గిఫ్ట్ పేరిట బురిడీ | Onlince Fraud in Visakhapatnam | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌ పేరిట బురిడీ

Published Thu, Dec 27 2018 1:06 PM | Last Updated on Thu, Dec 27 2018 1:06 PM

Onlince Fraud in Visakhapatnam - Sakshi

దిల్లీ నుంచి వచ్చినట్టు ఉన్న ఫ్రమ్‌ అడ్రస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లో వచ్చిన బూట్లు చూపుతున్న నాగరాజు

విశాఖపట్నం, చీడికాడ(మాడుగుల): మా కంపెనీ డ్రా తీస్తే మీ ఫోన్‌ నంబర్‌కు మూడు గిఫ్ట్‌లు లభించాయి.పోస్టల్‌ ద్వారా పంపిస్తాం పైకం చెల్లించి తీసుకోవాలన్న ఫోన్‌ కాల్‌ను నమ్మి  ఓ యువకుడు మోసపోయాడు. మండలంలోని అడవుల అగ్రహారానికి చెందిన బాధితుడు నమ్మి నాగరాజు అందించిన వివరాలిలా ఉన్నాయి.

నెల రోజుల క్రితం నాగరాజు ఫోన్‌కు.. 8059355031  అనే నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మేం బెంగళూరు నుంచి ఫోన్‌ చేస్తున్నామని మీ ఫోన్‌ నంబర్‌కు లక్కీ డ్రాలో రూ.18,500 వేల విలువ గల శ్యామ్‌సంగ్‌ జె7 ఫోను,సొనాటా రిస్టు వాచ్,బూట్లు గిఫ్ట్‌ గెలుచుకున్నారని వీటికి మీరు కేవలం రూ.4,500 వేలు చెల్లిస్తే సరిపోతుందని,గిఫ్ట్‌ నేరుగా మీ ఊరు పోస్టు ఆఫీసుకు పంపిస్తున్నామని తెలిపారు.  మొదట్లో నమ్మకపోవడంతో రెండుమూడు రోజులకు ఒక మారు మీ గిఫ్ట్‌ పంపిస్తున్నాం రిసీవ్‌ చేసుకోండి అంటూ చెప్పేవారు. గురువారం ఉదయం తమ గ్రామపోస్టుమాన్‌ వచ్చి తనకు గిఫ్ట్‌ వచ్చిందని చెప్పడంతో పార్శిల్‌ చూసి లోపల గిఫ్ట్‌లు ఉన్నాయనుకుని డబ్బులు చెల్లించి ప్యాకెట్‌ తెరిచి చూడగా రూ.300 విలువగల నాసిరకం బూట్లు ఉన్నాయని వెంటనే అదే నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్వీచ్‌ఆఫ్‌ వస్తోందని నాగరాజు చెప్పాడు.   తనను మోసం చేశారని,  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని  నాగరాజు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement