నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి గ్రామం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో కారు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరొకరు కోమాలోకి వెళ్లారు.
క్షతగాత్రుడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడకు చెందిన బాధితులు హైదరాబాద్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.