
కూరగాయలు తరిగే సెట్‌ను చూపిస్తున్న రామకృష్ణ
విశాఖపట్నం, అనంతగిరి(అరకులోయ): లక్కీడ్రా పేరుతో ఫోన్ ఇసా ్తమని తెలపడం తో రూ.3,500 చెల్లించి మండలంలోని కాశీ పట్నం పంచాయతీ మండపర్తి గ్రామానికి చెందిన పాడి రామకృష్ణ అనే గిరిజన యువకుడు మోసపోయాడు. వివరాలు ఇలా గత బుధవారం అతనికి కాల్ వచ్చింది.
మీ మొబైల్ నంబరుకు బ్లూటూత్, శాంసంగ్ ఫోన్ లక్కీడ్రాలో వచ్చాయని అవతలవ్యక్తి చెప్పారు. మీవివరాలు తెలి పితే పోస్టు ద్వారా వాటిని పంపింస్తామని, అయితే రూ 3,500 చెల్లించాలని తెలిపారు. మళ్లీ వారం రోజుల తరువాత పోస్టల్ కార్యాలయానికి వెళ్లి తీసుకోమని ఫోన్ వచ్చింది. దీంతో రామకృష్ణ పోస్టల్ కార్యాలయానికి వెళ్లి రూ.3,500 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. బాక్స్ విప్పి చూడగా అందులో కూరగాయలు తరిగే సెట్ ఉంది. దీంతో తాను మోసపోయానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment