టివ్ సీజన్లో డిమాండ్‌పై ఇవి ప్రతిబింబిస్తాయని వివరించారు. ఆల్టో, వాగన్ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్లు విక్రయాలు 9.8 శాతం క్షీణించి, 37,595యూనిట్లగా నమోదైనట్టు ఎంఎస్ఐ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాలు సిప్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో విక్రయాలు 1.8 శాతం పడిపోయినట్టు మారుతి వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కాంపాక్ట్ సెడాన్ డిజైర్ విక్రయాలు పడిపోయి, 27.4 శాతం కిందకి దిగజారాయి. అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు 2,481 యూనిట్లగా నమోదయ్యాయి. కాగ, మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ 8 శాతం ఎగిసి, 6,360 యూనిట్లగా రికార్డయ్యాయి.