E commerce websites
-
Cyber Crime: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు
ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్లైన్ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో సైబర్ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడడం కొత్త కాదు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. బనశంకరి: డబ్బు వ్యవహారాలు ఆన్లైన్ అయ్యేకొద్దీ ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2021– 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. సర్వేలో మొదటి ప్రశ్నగా గత మూడేళ్లలో మీరు, లేదా మీ బంధువులు, పరిచయస్తులు నగదు వంచనకు గురయ్యారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు 11,065 మంది స్పందించగా, అందులో 38 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒకరు మోసపోయారని తెలిపారు. 54 శాతం జాగ్రత్త పడ్డామని పేర్కొన్నారు. కొంత మందికే తిరిగి దక్కింది ఎవరికైనా డబ్బు తిరిగి వచ్చిందా అని అడగ్గా, 10,995 మంది స్పందించారు, వీరిలో 10 శాతం మంది అవును, ఫిర్యాదు చేసి డబ్బు వెనక్కి తీసుకున్నాం అని తెలిపారు. 19 శాతం మంది ఏ ఫలితమూ లేదని బాధ వెళ్లగక్కారు. ఇంకా 19 శాతం మంది ఫిర్యాదు చేశామని చెప్పగా, మిగిలిన 9 శాతం మంది పోయిన డబ్బు గురించి ఆలోచించడం లేదని చెప్పారు. మొత్తం 74 శాతం మంది బాధితులకు వారి డబ్బు తిరిగి రాలేదు. కంప్యూటర్, మొబైల్లో పాస్వర్డ్స్ 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పాస్వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్లో దాచుకున్నారు. 11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు. ఇ కామర్స్ ద్వారా అధిక మోసాలు ఇక ఎలా వంచన జరిగింది అన్న ప్రశ్నకు 9,936 మంది స్పందించగా 29 శాతం మంది బ్యాంక్ అకౌంట్ ద్వారా మోసానికి గురైనట్లు తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్, వెబ్సైట్లలో కొనుగోళ్లు (ఇ–కామర్స్) వల్ల 24 శాతం మంది వంచనకు గురయ్యారు. ఇదే అత్యధికం. 18 శాతం మంది క్రెడిట్ కార్డులతో మోసపోయారు. 12 శాతం మందిని మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు లూటీ చేశాయి. 8 శాతం మంది డెబిట్ కార్డులు, 6 శాతం మంది బీమా పేర్లతో నష్టపోయారు. సైబర్ వంచనకు గురైనవారు తక్షణం పోలీస్ సహాయవాణి 112 నంబరుకు ఫోన్ చేస్తే పోయిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. -
థర్డ్‌వేవ్ ముంగిట!.. ఊపందుకున్న ఈ-కామర్స్
లక్ష కొత్త కేసుల నమోదుతో భారత్ కరోనా మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్న సంకేతాలు మొదలయ్యాయి. భారీగా పెరిగిపోతున్న కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ భయాందోళనలు, టైం పరిమితుల నడుమ ఫిజికల్ స్టోర్ల ముందు క్యూ కట్టే జనం తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యావసరాల అమ్మకాలు గత వారం రోజులుగా జోరుగా నడుస్తున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే ఒమిక్రాన్ ఫియర్‌తో పాటు ప్రభుత్వ ఆంక్షలు, వారాంతపు కర్ఫ్యూ-లాక్డౌన్ల నేపథ్యంలో ప్రజలు షాపుల ముందు క్యూ కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, సబ్బుల ఇతరత్రాల అమ్మకాలు ఆన్లైన్ ఆర్డర్ల రూపంలో పెరిగిపోతున్నాయి. మరోసారి ప్రభుత్వాల ఆంక్షలతో ఫిజికల్ ఎకానమీ యాక్టివిటీకి అవాంతరం ఎదురుకాగా.. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ ఈ-కామర్స్ ఛానెల్స్ ముందుకు వచ్చాయి. అమెజాన్ ఇండియాతో పాటు బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లలో డిమాండ్ ఇప్పటికే మొదలైంది. కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే ఆస్కారం ఉందన్న అనుమానంతో నిల్వలకు సిద్ధపడుతున్నారు మరికొందరు. గత వారంలోనే 10 నుంచి 15 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఆయా ప్లాట్‌ఫామ్స్ ప్రకటించుకున్నాయి. ఇక ఈ వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఎక్కువగా డిమాండ్ ఉంటున్న ఉత్పత్తులు చాక్లెట్, శీతల పానీయాలకు సంబంధించినవి కావడం విశేషం. హైజీన్ ఉత్పత్తులు కూడా రెండో వేవ్ ఉధృతి తగ్గాక ఊసే లేకుండా పోయిన హైజీన్ ఉత్పత్తులకు మళ్లీ టైం మొదలైంది. శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, క్లీనింగ్ లిక్విడ్స్, డిస్ఇన్ఫెక్టెడ్ సొల్యూషన్స్, ఎన్95 మాస్కులు, ఇతర మాస్కులకు డిమాండ్ మొదలైంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తోనే ఈ ఊపు వస్తోందని తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. మెట్రో సిటీ, సిటీ, టౌన్లలో ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నివేదికను ఈ-కామర్స్ పోర్టల్స్ వెల్లడించాయని గమనించగలరు. -
పాతికేళ్ల ఫ్యాషన్ డిజైనర్ కేరాఫ్ బంజారా మార్కెట్
Artisans Of Banjara: పల్లె పట్నం, పండితుడు పామరుడు ఇలా ఎటువంటి తేడాలు లేకుండా అందర్నీ కలిపేస్తోంది ఇంటర్నెట్. ముఖ్యంగా ఎంతో మంది కళాకారులకు సోషల్ మీడియా ద్వారానే గుర్తింపు వచ్చింది. అనేక స్టార్టప్‌లు కూడా కేవలం సోషల్ మీడియా ఆధారంగానే పురుడుపోసుకున్నాయి. ఆ కోవకే చెందిన మరో స్టార్టప్ ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా. 25 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ విద్యార్థి యాక్సిడెంటల్‌గా స్థాపించిన ఈ స్టార్టప్ ఇప్పుడు వందల మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. న్యూఢిల్లీకి చెందిన సృష్టి తేహ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఏకో ట్రావెలర్‌గా నిత్యం ప్రయాణాలు చేయడం తన హాబీ. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా లాక్డౌన్ విధించడంతో పనులన్నీ పక్కన పెట్టి ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. మొదటిసారి లాక్డౌన్ నిబంధనలు ఎత్తి వేసిన తర్వాత ఇంట్లోకి అద్దం కొనేందుకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గురుగ్రామ్ సెక్టార్ 56లో ఉన్న బంజారా మార్కెట్‌కి వెళ్లింది. ఎప్పుటి నుంచో ఢిల్లీలో ఉంటున్నా మొదటిసారి అక్కడికి వెళ్లింది. బోణి చేయండమ్మ బంజారా మార్కెట్లో అద్దం కోసం సృష్టి తిరుగుతుంటే ఓ మహిళ చంకలో చంటి బిడ్డతో వచ్చి ‘బోణి చేయండమ్మా.. బిడ్ద ఆకలికి ఏడుస్తోంది’ అంటూ తన చేతిలో ఉన్న టీ కప్పులు కొనమంటూ ప్రాధేయపడింది. టీ కప్పులు కొంటుండగానే మళ్లీ ఆ మహిళే మాట్లాడుతూ ‘లాక్డౌన్ కారణంగా మా వ్యాపారం మొత్తం ఆగిపోయింది. ఎవ్వరూ మార్కెట్‌కి రావడం లేదు. పెద్ద వాళ్లమంతా రోజుల తరబడి పస్తులే ఉంటున్నాం. పిల్లలకు తిండి పెట్టడం కూడా కష్టంగా మారింది’ అంటూ తన పరిస్థితి వివరించింది. ముచ్చట గొలిపే వస్తువులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన సంచార జాతుల వారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన మార్కెట్ అది. కాలక్రమేనా బంజారా మార్కెట్‌గా పేరు పడిపోయింది. హస్త కళలతో వారు రూపొందించిన మట్టి పాత్రలు మొదలు టీకప్స్, రగ్గులు, దుప్పట్లు ఒక్కటేమిటి ఇంటి అలంకరణకు సంబంధించిన సమస్త వస్తువులు అక్కడ లభిస్తాయి. అయితే వాటిని అమ్ముకోలేక తిండికి సైతం తిప్పలు పడుతుండటం చూసి సృష్టి చలించిపోయింది. అదే సమయంలో అక్కడి వస్తువుల్లోని కళాత్మక ఆమెను కట్టి పడేసింది. ఆ వస్తువులకు సరైన మార్కెటింగ్ చేస్తే.. సీన్ వేరేలా ఉంటుందని ఆమెని ఫ్యాషన్ డిజైనర్ ఇట్టే పసిగట్టింది. ఇన్‌స్టా స్టోరీతో మరోసారి బంజార్ మార్కెట్‌కి వెళ్లిన సృష్టి.. అక్కడ తనకు నచ్చిన వస్తువుల ఫోటోలు తీసుకుంది. వాటిని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టా ఫాలోవర్సు బాగున్నాయంటూ స్పందించారు. ఈసారి గ్రాఫిక్స్ సాయంతో వాటిని చక్కగా డిజైన్ చేసి ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది... ఫర్ సేల్ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు అమ్ముతారో చెబితే కొంటామనే వారు ఎక్కువయ్యారు. దీంతో మొదటి సారి టైం డేట్ చెబుతూ ఫ్లాష్ సేల్ ప్రకటించింది. అయితే అప్పటికే ఆమె చేతిలో ఒక్క వస్తువు కూడా లేదు. రూ. 2000లతో మొదలు ఫ్లాష్ సేల్ ఇలా ప్రారంభమైందో లేదో కేవలం పది నిమిషాల్లో 791 వస్తువులకు ఆర్డర్లు వచ్చాయి. ఇందులో ఢిల్లీ నుంచే కాదు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వెంటనే తల్లి దగ్గర నుంచి రూ. 2000 తీసుకుని వాటితో ప్యాకింగ్ వస్తువులు కొనుగోలు చేసింది. ఆర్డర్లకు తగ్గట్టుగా వాటిని ప్యాక్ చేసి పంపింది. ఈ పని పూర్తి కాకముందే రెండో ఫ్లాష్ సేల్ ఎప్పుడంటూ ఎంక్వైరీ మొదలైంది. ఓపికగా ఫస్ట్ ఫ్లాష్ సేల్‌కి సంబంధించి కోరియర్ చేసిన వస్తువుల్లో సగానికి సగం డ్యామేజ్ అయి కస్టమర్లకు చేరుకున్నాయి. మరికొన్ని చెప్పిన సమయం కంటే ఆలస్యంగా గమ్యస్థానం చేరాయి. ఓ వైపు కస్టమర్ల నుంచి ఒత్తిడి మరోవైపు కొంతైన డబ్బులు ఇస్తూ ఇంటిల్లిపాదికి భోజనం దొరుకుతుందన్నట్టుగా చూస్తున్న బంజారాలు. ఓపికగా కష్టమర్లకు తిరిగి వస్తువులు పంపిస్తూ వారి మన్ననలు పొందింది. అలా తొలి వారమే రూ. 75,000 వస్తువులు అమ్ముడయ్యాయి. వస్తువుల క్వాలిటీ గురించి ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ప్రొఫెషనల్‌గా ఇన్‌స్టాలో సేల్స్‌కి ఆదరణ ఉండటం కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ బాగుండటంతో ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా పేరుతో ప్రత్యేకంగా ఈ కామర్స్ పోర్టల్‌ని ప్రారంభించారు. బంజారాలు తయారు చేస్తున్న వందల రకాల వస్తువులను ఈ పోర్టల్‌లో అమ్మకానికి పెట్టారు. ఏడాది కాలంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కామర్స్ పోర్టల్ రన్ అవుతోంది. దీంతో ఇటీవల ఆర్టిసన్స్ ఆఫ్ అస్సామ్ని సైతం అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. బతుకులు మారాయి బంజారా మార్కెట్లో ఉన్నప్పుడు రోజంతా కష్టం చేస్తే రూ.500లు వచ్చేవి. వాటితో మా ఇంట్లో ఐదుగురం కడుపు నిండా అన్నం తినేవాళ్లం. కానీ లాక్డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వ్యాపారం ఆగిపోయింది. తిండి కోసం దాతల ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ బాధలు లేవని, తమ కళకు తగ్గ గుర్తింపుతో పాటు ఆదాయం కూడా వస్తోందని బంజారాలు అంటున్నారు. ఇప్పుడిదే ఆధారం ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన బంజారా మార్కెట్‌ను ఇటీవల హర్యాణా అధికారులు జేసీబీలతో తొలగించారు. దీంతో అనేక మంది బతుకులు రోడ్డున పడ్డాయి. తమకు న్యాయం చేయండంటూ వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వారికి సర్కాను నుంచి అండ ఎప్పుడు లభిస్తోందో తెలియదు. కానీ వారి కళకు గుర్తింపు ఇస్తూ ఆపద సమయంలో అండగా ఉంటూ..ఆ కళాకారుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్తితి రాకుండా కాపాడుతోంది ఆర్టిసన్స్ ఆఫ్ బంజారా. - సాక్షి, వెబ్ప్రత్యేకం -
ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ఉత్పత్తి తయారైన దేశం గురించిన వివరాలను సరిగ్గా పేర్కొనకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ–కామర్స్ కంపెనీలకు గడిచిన ఏడాది కాలంలో 202 నోటీసులు పంపినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. నిర్లక్ష్యం ఇక్కడే ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఉపకరణలు, దుస్తులు మొదలైన ఉత్పత్తుల విషయంలో ఇలాంటి ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన విషయంలో మొత్తం 217 నోటీసులు జారీ కాగా వీటిలో 15 నోటీసులు.. ఎక్స్పైరీ తేదీ, తయారీదారు .. దిగుమతిదారు చిరునామాలను సరిగ్గా పేర్కొనకపోవడం వంటి అంశాలకు సంబంధించినవి. మిగతా నోటీసులు.. ఆయా ఉత్పత్తులు ఏ దేశం నుంచి వచ్చినవో ఈ–కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాంలలో సరిగ్గా చూపకపోవడం వల్ల జారీ చేసినవి. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు జారీ చేసినది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. భారీ జరిమానా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో కంపెనీలు చట్టబద్ధంగా నడుచుకోవాలని, వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ తెలిపారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 76 కంపెనీల నుంచి రూ. 42,85,400 జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఈ దాఖిల్ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) ద్వారా వచ్చిన పలు ఫిర్యాదులను గడిచిన కొన్ని నెలల్లో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ–దాఖిల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని లీనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఒక వినియోగదారుడు రూ. 127.46 మొత్తానికి సంబంధించి ఒక రెస్టారెంటుపై ఇదే విధంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...! -
స్మాల్-ఎల్-ఎక్స్ఎల్.. కొలిక్కి రానున్న మన ‘సైజు’లు
Indian Body Measurements Survey: స్మాల్, మీడియం, ఎల్, ఎక్స్ఎల్.. ఇలా దుస్తులు, చెప్పులు, షూస్ విషయంలో కొలమానాలు ఉంటాయి. అయితే అవి యూకే, యూఎస్, మెక్సికన్ అంటూ విదేశీ కొలతలు ఉండడం తెలుసుకదా!. ఆన్లైన్లో ఈ కొలతలతో పాటుగా సెంటీమీటర్ కొలతలు ఉండడం వల్ల కొనుగోలుదారులు ఓ క్లారిటీకి వస్తుంటారు. కానీ, కోట్ల మంది వస్త్ర వ్యాపారులకు మాత్రం కొన్నేళ్లుగా ఈ కొలతలు ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయి. అందుకే ఈ కొలతల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బట్టల దుకాణానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి సైజుల విషయంలో తేడాలు కనిపిస్తుంటాయి. రెగ్యులర్‌గా ‘ఎల్’ సైజ్ ఉపయోగించేవాళ్లకు.. వేరే బ్రాండ్‌లో ‘ఎక్స్ఎల్’ సరిపోతుంటుంది. అది చూసి బ్రాండ్‌ను బట్టి తేడాలుంటాయని చాలామంది పొరపడుతుంటారు. కానీ, విషయం అది కాదు. విదేశీ సైజుల కొలమానం ప్రకారం ఉండడం మూలంగానే అందులో తేడాలు వస్తున్నాయి. ప్రత్యేకించి మన దేశానికి ప్రత్యేకించి క్లోతింగ్ మెజర్మెంట్(కొలతల కొలమానం) అంటూ ఒకటి లేకుండా పోయింది. అందుకే ఇంకా యూకే, యూఎస్ అంటూ వస్త్ర, శాండల్స్ తయారీ పరిశ్రమలు విదేశీ కొలతలపైనే ఆధారపడుతున్నాయి. అందదా కొలతలతోనే దుస్తులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీనికి చెక్ పెట్టేందుకు మొదలైందే ‘ఇండియాసైజ్’ సర్వే. సర్వే ఉద్దేశం ‘INDIAsize’.. కేంద్ర వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) సహకారంతో ఈ సర్వేను మొదలుపెట్టింది. కొత్త ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, షిల్లాంగ్.. ఇలా ప్రధాన నగరాలను ఆరు జోన్లుగా విభజించి సర్వేను చేస్తున్నారు. సుమారు పాతిక వేలమంది కొలతలను తీసుకుని దుస్తుల కోసం ఒక కొలతల చార్ట్‌ను రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టారు. 15 నుంచి 65 ఏళ్ల వయసు వాళ్ల బాడీ కొలతల ఆధారంగా ఈ సర్వేను కొనసాగించనున్నారు. క్లోతింగ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో 2019లో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టు.. కరోనా వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు గత గురువారం ఢిల్లీలో ఇండియాసైజ్ సర్వే మొదలైంది. తొలి రౌండ్లో 5,700 మంది పాల్గొననున్నారు. 2022 చివరికల్లా సర్వేను ముగించి.. మన సైజులపై ఓ కొలిక్కి రానున్నారు. ఏం ఉపయోగమంటే.. దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులున్న రెండో పరిశ్రమ.. వస్త్ర పరిశ్రమ. ఏటా 140 బిలియన్ల రూపాయలు ఆదాయం వస్తే.. అందులో 100 బిలియన్ల రూపాయలు లోకల్ కన్జూమర్ల నుంచే వస్తోంది. కొలతల గందరగోళం నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ఆఫ్‌లైన్ షాపింగ్‌లో ఈ కొలతలు కీలకంగా వ్యవహరించనున్నాయి. రిటర్న్ పాలసీలో భాగంగా స్టాఫ్కానీ, కస్టమర్కానీ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. తయారీదారులకు సైతం ఈ సర్వే ఉపయోగపడనుంది. సేల్స్ పెంచుకోవడానికి, రిటర్న్ గూడ్స్ లాంటి సమస్యలను అధిగమించడానికి తయారీదారులకు సాయపడనుంది. ఎలా చేస్తారంటే.. ఆంత్రోపోమెట్రిక్ డేటా(శరీరాకృతి కొలతల) ఆధారంగా ఈ సర్వే కొనసాగనుంది. 100 డేటా పాయింట్స్ ఆధారంగా కొలతల్ని నిర్ధారిస్తారు. ఎంపిక చేసినవాళ్లపై ‘హ్యూమన్ సేఫ్ 3డీ వోల్ బాడీ స్కానర్’ టెక్నాలజీ ఉపయోగించి కొలతలను సేకరిస్తామని నిఫ్ట్ డైరెక్టర్ జనరల్ శాంతమను వెల్లడించారు. ఒక్కో వ్యక్తిని స్కాన్ చేయడానికి 15 నిమిషాల టైం పడుతుంది. తద్వారా టైలర్, ఎక్స్‌పర్ట్‌ల అవసరం లేకుండానే సర్వే వేగంగా పూర్తి కానుంది. ఈలోపు చెప్పులు, షూలకు సంబంధించిన సర్వే ప్రక్రియను మొదలుపెడతామని ఆయన తెలిపారు. గార్మెంట్స్ పరిశ్రమల చరిత్రలో ఫస్ట్ రికార్డెడ్ ఇన్‌స్టాన్స్ సైజింగ్ సర్వే.. 1921లో అది కేవలం పురుషుల కోసమే జరిగింది. అయితే అంత్రోపోమెట్రిక్(మనిషి బాడీ కొలతల ప్రకారం) మాత్రం 1939 నుంచి మొదలైంది. ఆ టైంలో పదిహేను వేలమంది అమెరికన్ మహిళల కొలతల ఆధారంగా దుస్తుల్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని దేశాలు ప్రత్యేకంగా తమ దేశ ప్రజల శరీరాకృతి కొలతల ఆధారంగా దుస్తులు, చెప్పులు రూపొందిస్తూ వస్తున్నాయి. చదవండి: ఆడవాళ్లు.. ఈ యాప్‌తో జాగ్రత్త! -
రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు..
శ్రీకాళహస్తిలో ఆన్లైన్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ–కామర్స్ వెబ్‌సైట్స్ పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. స్క్రాచ్ కార్డ్‌లను పంపించి వంచిస్తున్నారు.. అకౌంట్ నగదు జమచేశామని నకిలీ రశీదులతో వలేస్తున్నారు.. నమ్మినవారి సొమ్ము కాజేస్తున్నారు. నమ్మకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అంటూ చాలామంది బాధితులు తలపట్టుకుంటున్నారు. కొందరు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుజాత అనే మహిళకు స్నాప్‌డీల్ పేరుతో పోస్టులో ఇటీవల ఓ లేఖ, స్క్రాచ్ కార్డ్ వచ్చింది. కార్డ్‌ను రఫ్ చేస్తే అందులో ఉంటే నగదును మీ ఖాతాలో జమచేస్తామని ఉంది. దీంతో ఆమె స్క్రాచ్ కార్డును రఫ్ చేయగా అందులో రూ.6లక్షల అంకె వచ్చింది. కొంతసేపటి తర్వాత సుజాతకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. జీఎస్టీ కింద రూ.7వేలు ఆన్లైన్లో చెల్లిస్తే మీకు రూ.6లక్షలు పంపిస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని సుజాత తమ వారికి తెలియజేయగా వారు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. మళ్లీ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ ఖాతాలో రూ.6లక్షలు వేశామని, కావాలంటే చూసుకోమంటూ బ్యాంకు ఓచరు, ఫోన్ పే ద్వారా నగదు జమ చేసినట్లు ఓ మెసేజీని పంపించాడు. సుజాత స్పందించకపోవడంతో ఫోన్లో తిట్లు లంకించుకున్నాడు. దీనిపై బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పట్టణంలోని భాస్కరపేటకు చెందిన దొర అనే వ్యక్తికి సైతం ఫ్లిప్‌కార్ట్ పేరుతో ఇలాంటి మెసేజీనే వచ్చింది. ఫోన్ పే ద్వారా రూ.7వేలు చెల్లిస్తే రూ.6లక్షలు జమచేస్తామని అందులో ఉంది. తర్వాత దొర ఖాతాలో నగదు వేశామని ఫేక్ మెసేజీలను పంపించారు. అయితే దొర స్పందించకపోవడంతో అసభ్య పదజాలంతో తిట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా +917430572125, +9184264 89012, +919056098755 హెల్ప్‌లైన్ నంబర్ పేరుతో శ్రీకాళహస్తి వాసులకు తరచుగా ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి. వీటిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆన్లైన్ మోసగాళ్ల ముఠా ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు కోరుతున్నారు. చదవండి: హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు కృష్ణా జిల్లా మంటాడలో దారుణం.. -
అమ్మకానికి సద్దాం హుస్సేన్ ఫోటో
వాషింగ్టన్: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఇరాకీ నేత ఫోటోను ఓ అమెరికన్ ఈ కామర్స్ సైట్ అమ్మకానికి పెట్టింది. పైగా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. వివరాలు.. అమెరికాకు చెందిన ఈ కామర్స్ సైట్ ‘విష్’లో సద్దాం ఫోటోను అమ్మకానికి ఉంచింది. ధరను 20 డాలర్లుగా నిర్ణయించింది. పైగా డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. ‘అన్ని ప్రొడక్ట్స్‌పై 60-80శాతం డిస్కౌంట్ లభించనుంది’ అంటూ విష్ ప్రమోట్ చేసిన యాడ్‌లో సద్దాం హుస్సేన్ ఫోటో కూడా ఉంది. దానిపై రేటు 20 డాలర్లుగా నిర్ణయించబడింది. ఇది చూసిన నెటిజనులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘సద్దాం హుస్సేన్‌ను ఎవరు కొనాలనుకుంటున్నారు.. అది కూడా కేవలం 20 డాలర్లకే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది సద్దాం ఫోటో కాపీ. అమెరికా సేనలకు పట్టుబడిన తర్వాత తీసిన సద్దాం ఫోటోను ప్రీమియం హెవీ స్టాక్ పేపర్లో రీప్రింట్ చేశారు. పైగా ‘దీన్ని ఉరి తీయవచ్చు లేదా ప్రేమ్ కట్టించుకోవచ్చు’ అంటూ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోది. Who wants to buy Saddam Hussein for $20? pic.twitter.com/4tTpgSRKLj — The State Of Selling (@StateOfSelling) August 27, 2020 1979 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడిన సంగతి తెలిసిందే. -
4 వేల కోసం ప్రయత్నిస్తే 74 వేలు గాయబ్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ ఈ–కామర్స్ యాప్‌లో రూ.4 వేలు వెచ్చింది ఇయర్ ఫోన్స్ ఖరీదు చేశారో యువతి... అది ఎంతకీ డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు... అందులో కనిపించిన నకిలీ కాల్ సెంటర్ నెంబర్ అసలుదిగా భావించి సంప్రదించారు... సైబర్ నేరగాళ్ళు చెప్పినవి చెప్పినట్లుగా చేసి రూ.74 వేలు పోగొట్టుకున్నారు. ఈమెతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతిలో మరో రూ.1.5 లక్షలు కోల్పోయిన ముగ్గురు బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైౖమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతి ఈ–జీ ఫోన్స్ అనే సంస్థకు చెందిన వెబ్సైట్ ద్వారా ఇయర్ ఫోన్లు ఆర్డర్ చేశారు. (పోస్టు చేయడమే పాపమైంది...) వాటి ఖరీదు రూ.4000 ముందే ఆన్లైన్ ద్వారా చెల్లించేశారు. ఆ సందర్భంగా వెబ్సైట్ వాటి డెలివరీ డేట్‌ను సూచించింది. ఆ నిర్ణీత గడువు ముగిసినా కొరియర్ ద్వారా సదరు ఇయర్‌ఫోన్స్ డెలివరీ కాలేదు. దీంతో ఈ–జీ ఫోన్స్ సంస్థను సంప్రదించాలని భావించిన ఆమె దాని ఫోన్ నెంబర్ కోసం సదరు వెబ్సైట్లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ సంస్థ కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో ఈ–జీ ఫోన్ కాల్‌సెంటర్ పేరుతో కనిపించిన సెల్ ఫోన్ నెంబర్ నిజమైనదిగా భావించారు. ఆ నెంబర్లో సంప్రదించిన యువతి జరిగిన విషయం చెప్పారు. దీంతో అవతలి వ్యక్తులు ఆ ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం రిటర్న్ చేస్తామని అన్నారు. దానికోసం తాము మీ ఫోన్ నెంబర్‌కు పంపే లింకు ఓపెన్ చేయాలని సూచించి టీమ్ వ్యూవర్ యాప్ ఇన్‌స్టల్ చేయించారు. దీన్ని తమ ఫోన్ ద్వారా యాక్సస్ చేసిన సైబర్ నేరగాళ్ళు బాధితురాలి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని ద్వారా ఆమె ఈ వ్యాలెట్ వినియోగించిన సైబర్ నేరగాళ్ళు రూ.74 వేలు కాజేశారు. ♦ అంబర్‌పేటకు చెందిన ఓ యువకుడికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్ళు తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుతో రుణం ఇస్తామని ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నారు. ఇది నిజమని నమ్మిన యువకుడు అందులో పేర్కొన్న నెంబర్లలో సంప్రదించారు. సైబర్ నేరగాళ్ళు చెప్పిన వాటికి అంగీకరించడంతో వివిధ ఫీజుల పేరుతో రూ.30 వేలు తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. ♦ ఈ–యాడ్స్ సైట్ ఓఎల్ఎక్స్లో ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ విక్రయం ప్రకటనకు నగర యువకుడు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లో సంప్రదించగా ఆర్మీ అధికారిలా సైబర్ నేరగాళ్ళు మాట్లాడారు. బేరసారాల తర్వాత ఫ్రిడ్జ్‌కు రేటు ఖరారైంది. అడ్వాన్సులు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు, చెల్లించిన అధిక మొత్తం రిఫండ్ పేరుతో రూ.82 వేలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్న మోసగాళ్ళు ఆపై ఫోన్ చేసినా స్పందించకుండా నిండా ముంచారు. ♦ వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆన్లైన్లో ఉన్న ప్రకటనపై స్పందించారు. అవతలి సైబర్ నేరగాళ్ళు వివిధ ఫీజుల పేరుతో రూ.38,500 కాజేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రై మ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఈ– కామర్స్ బాటలో గ్రేటర్ వాసులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో కోవిడ్ విసిరిన పంజాతో నిత్యావసరాలు సహా అన్ని రకాల గృహ వినియోగ వస్తువుల కొనుగోలుకు సిటీజన్లు ఈ– కామర్స్ బాట పట్టారు. గత మూడు నెలలుగా ఈ వ్యాపారం మూడు నిత్యావసరాలు.. ఆరు అత్యావసరాలు అన్న చందంగా ఈ– సైట్ల వ్యాపారం జోరందుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు నెలలుగా ఈ కామర్స్ సంస్థల అమ్మకాలు సుమారు 43 శాతం మేర పెరిగినట్లు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైటు షాపిఫై సంస్థ తాజా సర్వేలో తేలింది. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా.. ఉప్పు.. పప్పు.. సబ్బు బిల్లా.. అగ్గిపుల్లా తేడా లేకుండా అన్నింటి కొనుగోలుకు గ్రేటర్ సిటీజన్లు ఆన్లైన్ బాట పట్టడం విశేషం. కొనుగోళ్లన్నీ .. కోవిడ్ నేర్పిన పాఠాల నేపథ్యంలో ఇటు వినియోగదారులు అటు చిన్న వ్యాపారులు సైతం ఆన్లైన్ బాట పట్టారు. వినియోగదారులు తమ ఇంటి నుంచి తమకు నచ్చిన.. మనసుకు మెచ్చిన వస్త్రాలు, బొమ్మలు, వజ్రాభరణాలు తదితరాలను ఒక్క క్లిక్‌తో ఆర్డర్ చేయడం.. ఆర్డర్లను స్వీకరించిన చిన్న దుకాణాల వారు సైతం నిమిషాల్లో కస్టమర్ల ఇంటికి డోర్ డెలివరీ చేయడం ఇట్టే జరిగిపోతోంది. ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ షాపిఫై సంస్థ వినియోగదారుల అభిరుచిపై చేసిన తాజా సర్వే వివరాలను వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలీబాబా తదితర సంస్థలు కొన్నేళ్లుగా వినియోగదారులు కోరిన పలు నిత్యావసరాలు, రోజువారీగా ఉపయోగించే వస్తువులను వినియోగదారులు ఆర్డరు చేసిన గంటలు.. రోజుల్లోనే డెలివరీ చేస్తుండగా.. ఇప్పుడు మన వీధి చివర్లో ఉండే చిన్న వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ దుకాణాలు, చిన్నారులు ఆడుకునే వస్తువులు విక్రయించే స్టోర్లు సైతం ఆన్లైన్ మార్కెటింగ్ నిర్వహించే ఈ– కామర్స్ సైట్లతో చేతులు కలపక తప్పని పరిస్థితి నెలకొంది. భౌతిక దూరం.. కష్టతరం.. కోవిడ్ కలకలం, మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంతో పాటు వినియోగదారులు ఒక్కసారిగా ఆయా దుకాణాలకు తరలి వెళ్తే భౌతిక దూరం పాటించడం కష్టతరం. దీంతో తమ రూటు మార్చుకున్నట్లు షాపీఫై సంస్థ తెలిపింది. ఇప్పటికే భాగ్యనగరంతోపాటు దేశవ్యాప్తంగా సుమారు 20కిపైగా ఈ– కామర్స్ సైట్లు తమ వ్యాపారాలను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు మన వీధి చివర్లో ఉండే దుకాణాలు, ప్రముఖ ప్రాంతాలు,కూడళ్లలో ఉండే దుకాణాల వారు సైతం ఇదే బాట పట్టాల్సి రావడం విశేషం. మరోవైపు గుండు పిన్ను దగ్గరి నుంచి రోజువారీగా కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, పాదరక్షలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఒకే చోట విక్రయించే మాల్స్‌కు సైతం జనం తాకిడి.. కోవిడ్ అలజడి పోయే వరకు అంతంతగానే ఉండే అవకాశాలుంటాయని తెలిపింది. చిన్న వ్యాపారాలు సైతం.. గ్రేటర్లో ఇప్పుడు చిన్న దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించే వారు సైతం ఆన్లైన్ బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వస్త్ర దుకాణాలు, బొటిక్స్, వెండి, బంగారు వజ్రాభరణాలు విక్రయించేవారు, గృహవినియోగ వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పాదరక్షలు, వాచీలు, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, వినియోగించే స్టేషనరీ, ఇతర బుక్స్, నిత్యావసరాలు, ఆర్గానిక్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర తినుబండారాలు, బియ్యం, కూరగాయలు ఇలా ఒక్కటేమిటి.. అన్నిరకాల దుకాణాల యజమానులు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ– కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో చేతులు కలపడం లేదా.. సొంతంగా తమ వ్యాపారానికి సంబంధించిన సైట్ క్రియేట్ చేసి తమ వద్ద అందుబాటులో ఉన్న వస్తువులను అందమైన ఫొటోలు తీసి సరసమైన ధరలకు, ఆఫర్లతో ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచక తప్పని పరిస్థితి నెలకొంది. తమ సైటు గురించి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ గ్రూపుల్లో ప్రచారం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొందని షాపీఫై అధ్యయనం వెల్లడించింది. కాగా ప్రధాన ఈ– కామర్స్ సైట్లు బ్రాండెడ్ వస్తువులు, వాటి మార్కెటింగ్, డెలివరీకి భారీగా ఫీజులు వసూలు చేయనున్న నేపథ్యంలో చిన్న వ్యాపారులు సొంతంగా ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకునేందుకు పలు స్టార్టప్ ఈ– కామర్స్ సైట్లతో చేతులు కలిపే అవకాశం ఉందని పేర్కొంది. నయా ట్రెండ్‌కు నాంది.. తాజా ట్రెండ్‌తో గల్లీ దుకాణమైనా.. ఢిల్లీలో ఉండే ప్రముఖ బ్రాండ్ వస్తువులను విక్రయించే సంస్థ అయినా ఆన్లైన్ మార్కెటింగ్ మినహా ఇతర ప్రత్యామ్నాయం లేకపోవడం గమనార్హం. నెటిజన్లుగా మారిన గ్రేటర్ సిటీజన్లు ఒక్క క్లిక్‌తో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్ ఇప్పటికే కొనసాగుతుండగా.. తాజా పరిణామాలతో మరింతగా ఈ– కామర్స్ వ్యాపారం పుంజుకోనుంది. పండగలు, ఇతర ప్రత్యేకమైన రోజుల్లో ఈ ట్రెండ్ మరింత విస్తరించనుందని ఈ అధ్యయనం తెలపడం విశేషం. ఈ ఏడాది చివరి వరకు చిన్న వ్యాపారాల ఆన్లైన్ వ్యాపారం ట్రెండ్ జోరందుకుంటుందని షాపిఫై సంస్థ అంచనా వేసింది. -
ఆన్లైన్లో ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు..
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 20 నుంచి ఈ కామర్స్ కంపెనీల సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్స్, స్టేషనరీ వస్తువులు సహా పలు ఉత్పత్తుల విక్రయానికి అనుమతిస్తామని హోంమంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ఈ కామర్స్ సేవలకు అనుమతిస్తామని బుధవారమే హోం మంత్రిత్వ శాఖ వెల్లడించినా నిత్యావసర వస్తువులు, సేవల వరకే అనుమతిస్తారా అన్ని ఉత్పత్తుల విక్రయానికి అనుమతిస్తారా అనే స్పష్టత ఇవ్వలేదు. ఆహారం, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు వంటి అత్యవసర వస్తువులనే విక్రయించాలని గత నోటిఫికేషన్స్‌లో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక తాజా నిర్ణయంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీల సేవలన్నీ ఏప్రిల్ 21 నుంచి దాదాపు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. చదవండి : కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు -
చదివింది ఇంటర్..మోసాల్లో మాస్టర్స్
గచ్చిబౌలి: కొంపల్లికి చెందిన ఓ మహిళ గత అక్టోబర్ 8న ఆన్లైన్లో రూ.228 చెల్లించి స్నాప్‌డీల్ డాట్ కామ్‌లో స్పైరల్ పొటాటో కట్టర్‌ను కొనుగోలు చేసింది. అదే కంపెనీ పేరును పోలి ఉన్న క్యూపీఎస్ఎన్డీల్ పేరుతో ఆమెకు గత నవంబర్ 11న రూ.6.90 లక్షల నగదు లేదా టాటా నెక్సా కారు గెలిచారని మెసేజ్ వచ్చింది. మెసేజ్లోని టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయడంతో తక్షణమే రూ.6500 చెల్లించాలని సూచించారు. కారు గెలిచానన్న ఆనందంలో ఆమె ఆన్లైన్లో ఆ మొత్తాన్ని చెల్లించింది. అనంతరం ఆమెకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు జీఎస్టీ, ట్రాన్స్పోర్ట్, షోరూమ్, టోల్ గేట్ ఖర్చుల నిమిత్తం మరో రూ.2.30 లక్షలు చెల్లిస్తే టాటా నెక్సా కారు పంపిస్తామని, కారు రంగు కూడా ఎంపిక చేసుకోవచ్చునని నమ్మబలికారు. వెంటనే ఆ మొత్తాన్ని వారు సూచించిన బ్యాంక్ ఖాతాకు టాన్స్‌ఫర్ చేసింది. మరుసటి రోజు తనకు ఫోన్ వచ్చిన నంబర్‌కు కాల్ చేయగా సదరు టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె నివ్వెరపోయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన నవంబర్ 13న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్ ముఠా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో వందలాది మందిని మోసం చేసి దాదాపు రూ. 5 కోట్లు టోకరా వేసినట్లు విచారణలో వెల్లడైంది. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఫొటోతో ఎర.. బీహార్ రాష్ట్రం, షైక్‌పురా జిల్లా, కబీర్పుర గ్రామానికి చెందిన సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్ ఇంటర్‌తో చదువుకు స్వస్తి చెప్పాడు. అతను అదే రాష్ట్రానికి చెందిన బిపిన్ కుమార్, సందీప్ పాశ్వాన్, మాణిక్‌చంద్ పాశ్వాన్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ కామర్స్ కంపెనీల పేరుతో మోసాలకు పాల్పడాలని పథకం పన్నిన వీరు గజియాబాద్‌కు చెందిన తౌసిప్ నుంచి వోడా ఫోన్, ఎయిటెల్ టోల్ ఫ్రీ నంబర్లు తీసుకున్నారు. అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన వికాస్ కుమార్‌తో కలిసి 13 నకిలీ వెబ్ సైట్లను సృష్టించారు. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, హోమ్షాప్–18, షాప్‌క్లూస్, నాప్టాల్, అమెజాన్, క్లబ్ ఫ్యాక్టరీ తదితర ఈ కామర్స్ వినియోగదారుల డాటాను సేకరించారు. అనంతరం వారికి ఆయా కంపెనీల పేరుతో రూ.6.90 లక్షల నగదు లేదా టాటా నెక్సా కారును బంపర్ ప్రైజ్‌గా గెలిచారని బల్క్ మేసేజ్‌లు పంపేవారు. మెసేజ్‌లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నంబర్‌కు ఫోన్ చేస్తే ఆన్లైన్ కొనుగోలు చేసిన వస్తువు పేరు, ఐడీ నంబర్, డేట్ చెబుతూ వారి నమ్మకాన్ని సంపాదిస్తారు. అనంతరం వాట్సాప్‌కు వారి పేరు బంపర్ ప్రైజ్‌ను గెలిచిన టికెట్‌తో పాటు నెక్సా కారు ఫొటోను పంపుతారు. కారు లేదా నగదు కావాలంటే ముందు రూ.6500 చెల్లించాలని కోరుతారు. ఆ తర్వాత ట్యాక్స్‌ల పేరుతో రూ.లక్షలు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తే వెంటనే కారు పంపిస్తామని నమ్మబలుకుతారు. అంతేగాక తాము ఈ కామర్స్ కంపెనీ ఉద్యోగులమని నమ్మించేందుకు తమ నకిలీ ఐడీ, పాన్, ఆధార్ కార్డులను వాట్సాప్‌లో పంపుతారు. నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాగానే టోల్ ప్రీ నంబర్, వాట్సాప్ నంబర్లకు కాల్ రాకుండా ఆయా నంబర్లను రిజక్ట్లో పెడతారు. ఇదే తరహాలో వీరు వందల మందిని మోసగించారని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే వీరి బాధితులు 80 మంది ఉన్నట్లు సీపీ తెలిపారు.నిందితులు సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్, మాణిక్‌చంద్ పాశ్వాన్, తౌసిఫ్ అహ్మద్, వికాస్ కుమార్‌లను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు నిందితులు బిపిన్ కుమార్, సందీప్ పాశ్వాన్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, స్కానర్ కమ్ ప్రింటర్, స్కార్పియో కారు, 19 సిమ్ కార్డులు, నకిలీ పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు ,4 డెబిట్ కార్డులు, 5 స్నాప్ డీల్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టోల్ ఫ్రీ నంబర్లపై విచారణ కేవైసీ డాక్యుమెంట్లు లేకుండా టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడంపై సెల్‌ఫోన్ కంపెనీలను విచారించనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. అంతే కాకుండా ఈ కామర్స్ వినియోగదారుల డాటా చోరీపై సదరు కంపెనీలను ప్రశ్నిస్తామన్నారు. గిఫ్ట్ వచ్చిందనే మెసేజ్‌లను నమ్మ వద్దని, వాటిని వెంటనే డిలీట్ చేయాలని ఆయన సూచించారు. ఈ కామర్స్ కంపెనీలు ఎవరికి గిఫ్ట్‌లు ఇవ్వవని సీపీ పేర్కొన్నారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రామయ్య, చంద్రశేఖర్, ఎస్ఐలు విజయ్ వర్ధన్, రాజేంద్ర, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. చదివింది ఇంటర్..మోసాల్లో మాస్టర్స్ ఈ ముఠా సభ్యులు ఇంటర్‌తో చదువు ఆపేసినా మోసాల్లో మాత్రం ఆరితేరారు. బీహర్‌లోని నలంద, నవాడ, వస్లీగంజ్ జిల్లాల్లోని ములంద్, పంచ్, చాక్వాయ్, డాక్రా, కబీర్పుర్, కటర్దీ, భగవాన్‌పూర్, మాయాపూర్, మీర్బీగా గ్రామాల నుంచి ఈ ముఠా సభ్యులు రోజుకు 50 మంది చొప్పున బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తారు. స్పందించిన వారిని నగదు, కారు పేరుతో బుట్టలో పడేస్తారు. ఆపై ఆన్లైన్లో నగదు డిపాజిట్ చేయించుకుని టోకరా వేస్తారు. నిందితుల స్నేహితుడైన సూరజ్ సింగ్ ఎస్బీఐ అకౌంట్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గుడిసెల్లో నివాసం ఉండే వీరు నేడు భవనాలు నిర్మించుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్నాప్ డీల్ పేరుతో ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్
సాక్షి, హైదరాబాద్: ఈ-కామర్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ క్రైం పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన 4 నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌లోని కబీర్‌పూర్‌కు చెందిన ముఠాలోని నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన సందీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్ల నుంచి డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 5 కోట్ల వరకు మోసాలు చేసినట్లు నిందితుల విచారణలో తెలిందన్నారు. వారి నుంచి 12 సెల్ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 1 స్కానర్ ప్రింటర్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ‘స్నాప్‌డీల్‌లో ఓ మహిళ పొటాటో కటర్ను కొనుగోలు చేసింది. ఆ తరువాత మీరు మొదటి బహుమతి పొందారు అంటూ ఆమెకు ఫోన్ చేశారు. సదరు మహిళకు రూ. 6 లక్షల 90వేలు విలువ చేసే కారును గెలుచుకున్నట్లు నమ్మించి రిజిస్ట్రేషన్ పేరుతో ఆమె నుంచి రూ. 2 లక్షల 30 వేల నగదు ఈ ముఠా వసూలు చేశారు’ అని ఆయన మీడియా ముందు వివరించారు. ఈ ముఠా స్నాప్ డీల్ పేరుతో ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, ఈ కామర్స్ లో సేకరించిన డేటా ఆధారంగా వినియోగదారులకు గాలం వేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో బహుమతుల పేరుతో ఇలా చాలా మందిని మోసాలు చేస్తూ వస్తున్నారని అన్నారు. స్నాప్ డీల్, క్లబ్ ఫ్యాక్టరీ, అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల యొక్క నకిలీ వెబ్ సైట్లు సృష్టించారని, టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఒకటికీ రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బహుమతులు గెలుచుకున్నారని మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మోద్దని ఆయన హెచ్చరించారు. -
ఈ కామర్స్ దిగ్గజాలకు షాక్ : అమ్మకాలు నిషేధించండి
సాక్షి, ముంబై : ఒకవైపు రానున్న ఫెస్టివ్ సీజన్ సందర్భంగా అమెజాన్, ప్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలకు షాకిచ్చేలా ఇండియన్ ట్రేడర్ బాడీ కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది. రానున్న పండుగల సందర్భంగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సేల్స్‌ను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనలను అతిక్రమిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రికి శుక్రవారం ఒక లేఖ రాసింది. రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నిర్వహిచే ఫెస్టివల్ సేల్‌ను నిషేధించాలని సియాట్ కోరింది. ఇవి ప్రకటిస్తున్న భారీ ఆఫర్లు సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. 10-80 శాతం దాకా భారీ తగ్గింపులను అందించడం ద్వారా, ఈ కంపెనీలు ధరలను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయని వాదించింది. కాగా ఈ పండుగ సీజన్లో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుసగా ఆరు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ అందిస్తోంది. అమెజాన్ కూడా తేదీలు ప్రకటించాల్సి ఉంది. -
టార్గెట్ కార్ షోరూమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం పేరుతో ఈ–కామర్స్ వెబ్‌సైట్స్‌లో ప్రకటనలు ఇచ్చి నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను వింటూనే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో ఉత్తరాదికి చెందిన సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. కార్ల షోరూమ్స్‌నే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ శుక్రవారం సూచనలు జారీ చేశారు. ఈ నేరగాళ్ళు ఆన్లైన్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న కార్ల షోరూమ్స్ వివరాలను ఇంటర్నెట్ ద్వారా సంగ్రహిస్తున్నారు. అందులో సూచించిన నెంబర్లకు కాల్ చేస్తున్న కేటుగాళ్లు తాము బడా కంపెనీలకు చెందిన ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తాము భారీ సంఖ్యలో కార్లు ఖరీదు చేయాలని భావిస్తున్నామంటూ వాటి ఖరీదులు, చెల్లించాల్సిన అడ్వాన్సుల విషయం ఎగ్జిక్యూటివ్స్ నుంచి తెలుసుకుంటున్నారు. ఆపై మరో అడుగు ముందుకు వేసి వారికి ఏఏ బ్యాంకులు/బ్రాంచ్‌ల్లో ఖాతాలు ఉన్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరి పేర్లతో ఉంటాయి? తదితరాలు సంగ్రహిస్తున్నారు. సదరు కంపెనీ ప్రతినిధులు అడ్వాన్సులు ఆన్లైన్లో చెల్లించడానికి అడుగుతున్నారని భావిస్తున్న షోరూమ్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ వివరాలన్నీ చెప్పేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత ఆయా బ్యాంకుల నెంబర్లనూ ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్లు వాటికి ఫోన్లు చేస్తున్నారు. మేనేజర్లుతో తాము ఫలానా కార్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకుంటున్నారు. ఆపై మాటల్లో పెట్టి తమ ఖాతాలోని నగదును ఫలానా ఖాతాలోకి బదిలీ చేయాలని కోరుతున్నారు. ఆయా షోరూమ్స్ లావాదేవీలు బ్యాంకులకు నిత్యకృత్యం కావడంతో చెక్కులు తదితరాలు తర్వాత ఇస్తారనే ఉద్దేశంతో బ్యాంకు వారు నగదు బదిలీ చేసేస్తున్నారు. ఈ ఖాతాలు సైబర్‌నేరగాళ్ళకు చెందినవి కావడంతో డబ్బు వారికి చేరిపోతోంది. ఆపై కార్ల షోరూమ్ వారు బ్యాంకును సంప్రదించిన తర్వాతే అసలు విషయం తెలిసి వారు సైబర్‌క్రైమ్ ఠాణాను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా నేరాలు జరుగుతున్న నేపథ్యంలో కార్ల షోరూమ్స్ నిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్స్ అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్‌కాల్స్‌ను నమ్మి కీలక విషయాలు చెప్పకూడదని, అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చహిస్తున్నారు. బ్యాంకులు సైతం చెక్కులు తదితరాలు తేకుండా నగదు ఫోన్‌కాల్స్ ఆధారంగా బదిలీ చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాల్లో డబ్బు పోవడం ఎంత తేలికో... రికవరీ అంత కష్టమని పేర్కొంటున్నారు. -
కెమెరా బుక్ చేస్తే రాళ్లు పంపారు!
హిందూపురం అర్బన్: ఆన్లైన్లో కెమెరాబుక్ చేస్తే దానికి బదులు రెండు రాళ్లు వచ్చాయి. పార్సిల్ విప్పిన వినియోగదారుడు అవాక్కయ్యాడు. హిందూపురం చిన్నమార్కెట్వద్ద నివాసముంటున్న నూనె వ్యాపారి మంజునాథ్ కుమారుడు హర్షిత్ సప్తగిరి కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను ఆన్లైన్లో తక్కువ ధరకు లభించే వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. రిపబ్లిక్‌డే సందర్భంగా తక్కువ ధరకు కెనాన్ 3000డీ కెమెరా కనిపించింది. మూడు రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ కింద కెమెరాను బుక్‌చేశాడు. శుక్రవారం కొరియర్ వ్యక్తి పార్సిల్ చేతికందించాడు. రూ.21 వేలు ఇచ్చి పార్సిల్ అతని ముందే తెరిచి చూపించమన్నాడు. కవర్ తీసి చూడగా అందులో రెండు రాళ్లు బయటపడ్డాయి. దీన్ని చూచి అక్కడివారు నిర్ఘాంతపోయారు. దానిని వీడియో తీçస్తుండటంతో పార్సిల్ తెచ్చిన వ్యక్తి డబ్బు వెనక్కు ఇచ్చి పార్సిల్ వెనక్కు పట్టుకుపోయినట్లు బాధితుడు హర్షిత్ చెప్పాడు. -
ఓటీపీలు లేకుండానే రూ.లక్షలు కొట్టేశారు
సాక్షి, సిటీబ్యూరో: వారు ముగ్గురు బిహార్ యువకులు. పదో తరగతి వరకు చదివిన వారు ప్లంబర్లుగా పని చేసేవారు. బతుకుదెరువు నిమి త్తం నగరానికి వలసవచ్చిన వీరు యూట్యూబ్ వీడియోల ద్వారా ఓటీపీ నంబర్లు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసే వెసులుబాటు ఉన్న ఈ–కామర్స్ సైట్లపై అధ్యయనం చేశారు.డెబిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు, సీవీవీ తెలిస్తే చాలు కార్డు కాలపరిమితి చెప్పే ఆన్లైన్ అప్లికేషన్లపై పట్టు సాధించారు. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చినట్లుగా నటిస్తూ ముందున్న ఖాతాదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో కార్డు వివరాలను సోల్డర్ సర్ఫింగ్ ద్వారా తెలుసుకుని ఆన్లైన్ షాపింగ్ చేసేవారు. ఇలా దాదాపు 200 మంది నుంచి దాదాపు రూ.15లక్షలకు పైగా కాజేసిన ఈ మిత్ర త్రయాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 18 సెల్ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు, రూ.1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లతో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం వివరాలు వెల్లడించారు. బాధితుల డబ్బుతోనే విమానయానం... బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లా, బంతారియా–జగదీశ్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్ తొమ్మిదో తరగతి చదివాడు. ఆన్‌లైన్‌పై పట్టు సాధించిన అతను అదే గ్రామానికి చెందిన స్నేహితుడు వినోద్ కుమార్, సెమర్ గ్రామానికి చెందిన మంజేష్ కుమార్‌తో కలిసి ఫిబ్రవరిలో బతుకు దెరువు కోసం షాద్‌నగర్‌కు వలస వచ్చి ఓ ప్రైవేట్ పైపులైన్ కంపెనీలో ప్లంబర్లుగా చేరారు. జీతం చాలకపోవడంతో మనీష్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ మోసాలను ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బులు చేసేవారిలా నటిస్తూ ముందున్న వారి కార్డు వివరాలు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి ఖాతాదారునిగా చెప్పుకుని ఖాతాలో నగదు వివరాలు తెలుసుకునేవారు. అనంతరం ‘బ్యాంక్ కార్డు వాలిడిటర్స్’ యాప్ ద్వారా ఆ డెబిట్ కార్డు కాలపరిమితి తెలుసుకొని, ఓటీపీ నంబర్ అవసరం లేని ఈ–కామర్స్ వెబ్సైట్ల నుంచి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసేవారు. ఇందుకుగాను తరచూ సెల్‌ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు మారుస్తూ వేర్వేరు చిరునామాలు ఇచ్చేవారు. తాము బుక్ చేసిన వస్తువులను తెచ్చుకునేందుకు ఇతర నగరాలకు వెళ్లేందుకోసం విమాన టికెట్లను కూడా బాధితుల డబ్బులతోనే బుక్ చేసుకునేవారు. నాలుగు నెలలుగా షాద్‌నగర్ నుంచి తమకు తెలియకుండా బ్యాంక్ ఖాతాల నుంచి షాపింగ్ చేస్తున్నట్లు తన సెల్‌కు ఎస్ఎంఎస్లు వస్తున్నాయని పేర్కొంటూ దాదాపు 75 బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న రూ.3,89,500 పోయినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. దొరికిపోయింది ఇలా... సైబరాబాద్ సైబర్ క్రైమ్‌కు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా షాద్‌నగర్ నుంచే ఉండటంతో ఆయా బ్యాంక్ ఖాతాదారులతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం మాట్లాడింది. శంషాబాద్, షాద్‌నగర్ బస్టాండ్లు, షాద్‌నగర్ ఏటీఎంకు సమీపంలో డెలివరీ చేసిన వస్తువుల వివరాలపై డెలివరీ బాయ్‌లను విచారించారు. ఏటీఎంలలోని సీసీటీవీ కెమెరాల పుటేజీల ఆధారంగా మనీష్, వినోద్‌లను పట్టుకున్న పోలీసులు వారి వివరాల ఆధారంగా మంజేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. ‘ఇప్పటివరకు వీరి సెల్‌ఫోన్ ద్వారా లభ్యమైన సమాచారాన్ని బట్టి 200 మంది వరకు బాధితులు ఉన్నారు. వీరు పాత డేటాను డిలీట్ చేయడంతో ఇంకా చాలా మంది బాధితులు ఉండొచ్చు. పోలీసు కస్టడీకి తీసుకొని విచారించి పూర్తి విషయాలు తెలుసుకుంటామ’ని సీపీ సజ్జనార్ తెలిపారు. ‘బ్యాంక్ కార్డు వాలిడిటర్స్’ కు నోటీసులు జారీ చేస్తామన్నారు. బ్యాంక్‌లు కూడా ఫిర్యాదు అందినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్ స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్ఐ గౌతమ్, హెడ్‌కానిస్టేబుల్ సిద్దేశ్వర్, సిబ్బందిని సీపీ అభినందించారు. -
సైబర్ నేరం..బహురూపం!
సాక్షి, సిటీబ్యూరో : ఎస్సెమ్మెస్, ఈ– మెయిల్, ఫోన్‌కాల్... ఇలా ఏదో ఒక రకంగాఎర వేసి అందినకాడికి దండుకున్న సైబర్ నేరగాళ్లు నగరంలోనానాటికీ రెచ్చిపోతున్నారు. వీటికి తోడు ఈ– కామర్స్ సైట్స్ వేదికగానూ బరి తెగిస్తున్నారు. గడచిన వారం రోజుల్లో వివిధ రకాలైన నేరాల్లో మోసపోయిన ఆరుగురు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుల్ని కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితులు వాడిన ఫోన్ నంబర్లు, బాధితులు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగాముందుకు వెళ్తున్నారు. ఉద్యోగం పేరుతో రూ.2.24 లక్షలు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్ ఖాన్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 24న మోర్గాన్ అనే వ్యక్తి నుంచి ఈ– మెయిల్ వచ్చింది. లండన్‌లోని ఫెలియో సూపర్‌మార్కెట్ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ అందులో ఉంది. ఆసక్తి ఉండే బయోడేటాతో పాటు దరఖాస్తు పత్రాన్నీ పంపాలని కోరడంతో అమీర్ అలాగే చేశాడు. ఇదే నెల 30 మరో ఈ–మెయిల్ పంపిన మోర్గాన్.. ఉద్యోగానికి ఎంపికైనట్లు, వీసా ప్రాసెసింగ్ ప్రారంభించాలని స్పష్టం చేశాడు. కెల్విన్ లారెన్స్ ఆ వ్యవహారాలు పర్యవేక్షిస్తాడంటూ అతడి ఫోన్‌నంబర్ అందించాడు. దీంతో అమీర్ కెల్విన్‌ను సంప్రదించగా ప్రాసెసింగ్ ఫీజుగా రూ.2.24 లక్షల్ని బ్యాంకు ఖాతాల్లో వేయమని చెప్పి డిపాజిట్ చేయించుకున్నాడు. మరో ఖాతాలో ఇంకో రూ.40 వేలు డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. కెమెరా ఎర చూపించి రూ.22 వేలు... అంబర్‌పేట వాసి యు.దీపక్ కార్పెంటర్. ఓఎల్ఎక్స్లో వచ్చిన ఓ ప్రకటనను ఇతడి ఆకర్షితుడయ్యాడు. ఓ హైఎండ్ డిజిటల్ కెమెరాను రూ.80 వేలకే అమ్ముతున్నట్లు అందులో ఉంది. దీనికి ఆకర్షితుడైన దీపక్ ప్రకటనలో ఉన్న నంబర్‌ను సంప్రదించాడు. ఎన్పీ బాలాజీ పేరుతో మాట్లాడిన అవతలి వ్యక్తి అడ్వాన్స్‌గా రూ.22 వేలు చెన్నైకి చెందిన ఐడీబీఐ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. మిగిలిన మొత్తం కెమెరా డెలివరీ అయ్యాక ఇవ్వచ్చని చెప్పాడు. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత కొన్నాళ్లు ఎదురు చూసినా కెమెరా రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన దీపక్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బహుమతిపేరుతో రూ.96 వేలు హాంఫట్.. నాంపల్లికి చెందిన బి.రూపేష్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. ఇతడికి కొన్నా క్రితం రోహిత్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. క్రాఫ్ట్ అవార్డ్స్ సంస్థ తరఫున రూ.12.8 లక్షల విలువైన కారు బహుమతిగా వచ్చిందంటూ చెప్పారు. కేవలం రూ.7,840 చెల్లిస్తే కారు వచ్చేస్తుందంటూ చెప్పి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై రకరకాల పేర్లు చెప్పి వివిధ దఫాల్లో మొత్తం రూ.95,940 స్వాహా చేశారు. మళ్లీ కాల్ చేసిన కేటుగాళ్లు మరో రూ.62 వేలు డిమాండ్ చేయడంతో రూపేష్‌కు అనుమానం వచ్చింది. ఆయన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. కేబీసీ పేరిటమహిళ నుంచి.. చాంద్రాయణగుట్టకు చెందిన జుబేదా గృహిణి. ఈ నెల 1న ఆమెకు ‘+92’తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఆపై ఫోన్ చేసిన వ్యక్తి కేబీసీ సంస్థ నుంచి మాట్లాడుతున్నానంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆపై తమ సంస్థ నిర్వహించిన లాటరీలో రూ.25 లక్షల బహుమతి వచ్చిందని చెప్పాడు. ఈ మాటలు జుబేదా నమ్మడంతో అసలు కథ ప్రారంభించాడు. రకరకాల పన్నుల పేర్లు చెప్పి రూ.9 వేలతో ప్రారంభించి భారీ మొత్తం గుంజాడు. మరో రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితురాలు మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేవీ ఉద్యోగినుంచి రూ.96.5 వేలు... కంచన్‌బాగ్‌కు చెందిన సంతోష్ కుమార్ నేవీలో సెయిలర్‌గా పని చేస్తున్నారు. ఓఎల్ఎక్స్లో ఓ కారు విక్రయానికి సంబంధించిన యాడ్‌కు ఈయన ఆకర్షితులయ్యారు. అందులో పేర్కొన్న నంబర్‌ను సంప్రదించగా.. రూ.1.85 లక్షల ధరగా చెప్పి కవిత శర్మ అనే మహిళను కాంటాక్ట్ చేయాలంటూ నంబర్ ఇచ్చారు. సంతోష్ ఆమెతో మాట్లాడగా... తాను ఢిల్లీకి.. అక్కడ నుంచి ఆస్ట్రేలియా వచ్చేసినట్లు చెప్పారు. కారు మాత్రం విమానాశ్రయ పార్కింగ్‌లో ఉందని నమ్మబలికారు. వివిధ దఫాలుగా రూ.96,500 కాజేశారు. విమానాశ్రయానికి వెళ్లి చెక్ చేసిన సంతోష్ తాను మోసపోయానని గుర్తించి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఓపీటీ ఫ్రాడ్‌లో రూ.75 వేలు.. హసన్‌నగర్‌కు చెందిన జహీరుద్దీన్ వృత్తి రీత్యా టైలర్. ఈ నెల 17న ఇతడికి కాల్ చేసిన వ్యక్తి బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్‌కార్డ్ వివరాలు సరిచూస్తున్నామంటూ చెప్పాడు. జహీరుద్దీన్ నుంచి బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు సంగ్రహించాడు. వీటిని వినియోగించి ఆన్లైన్ లావాదేవీలు చేసిన నేరగాడు అతడి ద్వారానే మూడుసార్లు ‘వన్ టైమ్ పాస్వర్డ్స్’ (ఓటీపీ) అడిగి తెలుసుకున్నాడు. వీటిని వినియోగించి బాధితుడి ఖాతాలో ఉన్న రూ.75 వేలు మూడు దఫాల్లో కాజేశాడు. మొత్తానికి మోసపోయానని గుర్తించిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అపరిచితులతో లావాదేవీలు వద్దు.. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతి వచ్చిందంటేనో, కారు, సెల్‌ఫోన్ తక్కువ ధరకు విక్రయిస్తామంటేనో నమ్మకూడదు. ప్రత్యక్షంగా చూడనిదే ఏదీ నిర్ధారించుకోకూడదు. అపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఇవి కేవలం ఆర్థిక నష్టాన్నే కాదు ఒక్కోసారి కొత్త సమస్యల్నీ తెచ్చిపెడతాయి. బ్యాంకు అధికారుల పేరు చెప్పి ఎవరైనా కాల్ చేసి ఓటీపీ అడిగితే నమ్మవద్దు. బ్యాంకులు అసలు అలా చేయనే చేయవు. సైబర్ నేరాలపై అవగాహనకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే 25 లక్షల కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు షార్ట్ ఫిల్మŠస్ కూడా అందుబాటులోకి తెచ్చాం. – కేసీఎస్ రఘువీర్, అదనపు డీసీపీ, సైబర్ క్రైమ్ -
విషాదం: ఆన్లైన్లో విషసర్పాన్ని ఆర్డరిస్తే!
బీజింగ్ : ఎవరైనా పాము పేరు చెబితనే వామ్మో అంటూ పరుగులు తీస్తారు. కానీ చైనాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాము వైన్‌ను తయారు చేసుకుని సేవిస్తారు. ఈ క్రమంలో ఓ యువతి ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లో అత్యంత విషపూరిత పామును బుక్ చేసుకుని.. ఆపై అదే పాముకాటుకు గురై దుర్మరణం చెందింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చైనాలోని షాంగ్జీ ఏరియాకు చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్ వైన్ తాగాలనిపించింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలో కొన్ని ప్రాంతాల్లో పలురకాలుగా స్నేక్ వైన్‌ను తయారుచేసుకుని ఇష్టంగా తాగుతారు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆ యువతి ఈ కామర్స్ వెబ్సైట్ ఝువాన్ఝువాన్లో ఓ విష సర్పాన్ని ఆర్డరిచ్చింది. తన ఇంటికి వచ్చిన పామును వైన్ ఉన్న పాత్రలో వేసింది. అయితే ఆ పాము ఎలాగోలా తప్పించుకుని పాత్రనుంచి బయటకొచ్చింది. ఆపై విష సర్పం కాటువేయడంతో యువతిని మృతిచెందినట్లు ఆమె తల్లి తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఇంటి సమీపంలోనే పామును పట్టుకుని తీసుకెళ్లారు. కాగా, ఈ కామర్స్ వెబ్సైట్లు మాధ్యమంగా విష సర్పాలు, క్రూర జంతువులను విక్రయించడం నేరమని పోలీసులు పేర్కొన్నారు. కానీ కొన్ని చిన్న ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అధిక సంపాదన కోసం ఇంకా ఇలాంటి జంతువులను విక్రయిస్తున్నారని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఆన్లైన్ చీటింగ్!
నాసిరకం సెల్ఫోన్లు పట్టుకుని రహదారుల్లో సంచరించడం... ‘అనువైన’వారిని ఎంపిక చేసుకుని కష్టాల పేరుతో ఆకర్షించడం.. సదరు ఫోన్ తక్కువ ధరకే విక్రయిస్తున్నానంటూ అందినకాడికి దండుకుని అంటగట్టడం.. ఇలా నేరుగా జరిగే చీటింగ్స్ గతంలోనూ చూశాం. ప్రస్తుతం మోసగాళ్ల పంథా మారింది. ఆన్లైన్ వేదికగా పక్కా పథకం ప్రకారం వంచనకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ ఫోన్ల ఫొటోలు పోస్ట్ చేసి, ఒరిజినల్ అంటూ టోకరా వేస్తున్న వాళ్లు కొందరైతే.. ఆన్లైన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటామంటూ పట్టుకుని ఉడాయిస్తున్న వారు ఇంకొందరు. తాజాగా ఇరవై రోజుల్లో కార్ల విక్రయం పేరుతో జరిగిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ–కామర్స్ సైట్స్‌ను బాధ్యుల్ని చేయలేమంటున్నారు. ఆయా సైట్స్‌కు బాధ్యత ఉండదు ఈ నేపథ్యంలో ఆన్లైన్లో క్రయవిక్రయాలు చేసే వాళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరముంది. ప్రాథమికంగా అమ్ముతున్న వ్యక్తి వివరాలు, వస్తువు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. వీలున్నంత వరకు వ్యక్తిగతంగా కలవడం, వస్తువును చూడటం చేసిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి. ఎలాంటి పరిశీలన లేకుండా ముందుకు వెళ్తే మోసపోతారు. – సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో విక్రయాలు జరిపే ఈ–కామర్స్ వెబ్సైట్లు రెండు రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు, సంస్థలకు చెందిన ఉత్పత్తులకు ప్రచారం కల్పిండంతో పాటు తమ వెబ్సైట్ ద్వారా అమ్ముకునే అకాశం ఇచ్చేవి మొదటి రకం. ఇలా చేసినందువల్ల లావాదేవీల్లో వీటికి కొంత కమీషన్ ముడుతుంది. రెండో రకానికి చెందిన ఈ–కామర్స్ సైట్లు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటివి ప్రధానంగా సెకండ్ హ్యాండ్ వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారులే తాము వినియోగిస్తున్న వస్తువుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో పోస్ట్ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించడం ద్వారా ఖరీదు చేసుకునే అవకాశం ఉంది. ‘పోస్టింగ్’ ఎంతో ఈజీ.. మొదటి తరహా వెబ్సైట్ల వల్ల అంతగా నష్టం లేకపోయినా.. రెండో రకానికి చెందిన వాటితోనే తలనొప్పులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీటిలో తాము వినియోగిస్తున్న వస్తువుల్ని విక్రయించాలని ఆశించే వినియోగదారులు ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, ఆయా వెబ్సైట్లకు చెందిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫోన్లో వినియోగించే సిమ్‌కార్డు బోగస్ వివరాలతో తీసుకున్నదైతే వీరి ఉనికి బయటపడటం కూడా కష్టసాధ్యమే. ఇలాంటి వెబ్సైట్లను వేదికగా చేసుకున్న మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చీటింగ్స్ ఎన్నో రకాలు.. ఈ వెబ్సైట్లను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే చీటర్లు ప్రధానంగా రెండు ‘మార్గాలను’ అనుసరిస్తున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువుల్ని పోలి ఉండే, అదే కంపెనీ పేర్లతో లభించే వస్తువుల్ని ఖరీదు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రోనగరాల మార్కెట్లతో ఇవి అతి తక్కువ ధరకు లభిస్తున్నవాటిని తీసుకువచ్చి అవి అసలువంటూ ‘సెకండ్ హ్యాండ్’ వెబ్‌సైట్స్‌లో పోస్టు చేసి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ఖరీదు చేస్తామంటూ వాటి యజమానుల్ని సంప్రదిస్తున్న మోసగాళ్లు ట్రయల్ అని, డబ్బు తీసుకువస్తామని, దృష్టి మళ్లించి వాటిని ఎత్తుకుపోతున్నారు. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయి. మరోపక్క వాహనాలను సైతం విక్రయిస్తామంటూ పోస్టులు పెట్టి అడ్వాన్స్ రూపంలో అందినకాడికి దండుకుంటున్నారు. ఈ తరహా ఆన్లైన్ మోసగాళ్లలో విదేశీయలు కూడా ఉంటున్నారు. తేలిక పాటి వాహనాలను విక్రయిస్తానంటూ ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లో తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజమహేంద్రవరం వాసి వినోద్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్ వెబ్సైట్ వేదికగా వాహనం విక్రయం పేరుతో టోకరా వేసిన ఉగాండా జాతీయుడు ఫెడ్రిక్‌ను గత శుక్రవారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. -
ప్యారా.. తిరంగా!
ఇండిపెండెన్స్ డే ఫీవర్.. సిటీని ఊపేస్తోంది. రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు.. ఫ్యాషన్, ట్రెడిషన్.. ఎక్కడ చూసినా యువ‘తిరంగా’లు ఎగసిపడుతున్నాయి. యువతని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ వెబ్సైట్లు సహా వ్యాపార సంస్థలన్నీ మువ్వన్నెల ముస్తాబుతో కనువిందు చేస్తున్నాయి. పంద్రాగస్టున కళ్లు చెదిరేలా మువ్వన్నెలతో కనిపించి దేశభక్తిని చాటుకొనేందుకు యువత సన్నద్ధమవుతోంది. వస్త్రధారణలో, అలంకరణలో.. ఆఖరుకు ఆహారంలోనూ అణువణువునా దేశభక్తి ప్రతిఫలించేలా వ్యాపార సంస్థలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టుకుని ముందుకొచ్చాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్సైట్లు యువతను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంటున్నాయి. ఈ-ప్రపంచం.. త్రివర్ణభరితం వోయ్లా డాట్ కామ్, షాప్‌క్లూస్ డాట్ కామ్, స్నాప్‌డీల్ డాట్ కామ్ వంటి పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు కొద్దిరోజులుగా త్రివర్ణభరితంగా మారాయి. ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో ‘తిరంగా’ జుయెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోని రంగు రాళ్లు, పూసలు వంటి వాటితో ఈ ఆభరణాలను రూపొందించాయి. అలాగే కాటన్‌తో తయారు చేసిన జాతీయ పతాకం సహా దేశభక్తిని ప్రతిబింబించేలా రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తున్నాయి. మువ్వన్నెల ఫ్యాషన్ సందడి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్యాషన్ బ్రాండ్స్ సరికొత్తగా రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌తో ముందుకొస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా కనిపించే కుర్తాలు, మూడురంగుల స్టోల్స్, సల్వార్ కమీజ్‌లు, టీ-షర్టులు అందిస్తున్నాయి. అన్ని వర్గాల వారికీ, అన్ని వయసుల వారికీ అందుబాటులో పలు ఫ్యాషన్ వస్తువులను ముందుకు తెస్తున్నాయి. యువతులైతే జెండా డిజైన్‌లో నెయిల్ ఆర్ట్, కనురెప్పల మేకప్, మువ్వన్నెల కేశాలంకరణ వంటివి చేయించుకుంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇవే కాకుండా హ్యాండ్‌బ్యాగ్స్, గాజులు, గొలుసులు వంటి యాక్సెసరీస్ సైతం ‘తిరంగా’ డిజైన్లలోనే ఎంపిక చేసుకుంటున్నారు. మూడు రంగుల్లో ముచ్చటైన రుచులు రెస్టారెంట్లు సైతం మూడు రంగుల వంటకాలను ముచ్చటైన రుచుల్లో అందిస్తున్నాయి. చీజ్ కేక్స్, చాక్లెట్ బ్రౌనీస్, హరా కబాబ్స్, ఆచారి పనీర్ టిక్కా వంటి ప్రత్యేక వంటకాలతో దేశభక్తిని చాటకుంటూనే, భోజనప్రియులనూ అలరిస్తున్నాయి. - శిరీష చల్లపల్లి