CAIT
-
పెళ్లి బాజా @ రూ.5.9 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం వధూవరులతో పాటు వ్యాపారులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వివాహాల విషయంలో గెస్ట్‌ల సంఖ్య తగ్గినా ఖర్చు బాజా మాత్రం గట్టిగానే మోగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య 18 రోజుల పాటు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని.. ఈ సీజన్లో రిటైల్ రంగంలో రూ.5.9 లక్షల కోట్ల మేర వ్యాపారం ఉంటుందని అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య (సీఏఐటీ) లెక్కగట్టింది. అంతేకాదు ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల మేర వివాహాలు జరుగుతాయని.. రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి ఆస్కారం ఉందని పేర్కొంది. అతిథుల సంఖ్య తగ్గుతోంది... వివాహ పరిశ్రమలో ఫ్యాషన్, ట్రావెల్, ఆతిథ్యం ఇంకా ఇతరత్రా సర్వీసులు కలగలిసి ఉంటాయి. ముఖ్యంగా దేశీయంగా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి పెరుగుతుండటంలో ట్రావెల్, ఆతిథ్య రంగానికి ఫుల్ జోష్ లభిస్తోంది. ప్రత్యేకమైన ఫుడ్ మెనూల నుంచి గెస్ట్‌లకు విభిన్నమైన అనుభూతులను అందించడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ‘ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు అతిథుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా మిలీనియల్ జంటలు తమకు అత్యంత దగ్గరి బంధువులు, ఆత్మీయులను మాత్రమే అతిథులుగా పిలుస్తున్నారు. గెస్ట్ లిస్టులో కోత పెట్టినప్పటికీ.. మొత్తంమీద బడ్జెట్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఏటికేడు విహహాల ఖర్చు పెరుగుతూనే ఉంది.అలంకరణలు, వ్యక్తిగత సర్వీసులు, అతిథుల అభిరుల మేరకు కేటరింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటున్నారు’ అని న్యూఢిల్లీలోని షాంగ్రీలా ఈరోస్ జనరల్ మేనేజర్ అభిõÙక్ సాధూ పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కళకళలాడనుండటంతో ఈ లగ్జరీ హో టల్ చైన్ ‘బంధన్ బై షాంగ్రీలా’ పేరుతో వివా హ సేవలను ప్రారంభించింది. ఈ హోటల్లో సాదారణ స్థాయి పెళ్లి బడ్జెట్ రూ. 25 లక్షలతో మొ దలై కోట్లలోకి వెళ్తోంది. జైపూర్ హయత్ ప్యాలెస్‌లోనూ సాధారణ పెళ్లి బడ్జెట్ రూ.20–30 లక్షలుగా ఉంది. ఖర్చెంతైనా తగ్గేదేలే... పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం... పెళ్లి ఖర్చు రూ. 25 లక్షల స్థాయి నుంచి ఏకంగా రూ.100 కోట్లకు కూడా వెళ్లే సందర్భాలున్నాయట. విహాహ వేడుకను గ్రాండ్‌గా జరిపించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారని, అవసరమైతే కొందరు ఆస్తులమ్మేందుకూ వెనుకాడటం లేదంటున్నా రు పరిశీలకులు! మధ్యతరగతి వర్గాల పెళ్లి ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఉంటుందని, ఎగువ మధ్యతరగతి విషయానికొస్తే.. ఇది రూ. 25 లక్షల నుంచి రూ.2.5 కోట్లకు చేరుతోందని వెడ్డింగ్ ప్లానర్ వెడ్డింగ్సూత్ర.కామ్ సీఈఓ పార్తీప్ త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘సంపన్నులు (హెచ్ఎన్ఐలు) రూ.1.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల స్థాయి లో వెచ్చిస్తున్నారు. అల్ట్రా హెచ్ఎన్ఐల బడ్జెట్ అ యితే ఏకంగా రూ.2.5 కోట్ల నుంచి రూ.100 కోట్లకు కూడా దూసుకెళ్తోంది’ అని ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో అనంత్ అంబానీ–రాధికా మర్చెంట్ వివాహ వేడుక ఖర్చు చూసి (దాదాపు రూ.5,000 కోట్లుగా అంచనా) ప్రపంచమంతా నోరెళ్లబెట్టడం తెలిసిందే!! భారతీయుల పెళ్లిళ్లా మజాకానా అనే రేంజ్లో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది.డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్బ్రైడల్ మేకప్ నుంచి ఫోటోగ్రఫీ, వేదిక, డెకరేషన్, వెడ్డింగ్ లొకేషన్ వరకూ ప్రత్యేకంగా ఉండాలని యువ జంటలు కోరుకుంటున్నారు. ‘గతంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రూ. 2 లక్షలు వరకు ఒక కుటుంబం ఖర్చు చేస్తే, ఇప్పుడిది రూ. 6 లక్షలకు చేరుతోంది. కొందరు వధువులు టాప్ మేకప్ ఆర్టిస్ట్‌లతో ప్రత్యేకంగా సింగారించుకుంటున్నారు. ఒక్కో ఫంక్షన్‌కు ఖర్చు రూ. లక్ష వరకూ ఉంటోంది’ అని త్యాగరాజన్ తెలిపారు. ఇక జైపూర్, ఉదయ్‌పూర్, జోద్పూర్, గోవా, మహాబలిపురం వంటి డెస్టినేషన్ వెడ్డింగ్ హాట్స్పాట్లకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోందట! శీతాకాలంలో పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు కూడా ఉండటంతో హోటల్ రేట్లు భారీగా ఎగబాకుతున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా, రాజస్థాన్, గోవా, కేరళ ప్రాచుర్యం కొనసాగుతుండటంతో పాటు ఇప్పుడు డెహ్రాడూన్, రిషికే‹Ù, కూర్గ్ వంటి కొత్త ప్రదేశాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ లిస్టులోకి చేరుతున్నాయి. ‘అత్యంత సంపన్న వర్గాల్లో 10 శాతం మాత్రమే పెళ్లిళ్ల కోసం విదేశీ గమ్యాలను ఎంచుకుంటున్నారు, ఈ విషయంలో థాయ్‌లాండ్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 450–550 భారతీయ పెళ్లిళ్లు జరుగుతున్నాయి’ అని త్యాగరాజన్ వివరించారు. -
ఈసారి రూ.25,000 కోట్లు తెస్తున్న గణపతి!
దేశంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాన్ని పంచే గణేష్ చతుర్థి.. ఏటా వేలాది కోట్ల రూపాయల వ్యాపారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకూ తోడ్పడుతోంది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. దేశంలో ప్రధాన హిందూ పండుగ అయిన గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సారి రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుందని అంచనా. చైనీస్ ఉత్పత్తులను పూర్తిగా పక్కన పెట్టి దేశీయ వస్తువులను వ్యాపారులు ప్రోత్సహిస్తున్న విషయాన్ని వ్యాపారుల సంఘం గుర్తుచేస్తోంది.దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సందర్భంగా జరిగే వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందిస్తుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ఎమిరిటస్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.20 లక్షల గణేష్ మంటపాలుఈ సారి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల గణేష్ మంటపాలు ఏర్పాటైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా తెలిపారు. 7 లక్షలకు పైగా మంటపాలతో మహారాష్ట్ర ముందంజలో ఉండగా, కర్ణాటక 5 లక్షలతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లు ఒక్కొక్కటి 2 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సెటప్, అలంకరణలు, పూజా కార్యక్రమాలకే ఒక్కో మంటపానికి కనీసం రూ.50,000 ఖర్చవుతుందని, మొత్తం ఖర్చు రూ.10,000 కోట్లు దాటుతుందని ఆయన భావిస్తున్నారు.గణేష్ విగ్రహాల వ్యాపారమే రూ. 500 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పూలు, దండలు, కొబ్బరికాయలు వంటి నిత్యావసర వస్తువులు ఆర్థిక వ్యవస్థకు మరో రూ. 500 కోట్లు జోడిస్తాయన్నారు. ఇక లడ్డూలు, ఇతర స్వీట్స్‌కు సంబంధించిన అమ్మకాలు రూ. 2,000 కోట్లకు మించి ఉంటాయని అంచనా. క్యాటరింగ్ వంటి సేవల ద్వారా జరిగే దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుంది.పండుగ సందర్భంగా జరిగే ప్రయాణాలు, బస ఖర్చు సుమారు రూ. 2,000 కోట్లు, పండుగ సంబంధిత వస్తువులైన బట్టలు, ఉపకరణాలు, గృహాలంకరణ, బహుమతి వస్తువుల రిటైల్ విక్రయాలు దాదాపు రూ. 3,000 కోట్లకు చేరవచ్చు. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నాయని బీసీ భార్టియా వివరించారు. -
42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5 లక్షల కోట్లు!
మన దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. జనవరి 15 నుంచి జులై 15 వరకు దేశం మొత్తం మీద సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నట్లు 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. దీని ద్వారా దేశంలో బిజినెస్ పెద్ద ఎత్తున జరిగే సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులై 15 వరకు జరిగే పెళ్లిళ్ల ద్వారా సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ వెల్లడించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రమే 4 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార ఆదాయం సమకూరుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి, ఈ పెళ్లిళ్ల ద్వారా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారాలు జరిగినట్లు తెలిసింది. వ్యాపారుల సంఘం ప్రకారం, ఈ పెళ్లిళ్ల సీజన్లో ఒక్కో పెళ్లికి కనీసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని. సంపన్నులు పెళ్లి చేసుకుంటే ఈ ఖర్చు కోట్ల రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది. ప్రతి వివాహానికి అయ్యే ఖర్చులో దాదాపు 20 శాతం వరుడు, వధువు కుటుంబాలకు ఇద్దరికీ కేటాయించినా.. మిగిలిన 80 శాతం వివాహ ఏర్పాట్లలో పాలుపంచుకున్న థర్డ్ పార్టీ ఏజెన్సీలకు వెళుతుందని సీఏఐటీ అధికారులు వెల్లడించారు. పెళ్లి అనగానే హౌస్ రేనోవేషన్, పెయింటింగ్ వంటివి మాత్రమే కాకుండా.. నగలు కొనుగోలు చేయడం, బట్టలు, ఫర్నిచర్, రెడీమేడ్ వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, వివాహ గ్రీటింగ్ కార్డులు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా సామాగ్రి, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ, ఎలక్ట్రికల్ యుటిలిటీస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! పెళ్లి అవసరాలకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాక.. బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్‌హౌస్‌లు వంటి వివాహ వేదికలు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. వాటిని అలంకరించడానికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం మీదే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. -
Ayodhya: ఆన్లైన్లో ప్రసాదం.. అమెజాన్‌కు నోటీసులు
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ.. ఆధ్యాత్మికం పేరిట ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల హవా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ఫిర్యాదు నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA)అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. శ్రీ రామ మందిర్ అయోధ్య ప్రసాద్.. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్ పేడ.. ఇతరాల్ని అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ మిఠాయిలనే.. అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్లైన్లో అమ్ముతున్నారని.. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్ నిమగ్నమై ఉందని.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్‌పై ఫిర్యాదులో పేర్కొంది సీఏఐటీ. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సీసీపీఏ. మరోవైపు నోటీసులపై అమెజాన్ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించాలి చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
రూ. 50,000 కోట్ల వ్యాపారం.. అంతా రాముని దయ!
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట జనవరి 22న జరగబోతోంది. ఈ పుణ్య తరుణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే భక్తి, ఆధ్యాత్మికతతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారులు, చిరు వర్తకులు రాముని దయతో నాలుగు డబ్బులు సంపాదించుకోబోతున్నారు. రూ. 50,000 కోట్ల వ్యాపారం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగే ప్రస్తుత జనవరి నెలలో భారతదేశం అంతటా రూ. 50,000 కోట్ల వ్యాపారం జరిగేలా దేశానికి సహాయపడుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేస్తోంది. ‘జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్సాహంగా, ఆతృతగా చూస్తున్నారు. ఇది రాముడు, రామ మందిరానికి సంబంధించిన ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేలా దోహదపడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని సభ్య వ్యాపారులు విస్తృతమైన సన్నాహాలు చేశారు’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నట్లుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువులు ఇవే.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం.. ప్రత్యేకమైన కండువాలు, లాకెట్లు, కీ చైన్లు, రామ మందిర నమూనాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు మొదలైన వాటికి దేశమంతటా ప్రస్తుతం గణనీయమైన డిమాండ్ ఉంది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా గాజులు, పెండెంట్లు వంటి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు రామమందిర చిత్రాలను కలిగిన కుర్తాలు, టీ షర్టులు, ఇతర దుస్తులకు బలమైన మార్కెట్ డిమాండ్ ఉన్నట్లు సీఏఐటీ చెబుతోంది. -
మాల్దీవుల బాయ్‌కాట్‌కు పిలుపు
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవ్స్–ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపిచ్చింది. భారతప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు సహించబోమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇందుకు నిరసనగా మాల్దీవ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్‌ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. ఇదీ చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. -
దేశంలో ఏకంగా 38 లక్షల వివాహాలు.. ఈ సీజన్లో ఖర్చు ఎంతో తెలుసా?
దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. దేశంలోని వివిధ నగరాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నవంబర్ 23న పునఃప్రారంభమై 2024 మార్చి మొదటి వారం వరకు మొత్తం 38 లక్షలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. వీటి కోసం 4.74 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు. ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో వివాహాలు జరుగుతుండడంతో.. వ్యాపారం సైతం అదే స్థాయిలో జరుగుతుందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 26 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలోని వ్యాపారులు, రిటైలర్ల నుంచి సేకరించిన సమాచారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పెళ్లిళ్ల వ్యాపారం గరిష్టంగా రూ. 4.74 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇక, గత సీజన్లో జరిగిన మొత్తం పెళ్లిళ్ల సీజన్ వ్యాపారం కంటే ఈ సంఖ్య దాదాపు 26 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో దాదాపు 3.2 మిలియన్ల వివాహాలు జరగ్గా.. తద్వారా జరిగిన వ్యాపారం విలువ రూ. 3.75 లక్షల కోట్లు. ఢిల్లీలోనే అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ సీజన్ లో 4 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయని, దీంతో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సుమారు 7 లక్షల వివాహాలు జరగ్గా.. ఒక్కొక్క పెళ్లి రూ. 3 లక్షలు, రూ.6 లక్షలు, రూ.8లక్షల ఖర్చవుతుంది. రూ.కోటి కంటే ఎక్కువ ఖర్చుతో దాదాపు 10 లక్షల వివాహాలకు ఒక్కోదానికి రూ. 10 లక్షల చొప్పున ఖర్చు కాగా.. రూ.15 లక్షలతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ.25 లక్షలతో 5 లక్షల పెళ్లిళ్లు. రూ. 50 లక్షలతో 50 వేల వివాహాలు, రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుతో 50 వేల వివాహాలు జరగనున్నాయి. -
ఈసారి రూ. 4.7 లక్షల కోట్ల వ్యాపారం..
న్యూఢిల్లీ: ఈసారి పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం భారీగా జరుగుతుందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, ఇతరత్రా సర్విసులపై వినియోగదారులు రూ. 4.74 లక్షల కోట్ల మేర వెచ్చించే అవకాశం ఉందని భావిస్తోంది. గత సీజన్లో నమోదైన రూ. 3.75 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు అధికం. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న వివాహాల సీజన్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగొచ్చని భావిస్తున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం సందర్భంగా తెలిపారు. ‘గతేడాది సుమారు రూ. 3.75 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈసారి ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు మేర పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. దేశ ఎకానమీకి, రిటైల్ వ్యాపారానికి కూడా ఇది మంచిదే‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో 23, 24, 27, 28, 29 తేదీల్లో, అలాగే డిసెంబర్లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పైగా పెళ్లిళ్లు ఉంటాయని, వీటితో రూ. 1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ తెలిపారు. -
దీపావళి ధమాకా!
న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు. ఇలా ఖర్చు చేశారు.. కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జోష్.. రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే.. ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
Indian Marriages: 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం..!
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో మరపురాని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈ బంధాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా భావిస్తారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల కలలకు తగ్గట్టుగా ఉన్నంతలో ఘనంగా చేయాలని ఆరాటపడతారు.. ఇందులో భాగంగానే బంధువులు, స్నేహితుల్లో ఎవరూ చేయని విధంగా పెళ్లిజరపాలనే తలంపుతో వైభవాన్ని చాటేలా చేస్తున్నారు. ఇదంతా ఎప్పుడూ జరుగుతూ ఉన్నా.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు అంచనాలకు మించి ఆకాశాన్నంటుతున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఈ సంవత్సరం పెళ్లిళ్ల సీజన్లో కేవలం 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. సదరు నివేదిక ప్రకారం.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు 35లక్షల వివాహాలు జరగనున్నాయి. ఈ వివాహాల వల్ల సంబంధీకులు జరిపే కొనుగోళ్లు, ఇతర సేవలు కలిపి రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వే తెలిపింది. ఈ ఏడాది మొత్తం పెళ్లిళ్లలో 10 శాతం అంటే 3.5 లక్షల పెళ్లిళ్లు ఒక్క దిల్లీలోనే ఉంటాయని అంచనా. మొత్తం వివాహాల్లో 50వేల మంది లగ్జరీ కేటగిరీలో ఉండనున్నారు. వారు కనీసం రూ.1కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారని నివేదిక చెబుతుంది. మరో 50వేల పెళ్లిళ్లకు ఒక్కో దానికి రూ.50 లక్షల వరకు ఖర్చులు ఉంటాయి. అయితే దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు సుమారు రూ.25లక్షలు ఖర్చు చేయనున్నట్లు సర్వే వెల్లడించింది. 12లక్షల వివాహాలకు రూ.10 లక్షలు, మరో 10 లక్షల వివాహాలకు రూ.6 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. గత సంవత్సరం అదే 23 రోజుల సమయంలో మొత్తం 3.2 మిలియన్ల వివాహాలు జరిగాయి. ఫలితంగా రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం నమోదైందని సీఏఐటీ సర్వే చెప్పింది. మధ్యతరగతి వివాహ వేడుకకు అయ్యే ఖర్చు సుమారుగా ఇలా.. కల్యాణ మండపం అద్దె(రోజుకు): రూ.2లక్షలు పూల అలంకరణ, ఇతర వినియోగాలుఖ: రూ.1.50లక్షలు భోజనం నిమిత్తం(క్యాటరింగ్):రూ.1.80క్షలు వంట మనుషులు, సహాయకుల ఖర్చులు: రూ.30వేలు కిరాణా సరకులు: రూ.60వేలు కూరగాయల ఖర్చు: రూ.30వేలు సన్నాయి వాయిద్యాలకు: రూ.20వేలు డ్రింకింగ్ వాటర్: రూ.2వేలు సలాడ్, పాన్, ఐస్‌క్రీం: రూ.25వేలు కార్మికులు, సహాయకులకు: రూ.5వేలు జనరేటర్: రూ.7వేలు విద్యుత్తు లైట్లు, అలంకరణ: రూ.30వేలు ఫొటో, వీడియోగ్రాఫర్: రూ.60వేలు ఇవికాకుండా బంగారు ఆభరణాలు, బంధువుల కానుకలు అదనం. -
మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి యాడ్ వివాదంలో చిక్కుకున్నారు. బిగ్‌బీ నటించిన తాజా ప్రకటన ఒకటి వివాదాస్పద మైంది. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ కోసం ఇటీవల ఆయన చేసిన ప్రకటన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉందంటూ వ్యాపార సంఘం మండిపడింది. అంతేకాదు మోసపూరితంగా వినియోగదారులను ప్రభావితం చేస్తున్న ఈ యాడ్ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అమితాబ్ బచ్చన్‌కు లేఖ రాసింది. Shri @SrBachchan ji, STOP HURTING SMALL BUSINESSES! You are the greatest showman of Bharat, which also means you have tremendous responsibility towards the nation and the citizens. In this advertisement for Flipkart you are demeaning the retailers of our nation by making… pic.twitter.com/wtHQkuw8M2 — Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) September 30, 2023 ఫ్లిప్‌కార్ట్ ఇటీవలి ప్రకటన చూసి చాలా నిరుత్సాహపడ్డాం. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేదిగా ఉన్న ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సియాట్ లేఖ రాసింది. దుకాణదారుల వద్ద డీల్‌లు , ఆఫర్లు అందుబాటులో లేవని, తద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే. ఏ కారణంతో అలాంటి మాటలు చెప్పారో వివరించాలని కోరింది.అలాగే తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు లేదా ద్రవ్య లాభాల కోసం ప్రకటనలతో కస్టమర్లను ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మళ్లించడం మానుకోవాలంటూ అభ్యర్థించింది. మొబైల్ రీటైల్ అసోసియేషన్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవైపు దుకాణదారుల జీవనోపాధిని అనైతికంగా ,అన్యాయంగా ప్రభావితం చేస్తూనే మరోవైపు కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నందున, ప్రకటనను ఉపసంహరించు కోవాలని కోరింది. 📢 AIMRA India condemns the misleading advertisements by @SrBachchan for #Flipkart, and millions of shopkeepers seek immediate correction! 🛍️ We expect our Mahanayak to stand by the country's traders and avoid damaging their business with deceptive ads. 🙏 #StopMisleadingAds… pic.twitter.com/5Ex9Y6jINC — ALL INDIA MOBILE RETAILERS ASSOCIATION (@AimraIndia) September 29, 2023 జాగో గ్రాహక్ జాగో నినాదానికి తూట్లు పొడుస్తున్న ఫ్లిప్‌కార్ట్ యాడ్‌పై CAIT , AIMRA డిమాండ్‌ను అమితాబ్ పట్టించుకోలేదంటూ సియాట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీనిపై ఫ్లిప్‌కార్ట్ , లేదా బిగ్‌బీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. Deep regrets that Shri @SrBachchan has ignored the demand of @CAITIndia & @AimraIndia for rejecting his endorsement on #Flipkart which has caused irreparable damage to the integrity of traders though @jagograhakjago has laid down a policy for not running any deceptive &… — Praveen Khandelwal (@praveendel) October 1, 2023 -
ఈ–కామర్స్ నియంత్రణకు వ్యవస్థ: సీఏఐటీ డిమాండ్
న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెబీ, ఆర్బీఐ మాదిరిగా ఈ–కామర్స్ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్ పాలసీ–2018 ప్రెస్ నోట్–2 స్థానంలో కొత్త ప్రెస్ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది. -
సెబీ మాదిరిగా..ఈ - కామర్స్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి..సీఏఐటీ డిమాండ్
న్యూఢిల్లీ: పటిష్ట ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంతోపాటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెబీ, ఆర్బీఐ మాదిరిగా ఈ–కామర్స్ వ్యాపార నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించడంతోపాటు ఎఫ్‌డీఐ రిటైల్ పాలసీ–2018 ప్రెస్ నోట్–2 స్థానంలో కొత్త ప్రెస్ నోట్‌ను విడుదల చేయాలని అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడంతోపాటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని సీఏఐటీ కోరింది. -
40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!
పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గతంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే పరిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్, డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ వివాహాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో, మార్కెట్లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022. Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q — Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022 చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
'మెట్రో'కు భారీ షాక్, వేలకోట్ల లాభాలే లక్ష్యంగా!
న్యూఢిల్లీ: మెట్రో ఏజీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిధులు మళ్లించుకునే క్రమంలో ఉందని అఖిల భారత రిటైలర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రో ఆరోపణలు చేసింది. మెట్రో ఏజీ భారత వ్యాపార విభాగం మెట్రో క్యాష్ అండ్ క్యారీ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఇవి తప్పుడు ఆరోపణలు అని, హాని కలిగించే ఉద్దేశ్యంతో చేస్తున్నవిగా మెట్రో ఏజీ ఖండించింది. మెట్రో ఏజీ 2003లో భారత్‌లోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 31 మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్‌లో వ్యాపారాన్ని విక్రయించి వెళ్లిపోయే సన్నాహాల్లో ఉంది. అమెజాన్, రిలయన్స్ రిటైల్, సీపీ గ్రూపు తదితర సంస్థలు బిడ్ వేసే యోచనతో ఉన్నాయి. ఈ క్రమంలో సీఏఐటీ ఆరోపణలు, అభ్యంతరాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘మీడియా కథనాల ప్రకారం మెట్రో జర్మనీ భారత వ్యాపారాన్ని విక్రయించి, తన పెట్టుబడులపై రూ.10,000 కోట్లకు పైగా లాభాలను పొందాలనుకుటోంది. భారత్‌లో గత సంవత్సరాల్లో భారీ లాభాలను సమకూర్చుకున్న మొత్తాన్ని దారి మళ్లించడమే ఇది. మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీ (హోల్‌సేల్) రూపంలో బీటుసీ (బిజినెస్ టు కస్టమర్/రిటైల్) వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది ఫెమా, జీఎస్టీ చట్టాలను ఉల్లంఘించడమే. వ్యవస్థలను అపహాస్యం చేయడం. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే సంస్థలు కస్టమర్ల నుంచి పన్ను రిజిస్ట్రేషన్ ఆధారాన్ని తీసుకోవాలి. కానీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా బోగస్ పన్ను రిజిస్ట్రేషన్ కార్డులను తన స్టోర్లకు వచ్చే కస్టమర్లకు జారీ చేసి నిబంధనలను పాతరేసింది’’అని సీఏఐటీ ప్రకటన విడుదల చేసింది. ఈడీ దర్యాప్తు దీనిపై మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేసినట్టు సీఏఐటీ ప్రకటించింది. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఉల్లంఘనలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈడీ త్వరలోనే తన దర్యాప్తు పూర్తి చేసి కనీసం మెట్రో ఇండియాపై రూ.12,000 కోట్ల వరకు జరిమానా విధించొచ్చని పేర్కొంది. సీఏఐటీ ఆరోపణలను మెట్రో ఏజీ ఖండించింది. సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘గత 19 ఏళ్ల భారత కార్యకలాపాల్లో నియంత్రణపరమైన నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ, భారత చట్టాలను అనుసరించడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు ఉంది. కనుక స్వార్థ ప్రయోజనాల కోణంలో చేసిన తప్పుడు, హానికారక ఆరోపణలను ఖండిస్తున్నాం’’అని పేర్కొన్నారు. -
దేశంలో దుమ్మురేపిన హోలీ అమ్మకాలు, చైనాకు రూ.10వేల కోట్ల నష్టం!
దేశంలో హోలీ అమ్మకాలు సరికొత్త రికార్డుల నమోదు చేశాయి. కరోనా భయం తొలగి, ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారని..తద్వారా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో హోలీ అమ్మకాలు 30శాతం పెరిగాయని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. అదే సమయంలో చైనాకు రూ.10వేలకోట్ల నష్టం వాటిల్లినిట్లు సీఏఐటీ తెలిపింది. మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశ రిటైల్ రంగానికి ఈ ఏడాది హోలీ అమ్మకాలు ఒక వరంలా మారాయని సీఏఐటీ తెలిపింది."హోలీ పండుగ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే వ్యాపారంలో దాదాపు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.అంచనా ప్రకారం..హోలీ సందర్భంగా దేశంలో సుమారు రూ.20వేల కోట్ల వ్యాపారం జరిగిందని" ట్రేడ్ బాడీ తెలిపింది. అంతేకాకుండా, ఏడాది దేశీయ మార్కెట్లో చైనా వస్తువుల అమ్మకాలు జరగలేదని స్పష్టం చేసింది. గతంలో దేశీయ మార్కెట్లో చైనా ఉత్పుత్తుల హవా ఉండేది.హోలీ వేడుకల సందర్భంగా రూ.10వేల కోట్లు జరిగేవి. కానీ ఈ ఏడాది భారత్ మార్కెట్లో చైనా ఉత్పుత్తులు అమ్మకాలు జరగలేదని సీఏఐటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక హోలీకి ప్రధానంగా రంగులు, బొమ్మలు, బెలూన్లు, హెర్బల్ కలర్స్,గులాల్, వాటర్ గన్, బెలూన్లు, చందన్, డ్రెస్ మెటీరియల్ వంటి దేశీయ వస్తువులు భారీ అమ్మకాలను నమోదు చేసుకున్నాయని చెప్పారు. మరోవైపు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్, టెక్స్టైల్స్, పువ్వులు, పండ్లు, బొమ్మలు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, కిరాణా, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పూజా సామాగ్రి మొదలైనవి కూడా విపరీతమైన అమ్మకాలు జరిపి భవిష్యత్తులో దేశీయ మార్కెట్‌కి మంచి రోజులొచ్చాయనే సంకేతాలిచ్చినట్లైందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. హోలీ రోజున మంచి అమ్మకాలను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారులు ఏప్రిల్-మేలో రాబోయే వివాహ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది భవిష్యత్ రోజుల్లో జరిగే వ్యాపారాలకు మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా 40వేల వాణిజ్య సంఘాలు,8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సీఏఐటీ పేర్కొంది. కరోనా నుంచి దేశం సురక్షితంగా ఉన్నందునే హోలీ వేడుకలు ఘనంగా జరిగాయని ఖండేల్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్‌పై ఆగ్రహం..! -
Omicron impact: పెళ్లిళ్లపై ఒమిక్రాన్ పంజా, వ్యాపారం కుదేలు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, ఫంక్షన్లపై కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపనుందా? 2021లో పెళ్లి ముహూర్తాలు జోరుగా సాగాయన్న సంతోషం ఎంతో కాలం నిలవకముందే తాజాగా ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాలా? వద్దా , గెస్ట్ల్లో ఎవర్ని తగ్గించాలి రా బాబూ అనే మీమాంసలో పడిపోయారు జనం. మరోవైపు ఈ కల్లోలంతో పెళ్లిళ్ల సీజన్ కోసం ముస్తాబవుతున్న ఫంక్షన్ హాల్స్ వెలవెలబోనున్నాయనే భయం బిజినెస్ వర్గాలను వెంటాడుతోంది. ఈ సీజన్‌పై ఆధారపడ్డ ఇతర వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? నిపుణులు ఏమంటున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింటాసాటి అనే మురారి సినిమాలోని పెళ్లి పాట గుర్తుందా.. బ్యాండ్ బాజా బారాత్ అంటూ ఆ లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఈ కాలపు పెళ్లీడు పిల్లలు ముచ్చపడుతుంటారు. అలాగే ఆకాశమంత పందిరి, భూదేవి అంతపీట వేసి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభోగంగా పెళ్లి వేడుకను సంబరంగా జరిపించాలని పేరెంట్స్ కూడా కోరుకుంటారు. అయితే కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ క్షణంలో కేసులు పెరుగుతాయో..ఏ నిమిషంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి 2022లో కూడా వెంటాడుతోంది. జనవరి -మార్చి నెలల కాలాన్ని శుభప్రదమైన పెళ్లిళ్ల సీజన్‌గా భావిస్తాం. పరిశ్రమ అంచనాల ప్రకారం జనవరి 14, మార్చి 31 కాలంలో 30 లక్షల ముహూర్తాలు ఖరారైనాయి. తద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని భావించారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, మ్యారేజ్ లాన్లు, ఫామ్‌హౌస్‌లు తదితరాలు పూర్తి స్థాయిలో ముస్తాబయ్యాయి. అంతేనా ఫైవ్ స్టార్ హోటల్స్, క్యాటరింగ్, డెకరేషన్, క్రాకరీ, లాజిస్టిక్స్, వీడియోగ్రాఫర్లు, బ్యాండ్లు, డీజేలు, లైటింగ్, టెంట్లు, ఇలా ఎండ్-టు-ఎండ్ వెడ్డింగ్ సొల్యూషన్స్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక పట్టు వస్త్రాలు, డిజైనర్ దుస్తులు, వెండి బంగారు, ఇతర ఆభరణాలు, పాదరక్షలు తదితర వ్యాపారాలు సీజన్‌కు తగ్గట్టుగా ఫుల్‌గా ప్రిపేర్ అయిపోయాయి. కానీ తాజా పరిస్థితులు సంబంధిత వ్యాపారాలను దెబ్బతీయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల ఉధృతి, ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందన్న నిపుణుల హెచ్చరికలతో పెళ్లిళ్ల వాయిదాకు లేదా, సాధ్యమైనంత తక్కువ మందితో ఆ వివాహ తంతును ముగించేందుకు జనం సిద్ధపడుతున్నారు. ఈ మేరకు తమ ఇప్పటికే క్యాన్సిలేషన్ ఆర్డర్లు చాలా వచ్చాయని వెడ్డింగ్ ప్లానర్లు తెలిపారు. ఈ సీజన్లో వెడ్డింగ్ బిజినెస్ నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి 1.5 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ సారి సీజన్ బావుంటుందని భావించాం కానీ, పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది, జనవరిపై ఆశల్లేవు అంటూ ఫెర్న్స్ అండ్ పెటల్స్ ఎండీ, వ్యవస్థాపకుడు వికాస్ గుట్గుటియా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2020లో నాటి తీవ్ర ప్రభావం ఉండక పోవచ్చని మాట్రిమోనీ.కాం ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా షిప్ట్ వెడ్డింగ్స్‌పై జంటలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. పెళ్లిళ్లను వాయిదా వేయకుండా, వేదిక మార్చుకోవడమో, బ్యాచ్‌ల వారీగా అతిథులను అనుమతించి వేడుకను ముగించుకొని, ఆ తరువాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చుకునే అవకాశముందని నమ్ముతున్నామన వెడ్డింగ్‌వైర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్-మార్కెటింగ్ అనమ్ జుబైర్ అన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది.దీంతో కేసులు లోడ్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేయగా, రాజస్థాన్‌లో ఇది 100గా ఉంది. ఢిల్లీలో 20 మంది అతిథులకు మాత్రమే అనుమతి. రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ సీజన్ వ్యాపారంపై ప్రభావం భారీగాపడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్లిళ్లు !
అయ్యా, గట్టి మేళం మోగించండి.. తలంబ్రాలు సిద్ధం చేయండి.. వివాహ భోజనంబు..చందన తాంబూలాలు, పూలు, పండ్లు రెడీ ‘విజయవాడకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తన కుమారుడికి ఈఏడాది మొదట్లో ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో కరోనా రెండో విడత కమ్ముకొచ్చింది. ఆయన యత్నాన్ని ఆదిలోనే దెబ్బతీసింది’.. ‘కెనడాలోని టొరంటోలో పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మధ్య తరగతి యువకుడికి కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. ముందనుకున్న ప్రకారం మే నెలాఖరులో వివాహం జరగాల్సి ఉంది. కానీ కరోనా ఆంక్షలు అడ్డం వచ్చాయి.అయితే ఇప్పుడవి తొలగిపోయాయి. – సాక్షి, అమరావతి కరోనా కారణంగా విధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించడం.. పెళ్లిబంధంతో ఒక్కటవుదామనుకుంటున్న యువతీ యువకుల నెత్తిన అక్షింతలయ్యాయి.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది ఇళ్లలో పెళ్లి భాజాభజంత్రీలు మోగుతున్నాయి. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రుల పలకరింపులు, ఆనంద వినోదాలతో పెళ్లింట కొత్త శోభ సంతరించుకుంటుంది. ఏదేమైనా..ఎక్కడ చూసినా.. రెండేళ్ల నాటి పరిస్థితులు మళ్లీ ఊపందుకుంటున్నాయనేది స్పష్టమవుతున్నది. కలిసొచ్చిన వ్యాక్సినేషన్.. కరోనా వైరస్ మహమ్మారి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో దాదాపు పూర్తి కావడం ఇందుకు ప్రధాన కారణం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో 98.86 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం జనం గుమికూడడంపై ఆంక్షలు సడలించింది. ఈ అవకాశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు పెద్దఎత్తున పెళ్లిళ్లకు గేట్లు బార్లా తెరిచారు. నెల వ్యవధిలో లక్షకు పైమాటే.. అఖిల భారత ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 13వతేదీ లోపు దాదాపు 26 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. కాగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని తెలుస్తున్నది. ఆగస్టులో కరోనా ఆంక్షల్ని స్వల్పంగా సడలించినప్పుడు 13 రోజుల్లో 47 వేలకు పైగా పెళ్లిళ్లు జరగడమే ఈ అంచనాకు ప్రాతిపదిక. ఆంధ్రాలో ఆది నుంచీ ఆడంబరమే.. ఇల్లుకట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత మనకు ఉండనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రాలో పెళ్లిళ్లకు పెట్టే ఖర్చు, ఆడంబరాలు ఆది నుంచీ ఎక్కువే. ముహూర్త బలానికి గిరాకీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు ఖాళీలు లేకుండా పోయాయి. నవంబర్ 21, 27, 28, డిసెంబర్ 8 తేదీల్లో స్టార్ హోటళ్లలోని హాళ్లు ఖాళీలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలామంది కార్తీక మాసంలోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడతారని పెళ్లిళ్ల పేరయ్యలు చెబుతున్నారు. ధరలు మండిపోతున్నాయి.. ఈ పెళ్లిళ్లు, కార్తీకమాసం పేరిట కూరగాయల ధరలు పెరిగిపోయాయని విజయవాడకు చెందిన ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎం.చంద్రశేఖర్ వాపోయారు. మంచి ముహూర్తం ఉన్న ఏ రోజూ కూరగాయలు దొరకడం లేదన్నారు. కిలోకి రూ.60,70 పెట్టనిదే ఏ కూరగాయా దొరకడం లేదని, చివరకి గోంగూర కట్ట రూ.10 అయిందని వాపోయారు. కార్తీకమాసం, మంచి ముహూర్తాలు కలిసి రావడంతో ఈవెంట్ మేనేజ్మెంట్లకు గిరాకీ పెరిగింది. కరోనా కాలంలో చిన్నా చితకా ఫంక్షన్లు చేసి మహాఅయితే ఏ 40,50 మందికో భోజనాలు ఏర్పాటు చేసిన వీళ్లకు ఇప్పుడు చేతినిండా పని దొరికినట్టయిందని విజయవాడకు చెందిన ఈవెంట్ మేనేజర్ శ్రీనివాసరావు చెప్పారు. బట్టలు, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పూల వ్యాపారుల పంట పడింది. పెళ్లి కుమారులు, కుమార్తెలు జిగేల్ జిగేల్ మంటూ మెరిసిపోతున్నారు. వేద పండితులకు, సన్నాయి వాయిద్య కళాకారులకు గిరాకీ పెరిగింది. ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్మేన్ల కొరత కనిపిస్తోంది. మొత్తం మీద ఖర్చుమాత్రం తడిసిమోపెడవుతున్నా ఎవ్వరూ ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. పెళ్లి వేడుకల్లో గట్టి మేళాలు మోగుతున్నాయి. -
CAIT Diwali sales: దేశీ తడాఖా.. చైనాకు రూ.50 వేల కోట్ల నష్టం!
సరిహద్దు వివాదాలు చైనాకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆశించినంత వేగంగా కాకపోయినా క్రమంగా చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత మొదలవుతోంది. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పదేళ్ల రికార్డు బ్రేక్ దీపావళి పండగ వెలుగులు పంచింది. వ్యాపారుల గల్లా పెట్టెని గలగలమనిపించింది. పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వ్యాపారం పుంజుకుంది. ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) జారీ చేసిన గణాంకాల ప్రకారం దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గడిచిన పదేళ్లలో ఈ స్థాయిలో బిజినెస్ ఎన్నడూ జరగలేదు. రిఫ్రెష్ అయ్యారు ఏడాదిన్నర కాలంగా కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా భయాలు తొలగిపోతుండటం, త్వరలోనే పెళ్లిల సీజన్ మొదలవుతుండటంతో జనం షాపింగ్‌కు మొగ్గు చూపారు ఫలితంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కరోనా ఒత్తిడి నుంచి జనాలు రిఫ్రెష్మెంట్ కోరుకున్నారని, దాని ఫలితమే ఈ స్థాయి అమ్మకాలు అని కైట్ అంటోంది. Wow - a very happy #Diwali indeed! #Retail Diwali sales notched a record Rs1.25L crore - a 10 yr high per #CAIT. Shoppers gorged on sweets, dry fruits besides buying diyas, candles, watches, toys, clothing, home decor & of course Gold jewelry. Even #online sales were up ~24% YoY. pic.twitter.com/uRzeKnamJj — Sachchidanand Shukla (@shuklasach) November 6, 2021 ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్లు దీపావళికి జరిగిన అమ్మకాల్లో ఆన్లైన్ ద్వారా సుమారు 32 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి రూ. 9,000 కోట్ల రూపాయల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. దీపావళి బిజినెస్‌కి సంబంధించి ఒక్క ఢిల్లీలోనే ఏకంగా రూ 25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీపావళి అమ్మకాలకు సంబంధించి డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, హోం డెకార్, ఫుట్‌వేర్, టాయ్స్, వాచెస్‌ల విభాగంలో భారీగా అమ్మకాలు జరిగాయని కైట్ అంటోంది. చైనాకు షాక్ ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) దేశంలో 7 కోట్ల మంది వర్తకులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కైట్ జాతీయ అధ్యక్షుడిగా భార్తీయా, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్లు కొనసాగుతున్నారను. వీరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం.. ఈసారి దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలను, పేపర్ వస్తువులను కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించారు. చైనా వస్తువులు కొనడం కంటే దేశీయంగా స్థానికులు తయారు చేసిన వస్తువులు కొనేందుకే మొగ్గు చూపారు. ఫలితంగా చైనా మేడ్ దీపాలు, ఎలక్ట్రిక్ లైట్లకు గిరాకీ పడిపోయింది. ఇక బాణాసంచా విషయంలోనూ ఈ తేడా కనిపించింది. మొత్తంగా దీపావళి వ్యాపారానికి సంబంధించి రూ. 50 వేల కోట్ల వరకు చైనా ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. చైనా వస్తువులు దేశంలోని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. -
భారత్ దెబ్బ.. చైనాకు ఏకంగా 50వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ: భారత్‌ను దెబ్బ తీయాలని నానా ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుత దీపావళి సీజన్లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది. దీంతో చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు సీఏఐటీ తెలిపింది. ఇటీవల గమనించిన ముఖ్యమైన మార్పుని పరిశీలిస్తే.. దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని తేలింది. తాజా పరిణామంతో భారతీయ వినియోగదారుల నేరుగా దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకి ₹2 లక్షల కోట్ల మేర ఇన్‌ఫ్లో రాబోతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సీఏఐటీ చైనీస్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చింది. చదవండి: Exam Result తప్పుగా మెసేజ్ వచ్చింది.. తొందరపడి ప్రాణం తీసుకుంది -
‘ఎవర్నీ వదలం’.. భారత్‌లో పరిణామాలపై అమెజాన్ గరం
న్యూఢిల్లీ: భారత్‌లోని కొందరు లీగల్ ప్రతినిధులపై వచ్చిన లంచం ఆరోపణలను అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సీరియస్‌గా తీసుకుంది. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆరోపణలను నిర్ధారించడం గానీ లేదా ఖండించడంగానీ చేయని అమెజాన్..‘అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము‘ అని పేర్కొంది. ది మార్నింగ్ కాంటెక్ట్స్ అనే పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత్‌లో ప్రభుత్వాధికారులకు తమ లీగల్ ప్రతినిధులు కొందరు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అమెజాన్ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో సీనియర్ కార్పొరేట్ కౌన్సెల్‌ను సెలవుపై పంపించింది. దీనిపైనే కంపెనీని వార్తా సంస్థలు సంప్రదించగా.. ఆరోపణలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయబోమని, విచారణ ప్రస్తుతం ఏ దశలో ఉందో చెప్పలేమని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. విదేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు కోసం తమ సిబ్బంది ఎవరైనా ఆయా దేశాల ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చినట్లు ఆరోపణలు వస్తే.. అమెరికన్ కంపెనీలు వాటిని తీవ్రంగా పరిగణిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐతో విచారణ జరిపించాలి: సీఏఐటీ మరోవైపు, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన వ్యవహారమని, అన్ని స్థాయిల్లో అవినీతి పేరుకుపోయిందన్న భావనను తొలగించేందుకు ప్రభుత్వం దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు లేఖ రాసింది. అమెజాన్ లీగల్ ప్రతినిధుల మీద లంచాల ఆరోపణల అంశాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) చైర్మన్ గ్యారీ గెన్సలర్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసే శక్తుల నుంచి దేశీ ఈ–కామర్స్ మార్కెట్‌ను కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలను దెబ్బ తీసే విధంగా చౌక ధరలు, తన ప్లాట్‌ఫాంపై కొందరు విక్రేతలకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర విక్రేతల అవకాశాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో అమెజాన్ మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేస్తున్న తరుణంలో కంపెనీ ఈ వివాదంలో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఫ్యూచర్ గ్రూప్‌లో ఇన్వెస్టరయిన అమెజాన్.. ఆ సంస్థ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కుదుర్చుకున్న ఒప్పందంపై న్యాయపోరాటం కూడా చేస్తోంది. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టుల్లో అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ పరస్పరం దావాలు వేశాయి. చదవండి: చైనాకు అమెజాన్ భారీ షాక్ -
అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి
అమెజాన్ ఇండియా స్థానిక కార్యకలాపాలను నిషేధించాలని భారతీయ చిల్లర వ్యాపారుల బృందం బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో భారతీయ చిరు వర్తకులకు వ్యాపార కలాపాల విషయంలో మోసాలు, అన్యాయాలకు పాల్పడినట్లు రాయిటర్స్ నివేదించింది. కఠినమైన విదేశీ పెట్టుబడి నిబంధనలను తప్పించుకునేందుకు భారత చట్టాలను ఉల్లంఘించినట్లు సీఐఐటి తెలిపింది. భారతదేశంలో 80 మిలియన్ల రిటైల్ దుకాణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) ఒక ప్రకటనలో రాయిటర్స్ కథనంలోని "దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడి" అయ్యాయి కాబట్టి భారతదేశంలో అమెజాన్ కార్యకలాపాలను వెంటనే నిషేధించడానికి ఈ సమాచారం సరిపోతుంది అని పేర్కొంది. "కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ అన్యాయమైన, అనైతికంగా వాణిజ్యాన్ని నిర్వహించడానికి భారతదేశం యొక్క ఎఫ్ డిఐ[ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్] చట్టాలను ఉల్లఘించినట్లు సిఐఐటి తెలిపింది. అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) కొన్ని సంవత్సరాలుగా వాణిజ్యశాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తుంది. ఈ సమాచారాన్ని ఈడీకి చేరవేసింది డీపీఐఐటీ. ఈ క్రమంలోనే అమెజాన్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. భారతీయ చిల్లర వ్యాపారుల బృందం దేశ బహిష్కరణ ప్రకటనలపై అమెజాన్ స్పందించలేదు. కానీ, సిఏఐటి అమెజాన్ నిషేధానికి పిలుపునిచ్చిన కొద్దికాలానికే రాయిటర్స్ నివేదికపై అమెజాన్ స్పందించింది. "ఇది ఆధారాలు లేని, అసంపూర్ణమైన, అసత్య ప్రచారం అని విమర్శించింది. అమెజాన్ భారతీయ చట్టాలకు లోబడి ఉంది అని" పేర్కొంది. "గత కొన్ని సంవత్సరాలుగా (ఎ) నిబంధనలలో అనేక మార్పులు జరిగాయి. అమెజాన్ ప్రతి సందర్భంలోనూ సమ్మతిని నిర్ధారించడానికి వేగంగా చర్యలు తీసుకుంది. అందువల్ల ఈ కథనం పాత సమాచారం ఉన్నట్లు అనిపిస్తుంది" అని తన అమెజాన్ ఇండియా న్యూస్ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. The story is unsubstantiated, incomplete, factually incorrect. Amazon remains compliant with Indian laws. We haven't seen the documents & Reuters hasn't shared provenance to confirm veracity: the details are likely supplied with intent to create sensation & discredit Amazon. 1/3 https://t.co/lblDPxYVCH — Amazon India News (@AmazonNews_IN) February 17, 2021 అమెజాన్ సంస్థకు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. బయటకు లక్షలాది మంది చిరు వర్తకులకు ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది. అమెజాన్ సంస్థ కార్పొరేట్, తన వాటా దారులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిరు వర్తకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది. చదవండి: అమెజాన్ ఇండియా భారీ మోసం! -
అమెజాన్, ఫ్లిప్ కార్టులపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను కేంద్రం ఆదేశించింది. ఈ కంపెనీలు ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999(ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించినందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) చేసిన పలు ఫిర్యాదుల కారణంగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్ ఇదే..!) వివిధ కంపెనీలకు ఇ-కామర్స్ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందంలో బ్రాండ్ రిటైలింగ్ పేరుతో ఏ విదంగా ఎఫ్‌డీఐ పాలసీ, ఫెమా చట్టాలను ఉల్లంఘించాయో తెలియజేస్తూ సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందంలో తయారీలో ఎఫ్‌డీఐ విధానాన్ని ఉల్లంఘించడంతో పాటు వివిధ ఇ-కామర్స్ కంపెనీలు మల్టీ-బ్రాండ్ రిటైలింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు డిపిఐఐటి నాలుగు ఫిర్యాదులను పంపిందని సిఐఐటి తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఫెమా, ఎఫ్‌డిఐ పాలసీలో ఉన్న లొసుగుల ద్వారా చట్టాన్ని ఉల్లంఘించినట్లు సీఏఐటీ తెలిపింది. -
12న అమెజాన్ స్మాల్ బిజినెస్ డే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ డిసెంబరు 12న స్మాల్ బిజినెస్ డే నిర్వహిస్తోంది. స్టార్టప్స్, మహిళా వ్యాపారులు, చేతివృత్తులు, నేతపనివారు, స్థానిక దుకాణదారులకు చెందిన ఉత్పత్తులను ఈ సందర్భంగా విక్రయిస్తారు. డిజిటల్ చెల్లింపులు జరిపితే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీలకు 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. స్మాల్ బిజినెస్ డే ఈ ఏడాది జరుపుకోవడం ఇది రెండవసారి. (రిలయన్స్ డీల్: అమెజాన్‌కు సమన్లు) ఈడీకి లేఖ రాసిన సీఏఐటీ అమెజాన్‌పై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) లేఖ రాసింది. ఉత్పత్తులను అతి తక్కువ ధరల్లో విక్రయిస్తూ కోట్లాది మంది చిన్న వర్తకులకు కష్టాలను తెచ్చిపెడుతోందని లేఖలో పేర్కొంది. ‘అమెజాన్ 2012 నుంచి నిర్లక్ష్యంగా, స్పష్టంగా చట్టాలు, నియమ, నిబంధనలను ఉల్లంఘించింది. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఇతర అనుబంధ కంపెనీలు, బినామీలు మార్కెట్‌ప్లేస్ ఆధారిత విధానం పేరుతో మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇది ఎఫ్‌డీఐ పాలసీ, ఫెమా యాక్ట్‌ను ఉల్లంఘించినట్టే’ అని వివరించింది. -
72 వేల కోట్ల అమ్మకాలు; చైనాకు భారీ నష్టం!
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించింది. దేశంలోని ప్రధాన మార్కెట్ల(పట్టణాల) నుంచి సేకరించిన వివరాల ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ మొత్తంలో టర్నోవర్ జరిగిందని, దీంతో చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్‌జీ, మిట్టల్ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ ప్రచారం నిర్వహించిన ఈ ట్రేడ్‌బాడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి సేకరించిన నివేదిక ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా సుమారు 72 వేల కోట్ల మేర టర్నోవర్ జరిగింది.తద్వారా చైనా మార్కెట్‌కు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయని ఆశిద్దాం’’ అని పేర్కొంది. ఇక పండుగ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి, ఫర్నీచర్, వాల్‌హ్యాంగింగ్స్, బంగారం, ఆభరణాలు, ఫుట్‌వేర్, వాచ్‌లు, దుస్తులు, ఇంటి అలకంరణ సామాగ్రి, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్, గిఫ్ట్ ఐటెంలు, స్వీట్లు తదితర వస్తువలు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. (చదవండి: ఆర్సీఈపీపై సంతకాలు.. చైనా ప్రాబల్యం!) కాగా ఈ ఏడాది జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇక సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో టిక్‌టాక్, వీచాట్ తదితర చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో డ్రాగన్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి.