
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇంకా ఇతర ఈ–కామర్స్ సంస్థల చేతుల్లో విలవిలలాడుతున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, భారతలోని చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎలాంటి ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది.