Govt Massive Survey On Standard Indian Cloth Sizes Chart: Details Inside - Sakshi
Sakshi News home page

INDIAsize: ఒకదాంట్లో ‘ఎల్‌’.. మరోదాంట్లో ‘ఎక్స్‌ఎల్‌’ తేడాలెందుకు ఉంటాయో తెలుసా?

Published Mon, Aug 30 2021 1:51 PM | Last Updated on Mon, Aug 30 2021 7:03 PM

Indian Clothes Size Govt Begins Survey To Chart Specific Sizes - Sakshi

Indian Body Measurements Survey:  స్మాల్‌, మీడియం, ఎల్‌, ఎక్స్‌ఎల్‌.. ఇలా దుస్తులు, చెప్పులు, షూస్‌ విషయంలో కొలమానాలు ఉంటాయి. అయితే అవి యూకే, యూఎస్‌, మెక్సికన్‌ అంటూ విదేశీ కొలతలు ఉండడం తెలుసుకదా!. ఆన్‌లైన్‌లో ఈ కొలతలతో పాటుగా సెంటీమీటర్‌ కొలతలు ఉండడం వల్ల కొనుగోలుదారులు ఓ క్లారిటీకి వస్తుంటారు. కానీ, కోట్ల మంది వస్త్ర వ్యాపారులకు మాత్రం కొన్నేళ్లుగా ఈ కొలతలు ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయి. అందుకే ఈ కొలతల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. 

బట్టల దుకాణానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి సైజుల విషయంలో తేడాలు కనిపిస్తుంటాయి. రెగ్యులర్‌గా ‘ఎల్‌’ సైజ్‌ ఉపయోగించేవాళ్లకు.. వేరే బ్రాండ్‌లో ‘ఎక్స్‌ఎల్‌’ సరిపోతుంటుంది. అది చూసి బ్రాండ్‌ను బట్టి తేడాలుంటాయని చాలామంది పొరపడుతుంటారు. కానీ, విషయం అది కాదు. విదేశీ సైజుల కొలమానం ప్రకారం ఉండడం మూలంగానే అందులో తేడాలు వస్తున్నాయి. ప్రత్యేకించి మన దేశానికి ప్రత్యేకించి క్లోతింగ్‌ మెజర్‌మెంట్‌(కొలతల కొలమానం) అంటూ ఒకటి లేకుండా పోయింది. అందుకే ఇంకా యూకే, యూఎస్‌ అంటూ వస్త్ర, శాండల్స్‌ తయారీ పరిశ్రమలు విదేశీ కొలతలపైనే ఆధారపడుతున్నాయి. అందదా కొలతలతోనే దుస్తులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీనికి చెక్‌ పెట్టేందుకు మొదలైందే ‘ఇండియాసైజ్‌’ సర్వే.
 

సర్వే ఉద్దేశం
‘INDIAsize’.. కేంద్ర వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(NIFT) సహకారంతో ఈ సర్వేను మొదలుపెట్టింది. కొత్త ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, షిల్లాంగ్‌.. ఇలా ప్రధాన నగరాలను ఆరు జోన్లుగా విభజించి సర్వేను చేస్తున్నారు. సుమారు పాతిక వేలమంది కొలతలను తీసుకుని దుస్తుల కోసం ఒక కొలతల చార్ట్‌ను రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టారు. 15 నుంచి 65 ఏళ్ల వయసు వాళ్ల బాడీ కొలతల ఆధారంగా ఈ సర్వేను కొనసాగించనున్నారు. క్లోతింగ్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా మద్దతుతో 2019లో అనౌన్స్‌ అయిన ఈ ప్రాజెక్టు.. కరోనా వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు గత గురువారం ఢిల్లీలో ఇండియాసైజ్‌ సర్వే మొదలైంది. తొలి రౌండ్‌లో 5,700 మంది పాల్గొననున్నారు. 2022 చివరికల్లా సర్వేను ముగించి..  మన సైజులపై ఓ కొలిక్కి రానున్నారు.  

ఏం ఉపయోగమంటే..
దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులున్న రెండో పరిశ్రమ.. వస్త్ర పరిశ్రమ. ఏటా 140 బిలియన్ల రూపాయలు ఆదాయం వస్తే.. అందులో 100 బిలియన్ల రూపాయలు లోకల్‌ కన్జూమర్ల నుంచే వస్తోంది. కొలతల గందరగోళం నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ఆఫ్‌లైన్‌ షాపింగ్‌లో ఈ కొలతలు కీలకంగా వ్యవహరించనున్నాయి. రిటర్న్‌ పాలసీలో భాగంగా స్టాఫ్‌కానీ, కస్టమర్‌కానీ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. తయారీదారులకు సైతం ఈ సర్వే ఉపయోగపడనుంది. సేల్స్‌ పెంచుకోవడానికి, రిటర్న్‌ గూడ్స్‌ లాంటి సమస్యలను అధిగమించడానికి తయారీదారులకు సాయపడనుంది.
 

ఎలా చేస్తారంటే.. 
ఆంత్రోపోమెట్రిక్‌ డేటా(శరీరాకృతి కొలతల) ఆధారంగా ఈ సర్వే కొనసాగనుంది. 100 డేటా పాయింట్స్‌ ఆధారంగా కొలతల్ని నిర్ధారిస్తారు. ఎంపిక చేసినవాళ్లపై ‘హ్యూమన్‌ సేఫ్‌ 3డీ వోల్‌ బాడీ స్కానర్‌’ టెక్నాలజీ ఉపయోగించి కొలతలను సేకరిస్తామని నిఫ్ట్‌ డైరెక్టర్‌ జనరల్‌ శాంతమను వెల్లడించారు. ఒక్కో వ్యక్తిని స్కాన్‌ చేయడానికి 15 నిమిషాల టైం పడుతుంది. తద్వారా టైలర్‌, ఎక్స్‌పర్ట్‌ల అవసరం లేకుండానే సర్వే వేగంగా పూర్తి కానుంది. ఈలోపు చెప్పులు, షూలకు సంబంధించిన సర్వే ప్రక్రియను మొదలుపెడతామని ఆయన తెలిపారు. 

గార్‌మెంట్స్‌ పరిశ్రమల చరిత్రలో ఫస్ట్‌ రికార్డెడ్‌ ఇన్‌స్టాన్స్ సైజింగ్‌ సర్వే.. 1921లో అది కేవలం పురుషుల కోసమే జరిగింది. అయితే అంత్రోపోమెట్రిక్‌(మనిషి బాడీ కొలతల ప్రకారం) మాత్రం 1939 నుంచి మొదలైంది.  ఆ టైంలో పదిహేను వేలమంది అమెరికన్‌ మహిళల కొలతల ఆధారంగా దుస్తుల్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్ని దేశాలు ప్రత్యేకంగా తమ దేశ ప్రజల శరీరాకృతి కొలతల ఆధారంగా దుస్తులు, చెప్పులు రూపొందిస్తూ వస్తున్నాయి.

చదవండి: ఆడవాళ్లు.. ఈ యాప్‌తో జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement