
చెట్టును ఢీకొన్న కారు, యువతి మృతి
మరో ఆరుగురికి గాయాలు
తెలంగాణలో దుర్ఘటన
ఉండవెల్లి: కర్ణాటక నుంచి ప్రయాగ్‌రాజ్ (కుంభమేళా)కు వెళ్తున్న ఓ కుటుంబం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ యువతి దుర్మరణం చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.
కుక్క అడ్డు రావడంతో
స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు దగ్గర రామనగరకు చెందిన నవ్యశ్రీ (18), ప్రతిభ, రేణుక, శోభ, శివప్రసాద్, రాజన్న, మంజునాథ్, డ్రైవర్ బస్వరాజు కారులో శుక్రవారం కుంభమేళాకు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారుకు చేరుకున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ప్రమాదంలో నవ్యశ్రీ, ప్రతిభ, బస్వరాజు, రేణుకకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా.. నవ్యశ్రీ మృతిచెందింది. శోభ, శివప్రసాద్, రాజన్నకు స్వల్పగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment