Online Cheating
-
నెట్టింట మారీచులు.. అంతా మనం గుర్తించేలోపే!
ఎక్కడ ఉంటారో..ఎలా ఉంటారో..ఎవరిని, ఎలా మోసం చేస్తారో కూడా తెలియదు. మోసం ఎలా జరుగుతుందో గుర్తించలేం. తెలిసే సరికి మోసపోతాం. ఒకసారి మోసపోయాక కోలుకోవడం కష్టం. ప్రస్తుతం మారుమూలలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం లభించడంతో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొన్ని ఉదంతాలు గమనిస్తే రామాయణంలో సీతాపహరణ సందర్భంగా బంగారులేడి వేషంలో మారీచుడు చేసిన మోసం గుర్తుకురాక మానదు. సాక్షి, కడప డెస్క్: సామాజిక మాధ్యమం.. ఇపుడు ప్రపంచాన్ని ఏకం చేస్తున్న ఏకైక మార్గం. అన్ని వర్గాలకు ఉపయోగపడే అంశాలను వ్యాప్తి చేస్తోంది. రోజురోజుకూ ఆధునికతను సంతరించుకుంటూ రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. ఇటీవలికాలంలో తరాల అంతరం లేకుండా సోషల్ మీడియాను అధికంగా వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ తదితర మాధ్యమాలలో తమ భావాలను పంచుకునేవారి సంఖ్య పెరిగింది. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా సోషల్ మీడియా ఖాతా ఉంటోంది. అయితే సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతోందో.. మరోవైపు వేరొకరి పరువు తీసేందుకు, బెదిరించి లేదా మోసం చేసి డబ్బు దండుకోవడానికి కూడా వేదిక అవుతోంది. చాలామంది యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించుకోవడానికి సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకున్నవారు తమ ఉనికి బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు రూపు, రూటు మార్చి మోసాలకు తెగబడుతున్నారు. నకిలీ ఐడీతో మోసానికి రెడీ తాము ఎంచుకున్న వారి ఫొటోతో ఫేస్బుక్ తదితర యాప్‌లకు నకిలీ ఐడీ రూపొందిస్తారు. అది అచ్చం అసలు ఖాతాలా భ్రమించేలా చేస్తారు. దాని నుంచి సంబంధిత వ్యక్తి బంధువులు, స్నేహితులకు డబ్బు పంపించమంటూ మెసేజ్‌లు చేసి మోసగిస్తారు. మరికొందరైతే ఖాతాల పాస్‌వర్డ్‌లను సంపాదించి, ఆ వ్యక్తి వివరాలు, ఫొటోలను తస్కరిస్తారు. వాటి ఆధారంగా అసభ్యకర మెసేజ్‌లు, ఇమేజ్‌లు తయారుచేసి బ్లాక్మెయిల్ చేస్తూ వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. మనీ రిక్వెస్ట్ ఫ్రాడ్ ఈ స్కామ్‌లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా మనీ సెండ్ చేసేలా హ్యాకర్లు ప్రజలను మోసం చేస్తారు. వారు ఫేక్ మనీ రిక్వెస్ట్‌లు పంపడం లేదా చట్టబద్ధమైన సంస్థల వలె నటించడం వంటి వ్యూహాలు పన్నుతారు. యూపీఐ మనీ రిక్వెస్ట్ ఫ్రాడ్‌కి గురైతే ఆర్థిక నష్టాలు, భద్రతా సమస్యలు తలెత్తుతాయి. బ్యాంక్ అకౌంట్ డీయాక్టి వేషన్ స్కామ్ స్కామర్లు అనుమానాస్పద యాక్టివిటీ వల్ల బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందని సంప్రదిస్తారు. సాధారణంగా ఆటోమేటిక్ కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్‌లతో ప్రారంభిస్తారు. స్పెసిఫిక్ నంబర్‌కు కాల్ చేయమని లేదా ఐడెంటిటీ వెరిఫికేషన్‌కి లింక్‌పై క్లిక్ చేయమని కోరుతారు. పర్సనల్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అందిస్తే బ్యాంకు అకౌంట్లో డబ్బు మాయమవుతుంది. ఓటీపీ స్కాం ఓటీపీ స్కాంలో టూ–ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ కోసం ఉపయోగించే వన్–టైమ్ పాస్‌వర్డ్‌లను(ఓటీపీ) ప్రజల నుంచి తెలుసుకునేందుకు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఆథరైజ్డ్ ఎంటీటీస్గా నటించడం, హానికరమైన లింక్‌లను పంపడం లేదా బ్యాంకుల వద్ద బాధితులుగా నటించడం వంటి వ్యూహాలను ఉపయోగిస్తారు. స్పందించినవారి ఖాతాల నుంచి డబ్బు లాగేస్తారు. లైక్, సబ్‌స్క్రైబ్ అంటూ.. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి చెందిన ఎస్.జాబీర్(యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల గత ఆది, సోమవారాల్లో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇంతలో ఎస్బీఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో నకిలీ ఎస్బీఐ లింక్ ప్రత్యక్షమైంది. ఇది నమ్మిన జాబీర్ అచ్చు ఎస్బీఐ యాప్‌ను తలపించిన ఆ నకిలీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన వివరాలతో లాగిన్ అయ్యారు. వెంటనే ఆయన అకౌంట్లోని నగదు మాయమైంది. యాప్ డబుల్‌తో మోసం చేశారని గ్రహించిన ఆయన తనతో పాటు మరికొందరు ఉపాధ్యాయులు కూడా ఇలాగే మోసపోయారని గుర్తించారు. వారితో కలిసి వెళ్లి రాయ చోటి స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యనారాయణకు తాము మోసపోయిన విధానాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ డీపీ(డిస్ప్లే పిక్చర్)తో సైబర్ మోసగాళ్లు మోసగించే యత్నం చేశారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆయన పరిచయస్తులతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. క్షేమసమాచారాలు అడిగినట్లుగా మెసేజ్‌లు పంపసాగారు. దీంతో వీసీ అప్రమత్తమయ్యారు. మోసగాళ్ల మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని రెండు రోజుల క్రితం ఆయన వైవీయూ గూపుల్లో, వ్యక్తిగతంగా అందరికీ మెసేజ్‌లు పంపారు. కరోనా ఉధృతి వేళ ఇంటి నుంచి పనిచేసే విధానానికి బాగా ఆదరణ పెరిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం కొలువుల కోసం అంతర్జాలంలో అన్వేషించడం ఎక్కువైంది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ‘తక్కువ పని గంటలు... ఎక్కువ సంపాదన’అంటూ డిజిటల్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరిని ఎవరైనా సంప్రదిస్తే డేటా ఎంట్రీ, ప్రముఖుల సామాజిక మాధ్యమ ఖాతాల్లో వచ్చే పోస్టులను లైక్, షేర్ చేయడంవంటి పనులు ఉంటాయని చెబుతున్నారు. పని సులభమని, వేలల్లో సంపాదించుకోవచ్చని చెబుతూ నకిలీ వెబ్సైట్లతో ముగ్గు లోకి దించుతున్నారు. మీకు అధిక ఆదాయం కావాలంటే కొంత పెట్టుబడి పెట్టాలంటూ వల విసురుతున్నారు. వారి నుంచి డబ్బులు వచ్చిన తరువాత వెబ్సైట్లను మూసేస్తున్నారు. ఆన్లైన్ ఆఫర్లతో జనాన్ని ముంచేస్తున్న 36 లక్షల వాట్సాప్ ఖాతా లను నిషేధించామని కేంద్ర ఐటీ మంత్రి ఆ మధ్య ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
ఎస్ఎంఎస్ లింక్‌ను క్లిక్ చేసిన రైతు.. దానితో..!
కామారెడ్డి: సైబర్‌మోసానికి ఓ బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ఘటన మండలంలోని నూత్‌పల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పుండ్రు రాజేందర్ అనే రైతు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ లింక్‌ను క్లిక్ చేయడంతో తన బ్యాంకు నుంచి రూ.5,36,700 మాయం అయ్యాయి. రాజేందర్ యాసంగిలో సాగుచేసి అమ్మిన ధాన్యం డబ్బులు స్థానిక నూత్పల్లి యూనియన్ బ్యాంకులో జమ చేశాడు. సెప్టెంబర్ 30న ఆయన స్మార్ట్‌ఫోన్‌కు యూనియన్ బ్యాంకు లోగోతో ఎస్ఎంఎస్ వచ్చింది. బ్యాంకుకు సంబంధించిన మెసేజ్లాగా ఉందని క్లిక్ చేశాడు. మరుక్షణమే బ్యాంకు ఖాతా నుంచి ఒక రూపాయి, మళ్లీ రూ.28 డెబిట్ అయ్యాయి. అదే క్షణంలో ఖాతా నుంచి రూ.2లక్షలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. రాజేందర్ వెంటనే బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు పరీక్షిస్తుండగానే మరో రూ.2లక్షలు, మరోసారి రూ.1లక్ష, ఇంకోసారి రూ.36,700 డెబిట్ అయ్యాయి. మొత్తం నాలుగు సార్లు రూ.5,36,700 సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇది సైబర్ క్రైం మోసంగా అధికారులు గుర్తించి వెంటనే 1930కు ఫోన్ చేసి రైతుతో ఫిర్యాదు చేయించారు. వెస్ట్ బెంగాల్ ఇచ్చాపురానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంటి మరమ్మతుల కోసమని బ్యాంకులో డబ్బులు దాచుకున్నానని, సైబర్ మోసం జరగడంతో ఇంటి పనులు నిలిచిపోయాయని బాధిత రైతు రాజేందర్ వాపోయాడు. సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన నూత్‌పల్లిలో సైబర్ మోసం జరగడంతో పోలీసులు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతాదారులకు బుధవారం అవగాహన కల్పించారు. ఖాతా దారులు తమ మొబైల్ ఫోన్లకు అపరిచితులు పంపిన ఎస్ఎంస్లు, వాట్సప్ మెసేజ్‌లు ఓపెన్ చేయకూడదని ఎస్సై రాహుల్ తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పోలీసు బ్రదర్స్ బురిడీ
సాక్షి, చైన్నె: ఇద్దరు పోలీసు సహోదరులు, ఓ విద్యాశాఖ అధికారితో కూడిన కుటుంబం తమతో పనిచేస్తున్న వారిని ఆన్లైన్ వర్తకం పేరిట బురిడీ కొట్టించి రూ. 40 కోట్లు మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ఈ బ్రదర్స్ కుటుంబంలోని 8 మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. కాంచీపురం జిల్లా ఏనాత్తూరు పుదునగర్‌కు చెందిన జోషఫ్, మరియా సెల్వి దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో సహాయ భారత్, ఆరోగ్య అరుణ్ పోలీసులు. ఒకరు మహాబలిపురం నేర విభాగంలో, మరొకరు కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. మరొకరు విద్యాశాఖలో పనిచేస్తున్నారు. ఈ కుటుంబం అంతా ఆన్లైన్ వర్తకం, పెట్టుబడులు అంటూ పార్ట్ టైం జాబ్ వ్యవహారాన్ని సాగిస్తున్నాయి. ఆన్లైన్ వర్తకంలో పెట్టుబడులు పెట్టే వారికి రెట్టింపు ఆదాయం వస్తున్నదంటూ తమ సహచరులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి చేత రూ.40 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే తాము చెల్లించిన మొత్తాలకు ఏ ఒక్క సమాచారం ఈ పోలీసు బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి రాకపోవడంతో సహచర పోలీసులు, విద్యాశాఖలో పనిచేస్తున్న వారు నిలదీశారు. వారి సమాచారం లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తునకు ఆదేశించారు. విచారించిన కాంచీపురం పోలీసులు ఈ కుటుంబంలోని ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో తల్లిదండ్రులు, పోలీసు బ్రదర్స్, విద్యాశాఖ అధికారి, వారి సతీమణులు మహాలక్ష్మీ, జయశ్రీ, సమీయా ఉన్నారు. ఆన్లైన్ వర్తకం బలిగొంది.. ఆన్లైన్ వర్తకంలో పెట్టుబడి పెట్టి నష్ట పోయిన ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి మదురై ఉసిలం పట్టిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉసిలం పట్టకి చెందిన జగదీశ్(39) కోయంబత్తూరు లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయనకు మణిమాల భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆన్లైన్ వర్తకంపై ఉత్సాహంతో ఉండే జగదీశ్ తన వద్ద ఉన్న నగదు, భార్య నగలే కాదు, సన్నిహితులు, మిత్రులు, బంధువుల వద్ద నగదు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. ఆశించిన ఫలితం రాక పోగా నష్టం ఏర్పడడంతో ఆందోళనతో ఇంట్లో ఉన్న మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా, శనివారం మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. -
సైబర్ ఉచ్చు.. సరికొత్త చిక్కు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ వాడకం, అన్ని రకాల సేవలు ఆన్లైన్లోనే పొందడం పెరిగినట్టుగానే, వాటిని ఆధారంగా చేసుకుని జరిగే సైబర్ నేరాలూ గణనీయంగా పెరిగాయి. ఎప్పుటికప్పుడు కొత్త పద్ధతుల్లో నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ఏడాదిలో మరికొన్ని కొత్త సైబర్ నేరాలు తెరపైకి రావచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సైబర్ నేరాలు కేవలం ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దేశ ఆర్థిక, సామాజిక భద్రతకూ ముప్పుగా పరిణమిస్తున్నాయి. గతంలో ఐటీ, బ్యాంకింగ్, ఎయిర్‌లైన్స్, పవర్‌గ్రిడ్ వంటి వ్యవస్థల్లో గమనించగా..ఇప్పుడు అన్ని రంగాలనూ ప్రభావితం చేసే స్థాయికి వెళ్లాయి. నిత్యజీవితంలో ప్రతి అంశానికి ఇప్పుడు సైబర్ దాడుల ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. కాస్త అవగాహన, అప్రమత్తతతో వ్యవహరిస్తే వీటికి కళ్లెం వేయొచ్చునని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో ముఖ్యంగా మూడు రకాలైన మోసాలు జరుగుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. సెక్స్టార్షన్ నేర విధానం: ►యువతులు వీడియోకాల్స్ చేస్తారు. మాటల్లోకి దించి రెచ్చగొడతారు. వీడియో సంభాషణలన్నీ రికార్డ్ చేస్తారు. మనం వారి వలల్లో చిక్కుకున్నామని భావించిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడతారు. చాలామంది ఈ విధమైన మోసాల్లో చిక్కుకుంటున్నారు. ఏం చేయాలి: ►అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్‌ను లిఫ్ట్ చేయకూడదు. ►సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్, ఫొటోలను లాక్ (కనిపించకుండా) చేయాలి. మ్యూచువల్ ఫ్రెండ్స్ పేర్లు కూడా కన్పించకుండా చేయాలి. ► ఏదైనా పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నా, బాధితులుగా మారినా భయపడొద్దు. వెంటనే మీ సోషల్ మీడియా ఖాతాను తాత్కాలికంగా డీ యాక్టివేట్ చేయాలి. పర్యాటకం పేరిట.. నేర విధానం: జంగిల్ సఫారీ, పుణ్యక్షేత్రాల సందర్శనకు హెలికాప్టర్ ప్రయాణాల పేరిట మోసస్తారు. కోవిడ్ తగ్గిన తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శన, విహారయాత్రలు పెరిగాయి. దీన్నిఅవకాశంగా తీసుకుని పర్యాటకుల్ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వివిధ ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలు, ఆఫర్ల పేరిట ఆకర్షిస్తున్నారు. ఆన్లైన్లో డబ్బులు కాజేసిన తర్వాత కానీ అలాంటి సంస్థలేవీ లేవనితెలియడం లేదు. ఏం చేయాలి: ►బ్యాంకు లావాదేవీలైనా సరే ఆన్లైన్లో చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ►అనుమానాస్పద వెబ్సైట్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఊరూపేరూ లేని వెబ్సైట్లలో యాత్రలు బుక్ చేసుకోకూడదు. అన్నీ కచ్చితంగా నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లాలి. ►రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక టూరిజం వెబ్సైట్లలో బుక్ చేసుకోవడం ఉత్తమం. ►ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తిస్తే.. 24గంటల లోపే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేయాలి. అలాచేస్తే నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును బ్యాంకులు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. క్లిక్ చేయొద్దు..డౌన్లోడ్ వద్దు మనకు వచ్చే ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్‌లో అనుమానాస్పద యూఆర్ఎల్, వెబ్ యూఆర్ఎల్ ఉంటే వాటిపై క్లిక్ చేయవద్దు. అలాగే మనకు తెలియని ఈమెయిల్ ఐడీల నుంచి వచ్చే లింక్‌లు, అటాచ్మెంట్లు డౌన్లోడ్ చేయవద్దు. సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్‌ను నమ్మకండి. – ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణులు, న్యూఢిల్లీ 2022లో నమోదైన కొన్ని నేరాలు పరిశీలిస్తే.. ►కొన్ని ఈ మెయిల్స్‌పై క్లిక్ చేయగానే అవి ఫిషింగ్ వెబ్సైట్ల (సైబర్ నేరగాళ్లవి)లోకి వెళ్లేలా చేస్తాయి. ►వెబ్సైట్లలో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు పెడతారు. ఏదైనా సాయం కోసం వాటికి కాల్ చేసిన వారిని ఎనీడెస్క్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకునేలా చేసి డేటాను చోరీ చేస్తారు. ►పలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీల పేరిట ఫేక్ వెబ్సైట్లను పెట్టి, వాటిలో భారీ డిస్కౌంట్లపై ఫుడ్ అందజేసే పేరిట మోసగిస్తారు. ► ఆదాయ పన్ను ఫైల్ చేయాలంటూ నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లింకులను పంపుతారు. వాటి నుంచి కస్టమర్ల డేటాను, అవతలి వాళ్లు అమాయకులైతే డబ్బులు కొల్లగొడతారు. ►ఉచితంగా కోవిడ్ పరీక్షల పేరిట ముందుగా కొంత మొత్తం చెల్లించాలని చెప్పి, తర్వాత రిమోట్ యాక్సెస్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటే మీ డబ్బు మీకు వాపస్ అంటూ మోసగిస్తారు. ►ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లలో మిలిటరీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లా నకిలీ ఐడీ కార్డులు అప్లోడ్ చేసి వస్తువుల కొనుగోలు, అమ్మకాల పేరిట బురిడీ కొట్టిస్తున్నారు. ►ఎక్కువ విదేశీ ఖాతాలకు పెద్ద మొత్తాలు పంపే వ్యాపార కంపెనీలు, వ్యాపారవేత్తలను టార్గెట్‌గా చేసుకుని మోసాలు (బిజినెస్ ఈ–మెయిల్కాంప్రమైజ్ (బీఈసీ) చేస్తున్నారు. ►సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లు లేదా కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ టెక్నిక్‌లు వాడి బిజినెస్ ఈ మెయిల్స్‌ను హ్యాక్ చేస్తున్నారు.. కోవిడ్ వ్యాక్సిన్, సర్వేలు, రివార్డ్‌లు నేర విధానం: ఇటీవలి కాలంలో నేరగాళ్లు కోవిడ్ వ్యాక్సిన్ సర్వే, ఎన్నికల సర్వేలో పాల్గొని రివార్డులు గెలుచుకోండి అంటూ కొన్ని లింక్‌లను పంపుతున్నారు. రివార్డులనగానే చాలామంది ఆకర్షితులవుతున్నారు. వాటిపై క్లిక్ చేస్తే మన సమాచారం అంతా వారికి చేరిపోయేలా, లేదంటే మన మొబైల్ ఫోన్లలో రిమోట్ యాక్సెస్ యాప్‌లు ఇన్స్టాల్ అయ్యేలా చేస్తున్నారు. అవగాహన: ►అనుమానాస్పద ఎస్ఎంఎస్ లింక్‌లను (దీనిని స్మిషింగ్ అంటాం) క్లిక్ చేయకూడదు. ►వాయిస్ కాల్స్ (విషింగ్) అటెండ్ చేయవద్దు. అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి. 2,37,658 ఫిర్యాదులు ►కేంద్ర హోంశాఖ అధికారిక మ్యాగజైన్ ‘సైబర్ ప్రవాహ’ప్రకారం సైబర్ నేరాలకు సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. ►నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) సమాచారం ప్రకారం 2022 ఏడాది రెండో త్రైమాసికం వరకు సైబర్ నేరాలపై 2,37,658 ఫిర్యాదులు అందాయి ►ఎన్సీఆర్పీలో ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 7.08 లక్షల మంది సైబర్ నేరగాళ్ల వివరాలను సేకరించి డేటాబేస్ రూపొందించారు. ►సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.95 కోట్లను వారి ఖాతాల్లోకి చేరకుండా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) కింద బ్యాంకులు ఆ డబ్బును నిలిపివేసాయి. ►సైబర్ దోస్త్ ట్విట్టర్ ఖాతా ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా ఇప్పటివరకు 1,263 ట్వీట్లను అధికారులు షేర్ చేశారు. ఈ ట్విట్టర్ ఖాతాను 3.97 లక్షల మంది ఫాలో అవుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. ►డబ్బులపై ఆశ, బలహీనతల కారణంగానే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత అందునా విద్యార్థులు మోసపోతున్నారు. మనం లాటరీలో పాల్గొనకుండా, ఎలాంటి బహుమతీ రాదని గుర్తించాలి. ►ఈమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలకు ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’(పాస్‌వర్డ్‌తో పాటు ఓటీపీ వచ్చేలా) పెట్టుకోవాలి. ►వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్లు సేవ్ చేసుకోవద్దు. ►మీ పిల్లల సోషల్ మీడియా ఖాతాల్లో మీరు కూడా ఫ్రెండ్‌గా ఉండడం ఉత్తమం. ఆన్లైన్లో పిల్లలు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో గమనిస్తుండాలి. ►సైబర్ నేరగాళ్ల చేతిలో ఏ విధంగా మోసపోయినా, వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, టోల్‌ఫ్రీ నంబర్ 155260 లేదా 1930లో, www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. -
మోసపోయానని భావించి.. డెత్‌నోట్‌రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): రాష్ట్రంలో ఆన్లైన్ మోసాలు ఆగడం లేదు. తాజాగా బీదర్ జిల్లాలో ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... బసవ కల్యాణ తాలూకా ఇస్లాంపురకు చెందిన ఆరతి (28) ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆన్లైన్లో రాజగోపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆరతి ఇతరుల వద్ద అప్పు తీసుకుని అతనికి విడతల వారీగా రూ. 2.5 లక్షల నగదు పంపింది. ఆ తరువాత అతని సెల్‌ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు భావించిన ఆరతి డెత్‌నోట్ రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బసవకల్యాణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్) -
ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్.. సోపు చూసి షాకైన కస్టమర్!
సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి ఆన్లైన్ కొనుగోళ్లపై కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఏది కావాలన్న కూర్చున్న చోట నుంచే ఆర్డర్ పెడితే చాలు మన ముందుకు వస్తున్నాయి. అయితే ఒక్కోసారి మాత్రం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకోటి ప్రత్యక్షమై, కస్టమర్లను కంగారుపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే బట్టల సబ్బు దర్శమిచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో వెలుగు చూసింది. వివరాల ప్రకారం భీమన్న ఆన్లైన్ లోని ఓ యాప్ ద్వారా మొబైల్ కొనుగోలు చేశాడు. అందుకుగాను అతను రూ.6100 చెల్లించి ఫోన్ బుక్ చేసుకున్నాడు. అనుకన్నట్లే ఫోన్ ప్యాక్ చేసిన పార్శిల్ అతని ఇంటికి వచ్చింది. కొత్త ఫోన్ చూద్దామని ఎంతో ఆశగా పార్శిల్ తెరవగా అందులో ఫోన్‌కి బదులుగా బట్టల సబ్బు దర్శనమిచ్చింది. దీంతో భీమన్న షాకయ్యాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని సదరు ఆన్లైన్ సంస్థను విజ్ఞప్తి చేస్తున్నాడు. చదవండి: Amnesia Pub Case: జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు.. అందరూ పొలిటికల్ లీడర్ల కొడుకులే -
పార్సిల్లో ఫోన్‌కి బదులు బట్టల సబ్బు దర్శనం
-
విజయవాడలో భారీ సైబర్ మోసం
-
తోడు కావాలని కాల్ చేస్తే.. పని పూర్తి చేసి ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి,హిమాయత్‌నగర్(హైదరాబాద్): ‘మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? మీకు తోడు కావాలా? ఇదిగో ఈ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయండి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుకోండి’ అంటూ సికింద్రాబాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఓ మెసేజ్ వచ్చింది. కుమారులు, కుమార్తెలు అంతా దుబాయిలో ఉంటున్నారు. ఆయనను పలకరించే వారెవరూ లేకపోవడంతో తోడు కోసం ఆశపడి సైబర్ నేరగాడు చెప్పినట్లు చేశాడు. అంతే.. పలు దఫాలుగా రూ.7.8 లక్షలు లూటీ అయ్యాయి. తన డబ్బులు తిరిగి రావాలంటే మరో రూ.3 లక్షలు ఇస్తేనే రూ.7.8 లక్షలు ఇస్తామన్నారు. దీంతో ఆయన మరో రూ.3 లక్షలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తను మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాఫిట్ వస్తుందని నమ్మించి.. మొగల్పురాకు చెందిన సయ్యద్ సోహేల్ మొయినుద్దీన్‌కు కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయమయ్యా డు. తాను ‘డబ్ల్యూపీఇన్వెస్ 66.కామ్’లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాన్నాడు. దీంతో మొయినుద్దీన్ కూడా ఆ యాప్‌లో తొలుత రూ.10 వేలతో రిజిస్టర్ అయ్యా డు. లాభం రూ.10వేలు కనిపించింది. దీంతో ఆ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే రావట్లేదు. నా డబ్బులు నాకు కావాలని తన స్నేహితుడికి చెప్పడంతో అవి రావాలంటే ఇంకా వ్యాపారం చేస్తున్నట్లుగా ఆ యాప్‌లో చూపించుకోవాలన్నాడు. ఇలా పలు దఫాలుగా రూ.2.40 లక్షలను కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రెడిట్ కార్డు గిఫ్ట్ పేరుతో.. కాచిగూడకు చెందిన దేవకీనందన్కు క్రెడిట్ కార్డు నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ కార్డుపై మీకు రూ.5వేల బహుమతి వచ్చింది. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆమె ఓటీపీ నంబర్ చెప్పడంతో ఆ కార్డులో ఉన్న రూ.లక్ష లిమిట్‌ను క్షణాల్లో స్వైప్ చేశాడు. దీంతో బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బహుమతి పంపించానంటూ.. రూ.80 లక్షలు స్వాహా
బనశంకరి: హృద్రోగ నిపుణుడిగా ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి... బెంగళూరు బనశంకరి నివాసి సంధ్యా గాయత్రిని రూ.80 లక్షల మేర మోసం చేశాడు. జనవరి 23వ తేదీ సంధ్యా గాయత్రికి ఇన్‌స్ట్రాగామ్‌లో డేవిస్ హర్మాన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా ఆమె ఆమోదించింది. క్రమేపీ ఇద్దరూ స్నేహితులయ్యారు. డేవిడ్ హర్మాన్ తాను కార్డియాలజిస్టునని చెప్పుకోగా, ఆమె తన గుండెజబ్బుకు సలహాలను తీసుకునేది. మీకు ఖరీదైన కానుక పంపించానని ఫిబ్రవరి 6న ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు మెసేజ్ పంపాడు. 35 వేల పౌండ్ల విదేశీ కరెన్సీ, వస్తువులు ఉన్నాయని, కస్టమ్స్ ఫీజు చెల్లించి తీసుకోవాలని తెలిపాడు. కొంతసేపటికి ఒక యువతి సంధ్యాగాయత్రికి ఫోన్ చేసి కస్టమ్స్ కొరియర్ అధికారిగా పరిచయం చేసుకుంది. కస్టమ్స్ ఫీజు చెల్లించి విదేశాల నుంచి వచ్చిన గిప్టు తీసుకోవాలని ఒత్తిడి చేసింది. కానీ సంధ్యా గాయత్రి అనుమానంతో డబ్బు పంపలేదు. మళ్లీ ఆ యువతి ఫోన్‌చేసి పార్శిల్ తీసుకోనందున, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుంచినోటీస్ వచ్చిందని నకిలీ నోటీస్ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌లో పంపింది. దీంతో సంధ్యా గాయత్రి నిజమేనేమో అని నమ్మింది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 19 వరకు దశలవారీగా వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.80 లక్షలు బదిలీ చేసింది. డబ్బు జమకాగానే డేవిన్‌హర్మాన్ అడ్రస్ లేదు. నెలరోజులైనా ఏ కానుక అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళ బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చదవండి: NATO: చైనాతో ప్రపంచ దేశాలకు ప్రమాదం -
ఫేక్ ఐడీతో బురడీ కొట్టించాడు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ మోసగాళ్లు పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త పంధాతో అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు. తాజాగా నగరంలోని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో నయా ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. షాపులో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన కేటుగాడు.. పేటీఎం ఫేక్ ఐడీ ద్వారా చెల్లింపులు చేసినట్లు షాపు యజమానిని బురడీ కొట్టించాడు. నిందితుడి ఫోన్లో వచ్చిన మెసేజ్‌ను చూసి డబ్బులు జమయ్యాయని భావించిన బాధితుడు.. తీరా అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కంచన్ బాగ్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆన్లైన్ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 28 వేల రూపాయల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్ అమ్మకాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న భరత్పూర్ గ్యాంగ్‌ను సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ మార్కెటింగ్‌ల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు. (చదవండి: పాదరసం.. అంతా మోసం ) -
పట్ట పగలు మంత్రి ‘పిఏ’ కిడ్నాప్....!
-
సినీ ఫక్కీలో మంత్రి ‘పిఏ’ కిడ్నాప్....!
సాక్షి, చెన్నై : తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ వ్యక్తిగత పిఏ కర్ణన్‌ను పట్టపగలు నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేయడంతో పది కి.మీ దూరం వెళ్లి రోడ్డు మీద వదిలి పెట్టి వెళ్లారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో మంత్రి రాధాకృష్ణన్ ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. ఇక్కడ వ్యక్తిగత పిఏగా కర్ణన్ వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన నలుగురు యువకులు సిని తరహాలో కత్తులతో బెదిరించి ఆయన్ను కారులో ఎక్కించుకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో తిరుప్పూర్ జిల్లా పోలీసులు అంతా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసు అధికారులు, అక్కడి సిసి కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా ఆ కారు, అందులో వచ్చిన నలుగురి కోసం వేట ముమ్మరం చేశారు. మంత్రి పిఏ కిడ్నాప్ సమాచారం ఉడుమలైలో కలకలం రేపింది. పోలీసులు నిఘా పెంచడంతో పాటుగా వ్యవహారం మీడియాల్లో హాట్ టాపిక్‌గా మారడంతో కిడ్నాపర్లు అప్రమత్తమైనట్టున్నారు. ఉడుమలై నుంచి పది కి.మీ దూరం వెళ్లిన కిడ్నాపర్లు, అక్కడ రోడ్డు పక్కగా కర్ణన్‌ను దించే వెళ్లి పోయారు. అయితే, ఈ కిడ్నాప్ ఎందుకు జరిగింది..? ఎవరు చేయించారు..? దీని వెనుకు ఉన్న రహస్యం బయట తీయడానికి పోలీసులు ఉరకలు తీస్తున్నారు. అయితే,కిడ్నాపర్లు నలుగురు మాస్క్‌లు ధరించి రావడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారి ఉన్నది. ఆన్లైన్ మోసంతో ....... ఈ కిడ్నాప్‌ను పక్కన పెడితే, చెన్నైలో మరో కిడ్నాప్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాగర్ కోయిల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మోహన్ అనే ఉద్యోగిని కోయంబత్తూరుకు చెందిన రమేష్ రెడ్డి, ప్రభాకరన్‌లు కిడ్నాప్ చేసి చెన్నై పోలీసులకుఅ డ్డుంగా బుక్కయ్యారు. ఆన్లైన్లో నగదు బదిలీ పేరిట తనను మోసగించడమే కాకుండా, తరచూ డబ్బుల కోసం ప్రభాకరన్, రమేష్‌రెడ్డిలు వేదిస్తుండటంతో ఇవ్వలేని పరిస్థితుల్లో మోహన్ పడ్డాడు. దీంతో మోహన్‌ను కిడ్నాప్ చేసిన ప్రభాకరన్, రమేష్ రెడ్డిలు అడయార్ ఏసి విక్రమన్‌కు వచ్చిన సమాచారం మేరకు బుక్కయ్యారు. -
ఆన్లైన్ మోసం.. ఫోన్ బదులు స్వీట్
రాయచోటి టౌన్ : ఆన్లైన్ ద్వారా ఫోన్ కోసం డబ్బులు చెల్లిస్తే స్వీట్ ప్యాకెట్ పంపారని బాధితుడు షేక్ మౌలాలీ వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. రాయచోటి రూరల్ పరిధిలోని శిబ్యాల గ్రామం తురుకపల్లెకు చెందిన షేక్ మౌలాలీకి శనివారం ఫోన్ కాల్ వచ్చింది. లక్కీడ్రాలో నీ నంబర్‌కు మొబైల్ ఫోన్ వచ్చింది. ఆ మొబైల్ పంపుతాం.. వెంటనే నీవు రూ.1500 చెల్లించాలని చెప్పారు. ఆశతో వెంటనే అతడు ఫోన్ పేద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీనికి సంబంధించి మంగళవార పోస్టల్ ద్వారా ఇంటికి పార్శిల్ వచ్చింది. విప్పి చూడగా అందులో స్వీట్, ఒక రోల్డ్‌గోల్డ్ చైన్ ఉండటంతో అవాక్కయాడు. -
లక్కీ డ్రా అంటే 2.08 లక్షలు చెల్లించేశాడు..
కాకినాడ రూరల్: లక్కీ డ్రా ద్వారా రూ.25 లక్షలు గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్ రావడంతో.. రూ.2.08 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించిన ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు సర్పవరం పోలీసులను ఆశ్రయించాడు. లక్కీ డ్రా రాలేదని ఆన్లైన్ మోసానికి గురయ్యానని అతడు ఆలస్యంగా గుర్తించాడు. సీఐ గోవిందరాజు బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుడారిగుంట శ్రీసాయి 40 బిల్డింగ్స్ శ్రీ వాసవి కుటీర్ వద్ద నివాసం ఉంటున్న లంక రవికుమార్ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. జూన్ 29న ఉదయం 10 గంటలకు 70779 97542 నంబర్ నుంచి ఆకాశ వర్మ పేరుతో ఆయనకు వాట్సాప్ కాల్ వచ్చింది. లక్కీ డ్రాలో రూ.25 లక్షలు గెలుచుకున్నారని, రిజిస్ట్రేషన్‌కు రూ.8 వేలు, మీడియాకు ఇన్కమ్ ట్యాక్స్‌కు రూ.2 లక్షలు చెల్లించాలని నమ్మబలికాడు. దీంతో రెండు వారాల్లో దఫాదఫాలుగా రూ.2.08 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించారు. తరువాత రాణాప్రతాప్‌సింగ్ అనే పేరుతో రవికుమార్‌కు ఫోన్ చేసి ఇన్సురెన్స్ కోసం మరో రూ.65 వేలు చెల్లించాలని కోరడంతో అనుమానం వచ్చి స్నేహితులకు చెప్పాడు. చివరికి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
టీవీలో ప్రకటనలు చూస్తే నెలనెలా జీతం..!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పని చేసే ఓ సంస్థ కొత్త తరహా మోసానికి తెరలేపింది. తమ వద్ద డబ్బు చెల్లించి ఎల్ఈడీ టీవీ పొందాలని, అందులో వచ్చే యాడ్స్ చూస్తూ ఉంటే నెలనెలా తామే కనీస మొత్తం చెల్లిస్తూ ఉంటామని ఆన్లైన్లో ప్రచారం చేసుకుంది. దీన్ని చూసిన ముగ్గురు నగరవాసులు రూ.2.49 లక్షలు చెల్లించి మోసపోయారు. వీరి ఫిర్యాదు మేరకు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూరత్‌కు చెందిన డోర్ టైజర్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చింది. అందులో తమ వద్ద రూ.83 చెల్లిస్తే అత్యాధునికమైన ఎల్ఈడీ టీవీ పంపిస్తామని నమ్మబలికింది. అంతటితో ఆగకుండా తమ వద్ద సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక యాప్ ద్వారా ఆ టీవీలో కొన్ని ప్రకటనలు చూపిస్తామంటూ చెప్పింది. వీటిని క్రమం తప్పకుండా చూస్తే ప్రతి నెలా కనిష్టంగా రూ.11,500 చొప్పున చెల్లిస్తామంటూ ఎర వేసింది. ఈ ప్రకటన చూసి ఆకర్షితులైన ముగ్గురు నగరవాసులు అందులోని నెంబర్లకు సంప్రదించారు. ఒక్కోక్కరు రూ.83 వేల చొప్పున రూ.2.49 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఈ యాడ్స్ యాడ్స్ ఓఎల్ఎక్స్లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలకు ఇద్దరు నగరవాసులు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లకు సంబంధించిన వీరు బేరసారాలు పూర్తి చేశారు. ఆపై అడ్వాన్సుల పేరుతో రూ.40 వేలు, రూ.74 వేలు చెల్లించి మోసపోయారు. ఇంకో ఉదంతంలో నగరానికి చెందిన ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌కు సైబర్ నేరగాళ్ళు ఫొన్ చేశారు. తాము ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తక్కువ వడ్డీకి భారీ మొత్తం రుణం అంటూ ఎర వేశారు. బాధితుడు అంగీకరించడంతో ఇతడి నుంచి కొన్ని పత్రాలు సైతం వాట్సాప్ చేయించుకున్నారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర పేర్లు చెప్పి రూ.40 వేలు కాజేశారు. -
ఆన్లైన్ ఉద్యోగాల పేరిట మోసం
సాక్షి, బెంగళూరు(బనశంకరి): లాక్డౌన్ నేపథ్యంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని అవకాశంగా తీసుకున్న వంచకులు బెంగళూరులోని సిలికాన్‌సిటీలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇళ్లనుంచే పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పి డబ్బు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇద్దరు నిరుద్యోగులు వంచక ముఠా చేతికి చిక్కి నగదు కోల్పోయారు. లాక్డౌన్ తొలగించే వరకు ఉద్యోగం ఉండాలనే కారణంతో చాలామంది ఆన్లైన్ ఉద్యోగాలకోసం జాజ్ సెర్చ్పోర్టర్లను ఆశ్రయిస్తున్నారు. నగరానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఉద్యోగం వేటలో ఉన్నారు. ఈక్రమంలో అతనికి జాబ్ సర్చ్ కంపెనీతో పోలిన కంపెనీ మెయిల్ ఐడీ నుంచి ఆఫర్ వచ్చింది. రిజిస్ట్రేషన్ పీజు చెల్లించాలని సూచించారు. దీనిని నమ్మిన శేఖర్ తన క్రెడిట్‌కార్డు ద్వారా రూ.6,899 చెల్లించాడు. అంతటితో ఆగని వంచకులు కంపెనీ ఫీజుతో పాటు ఇతర అవసరాలంటూ మరింత నగదు డిమాండ్ చేశారు. కానీ ఇతనికి ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. చెల్లించిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగ్గా ముఖం చాటేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా 21 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం ఆన్లైన్ పోర్టల్‌లో తన బయోడేటా వివరాలు ఉంచింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని హెచ్ఆర్.గోకుల్, కే ఎస్.కుమార్ అనే వ్యక్తులు మెయిల్ పంపారు. అప్లికేషన్ ఫీజు కోసం రూ.1599 చెల్లించాలని సూచించారు. వారు చెప్పిన ప్రకారం ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. అనంతరం క్లియర్ చార్జ్ చెల్లించాలని రూ.2వేలు లాగేశారు. అనంతరం మరింత నగదు ఇవ్వాలని కోరగా అనుమానం వచ్చిన ఆ యువతి తాను చెల్లించిన నగదు వెనక్కు ఇవ్వాలని కోరింది. దీంతో వంచకులు డబ్బు ఇవ్వకుండా వంచనకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కాగా ఉద్యోగం వేటలో ఉన్న వారు ఉద్యోగాల ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా నగదు చెల్లించరాదని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. -
మహిళను ముంచిన ‘మందు’
పుణే: ఆన్లైన్లో ఆల్కహాల్ ఆర్డర్ చేసి రూ.51వేలు పోగొట్టుకున్నారు ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఘటన గత శనివారం పుణేలో చోటు చేసుకుంది. వివరాలు.. కోల్‌కతాకు చెందిన 32ఏళ్ల మహిళా ఇంజనీర్ నాలుగురోజుల క్రితం పుణే వెళ్లారు. బవ్ధాన్లోని తన స్నేహితులను కలిసిన ఆమె.. వారితో కలిసి పార్టీ చేసేందుకు సమీపంలోని బార్‌కు వెళ్లారు. అయితే అయోధ్య తీర్పు సందర్భంగా ఆ రోజు మద్య దుకాణాలు బంద్ చేశారు. దీంతో స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిన ఆమె ఎలాగైనా పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆన్లైన్లో మద్యం డెలివరీ కోసం ప్రయత్నించారు. ఆన్లైన్లో ఒక మొబైల్ నెంబర్ కనిపించడంతో దానికి ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి.. మద్యం దుకాణాన్ని మూసేశామని, ఆల్కహాల్ దొరకడం కష్టమని చెప్పాడు. అయితే ఎలాగైనా తన ఇంటికి ఆల్కహాల్ చేరవేయాలని ఆమె కోరింది. దీంతో ఆయన ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని చెప్పాడు. దీనికి సమ్మతించిన మహిళా సాఫ్టవేర్... వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ)ను ఆ అగంతకుడుకి చెప్పేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.31,777 విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఆ అగంతకుడికి ఫోన్ చేసి వివరణ అడిగారు. పొరపాటు జరిగిందని, మరోసారి ఓటీపీ చెప్తే అమౌంట్ జమ చేస్తానని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి ఓటీపీ చెప్పింది. మళ్లీ రూ.19,001 విత్‌డ్రా చేసేశాడు. మెసేజ్ చూసుకున్న ఆమె అతనికి ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు. మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ.. స్నేహితులతో కలిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పుణే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. -
వలలోకి దించుతాయ్.. ఈ వెబ్సైట్లతో జాగ్రత్త!!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): తియ్యటి మాటలతో యువకులను వలలో వేసుకుంటున్న వెబ్సైట్ నిర్వాహకులు కోలకతాలో కుప్పలు తెప్పలుగా ఉన్నారని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపారు. శనివారం ఆయన కోల్‌కతాలో ఒక కాల్‌సెంటర్‌పై దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి సోమవారం నగరానికి చేరుకున్న సీఐ వి. గోపీనాథ్ సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపం అనే వ్యక్తి ఈ తరహా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వీటిపై కోల్‌కతా పోలీసులకు అవగాహన లేదన్నారు. విశాఖ పోలీసుల చొరవతోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాము గతంలో రెండుసార్లు కోల్‌కతా వెళ్లి ప్రయత్నించినా ఆచూకీ తెలియరాలేదన్నారు. స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, గుర్తింపుకార్డులు మూడవసారి పకడ్బందీగా ప్రయత్నం చేయటంతో గుర్తించగలిగామని సీఐ గోపీనాథ్ వివరించారు. ఇందులో యువతులను కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకుంటున్నారని, తరువాత వారిని తమకు అనుకూలంగా మార్చి ఈ తరహా మోసాలకు గురి చేస్తున్నారని, అందుకు టార్గెట్లు, కమిషన్లు, బహుమతులు ఎరచూపి యువతులను వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాల్‌సెంటర్‌పై దాడి చేసి నప్పుడు 23 మంది యువతులతో పాటు, ఒక హెచ్ఆర్, ఆఫీస్ బాయ్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని అలిపూర్లో ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని తెలిపారు. వారి దగ్గర నుంచి 40 వరకు బేసిక్ ఫోన్లు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రూటర్, హార్డ్ డిస్కు, కొన్ని సిమ్‌లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు డిసెంబర్ 6న నగరంలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. వెబ్సైట్లతో జాగ్రత్త.. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పీపుల్ ఫ్రెండ్స్, కిన్ కీ, హానీ పికప్, ఫ్యాషన్, హాట్ టెంప్టేషన్ వంటి వెబ్సైట్లు ఉన్నాయన్నారు. చాలా వరకు తాము చేసిన దాడులతో వాటిని నియంత్రించగలిగామని తెలిపారు. ముఖ్యంగా వీరి వలలో నగరానికి చెందిన కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వివరించారు. యువత, ఉత్సాహవంతులు ఇలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. తేనెలా మాట్లాడుతూ నెమ్మదిగా తమ వలలోకి దించి వారి నుంచి లక్షల్లో డబ్బులు కాజేయటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
ఆమెతో చాటింగ్ చేసి అంతలోనే..
యశవంతపుర : ఆన్లైన్లో పరిచయం వ్యక్తి మహిళ బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు రాజరాజేశ్వరినగరకు చెందిన గృహిణి అశ్వినికి, జేపీ నగర 6వ స్టేజీలో నివాసం ఉంటున్న వినోద్ అలియాస్ మంజునాథ్‌తో ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నాడు. జూన్ 10న అతడు ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆమె ఓకే చేసింది. అప్పుడప్పుడు చాటింగ్ చేసుకునేవారు. ఇటీవల తన చెల్లికి, తల్లికి ఆరోగ్యం బాగాలేదని, అర్జంటుగా డబ్బు కావాలని అశ్వినికి మంజునాథ్ కోరాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా అతడు వినలేదు. ఆమె ఇంటికి వచ్చి ఆమె నుంచి రూ. రెండు లక్షలు విలువైన బంగారు గొలుసు, ఉంగరాలు, కమ్మలను మంజునాథ్ తీసుకున్నాడు. ఆ తరువాత అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఫేస్‌బుక్‌లోనూ స్పందించడం లేదు. మోసపోయానని బాధితురాలు జయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
ఆన్ ‘లైనేస్తారు’ జాగ్రత్త
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నవీన్‌కు స్మార్ట్ ఫోన్‌తో ఎక్కువ సేపు గడపడం అలవాటు. రెండు వారాల క్రితం పేటీఎం లక్కీ డ్రాలో మీరు ఎంపికయ్యారంటూ.. సెల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌ని నమ్మి రిప్లై ఇవ్వగా లక్కీడ్రాలో బ్లూ స్టార్ ఏసీ గెలుచుకున్నారని సమాధానం వచ్చింది. మీ ఇంటికి ఏసీ పంపించాలంటే ముందుగా జీఎస్టీ కట్టాలి. జీఎస్టీ చెల్లించినట్లయితే ఎలాంటి రుసుము లేకుండా ఏసీ ఇంటికి చేరుతుందని చెప్పడంతో నవీన్ కొంత నగదును పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంటి అడ్రసుకు ఏసీ రాలేదు. మెసేజ్లోని నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. బదిలీ చేసిన సొమ్ము తక్కువ కావడంతో ఎవరికీ చెప్పుకోలేక సన్నిహితుల వద్ద వాపోయాడు. ఈ విధంగా చాలామంది యువత నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. –సాక్షి, విశాఖపట్నం రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. సమాజంలో సోషల్ మీడియా వాడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువుతోంది. సాంఘిక మాధ్యమాల వినియోగంతో పాటుగా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు అవినీతిని అంతం చేసేందుకు మంచి మార్గాలైనప్పటికీ ఇందులో మంచితో పాటు చెడు కూడా ఎక్కువగానే ఉంది. కొంతమంది సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని యువత జేబులను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అత్యాశకు పోయి నష్టపోతున్నారు. ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టండిలా..... అపరిచితుల నుంచి వచ్చే సందేశాలకు, ఫోన్లకు స్పందించకూడదు.పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోకుండా ఆన్లైన్లో డబ్బులు బదిలీ చేయకూడదు. ఆర్బీఐ గుర్తించిన యాప్‌లను మాత్రమే బదలాయింపులకు వినియోగించాలి. వ్యక్తిగత సమాచారమైన ఓటీపీ, సీవీవీ, డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లు ఆకౌంట్ నంబర్లు చెప్పకూడదు. బ్యాంక్ సిబ్బందిమంటూ ఫోన్ చేసేవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నకిలీ నోటిఫికేషన్లను గుర్తించి వాటిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. అసలు నోటిఫికేషన్ విడుదల అయ్యిందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. యువతే లక్ష్యంగా...... ఉద్యోగాలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, లక్కీడ్రాల పేర్లతో సైబర్ నేరగాళ్లు వేసే ఉచ్చులో పడి మోసపోతున్న వారిలో అధిక శాతం యువతే. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చిరిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా అత్యాశ, అవగాహన రాహిత్యంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరగాళ్లు అనునిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యువతను టార్గెట్ చేసుకుం టుకున్నారు. సైబర్ వలలో పడినవారిలో అధిక శాతం మంది అత్యాశతో చిక్కుకున్నవారే. ఉచితంగా డబ్బులు, గిఫ్ట్‌లు వస్తున్నాయనే ఆÔశతో విచక్షణ కోల్పోయి ఎవరిని సంప్రదించకుండా డబ్బులు చెల్లించి చేతులు కాల్చుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఇతర దేశాలు, రాష్ట్రాలు నుంచి ఫోన్‌కాల్స్‌తో బురడీ కొట్టిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఆన్లైన్లో అపరిచితులతో కొంత జాగ్రత్త వహిస్తే మోసాల నుంచి రక్షించుకోవచ్చు. బ్యాంక్ అధికారులమంటూ... అశ చూపించి దోచుకోవడం ఒక రకమైతే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ...కొందరు సొమ్మును కాజేస్తున్నారు. బ్యాంక్ తరుఫునుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యింది. మీ అకౌంట్ పని చేయడం లేదంటూ భయానికి గురిచేసి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరికొందరు మీకు రుణం ఇస్తామంటూ ఫోన్ చేసి బ్యాంక్ ఖాతా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కొందరు మీరు పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని అకౌంట్లో డబ్బులు వేసేందుకు మీ వివరాలు కావాలంటూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. స్పందించిన వారి అకౌంట్లలో సొమ్మును లూటీ చేస్తున్నారు. వీటితో పాటు పర్సనల్ లోన్స్, హౌస్ లోన్స్ ఇస్తామంటూ సందేశాలు పంపి మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ను ఆసరాగా తీసుకుని.. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యధిక శాతం మంది ప్రజలు గడిచిన కొన్నేళ్ల నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ కొనుగొళ్లు అంటూ అధిక శాతం లావాదేవీలు ఇంటర్నెట్లోనే నిర్వహిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. ప్రజల్లో ఉన్న అత్యాశను అవకాశంగా మార్చుకుంటున్నారు. లాటరీ టికెట్ కొనకుండానే మీరు లాటరీలో డబ్బులు గెలుచుకున్నారని, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకుండానే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని, లక్కీ డ్రాలో పాల్గొనకుండానే మీ నంబర్‌పై లక్కీ డ్రా వచ్చిందని ఆయా నంబర్లకు ఫోన్లు, మెసేజ్‌లు పంపుతున్నారు. నిజమే అనుకుని రిప్లై ఇచ్చిన వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు, జీఎస్టీ అంటూ వివిధ పేర్లు చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఈ విధంగానే కాకుండా బ్యాంకు అధికారులమంటూ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలుసుకుని క్లోనింగ్ ద్వారా బ్యాంకు ఖాతాలోని డబ్బును దోచేస్తున్నారు. డమ్మీ నోటిఫికేషన్లతో మోసం.. రాని నోటిఫికేషన్లు వచ్చాయంటారు. కొత్త కొత్త నోటిఫికేషన్ల పుట్టిస్తారు. నోటిఫికేషన్లు అంటూ నోట్లో మన్ను కోడతారు. నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకుంటారు. ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేస్తారు. అధికంగా ఉన్న నిరుద్యోగులు డమ్మీ నోటిఫికేషన్లు చూసి నిజమేననుకోని అప్లై చేస్తున్నారు. డమ్మి నోటిఫికేషన్లు విడుదల చేసే వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు సైతం మరో వెబ్‌సైట్‌తో ఆదే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అసలైన వెబ్సైట్ ఎదో తెలియక డమ్మీ వెబ్సైట్లో ఫీజు కట్టి మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైల్వేలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలో ఈ తరహా మోసం అధికంగా ఉంది. ప్రత్యేక నిఘా వినియోగదారులు, నిరుద్యోగులలో అవేర్నెస్ పెరగాలి. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో అపరిచితులు చెప్పే మాటలు నమ్మవద్దు. బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియపరచకూడదు. బ్యాంకు అధికారులు వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లో అడగరు. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయజేయాలి. – మహేందర్ మాతే, సిటీ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ -
సెల్‌ఫోన్ కోసం ఆశపడితే.. స్వీట్‌బాక్సు మిగిలింది
వైఎస్ఆర్ జిల్లా, బ్రహ్మంగారిమఠం : హలో.. మేము సెల్‌ఫోన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి.. మా కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఫోన్లు ఆఫర్లు ప్రకటించాము. తక్కువ ధరకే విక్రయిస్తున్నాము. మీరు బుక్ చేసుకుంటే ఫోన్ మీ చేతికి అందాక రూ.1600 చెల్లించండి.. అంటూ ఫోన్ చేస్తారు.. వారి మాటలు నమ్మి బుట్టలో పడితే చేతికి అందేది సెల్‌ఫోన్ బాక్సు కాదు.. స్వీట్ బాక్సు.. వివరాల్లోకెళితే.. బ్రహ్మంగారిమఠం మండలంలో ఇటీవల పలువురికి ఓ మహిళ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మీకు తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్ పంపిస్తాం.. మీ చిరునామా తెలపండి.. మీ ఇంటికి సెల్‌ఫోన్ బాక్సు వస్తుంది.. తరువాత రూ.1600 చెల్లించి బాక్సు తీసుకోండి అని పేర్కొంది. ఆమె మాటలు నమ్మి మల్లేపల్లి పంచాయతీలోని లింగాలదిన్నె, చెంచయ్యగారిపల్లె తదితర గ్రామాలకు చెందిన వారు ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన మిరాకీ వరల్డ్ అనే కంపెనీ పేరుతో ఓ సెల్‌ఫోన్ బాక్సు వచ్చింది. డబ్బులు చెల్లించి ఆ బాక్సు తీసుకుని తెరిచి చూడగా అందులో సెల్‌ఫోన్‌కు బదులు స్వీట్స్ ఉన్నాయి. తక్కువ ధరకు సెల్‌ఫోన్ వస్తుంది అని ఆశపడితే చివరకు స్వీట్ బాక్సు రావడంతో మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఇది మరో రకం మోసం.. పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం ముద్దనూరు రోడ్డులో నివాసముంటున్న రవికుమార్ నాలుగు రోజుల క్రితం ఆన్లైన్లో సెల్‌ఫోన్ బుక్ చేశాడు. రూ.3వేలు విలువ చేసే మొబైల్ ఫోన్ కేవలం రూ.1500కు ఇస్తున్నారని చెప్పడంతో బుక్ చేశాడు. బుక్ చేసిన నాలుగు రోజుల తర్వాత కొరియర్ బాయ్ సెల్‌ఫోన్ బాక్సు ఇచ్చి వెళ్లాడు. తెరిచి చూడగా అందులో కేవలం రూ.500 విలువ గల సెల్‌ఫోన్ ఉండటంతో వెంటనే కొరియర్ బాయ్‌కు ఫోన్ చేశాడు. మేం చేసేదేమీలేదని ఆన్లైన్ ద్వారా వచ్చిన వాటిని మేము డెలీవరీ చేస్తున్నామని చెప్పాడు. దీంతో బాధితుడు చేసేదేమీలేక మిన్నకుండి పోయాడు. తక్కువ మొత్తంతోనే సరిపోయింది. పెద్ద మొత్తంలో ఏదైనా బుక్ చేసుకుని ఉంటే తన పరిస్థితి ఏమిటని వాపోయాడు. -
మ్యాట్రి‘మనీ’ మోసాలు
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లిళ్లకు ఆన్లైన్ వేదికైన మ్యాట్రిమోనియల్ సైట్లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించి యువతులను మోసం చేస్తున్న పలువురు ఎన్నారైలు, సిటీవాసులపై సైబరాబాద్ షీ బృందాలు కేసులు నమోదు చేశాయి. గతంలోనే వివాహం జరిగినా విషయం దాచి పెళ్లి పేరుతో యువతులతో సన్నిహిత్యం పెంచుకొని, అదే నమ్మకంతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే మ్యాట్రిమోనీ సైట్లో తప్పుడు ప్రొఫైల్స్‌తో యువతులకు వల వేసి మోసం చేస్తున్నట్లు పలు కేసులు స్పష్టం చేస్తున్నాయని షీటీమ్స్ ఇన్చార్జి అనసూయ అన్నారు. ఈ విషయంలో యువతులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వరుడిని నేరుగా కలిసి అన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాతే పెళ్లి విషయంలో అడుగు ముందుకు వేయాలని ఆమె సూచించారు. మరో యువతితో సంబంధం కొనసాగిస్తూనే... మాదాపూర్‌కు చెందిన ఓ యువతి భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కొత్త జీవితం కోసం మ్యాట్రిమోనీలో డైవోర్స్డ్ పీపుల్స్ పేజీలో రిజిష్టర్ చేసుకుంది. అదే సైట్లో రిజిష్టరైన ఎన్ఆర్ఐ ప్రవీణ్ కుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నానని తాను కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు ఆరు నెలల పాటు వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు అతడిని పరిచయం చేయడంతో పెళ్లికి అంగీకరించారు. అయితే అతను ఇండియాకు రాకపోవడంతో బాధితురాలే అతడిని కలిసేందుకు దుబాయ్‌కి వెళ్లింది. ఆమెతో నెలరోజుల పాటు హోటల్ గదిలో సహజీవనం చేశాడు. అదే సమయంలో అతను మరో యువతితో సెల్ఫోన్లో చాటింగ్ చేస్తుండటాన్ని గుర్తించిన బాధితురాలు తనను మోసం చేశాడంటూ సైబరాబాద్ షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో రూ.లక్షలు వసూలు... అల్కపూరి టౌన్‌షిప్‌కు చెందిన బాధితురాలు 2017లో భర్త నుంచి విడాకులు తీసుకొంది. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. అప్పటికే ఆ సైట్లో రిజిస్టర్ చేసుకున్న నిందితుడు ఈమె ప్రొఫైల్‌ను లైక్ చేశాడు. సొంత వ్యాపారం చేస్తున్న తాను ఆర్థికంగా బాగున్నట్లు నమ్మబలికాడు. రోజూ సెల్లో చాటింగ్ చేస్తూ తన కుటుంబసభ్యులందరినీ పరిచయం చేశాడు. కొన్ని రోజుల తర్వాత కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నానని కొంత సహాయం చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు పలు దఫాలుగా రూ.12 లక్షలు ఇచ్చింది.ఓ రోజూ బాధితురాలి ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితు రాలుషీ బృందానికి ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ ఠాణాలో కేసు నమోదు చేసి నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తగినవాడు కాదన్నందుకు... బీహెచ్ఈఎల్ ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ యువతికి ఐదు నెలల క్రితం మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వినయ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. సెల్ఫోన్లో చాటింగ్ చేసుకోవడమేగాక పలుమార్లు వ్యక్తిగతంగా కలిశారు. అయితే అతడి ప్రవర్తన నచ్చక తనకు సరైనవాడు కాదని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు వేరొక పెళ్లి చేయాలని నిశ్చయించారు. బాధితురాలి ఎంగేజ్మెంట్ విషయం తెలుసుకున్న నిందితుడు ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయడంతో నిశ్చితార్థం ఆగిపోయింది. తనను కలిసినప్పుడు సెల్ఫోన్లో తీసిన ఫొటోలు, చాటింగ్ మెసేజ్‌లను చూపించి బెదిరించడంతో బాధితురాలి షీ బృందానికి ఫిర్యాదు చేసింది. ఆర్సీపురం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారంతో మోసం... షాపూర్‌నగర్‌కు చెందిన యువతి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ వ్యక్తి ప్రొఫైల్ నచ్చడంతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. నిశ్చితార్థం సమయంలో సొంతిళ్లు ఉందని, ఇసుక వ్యాపారం చేస్తానని చెప్పిన నిందితుడు రోజుకు రూ.6వేల ఆదాయం ఉంటుందని నమ్మించాడు. అయితే మూడురోజుల తర్వాత బాధితురాలి తల్లిదం డ్రులు నిందితుడి తల్లిని సంప్రదించగా ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పింది.దీంతో అనుమానం వచ్చిన వారు విచారణ చేయగా నిందితుడికి ఎలాంటి ఆదాయం లేదని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలడంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తననే పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఆమె నగ్నచిత్రాలను సృష్టించి ఇతరులకు పంపుతానంటూ బెదిరించడంతో బాధితురాలు షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. జీడిమెట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానంటూ... కొండాపూర్‌కు చెందిన బాధితురాలికి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఆమెను ఢిల్లీకి పిలిపించాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెను కలిసి గుర్గావ్లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. వారం రోజుల పాటు అక్కడే ఉంచుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటానని అతను తిరిగిరాకపోవడంతో బాధితురాలు నేరుగా గుర్గావ్లోని అతడి ప్లాట్‌కు వెళ్లింది. తాను గర్భవతిని అని చెప్పడంతో మాత్రలు ఇచ్చి అబార్షన్ అయ్యేలా చూశాడు. ఆ తర్వాత అతడికి అప్పటికే వివాహం జరిగిందని, కుమార్తె కూడా ఉన్నట్లు తెలుసుకున్న బాధితురాలు షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. -
లక్కీ డ్రా పేరిట మోసం
విశాఖపట్నం, అనంతగిరి(అరకులోయ): లక్కీడ్రా పేరుతో ఫోన్ ఇసా ్తమని తెలపడం తో రూ.3,500 చెల్లించి మండలంలోని కాశీ పట్నం పంచాయతీ మండపర్తి గ్రామానికి చెందిన పాడి రామకృష్ణ అనే గిరిజన యువకుడు మోసపోయాడు. వివరాలు ఇలా గత బుధవారం అతనికి కాల్ వచ్చింది. మీ మొబైల్ నంబరుకు బ్లూటూత్, శాంసంగ్ ఫోన్ లక్కీడ్రాలో వచ్చాయని అవతలవ్యక్తి చెప్పారు. మీవివరాలు తెలి పితే పోస్టు ద్వారా వాటిని పంపింస్తామని, అయితే రూ 3,500 చెల్లించాలని తెలిపారు. మళ్లీ వారం రోజుల తరువాత పోస్టల్ కార్యాలయానికి వెళ్లి తీసుకోమని ఫోన్ వచ్చింది. దీంతో రామకృష్ణ పోస్టల్ కార్యాలయానికి వెళ్లి రూ.3,500 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. బాక్స్ విప్పి చూడగా అందులో కూరగాయలు తరిగే సెట్ ఉంది. దీంతో తాను మోసపోయానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆన్లైన్ మోసం
పశ్చిమగోదావరి, గోపాలపురం: ఆన్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్లో సెల్‌ఫోన్ బుక్‌చేస్తే బెల్టు, ఏటీఎం కార్డులు పెట్టుకునే పర్సు పంపడంతో లబోదిబోమంటున్నాడు. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామానికి చెందిన చిన్న వెంకటేశ్ అనే యువకుడికి ఎస్ఎస్ టెలీ డీల్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఫోన్ నంబర్‌కు ఆఫర్ తగిలిందని రూ.12 వేల విలువైన సెల్‌ఫోన్ రూ.4,050 చెల్లిస్తే సొంతమవుతుందని నమ్మబలికారు. దీనిని నమ్మిన వెంకటేశ్ ఆర్డర్ చేయగా గ్రామంలోని పోస్టాఫీసుకు పార్సిల్ వచ్చింది. సెల్‌ఫోన్ తీసుకున్న తర్వాత పోస్టాఫీసులో నగదు చెల్లించాలనడంతో వెంకటేశ్ పార్సిల్ తీసుకుని రూ.4,050 చెల్లించాడు. పార్సిల్ తెరిచి చూడగా బెల్టు, ఏటీఎం కార్డులు పెట్టుకునే పర్సు ఉన్నాయి. వెంటనే వెంకటేశ్ తనకు ఫోన్ వచ్చిన నంబర్‌కు కాల్చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఇటీవల ఆన్లైన్ మోసాలు పెరిగాయని, మహిళలతో ఫోన్‌కాల్స్ చేయించి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌స్టేషన్ హౌస్ అధికారి జి.శ్రీనివాసరాజు తెలిపారు. -
కెమెరా బుక్ చేస్తే రాళ్లు పంపారు!
హిందూపురం అర్బన్: ఆన్లైన్లో కెమెరాబుక్ చేస్తే దానికి బదులు రెండు రాళ్లు వచ్చాయి. పార్సిల్ విప్పిన వినియోగదారుడు అవాక్కయ్యాడు. హిందూపురం చిన్నమార్కెట్వద్ద నివాసముంటున్న నూనె వ్యాపారి మంజునాథ్ కుమారుడు హర్షిత్ సప్తగిరి కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను ఆన్లైన్లో తక్కువ ధరకు లభించే వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. రిపబ్లిక్‌డే సందర్భంగా తక్కువ ధరకు కెనాన్ 3000డీ కెమెరా కనిపించింది. మూడు రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ కింద కెమెరాను బుక్‌చేశాడు. శుక్రవారం కొరియర్ వ్యక్తి పార్సిల్ చేతికందించాడు. రూ.21 వేలు ఇచ్చి పార్సిల్ అతని ముందే తెరిచి చూపించమన్నాడు. కవర్ తీసి చూడగా అందులో రెండు రాళ్లు బయటపడ్డాయి. దీన్ని చూచి అక్కడివారు నిర్ఘాంతపోయారు. దానిని వీడియో తీçస్తుండటంతో పార్సిల్ తెచ్చిన వ్యక్తి డబ్బు వెనక్కు ఇచ్చి పార్సిల్ వెనక్కు పట్టుకుపోయినట్లు బాధితుడు హర్షిత్ చెప్పాడు. -
గిఫ్ట్ పేరిట బురిడీ
విశాఖపట్నం, చీడికాడ(మాడుగుల): మా కంపెనీ డ్రా తీస్తే మీ ఫోన్ నంబర్‌కు మూడు గిఫ్ట్‌లు లభించాయి.పోస్టల్ ద్వారా పంపిస్తాం పైకం చెల్లించి తీసుకోవాలన్న ఫోన్ కాల్‌ను నమ్మి ఓ యువకుడు మోసపోయాడు. మండలంలోని అడవుల అగ్రహారానికి చెందిన బాధితుడు నమ్మి నాగరాజు అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల రోజుల క్రితం నాగరాజు ఫోన్‌కు.. 8059355031 అనే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మేం బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ ఫోన్ నంబర్‌కు లక్కీ డ్రాలో రూ.18,500 వేల విలువ గల శ్యామ్‌సంగ్ జె7 ఫోను,సొనాటా రిస్టు వాచ్,బూట్లు గిఫ్ట్ గెలుచుకున్నారని వీటికి మీరు కేవలం రూ.4,500 వేలు చెల్లిస్తే సరిపోతుందని,గిఫ్ట్ నేరుగా మీ ఊరు పోస్టు ఆఫీసుకు పంపిస్తున్నామని తెలిపారు. మొదట్లో నమ్మకపోవడంతో రెండుమూడు రోజులకు ఒక మారు మీ గిఫ్ట్ పంపిస్తున్నాం రిసీవ్ చేసుకోండి అంటూ చెప్పేవారు. గురువారం ఉదయం తమ గ్రామపోస్టుమాన్ వచ్చి తనకు గిఫ్ట్ వచ్చిందని చెప్పడంతో పార్శిల్ చూసి లోపల గిఫ్ట్‌లు ఉన్నాయనుకుని డబ్బులు చెల్లించి ప్యాకెట్ తెరిచి చూడగా రూ.300 విలువగల నాసిరకం బూట్లు ఉన్నాయని వెంటనే అదే నంబర్‌కు ఫోన్ చేస్తే స్వీచ్‌ఆఫ్ వస్తోందని నాగరాజు చెప్పాడు. తనను మోసం చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని నాగరాజు తెలిపాడు. -
ఫోన్ బుక్ చేస్తే బూట్లు వచ్చాయి
చిత్తూరు, కేవీబీపురం: ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ హద్దులు మీరుతున్నాయి. మండలంలో ని అంజూరు గిరిజన కాలనీకి చెందిన తుపాకుల బాబు ఫోన్ బుక్ చేస్తే బూట్లు రావడంతో అవాక్కయ్యాడు. వారం రోజుల క్రితం బాబుకు 96675 56223 నుంచి ఫోన్ వచ్చింది. సామ్సంగ్ కంపెనీకి చెందిన 12 వేల రూపాయల మొబైల్ ఫోన్‌ను కేవలం రూ.4,800లకే ఇస్తున్నామని నమ్మబలికారు. వెంటనే బాబు ఫోన్ బుక్ చేశాడు. సోమవారం ఉదయం పార్సిల్ స్థానిక తపాలా కార్యాలయానికి వచ్చిందని అక్కడి సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. రూ.5వేలు అప్పు చేసి ఆ డబ్బు తపాలా కార్యాలయంలో చెల్లించారు. పార్సిల్ తెరిచి చూడగా అందులో ఫోన్‌కు బదులు బూట్లు దర్శనమిచ్చాయి. దీనిపై తపాలా సిబ్బందిని ప్రశ్నించినా, ఆన్లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా లాభం లేకపోయింది. -
ఆన్లైన్ మోసం
ప్రకాశం, వేటపాలెం: ఆన్లైన్ షాపింగ్ ద్వారా వస్తువు కొనుగోలు చేసిన వినియోగదారుడు మోసపోయాడు. ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. దేశాయిపేట పంచాయతీ మంకెనవారిపాలేనికి చెందిన అంగలకుర్తి రవికుమార్ అమేజాన్‌లో ఆన్లైన్లో హెడ్ సెట్– త్రిడీ వీఆర్‌ను బుక్ చేశాడు. ఆదివారం చీరాలకు చెందిన ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అతడికి పార్శిల్ వచ్చింది. డబ్బులు కట్టి పార్శిల్ తీసుకుని విప్పి చూడగా అందులో గులకరాయి ఉంది. విస్తుపోయిన వినియోగదారుడు రవికుమార్ పార్శిల్ తెచ్చిన వారితో మాట్లాడగా వాపసు చేస్తే బుక్ చేసిన వస్తువు మళ్లీ వస్తుందనడం గమనార్హం. -
ఫోన్ పేరిట టోకరా
అనంతపురం, సోమందేపల్లి: అతి తక్కువ ధరకే ఫోన్ పంపుతామని చెప్పి స్వీట్‌బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రాన్ని పంపి అమాయకుడికి టోకరా వేసిన ఉదంతం వెలుగు చూసింది. సోమందేపల్లి మండల కేంద్రంలోని గీతానగర్‌కు చెందిన నరేష్ చేనేత కార్మికుడు. ఇతడికి ఎస్ఎస్ స్కై కంపెనీ తరఫున 96066 71368 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. స్యామ్సంగ్ జే2 ఫోన్ రూ.1600కే ఆఫర్లో ఇస్తున్నామని చెప్పడంతో నరేష్ ఆర్డర్ చేశాడు. సోమవారం పోస్టుమ్యాన్ పార్సిల్ తీసుకురాగా పై మొత్తం చెల్లించి తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్సిల్‌ను తెరవగా అందులో ఫోన్‌కు బదులు స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రం ఉంది. తనను కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు లబోదిబోమన్నాడు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితుడు చెబుతున్నాడు. -
ఆన్లైన్లో మోసం
ఏయూ క్యాంపస్(విశా ఖ తూర్పు): భారీ ఆఫర్లతో ముంచెత్తారు. వాటిని నిజమని నమ్మిన ప్రజలు ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేశారు. తీరా చేతికి వచ్చిన కొరియర్‌ను తెరిచి చూస్తే పనికిరాని వస్తువులు దర్శనమిచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగి చంద్రాన శశికాంత్‌కు ఈ సంఘటన ఎదురైంది. కొద్ది రోజుల క్రితం పేటీఎం మాల్లో భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ప్రకటనలు జారీ చేశారు. దీనిని చూసిన శశికాంత్ శామ్సంగ్ బ్లూటూత్ పరికరం ఆన్లైన్లో కొనుగోలు చేశారు. గురువారం సాయంత్రం వచ్చిన కొరియర్‌ను తెరిచి చూడగా అందులో పనికిరాకుండా, వినియోగించిన, నాసిరకం బ్లూ టూత్ పరికరం దర్శనమిచ్చింది. దీంతో తాను మోసపోయానని, దీనిపై సదరు సంస్థకు ఫిర్యాదు చేస్తానని శశికాంత్ “సాక్షి’కి తెలిపారు. ఇటువంటి చర్యలతో వీటిపై నమ్మకం పోతుందని, భవిష్యత్‌లో కొనుగోలు చేయాలంటే భయం వేస్తుందన్నారు. -
అత్యాశే ఆసరాగా...
విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): అమాయకత్వం అనుకోవాలో.. గడుసుతనం అనుకోవాలో తెలీదు. నిత్యం ఎక్కడో ఒక చోట మాయ మాటలతో మోసాలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా, యువత, మహిళల్లో చైతన్యం రావడం లేదు. ఫోన్ ద్వారానో, మెసేజ్‌లు, మెయిల్ మెసేజ్‌లు ద్వారానో మీకు లక్కీ డిప్ పలికిందనో, డ్రా పలికింది.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయనో రకరకాలుగా మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతున్నా, నేటికీ అవివేకంగా మోసపోతూనే ఉన్నారు. అత్యాశకు పోయి వేలకు వేలు డబ్బులు మూల్యంగా చెల్లించుకోవల్సి వస్తుంది. తాజాగా అగనంపూడికి చెందిన పది మంది ఇదే తరహా మోసానికి గురై లబోదిబో అంటున్నారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్ బిజినెస్‌లో భాగంగా ఫోన్ నంబర్లు డ్రా తీయగా మీ నంబర్ డ్రాలో పలికిందని, రూ.15 వేల విలువైన సెల్‌ఫోన్‌కు కేవలం పదిశాతం అంటే రూ.15 వందలు చెల్లిస్తే మీ స్వంతమని ఫోన్లో స్వీట్ వాయిస్ వినపడుతుండడంతో నిజమేనని నమ్మి పోస్టాఫీసు ద్వారా పదిమంది డబ్బులు చెల్లించారు. డబ్బులు చెల్లిం చిన ఐదు రోజుల్లో చెల్లింపుదారుల పేరుతో పార్శిల్ ఇంటికి వస్తుంది. ప్యాకెట్‌ను తెరిచి చూస్తే ఫోన్ స్థానంలో ఇటుకలు, చెక్కముక్కలు, నిరోధ్ ప్యాకెట్లు, దేవుని ఫొటోలతో ఉన్న సీడీలు, ఇత్తడి రేకులు, గో ళీలు ఇలా రకరకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అవాక్కవ్వడం తప్ప చేసేది లేక లోలోనే మధనపడుతున్నారు. వెంటనే సదరు నంబర్‌కు ఫోన్ చేస్తే ఏముంది ఫోన్ స్విచ్ ఆ‹ఫ్ చేసి ఉందనో, అందుబాటులో లేదనో, మనుగడలో లేదనో సమాధానం వస్తుండడంతో మోసాన్ని గ్రహిస్తున్నారు. అత్యాశకు పోవడం వల్ల రూ.15 వందలు పోయాయని మింగలేక కక్కలేక లబోదిబోమంటున్నారు. -
ఫేస్బుక్ పరిచయం..వాట్సప్ చాటింగ్
జ్యోతినగర్(రామగుండం) : పెరుగుతున్న టెక్నాల జీ ఆన్లైన్ మోసాలు మరింత సులువు అయ్యేలా చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్న విదేశీ యువతి తనకు బహుమతులు పంపిస్తున్నాని, దానికి సంబంధించిన కస్టమ్స్ చెల్లించాలని కోరింది. ఇది మోసంగా గమనించి సదరు వ్యక్తి యువతి వేసిన వలకు చిక్కకుండా బయటపడ్డాడు. ఇదీ జరిగింది.. ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఫేస్బుక్లో లండన్‌కు చెందిన యువతి పరిచయమైంది. కొద్దిరోజుల పాటు ఒకరికొకరు సందేశాలు పంపుకున్నారు. తరువాత సదరు వ్యక్తిని విదేశీ యువతి ఫోన్ నంబర్ అడిగింది. దీంతో ఇద్దరూ వాట్సప్‌లో చాటింగ్ చేసుకోవడం ఆరంభించారు. ఇలా ఆ వ్యక్తి ‘ఖని’లోని తన ఇంటి అడ్రస్‌ను విదేశీ యువతికి వెల్లడించారు. ఈ క్రమంలో ఒకరోజు తన పుట్టినరోజు అని ‘నీకు గిఫ్టుపంపిస్తున్నా.. స్వీకరించాలి.’ అని చాటింగ్ చేసింది. అందులో ఆపిల్ఫోన్, బంగారుగొలుసు, ల్యాప్‌టాప్, షూ, గడియారం తదితర వస్తువులు సుమారు 50,000 వేల బ్రిటీష్‌ఫౌండ్లు పంపిస్తు న్నట్లు తెలిపింది. సంబంధిత ఫొటోలు, కొరియర్‌రశీదు వాట్సప్ కూడా చేసింది. ఈనెల 11న స్వైప్ ఎక్ర్‌ప్రెస్ కొరియర్ పేరుతో ఓ రశీదును పంపిస్తూ.. 13న ‘ఖని’ చేరుతుందని సందేశం పంపింది. అసలు టోకరా ప్రారంభం ఇలా.. ఇంతలో మరో సందేశం పంపింది. ‘ మీకు పార్సిల్ పంపే క్రమంలో ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. గిప్ట్‌ప్యాక్ తీసుకునేప్పుడు కస్టమ్స్ కింద రూ.36,900 చెల్లించాలి’ అని తెలిపింది. దీంతో సదరు వ్యక్తికి అనుమానం వచ్చింది. తన దగ్గర అంత మొత్తంలో లేవని తేల్చిచెప్పాడు. 13వ తేదీన పార్సిల్ వచ్చినట్లు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. రూ.36,900 చెల్లించి తీసుకెళ్లమనడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే సదరు యువతి వాట్సప్ నంబర్ బ్లాక్‌చేసి, ఫేస్బుక్లో అన్‌ఫ్రెండ్ చేశాడు. -
మాయా ఉంది..మోసం ఉంది!
కొమరోలు (గిద్దలూరు): ఖరీదైన మొబైల్ పంపిస్తామంటూ బెల్టు, ఏటీఎం కార్డు ఉంచుకునే పౌచ్ పంపడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ మోసం మండలంలోని బాదినేనిపల్లెలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన రోశయ్యకు ఇటీవల ఓ ఫోన్ వచ్చింది. నీ సెల్‌ఫోన్‌కు రూ.కోటి లాటరీ తగిలిందని, ఖరీదైన మొబైల్ వచ్చిందని నమ్మించారు. వారం క్రితం అడ్రసు చెబితే పోస్టాఫీసుకు సెల్ పంపిస్తామని చెప్పారు. శేషయ్య తొలుత అడ్రసు చెప్పేసి వదిలేశాడు. రెండు రోజుల క్రితం తిరిగి ఫోన్ చేసి పార్సిల్ పంపించామని, పోస్టాఫీసులో ఉందని చెప్పారు. నగదు చెల్లించి పార్శిల్ తీసుకునేందుకు ఆయన ఇష్ట పడలేదు. రెండు రోజులుగా ఫోన్ చేసి పార్శిల్ తీసుకుంటే మంచి మొబైల్ వస్తుంది, ఎందుకు తీసుకోవడం లేదని సదరు ఫోన్ చేస్తున్న వ్యక్తి విసిగించడం ప్రారంభించాడు. అతని మాయ మాటలు నమ్మిన బాధితుడు చివరకు పోస్టాఫీసుకు వెళ్లి రూ.4,150లు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. పార్శిల్ ఓపెన్ చేయగా అందులో బెల్టు, ఏటీఎం కార్డులు దాచుకునే పౌచ్ మాత్రమే ఉంది. మోసపోయానని తెలుసుకున్న ఆయన తిరిగి మొబైల్‌కు వచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాప్ వచ్చింది. పది రోజుల క్రితం ఇదే మండలం పోసుపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే మోసపోయి రూ.4,150లు చెల్లించాడు. కవర్లో బూడిద వచ్చింది. కొమరోలు మండల కేంద్రంలోని ఇస్లాంపేటకు చెందిన ఓ వ్యక్తికి కవర్లో లక్ష్మీదేవి ఫొటో వచ్చింది. ఇలా ప్రజలను మోసం చేసేందుకు మాయగాళ్లు నిత్యం ఫోన్ చేస్తూ ఆశపెట్టి ముంచుతుంటారని బాధితుడు వాపోయాడు. -
ఆన్లైన్ మోసాలకు కళ్లెం!
విజయనగరం పూల్‌బాగ్ : జిల్లాలో ఇటీవలి కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ విస్తృతమైంది. దుకాణాలకెళ్లి వెదకడం ఇష్టలేక కొందరు... ఆన్లైన్లో అందంగా చూపించే బొమ్మలకు ఆకర్షితులైన కొందరు ఎక్కువగా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించి ఆర్డర్లు ఇవ్వడం ఎక్కువైంది. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ కంపెనీలు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వారు ఆర్డర్ ఇచ్చిన సరకు స్థానంలో వేరే ఏవో వస్తువులను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. ఆన్లైన్లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతలను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. ఈ-మార్కెట్‌పై నిఘా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ-మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని తూనికల కొలతలశాఖకు అప్పగించింది. ఆన్లైన్లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతో పాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంప్రదించాల్సి చిరునామా, కస్టమర్ కేర్ ఫోన్ నంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొలుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొనడంతో ఈ దిశగా మార్పులు ప్రారంభమయ్యాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 70 నుంచి 80 శాతంమంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నారు. వీరిలో 40శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్ఫోన్లు, కొత్తకొత్త మోడళ్లకోసం నిత్యం సెర్చ్ చేస్తున్నారు. ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాఫ్, ఫేస్బుక్, గూగుల్ వంటి మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. వాటికి ఆకర్షితులై ఆన్లైన్లో వస్తువులు బుక్‌చేస్తే వారే బుక్‌అయిపోతున్నారు.∙ -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
శ్రీకాకుళం, రాజాం : సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్ ఆన్లైన్ మోసానికి పాల్పడి ఆరు నెలలు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదు. నాలుగేళ్ల పాటు అటు రాజాం, ఇటు సంతకవిటి మండలంలోని తాలాడ వద్ద కార్యాలయాలు ప్రారంభించి షేర్లు పేరుతో భారీగా పెట్టుబడులు రాబట్టిన శ్రీరామ్ తర్వాత పరారై పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటన జరగ్గా, నేటికి ఆరునెలలు కావస్తోంది. ఆరంభంలో చకచకా కేసును కొలిక్కితీసుకొచ్చిన పోలీసులు మొదటి చార్జీ షీటులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు కూడా అప్పగించారు. వారంతా మూడు నెలుల జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అక్కడితో స్థానిక పోలీసులు కేసు ముగించగా, ఈ ఏడాది జనవరిలో విశాఖ సీఐడీ పోలీసులు కేసును తమచేతిలోకి తీసుకున్నారు. జనవరిలో హడావుడి చేసిన సీఐడీ పోలీసులు నాలుగునెలుల ముగిసినా కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి విషయాలు అటు మీడియా కు గాని, ఇటు బాధితులకు గానీ వెల్లడించలేదు. ప్రాణాలుకు విలువే లేదా..! ట్రేడ్ బ్రోకర్ మోసానికి చాలా మంది ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులతో పాటు నిరుపేదలు కూడా బలైపోయారు. 340 మందికి పైగా బాధిత పెట్టుబడిదారులు ట్రేడ్ బ్రోకర్‌పై కేసులు పెట్టారు. చాలామంది కోర్టును ఆశ్రయించారు. అటు అధికార పార్టీ నేతలు, మంత్రుల వద్దకు, ఇటు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలని పట్టుబడుతూ రాజాంకు చెందిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఎమ్మేల్యే కంబాల జోగులు సైతం సంతకవిటి పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. అప్పట్లో హామీ ఇచ్చిన పోలీసులు అర్ధ సంవత్సరమైనా న్యాయం చేయలేకపోయారు. బాధితుల్లో ఒకరైన సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి దాసరి కన్నంనాయు డు, మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడ మ్మ అనే మరో మహిళ మృతిచెందారు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టుబడిగా పెట్టి మోసపోయామని మరికొంతమంది మంచం పట్టారు. రూ.80 కోట్లకు పైగా పెట్టుబడులు బ్రోక ర్ వద్ద పెట్టినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో రూ.40 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంతజరిగినా ఈ కేసులో కదలిక లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ డబ్బేమైనట్లు...? రూ. 80 కోట్లు పెట్టుబడులు లాగేసిన బ్రోకర్‌కు కొంతమంది అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఉన్న బ్రోకర్ తమకేదైనా చెబుతారని బాధితులు ఎదురుచూసినా ఫలితం లేని పరిస్థితి . ఇంతవరకూ బ్రోకర్ ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పాటు ఆయన బంధువులు కూడా కనిపించడం లేదు. ఎంతో కొంత వస్తుందని ఎదురుచూస్తున్నవారికి సైతం నిరాశే ఎదురవుతోందిది. సీఐడీ పోలీసులైనా తమకు న్యాయం చేస్తార ఎదురుచూసినవారికి ఇంతవరకూ ఎటువంటి సానుకూలత లభించలేదు. బ్రోకర్ రాజాం వస్తాడని, అక్కడ కలిసి తమ గోడు వెల్లగక్కి ఎంతో కొంత తిరిగి ఇస్తాడేమోనని ఎదురుచూస్తున్నవారికి సైతం శ్రీరామ్ కనిపించడం లేదు. ఇంతకీ ఈ డబ్బులు ఉన్నాయా...లేక ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టాడా అన్నది పోలీసులు చేధించి బాధితుల ముందు ఉంచాల్సి ఉంది. అంతా సీఐడీ చేతిలోనే.. మా పరిధిలో ఉన్నసమయంలో బ్రోకర్ కేసుకు సంబంధించి మా వంతు న్యాయం మేం చేశాం. తర్వాత సీఐడీ పోలీసుల చేతిలో కేసు ఉంది. వారు కూడా ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆరాతీస్తున్నారు. అసలైన నిందితుల వేటలో ఉన్నారు. డబ్బుపై పక్కాగా ఆరా తీస్తున్నారు. త్వరలో వివరాలు వెల్లడించవచ్చు. – ఎం.వీరకుమార్, రాజాం రూరల్ సీఐ, రాజాం. -
ఆన్లైన్ మోసం
వజ్రపుకొత్తూరు రూరల్ : ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మండల కేంద్రం వజ్రపుకొత్తూరులో సోమవారం ఇలాంటి మోసం వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన దువ్వాడ ఉమామమేశ్వరరావు సెల్ ఫోన్‌కు మీరు లక్కీ డ్రాలో రూ. 9 వేల విలువ గల శాంసాంగ్ మొబైల్ రూ.1600లకే దక్కించుకున్నారని ఆశ చూపడంతో అతని మిత్రుడు కొయిరి పాపారావు ఈ నగదును సదరు అడ్రాస్‌కు వారం రోజుల క్రితం పంపించారు. కాగా సోమవారం తన ఇంటికి వచ్చిన పార్సెల్‌ను విప్పి చూడగా దానిలో నాణ్యత లేని రాగి బొమ్మలు దర్శనం ఇవ్వడంతో వారు కంగుతిన్నారు. తాము నగదు చెల్లించి మోసపోయామని గుర్తించారు. అయితే తక్కువ నగదుతో సరిపోయిందని లేదంటే అధిక మొత్తంలో నగదు చెల్లించి ఉంటే పరిస్థితిని ఊహించి ఆందోళన చెందినట్టు బాధితుడు పాపారావు విలేకరుల ముందు వాపోయాడు. -
ఆన్లైన్ మోసాలకు కళ్లెం
♦ నగరానికి చెందిన రాజేష్‌కు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉంది. ఖరీదైన మొబైల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చినకవర్‌ను తెరిచి చూసి షాక్ అయ్యాడు. తాను బుక్ చేసినది కాకుండా మరొకటి రావడంతో ఖంగుతిన్నాడు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆందోళన చెందాడు. ఆన్లైన్లో చూస్తే ఎలాంటి వివరాలు లేవు. ♦ పీలేరుకు చెందిన రాణి ఆన్లైన్లో ఓ ఖరీదైన చీరను కొనుగోలు చేసింది. పార్సిల్లో నాసిరకం చీర వచ్చింది. దీన్ని చూసిన ఆమె ఎవరికి చెప్పుకోలేక మథనపడుతోంది. తిరుపతి క్రైం :జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాం తంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నగదు రహి త లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్క రూ ఆన్లైన్ వ్యాపారంపై మొగ్గు చూపుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇలాంటి మోసాలకు కళ్లెం వేసేందుకు తూనికలు, కొలతలు శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ– కామర్స్ వైపు దృష్టి పెట్టేలా ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. దాంతో ఆన్లైన్లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతల ను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను అమలుకు ఆ శాఖ అధికారులు ఉపక్రమిస్తున్నారు. ఈ మార్కెట్‌పై నిఘా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ– మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్రం కొన్ని చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను తూనికల కొలతల శాఖకు అప్పగించింది. జీఎస్ఆర్ 629 ఉత్తర్వు ల మేరకు ఈ తరహా మోసాలకు అడ్డుకట్టు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంద్రించాల్సిన చిరునామా, కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొనుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొనడంతో ఈ దశగా మార్పులు ప్రారంభమయ్యాయి. ఇది పరిస్థితి జిల్లాలో 70 నుంచి 80 శాతం మంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నా రు. వీరిలో 40 శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్ఫోన్లు, కొత్తకొత్త మోడళ్ల కోసం నిత్యం సర్చ్ చేస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ వంటి మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నాయి. వాటి జోలికి వస్తే నట్టేట ముంచేస్తున్నారు. ఫిర్యాదు ఇలా ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. డివిజన్ల వారీగా ఇన్స్పెక్టర్లకు లేదా సంబంధిత అధికారులను కలిసి తాము మోసపోయిన విధానాన్ని వివరించవచ్చు. ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో కొనుగోలు చేసిన రసీదు, సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు చూపించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో ఆన్లైన్లో చూపించిన వస్తువు, ఇంటికొచ్చిన పార్సల్లోని వస్తువును చూపించాలి. అలా వివరించిన అనంతరం మోసానికి పాల్పడిన సంస్థకు తూనికల శాఖ నోటీసు జారీ చేస్తుంది. అనంతరం వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. మోసానికి పాల్పడితే చర్యలే.. ఈ–కామర్స్ సంస్థలో వినియోగదారులు మోసపోకుండా భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటిలో జరిగే లావాదేవీలపై తూనికలశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆన్లైన్ కంపెనీలు ఎటువంటి మోసాలకు పాల్పడినా వెంటనే ఫిర్యాదు చేయండి. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో వస్తువులు మారినా, నాణ్యత తగ్గినా వస్తువు వివరాలు లేకపోయినా చర్యలు తప్పవు.– రవీంద్రారెడ్డి, తూనికలు,కొలతలశాఖాధికారి, తిరుపతి -
సెల్‌ఫోన్ పేరుతో మోసం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వాకాడు: సెల్‌ఫోన్ పేరుతో గోల్డెన్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ ఓ యువకుడి నుంచి రూ.2,650 కాజేసి మోసం చేసిన ఉదంతం మంగళవారం మండలంలోని గొల్లపాళెంలో చోటు చేసుకుంది. బాధితుడి సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లాలోని గోల్డెన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఇటీవల తక్కువ ధరలకు ఖరీదైన స్మార్ట్ఫోన్లు అందజేస్తున్నామని పత్రికల్లో ప్రకటన చేసింది. దీంతో ఆశ పడిన వాకాడు గొల్లపాళెంకు చెందిన డి.కస్తూరయ్య ఆర్డర్ చేయడంతో సెల్‌ఫోన్ పార్సిల్ మంగళవారం పోస్టు ద్వారా ఇంటికి చేరింది. అయితే రూ. 2,650 చెల్లించి పార్సిల్ తీసుకుని ఓపెన్ చేసి చూడగా అందులో కూరగాయల కోసుకునే కత్తి ఉండటంతో ఆ బాధిత యువకుడు అవాక్కయ్యాడు. -
తెరవెనుక దొంగలు
నేడు శాస్త్ర సాంకేతిక రంగం పరుగులు పెడుతోంది. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని కొందరు నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలకు దిగుతున్నారు. అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు తిరుపతి క్రైం పోలీసు స్టేషన్ పరిధిలో అధికమవుతున్నాయి. ఇప్పటికే 35 మందికి పైగా ఆన్లైన్ మోసాల బారిన పడ్డారు. పోలీసు స్టేషన్లకు చేరుకుని లబోదిబోమంటున్నారు. తిరుపతి క్రైం: నైజీరియన్లతోపాటు మరికొందరు విదేశీయులు వీసాపై ఢిల్లీ, ముంబయి, కోల్కత్తా వంటి మెట్రో నగరాలకు చేరుకుంటున్నారు. అక్కడ లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని స్థానికంగా ఉన్న కొందరితో ఆపరేషన్ చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా తెప్పించుకున్న ఈమెయిల్ అడ్రస్‌లతోపాటు, మొబైల్‌కు మెసేజ్ పంపుతున్నారు. ఇందులో లాటరీ వచ్చిందని ఆశలు రేపుతున్నారు. దీంతో స్పందించిన అమాయకులు తమ బ్యాంకు ఖాతా నెంబర్, ఏటీఎం, పిన్, ఓటీపీ నెంబర్ చెబుతున్నారు. దుండగులు ఆయా నగరాల నుంచే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ నేరగాళ్లు అనేక విధాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్లు వేశాం. ప్రజలకు అవగాహన కలిగేలా సైబర్ క్రైంపై ప్రచారం చేస్తున్నాం. తప్పుడు ప్రకటనలు, నిరుద్యోగులు, మాయలేడీల వలలో పడకండి. లాటరీ వచ్చిందని డబ్బులు కడితే ఇంటికి వస్తాయని నమ్మి మోసపోకండి. – క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆన్లైన్లో మోసాలు ఇలా ♦ ఓ యువకుడికి అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పలానా కంపెనీ నుంచి నగదును తమ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నామని అవతలి వ్యక్తి తెలిపాడు. నీకు పంపిన పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. ఆ యువకుడు పాస్వర్డ్ చెప్పిన వెంటనే తన అకౌంట్లో ఉన్న రూ.26 వేలు అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ♦ తిరుపతికి చెందిన ఒక యువకుడికి పేస్‌బుక్‌లో ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి తనకు నగదు ఇవ్వాలని, మళ్లీ ఇస్తానని చెప్పి రూ.వేలు కాజేసింది. తర్వాత ఫేస్ బుక్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితుడు క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ♦ క్విక్కర్, ఓఎల్ఎక్స్ సంస్థలను సైతం సైబర్ నేరగాళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వస్తువులను పెట్టి తక్కువ ధరలకే విక్రయిస్తామని చెబుతున్నారు. అలా ఆశపడ్డ వ్యక్తి అకౌంట్లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్నారు. ♦ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఒకసారి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని తెలిపి అకౌంట్ నెంబర్ తెలుసుకుని పాస్వర్డ్ పంపుతారు. పాస్వర్డ్ పంపితే ఆధార్ కార్డు అనుసంధానం అవుతుందని నమ్మబలుకుతారు. అలా చెప్పిన వెంటనే అకౌంట్లోని డబ్బులను వారి అకౌంట్‌కు బదిలీ చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు సైతం నగరంలో అధికంగానే నమోదవుతున్నాయి. -
వీరింతే మారరంతే..!
జీతం కంటే గీతం పెద్దది. సక్రమంగా డ్యూటీ చేస్తే కేవలం జీతం మాత్రమే. అదీ రూ.30 లేదా రూ.40 వేలకే పరిమితం. అదే దారి తప్పితే రాత్రికి రాత్రే రూ.లక్షలకు లక్షలు చేతిలో గుట్టుచప్పుడు కాకుండా వచ్చిపడతాయి. ఇంత చిన్న లాజిక్ తెలిశాక కష్టపడి పనిచేయాలని ఎవరైనా అనుకుంటారనుకుంటే పొరపాటే. కొంతమంది అధికారులు అడ్డదారులకు బాగా అలవాటు పడ్డారు. పరువుపోయినా ఫర్వాలేదు.. తుడిచేసుకుంటే పోతుంది. అంతేగానీ మొహమాటపడితే రూ.లక్షలు ఎలా వస్తాయనుకుంటున్నారు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు. వారిలో ఉన్న ఈ బలహీనతను కొంతమంది బడాబడా నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అక్రమాలకు దారి చూపించి రాజకీయ అండదండలతో ప్రభుత్వ భూములను పెద్దోళ్ల పాస్‌పుస్తకాల్లోకి ఎక్కిస్తున్నారు. చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు మండంలం పి.గుడిపాడు సర్వే నంబర్ 12,16ల్లో మొత్తం 27 ఎకరాల వరకు డొంకపోరంబోకు భూమి ఉంది. దానిలో 4.52 ఎకరాలను ఇటీవల ఓ తహసీల్దార్ కంప్యూటర్ ఆపరేటర్ సాయంతో ఆన్లైన్లో ఎక్కించేశారు. దాని వెనుక రూ.లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో ఎక్కించిన భూములను రద్దు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు సంకే సుబ్బారావు ఇటీవల జన్మభూమి సభలో అధికారులకు అర్జీ ఇచ్చారు. అంతకు ముందు పనిచేసిన తహసీల్దార్.. 4.58 ఎకరాల డొంకపోరం బోకు భూమిని ఆన్లైన్లో ఎక్కించి ఎంచక్కా తనకు కావాలసింది తాను లాగేసుకొని బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. వాస్తవానికి ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమిని ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా కన్వర్షన్ చేయించిన తర్వాత అనాధీనంగా మార్చిన తర్వాతే ఆన్లైన్లో ఎక్కించాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయాలంటే సంబంధిత గ్రామ వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్ రిపోర్టులు పక్కాగా ఉండాలి. ఇవేమీ లేకుండా ఏకంగా ఆ ఇద్దరు తహసీల్దార్లు చకచకా రాత్రికి రాత్రే దాదపు 9 ఎకరాల డొంకపోరంబోకు భూమిని ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. విచిత్రం ఏమిటంటే చీమకుర్తి మండలం గోనుగుంటలో కంసలి మాన్యానికి చెందిన భూమిని స్థానిక రైతు అన్ను రాంబాబు తన పాస్‌పుస్తకంలోకి ఎక్కించమంటే కంసలి మాన్యాలు, పోరంబోకులకు పాస్‌పుస్తకాలు ఇవ్వకూడదని చెప్పింది కూడా ఆ తహసీల్దారే కావడం గమనార్హం. అలా ఎక్కించకూడదని చెప్పిన తహసీల్దార్ ఎకరాలకు ఎకరాల భూమిని ఎలా ఎక్కిం చారోనని అర్థంగాక స్థానికులు జుత్తుపీక్కుంటున్నారు. ఎన్నో అక్రమాలు ♦ చీమకుర్తిలోని సత్రాలకు చెందిన భూమిని ఆన్లైన్లో ఎక్కించాలని భూమికి సంబంధించిన కొందరు రెవెన్యూ అధికారులను కలిస్తే సత్రం ఆనవాళ్లు లేకుండా చేస్తే ఆన్లైన్లో ఎక్కిస్తామని రెవెన్యూ అధికారులే శకుని సలహాలు ఇచ్చారు. దాని ఫలితంగా రాత్రికి రాత్రి సత్రాన్ని కూల్చేసి రాగా మీడియాలో రావడంతో రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఎక్కించేందుకు కాస్త వెనక్కి తగ్గారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు మాత్రం పొలంగా చూపుతున్న స్థలాన్ని ఇంటి స్థలంగా చూపించి రిజిస్ట్రేషన్ చేశారు. దాని వెనుక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ♦ చీమకుర్తిలోనే కర్నూలు రోడ్డు ఫేసింగ్‌లోనే జంగంకుంటను ఆనుకొని సర్వే నంబర్ 36లో 2.28 ఎకరాల అనాధీనం భూమిని అడ్డదారిలో కొంతమంది గతంలో ఉన్న తహసీల్దార్ల సాయంతో పట్టాలు సృష్టించి పాస్‌పుస్తకాల్లోకి ఎక్కించారు. సర్వే నంబర్ 37లో జంగంకుంట, 449లో కోనేటి కుంట, 194, 286 సర్వే నంబర్లలో ఉన్న అక్కమ్మకుంట, పాపయ్యకుంటలకు చెందిన కుంట పోరంబోకు భూములకు రెవెన్యూ అధికారులే అందడండలందించి పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించారు. ప్రభుత్వ భూములకు అధికారులే రక్షణగా నిలవాల్సి ఉంటే రెవెన్యూలోని లొసుగులను అడ్డం పెట్టుకొని అక్రమార్కులకు అనుకూలంగా పాస్‌పుస్తకాలు ఇస్తూ ఆన్లైన్లో ఎక్కిస్తూ భూములను అన్యాక్రాంతం చేస్తుంటే ఇక ప్రభుత్వ ఆస్తులకు రక్షణేముంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కేంద్రంగా అక్రమాలు ♦ అవినితికి పెట్టింది పేరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం. సామాన్యుడు ఇంటి స్థలాన్ని, పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వెళ్తే ఫీజు టు ఫీజు అంటూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే రెట్టింపు స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ వంట్లో వణుకు పుట్టిస్తున్నారు. ప్రభుత్వ భూములను రిజిస్టర్ చేయకూడదని రెవెన్యూ కార్యాలయం అధికారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి నివేదిక అందిస్తారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు అవేమీ పట్టవు. అదేదో సినిమాలో చెప్పినట్లు డబ్బులు ఎవరిస్తే వారికి చార్మినార్‌నైనా రిజిస్ట్రేషన్ చేస్తామన్నట్లుగా చీమకుర్తిలోని వందల సంఖ్యలో ప్రభుత్వానికి చెందిన ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన ఘనత చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికే దక్కుతుంది. ఇక ప్రభుత్వ పొలాలకు డబ్బులు అప్పగిస్తే చకచకా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేకనే గత మార్చిలో ఒకసారి, అంతకు మందు ఏడాదిన్నర క్రితం మరోసారి ఏసీబీ అధికారులు చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ♦ ఇలా ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన అధికారులు తమ జీతాన్ని మరిచిపోయి పైసంపాదనకు అలవాటుపడ్డారు. అధికారులు ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడటంపై ప్రజలు నెవ్వరపోతున్నారు. కంచె చేను మేసిందనే సామెతను సార్థకం చేసేలా అధికారుల వైఖరి ప్రజలను ఇబ్బందుల పాల్జేయడమే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టం కలిగిస్తున్నారు. -
ఆన్లైన్ చీటింగ్!
నాసిరకం సెల్ఫోన్లు పట్టుకుని రహదారుల్లో సంచరించడం... ‘అనువైన’వారిని ఎంపిక చేసుకుని కష్టాల పేరుతో ఆకర్షించడం.. సదరు ఫోన్ తక్కువ ధరకే విక్రయిస్తున్నానంటూ అందినకాడికి దండుకుని అంటగట్టడం.. ఇలా నేరుగా జరిగే చీటింగ్స్ గతంలోనూ చూశాం. ప్రస్తుతం మోసగాళ్ల పంథా మారింది. ఆన్లైన్ వేదికగా పక్కా పథకం ప్రకారం వంచనకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ ఫోన్ల ఫొటోలు పోస్ట్ చేసి, ఒరిజినల్ అంటూ టోకరా వేస్తున్న వాళ్లు కొందరైతే.. ఆన్లైన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటామంటూ పట్టుకుని ఉడాయిస్తున్న వారు ఇంకొందరు. తాజాగా ఇరవై రోజుల్లో కార్ల విక్రయం పేరుతో జరిగిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ–కామర్స్ సైట్స్‌ను బాధ్యుల్ని చేయలేమంటున్నారు. ఆయా సైట్స్‌కు బాధ్యత ఉండదు ఈ నేపథ్యంలో ఆన్లైన్లో క్రయవిక్రయాలు చేసే వాళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరముంది. ప్రాథమికంగా అమ్ముతున్న వ్యక్తి వివరాలు, వస్తువు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. వీలున్నంత వరకు వ్యక్తిగతంగా కలవడం, వస్తువును చూడటం చేసిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి. ఎలాంటి పరిశీలన లేకుండా ముందుకు వెళ్తే మోసపోతారు. – సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో విక్రయాలు జరిపే ఈ–కామర్స్ వెబ్సైట్లు రెండు రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు, సంస్థలకు చెందిన ఉత్పత్తులకు ప్రచారం కల్పిండంతో పాటు తమ వెబ్సైట్ ద్వారా అమ్ముకునే అకాశం ఇచ్చేవి మొదటి రకం. ఇలా చేసినందువల్ల లావాదేవీల్లో వీటికి కొంత కమీషన్ ముడుతుంది. రెండో రకానికి చెందిన ఈ–కామర్స్ సైట్లు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటివి ప్రధానంగా సెకండ్ హ్యాండ్ వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారులే తాము వినియోగిస్తున్న వస్తువుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో పోస్ట్ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించడం ద్వారా ఖరీదు చేసుకునే అవకాశం ఉంది. ‘పోస్టింగ్’ ఎంతో ఈజీ.. మొదటి తరహా వెబ్సైట్ల వల్ల అంతగా నష్టం లేకపోయినా.. రెండో రకానికి చెందిన వాటితోనే తలనొప్పులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీటిలో తాము వినియోగిస్తున్న వస్తువుల్ని విక్రయించాలని ఆశించే వినియోగదారులు ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, ఆయా వెబ్సైట్లకు చెందిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫోన్లో వినియోగించే సిమ్‌కార్డు బోగస్ వివరాలతో తీసుకున్నదైతే వీరి ఉనికి బయటపడటం కూడా కష్టసాధ్యమే. ఇలాంటి వెబ్సైట్లను వేదికగా చేసుకున్న మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చీటింగ్స్ ఎన్నో రకాలు.. ఈ వెబ్సైట్లను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే చీటర్లు ప్రధానంగా రెండు ‘మార్గాలను’ అనుసరిస్తున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువుల్ని పోలి ఉండే, అదే కంపెనీ పేర్లతో లభించే వస్తువుల్ని ఖరీదు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రోనగరాల మార్కెట్లతో ఇవి అతి తక్కువ ధరకు లభిస్తున్నవాటిని తీసుకువచ్చి అవి అసలువంటూ ‘సెకండ్ హ్యాండ్’ వెబ్‌సైట్స్‌లో పోస్టు చేసి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ఖరీదు చేస్తామంటూ వాటి యజమానుల్ని సంప్రదిస్తున్న మోసగాళ్లు ట్రయల్ అని, డబ్బు తీసుకువస్తామని, దృష్టి మళ్లించి వాటిని ఎత్తుకుపోతున్నారు. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయి. మరోపక్క వాహనాలను సైతం విక్రయిస్తామంటూ పోస్టులు పెట్టి అడ్వాన్స్ రూపంలో అందినకాడికి దండుకుంటున్నారు. ఈ తరహా ఆన్లైన్ మోసగాళ్లలో విదేశీయలు కూడా ఉంటున్నారు. తేలిక పాటి వాహనాలను విక్రయిస్తానంటూ ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లో తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజమహేంద్రవరం వాసి వినోద్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్ వెబ్సైట్ వేదికగా వాహనం విక్రయం పేరుతో టోకరా వేసిన ఉగాండా జాతీయుడు ఫెడ్రిక్‌ను గత శుక్రవారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. -
ఎయిర్ టెల్ లక్కీ డ్రాలోమట్టి ముద్ద
ప్రకాశం , దర్శి రూరల్: పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన పండూరి శంకర్ అనే వ్యక్తికి పది రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. మీకు ఎయిర్ టెల్ లక్కీ డ్రాలో సామ్సంగ్ జె–7 మొబైల్ తగిలిందని చెప్పారు. తనకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా మీరు ఎయిర్టెల్ నంబర్‌ను పదేళ్ల నుంచి వాడుతున్నారని, అందుకే అవకాశం వచ్చిందని చెప్పకొచ్చారు. ఆ సెల్ బయట మార్కెట్లో రూ.16 వేలు ఉందని, డ్రాలో వచ్చినందున మీకు రూ.4 వేలకే ఇస్తున్నామని నమ్మించారు. పదే పదే ఫోన్ చేసి విసుగు వచ్చేలా మాట్లాడటంతో సరే పంపించండన్నాడు. శంకర్ చిరునామాను ఫోన్లో అడిగి తెలుసుకుని వెంటనే వారు ఓ బాక్స్‌ను పోస్టులో పంపారు. ఆ వెంటనే మళ్లీ ఫోన్ చేసి పోస్టాఫీస్‌కు వెళ్లి రూ. 4 వేలు చెల్లించి సెల్ తీసుకోవాలని చెప్పారు. బుధవారం శంకర్ పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.4 వేలు చెల్లించి పార్శిల్ తీసి చూడగా అందులో మట్టిముద్ద, నాలుగు రేకు బొమ్మలు కనిపించాయి. బాధితుడు వచ్చిన నంబర్‌కు తిరిగి కాల్ చేయగా పని చేయలేదు. మరో నంబర్ నుంచి కాల్ చేయగా దాన్నీ కట్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాడు. మళ్లీ మరొక నంబర్‌తో ఫోన్ చెయ్యగా మీకు వచ్చిన పార్శిల్‌ను వీడియో తీసి పంపాలని చెప్పి ఆ తర్వాత స్విచ్చాప్ చేసుకున్నాడు. పార్శిలో ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించగా స్మార్ట్ గెలాక్సీ, 10బై10, విలేజ్ బేగంపూర్, ఢిల్లీ..అని ఉంది. -
సహోద్యోగినికి సైబర్ వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్ ద్వారా ఖరీదు చేసిన అమెరికా నెంబర్ వినియోగించి సహోద్యోగినిని ఆన్లైన్ వేధింపులకు గురి చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడిపాలానికి చెందిన బి.వెంకట సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం మాదాపూర్‌లో ఉంటూ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఇదే హోటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఓ యువతి సైతం పని చేశారు. ఆమెకు పెళ్లికుదరడంతో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆమెపై అసక్తి పెంచుకున్న సత్యనారాయణ పెళ్లి చెడగొట్టాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ద్వారా అమెరికాకు చెందిన ఓ సిమ్‌కార్డు ఖరీదు చేశాడు. దీనిని వైఫై ద్వారా వినియోగిస్తూ వాట్సాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. బాధితురాలి ఫోన్లో ఉన్న ఆమె ఫొటోలు, కాబోయే భర్త నెంబర్ సేకరించిన అతను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జోడిస్తూ సహోద్యోగులతో పాటు కాబోయే భర్తకూ పంపాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఉద్యోగం సైతం మానుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సత్యనారాయణ నిందితుడిగా గుర్తించి శుక్రవారం అతడు పని చేస్తున్న హోటల్లోనే అరెస్టు చేశారు. -
ఏడాదిపాటు ఉచిత 4జీ డేటా!
సాక్షి, హైదరాబాద్: ఏమాత్రం అవకాశం దొరికినా సైబర్ నేరగాళ్లు అమాయకుల చెవిలో పూలు పెడుతున్నారు. ఏదో లక్కీ డ్రా గెలుచుకున్నారంటూ మోసం చేస్తారు. మిమ్మల్ని బుట్టలో పడేసి కార్డు, బ్యాంకు వివరాలు తెలుసుకుంటారు. ఆ తరువాత ఖాతాలు ఖాళీ చేస్తారు. ఇప్పుడు తాజాగా మరో పద్దతి ఎన్నుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఉచితంగా 3జీ, 4జీ డేటా ప్యాక్ ఉచితం అంటూ మోసం చేస్తున్నారు. ఓ వెబ్సైట్ లింకును షేర్ చేస్తే మీకు ఏడాది పాటు ఉచితడేటా అంటూ మీ వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం సేకరించిన వివరాలను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే తాజాగా ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల్లో ఓ మెస్సేజ్ వైరల్ అవుతోంది. షేర్ చేస్తే ఏడాదిపాటు 3జీలేదా 4జీ ఉచిత డేటా అంటూ ఓవెబ్‌సైట్ లింక్ షేర్ అవుతోంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే ఇందులో మూడు స్టేజ్‌లు చూపిస్తుంది. మొదటిది మీ వివరాలు నింపాలి. రెండో స్టేజ్‌లో ఫేస్బుక్ లేదా వాట్సప్‌లో షేర్ చేయమని అడుగుతుంది. ఆతర్వాత మూడో స్టేజ్‌లో 30 నిమిశాల్లో రీచార్జ్ వస్తుందని ఉంటుంది. అయితే ఉచిత డేటాకు ఆశపడి చాలా మంది ఈ లింక్‌ను తమ గ్రూపుల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అదొక నకిలీ వెబ్సైట్. మీరు వివరాలు నమోదు చేయగానే ఆడేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. అంతేకాకుండా టెలీ మార్ఫింగ్ ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైన అనుమానం ఉంటే సంబంధిత ఆపరేటర్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తారు. ఒక వేళ సదరు ఆపరేటర్ ఏదైన ప్రత్యేక ఆఫర్ ప్రకటిస్తే అది కంపెనీ మెస్సేజ్ రూపంలో వినియోగదారులకు తెలియచేస్తుంది. అంతేకాకుండా తమ అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా మసులుకోండి. జాగ్రత్తలు పాటించండి. మీ బ్యాంకు, ఆధార్, పర్సనల్ విషయాలను ఎటువంటి సందర్భంలోను వెల్లడించొద్దు. -
సెల్‌ఫోన్ బదులుగా పూజా సామగ్రి
కొత్తూరు: జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన జి.నాగరాజుకు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేసి రూ. 14వేలు విలువైన శ్యామ్‌సంగ్ సెల్‌ఫోన్‌ను కేవలం రూ.4వేలకే అందిస్తానని చెప్పాడు. దీనికి నాగరాజు తిరస్కరించగా సంబంధింత వ్యక్తి పదేపదే ఫోన్ చేసి సెల్‌ఫోన్ ఆఫర్‌ను వదులుకోవద్దంటూ అభ్యర్థించాడు. దీంతో ఆయన చెప్పిన ప్రకారమే రూ.4 వేలను ఆన్లైన్లో చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు. ఇటీవల నివగాం పోస్టాఫీస్‌కు పార్సిల్ వచ్చినట్లు సమాచారం అందడంతో నాగరాజు అక్కడకు వెళ్లి చూడగా సెల్‌ఫోన్ బదులుగా రోల్డు గోల్డు తాబేలు, రెండు పాదాలు, లక్ష్మీదేవి ప్రతిమ, పూజా సామగ్రి తదితర వస్తువులు ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే గతంలో తనకు వచ్చిన ఫోన్ నంబర్లు 8010021314, 8744960255కు సంప్రదించినా ఫలితం లేకపోయిందని నాగరాజు వాపోయాడు. -
వాచ్ బుక్ చేస్తే.. రాయి వచ్చింది...
నిజామాబాద్: జిల్లాలోని ఓ వ్యక్తి ఆన్లైన్లో రిస్ట్ వాచ్ బుక్ చేస్తే పార్శిల్లో సిమెంట్ రాయి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు బీర్కూర్ మండలం బరంగరెడ్డికి చెందిన అశోక్ ఐదు రోజుల క్రితం ఆన్లైన్ ఈ కామర్స్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.700 చెల్లించి రిస్ట్‌వాచ్ బుక్ చేశాడు. తీరా పార్శిల్ ఇంటికి వచ్చిన అనంతరం ఆనందంతో తెరిచి చూడగా వాచ్‌కి బదులు సిమెంట్ రాయి, ఐరాన్ రాడ్ కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజురోజుకి ఆన్లైన్ మోసాలు పెరిగిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ఆన్లైన్ మోసం
బొబ్బిలి రూరల్ : బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.... మీ ఏటీఎం కార్డు 16 అంకెల నంబర్, పిన్ నంబర్ తెలియజేయండంటూ ఓ వ్యక్తి నుంచి వివరాలు తీసుకుని ఏటీఎం నుంచి మూడు లావాదేవీలతో రూ.49,997లు డ్రా చేసిన వైనమిది. బాధితుడు శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఎం.బూర్జవలస పంచాయతీ గున్నతోటవలసకు చెందిన పప్పల శ్రీనివాసరావు గ్రోత్ సెంటర్లో కార్మికుడిగా పని చేçస్తున్నాడు. అతని ఖాతాలో కొంత మొత్తం ఉండగా, ఈ నెల 28న శ్రీనివాసరావుకు 8877425622 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మేం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది... మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు తెలియజేసి, పిన్ నంబర్ తెలియజేయండి‘ అని ఫోన్ చేశారు. దీన్ని నమ్మిన శ్రీనివాసరావు తానుబయట ఉన్నాను. నా ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. వివరాలు తెలియజేస్తాను పావు గంట పోయాక చేయండి అని ఫోన్ పెట్టేయగా పావు గంట పోయాక తిరిగి ఆ వ్యక్తి అదే నంబర్‌తో ఫోన్ చేయగా వివరాలు తెలియజేయగా పది నిమిషాలలో వరుసగా ఒకసారి రూ.19,999, మరోసారి రూ.9,999, తిరిగి రూ.19,999లు మొత్తంగా రూ.49,997లు డ్రా చేశాడు. ఎప్పుడు డ్రా చేసినా తన సెల్‌కు మెసేజ్ వచ్చేదని, కానీ తనకు మెసేజ్ రాలేదని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. గురువారం డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే ఖాతాలో డబ్బులు లేవని తెలియజేయడంతో గ్రోత్ సెంటర్ ఎస్బీఐ బ్రాంచ్‌కి వచ్చి వివరాలు తీసుకుంటే మోసపోయిన సంగతి తెలిసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ సుధీర్‌ను కలిసి విషయం తెలియజేస్తే తామేమీ చేయలేమని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చేసేదేంలేక శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వెబ్‌క్యామ్‌లో అందం ఎరవేసి..
'ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అమ్మాయి ఫేస్ బుక్ రిక్వెస్ట్ పంపింది. ఎవరో తెలియని వాళ్లు అని నేను అనుకోలేదు. ఎందుకంటే నాతో చదివిన ఎక్కువగా పరిచయంలేని నా పాత స్కూల్ స్నేహితులు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. దీంతో వెంటనే రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశా. మరుసటి రోజు అదే అకౌంట్ నుంచి హాయ్ హౌ ఆర్ యూ, మీ ఫ్రొఫైల్ చూసి రిక్వెస్ట్ పంపా అంటూ మెసేజ్ వచ్చింది. ఫ్రొఫైల్ చెక్ చేశా. నిజంగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అదే రోజు రాత్రి స్కైప్ ద్వారా చాట్ చేసింది. తనకు 23 ఏళ్లని, తల్లిదండ్రులు మరణించారని, లెబనాన్‌లోని సెడాన్‌లో తన సోదరి ఇంట్లో ఉంటున్నానని, ప్రస్తుతం చదువు, పని లేకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండాల్సి రావడంతో బోరుకొడుతోందని చెప్పింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ.. తనకు శృంగారమంటే అమితమైన ఆసక్తి అని, అయితే తన సోదరి బయటకు వెళ్లనివ్వదని చెప్పింది. ఎదో తెలియని క్యూరియాసిటీ నాలో మొదలైంది. కానీ, ఎక్కడో ఎదో చిన్న సందేహం. తెలియని అమ్మాయితో అలా మాట్లాడటం..! అయినాసరే ఆమెకు దగ్గరవుతూనేఉన్నా. ఒకరోజు నా దగ్గర వెబ్ కామ్ ఉందా అని ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి కూడా వెబ్ కామ్ ఆన్ చేసింది. అంతే కళ్లు చెదిరే తన అందాన్ని చూసి ముగ్దుడినైపోయా. మేము మాట్లాడుకోకుండానే, కేవలం టైపింగ్ చేస్తూనే చాట్ చేశాము. తన సోదరి ఇంట్లోనే ఉందని, మాట్లాడితే తనకు తెలిసిపోతుందని ఆ అమ్మాయి చెప్పింది. ఇంకోరోజు.. 'నువ్వు ఏం చేస్తావ్?' అని అడిగింది. వెంటనే మిలాన్‌లో మార్కెటింగ్ చేస్తానంటూ బదులిచ్చా. 'అయితే మీరు కచ్చితంగా కోటీశ్వరుడై ఉంటారే' అంది. అవునన్నాను. తన సోదరి వస్తుందంటూ డ్రెస్ వెసుకొని సైన్ ఆఫ్ అయ్యింది. ఒక అరగంట తరువాత నా ఫేస్ బుక్ అకౌంట్‌కు ఓ మెసేజ్ వచ్చింది. 'చూడు, నేను ఓ మగాణ్ని. అవతల నువ్వేం చేశావో వెబ్ క్యామ్ ద్వారా మొత్తం రికార్డు చేశా' అంటూ ఆ వీడియోను నాకు పంపాడు. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను చూసి షాక్‌కు గురై ఒక్కసారిగా కుంగిపోయా. 'నీ ఫెస్ బుక్ అకౌంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల జాబితా మొత్తం నా దగ్గర సిద్ధంగా ఉంది. మీ తల్లి, సోదరులు, కజిన్స్ అందిరివి ఉన్నాయి. నీకు వారం రోజులు గుడువు ఇస్తా, ఇలోగా నాకు 5000యూరోలు పంపించు లేదా వీడియోను అందరికి పంపిస్తా'అని మెసేజ్ పంపాడు. దిమ్మతిరిగినంత పనైందినాకు. వెంటనే స్కైప్ లిస్ట్ నుంచి ఆ కాంటాక్ట్‌ను డిలీట్ చేశా. దీంతో వాట్సప్‌లో మెసేజ్‌లు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక అతన్ని బతిమిలాడటం ప్రారంభించా. 5000ల యూరోలు కట్టే అంత స్తోమత నాకు లేదన్నా. దానికి అతను ' నువ్వు కచ్చింతంగా ఇవ్వగలుగుతావు, యూరప్‌లో మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా' అన్నాడు. లేదు అమ్మాయి అనుకొని ఇంప్రెస్ చేయడాకి అబద్ధం చెప్పాను. నేను కేవలం పిజ్జా డెలివరీ బోయ్ అని చెప్పా. బాత్ రూంకి నేనే టైల్స్ వేస్తూ దిగిన ఓ ఫోటో పరిచయం చేసుకుంటున్న సందర్భంగా ఆమెకు పంపిన విషయం గుర్తొచ్చి, దాని గురించి వివరించా. నిజంగానే నేను డబ్బు ఉన్నోడినైతే ఆ పని నేనే ఎందుకు చేస్తా అంటూ కొంత మేర ఆ వ్యక్తిని కన్విన్స్ చేయగలిగా. 'అదీ నిజమే కానీ, నాకు అదంతా అవసరం లేదు. నీకు ఒక వారం గడువు ఇస్తున్న 2000 యూరోలు అరెంజ్ చేయి. లేదా నీ కుటుంబ సభ్యులకు వీడియో పంపిస్తా' అన్నాడు. ఇప్పుడు నాముందు రెండే దారులున్నాయి. ఒకటి అతడు అడిగినంత డబ్బు ఇస్తూనే ఉండాలి, పైగా గ్యారంటీ ఏమీ లేదు. రెండు.. అతని డీల్‌ను రిజక్ట్ చేసి ఆ వీడియో ఎవరూ చూడరని కామ్‌గా ఉండటం. నేను రెండోదే ఎంచుకున్నా... ఆ రోజు రానే వచ్చింది....వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తున్నాఅంటూ మెసెజ్ వచ్చింది. మరో సందేహం లేకుండా అప్ లోడ్ చేసుకో అంటూ బదులిచ్చా. నా ఫేస్ బుక్ వాల్ పైన నా పర్మిషన్ లేకుండా వేరే వాళ్లు పోస్టు చేయకుండా వెంటనే ప్రైవసీ సెట్టింగ్ మార్చా. యూట్యూబ్‌లో ఆ వీడియోను చూశా. సెక్సువల్ కంటెంట్ ఉందంటూ వీడియోను రిపోర్టు చేయడం ప్రారంభించా. వీడియోను నిలిపివేయండి అంటూ ఎన్నో సార్లు రిపోర్టు చేశా. డబ్బు పంపకపోతే వీడియో లింక్‌ను నా బంధువులకు పంపిస్తానంటూ అతను మరో మెసెజ్ పెట్టాడు. సరే అలాగే చేయ్ అంటూ మెసేజ్ పెట్టా. యూట్యూబ్‌లోని వీడియోను రిపోర్టు చేస్తూనే ఉన్నా, వీడియోను చూస్తున్న ప్రతిసారి ఎంత మంది దాన్ని చూశారో పరిశీలిస్తూనే ఉన్నా. సరిగ్గా ఓ గంట తర్వాత ఆ వీడియోను యూట్యూబ్ తొలగించింది. వీడియోను అప్లోడ్ చేసినప్పటినుంచి ఎంతమంది చూసారో తెలిపే వ్యూస్‌లో అన్ని నేను చూసినవే ఉన్నాయి. ఒక్క వ్యూ తప్ప. అది వీడియోను అప్ లోడ్ చేసిన తర్వాత ఆ వ్వక్తే చూసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక వేళ నా తల్లి, సోదరి, బందువులు ఆ వీడియోను చూస్తే ఎలా ఉండేది. సిగ్గుతో చచ్చిపోవాలని అనుకునే వాడినేమో. ఆ వీడియో యూట్యూబ్ నుంచి తీసివేసిన తర్వాత తిరిగి ఆ వ్యక్తినుంచి నాకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదు. డబ్బు కోసం నాలాంటి పేదోళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అతన్ని అడిగిన ప్రశ్నకు..నేను గల్ఫ్‌లో ఉన్న కోటీశ్వరులని కూడా లక్ష్యంగా చేసుకొనే పని చేస్తామంటూ బదులిచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. నేను చాలా అదృష్టవంతున్ని అతను నన్ను నిజంగానే పేదవాడని నమ్మి, మళ్లీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, యూట్యూబ్‌లో మళ్లీ ఏమైనా అప్లోడ్ చేశాడేమే అని ప్రతి సారి చెక్ చేసుకోవడం మాత్రం అలవాటుగా మారింది' అని విదేశాల్లో ఉంటున్న పాలస్తీనా యువకుడు తాను ఆన్లైన్ స్కామ్‌లో ఇరుక్కున్న వైనాన్ని ప్రఖ్యాత బీబీసీ వార్తా సంస్థకు వివరించాడు. ఇప్పుడీ కథనం ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. రిపోర్టర్: 23 ఏళ్ల లెబనాన్ అమ్మాయిగా సమీర్‌ను నమ్మించింది మోసం చేసింది మోరాకోలోని ఒడ్ జెమ్ టౌన్‌కు చెందిన యువకుడు. అది సెక్సార్షన్ ఇండస్ట్రీకి రాజధానిలాంటి ప్రాంతం. ఒడ్ జెమ్ స్కామర్లు ఫేస్ బుక్ పేజీల్లో ఇలాగే ఎంతో మందికి వల వేస్తూ ఉంటారు. ఎవరైనా అబ్బాయి చిక్కితే పోర్న్ సైట్ నుంచి అమ్మాయిలకు సంబంధించి డౌన్ లోడ్ చేసుకున్న వీడియోను ప్లే చేసి అమ్మాయిలా నమ్మించి బుట్టలోకి దింపుతారు. రోజుకు కనీస 500 డాలర్లు సంపాదిస్తారని స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి తెలిపాడు. వందలాది ఒడ్ జెమ్ యువకులు ఇలాంటి స్కామ్‌లో ఆరితేరారని తెలిపాడు. వేరే ఇతర జీవనాధారం లేని ఈ ప్రాంతంలో 50 అంతర్జాతీయ మనీ ట్రాన్సఫర్ ఆఫీసులు ఉన్నాయంటేనే ఈ స్కామ్ ఎంతగా వారికి డబ్బు సంపాదించి పెడుతుందో అర్థం అవుతుంది. ఇక్కడి వీధుల్లో జర్మన్ కార్లు, జపాన్ మోటారు బైకులతో కలకలలాడుతున్నాయి. యూకే, యూఎస్, యువ అరబ్ యువకులే లక్ష్యంగా ఎక్కువగా ఈ దందా కొనసాగుతోంది. ప్రపంచంలో ఈ తరహా జరుగుతున్న స్కాముల్లో మూడో వంతు ఈ ప్రాంతాల్లోంచే జరుగుతుండటం కొసమెరుపు. -
'ఆన్లైన్'లో ఇంత మోసమా!
-
'ఆన్లైన్'లో ఇంత మోసమా!
జమ్మికుంట: పండుగ సంబురానికి అదనంగా డెలివరీ బాయ్ తెచ్చిన ల్యాప్‌టాప్ పార్సిల్‌ను చూసి ఆ కుటుంబం ఎగిరి గంతేసింది. ఉత్సుకతతో పార్సిల్ తెరిచిచూసి ఒక్కసారిగా దిగ్భాంతికి గురైంది! ఆన్లైన్ షాపింగ్ ద్వారా బుక్ చేసిన లాప్టాప్కు బదులు ఫ్లైవుడ్(చెక్క) ముక్క కనిపించిందా పార్సిల్లో! కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటోన్న మామిడాల శ్రీధర్.. నవంబర్ 2న స్నాప్‌డీల్ అప్లికేషన్ ద్వారా రూ.34 వేల విలువచేసే హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకున్నారు. మంగళవారం(దసరా పండుగనాడు) ఆ బుకింగ్‌కు సంబంధించిన పార్సిల్‌ను డెలివరీ బాయ్ తీసుకొచ్చాడు. పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిన శ్రీధర్ తీరా దాన్ని తెరిచి చూశాక.. ల్యాప్‌టాప్‌కు బదులు ఫ్లైవుడ్ ఉండటంతో కంగుతిన్నాడు. పార్సిల్ తెరిచే టప్పుడు వీడియో తీసిన బాధితుడు తాను మోసపోయిన తీరును మీడియాకు వెల్లడించాడు. (ఆ దృశ్యాలను వీడియోలో చూడొచ్చు) మోసం తెలుసుకున్న తర్వాత డెలివరీ బాయ్‌కి ఫోన్ చేయగా.. 'నాకేమీ తెలియదని, ఏం చేసుకుంటావో చేసుకోమని' అన్నట్లు శ్రీధర్ చెప్పారు. ఈ వ్యవహారంపై స్నాప్‌డీల్ కంపెనీకి కూడా ఫిర్యాదుచేశామని, వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు మెయిల్ చేసిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదుచేశానని పేర్కొన్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి మోసాలు చోటుచేసుకున్నప్పుడు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్ లాంటి పెద్ద ఆన్లైన్ వ్యాపార సంస్థలు.. ఆయా డెలివరీ బాయ్స్తోపాటు స్థానిక డిస్ట్రిబ్యూటర్లపైనా చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. -
ఆన్లైన్లో ఘరానా మోసం.. ముగ్గురి అరెస్ట్
వరంగల్: ఓ నకిలీ కంపెనీ పేరుతో ఆన్లైన్లో ఘరానా మోసానికి పాల్పడ్డారో ముగ్గురు యువకులు. వారిని తొర్రూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆర్జీ గ్రూప్ మనీ సర్య్కూలేషన్ అనే సంస్థ పేరుతో ముగ్గురు యువకులు ఆన్లైన్లో మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురి నుంచి రెండు కార్లు, ల్యాప్‌టాప్, నాలుగు ఫోన్లు, రూ. 7 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆన్లైన్ మోసం
ములుగు: ఏ వస్తువైనా సరే ఆన్లైన్లో బుక్ చేస్తే చాలు, కొద్ది గంటల్లోనే పార్సల్ ఇంటికి వస్తుందని ఎదురు చూసే కస్టమర్లను మిడిల్ మేనేజర్లు మోసం చేస్తున్నారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు కూడా ఈ బాధ తప్పటంలేదు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం నల్లగుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలో అమెజాన్ యాప్ ద్వారా ప్రాడక్ట్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఖాళీ పార్సల్ వచ్చింది. గ్రామానికి చెందిన జనగాం రవి అనే యువకుడు అమెజాన్ ఆప్‌లో రూ.315 విలువ గల మెమోరీ కార్డును ఆన్లైన్లో బుక్ చేశాడు. కంపెనీ పంపించిన పార్శిల్ తో కొరియర్ బాయ్ మంగళవారం రవి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో రవి లేకపోవటంతో అతని సోదరుడు బాబురావు రూ. 315 చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. కొరియర్ బాయ్, స్థానికుల ముందే ఆ పార్శిల్ తెరిచి చూడగా అందులో మెమోరీ కార్డు లేకుండా ఖాళీ కవర్ మాత్రమే ఉంది. దీంతో బాబురావు కొరియర్ బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోరీ కార్డు ఇచ్చేదాక ఇక్కడి నుంచి కదలనివ్వమని నిలువరించాడు. చివరకు బాయ్ తమ సంస్థ ఉన్నత సిబ్బందితో ఫోన్లో మాట్లాడి బాబురావుకు రూ.315 తిరిగి అందించాడు. నాణ్యమైన వస్తువు లభిస్తుందని ఆర్డర్ ఇస్తే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని స్థానికులు విస్తుపోయూరు. సంబంధిత అధికారులు స్పందించి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆన్లైన్లో మోసాలు.. ముఠా గుట్టురట్టు!
హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబర్ క్రైం పోలీసులు. నగరంలో సైబర్ క్రైం ఆపరేషన్‌లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉన్న ప్లానెట్ ఐ ట్రేడ్ సెంటర్‌పై బుధవారం సైబర్ క్రైం పోలీసులు దాడులు జరిపారు. సైబర్‌క్రైం ఏసీపీ రఘువీర్, సీఐ శంకర్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్లానెట్ ఐ ట్రేడ్ సెంటర్ కంపెనీ మేనేజర్ పాటూరి వీరభద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 50 మంది ఉద్యోగులతో వీరభద్రరావు కాల్ సెంటర్‌ను నడుపుతున్నాడనీ, లక్కీ డిప్ల ద్వారా 3 తులాల బంగారం ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఓన్లీ పోస్టల్ ఛార్జీలు మాత్రమే కట్టాలంటూ మోసానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న గిప్ట్‌లో పుసల దండను ఇచ్చి ఈ కంపెనీకి చెందిన ముఠా మోసానికి పాల్పడినట్టు తెలిపారు. రోజుకు వేయ్యి నుంచి రెండువేల మందిని ఈ ముఠా మోసగిస్తోంది. తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి పార్సిళ్లు పంపేందుకు కంపెనీ యజమాని పోస్టల్ కోడ్ తీసుకున్నట్టు సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.