హిందూపురం అర్బన్: ఆన్‌లైన్‌లో కెమెరాబుక్ చేస్తే దానికి బదులు రెండు రాళ్లు వచ్చాయి. పార్సిల్ విప్పిన వినియోగదారుడు అవాక్కయ్యాడు. హిందూపురం చిన్నమార్కెట్‌వద్ద నివాసముంటున్న నూనె వ్యాపారి మంజునాథ్ కుమారుడు హర్షిత్ సప్తగిరి కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు లభించే వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. రిపబ్లిక్‌డే సందర్భంగా తక్కువ ధరకు కెనాన్ 3000డీ కెమెరా కనిపించింది. మూడు రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ కింద కెమెరాను బుక్‌చేశాడు. శుక్రవారం కొరియర్ వ్యక్తి పార్సిల్ చేతికందించాడు. రూ.21 వేలు ఇచ్చి పార్సిల్ అతని ముందే తెరిచి చూపించమన్నాడు. కవర్ తీసి చూడగా అందులో రెండు రాళ్లు బయటపడ్డాయి. దీన్ని చూచి అక్కడివారు నిర్ఘాంతపోయారు. దానిని వీడియో తీçస్తుండటంతో పార్సిల్ తెచ్చిన వ్యక్తి డబ్బు వెనక్కు ఇచ్చి పార్సిల్ వెనక్కు పట్టుకుపోయినట్లు బాధితుడు హర్షిత్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment