నవంబర్–డిసెంబర్లో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు
రిటైల్ రంగానికి బిగ్ బూస్ట్: సీఏఐటీ
మధ్యతరగతి సగటు పెళ్లి ఖర్చు రూ. 5–25 లక్షలు
న్యూఢిల్లీ: రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం వధూవరులతో పాటు వ్యాపారులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వివాహాల విషయంలో గెస్ట్‌ల సంఖ్య తగ్గినా ఖర్చు బాజా మాత్రం గట్టిగానే మోగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య 18 రోజుల పాటు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని.. ఈ సీజన్‌లో రిటైల్ రంగంలో రూ.5.9 లక్షల కోట్ల మేర వ్యాపారం ఉంటుందని అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య (సీఏఐటీ) లెక్కగట్టింది. అంతేకాదు ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల మేర వివాహాలు జరుగుతాయని.. రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి ఆస్కారం ఉందని పేర్కొంది.
అతిథుల సంఖ్య తగ్గుతోంది...
వివాహ పరిశ్రమలో ఫ్యాషన్, ట్రావెల్, ఆతిథ్యం ఇంకా ఇతరత్రా సర్వీసులు కలగలిసి ఉంటాయి. ముఖ్యంగా దేశీయంగా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి పెరుగుతుండటంలో ట్రావెల్, ఆతిథ్య రంగానికి ఫుల్ జోష్ లభిస్తోంది. ప్రత్యేకమైన ఫుడ్ మెనూల నుంచి గెస్ట్‌లకు విభిన్నమైన అనుభూతులను అందించడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
‘ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు అతిథుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా మిలీనియల్ జంటలు తమకు అత్యంత దగ్గరి బంధువులు, ఆత్మీయులను మాత్రమే అతిథులుగా పిలుస్తున్నారు. గెస్ట్ లిస్టులో కోత పెట్టినప్పటికీ.. మొత్తంమీద బడ్జెట్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఏటికేడు విహహాల ఖర్చు పెరుగుతూనే ఉంది.
అలంకరణలు, వ్యక్తిగత సర్వీసులు, అతిథుల అభిరుల మేరకు కేటరింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటున్నారు’ అని న్యూఢిల్లీలోని షాంగ్రీలా ఈరోస్ జనరల్ మేనేజర్ అభిõÙక్ సాధూ పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కళకళలాడనుండటంతో ఈ లగ్జరీ హో టల్ చైన్ ‘బంధన్ బై షాంగ్రీలా’ పేరుతో వివా హ సేవలను ప్రారంభించింది.
ఈ హోటల్‌లో సాదారణ స్థాయి పెళ్లి బడ్జెట్ రూ. 25 లక్షలతో మొ దలై కోట్లలోకి వెళ్తోంది. జైపూర్ హయత్ ప్యాలెస్‌లోనూ సాధారణ పెళ్లి బడ్జెట్ రూ.20–30 లక్షలుగా ఉంది.
ఖర్చెంతైనా తగ్గేదేలే...
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం... పెళ్లి ఖర్చు రూ. 25 లక్షల స్థాయి నుంచి ఏకంగా రూ.100 కోట్లకు కూడా వెళ్లే సందర్భాలున్నాయట. విహాహ వేడుకను గ్రాండ్‌గా జరిపించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారని, అవసరమైతే కొందరు ఆస్తులమ్మేందుకూ వెనుకాడటం లేదంటున్నా రు పరిశీలకులు!
మధ్యతరగతి వర్గాల పెళ్లి ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఉంటుందని, ఎగువ మధ్యతరగతి విషయానికొస్తే.. ఇది రూ. 25 లక్షల నుంచి రూ.2.5 కోట్లకు చేరుతోందని వెడ్డింగ్ ప్లానర్ వెడ్డింగ్‌సూత్ర.కామ్ సీఈఓ పార్తీప్ త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐలు) రూ.1.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల స్థాయి లో వెచ్చిస్తున్నారు.
అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల బడ్జెట్ అ యితే ఏకంగా రూ.2.5 కోట్ల నుంచి రూ.100 కోట్లకు కూడా దూసుకెళ్తోంది’ అని ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో అనంత్ అంబానీ–రాధికా మర్చెంట్ వివాహ వేడుక ఖర్చు చూసి (దాదాపు రూ.5,000 కోట్లుగా అంచనా) ప్రపంచమంతా నోరెళ్లబెట్టడం తెలిసిందే!! భారతీయుల పెళ్లిళ్లా మజాకానా అనే రేంజ్‌లో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది.
డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్
బ్రైడల్ మేకప్ నుంచి ఫోటోగ్రఫీ, వేదిక, డెకరేషన్, వెడ్డింగ్ లొకేషన్ వరకూ ప్రత్యేకంగా ఉండాలని యువ జంటలు కోరుకుంటున్నారు. ‘గతంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రూ. 2 లక్షలు వరకు ఒక కుటుంబం ఖర్చు చేస్తే, ఇప్పుడిది రూ. 6 లక్షలకు చేరుతోంది. కొందరు వధువులు టాప్ మేకప్ ఆర్టిస్ట్‌లతో ప్రత్యేకంగా సింగారించుకుంటున్నారు. ఒక్కో ఫంక్షన్‌కు ఖర్చు రూ. లక్ష వరకూ ఉంటోంది’ అని త్యాగరాజన్ తెలిపారు.
ఇక జైపూర్, ఉదయ్‌పూర్, జోద్‌పూర్, గోవా, మహాబలిపురం వంటి డెస్టినేషన్ వెడ్డింగ్ హాట్‌స్పాట్‌లకు క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటోందట! శీతాకాలంలో పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు కూడా ఉండటంతో హోటల్ రేట్లు భారీగా ఎగబాకుతున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా, రాజస్థాన్, గోవా, కేరళ ప్రాచుర్యం కొనసాగుతుండటంతో పాటు ఇప్పుడు డెహ్రాడూన్, రిషికే‹Ù, కూర్గ్ వంటి కొత్త ప్రదేశాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ లిస్టులోకి చేరుతున్నాయి.
‘అత్యంత సంపన్న వర్గాల్లో 10 శాతం మాత్రమే పెళ్లిళ్ల కోసం విదేశీ గమ్యాలను ఎంచుకుంటున్నారు, ఈ విషయంలో థాయ్‌లాండ్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 450–550 భారతీయ పెళ్లిళ్లు జరుగుతున్నాయి’ అని త్యాగరాజన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment