ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాక్‌ : అమ్మకాలు నిషేధించండి |  Ban upcoming festive sales on Amazon Flipkart says CAIT | Sakshi
Sakshi News home page

ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాక్‌ : అమ్మకాలు నిషేధించండి

Published Sat, Sep 14 2019 2:19 PM | Last Updated on Sat, Sep 14 2019 2:24 PM

 Ban upcoming festive sales on Amazon Flipkart says CAIT - Sakshi

సాక్షి, ముంబై : ఒకవైపు రానున్న ఫెస్టివ్‌ సీజన్‌ సందర్భంగా అమెజాన్‌ప్లిప్‌కార్ట్‌ లాంటి దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. మరోవైపు  ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాకిచ్చేలా  ఇండియన్ ట్రేడర్ బాడీ  కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది. రానున్న పండుగల సందర్భంగా  ఈ కామర్స్‌ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివ్‌ సేల్స్‌ను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనలను అతిక్రమిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రికి  శుక్రవారం  ఒక లేఖ రాసింది.

రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్‌ సందర్భంగా  ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు  ఆఫర్‌ చేయడం  తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిచే ఫెస్టివల్ సేల్‌ను నిషేధించాలని  సియాట్‌ కోరింది.  ఇవి ప్రకటిస్తున్న భారీ ఆఫర్లు సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. 10-80 శాతం దాకా భారీ తగ్గింపులను అందించడం ద్వారా, ఈ కంపెనీలు ధరలను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయని వాదించింది. కాగా  ఈ పండుగ సీజన్‌లో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుసగా ఆరు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ అందిస్తోంది. అమెజాన్ కూడా తేదీలు ప్రకటించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement