
ఆరతి (ఫైల్)
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): రాష్ట్రంలో ఆన్‌లైన్ మోసాలు ఆగడం లేదు. తాజాగా బీదర్ జిల్లాలో ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... బసవ కల్యాణ తాలూకా ఇస్లాంపురకు చెందిన ఆరతి (28) ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.
ఇటీవల ఆన్‌లైన్‌లో రాజగోపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆరతి ఇతరుల వద్ద అప్పు తీసుకుని అతనికి విడతల వారీగా రూ. 2.5 లక్షల నగదు పంపింది. ఆ తరువాత అతని సెల్‌ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు భావించిన ఆరతి డెత్‌నోట్ రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బసవకల్యాణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్)
Comments
Please login to add a commentAdd a comment