Weddings
-
చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!
భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘మనం రేపటి నుండి రాజకీయంగా ఓటు ద్వారా మనిషికి ఒకే విలువను సాధించుకున్నాం. కానీ సామాజికంగా సమానతను సాధించుకోవాల్సి ఉంది’ అన్నారు. కులమత అంతరాలు ఆర్థిక అసమానతలు, దోపిడీ పీడనలు లేని సమాజాన్ని కలగన్న ఆనాటి మహనీయుల కలలు ఇంకా నెరవేరనే లేదు. భారతదేశ చాతుర్వర్ణ కుల వ్యవస్థ భారత సమాజాన్ని నిలువునా చీల్చిందనీ, కుల నిర్మూలన జరగకుండా, అంధ విశ్వాసాలు తొలగి పోకుండా సమాజం పురోగమించదనీ, ఆ లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ స్ఫూర్తితో సమాజాన్ని పాలకులు ముందుకు నడపాలి. అయితే వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల దొంతరలలోని కులాలను స్థిరీకరిస్తూ, అంతరాలను పెంచి పోషిస్తున్నారు. కులం కట్టుబాట్లను అనుసరించి... తమ ఇష్టానిష్టాలకు భిన్నంగా ఆ యా కులాల్లోనే వివా హాలు చేసుకోవడం ఒకరకంగా దోపిడీకి గురికావడం లాంటిదే. రెండు వందల ఏళ్ల నాడే సావిత్రీబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలేలు ఈ కుల కట్టుబాట్లను తుదమట్టిస్తూ, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్స హించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవా లనుకునే జంటలకు కాని, కులమత అడ్డుకోటలను కూల్చాలనుకునే ప్రేమి కులకు కాని, కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పెళ్లి తంతులు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లిళ్లు చేసుకొనేవారు అనేకమంది విడిపోతున్నారు. ఇవాళ కుటుంబంలో అమ్మాయి పుట్టిందంటే భయపడే పరిస్థితి ఎందుకుంది? ఆమె పెరిగి, పెద్దదై పెళ్లి చేసుకునేదాకా తల్లితండ్రులు భయాందోళనలకు గురికావలసి రావడానికి కారణం ఏమిటి? సమాజంలో పాతుకుపోయిన మనువాదమే కదా. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ (ఏ స్త్రీ కూడా స్వేచ్ఛకు అర్హురాలు కాదు) అనే భావం నరనరాల్లో జీర్ఙించుకున్న సమాజం కదా మనది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా, కుటుంబ పరువును కాపాడవలసిన జీవిగా పురుషాధిక్య సమాజం చూడటం వల్లే... ఆమె కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడుతున్నారు.రాజ్యాంగం మనిషికి స్వేచ్ఛగా బ్రతికే హక్కుని ప్రసాదించింది. ఇష్టమైనవారిని కులమతాల ప్రసక్తి లేకుండా వివాహమాడే స్వేచ్ఛను కల్పించింది. వరకట్నం చట్ట వ్యతిరేకమని తెలిసినా పట్టించుకుంటున్నది ఎంతమంది? కట్నాలు లేకుండా, కులపట్టింపులు లేకుండా తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే వారి మీద కత్తులు నూరటం దుర్మార్గం. ఇవాళ్టి సామాజిక సందర్భంలో పిల్లలు ఒకరిని ఒకరు కలుసు కోవడం, తెలుసుకోవడం, భావి జీవితం గురించి కలలు కనటం అనేది చాలా సహజాతి సహజమైన పరిణామం. ఇందుకు తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాల్సిందిపోయి... వాళ్ళు ఏదో సమాజానికి కీడు చేస్తున్నట్టు నియంత్రించడం తగదు. కులం అనే ఒక కాగితపు పులిని చూసి మనిషి తన కన్న బిడ్డల్ని చంపుకొనే క్రూర జంతువుగా మారడం దారుణం. కుల పెద్దలుగా చలామణీ అయ్యేవారు, నాయకులు కులాంతర వివాహం చేసుకున్న జంటల్ని వెంటాడి వేధిస్తు న్నారు. సినిమాల్లో ప్రేమల్ని, ప్రేమికుల కష్టాల్ని చూసి కన్నీళ్లు కార్చే పెద్దలు, తమ కడుపున పుట్టిన బిడ్డలు తమకి ఇష్టం వచ్చిన అబ్బాయినో, అమ్మాయినో కోరుకుంటే... పరువు పోయిందని హత్యలకు తెగపడటం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో బంటినీ, మిర్యాలగూడలో ప్రణయ్ లాంటి ప్రేమికులనూ చంపడం ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసి ఉంది. ప్రేమ వివాహాలు, కులాంతర పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు చట్టం, సమాజం మద్దతుగా నిలవాలి.తమ ఇష్టాలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడం ద్వారా నిజమైన ప్రేమికుల్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే వాళ్లకు నచ్చకపోతే విడిపోయి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కూడా సమాజం ఇవ్వాలి. కులాంతర వివాహం... మానసిక, శారీరక వైకల్యం లేని క్రియాశీల భవిష్యత్ తరానికి బాటలు వేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహ కాలు పెంచాలి. ఈ జంటలపై దాడులు చేసేవారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే విచారణ చేసి శిక్షించాలి. – ప్రభాకర్ కస్తూరిసమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ‘ 94409 70454 -
పెళ్లెప్పుడవుతుంది బాబూ!
కొడుకంటే మమకారం.. వంశోద్ధారకుడు కావాలన్న ఆశయం.. ఫలితం సమాజంలో తగ్గుతున్న అమ్మాయిల జననం.. దీనికితోడు గొంతెమ్మ కోర్కెలు.. సాఫ్ట్వేర్లు.. మన కనుసైగల్లో మసలుకునే వారు కావాలన్న ఆశలు.. కూతురు, అల్లుడు ఒంటరిగా ఉండాలన్న వధువు తల్లిదండ్రుల షరతులు.. వెరసి పలువురు యువకులు పెళ్లికానీ ప్రసాద్‌లుగా మారుతున్నారు.పలమనేరు: అబ్బాయికి ఆస్తి పాస్తులు.. మంచి ఉద్యోగం.. అందం అన్నీ ఉన్నాయి. వివాహం చేయడానికి వందలాది సంబంధాలు చూస్తున్నారు..అయినా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో 30 ఏ ళ్లు దాటిపోతోందని, అబ్బాయి పెళ్లి జరుగుతుందోలేదోనని అతడి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. గతంలో అమ్మాయి తరఫువారే వరసైన వారికి పెళ్లి చేయించేలా పెద్దలు మాటిచ్చేవారు. ఇక బావా, మరదళ్లు అయితే చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు. కట్నకానుకలపై పెద్దగా పట్టింపులుండేవి కాదు. కానీ రెండు దశాబ్ధాలుగా వ్యవస్థ మారిపోయింది. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు కుదరడం ఆషామాషీ కాదు. అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఉద్యోగం, ఎంత జీతం, ఆస్తిపాస్తులు, సెల్ఫ్ అకౌంట్లో సేవింగ్స్ ఎంత, సొంతంగా సైట్ లేదా సొంత ఇ ల్లు, కారుందా? అనే మాట వినిపిస్తోంది. వివాహానంతరం వారిద్దరే వేరుగా ఉండాలనే మాట అమ్మాయి, వారి తల్లిదండ్రు ల్లో వినిపిస్తోంది. దీంతోపాటు జాతకాలు, అబ్బాయిల వ్యక్తిగత విషయాలపై వే గుల విచారణ ఎక్కువైంది. వీరు అబ్బాయి ఫేస్బుక్, ఇన్స్ట్రా, ఎక్స్‌తోపాటు జీమెయిల్లో సెర్చింగ్ ఆధారంగా గర్ల్ ఫ్రెండ్స్, వారి అలవాట్లను కనుక్కుని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నా రు. దీంతో అబ్బాయిలకు అన్నీ ఉండీ మూడు పదులు దాటినా అమ్మాయిలు దొరక్క వారు పడుతున్న కష్టం కంటే వారి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతంగా మారింది. 5 వేల మంది పెళ్లిళ్ల పేరయ్యలు మ్యాట్రిమోనియల్ సైట్లు, ఆయా కులాలకు చెందిన ప్రత్యేక సైట్లుతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5వేల మందికిపైగా పెళ్లిళ్ల పేరయ్య లున్నారు. వీరందరూ తమ వద్ద వేలాది మంది అబ్బాయిలు, అమ్మాయిల ఫ్రొఫైళ్లు పెట్టుకుని ఇరువర్గాలకు చూపుతున్నా పెళ్లిళ్లు మాత్రం సెట్ కావడం లేదు.కర్షకుడా..? అయితే వద్దులే! సేద్యం చేసుకునే వారికి ఆడబిడ్డ దొరకడం చాలా కష్టంగా మారింది. మరికొన్ని వృత్తి పనులు చేసేవారికి సైతం ఈ సమస్య తప్పడం లేదు. కొన్ని ఉన్నత కులాల్లోనూ అమ్మాయిల దొరకడం కష్టంగా మారింది. ఇంకొందరికి జాతకాలు సెట్కాలేదనే కారణం కనిపిస్తోంది. గతంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు లింగవివక్ష కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిల సగటు తగ్గుతోంది. నిఘా వర్గాలతో కొన్ని సంబంధాలు విఫలం తమ పిల్లను పలానా వాళ్లు అడిగారు, వారి అబ్బాయి మంచోడేనా కనుక్కోవాలని పెళ్లి కుమార్తె తరఫువారు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. దీంతో వారు ఓకే అంటే పర్వాలేదు గానీ.. అబ్బాయికి ఎదో అలవాట్లున్నాయని, లేదా చెప్పిన జీతం అంత లేదని, అసలు సాఫ్ట్వేర్ కాదని, ఏదో విషయంలో తప్పులు చెప్పారని సమాచారం ఇస్తే ఇక పెళ్లి కథ కంచికి చేరుతోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాలే!గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మా ట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్‌కు వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో బంధువుల ఉన్నప్పటికీ మాట మంచీ లేకుండా పోతోంది.చదవండి: ‘లైవ్’ కోడి స్పెషల్!పెళ్లిళ్లు సెట్ చేయడం చాలా కష్టం గతంలో ఎన్నో పెళ్లిళ్లు సెట్ చేశాం. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎన్నో షరతులు పెడుతున్నారు. గతంలో అబ్బాయి, అమ్మాయి ఫొటోలు చూసి పెళ్లికి ఒప్పుకొనేవారు. ఇప్పుడలా కాదు ఇరువర్గాలు మొత్తం విచారించుకుని, నచ్చితేనే ఓకే అంటున్నారు. నేడు పెళ్లి కుమా ర్తె డిమాండ్లను తీర్చడం ఆషామాషీ కాదు. –త్యాగరాజులు, ఎస్ఎల్వీ మ్యారేజి లింక్స్ నిర్వాహకులు, పలమనేరుఅమ్మాయిల సంఖ్య తక్కువ అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. వారికి కావాల్సిన మేరకు అ మ్మాయిలు దొరకడం లేదు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఒ ప్పుకుంటే పెళ్లి ఠక్కున జరిగేవి. ఇప్పుడలాకాదు అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఎన్నో డిమాండ్లు పెడుతోంది. అంతా సాఫ్ట్వేర్లే కావాలంటున్నారు. సేద్యం చేసుకునే వాడిని పెళ్లి చేసుకొనేవాళ్లెవరో అర్థం కాలేదు. గొంతెమ్మ కొర్కెలతో ముదిరిపోతున్నారు. – లక్ష్మీపతినాయుడు, మ్యారేజి బ్రోకర్,బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
డిసెంబర్లో భారీగా పెళ్లిళ్లు.. మోగనున్న పెళ్లి బాజా
సాక్షి, అమలాపురం: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోంది. బ్రహ్మచారులు కొత్త బంధంలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కన్నెపిల్లలు సిగ్గుల మొగ్గలవుతూ ముస్తాబులకు రెడీ అవుతున్నారు. పెళ్లి ఏర్పాట్లకు వధూవరుల కుటుంబాలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. నగలు, వస్త్రాలు, కల్యాణ మండపాలు, సన్నాయి, కేటరింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. నగలు, వస్త్ర దుకాణాల్లో అప్పుడే షాపింగ్ కళ పెరిగిపోయింది. పెళ్లి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైంది. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆచితూచి శుభఘడియలను ఎంచుకుని ముడేస్తారు. తద్వారా వారి వివాహ బంధం జీవితకాలం ఎలాంటి ఆటుపోట్లకు లోనవకుండా ఉండాలని కోరుకుంటారు.మార్గశిరం మంచిదని..మార్గశిర (డిసెంబర్) మాసంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మాసంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మార్గశిర మాసంలో బలమైన ముహూర్తాలు ఉండటంతో పాటు జనవరిలో పుష్యమాసం కావడం.. మార్చి రెండో వారం నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) రానుండటంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ఆరాటపడుతున్నారు. ప్రస్తుత కార్తీక మాసంలో ఈ నెల 24న చివరి ముహూర్తం ఉంది. కార్తీకంలో పెళ్లిళ్లు జరిగినా పెద్దగా లేవనే చెప్పాలి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం మొదలు కానుండటంతో వివాహాలు అధిక సంఖ్యలో జరగనున్నాయి. తెలుగునాట మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల తరువాత మార్గశిర మాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. జనవరిలో ముహూర్తాలు లేవుడిసెంబర్ 25 తరువాత నుంచి జనవరి 30వ తేదీ వరకూ పుష్యమాసంలో వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా చేయరు. జనవరి 31 నుంచి మార్చి 7వ తేదీ వరకూ మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. మార్చి 13 నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) మొదలు కానుండటంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు. ఈ కారణాలతో మార్చి 7లోపు పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది ఆరాటపడుతున్నారు.7న అతి పెద్ద ముహూర్తండిసెంబర్ నెల పొడవునా ముహూర్తాలున్నాయి. ఆ నెలలో ఏడో తేదీ అతి పెద్ద ముహూర్తం. ఆ రోజున సుమారు 30 పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం సైతం పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో పుష్యమాసం కావడంతో పెద్దగా ముహూర్తాలు లేవు. ఈ కారణంగా డిసెంబర్లో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. – దైవజ్ఞరత్న ఉపద్రష్ట నాగాదిత్య సిద్ధాంతి, అమలాపురం25 వరకూ శుభముహూర్తాలుమార్గశిర మాసంలో డిసెంబర్ 4వ తేదీ బుధవారం బలమైన ముహూర్తాలున్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 7.54 గంటలకు, తెల్లవారుజామున 4.28 గంటలకు (తెల్లవారితే గురువారం), అలాగే 5, 6 తేదీల్లో ముహూర్తాలున్నాయి. 7వ తేదీన కూడా అతి పెద్ద ముహూర్తాలున్నాయి. ఆ రోజు రాత్రి 7.50, తెల్లవారుజామున 4.24 (8వ తేదీ ఉదయం) రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే, 10వ తేదీన సైతం అధిక సంఖ్యలో వివాహాలు చేయనున్నారు. డిసెంబర్ 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో పెళ్లిళ్లతో పాటు, వివిధ శుభ కార్యక్రమాలకు సైతం మంచి ముహూర్తాలు ఉన్నాయి. -
పిలవని పెళ్లిళ్లకు.. పోలీసులు రెడీ..
పాత తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ చివర్లో డిష్యూం డిష్యూం ఫైటింగ్‌లు అయిపోయాక పోలీసులు వచ్చి శుభం కార్డు పడటం అందరం చూసే ఉంటాం. ఆగ్రా పోలీసులు మాత్రం పెళ్లిళ్లలో చిట్టచివర్లో కాకుండా ముందే వస్తారు. అదీ కూడా పిలవకుండానే వచ్చి పెళ్లిలో అత్యంత కీలకమైన, విలువైన వధువు నగలు, పెళ్లివారి నగదు వంటి వాటిపై నిఘా పెడతారు. ఎందుకంటే వాటిని కొట్టేసేందుకు చోరశిఖామణులు పెళ్లి మండపాల్లో తచ్చాడుతారని పోలీసులుకు బాగా తెలుసు. అందుకే మఫ్టీల్లో వచి్చమరీ పటిష్ట భద్రత కల్పిస్తారు. ఇదంతా ఉచితమే. ఇలా అదనపు మొహరింపు వెనక ఒక పెద్దకారణమే ఉంది. ఈ వివరాలను ఆగ్రా సిటీ డెప్యూటీ పోలీస్ కమిషనర్ సూరజ్ రాయ్ వెల్లడించారు. టీనేజర్లూ డేంజరే ‘‘రాత్రిళ్లు దొంగలు పడటం సర్వసాధారణం. పట్టపగలు పెళ్లి పందిళ్లు, మండపాల్లో దొంగలు చేతవాటం చూపించడం ఈమధ్య మరీఎక్కువైంది. ముఖ్యంగా పెళ్లి నగలు, నగదుపై కన్నేసి కొట్టేసిన ఘటనలు చాలా జరిగాయి. అందుకే పోలీసు సిబ్బందిని సాధారణ దుస్తుల్లో వివాహవేడుకలకు బందోబస్తుగా మేమే పంపిస్తున్నాం. బంధువుల్లా కలిసిపోయి అందరిపైనా ఓ కన్నేస్తాం. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ముఖ్యంగా గమనిస్తాం. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉండే నగలు, నగదునే దొంగలు కొట్టేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల సాయంతోనూ నిఘా కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగ్రా జిల్లాలోని ప్రతి కీలకమైన వేడుకకు మేం పిలవకున్నా వెళ్తున్నాం. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను గమనిస్తాం. కొన్ని సార్లు ఆ అనుమానాస్పద వ్యక్తుల వెంట వచ్చే టీనేజర్లనూ ఓ కంట కనిపెడతాం. ఎందుకంటే ఆ మధ్య ఒక పెళ్లిలో టీనేజీ పిల్లాడే కోట్లవిలువైన చోరీకి పాల్పడ్డాడు. పెళ్లిమంటపాలు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు ఇలా మొత్తం 18 క్లస్టర్లకు పోలీసులను పంపుతున్నాం. స్థానికులు సైతం తమ పెళ్లికి నిఘా కావాలంటే ముందస్తుగా సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదిస్తే ప్రతి పెళ్లికి కుదిరితే బందోబస్తును ఏర్పాటుచేస్తాం’’అని ఆయన వివరించారు. – ఆగ్రా -
పెళ్లి బాజా @ రూ.5.9 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం వధూవరులతో పాటు వ్యాపారులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వివాహాల విషయంలో గెస్ట్‌ల సంఖ్య తగ్గినా ఖర్చు బాజా మాత్రం గట్టిగానే మోగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య 18 రోజుల పాటు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని.. ఈ సీజన్లో రిటైల్ రంగంలో రూ.5.9 లక్షల కోట్ల మేర వ్యాపారం ఉంటుందని అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య (సీఏఐటీ) లెక్కగట్టింది. అంతేకాదు ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల మేర వివాహాలు జరుగుతాయని.. రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి ఆస్కారం ఉందని పేర్కొంది. అతిథుల సంఖ్య తగ్గుతోంది... వివాహ పరిశ్రమలో ఫ్యాషన్, ట్రావెల్, ఆతిథ్యం ఇంకా ఇతరత్రా సర్వీసులు కలగలిసి ఉంటాయి. ముఖ్యంగా దేశీయంగా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి పెరుగుతుండటంలో ట్రావెల్, ఆతిథ్య రంగానికి ఫుల్ జోష్ లభిస్తోంది. ప్రత్యేకమైన ఫుడ్ మెనూల నుంచి గెస్ట్‌లకు విభిన్నమైన అనుభూతులను అందించడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ‘ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు అతిథుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా మిలీనియల్ జంటలు తమకు అత్యంత దగ్గరి బంధువులు, ఆత్మీయులను మాత్రమే అతిథులుగా పిలుస్తున్నారు. గెస్ట్ లిస్టులో కోత పెట్టినప్పటికీ.. మొత్తంమీద బడ్జెట్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఏటికేడు విహహాల ఖర్చు పెరుగుతూనే ఉంది.అలంకరణలు, వ్యక్తిగత సర్వీసులు, అతిథుల అభిరుల మేరకు కేటరింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటున్నారు’ అని న్యూఢిల్లీలోని షాంగ్రీలా ఈరోస్ జనరల్ మేనేజర్ అభిõÙక్ సాధూ పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కళకళలాడనుండటంతో ఈ లగ్జరీ హో టల్ చైన్ ‘బంధన్ బై షాంగ్రీలా’ పేరుతో వివా హ సేవలను ప్రారంభించింది. ఈ హోటల్లో సాదారణ స్థాయి పెళ్లి బడ్జెట్ రూ. 25 లక్షలతో మొ దలై కోట్లలోకి వెళ్తోంది. జైపూర్ హయత్ ప్యాలెస్‌లోనూ సాధారణ పెళ్లి బడ్జెట్ రూ.20–30 లక్షలుగా ఉంది. ఖర్చెంతైనా తగ్గేదేలే... పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం... పెళ్లి ఖర్చు రూ. 25 లక్షల స్థాయి నుంచి ఏకంగా రూ.100 కోట్లకు కూడా వెళ్లే సందర్భాలున్నాయట. విహాహ వేడుకను గ్రాండ్‌గా జరిపించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారని, అవసరమైతే కొందరు ఆస్తులమ్మేందుకూ వెనుకాడటం లేదంటున్నా రు పరిశీలకులు! మధ్యతరగతి వర్గాల పెళ్లి ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఉంటుందని, ఎగువ మధ్యతరగతి విషయానికొస్తే.. ఇది రూ. 25 లక్షల నుంచి రూ.2.5 కోట్లకు చేరుతోందని వెడ్డింగ్ ప్లానర్ వెడ్డింగ్సూత్ర.కామ్ సీఈఓ పార్తీప్ త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘సంపన్నులు (హెచ్ఎన్ఐలు) రూ.1.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల స్థాయి లో వెచ్చిస్తున్నారు. అల్ట్రా హెచ్ఎన్ఐల బడ్జెట్ అ యితే ఏకంగా రూ.2.5 కోట్ల నుంచి రూ.100 కోట్లకు కూడా దూసుకెళ్తోంది’ అని ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో అనంత్ అంబానీ–రాధికా మర్చెంట్ వివాహ వేడుక ఖర్చు చూసి (దాదాపు రూ.5,000 కోట్లుగా అంచనా) ప్రపంచమంతా నోరెళ్లబెట్టడం తెలిసిందే!! భారతీయుల పెళ్లిళ్లా మజాకానా అనే రేంజ్లో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది.డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్బ్రైడల్ మేకప్ నుంచి ఫోటోగ్రఫీ, వేదిక, డెకరేషన్, వెడ్డింగ్ లొకేషన్ వరకూ ప్రత్యేకంగా ఉండాలని యువ జంటలు కోరుకుంటున్నారు. ‘గతంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రూ. 2 లక్షలు వరకు ఒక కుటుంబం ఖర్చు చేస్తే, ఇప్పుడిది రూ. 6 లక్షలకు చేరుతోంది. కొందరు వధువులు టాప్ మేకప్ ఆర్టిస్ట్‌లతో ప్రత్యేకంగా సింగారించుకుంటున్నారు. ఒక్కో ఫంక్షన్‌కు ఖర్చు రూ. లక్ష వరకూ ఉంటోంది’ అని త్యాగరాజన్ తెలిపారు. ఇక జైపూర్, ఉదయ్‌పూర్, జోద్పూర్, గోవా, మహాబలిపురం వంటి డెస్టినేషన్ వెడ్డింగ్ హాట్స్పాట్లకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోందట! శీతాకాలంలో పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు కూడా ఉండటంతో హోటల్ రేట్లు భారీగా ఎగబాకుతున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా, రాజస్థాన్, గోవా, కేరళ ప్రాచుర్యం కొనసాగుతుండటంతో పాటు ఇప్పుడు డెహ్రాడూన్, రిషికే‹Ù, కూర్గ్ వంటి కొత్త ప్రదేశాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ లిస్టులోకి చేరుతున్నాయి. ‘అత్యంత సంపన్న వర్గాల్లో 10 శాతం మాత్రమే పెళ్లిళ్ల కోసం విదేశీ గమ్యాలను ఎంచుకుంటున్నారు, ఈ విషయంలో థాయ్‌లాండ్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 450–550 భారతీయ పెళ్లిళ్లు జరుగుతున్నాయి’ అని త్యాగరాజన్ వివరించారు. -
Sravana Masam 2024: నేటి నుంచే శ్రావణ సందడి
పెద్దపల్లిరూరల్: శుభ ముహూర్తాలకు వేళయింది. సోమవారం నుంచి మొదలయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలామంది సన్నద్ధమయ్యారు. శుక్ర మౌఢ్యమి, ఆషాడం, గురుమౌఢ్యమి కారణంగా మూడునెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పురోహితులు, బ్యాండుమేళం, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్‌ప్రెస్, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్‌తో పాటు నగల వ్యాపారులు శ్రావణమాస ముహూర్తాలకు శ్రీరెడీశ్రీ అయ్యారు. మూడునెలల పాటు ఖాళీగా ఉన్న వీరంతా ఇప్పుడు బిజీ కానున్నారు.శ్రావణంలో పండుగలుశ్రావణమాసంలో వచ్చే పండుగలిలా ఉన్నాయి. సోమవారం (ఈనెల 5) నుంచే శ్రావణం మొదలవుతోంది. 8న నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఈనెల 5న తొలి సోమవారంతో పాటు 12,19,26న సోమవారాల్లో శివుడిని, 9,16,23,30వ తేదీల్లో (శుక్రవారాల్లో) లక్ష్మీదేవి, 10,17,24,31వ తేదీల్లో (శనివారాల్లో) విష్ణువును పూజిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజా కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి.శుభ ముహూర్తాలుఈనెల 5వ తేదీతో మొదలయ్యే శ్రావణమాసం సెప్టెంబర్ 3తో ముగియనుండగా, ఈ నెల 31లోపే శుభకార్యాలను ముగించుకోవాలని అర్చకులు సూచిస్తున్నారు. ఈనెల 7,8,9,10,11,15,16,17,18,21,22,23,24,28 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. మూడునెలల ముందు నుంచే వేచి ఉన్నవారంతా ఈ శుభ ముహూర్తాల్లో తమకు అనుకూల తేదీలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇంటింటా పండగే..శ్రావణమాసంలో అందరూ భక్తితో పరవశిస్తారు. ఈ మాసంలో ఇంటింటా పండగ వాతావరణమే. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణం. అందుకే ఈ మాసంలో అందరూ భక్తి, పవిత్రతో ఉంటూ శుభ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఈ నెల 28వరకే శుభముహూర్తాలున్నాయి.– కొండపాక శ్రీనివాసాచార్యులు, అర్చకుడు, పెద్దపల్లి -
వెడ్డింగ్స్.. డెస్టినేషన్
పెళ్లి..చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఘనంగా పెళ్లిళ్లు చేయడం దక్షిణాది ప్రత్యేకత. అయితే కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో సెలబ్రెటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు మాత్రమే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు విదేశాలకు వెళ్లేవారు. అనంతర కాలంలో ఆ ఖర్చును భరించగలిగే ఆర్థికస్తోమత ఉన్నవారు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లోనే కాకుండా భారత్‌లోని జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్, ముస్సోరీ, గోవా వంటి ప్రదేశాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు వేదికలుగా ఆదరణ పొందాయి.కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాలు వీటికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకశాఖ నగరంతోపాటు, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఈ వేదికల్లో వేడుకలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితం నగరం వేదికగా జరిగిన అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ సమ్మేళనంలో ఆ దిశగా దృష్టి సారించారు. ..: సాక్షి, హైదరాబాద్ :.. డెస్టినేషన్వెడ్డింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు..ఖర్చెంత?సాక్షి, హైదరాబాద్వారసత్వ సంపదతోపాటు అద్భుత కట్టడాలకు కేంద్రం హైదరాబాద్ నగరం.ఇక్కడి చారిత్రాత్మక కట్టడం తారామతి బారాదరి వెడ్డింగ్ డెస్టినేషన్‌కు అడ్డాగా మారింది. ఎత్తయిన కొండపైన ఆనాటి రాజసం నింపుకున్న నిర్మాణ శైలి, వందలమంది ఒకేసారి కూర్చొని పెళ్లి వైభవం ఆస్వాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ వేడుక చేసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తారామతిలో ఐదు గంటల ఫొటో షూట్‌కు ఉదయం అయితే రూ.8000, సాయంత్రం నుంచి అయితే రూ. 10 వేలు చార్జ్ చేస్తున్నారు.పెళ్లిళ్లు, రిసెప్షన్ లేదా ఇతర ఫంక్షన్లకు ఓపెన్ ఏరియా అయితే రూ.70 వేలు, ఇండోర్ బాంకెట్ హాల్ అయితే లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఫుడ్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఇక్కడ ఫుడ్ కాకుండా బయట నుంచి తెప్పించుకోవాలనుకునేవారు అదనంగా రూ.11 వేలు చెల్లించాలి. నిర్వాహకులే స్వయంగా ఫుడ్ ఏర్పాటు చేసుకోవాలంటే...అదనంగా రూ.15 వేలు చెల్లించాలి. వేదిక, వసతుల అద్దె సాధారణంగానే ఉన్నా, ఆకర్షణీయమైన అలంకరణ, ఖరీదైన వంటకాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ పెళ్లిళ్లకు కనీసం పాతిక లక్షల పైనే ఖర్చు పెడుతున్నారు.తారామతి బారాదరి, ఫలక్‌నుమా ప్యాలెస్..⇒ నగరంలోని ‘ఫలక్‌నుమా ప్యాలెస్’ కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయితో ఖ్యాతి గడించిన విలాసవంతమైన వేదిక. గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన సోదరి వివాహం ఇక్కడే జరిపించిన విష యం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్‌తోపాటు పలువురు వ్యాపారవేత్తలు వచ్చారు. మరెందరో ప్రముఖులు కూడా ఈ వేదికను వినియోగించుకున్నారు.అనంతగిరి హిల్స్..⇒ అటు అనంతగిరిహిల్స్ వేది కగా కూడా వివాహాల సంఖ్య పెరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపించి వందల మంది వేడు కల్లో పాల్గొనేలా సౌకర్యాలు అభివృద్ధి చేయడంతో పెళ్లిళ్లు, వెడ్డింగ్ షూట్లకు ఇక్కడ ఆదరణ పెరిగింది. ఇక్కడి ప్రకృతి పారవశ్యం నూతన జంటలకు ఆకర్షిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే పలు వెడ్డింగ్ షూట్ సెట్టింగ్ రిసా ర్టులూ వెలిశాయి. ఇక్కడ డెస్టినే షన్ వెడ్డింగ్‌లకు సాధార ణంగా 5 లక్షల పైనే ఖర్చు అవుతుందని అంచనా. అయితే, వీటిల్లో వెడ్డింగ్ ప్లానర్ల ఖర్చులే అత్యధికంగా ఉంటాయి. తమ అభిరుచికి తగ్గ ట్టుగా కేవలం సెట్టింగ్‌లకు లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. కొందరైతే సెట్టింగ్‌లకే కోటి రూపా యల దాకా ఖర్చు చేస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు.ఫ్యూచర్ ప్లాన్.. లక్నవరం వరంగల్‌కు సమీపంలోని లక్న వరం సరస్సు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు మరో ఫేవరెట్ స్పాట్ కానుంది. ఇక్కడ 17 నుంచి 20 దాకా ఐల్యాండ్లు ఉన్నాయని, వాటిని కూడా ఈ దిశగా అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని టూరిజం శాఖ ప్రతినిధి తెలిపారు. లక్నవరంలోని కాటేజె స్తో పాటు దీనికి దగ్గరలోనే వరంగల్ టూరిజం హోటళ్లు, రిసార్ట్లు ఉన్నాయి. తీసుకునే కాటేజీల సంఖ్య, అవసరానికి అనుగుణంగా సమీపంలోనే హరిత హోట ళ్లలో ఏర్పాటు చేసే సౌకర్యా లను బట్టి రూ. 3–5 లక్షల వరకు ఖర్చు అవుతుందని పర్యా టక అధికారులు చెబుతు న్నారు. వినూత్నమైన సెట్టింగులు, పూల అలంకరణలు, భోజన ఏర్పాట్లు ఇలా అన్నీ.. చేసే స్థాయిని బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. సోమశిల..ప్రముఖ పర్యాటక ప్రదేశం సోమశిలలో జరి గిన డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా అందరినీ ఆక ర్షించింది. ఇక్కడి డ్రోన్ షాట్లు ప్రకృతి పారవశ్యాన్ని చిత్రీ కరించిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే నాగార్జునసాగర్వంటి పలు పర్యాటక ప్రదే శాలు ఇలాంటి వినూత్న వివాహాల వేడుకలకు అద్భు త వేదికలుగా అవతరిస్తు న్నాయి. కాగా, ప్రస్తు తం కొద్ది మందికి మాత్రమే ఇలాంటి సౌక ర్యాలు అందు బాటులో ఉన్నా, వీటికున్న ఆదరణ దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తూ విదేశాలకు చెందిన వారిని సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు మన వైపు ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర పర్యా టక శాఖ అధికారులు చెప్పారు.వెలుగులోకి మరిన్ని డెస్టినేషన్ వేదికలుమన సంస్కృతీ సంప్ర దాయాలకు గౌరవిస్తూనే.. ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు మంచి వేదికలుగా వాడుకుంటున్నారు. ఈ మార్పు పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెంచడంతోపాటు వారి పెళ్లిని చిరకాల మధుర జ్ఞా్ఞపకంగా నిలుపుతుంది. ఈ ఆనవాయితీ ఇలానే కొనసాగితే మరి కొనేళ్లలో మరో పది వరకు డెస్టినేషన్ వేదికలు వెలుగులోకి వస్తాయి. అంతటి విశిష్టత కలిగిన కోటలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్లను సైతం ఆకర్షిస్తున్నాయి – అరవింద్, పర్యాటక నిపుణుడు -
శ్రీరస్తు.. శుభమస్తు!
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): శుభ ముహూర్తాల మాఘమాసం వచ్చేసింది. పెళ్లి కళను వెంటబెట్టుకొచ్చింది. ‘శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు’ అనుకుంటూ శుభముహూర్తాలు నిశ్చయించుకున్న కుటుంబాలన్నీ వధూవరులను పెళ్లి పీటలెక్కించి చిద్విలాసాల నడుమ వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మాఘ మాసం నుంచి ఛైత్రమాసం వరకు మూడు నెలల పాటు శుభకార్యాలకు మంచి ఘడియలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు. మాఘమాసం ప్రారంభం కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు జరిపించేందుకు భారీగా ముహూర్తాలు నిశ్చయిస్తున్నట్టు పురోహితులు పేర్కొంటున్నారు. శుభకార్యాలకు ఉత్తరాయణం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఆ క్రమంలో మాఘమాసంలో ఈ నెల 13 నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలో లక్షకుపైగా వివాహాలు రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో సుమారు లక్ష వరకూ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. ప్రధానంగా తిరుపతి, విజయవాడ, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో వారి వారి నమ్మకాలు, మొక్కులతో వేలాది జంటలు వివాహంతో ఒక్కటి కానున్నాయి. ఆ పుణ్యక్షేత్రాలతో పాటుగా రాష్ట్రంలోని కల్యాణ మండపాలు ఆయా ముహూర్తాల్లో అధిక శాతం ఇప్పటికే బుక్కయ్యాయి. కల్యాణ మండపాలతో పాటుగా హోటల్స్‌లోనూ వివాహాలను జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 28 నుంచి మూఢం ఏప్రిల్ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభమవుతుంది. మూఢం శుభకార్యాలకు మంచిది కాదని, అందువల్ల ఏ ముహూర్తాలూ ఉండవని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా మే, జూన్, జూలై మాసాల్లో మూఢంతో పాటు ఆషాఢ మాసం సైతం ప్రారంభం కానుంది. భాద్రపద మాసంలోనూ ముహూర్తాలు ఉండవు. తిరిగి ఆగస్టులో శ్రావణం వచ్చే వరకూ ముహూర్తాలు లేవు. ఏప్రిల్ తరువాత వివాహాలు జరుపుకోవాలనుకునే వారు శ్రావణ మాసం వరకూ ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు. మూడు మాసాల్లో కల్యాణ ఘడియలు మాఘ మాసం (ఫిబ్రవరి)లో 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి 2, 3 తేదీలు, ఫాల్గుణ మాసం (మార్చి)లో 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30, ఏప్రిల్ 3, 4 తేదీలు, ఛైత్ర మాసం (ఏప్రిల్)లో 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆయా శుభ ఘడియల్లో వివాహాలు జరిపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. మార్కెట్‌కు పెళ్లి కళ వివాహాలపై ఆధారపడ్డ వర్గాలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, మంగళ వాయిద్యాలు, ఆర్కెస్ట్రా, వస్త్ర దుకాణాలు, బంగారు నగల దుకాణాలు, కల్యాణ మండపాలు వంటి 20 రంగాలు వివాహాలపై ఆధారపడి కొనసాగుతున్నాయి. వీటిని సమన్వయం చేస్తూ ఈవెంట్ మేనేజర్లు వివాహాలను గ్రాండ్‌గా జరిపేందుకు రాష్ట్రంలో ఉన్నారు. ఈ మూడుఎ మాసాలు ఆయా రంగాల వారంతా బిజీ కానున్నారు. మాఘం నుంచి ౖఛైత్రం వరకు.. మాఘమాసం నుంచి ఛైత్ర మాసం వరకూ మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువ మంది ఈ ముహూర్తాల్లో వివాహాలు జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఛైత్రం చివరిలో మూఢం ప్రారంభమవుతుంది. శ్రావణం వచ్చే వరకు ముహూర్తాలు లేవు. – పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పండితుడు, విజయవాడ -
వెడ్ ఇన్ ఇండియా: 'ప్లీజ్ ఇక్కడే పెళ్లి చేసుకోండి'!
భారతదేశంలో ప్రజలు పెళ్లిళ్లకు ఎంతెంత రేంజ్లో డబ్బుల ఖర్చు పెడతారో తెలిసిందే. నిజం చెప్పాలంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే భారత్‌లో అదొక వ్యాపారంలా సాగుతుంది. అయితే ఇటీవల ఆ పెళ్లిళ్లలో ట్రెండ్ మారుతోంది కూడా. ఏకంగా కోట్లు ఖర్చే చేసి మరీ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ఓ స్టేస్ సింబల్‌లా మారిపోయింది. ఇక రానురాను ఆ ట్రెండ్ ఓ రేంజ్లో కొనసాగేలా ఉంది. అయితే మన ప్రధాన మోదీ మాత్రం "ప్లీజ్ మన మాతృభూమిలోనే పెళ్లి చేసుకోండి" అని పిలుపునిస్తున్నారు. ఎందుకని ఆయన ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు? కారణమేంటీ..? నిజానికి భారతీయుల్లో పెళ్లిళ్ల కోసం విదేశీయులకు వెళ్లే వాళ్లు కేవలం అత్యధిక ధనవంతులే. సాధారణ మానవుడు పెళ్లి చేసుకుంటే చాలనుకుంటాడు. అంత రేంజ్‌లకు వెళ్లడు. మన దేశంలో బడా బాబులకు కొదవలేదు కూడా. అయితే ఇంతకుమునుపు శ్రీమంతులు విభిన్నంగా కళ్లు చెదిరే ఆర్భాటాలతో చేసుకునేవారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారంటా! అని కథలుగా చెపుకునేవారు. కానీ ఈ 20 ఏళ్లలో పరిస్థితుల చాలా మారిపోయాయి. అంతెందుకు పెళ్లిళ్ల సీజన్‌కి రాజకీయనాయకుల సైతం ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎంతలా అంటే? ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 23న ఖరారు చేయగా ఆ టైంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయని ఏకంగా తేదీనే మార్చారు. వెడ్డింగ్ అతిపెద్ద వ్యాపార ఇండస్ట్రీ.. పెళ్లిళ్ల టైంలో కళ్యాణ మండపాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వాటి ధరలు హడలెత్తించేలా ఉంటాయి. ఆఖరికి పూల దగ్గర నుంచి నగలు, బట్టలు అన్నింటికి మంచి గిరాకీ టైం అనే చెప్పాలి. ఎంత ఎక్కువ ధర చెప్పినా ప్రజలు కూడా లెక్కచేయకుండా కొనే సమయం కావడంతో వ్యాపారులు కూడా ఈ సీజన్‌ని భలే క్యాష్ చేసుకుంటారు. ఈ దృష్ణ్యా చూస్తే పెళ్లిళ్లు ఓ పెద్ద మార్కెట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈ పెళ్లి పేరుతో అన్ని రకాల వృత్తుల వారికి చేతినిండా పని, ఆదాయానికి ఆదాయం. పెళ్లిళ్ల కార్యక్రమాలను నిర్వహించే ఈవెంట్ మేనజర్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. గతేడాది 2023లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగాయని, దాదాపు 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) స్వయంగా పేర్కొంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఎందుకింత ఆధరణ.. అందుకు ప్రధాన కారణం..జీవితంలో ఒక్కసారే చేసుకునేది కావడం, గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా చేసుకోవాలన్న కోరికలే ఇంతలా ఖర్చు చేసేలా చేస్తోంది. దీంతోపాటు అరచేతిలోనే ప్రపంచంలా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత ఉంది. ఈ మేరకు ప్రముఖ మ్యారేజ్ ప్లానర్ అగ్నిశక్తి మాట్లాడుతూ..తాము సుమారు 8లక్షలు నుంచి 3 కోట్ల బడ్జెట్ వరకు వివాహాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాన భాగం వేదికపైనే ఖర్చు అవుతుందని, మిగిలిన బడ్జెట్‌ని ఆహారం, పానీయాలు, డెకరేషన్ సెటప్, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులకు ఖర్చే చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా వధువు, వరుడు కుటుంబాలకు ప్రత్యేక డిజైనర్లను పెట్టుకుని మరీ బట్టలను కొనుగోలు చేయడం ఓ ట్రెండ్‌గా మారిందని అన్నారు. సెలబ్రెటీలైతే ఈ విషయంలో ఏకంగా సినిమాలో పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. చాలామంది ఈ లగ్జరీ పెళ్లిళ్లను తమ స్టేటస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా భావించడం కూడా కొంత కారణం. ఈ నేపథ్యంలోనే బహుశా డిస్టినేపన్ వెడ్డింగ్‌లకు బాగా ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఎలాగో లక్షలు లక్షలు ఖర్చుపెడుతున్నాం కాబట్టి అదేదో అందరూ గుర్తు పెట్టుకునేలా విదేశాల్లో చేసుకుంటే..ఎంజాయ్మెంట్కి ఎంజాయ్, అందరూ గొప్పగా కూడా చెప్పకునేలా ఉంటుందన్న ధోరణి ప్రజల్లో బాగా పెరిగిందని మరో వెడ్డింగ్ ప్లానర్ సక్షమ్ శర్మ చెబుత్నునారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అయ్యే ఖర్చు.. ఇది వారు వెళ్లే ప్రదేశం, వచ్చే అతిథుల బట్టి ఖర్చు ఉంటుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు బడ్జెట సుమారు 80 నుంచి 90 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లు చెబుతున్నారు. అదే థాయిలాండ్, బాలి అయితే ఏకంగా కోట్లలోనే బడ్జెట్ మొదలవుతుందని తెలిపారు. ఇంతలా లగ్జరీయస్‌గా పెళ్లి చేసుకోవాడానికి కొన్ని హోటళ్లు క్రెడిట్ లోన్లు కూడా ఇస్తాయట. మోదీ వద్దు అనడానికి రీజన్.. నవంబర్‌లో మన్కి బాత్ రేడియో ప్రసంగంలో ప్రధాన మోదీ విదేశాలలో వివాహాలను చేసుకునే బడా కుటుంబాల ధోరణి కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత మొత్తంలో ఖర్చే చేసేటప్పుడూ..మన భారత్‌లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో హుందాగా చేసుకోండని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాదు మేక్ ఇన్ ఇండియా మాదిరిగా వెడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కూడా చేపట్టాలని అన్నారు. అంతగా కావాలనుకుంటే ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరుపుకోమని అన్నారు. మోదీ ఇలా అనడానకి ప్రధాన కారణం భారతదేశం డబ్బు విదేశాలకు తరలిపోవడం ఇష్టం లేక ఆయన ఈ విధంగా పిలుపునిచ్చారు. ఇది ఒక రకంగా భారతీయ ఆర్థికవ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు ఉపకరించే చొరవ. ఇది చాలామంచి ప్రయత్నమే కానీ భారతీయులను ఇక్కడే పెళ్లిళ్లు చేసుకునేలా మంచి వెడ్డింగ్ సెట్టింగ్ మైదానాలతో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే వెడ్డింగ్ టైంలో భారీ డిమాండ్ పలికే ఫంగ్షన్ హాల్స్ చార్జీల్లో కూడా మార్పులు వస్తే ఇదంతా సాధ్యమని అంటున్నారు ఈవెంట్ మేనేజర్లు. దీంతో ప్రవాస భారతీయులు సైతం తమ సొంత గడ్డలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు. అలాగే తమ పెళ్లి గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకునే వాళ్లకు.. మన భారత్‌లో ఉన్న గోవా, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్, అండమాన్ తదితర ప్రసిద్ద ప్రదేశాలను హైలెట్ చూస్తూ.. అక్కడి ఫంక్షన్ హాల్లో భారీ మార్పులు తీసుకొచ్చేలా తీర్చిదిద్ధడమే గాక అందుబాటు ధరలో ఉండేలా చేస్తే ప్రధాని మోదీ చెబుత్ను నినాదం సాకారం అవుతుందన్ని అంటున్నారు మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్లు. ఈ నినాదానికి మద్దతు పలుకుతూ ప్రముఖ సెలబ్రెటీ రియా కపూర్ ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు కూడా. భారతదేశం వివిధ ఐకానిక్ ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ చొరవ నిజంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు మంచి బూస్టప్. (చదవండి: ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!అతనేమి ఐఐఎం, ఐఐటీ.. !) -
ఈసారి రూ. 4.7 లక్షల కోట్ల వ్యాపారం..
న్యూఢిల్లీ: ఈసారి పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం భారీగా జరుగుతుందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, ఇతరత్రా సర్విసులపై వినియోగదారులు రూ. 4.74 లక్షల కోట్ల మేర వెచ్చించే అవకాశం ఉందని భావిస్తోంది. గత సీజన్లో నమోదైన రూ. 3.75 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు అధికం. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న వివాహాల సీజన్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగొచ్చని భావిస్తున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం సందర్భంగా తెలిపారు. ‘గతేడాది సుమారు రూ. 3.75 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈసారి ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు మేర పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. దేశ ఎకానమీకి, రిటైల్ వ్యాపారానికి కూడా ఇది మంచిదే‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో 23, 24, 27, 28, 29 తేదీల్లో, అలాగే డిసెంబర్లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పైగా పెళ్లిళ్లు ఉంటాయని, వీటితో రూ. 1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ తెలిపారు. -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
పెళ్లి సందడికి వేళాయె!
శుభముహుర్తాలకు వేళయ్యింది. శ్రావణమాసం.. వరుస ముహూర్తాలు వస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు సుమారు 50కి పైగాముహూర్తాలు వస్తుండడం విశేషం. ఫలితంగా అన్ని జిల్లాలు పెళ్లిళ్లతో.. పందిళ్లు సందడిగా మారనున్నాయి. వివాహ ముహూర్తాలు ఆగస్టులో 8, సెప్టెంబరులో 6, అక్టోబరులో 10, నవంబరులో 14, డిసెంబరులో 14 వరకు ఉండటంతో ముఖ్యంగా కడప జిల్లా మరింత సందడిగా మారింది. అక్కడ జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు పెద్దవి 800 మీడియం 1200 చిన్నవి వాటిల్లోనే ఏకంగా 1000కి పైగా వివాహాలు జరగడమే గాక మొత్తం ఖర్చు రూ. 25కోట్లు వరకు ఉండొచ్చు. ఏప్రిల్‌లో శుభ కార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, జూన్‌లో కొన్ని మాత్రమే ఉండడం, జులైలో ఆషాఢమాసం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు ఉండడంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు వరకు వరుసగా ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో దాదాపు వెయ్యికి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆగస్టు 16న అమావాస్య అనంతరం నిజ శ్రావణమాసం వస్తుండడంతో 19వ తేదీ నుంచి దాదాపు 10 రోజులపాటు వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇవి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. కడప జిల్లాలో ఈ సంవత్సరాంతం వరకు ఉన్న 50కి పైగా ముహూర్తాల్లో వెయ్యికి పైగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా పెద్ద కల్యాణ మండపాలు, 1200కు పైగా మీడియం మండపాలు, 1000కి పైగా చిన్న మండపాలు ఉన్నాయి. వీటికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యే నాటికి దాదాపు అన్ని కల్యాణ మండపాలు, ముహూర్తాలుగల అన్ని రోజుల్లోనూ ముందే రిజర్వు అయి ఉండడం విశేషం. డిసెంబరు వరకు ఉన్న ఈ సీజన్లో వివాహాల కోసం కనీసం రూ. 15–25 కోట్లవరకు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌కు ముందు వివాహాలు చేయలేకపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు మంచి ముహూర్తాలు ఆహ్వానం పలుకుతున్నా... పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. విందు భోజనాలు రెండు, మూడు నెలల క్రితం నాటికి విందు భోజనాలు ప్లేటు రూ. 150–180 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 200–250కి పైగా చేరింది. దీంతో ఘనంగా వివాహాలు నిర్వహించుకోవాలని భావించిన తల్లిదండ్రులకు ధరల దడ పట్టుకుంది. రెండు నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే ఇటీవల కూరగాయల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అయినా జీవితంలో ఒక్కసారే నిర్వహించే అపురూపమైన ఘట్టం గనుక వివాహాలను ఘనంగానే నిర్వహించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. వస్త్రాల ధర కూడా 20–40 శాతం పెరిగింది. శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభమైంది గనుక డిమాండ్ పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
ఈ ఏడాది ముహూర్తాలు ఇలా.. లగ్నానికి లేదిక విఘ్నం
ఆషాఢ, అధిక శ్రావణం కారణంగా 2 నెలల విరామం అనంతరం ఈ నెల 19 నుంచి శుభకార్యాల సందడి ప్రారంభం కానుంది. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, ఏడడుగులు, మూడుముళ్లతో పెళ్లి సంబరాలు అంబరాన్నం టనున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభ కార్యాల నిర్వాహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17న నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుండగా.. 19 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా శుభకార్యాలు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యాయి. భీమవరం (ప్రకాశం చౌక్)/రాయవరం: ఈ ఏడాది మొదటి నెల నుంచి డిసెంబర్ వరకు పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు మంచి తరుణంగా నిలుస్తోంది. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో 104 పెళ్లి ముహూర్తాలు ఉండగా ఇప్పటికే 51 ముహూర్తాలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు 53 ముహూర్తాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు లేకపోవడం విశేషం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 25 నుంచి ముహూర్తాలు ప్రారంభమవ్వగా...ఆషాఢం, అధిక శ్రావణం కారణంగా శుభకార్యాలకు విఘ్నం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి శుభ ముహూర్తాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. అనేక శుభకార్యాలు, గృహ ప్రవేశాలు డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి. ‘అందరికీ..అన్నింటికీ’ డిమాండ్... పెళ్లి, శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండటంతో అన్ని ప్రాంతాల్లోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సాధారణ ఫంక్షన్ హాళ్ల దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ హాళ్ల వరకు గిరాకీ ఎక్కువగా ఏర్పడింది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన పలువురు రెండు మూడు నెలల ముందు నుంచే కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు మంచి ఆదాయం అందుతోంది. ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతోన్న నేపథ్యంలో వాటికీ డిమాండ్ విపరీతంగా ఉంది. అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం లాంటి ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. వివాహాలు ప్రారంభం కానుండటంతో పలు వృత్తుల వారికి చేతినిండా పని దొరుకుతుంది. బాజాభజంత్రీలు, డెకరేటర్స్, ఫొటోగ్రాఫర్స్, టెంట్‌హౌస్ నిర్వాహకులు, వంట పనివారు, ట్రాన్స్పోర్టర్స్, ఎల్రక్టీషియన్స్, సౌండ్ ఇంజినీర్స్, ఈవెంట్ మేనేజర్స్, పురోహితులకు చేతినిండా పని దొరకనుంది. ఈ ఏడాది ముహూర్తాలు ఇలా.. ఆగస్ట్ : 19, 20, 22, 24, 26, 29, 30, 31 సెప్టెంబర్ : 1, 2, 3, 6, 7, 8 అక్టోబర్ : 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31 నవంబర్ : 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29 డిసెంబర్ : 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31 ఈ ఏడాదే ఎక్కువ.. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ఎక్కువ పెళ్లి ముహూర్తాలున్నాయి. ముహూర్తాలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్లలో అయితే ఒక్కో నెలలో ఏకంగా 14 ముహూర్తాలు చొప్పున ఉన్నాయి. – మద్దిరాల మల్లిఖార్జునశర్మ, శ్రీమావుళ్లమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుడు -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వివాహ వేడుకలు
-
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్‌పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
ముహూర్తం ముందరున్నది
సాక్షి, అమరావతి: ‘‘మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది.. మా అమ్మాయి జాతకానికి మీ అబ్బాయి జాతకం బాగా కుదిరింది.. మనం ఇప్పుడే ఒక మాట అనుకుని పెళ్లి ఖాయపర్చుకుంటే మూఢం వెళ్లగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం’’ రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మధ్య సాగుతున్న సంభాషణ ఇది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. దీంతో వివాహాలు జరిపించేందుకు శుభలగ్నం కోసం ఎదురుచూస్తున్నారు. మూఢం ముగియడంతో నవంబర్ 28 నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం (సంక్రాంతి నెల) కావడంతో వివాహాలు చేయరు. దీంతో వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందుంది ముహూర్తం అంటూ.. పెళ్లి ఏర్పాట్లలో వధూవరుల కుటుంబాలు బిజీ అవుతున్నాయి. మార్కెట్లకు పెళ్లి కళ.. ప్రస్తుత శుభకృత్ నామ తెలుగు సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోనే లక్షా 50 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో మార్కెట్లకు కూడా పెళ్లి కళ వచ్చింది. ఇప్పటికే ఇళ్ల మరమ్మతుల కోసం సిమెంట్ పనులు, ఇళ్లకు రంగులు తదితర అలంకరణ పనులు ఊపందుకుంటున్నాయి. సరికొత్త శ్రేణి ఆభరణాలతో బంగారం షాపులు రెడీ అవుతున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల షాపులు, పాదరక్షల షాపులు, పెళ్లి శుభలేఖల షాపులు సిద్ధమయ్యాయి. చాలా చోట్ల కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, బాంక్వెట్ హాళ్ల అడ్వాన్సు బుకింగ్‌లు అవుతున్నాయి. మే వరకూ శుభ ముహూర్తాలు.. నాలుగు నెలల తర్వాత మంచి బలమైన ముహూర్తాలు వస్తున్నందున పెళ్లి బాజాలు మోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూఢం లో వివాహాలు జరిపించరు. మూఢం వెళ్లగానే మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేస్తారు. ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరం తర్వాత వచ్చే శోభకృత్ నామ సంవత్సరం 2023 మే నెల వరకు శుభలగ్నాలు ఉన్నాయి. 2023 ఉగాది అయ్యాక చైత్రం, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో మంచి ముహూర్తాల్లో వివాహాలు జరిపిస్తారు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 ముహూర్తాలు ఉన్నాయి. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు(లాలూ), పురోహితుడు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!
పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గతంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే పరిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్, డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ వివాహాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో, మార్కెట్లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022. Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q — Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022 చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
ఇక్కడ పెళ్లిళ్లు వద్దే వద్దు.. ఏకమైన గ్రామస్తులు..!
వివాహాలు లేదా పలు వేడుకలను మంచి ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది సర్వ సాధారణం. ఐతే మరికొంతమంది పచ్చదనం పరుచుకున్న ప్రదేశాల్లో ఆహ్లాదంగా ఇలాంటి వేడుకులను జరుపుకునేందుకు ఇష్టపడతారు. అలానే యూకేలో ఒక ఆక్స్‌నీడ్ హాల్ అనే గ్రాండ్ ఎస్టేట్ ఇలాంటి వేడుకలకు పెట్టింది పేరు. బ్రిటన్‌లోని చాలా మంది ధనవంతుల కుటుంబాలు ఈ ప్రదేశంలోనే పెళ్లిళు, పార్టీలు వంటి వేడుకలను చేసుకుంటారు. అదీగాక ఈ మహమ్మారి సమయంలో ఈ ప్రదేశంలో ఈ వివాహ వేడుకలు, పార్టీలు మరింత అధికమయ్యాయి. అంతకుముందు ఉన్నత స్థాయి కుటుంబాలకు మాత్రమే అనుమతిచ్చేవారు. అయితే ఈ వేడుకలు అక్కడ ఉండే స్థానికులను ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా ఈ గార్డెన్‌లోకి వధువరులకు ఎంట్రీ లేదు, ఇక్కడ వివాహలు చేసుకునేందుకు అనుమతి లేదు అనే బోర్డులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో ఈ ఎస్టేట్ 16వ శతాబ్ద కాలంనాటి చారిత్రక ఎస్టేట్‌గా పేరుగాంచింది. ఐతే వివాహానికి విచ్చేసిన అతిధులు ఆ వెడ్డింగ్ హాల్ గ్రాండ్ ఎస్టేట్ చుట్టూ ఉన్న 500 ఎకరాల పోలాలను నాశనం చేస్తున్నారు. పైగా విపరీతమై మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కలవాళ్లను ఇబ్బందులకు గురిచేయడంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వధువరులకు, జంటలకు ఆహ్వానం లేదు అని ఆ ఎస్టేట్ ముందు బోర్డులు పెట్టారు. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక మునుపే ఆ ఇంట మృత్యుఘోష
అల్లారుముద్దుగా పెంచిన ఏకైక కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. గొప్ప సంబంధమే దొరికిందని మురిసిపోయాడు. ఇక కుమార్తె జీవితం బంగారు మయమేనంటూ బంధువులతో చెప్పుకొని సంతోషంగా గడిపాడు. పెళ్లి తంతు ముగిశాక దగ్గరి బంధువులతో కలిసి సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వాహనంలో పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామనే లోపు మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. కళ్లు తెరిచేలోపే అయిన వారందరినీ కబళించేసింది. తీవ్ర గాయాలపాలైన ఆయన కూడా ఆస్పత్రిలో తుది శ్వాస వదిలాడు. ఉరవకొండ: మండలంలోని నింబగల్లు గ్రామానికి చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప నాయుడు (58) ఏకైక కుమార్తె ప్రశాంతి. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో ఈమెను అల్లారుముద్దుగా పెంచాడు. ఆదివారం ఉదయం బళ్లారిలోని అల్లంభవన్ ఫంక్షన్ హాలులో ఎంతో వైభవంగా ప్రశాంతి వివాహం జరిపించాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వెంకటప్ప నాయుడు, ఆయన దగ్గరి బంధువులు ఎనిమిది మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వీరి వాహనం బూదగవి వద్ద వస్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళుతున్న 16 చక్రాల ఐరన్‌ఓర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవింగ్ సీటులోని వెంకటప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలొదిలాడు. మిగిలిన ఎనిమిది మంది తీవ్రగాయాలతో వాహనంలోనే మృతి చెందారు. మరో అరగంటలో ఇంటికి చేరాల్సి ఉండగా.. ఘటనా స్థలం నుంచి నింబగల్లుకు కొద్ది దూరమే. మరో అరగంటలో వీరు గ్రామం చేరేవారు. అయితే, ఊహించని విధంగా దూసుకొచ్చిన మృత్యువు అందరినీ కబళించేసింది. మృతులంతా దగ్గరి బంధువులే. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరి మరణవార్త తెలియడంతో నింబగల్లు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటప్ప నాయుడి ఇంటి వద్దకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకటప్ప నాయుడు బీజేపీ సీనియర్ నేత కూడా కావడంతో విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. నిన్నటి వరకూ సందడిగా ఉన్న ఇంటి పరిసరాల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. మృతులతో తమ అనుబంధాన్ని తలచుకుని పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత పనిచేశావు దేవుడా అంటూ బంధువులు విలపించిన తీరు పలువురిని కలచివేసింది. ఇదే ప్రమాదంలో బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి, ఆమె కుమారుడు అశోక్, కుమార్తె స్వాతి, మనవడు జశ్వంత్, మనవరాలు జాహ్నవి చనిపోవడంతో బొమ్మనహాళ్‌లోని సరస్వతి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే రాధమ్మ మృతితో కణేకల్లు మండలం హనుమాపురం, శివమ్మ, సుభద్రమ్మ మృతితో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి, రాయలప్ప దొడ్డి శోకసంద్రంగా మారాయి. ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు.. మృతదేహాలను ఘటనాస్థలం నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకూ తమ కళ్లెదుటే ఎంతో సంతోషంగా కనిపించిన వారు.. ఒక్కసారిగా విగతజీవులుగా పడి ఉండడం చూసి బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. విదేశాల నుంచి కూడా కొంత మంది బంధువులు పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ ఘోరాన్ని చూసేందుకే తమను రప్పించావా దేవుడా అంటూ వారు విలపించారు. -
పెళ్లి సందడి.. కల్యాణ ఘడియలొచ్చేశాయి..
సాక్షి, అమరావతి బ్యూరో: కల్యాణ ఘడియలొచ్చేశాయి. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. దీంతో జిల్లాలోను, నగరంలోనూ చాలా ఇళ్లల్లో పెళ్లి సందడి షురూ కానుంది కొన్నాళ్లుగా కోవిడ్ భయంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తప్పనిసరి అయిన వారు మాత్రమే వివాహాలు జరిపించుకున్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ ఒమిక్రాన్ భయంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు క్రమంగా కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో పాటు శుభ ముహూర్తాలు ఆరంభం కావడంతో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేటి నుంచే సందడి షురూ.. శనివారం నుంచి ఈనెల 16 వరకు 5, 6, 7, 10, 11, 12, 14, 16 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈనెల 20 నుంచి మార్చి 23 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉంటుంది. మౌఢ్యమి రోజులు అశుభంగా పరిగణించి పెళ్లిళ్లు, ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు జరిపించరు. గురు మూఢం ముగిశాక కూడా మార్చి 23 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవు. తిరిగి మళ్లీ ఏప్రిల్ 2 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్‌లో 2, 3, 6, 7, 13, 15, 16, 20, 21, 23, 24 తేదీలు అంటే పదకొండు రోజుల పాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మే నెలలో 4, 11, 12, 13, 15, 26 తేదీల్లో వివాహ సుముహూర్తాలున్నాయి. ముందు ముహూర్తాలకే ప్రాధాన్యం.. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి జనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ రూపంలో వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. వచ్చే రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. పైగా కొద్ది రోజుల నుంచి కోవిడ్ తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే కొన్నాళ్ల పాటు వేచి ఉండకుండా ముందుగా వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తగ్గించుకుంటున్న పెళ్లి ఖర్చులు.. గతంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపించేవారు. స్తోమతను బట్టి లక్షలు, కోట్ల రూపాయలను వెచ్చించే వారు. ఇదంతా కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితి. కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కరోనా భయంతో పాటు కోవిడ్ ఆంక్షలతో ఎంతటి స్థితిమంతులైనా ఆర్భాటాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వివాహ వేడుకలకు పరిమితులు విధించడంతో మునుపటిలా వందలు, వేల మందిని ఆహా్వనించడం లేదు. పురోహితులకు డిమాండ్.. ఇక ఈ నెలలో కేవలం ఎనిఠిమిది రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలుండడంతో పెళ్లి పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. విజయవాడలో దాదాపు 1500 మంది పురోహితులున్నారు. వివాహానికి స్థాయిని బట్టి పురోహితులు రూ.30–60 వేల వరకు తీసుకుంటారు. కల్యాణ మండపాలకు గిరాకీ.. మరోవైపు కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ కనిపిస్తోంది. పెళ్లిళ్లు రెండు, మూడు నెలల ముందుగానే నిశ్చయమవడంతో అప్పట్లోనే వీటిని బుక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ నగరంలోని వివాహ వేదికలు ఖాళీ లేకుండా పోయాయి. బెజవాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 16 కల్యాణ మండపాలున్నాయి. ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు మరో 70 వరకు నడుస్తున్నాయి. ఈ నెలలో జరిగే పెళ్లిళ్లకు ఇవన్నీ దాదాపు బుక్ అయినట్టు చెబుతున్నారు. కొందరు ధనికులు పేరున్న హోటళ్లలో వివాహాలు జరిపించుకుంటున్నారు. విజయవాడలో వివిధ స్టార్ హోటళ్లలో 4,500 వరకు గదులుండగా వీటిలో సగటున 50 శాతానికి పైగా పెళ్లిళ్లకు బుక్ అయ్యాయి. నగరపాలక సంస్థ కల్యాణ మండపాలకు ఒక రోజు అద్దె రూ.10–15 వేలు, వీఎంసీ ఐవీ ప్యాలెస్ రూ.లక్ష ఉంది. ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ.. కోవిడ్ భయంతో చాన్నాళ్లుగా వివాహ వేడుకలను తగ్గించుకున్నారు. దీంతో ఆతిథ్య రంగం బాగా నష్టపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ నెలలో మంచి ముహూర్తాలుండడంతో నగరంలోని హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ 50 శాతం వరకు పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం. – ముప్పవరపు మురళీకృష్ణ, మెంబర్, విజయవాడ హోటలీయర్స్ అసోసియేషన్ ఈ నెలలో మంచి ముహూర్తాలు.. మాఘమాసం (ఫిబ్రవరి)లో సెంటిమెంటుగా భావించి పెళ్లిళ్లు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈ నెలలో ఎనిమిది రోజులు మంచి ముహూర్తాలున్నాయి. అందువల్ల ఆయా తేదీల్లో వివాహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. – కృష్ణశాస్త్రి, పురోహితుడు, విజయవాడ -
కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి..ఆపై విందు భోజనం! ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీలులేదు. పైగా అధికారులు కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ కఠినమైన కరోనా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒక జంట విన్నూతనమైన ఆలోచనతో తమ పెళ్లిని జరుపుకోవాలనుకున్నారు. అంతేకాదు తమ పెళ్లిని తమవారంతా చూసేలా సరికొత్త ఆలోచన చేశారు. అసలు విషయంలోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట జనవరి 24న వివాహం చేసుకోనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పెళ్లికి అతిథులు హాజరయ్యేందుకు ‘గూగుల్ మీట్’ని, భోజనాల కోసం జొమాటో యాప్‌ను( ఫుడ్ ఆర్డర్లు) వినియోగించనున్నారు. పైగా ప్రత్యక్షంగా పెళ్లిని చూసేలా లైవ్ టెలికాస్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ విధించిన నిబంధనలకు లోబడి 120 మంది అతిధులు నేరుగా పెళ్లికి హాజరవుతారు. కాగా మిగతా 300 మంది డిజిటల్ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. ఆహ్వానితులందరికీ వేడుకకు ఒక రోజు ముందు పాస్‌వర్డ్‌లతో పాటు వివాహాన్ని చూడటానికి లింక్‌ను కూడా అందిస్తారు. ఈ క్రమంలో ఆ జంట మాట్లాడుతూ.. ‘మేము గతేడాది వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ కరోనా అడ్డంకిగా మారింది. అందుకే మా కుటుంబ భద్రత, అతిధుల భద్రత దృష్ట్యా డిజిటల్ వివాహాన్ని నిర్వహించాలనే ఆలోచన చేశాము’ అని తెలిపారు. ఈ మేరకు జొమాటో అధికారి మాట్లాడుతూ.. ‘ఈ ఆలోచన చాలా ప్రసంశించదగ్గది. పైగా మాకు ఈ కొత్త ఆలోచన బాగా నచ్చింది. ఈ వివాహాలను స్వాగతిస్తున్నాం. అంతేకాదు ఇలాంటి వివాహాలను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
పెళ్లిళ్లలో హిజ్రాల వీరంగం.. నిరాకరిస్తే నగ్నంగా డ్యాన్స్
సాక్షి, జగిత్యాలక్రైం: పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరిపించాలని అనుకుంటారు. కానీ హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన భీమయ్య కుమారుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపించారు. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో హిజ్రాలు వచ్చి, వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి, నగ్నంగా డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు పారిపోయారు. రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన రమణ కుమారుడి పెళ్లి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో జరిగింది. హిజ్రాలు వేదికపైకి వెళ్లి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో ఆయన రూ.5 వేలు ఇచ్చి, పంపించారు. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి.. ) రూ.50 వేల వరకు వసూలు జగిత్యాల జిల్లాలోని అన్ని ఫంక్షన్‌హాళ్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని వా రు అడిగినంత ముట్టజెబుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలి తంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటు ంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) హిజ్రాల ఆగడాలను అరికట్టాలి జిల్లాలో వివాహ వేడుకలకు వచ్చి, హిజ్రాలు మామూళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఫంక్షన్‌కు వచ్చిన వారంతా భయపడుతున్నారు. పోలీసులు స్పందించి, హిజ్రాల ఆగడాలను అరికట్టాలి. – మారు గంగారెడ్డి, జాబితాపూర్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం హిజ్రాలు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తే బాధితులు 100 డయల్‌కు కాల్ చేయాలి. ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శుభకార్యాల్లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, డబ్బులివ్వాలని వేధిస్తే హిజ్రాలను కఠినంగా శిక్షిస్తాం. – రత్నపురం ప్రకాశ్, డీఎస్పీ, జగిత్యాల -
తరుముతున్న థర్డ్‌వేవ్: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్లోనే కానివ్వండి పంతులు గారూ’
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్): కరోనా విజృంభనతో గత ఏడాది వివాహాల కళ తప్పింది. నిబంధనల మధ్య కొద్ది మందితో, నిరాడంబరంగా పెళ్లిల్లు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వివాహాలకు కళ వచ్చింది. పెళ్లిళ్ల సందర్భంగా ఫంక్షన్‌హాల్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా వివాహాల హడావుడే కనబడుతోంది. కానీ మళ్లీ ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గత రెండేళ్లలో జరిగిన కరోనా పెళ్లిళ్లను గుర్తు చేసుకుంటూ ముందస్తుగా డిసెంబర్లోనే పెళ్లిళ్లను జరిపిస్తున్నారు. ఎప్పుడు, ఏమవుతుందోనని.. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించకముందే ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిపించాలనుకుంటున్నారు. ఈక్రమంలో డిసెంబర్లో 12,14,16,19,21, 22,24,26 27,28, 29రోజులలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ముందుముందు పరిస్థితులు ఎలా ఉంటాయని భయపడుతూ.. ముందస్తుగా డిసెంబర్లోనే పెళ్లి తంతు ముగించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోను ముహుర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నా ముందుగానే పెళ్లికి ముహుర్తాన్ని ఖరారు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 22వరకు ముహుర్తాలు ఉన్నాయంటు పలువురు పండితులు తేదీలను నిర్ణయించినా కూడా ఆ సమయానికి ఒప్పుకోవడం లేదు. చదవండి: అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం.. ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి, జనం గుంపులుగా తిరగడం చేస్తుండటం వల్ల థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటినుంచే జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని పలువురు పేర్కొంటున్నారు. చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు డిసెంబర్లో జోరుగా పెళ్లిళ్లు జనాలు థర్డ్‌వేవ్ వస్తుందన్న భయంతోనే డిసెంబర్లోనే పెళ్లి చేయాలని అంటున్నారు. దీంతో పురోహితులు ముహూర్తం ఉన్న రోజు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలో సైతం ముహుర్తాలు ఉన్నాయి. –వెంకటేష్పంతులు, దుర్కి మూణ్నాలుగు పెళ్లిళ్లకు వెళ్తున్నా.. డిసెంబర్ నెలలో ముహుర్తాలు చాలా ఉండటంతో రోజు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లకు హాజరవ్వాల్సి వస్తుంది. కొన్ని పెళ్లిళకు ప్రయాణం దూరం కావడంతో కొన్ని పెళ్లిళ్లకే హాజరవుతున్నాను. కొన్ని పెళ్లిళ్లకు వెళ్లడానికి సమయం సైతం సరిపోతలేదు. –పెర్క రాజు, మైలారం -
నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్లిళ్లు !
అయ్యా, గట్టి మేళం మోగించండి.. తలంబ్రాలు సిద్ధం చేయండి.. వివాహ భోజనంబు..చందన తాంబూలాలు, పూలు, పండ్లు రెడీ ‘విజయవాడకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తన కుమారుడికి ఈఏడాది మొదట్లో ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో కరోనా రెండో విడత కమ్ముకొచ్చింది. ఆయన యత్నాన్ని ఆదిలోనే దెబ్బతీసింది’.. ‘కెనడాలోని టొరంటోలో పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మధ్య తరగతి యువకుడికి కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. ముందనుకున్న ప్రకారం మే నెలాఖరులో వివాహం జరగాల్సి ఉంది. కానీ కరోనా ఆంక్షలు అడ్డం వచ్చాయి.అయితే ఇప్పుడవి తొలగిపోయాయి. – సాక్షి, అమరావతి కరోనా కారణంగా విధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించడం.. పెళ్లిబంధంతో ఒక్కటవుదామనుకుంటున్న యువతీ యువకుల నెత్తిన అక్షింతలయ్యాయి.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది ఇళ్లలో పెళ్లి భాజాభజంత్రీలు మోగుతున్నాయి. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రుల పలకరింపులు, ఆనంద వినోదాలతో పెళ్లింట కొత్త శోభ సంతరించుకుంటుంది. ఏదేమైనా..ఎక్కడ చూసినా.. రెండేళ్ల నాటి పరిస్థితులు మళ్లీ ఊపందుకుంటున్నాయనేది స్పష్టమవుతున్నది. కలిసొచ్చిన వ్యాక్సినేషన్.. కరోనా వైరస్ మహమ్మారి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో దాదాపు పూర్తి కావడం ఇందుకు ప్రధాన కారణం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో 98.86 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం జనం గుమికూడడంపై ఆంక్షలు సడలించింది. ఈ అవకాశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు పెద్దఎత్తున పెళ్లిళ్లకు గేట్లు బార్లా తెరిచారు. నెల వ్యవధిలో లక్షకు పైమాటే.. అఖిల భారత ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 13వతేదీ లోపు దాదాపు 26 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. కాగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని తెలుస్తున్నది. ఆగస్టులో కరోనా ఆంక్షల్ని స్వల్పంగా సడలించినప్పుడు 13 రోజుల్లో 47 వేలకు పైగా పెళ్లిళ్లు జరగడమే ఈ అంచనాకు ప్రాతిపదిక. ఆంధ్రాలో ఆది నుంచీ ఆడంబరమే.. ఇల్లుకట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత మనకు ఉండనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రాలో పెళ్లిళ్లకు పెట్టే ఖర్చు, ఆడంబరాలు ఆది నుంచీ ఎక్కువే. ముహూర్త బలానికి గిరాకీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు ఖాళీలు లేకుండా పోయాయి. నవంబర్ 21, 27, 28, డిసెంబర్ 8 తేదీల్లో స్టార్ హోటళ్లలోని హాళ్లు ఖాళీలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలామంది కార్తీక మాసంలోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడతారని పెళ్లిళ్ల పేరయ్యలు చెబుతున్నారు. ధరలు మండిపోతున్నాయి.. ఈ పెళ్లిళ్లు, కార్తీకమాసం పేరిట కూరగాయల ధరలు పెరిగిపోయాయని విజయవాడకు చెందిన ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎం.చంద్రశేఖర్ వాపోయారు. మంచి ముహూర్తం ఉన్న ఏ రోజూ కూరగాయలు దొరకడం లేదన్నారు. కిలోకి రూ.60,70 పెట్టనిదే ఏ కూరగాయా దొరకడం లేదని, చివరకి గోంగూర కట్ట రూ.10 అయిందని వాపోయారు. కార్తీకమాసం, మంచి ముహూర్తాలు కలిసి రావడంతో ఈవెంట్ మేనేజ్మెంట్లకు గిరాకీ పెరిగింది. కరోనా కాలంలో చిన్నా చితకా ఫంక్షన్లు చేసి మహాఅయితే ఏ 40,50 మందికో భోజనాలు ఏర్పాటు చేసిన వీళ్లకు ఇప్పుడు చేతినిండా పని దొరికినట్టయిందని విజయవాడకు చెందిన ఈవెంట్ మేనేజర్ శ్రీనివాసరావు చెప్పారు. బట్టలు, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పూల వ్యాపారుల పంట పడింది. పెళ్లి కుమారులు, కుమార్తెలు జిగేల్ జిగేల్ మంటూ మెరిసిపోతున్నారు. వేద పండితులకు, సన్నాయి వాయిద్య కళాకారులకు గిరాకీ పెరిగింది. ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్మేన్ల కొరత కనిపిస్తోంది. మొత్తం మీద ఖర్చుమాత్రం తడిసిమోపెడవుతున్నా ఎవ్వరూ ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. పెళ్లి వేడుకల్లో గట్టి మేళాలు మోగుతున్నాయి. -
శ్రావణ మాసం: ఒకే రోజు 300 పెళ్లిళ్లు
అన్నవరం: శ్రావణ మాసం వచ్చింది. శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముడుల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా మారింది. గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు. -
పెళ్లికి 150 మంది మించకూడదు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నియంత్రణలో భాగంగా పెళ్లిళలకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పెళ్లిళ్లతో పాటు ఏదైనా ఫంక్షన్లు, ప్రార్థనలు ఏదైనా సరే 150 మందికి మించి గుమికూడ వద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. సినిమాహాళ్లలో సీటు మార్చి సీటు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. తాజా నిబంధనలను జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కరోనా కాలం.. మ్యారేజెస్ మెనులోకి ఇవి కూడా చేరాయి..
ఇంతకుముందు పెళ్లిళ్లకు వెళితే యోగక్షేమాలు అడిగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. కరోనా కాలంలో కొత్త ట్రెండ్లు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిప్ట్స్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు పెళ్లివారు. ట్రెండీగా ఓటీటీ మెంబర్‌షిప్‌లు ఆఫర్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో మ్యారేజెస్ మెనులోకి కొత్తగా చేరిన అంశాలేంటి? పెళ్లిలకు ఓటీటీ మెంబర్‌షిప్‌లకు సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.. -
అను‘మతి’లేని పనులు.. పెళ్లిళ్ల పేరుతో..
అమ్మానాన్నలను కోల్పోయిన చిన్నారుల కళ్లలో భయం ఇంకా పోలేదు. కన్నపేగులను పోగొట్టుకున్న వృద్ధుల కంట నీటి ధార ఇంకా ఆగలేదు. పగిలిన గాజులు, తెగిన తాళిబొట్లు ఊరి పొలిమేరలు దాటి పోలేదు. దాపురించిన ఆపత్కాలం అయిపోలేదు. కేసులు తగ్గినా ప్రమాదం తగ్గలేదు. ఇలాంటి సమయంలో వేడుకలు సరికావని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఇంటిలో పెళ్లి మరొక ఇంటిలో చావుకు వేదిక కాకూడదని విన్నవిస్తున్నారు. మన వినోదం ఇంకొకరికి విషాదం పంచకూడదని హెచ్చరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వైద్య సిబ్బంది రాత్రీపగలు సేవలు అందిస్తున్నారు. అందరి కృషితో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జిల్లాలో కొందరు మంచి ముహూర్తాల పేరిట వందలాదిగా గుమిగూడుతూ శుభ కార్యాలు చేసుకుంటున్నారు. ఇలాంటివి వద్దని వారిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటివి ఆగకపోతే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడుకలకు హాజరైన వారు సూపర్ స్ప్రైడర్లుగా కోవిడ్‌ను వ్యాప్తి చేస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. అనుమతించిన వారి కంటే ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరిపైన రూ. 1000 అపరాధ రుసుం విధిస్తున్నారు. తగ్గుతున్నవి కేసులే.. ప్రమాదం కాదు జిల్లాలో రోజుకి 2,500కిపైగా కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడవి 231కి చేరాయి. ఇది మంచి పరిణామమే. అయితే కేసులు తగ్గుతున్నాయన్న ధీమాతో జిల్లాలో పలుచోట్ల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యక్రమాలు చేపడుతున్నారు. వందలాది మంది హాజరై కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్పీ, డీఎస్పీలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు ఎక్కడికక్కడ పెళ్లిళ్లు జరుగుతున్న చోటకు వెళ్లి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. నిబంధనలకు మించి ఎక్కడ ఎక్కువ మంది హాజరయ్యారో అక్కడ సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అక్కడికక్కడే అపరాధ రుసుం విధిస్తున్నారు. జిల్లాలో నమోదైన కేసులివి.. ► పాతపట్నంలో నిబంధనలకు మించి 200మంది అదనంగా హాజరయ్యారని పెళ్లి నిర్వాహకులపై రూ. 2లక్షల అపరాధ రుసుం విధించారు. ► ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో నిబంధనలు ఉల్లంఘించి వివాహం జరిపిన ఒక కుటుంబానికి రూ.10వేలు ఫైన్ వేశారు. ► మర్రికొత్తవలసలో నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసిన వారికి రూ. 20వేలు అపరాధ రుసుం విధించారు. ► చేపనపేట గ్రామంలో రూ. 5వేలు అపరాధ రుసుం వేశారు. ► బూర్జ మండలంలో కూడా ఒక కుటుంబంపై రూ. 10వేలు అపరాధ రుసుం విధించారు. ► సోంపేట మండలం బెంకిలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వివాహం జరిపించిన ఇద్దరికి రూ. 20వేలు ఫైన్ విధించారు. ► సోంపేట మండలంలోని జింకిభద్రలో ఒకరికి రూ. 20వేలు అపరాధ రుసుం విధించారు. ► ఎల్‌ఎన్‌పేట మండలం వాడవలస, శ్యామలాపురం ఆర్అండ్ఆర్ కాలనీలో రెండు కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఫైన్ వేశారు. ► ఇచ్ఛాపురం మండలం రత్తకన్న గ్రామంలో నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసేందుకు సిద్ధమైన ఓ కుటుంబంపై రూ.25వేలు అపరాధ రుసుం విధించారు. ► నరసన్నపేట మండలం చెన్నాపురం పంచాయతీ గొనబుపేటలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పెళ్లి నిర్వాహకులపై రూ. 15వేలు జరిమానా విధించారు. ► నరసన్నపేట మండలం శివరాంపురంలో ఒక కుటుంబంపై రూ. 20వేలు ఫైన్ వేశారు. ► సీతంపేట మండలం పూతికవలస పంచాయతీ ఈతమానుగుడలో నిబంధనలకు విరుద్ధంగా దైవప్రార్థనలు చేసిన వారికి రూ.లక్ష అపరాధ రుసుం విధించారు. చర్యలు తప్పవు కోవిడ్ కట్టడికి అధికారులంతా కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన వారి కంటే ఎక్కువ మందితో శుభ కార్యాలు నిర్వహిస్తున్నారు. ఇది సరికాదు. కోవిడ్ వ్యాప్తికి ఇవి కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నాం. ఎంతటి వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. – జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం -
కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా?
సాక్షి, బెంగళూరు: కేరళ నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి, లేదంటే వారిని వెనక్కి పంపిస్తారు. ఈ నిబంధనలు కాబోయే దంపతులకు చుక్కలు చూపిస్తున్నాయి. వధువు కర్ణాటక, వరుడు కేరళ, వివాహం కొడగు జిల్లా మడికేరిలో అయితే, వరుడు సహా వందలాది మంది బంధుమిత్రులు కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించడం సాధ్యమేనా అని కేరళీయులు నిట్టూరుస్తున్నారు. కొత్త నిబంధనలతో కష్టం.. కేరళ, మహారాష్ట్రలో కరోనా మళ్లీ పెరగడంతో అక్కడి నుంచి వచ్చే వారికి కొత్త నిబంధనను కర్ణాటక అమలు చేస్తోంది. కరోనా పరీక్ష నెగిటివ్ రిపోర్టు చూపిస్తేనే ఈ ఇరురాష్ట్రాల వారిని అనుమతిస్తారు. దీంతో చాలా మందికి ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. సుమతి– ప్రమోద్‌ల పెళ్లికి ఆటంకం కొడగు జిల్లా మడికేరిలోని కడగదాళు గ్రామానికి చెందిన సుమతి అనే అమ్మాయి పెళ్లి కేరళలోని కాసరగోడు జిల్లాకు చెందిన ప్రమోద్ నాయర్‌తో నిశ్చయమైంది. మడికెరిలోని ఓంకారేశ్వర దేవాలయంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికొడుకు బృందంవారు కరోనా నెగిటివ్ రిపోర్టు తీసుకురావాల్సి రావడంతో సమస్య వచ్చి పడింది. అంతమందీ కరోనా పరీక్షలు జరిపించాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పరీక్షలు చేయించుకున్నా 72 గంటల వరకు రిపోర్టులు రావని బంధువులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సోమవారం వివాహం నాటికి కరోనా పరీక్షల ఫలితాలు రావడం ఆలస్యమవుతుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులే హాజరైతే 10–15 మంది ఉంటారని, వారికి ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయిస్తే కనీసం రూ. 25 వేలైనా ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసి కూతురు పెళ్లి చేస్తున్న తమలాంటి సామాన్యులకు అంతటి భారం మోయడం కుదరని చెప్పారు. తమ బాధను అర్థం చేసుకుని పెళ్లికైనా నిబంధనలను సడలించాలని వేడుకున్నారు. కేరళ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటువంటి ఉదంతాలు మరెన్నో ఉన్నాయి. చదవండి: కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్డౌన్ ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు.. -
ఒకే రోజు 200 పెళ్లిళ్లు
టీ.నగర్: రాష్ట్రంలోని మదురై, తిరుప్పరంగుండ్రం, కడలూరులలో శుక్రవారం ఒకే రోజు రెండు వందల వివాహాలు జరిగాయి. మీనాక్షి అమ్మవారి ఆలయం, తల్లాకుళం పెరుమాళ్ ఆ లయం, తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయాల ఎదుట వందకు పైగా వివాహాలు జరిగా యి. అదేవిధంగా శుక్రవారం తిరుప్పరంగుండ్రం మురుగన్ ఆలయంలో 50 పెళ్లిళ్లు జరిగా యి. కడలూరు సమీపంలోగల తిరువందిపురం ప్రాంతంలోని కల్యాణ మండపంలో 50కి పైగా వివాహాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జరిగాయి. ఒక్కో వివాహాన్ని నిర్ణీత సమయంలో ముగించడంతో వరుసగా వివాహ కార్యక్రమాలు సాగాయి. వివాహానంతరం నూతన జంటలు కుటుంబ సభ్యులు, బంధువులతో తిరు వందిపురం దేవనాదస్వామి దర్శనం చేసుకున్నారు. -
పువ్వులా.. నవ్వులా!
ప్రీ వెడ్డింగ్ షో అని పెళ్లికి ముందు వధూవరులు వీడియో, ఫొటో షూట్లలో పాల్గొనడం, ఆ మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం తెలిసిందే. ఈ ఫొటో షూట్‌కి పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇండోవెస్ట్రన్ స్టైల్లో దుస్తులు ధరిస్తుంటారు. అందులో ముఖ్యంగా పెళ్లి కూతురు దుస్తులు చూస్తే గౌన్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. పచ్చని ప్రకృతిలో పువ్వులాంటి గౌన్ ధరించిన అమ్మాయి మరింత అందంగా ఆకట్టుకుంటుంది. పెళ్లికూతురు గెటప్ కోసమే కాదు, కాక్టెయిల్ పార్టీలకు, బర్త్ డే పార్టీలకు గౌన్స్టైల్ యువతులకు బాగా నప్పుతుంది. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన గౌన్లు ఇవి. ►పొరలుపొరలుగా ఉండే పూల రేకలను పోలిన థీమ్ ఈ గౌన్ల సొంతం. ►రంగు రంగుల పూల రేకలు, పచ్చని ఆకులు.. ప్రకృతికి ప్రతిబింబం. అదే థీమ్తోడిజైన్ చేసిన గౌన్లు ఇవి. లైట్ మేకప్ బెస్ట్ ►గౌన్లు హైనెక్‌తో ఉంటే చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది ►డీప్ నెక్ ఉంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చోకర్ నెక్లెస్ పెట్టుకోవచ్చు ►జుట్టుకు ఒక ఫ్లోరల్ హెడ్ బ్యాండ్ పెట్టుకున్నా చాలు. లేదంటే పెళ్లి వంటి ఫంక్షన్స్ అయితే హైబన్–లోబన్.. వంటివి ట్రై చేయవచ్చు ►మేకప్ గాడీగా కాకుండా ధరించిన డ్రెస్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి. గౌన్ ముదురు రంగులో ఉంటే మేకప్ లైట్‌గా న్యూడ్ షేడ్స్ వేసుకుంటే బాగుంటుంది ►గౌన్ లేత రంగులో ఉంటే బ్రైట్ మేకప్‌ను వేసుకోవచ్చు ►ఈ గౌన్లకు యాక్ససరీస్ ఎంత తక్కువ ధరిస్తే అంత బాగుంటుంది. – సాగరికారెడ్డి, అభిజ్ఞారెడ్డి ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ స్టైలిస్ట్, హైదరాబాద్ ఇన్‌స్ట్రాగ్రామ్: abhignasagarikaofficial -
అదృష్టం తలంబ్రాలు చల్లింది
ఐదు నెలల పాపాయి సాక్షిగా జరిగిన పెళ్లి అది! పాపాయి అమ్మ అరుణ, నాన్న జీతేశ్వర్ పెళ్లి చేసుకున్నారు. అదే పందిరి కింద పాపాయి నానమ్మ సహోదరి (ఆమె పేరే సహోదరి), తాత రామ్‌లాల్ కూడా దంపతులయ్యారు. రామ్‌లాల్, సహోదరి ఇద్దరూ ముప్పై ఏళ్లు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉండి ఇప్పుడు దంపతులయ్యారు. వాళ్లకు పుట్టిన జీతేశ్వర్ కూడా అదే రోజు అరుణను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే జీతేశ్వర్, అరుణలకు ఐదేళ్ల పాపాయి ఉంది. చిత్రంగా ఉన్నా విచిత్రంగా ఉన్నా ఇది నిజం. జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసీ తెగలో జరిగిన పెళ్లిళ్లు అవి. ఆ రోజు జరిగింది ఈ రెండు పెళ్లిళ్లే కాదు. రెండు వందల పెళ్లిళ్లు జరిగాయి. వధూవరుల్లో ఇరవైలలో ఉన్నవాళ్లే కాదు, అరవైలలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ ఆదివాసీ తెగలో ఉన్న ఒక దుస్సంప్రదాయం కారణంగా పెళ్లి బంధం లేకుండానే లివింగ్ ఇన్ రిలేషన్ షిప్లో కొనసాగిన వాళ్లే వాళ్లంతా. అంతకంటే లోతుగా చెప్పాలంటే చేతిలో డబ్బులేకపోవడం వల్ల వాళ్ల తెగ దుస్సంప్రదాయాన్ని పాటించే ఆర్థిక వెసులుబాటు లేక పెళ్లి చేసుకోకనే కలిసి జీవించిన వాళ్లు. జార్ఖండ్, కుంతి జిల్లాలోని ఆదివాసీ తెగల్లో పెళ్లి అంటే విపరీతమైన ఖర్చుతో కూడిన వ్యవహారం. పెళ్లి చేసుకునే వాళ్లు ఊరు ఊరంతటికీ తిన్నంత తినిపించాలి, తాగినంత తాగించాలి. అప్పుడే ఒక స్త్రీ– పురుషుడిని వివాహబంధంలోకి అనుమతిస్తుంది వాళ్ల తెగ ఆచారం. రోజూ పని దొరుకుతుందనే భరోసా లేదు. ఇక పెళ్లి వేడుక చేసుకోవడానికి డబ్బెక్కడ నుంచి తేవాలి? అందుకే ఈ లివింగ్ ఇన్ రిలేషన్ షిప్‌లు. ధుక్ని.. ధుకాష్.. ధున్‌కా ఈ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌ని ఆదివాసీలు ‘ధుక్ని, ధుకావ్, ధున్‌కా’ అనే పేర్లతో పిలుస్తారు. ఈ రిలేషన్‌షిప్‌ని ధుకు అని, ఆ రిలేషన్లో ఉన్న మహిళను ధుక్నీ మహిళ అని వ్యవహరిస్తారు. ఇదేమీ గౌరవప్రదమైన హోదా కాదు. జీవితంలో చొరబడిన మహిళ అని అర్థం. భార్య అనే హోదా ఉండదు కాబట్టి దుక్నీ మహిళ నుదుట సింధూరం ధరించడానికి వీల్లేదు. ఆమెకు పుట్టిన పిల్లలకు చెవులు, ముక్కులు కుట్టించడానికి వీల్లేదు. ఆ మగమనిషి రేషన్ కార్డులో ఆ మహిళ పేరు ఉండదు, పిల్లల పేర్లు నమోదు కావు. ఆ పిల్లలకు ఆధార్ కార్డులుండవు. ధున్‌కా రిలేషన్షిప్లో ఉన్న పురుషుడు చనిపోతే ఆ మహిళకు అతడి ఆస్తిలో భాగం రాదు. ఆమె మరో వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకోవాలి లేదా ఆ చనిపోయిన మనిషి బంధువుల దయాదాక్షిణ్యాల మీద బతుకు సాగించాలి. ఆ మహిళలు చెప్పే మరో కష్టం ఏమిటంటే.. సొంత ఊళ్లో అయితే ఎవరు ఎవరితో కలిసి జీవిస్తున్నదీ అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈవ్ టీజింగ్ ఉండదు. ఈ మహిళలకు నుదుట సింధూరం లేకపోవడంతో (వివాహిత అనడానికి గుర్తు) బయట గ్రామాలకు వెళ్లినప్పుడు పెళ్లి కాని యువతులుగా భావించి మగవాళ్లు టీజ్ చేస్తుంటారు. అయినప్పటికీ ఖరీదైన పెళ్లి వేడుకకు భయపడి లివింగ్ ఇన్‌లో ఉన్న వాళ్లు వేలాదిమంది ఉన్నట్లు్ల సమాచారం. ఊరంతా పెళ్లి కళ ఈ నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలోని రిటైర్డ్ పోలీస్ అధికారి ఆరాధనా సింగ్ చొరవతో ఒక స్వచ్ఛంద సంస్థ ఈ సామూహిక వివాహాలు చేసింది. ఆమె సర్వీస్ ఎక్కువగా ట్రాఫికింగ్‌కు గురైన పిల్లలను వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడంలోనే గడిచింది. ఆదివాసీల పిల్లలు అపహరణకు గురయినప్పుడు వాళ్లను వెతికి పట్టుకోవడం, వెతికి పట్టుకున్న పిల్లలను ఎవరి పిల్లలో నిర్ధారించుకుని తల్లిదండ్రులకు అప్పగించడం ఒక సవాల్‌గా ఉండేదామెకి. ఆ పిల్లల పేర్లు ఎక్కడా అధికారికంగా నమోదు కాకపోవడమే అందుకు కారణం. అలా తప్పిపోయి దొరికిన ఒక పిల్లాడి తండ్రి ఒకరోజు మద్యం తాగి ఆమె ఇంటి ముందుకు వచ్చి ‘పెళ్లి చేసుకుంటాను, డబ్బివ్వమని’ కాళ్లావేళ్లా పడ్డాడు. అప్పుడు విచారిస్తే ఆదివాసీల జీవనశైలి తెలిసిందామెకు. స్థానికంగా పనిచేస్తున్న ‘నిమిత’ అనే ఓ స్వచ్ఛంద సంస్థతో మాట్లాడి ఈ పెళ్లిళ్లు చేయించారు ఆరాధనా సింగ్. తొలి అడుగుగా వాళ్లకు పెళ్లి ప్రయత్నం జరిగింది.పెళ్లికి అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదని చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఆచారాలు మనిషిని ఒక సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేయాలి తప్ప, మనిషికి మోయలేని బరువుగా మారకూడదని వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేదెవరు? పెళ్లి పెద్ద ఆరాధనా సింగ్, నమిత స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రయత్నం చేస్తే వినేందుకు ఆ తెగల్లోని మిగతా వాళ్లు మానసికంగా సిద్ధంగా ఉంటారా అనేదే పెద్ద ప్రశ్న. -
పవర్ గర్ల్
ప్రేమ ముందు ఎవరెస్టు శిఖరం కూడా చిన్న రాళ్ల గుట్టలా అనిపిస్తుంది. ప్రేమ మహిమ అది. అలాగని ప్రియాంకా చోప్రా ప్రేమలో మునిగిపోయి తన కెరీర్‌లోని భవబంధాలనేమీ తెంచుకో లేదు. పెళ్లి వల్ల వచ్చిన కొత్త పవర్‌తో.. పాత విధుల్లోకి ఉత్సాహంగా పునఃప్రవేశం చేయబోతున్నారు. పెళ్లి తప్ప జీవితంలో ఇంకేం లేనట్లు.. కాబోయే భర్త (ఇప్పుడయ్యిందిలెండి) భుజం మీద చెయ్యేసి నోరంతా తెరిచి ఇలా నవ్వుతోందేమిటీ పిచ్చిపిల్ల.. ఆరేడు నెలలుగా! న్యూయార్క్ వెళుతోంది. ముంబై వస్తుంది. మళ్లీ న్యూయార్క్, మళ్లీ ముంబై. అస్సలు ఎక్కడా సింగిల్‌గా కనిపించలేదు. నిక్ ఆమెకు ఒక బాడీ పార్ట్‌గా ఉన్నాడే కానీ, బాయ్ ఫ్రెండ్‌గా లేడు. అంతలా ప్రియాంక అతడిని అంటిపెట్టుకునే ఉంది. నిక్ కూడా ఆమె వెంట తిరుగుతున్నాడు కానీ.. ఆ తిరగడంలో పెద్దగా ఫీల్ కనిపించడం లేదు. సరే, అది అతడి స్వభావం. ప్రియాంకైనా చిన్నపిల్లైపోయి నిక్‌పై అందర్లో అలా వాలిపోవాలా? పోనివ్వండి. అది పర్సనల్. ఇప్పుడు అభిమానుల కన్సర్న్ ఏంటంటే.. పెళ్లైపోయింది కదా.. లాస్ట్ సాటర్డే.. ఇకనైనా ప్రియాంక కుదురుగా ఉంటుందా? అని. ఆమె చేయవలసిన చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయి. అసలు నిక్ సమక్షంలో గడపడం కోసమే ఆమె సల్మాన్ చిత్రం ‘భరత్’ సినిమా కాంట్రాక్ట్‌ను సగంలో రద్దు చేసుకుని వెళ్లిపోయింది. అలాంటివే కొన్ని చిన్నచిన్న ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యాయి. ప్రేమ మహిమ కావచ్చు. ప్రేమ ముందు ఎవరెస్టు శిఖరం కూడా చిన్న రాళ్ల గుట్టగా కనిపిస్తుంది కదా. అయితే మనం అనుకుంటున్నట్లేమీ తన కెరీర్‌తో, సేవాకార్యక్రమాలతో భవబంధాలనేమీ తెంచుకోలేదు. ప్రియాంక బాలీవుడ్లో సూపర్‌స్టార్. హాలీవుడ్లో ఇండియన్ సూపర్ స్టార్. అంత స్టార్‌డమ్‌ను కూడా ఆమె పక్కన పెట్టేసి కామన్ గర్ల్ అయిపోయింది. నిక్కే (నిక్ యే) ఆమె లోకం అయిపోయాడు. మంచి విషయమే. అయితే ప్రియాంక గురించి మనం మర్చిపోకూడనివి మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. పెళ్లే జీవితంలా ఆమె ప్రస్తుతానికి కనిపించవచ్చు. మునుపటి ప్రియాంక ఆమెలోంచి ఎక్కడికీ పోలేదు. వారం క్రితం (పెళ్లయ్యాకే) ‘టైమ్స్’ ప్రతినిధి మొహువా దాస్‌కు ముంబై జుహు హోటల్లో కొంచెం టైమ్ ఇచ్చారు ప్రియాంక. కొత్త పెళ్లి కూతురులోని పాత ఉద్యమ నాయికను మొహువా బయటికి తీసుకొచ్చారు. కష్టపడినందుకే గుర్తింపు ‘‘వెళ్తానని నాకు తెలియదు. వెళ్లాలని నేను అనుకోలేదు. ప్రతి పనిలోనూ కష్టపడతాను. నన్నెవరో గుర్తుంచుకోవాలని, పెద్ద పేరు తెచ్చుకోవాలనీ దేశాలను పట్టుకుని వెళ్లలేదు. అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. ఏదైనా ఊరికే వచ్చేయదు. మనం ఇక్కడ కష్టపడుతుంటామా.. ఎక్కడో గుర్తింపు వస్తుంది’’ అంటున్న ప్రియాంక.. ప్రస్తుతం తన ప్రాజెక్టులన్నిట్లో తిరిగి నిమగ్నమయ్యే పనిలో ఉన్నారు. 1 ప్రియాక దశాబ్దకాలంగా ‘యునిసెఫ్’తో కలిసి బాలికల హక్కులు, బాలల రక్షణపై పని చేస్తున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ ఘోర పరిస్థితుల్లో బ్రతుకును ఈడుస్తున్న రొహింగ్యా పిల్లల్ని కలిశారు. పర్సు తియ్యక్కర్లేదు ‘‘పిల్లలు పిల్లలే. భవిష్యత్తు పిల్లల్దే. పిల్లల భవిష్యత్తే ప్రపంచ భవిష్యత్తు. దేశాల మధ్య ఏమైనా ఉండనివ్వండి. పిల్లల్ని సరిగా ఉంచాలి. సరిగా పెంచాలి. మంచి చదువు. మంచి ఆహారం. శుభ్రమైన జీవితం. వాళ్లను కనుక నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యంగానే పెరిగి పెద్దవారౌతారు. కోరుకున్నది పొందలేకపోతే ప్రపంచంపై కోపం, కసి, పగ పెంచుకుంటారు. హింసావాదులుగా, ఉగ్రవాదులుగా అవుతారు. అందుకే మనం విశాలంగా ఆలోచించాలి. వివక్షను మత దురాభిమానాలను పక్కనపెట్టి పిల్లలకు ప్రేమను అందించాలి. వాళ్లకు వసతులు, సదుపాయాలు కల్పించాలి. ఇందుకోసం మన పర్సు ఖాళీ చేసుకోనక్కర్లేదు. మన జీవితంలోంచి పరోపకారం కోసం ఏడాది కాలాన్ని త్యాగం చెయ్యనక్కర్లేదు. ఎవరికి వారు ఎక్కడికక్కడ సామాజిక బాధ్యతను నెరవేర్చగలిగితే చాలు. పిల్లలు హాయిగా బతికేస్తారు. చక్కటి పౌరులుగా ఎదుగుతారు.’’ అని చెప్తారు ప్రియాంక. 2 మన దేశంలో బాలికల పరిస్థితి, బాలల హక్కులు ఎలా ఉన్నాయన్న దానిపైన కూడా యూనిసెఫ్ ప్రతినిధిగా నిశిత పరిశీలనే చేశారు ప్రియాంక. ఇండియాను ‘డిఫరెంట్ బీస్ట్’ అంటా రు ఆవిడ. అంటే పూర్తి భిన్నమైన దేశం అని. పరాయి సొత్తా! ఇదేం మాట? ‘‘చూడండి ఎంత పెద్ద జనాభానో. మన ఆలోచనలు కూడా సనాతనంగా ఉంటాయి. ఐదు వేల ఏళ్ల నాగరికత. అప్పట్నుంచీ ఒకటే మాట వింటున్నాం.. ‘లడ్కీ పరాయా ధన్ హోతీ హై’ అని. ఆడపిల్ల పరాయి వాళ్ల సొత్తా! ఇదేం మాట? ఆమె జీవితం ఆమెది కాదా?! ఇంటిని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. మరి తనను తాను చూసుకోడానికి ఇంకా ఎన్ని యుగాలు ఆగాలి? ఇంటినీ, పిల్లల్ని చూసుకోవడం తప్పని కాదు. తనకూ కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశాన్ని ఈ సమాజం కల్పించాలి కదా. ప్రభుత్వాలు బాలికల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. మనం వెనక్కు లాగకుండా ఉండాలి’’.. అంటారు ప్రియాంక. 3 ‘మీటూ’ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రియాంక ముక్కుసూటిగానే ఉన్నారు. ‘మీటూ’ అంటూ తనుశ్రీ దత్తా బయటికి వచ్చినప్పుడు మొదట ఆమెను సపోర్ట్ చేసింది ప్రియాంకే. తర్వాత ఒకరిద్దరు ఆమెను ఫాలో అయ్యారు. అక్కడితో బాలీవుడ్ మీటూ ఆగిపోయినట్లయింది! ఎందుకని బాలీవుడ్ స్టార్లు నోరెత్తడం లేదు? మహిళంటే మహిళే ‘‘నిజమే. కానీ మనం బాలీవుడ్ దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాం. ఒక్క బాలీవుడ్లోనే వేధింపులు ఉన్నాయా? తక్కిన ఇండస్ట్రీలలో వేధింపులకు గురవుతున్న మహిళ తరఫున అక్కడి వాళ్లూ బయటికి రావడం లేదేం? మహిⶠంటే మహిళే. బాలీవుడ్ మహిళ, మీడియా మహిళా, ఐటీ మహిళ అని కాదు. అన్ని రంగాల్లోని మహిళలు, మహిళలకు మద్ధతుగా పురుషులు బయటికి రావలసిన అవసరం ఉంది’’ అని ప్రియాంక ఉద్దేశం. 4 సినిమాలు చెయ్యడం, సినిమాలు తియ్యడం, టెక్ కంపెనీలకు, కోడింగ్ (టెక్నికల్ టీచింగ్) ఎడ్యుకేషన్‌కు కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చెయ్యడం, ఒక డేటింగ్ యాప్‌ని నడపడం.. ఇన్ని ఎలా చేస్తున్నారు. చేస్తూ కూడా టెన్షన్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు! స్వేచ్ఛగా పెంచాలి ‘‘బహుశా మా పేరెంట్స్ పెంపకం’’ అంటారు ప్రియాంక. ‘‘నాకు ఏం కావాలంటే అది ఇచ్చారు. ఏం చేస్తానంటే అది చెయ్యనిచ్చారు. ‘నీకేం నచ్చుతుందో అందులో ముందుకు వెళ్లేందుకు భయపడకు’ అని చెప్పారు. మన దేశంలో చాలామంది అమ్మాయిలకు ఇంత అదృష్టం ఉండదు. వాళ్లసలు బయటికి కనిపించనేకూడదు. నలుగురికీ వినిపించేలా మాట్లాడకూడదు. నిండుగా బట్టలు వేసుకోవాలి. అణకువగా, బిడియంగా ఉండాలి.. ఇలా చెప్తారు ఇంట్లోని వాళ్లు. అయితే వాళ్ల గొంతును వాళ్లు వినిపించే అమ్మాయిలు ఇప్పుడు సమాజానికి కావాలి. కనుక ఆడపిల్లల్ని ధైర్యంగా, మాటకారిగా ఉండే లా పెంచాలి’’ అని ప్రియాంక అభిప్రాయం. 5 నిక్ కోసం, న్యూయార్క్ వెళ్లడం కోసం దేశంలోని సొంత మనుషులను, సొంత సినిమాలను వదులుకుని వెళ్లారని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు ప్రియాంక. ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగా కాలిపై కాలు వేసుకుని కూర్చోవడంపైన కూడా నెటిజన్లు ఆమెను విమర్శించారు. నాకేం కోపం ఉండదు ‘‘మనది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కుంది. అలాగని కంప్యూటర్ల వెనుక నక్కి దొంగచాటుగా ట్రోల్ చెయ్యడం ధైర్యం లేని పని. ఇలాంటి పోస్ట్‌లను కూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఫ్యాన్స్ నుంచి నాకు అభిమానం ఎలాగైతే లభిస్తోందో.. నేనంటే ఏ కారణం చేతనో గిట్టని వాళ్ల నుంచి ద్వేషమూ అలాగే లభిస్తుంది. ఇందులో ఆలోచించవలసింది, ఆగ్రహించవలసింది, తిరుగు పోస్ట్‌లతో ప్రతీకారం తీర్చుకోవలసిందీ ఏముంటుంది?’’ అని ప్రియాంక అంటారు. ‘హాలీవుడ్‌కు అంతగా అడిక్ట్ అయిపోయారా?’ అని కొందరు ఆమెను ట్రోల్ చేశారు. . -
ఒక్క రోజే 5వేల పెళ్లిళ్లు!
న్యూఢిల్లీ: మంచి ముహూర్తాలు ఉండటంతో దేశ రాజధానిలో సోమవారం ఒక్క రోజే 5వేల వరకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే, అక్కడక్కడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. పెళ్లిళ్ల నేపథ్యంలోనే పోలీసు శాఖ అదనంగా వెయ్యి మందికి పైగా సిబ్బందిని విధుల్లో ఉంచింది. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా రూట్లలో ఉన్న రద్దీని వాహనదారులకు తెలియజేస్తూ సూచనలిచ్చింది. సిబ్బంది మోటారు సైకిళ్లపై తిరుగుతూ రాకపోకలను క్రమబద్ధీకరించారు. అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు. -
ఒకే ముహూర్తాన 131 పెళ్లిల్లు
సాక్షి, ఆసిఫాబాద్: ఒకే ముహూర్తాన 131 జంటలు మూడు ముడులు, ఏడు అడుగుల బంధంతో ఏకమయ్యాయి. ఇందులో 91 ఆదివాసీ జంటలున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్ వేది కైంది. బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల యువతీ యువకుల వివాహాలను ఘనంగా జరిపించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటలకు కోనేరు ట్రస్టు ద్వారా ఉచితంగా పుస్తె మట్టెలు, వస్త్రాలు, ఫ్యాను, బీరువా తదితర సామగ్రిని కోనప్ప అందజేశారు. జంటలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తామన్నారు. -
ప్రేమకథను అందంగా చెక్కించిన సమంత...
పెళ్లి వేడుకల్లో ఫ్యాషన్ అగ్రతాంబూలం అందుకుంటోంది. వెడ్డింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాస్ట్లీ వెడ్డింగ్‌లకు కేరాఫ్ మారిన మన నగరం... వేడుకలో ధరించేదుస్తులకు అంతే ప్రాధాన్యమిస్తోంది. రూ.లక్షల్లో ఖర్చు చేస్తోంది. జాతీయ డిజైనర్లనుసంప్రదిస్తోంది. సిటీ సెలబ్రిటీల పెళ్లిళ్లను గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. పింకీ‘సన్’దడి... డిజైనర్స్ రారండి సిటీ సోషలైట్ పింకీరెడ్డి–సంజయ్‌రెడ్డి కుమారుడు కేశవ్‌రెడ్డి పెళ్లి సుబ్బరామిరెడ్డి మనవరాలితో జరిగిన విషయం విదితమే. ఈ వేడుకకు రణ్‌వీర్‌సింగ్, రవీనాటండన్, శిల్పాశెట్టి తదితర ముంబై తారాగణమంతా దిగింది. నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో పెళ్లి కూతురి చీరలు, గాగ్రా చోళీలు.. వరుడు ధరించిన షేర్వానీ, సూట్స్ అసాధారణ డిజైన్లతో ఆహూతులను కట్టి పడేశాయి. అవును మరి.. దేశంలోనే టాప్ డిజైనర్లుగా పేరొందిన మనీష్‌మల్హోత్రా, సబ్యసాచి, తరుణ్ తహ్లియానీ, రోహిత్‌బాల్, నీతాలుల్లా, నిషికాలుల్లా లాంటి మహామహులు తీర్చిదిద్దినవి ఇవి. వధూవరులకే కాదు.. ఏకంగా కుటుంబం మొత్తానికీ తమదైన హంగులు అద్దారు వీరు. రోహిత్, శంతను–నిఖిల్ సంగీత్, రిసెప్షన్ కోసం సంప్రదాయ దుస్తులకు తమదైన ప్రత్యేకతను జోడించారు. వీరి కూతురు మల్లికారెడ్డి పెళ్లి వేడుక సమయంలోనూ ముంబై నుంచి వచ్చిన అతిథుల జాబితాకే కాదు... ప్రఖ్యాత డిజైనర్లు తీర్చిదిద్దిన డ్రెస్సులూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. సల్లూ భయ్యా.. అదిరిందయ్యా సల్మాన్‌ఖాన్ తన సోదరి అర్పితాఖాన్ వివాహ వేడుకను సిటీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు పనిచేశారు. అర్పితాఖాన్ ధరించిన గ్రాండ్ లెహెంగా డ్రెస్‌ని ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్ఖోస్లాతో డిజైన్ చేయించారు. ఈ డ్రెస్ ధరించిన అర్పితా తన లుక్‌తో ఆహూతులను కట్టిపడేసింది. వేడుకలో రెండో కాస్ట్యూమ్‌గా క్రీమ్, పింక్ కాంబినేషన్లతో డిజైన్ చేసిన దుస్తులను ఢిల్లీ డిజైనర్ అనితాడోంగ్రేతో డిజైన్ చేయించారు. ఫ్యామిలీ ‘షో’ ఒకప్పుడు పెళ్లంటే వధూవరులే ప్రత్యేకం. ఇప్పుడు మాత్రం సకుటుంబ సపరివారంగా డిజైనర్ దుస్తులతో సిద్ధమవుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కూతురిని మించి తల్లి.. కొడుకును మించి తండ్రి అన్నట్టు డిజైనింగ్ దుస్తులతో అదరగొట్టేస్తున్నారు. దీంతో ఇది డిజైనర్లకు మరింత కలిసొచ్చే ట్రెండ్ అయింది. ‘ఇప్పుడు పెళ్లి దుస్తులను ఒక్క వధూవరులకే కాకుండా కుటుంబసభ్యులు మొత్తం డిజైన్ చేయించుకుంటూ, పూర్తి ప్యాకేజ్ ఆర్డర్ ఇస్తున్నారు. దీంతో ఒక పెళ్లి వర్క్ అంటే కనీసం 15 రోజులపైనే పడుతోంద’ని నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సంతోష్‌కుమార్ చెప్పారు. అంతేకాదు కుటుంబసభ్యులు మొత్తం ఒకే తరహాలో డిజైన్ చేయించుకునే థీమ్ డ్రెస్సింగ్ కూడా ఇప్పుడు సిటీలో ట్రెండ్‌గా మారింది. లక్షల్లో... కోట్లలో... నటి సమంత ఎంగేజ్మెంట్కు రూపొందించిన ఒక్క లెహెంగాకే రూ.15లక్షల వరకు వెచ్చించినట్టు సమాచారం. అదే విధంగా పింకీరెడ్డి కుమారుడి పెళ్లి వేడుకల కోసం రూపొందించిన దుస్తుల ఖర్చు రూ.కోట్లలోనే ఉంటుందని ఫ్యాషన్ పరిశ్రమ వర్గాల అంచనా. ఓ వైపు ఖరీదైన వేడుకల్లో దుస్తుల వ్యయం ఇలా పెరిగిపోతుంటే.. మరోవైపు డిజైనర్ దుస్తులను సామాన్యుల దరికి చేర్చే మార్కెట్ ప్లాన్లూ ఊపందుకున్నాయి. ‘మొత్తం పెళ్లి దుస్తుల ఖర్చును ఇప్పుడు రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చించడానికి మధ్య తరగతి సైతం సిద్ధపడుతోంద’ని ఫ్యాషన్ రంగ నిపుణులు రూపేష్ చెప్పారు. సాధారణంగా డిజైనింగ్ దుస్తుల ఖరీదు కనీసం రూ.50,000ల నుంచి మొదలై ఆ తర్వాత పిండికొద్ది రొట్టె అన్నట్టుగా ఉంటుందని వీరంటున్నారు. మిడిల్ క్లాస్‌కీ.. మధ్యతరగతి ప్రజలకు వైవిధ్యభరితమైన వెడ్డింగ్ ఫ్యాషన్‌ను చేరువ చేసే క్రమంలో డిజైనర్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు మధ్య తరగతి పెళ్లి వేడుకల్లో సైతం దోవతీలు పోయి.. డిజైనర్ పంచెలు రాజ్యం చేస్తున్నాయి. తక్కువ ఖరీదులోనే షేర్వానీలు, వెడ్డింగ్ గౌన్లు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. దేనికదే ప్రత్యేకం.. పెళ్లి అంటే ఒక వేడుక కాదు.. కొన్ని వేడుకల కలయిక. విభిన్న సందర్భాల సంబరం. పెళ్లి నిర్ణయించిన దగ్గర మొదలుపెడితే ప్రీ వెడ్డింగ్ షూట్, బ్యాచిలర్ పార్టీ, బ్రైడల్ షవర్, ఎంగేజ్మెంట్, సంగీత్, వివాహం, రిసెప్షన్, వ్రతం, హనీమూన్... ఇలా దాదాపు 10 వరకు విభిన్న వేడుకల సమాహారంగా పెళ్లిని చూస్తున్నారు నగరవాసులు. దీనికి తగ్గట్టే సందర్భోచితంగా దుస్తులను డిజైన్ చేయిస్తున్నారు. బ్యాచిలర్ పార్టీకి ఓ రకంగా, హనీమూన్‌కి మరో రకంగా... ఇలా ఆయా సందర్భాలకు, మూడ్స్‌కు అనుగుణంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటున్నారు. సిటీ డిజైనర్ల పాత్ర.. సెలబ్రిటీల పెళ్లిళ్లకు ముంబై, ఢిల్లీ తదితర నగరాల నుంచి డిజైనర్లు దిగుమతవుతుంటే... మేం మాత్రం తక్కువనా అన్నట్టు సిటీ డిజైనర్లు తమదైన స్థాయిలో పెళ్లి దుస్తులను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికీ సిటీ సెలబ్రిటీ ఫ్యామిలీలు ఇతర మెట్రోల నుంచి డిజైనర్లను రప్పించడానికే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ... ఇప్పుడిప్పుడే సిటీ డిజైనర్లను కాస్త పలకరిస్తున్నారు. పింకీ కుమారుడి పెళ్లిలో సిటీ డిజైనర్లు ఆనంద్ కబ్రా, శ్రవణ్‌కుమార్ సైతం తమవంతుగా పాలుపంచుకోవడం దీనికో ఉదాహరణ. శామ్స్.. డిజైనర్ డ్రీమ్స్ హీరో నాగచైతన్య, నటి సమంత (శామ్స్) జంట ఫ్యాషన్‌ప్రియులు కావడంతో తమ పెళ్లి దుస్తుల డిజైనింగ్‌కు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా సమంత తన ఎంగేజ్మెంట్ కోసం సృష్టించిన లవ్‌స్టోరీ లెహెంగా అయితే టాక్ ఆఫ్ ది ఫ్యాషన్ వరల్డ్ అయింది. దీని మీద చైతూతో తన ప్రేమకథను అందంగా చెక్కించిన సమంత... పెళ్లి దుస్తుల కోసం కూడా లెహెంగానే డిజైన్ చేసిన ముంబై డిజైనర్ క్రేషా బజాజ్నే ఎంచుకుంది. ‘సమంత అంటేనే ఫ్యాషన్‌కి సింబల్ అని పేరుంది. ఆ అంచనాలకు తగ్గకుండా, అదే సమయంలో తమ ప్రేమలోని గాఢతను కూడా తెలియజెప్పేందుకు శామ్స్ లెహెంగాను విభిన్నంగా డిజైన్ చేయించార’ని చెప్పారు ఆమె వ్యక్తిగత స్టైలిస్ట్ నీరజ కోన. మంచి ‘తరుణ్’ం మించిన దొరకదు.. అనుకుంటూ తమ పెళ్లి కోసం టాప్ డిజైనర్ తరుణ్ తహిల్యానీకి ఓటేశారు హీరో రామ్‌చరణ్. ఆయన పెళ్లికి ప్రత్యేకంగా ముంబై నుంచి తరుణ్ బృందం తరలివచ్చింది. ‘తరుణ్ తహిల్యానీ మా కుటుంబానికి బాగా దగ్గరివాడు కావడంతో ఆయన్నే మా పెళ్లి దుస్తుల డిజైనింగ్‌కి ఎంచుకున్నాం. అంతేకాకుండా ఆయన మా ఎంగేజ్మెంట్ కోసం రూపొందించిన దుస్తులు నాకు బాగా నచ్చాయి. ఆయన డిజైనింగ్ వర్క్ నాకు చాలా ఇష్టం. ఇక వేరే పేరే నాకు తట్టలేదు’ అని చెప్పారు ఉపాసన. మేమూ చేస్తున్నాం... నగరవాసుల్లో ఫ్యాషన్‌పై ఆసక్తి పెరగడానికి సెలబ్రిటీలే కారణమనడం లో సందేహం లేదు. దీంతో వెడ్డింగ్ సీజన్లో మాకు చేతినిండా పని ఉంటోంది. అయితే సెలబ్రిటీల పెళ్లిలకు డిజైనర్లు దిగుమతవుతుండ డం గతంతో పోలిస్తే తగ్గింది. ఇటీవల రెండు రాజకీయ కుటుంబాల పెళ్లిళ్లకు నేను దుస్తులు అందించడమే దీనికి ఉదాహరణ. ఈ ట్రెండ్ ఇంకా పుంజుకోవడం తథ్యం. – శశి వంగపల్లి, సిటీ డిజైనర్ సిటీ క్లయింట్లు ఎక్కువే.. శృతిహాసన్, కాజల్ లాంటి తారలు నాకు క్లయింట్స్‌గా ఉన్నారు. పెళ్లిళ్లకు అటెండ్ అవడానికి, ఇంకేవైనా ప్రైవేట్ ఫంక్షన్లకు వారికి డ్రెసెస్ డిజైన్ చేయడం కోసం మమ్మల్ని సంప్రదిస్తుంటారు. తరచూ వెడ్డింగ్ సీజన్లో హైదరాబాద్‌లో మా కలెక్షన్‌ను ప్రదర్శిస్తుండడానికి అదో కారణం. – అర్పిత, ముంబై డిజైనర్ -
ముహూర్తం బాగుంది..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్‌ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి. ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే.. ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. చార్జీలు అ‘ధర’హో.. మరోవైపు డిమాండ్‌ను బట్టి ఫంక్షన్‌హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు ఫుల్ బిజీ వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి. అలంకరణ కోసం తెచ్చిన పూలు.. పూల ధరలకు రెక్కలు పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్‌లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇవి బలమైన ముహూర్తాలు ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి. – డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు ఆర్డర్లు వదిలేసుకున్నాం.. పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా. – అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు -
పెళ్లికి వేళాయే..
ఆలేరు /భువనగిరి : పెళ్లిళ్లు, పేరంటాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు సుముహూర్తాలు రాబోతున్నాయి. ఈనెల 17 నుంచి జూలై 7వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో వివా హ వేడుకల సందడి ప్రారంభంకానుంది. సంబంధాలను కుదుర్చుకున్న యువత మూడుమూళ్ల బంధంతో ఏకమయ్యేందుకు ముహూర్తాలను ఎంచుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఖరీదవుతున్న వేడుకలు.. ప్రస్తుతం పెళ్లిళ్ల ఏర్పాట్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతోంది. కల్యాణ మండపం ఒక్కరోజు అద్దె రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.1.30లక్షల వరకు డిమాండ్ ఉంది. వీటికి అదనంగా విద్యుత్ బిల్లు, క్లినింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపం బుక్ చేసుకున్నాక పెళ్లి పందిరి, సౌండ్ సిస్టమ్, సామగ్రి, ఇతర సదుపాయాలు, మండప నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీటికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి చార్జీలు కూడా సుమారు రూ. 20వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటున్నాయి. ఇక ఫొటో, వీడియో, ఆల్బమ్, తయారీదారుల ధరలు కూడా పెరిగాయి. వీటికి రూ.30వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. విందు భోజనాలు.. ప్రస్తుతం పెళ్లంటే రకరకాల స్వీట్లు, కూరగాయలు, బిర్యాని తదితర నోరూరించే పదార్థాలు ఉండాల్సిందే. మధ్యతరగతి కుటుంబ సభ్యులకు కనీసం రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతోంది. కేటరింగ్‌కు ఇస్తే అన్ని వారే సమకూర్చుతున్నారు. ఒక్కో ప్లేట్‌కు శాఖాహారమైతే రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. అదే మాంసాహారమైతే రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు దొరకడం కష్టమే.. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో అన్ని వర్గాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ముఖ్యంగా కొందరికి పురోహితులు దొరకడం లేదు. పూల ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతేకాకుండా మునుపెన్నడూ లేని వి«ధంగా జీఎస్టీతో పెద్ద మొత్తంలో పన్ను పడుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ ప్రభావం పడనుంది. శుభ ముహూర్తాలు.. ఫిబ్రవరి నుంచి ఆషాడం వచ్చే వరకు జూలై 7వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఒక్కో నెలలో 5 నుంచి 12వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 17, 19, 23, 24, 26 మార్చి 4, 8, 10, 12, 14 ఏప్రిల్ 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30 మే 2, 9, 10, 16, జూన్ 16, 20, 21, 22, 27, 28, 30 జూలై 1, 5, 6, 7వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాడమాసం ప్రారంభం అవుతుందని వేదపండితులు చెబుతున్నారు. మే 16వ తేదీ నుంచి జూన్ 13 వరకు అధిక జ్యేష్ట మాసం ఉంటుంది. అధికంగా జరగనున్నాయి మార్చి 4, 8, 10, 14 తేదీల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. మార్చి 4వ తేదీ ముహుర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదేరోజు ఆదివారం కావడంతో ఎక్కువగా ముహుర్తాలను నిర్ణయించుకున్నారు. – పవన్‌శర్మ, పురోహితుడు -
అంత డబ్బులేదు బాసూ!
ఉగాండాకు చెందిన సెమాండా.. అక్కడి కటాబా అనే టౌన్లో రోడ్డుపై ఆహారపదార్థాలు అమ్ముకుంటూ ఉంటాడు. వయసు 50 ఏళ్లు. గత నెలలో ఆఫ్రికా మొత్తం సెమాండా పేరు వార్తల్లో ప్రముఖంగా కన్పించింది. ఎందుకంటే అతడు పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి చేసుకుంటే కూడా వార్తేనా అవాక్కవకండి! ఎందుకంటే ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకున్నందుకు వార్తల్లోకి ఎక్కలేదు..! ముగ్గురిని ఒకేసారి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆయన చెప్పిన సమాధానానికి అక్కడి జనం అవాక్కయ్యారు. వార్తల్లో నిలిచాడు. ఆ సమాధానం ఏంటంటే.. ముగ్గురిని మూడుసార్లు పెళ్లి చేసుకునేంత డబ్బు తనవద్ద లేదని.. అందుకే ముగ్గురినీ ఒకేసారి చేసుకున్నానని చెప్పాడు. దీంతో ఫేమస్ అయిపోయాడు. మరి డబ్బే లేనప్పుడు ముగ్గురిని ఎలా పోషిస్తావు అని అడిగితే ‘‘వారికి నేనంటే ఇష్టం.. వారంటే నాకు చాలా ఇష్టం. నలుగురం బతికేందుకు ఇంకా ఇంకా కష్టపడతాను’ అని సమాధానం ఇచ్చాడు. ఆ ముగ్గురు భార్యల్లో ఒకరికి 48 ఏళ్లు.. మరో ఇద్దరికి 27, 24 ఏళ్లు.. -
‘స్వలింగ’ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్ధత
సిడ్నీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును ఇంతకుముందు పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43–12 మెజారిటీతో ఆమోదించగా.. గురువారం కాన్బెర్రాలో సమావేశమైన ప్రతినిధుల సభ (దిగువ సభ) 146–4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందగానే సభ్యులు ఆనందంతో చప్పట్లు కొడుతూ, పరస్పరం ఆలింగనాలతో హర్షం వ్యక్తం చేశారు. తొలి నుంచి స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతు ఇస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మాట్లాడుతూ..‘సమానత్వానికి, గౌరవానికి, ప్రేమకు ఇది అద్భుతమైన రోజు. ఆస్ట్రేలియా ఎట్టకేలకు సాధించింది’ అని ప్రకటించారు. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేయవచ్చు. నోటీస్ దాఖలు చేసిన 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత షార్టెన్ స్వాగతించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల సరసన ఆస్ట్రేలియా చేరింది. -
కల్యాణ వైభోగమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివాహాలు చేసుకుంటున్న జంటలు తమ పెళ్లిని చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నాయి. ప్రతి పెళ్లికి చట్టబద్ధత ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితి మారుతోంది. దాంతో ఏటా జరుగుతున్న వివాహాల్లో ఎక్కువ శాతం చట్ట ప్రకారం నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున మూడు లక్షల జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్లు అంచనా. అధికారిక అంచనాల ప్రకారం గత మూడేళ్లలో 9.75 లక్షలకుపైగా పెళ్లిళ్లు జరగగా.. 3.10 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. ఇది దేశంలోనే టాప్ అని అధికారవర్గాలు చెబుతున్నాయి. క్రమంగా పెరుగుతున్న శ్రద్ధ బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు వివాహ బంధానికి చట్టపర రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివాహాల నమోదు చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. వివాహాల నమోదు పెద్దగా కనిపించలేదు. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ కేవలం సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో చేసేవారు. అనంతరం గ్రామ పంచాయతీ స్థాయిలో ధ్రువీకరణ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దాంతో పరిస్థితి కొద్దిగా మెరుగుపడినా పెద్దగా పురోగతి లేదు. అయితే రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను చేపట్టిన నేపథ్యంలో.. వివాహాల నమోదు బాగా పెరిగింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు జంటలు వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి. సర్కారు ‘కానుక’తో.. తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ సర్కారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ పథకాలకు బాగా డిమాండ్ పెరిగింది. తొలి రెండేళ్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే పరిమితం చేసిన ఈ పథకాలను.. అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకూ వర్తింపజేశారు. 2014–15, 2015–16, 2016–17 సంవత్సరాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.51,116 నగదును కానుకగా అందించగా.. 2017–18 ఏడాది నుంచి రూ.75,116కు పెంచింది. దీంతో అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు పెరిగాయి. ఈ రెండు పథకాల కింద అక్టోబర్ నాటికి 2.75 లక్షల దరఖాస్తులు రాగా.. 2.46 లక్షల జంటలు ‘కానుక’అందుకున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. ఎన్నారై పెళ్లిళ్లపై అవగాహన ఇటీవల ఎన్నారై వివాహాల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లో స్థిరపడిన వరుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు ఇక్కడి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి ఎన్నారై పెళ్లిళ్లు బెడిసికొడుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నారై సంబంధాల విషయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం, మహిళా అవగాహన కల్పిస్తున్నాయి. అలాంటి వివాహాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 26 వేల ఎన్నారై వివాహాలు జరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ఒకరు తెలిపారు. -
పెళ్లిళ్లు.. విడాకులు.. డబ్బులు!
ఇప్పటివరకు 3 పెళ్లిళ్లు చేసుకున్న డాక్టర్ - డబ్బులు వసూలు చేసి ఇద్దరు భర్తల నుంచి విడాకులు తీసుకున్న సరిత - మూడో భర్త ఫిర్యాదుతో ఆమె బాగోతాలు వెలుగులోకి సాక్షి, హైదరాబాద్: పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్తపై కేసు పెట్టడం.. వారి నుంచి లక్షల్లో డబ్బులు దండుకోవడం.. ఆ తర్వాత కోర్టు నుంచి విడాకులు తీసుకుని మరొకరిని వివాహం చేసుకోవడం.. ఇది హైదరాబాద్‌లోని తార్నాక వాసి అయిన 32 ఏళ్ల హోమియోపతి డాక్టర్ చివాకుల సరిత చరిత్ర.. ఇలా 12 ఏళ్లలో ముగ్గురిని వివాహం చేసుకుని భర్తలను అష్టకష్టాలు పెట్టిన సరితను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆమెపై వనస్థలిపురానికి చెందిన మూడో భర్త బీవీఎస్ ప్రకాశ్‌రావు ఫిర్యాదు చేయడంతో సరిత బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి పెళ్లి.. 2005, ఫిబ్రవరి 11న కర్ణాటక హుబ్లీకి చెందిన కె.రామానంద శంకర్‌ను సరిత మొద టి వివాహం చేసుకుంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. సరిత కోరిన మేరకు రూ. 6 లక్షలు, 20 తులాల బంగారం చేతికి అందాక.. 2010, అక్టోబర్ 22న హుబ్లీ కోర్టు ద్వారా శంకర్ నుంచి విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి.. 2011, మార్చి 18న చందానగర్‌కు చెందిన వెంకటరాంబాబుతో సరితకు ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. కేవలం నెల రోజులకే అదనపు కట్నం కోసం వెంకటరాంబాబు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. వారి నుంచి రూ. 9 లక్షలు చేతికి అందాక హఫీజ్ కోర్టులో విడాకులు తీసుకుంది. మూడో పెళ్లి.. 2015, డిసెంబర్ 27న సరితను వనస్థలిపురానికి చెందిన బీవీఎస్ ప్రకాశ్‌రావు పెళ్లాడా డు. అయితే అదనపు కట్నం తేవాలంటూ ప్రకాశ్, అతడి తల్లి వేధిస్తోందని సరూర్‌నగర్‌లోని మహిళా పోలీసుస్టేషన్లో జూలై 31న తన తల్లిదండ్రులతో కలసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రకాశ్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 3 రోజుల అనంతరం బెయిల్‌పై విడుదలైన ప్రకాశ్‌రావు తన భార్య, ఆమె తల్లిదండ్రుల గురించి ఆరా తీశాడు. దీంతో సరిత బాగోతం బయటపడింది. ఆ వివరాలతో వనస్థలిపురం పోలీసులకు ప్రకాశ్‌రావు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సరితను అరెస్టు చేశారు. విచారణలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు నిందితురాలు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. మరొకరితో సన్నిహితంగా.. : 2015లో పుణేకు చెందిన వీరేందర్తో సంబంధం ఏర్పరుచుకుని నెల రోజుల పాటు సన్నిహితంగా మెలిగింది. అయితే తనను నమ్మించి మోసగించాడంటూ సదరు వ్యక్తి గురించి పోలీసులను సరిత ఆశ్రయించింది. ఇప్పటికే అతని నుంచి సరిత రూ.80 వేలు దండుకుంది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. -
ఇల్లరికంలో ఉంది మజా!
అత్తారింటికి దారి.. కడియపు సావరం! ఉపాధి కరువై.. బతుకు భారమై.. ఉన్న ఊరిని వదిలి వలస వచ్చేస్తున్నవారికి ఆ ఊరు.. కల్పవృక్షం. ఏడాదిలో 365 రోజులూ చేతి నిండా పని, రెండు చేతులా సంపాదిస్తూ శ్రీమంతులు కావాలంటే ఆ ఊరిలో అడుగుపెట్టాల్సిందే.. అంతేనా చక్కనైన కుందనపు బొమ్మల్లాంటి యువతులను పెళ్లి చేసుకోవడానికి దారీ అదే‘ఇల్లరికంలో ఉంది మజా’ అంటూ పాటేసుకుంటూ.. ఆ మజాను ఆస్వాదించాలన్నా ఆ ఊరికి దారి తీయాల్సిందే..పూల మొక్కలతో.. నర్సరీలతో అలరారే ఆ అందమైన ఊరు.. కడియపు సావరం.. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కుగ్రామం ఇల్లరికపు అల్లుళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా భాసిల్లుతోంది.. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు ఆ గ్రామంలోని పూల మొక్కలు, నర్సరీల్లోని పనులను ఆలంబనగా చేసుకుని 365 రోజులూ పనులు చేసుకుంటున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 సంపాదిస్తూ భార్యాభర్తలిద్దరూ ఆడుతూపాడుతూ పనులు చేసుకుంటూ సంపన్నులవుతున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు.. పొలం, పుట్ర కొనుక్కుంటున్నారు.. ఇళ్లు కట్టుకుంటున్నారు.. పిల్ల లకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. స్వగ్రామంలో పూట గడవని స్థితిని ఎదుర్కొన్న వీరంతా కడియపు సావరంలో కాలరెగరేసుకుని జీవిస్తున్నారు. మొత్తంగా కడియపు సావరం ప్రజలు తమ గ్రామ అల్లుళ్లకు నర్సరీలు, పూలమొక్కల పెంపకం పనులు ఇస్తూ, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ సాదర ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా ఆ గ్రామం ఇల్లరికం అనే పదానికి అర్థాన్నే మార్చేసింది. వివాహాలు ఇలా ప్రారంభం.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు అక్కడే ఏళ్ల తరబడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వీరిలో బుద్ధిమంతులైన కొందరు యువకులకు ఆ గ్రామంలోని రైతులు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడం ప్రారంభమైంది. అలాగే ఇతర ప్రాంతాల యువకులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం జరిపించిన రైతులు వారినీ తమ గ్రామానికి రప్పించుకున్నారు. ఇలా ఉపాధిని వెతుక్కుంటూ సుమారు 500 నుంచి 700 మంది వరకు అల్లుళ్లు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో కుగ్రామమైన కడియపు సావరంలో గత కొన్నేళ్ల నుంచి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చేతినిండా పని.. బతుకుపై భరోసా కడియం మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు పూలు, పండ్లు, కూరగాయ మొక్కల పెంపకం, నర్సరీలే జీవనాధారం. ఆ మండలంలోని 13 గ్రామాల్లో ఏడు వందల నర్సరీలు ఉన్నాయి. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు మొక్కలను విక్రయిస్తున్నారు. వీటితోపాటు కల్యాణ మండపాలు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ అభివృద్ధి వంటి అనేక రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎంత సంపాదించినా స్త్రీ, పురుష అనే భేదం లేకుండా రోజుకు రెండు మూడు గంటలు నర్సరీలో పనిచేయాల్సిందే. చేతినిండా పని, బతుకుపై భరోసా కల్పిస్తుండటంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి వేలాది మంది కార్మికులు వలస వచ్చారు. మరోవైపు సమాజం ఆధునిక పోకడల వైపు పయనిస్తుండటంతో ఇక్కడి యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్న యువత పూల మండపాల అలంకరణపై దృష్టి పెడుతోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఉండి విభిన్న రీతుల్లో మండపాలను రూపొందిస్తున్నారు. ఇద్దరం కష్టపడుతున్నాం మాది అల్లవరం మండలం గూడతిప్ప. పదేళ్ల క్రితం పెళ్లైంది. మా అత్తగారి ఊరు కడియపు సావరం. మా ఏరియాలో పనులు తగ్గిపోవడం, కూలీ గిట్టుబాటు కాకపోవడంతో పెళ్లైన కొత్తలోనే ఇక్కడకు వచ్చేశాం. ఇద్దరం కష్టపడుతున్నాం. చేతినిండా పని దొరుకుతోంది. నేను వ్యవసాయ పనుల్లోకి వెళుతుంటే, మా ఆవిడ వెంకట లక్ష్మి పూలు గుచ్చి రైతులకు అందిస్తోంది. ఇటీవలే మేం సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకున్నాం. మేం చాలా ఆనందంగా జీవిస్తున్నాం. ఈ ఊరు మాకు బతుకుపై భరోసా కల్పించింది. – డాబా లక్ష్మణస్వామి, కడియపు సావరం -
‘దళితులతో బీజేపీ నాయకులు పెళ్లిళ్లకు సిద్ధమా?’
బెంగళూరు: దళితులపై బీజేపీ నాయకులకు నిజంగా ప్రేమ ఉంటే హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని దళితుల ఇళ్లల్లో తింటున్నట్లు నటించడం కాదు, దళితులతో వైవాహిక బంధం పెంచుకోవాలని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. దళిత యువకులకు వారి ఇంటి అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలని, అలాగే దళిత యువతులను బీజేపీ నేతల కుటుంబాల్లోకి కోడళ్లుగా చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కిత్తగనూరులో 65 ఎంఎల్డీ సామర్థం కలిగిన నీటి శుద్ధీకరణ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్న బీజేపీ నేతలు ఓట్ల కోసమే వారి ఇళ్లల్లో భోజనాలు చేస్తూ కపట నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాటకాలను ప్రజలు పసిగట్టడంతో ఇక అధికారంలోకి రావడం కష్టమని భావించి గతంలో రాష్ట్రంలో 150 స్థానాల్లో గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఈ మధ్యకాలంలో 150 స్థానాల్లో గెలుపు గురించి ఎక్కడా మాట్లాడడం లేదన్నారు. మురికివాడల వాసుల తాగునీటి కోసం రోజూ పది లక్షల లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. -
రండి పెళ్లి చేస్తాం...
ఖాళీగా అవసరం లేకుండా అలా పడిఉన్న రైల్వే స్టేషన్లను పెళ్లి మండపాలుగా మార్చితే ఎంత బాగుంటుంది. ఇలాంటి ఐడియాతోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ముందుకొచ్చారు. ఖాళీగా పడిఉన్న రైల్వే స్టేషన్లను వేరే ప్రాంతాలకు తరలించే బదులు వాటిని పెళ్లి వేడులకు, ఇతర గ్రాండ్ ఈవెంట్లకు వాడాలని నిర్ణయించారు. వెడ్డింగ్ ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లకు రైల్వే స్టేషన్లను అద్దెకివ్వాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. గత నెల న్యూఢిల్లీలో జరిగిన రైల్ వికాస్ శివిర్ మీటింగ్‌లో ఈ అద్భుతమైన ఆలోచనను ఎంపికచేశారు. రవాణా వ్యవస్థలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్న రైల్వే కార్యకాలపాల అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ ఈ మీటింగ్‌లో అధికారులకు పిలుపునిచ్చారు. రైల్వే అభివృద్ధికి రోడ్ మ్యాప్ చేయాలని ఆదేశించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే బోర్డు అడ్వయిజర్ అలోక్ రాజన్ తెలిపారు. -
సన్యాసి మొగుడు
ఏమిటో ఈ పెళ్లిళ్లు... తల్లిదండ్రులు ఎంతో కష్టపడి.. జాతకాలు, గుణగణాలు, కుటుంబాలు కలిసేలా ఓ అబ్బాయిని చూసి ఆ అయ్య చేతిలో కూతురిని పెడితే.. ఎన్ని రకాల సమస్యలో! వాదించే వాళ్లు.. వేధించే వాళ్లు.. వారించే వాళ్లు! ఇవన్నీ కాకపోతే ఇదో కొత్త నమూనా... సన్యాసి మొగుడు! ఈ పీడకల నుంచి బయడ్డానికి విడాకులు దొరుకుతాయా? తన లైఫ్‌కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని గుడ్డిగా కుటుంబానికే వదిలేసి.. కనీసం పెళ్లి చూపులు అప్పుడన్నా భరద్వాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయని తన తెలివి తక్కువతనానికి చింతించింది జాహ్నవి.‘మంచి సంబంధం... సంప్రదాయ కుటుంబం... అంటూ దాని గొంతు కోశారు.. బంగారంలాంటి పి...ల్ల’ ఉబికి వస్తున్న దుఃఖాన్ని చీరకొంగును నోట్లో కుక్కుకుని ఆపుకుంటూ బాధపడుతోంది జాహ్నవి తల్లి! ‘ఇది మరీ బాగుందే తల్లి.. దిగే వరకు మాకు మాత్రం లోతు తెలిసిందా? వాకబు చేసిన వాళ్లంతా మంచి వాళ్లనే చెప్పారు. అయినా దానికి మేమేమైనా శత్రువులమా? అది బాగుండాలనే కదా అనుకుంది!’ అంది ఉక్రోషం, నిష్ఠూరం కలగలసిన స్వరంతో జాహ్నవి నానమ్మ. మనవరాలికి జరిగిన అన్యాయంలో కోడలు తనను బాధ్యురాలిని చేయడం వల్ల పలికిన భావోద్వేగం అది. ‘ఆ మాటకొస్తే నేనొక్కదాన్నే పట్టుబట్టలేదు కదా ఈ సంబంధం గురించి మీ అమ్మ, మీ తమ్ముడూ చూశారు’ అంది. మళ్లీ అదే నిష్ఠూరం.. ఈసారి తన పొరపాటులో భాగస్వామ్యం పంచే ప్రయత్నం! ‘మా అమ్మనూ అంటునాన్లెండి’ అంది జాహ్నవి తల్లి. ‘నీ కూతురు మీద మాకేం పగా ద్వేషాలు లేవు... మంచి కుర్రాడొస్తే బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో పెద్దవాళ్లం చూశాం. ఘోరమైన తప్పిదం జరిగిపోయింది. మమ్మల్ని క్షమించు తల్లీ.. క్షమించు’ అంటూ చెంపల మీద టపటపా కొట్టుకుంది జాహ్నవి అమ్మమ్మ. ‘అమ్మా.. ఆపుతావా? కూతురి జీవితం నాశనమైందనే బాధలో ఏదో అంటోంది అక్క... పెద్దవాళ్లు కాస్త ఓపికగా ఉండండి. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి’ సర్దిచెప్పాడు జాహ్నవి మేనమామ. ‘ఇంక మీ జోక్యం వద్దు మామయ్యా. జరగాల్సింది నేను చూసుకుంటాను. నా మానాన నన్ను వదిలేయండి. మిమ్మల్ని తప్పు పట్టో, మీమీద నమ్మకం లేకో అనట్లేదు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నన్ను తీసుకోనివ్వండి. ఈ మాటలతో మీరు బాధపడితే క్షమించండి’ అని నిక్కచ్చిగా చెప్పేసి బయటకు వెళ్లిపోయింది జాహ్నవి. అసలు ఏమైంది? ఇద్దరన్నదమ్ముల మధ్య ఆడపిల్ల. అపురూపంగా పెరిగింది. ఏం కావాలన్నా కాదనలేదు అమ్మానాన్న. ఇంటర్ అయిపోయాక ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానంది. నాన్నకు ఇష్టంలేకపోయినా తన కోసం ఓకే అన్నారు. ఎంతో ఆసక్తితో ఆ కోర్స్‌ను పూర్తి చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ముంబైకి వెళ్లింది. తన అభిరుచికి పేరెంట్స్ ఓకే... వాళ్ల కోసం పెళ్లికి తానూ ఒకే... ఓ యేడాది పాటు అక్కడున్న ప్రముఖ డిజైనర్లందరి దగ్గరా పనిచేసి వచ్చింది. ఆ అనుభవంతో హైదరాబాద్‌లో సొంత బొటిక్ ఒపెన్ చేసింది. బొటిక్ పెట్టడం అమ్మానాన్న సహా అన్నయ్యకూ ఇష్టం లేదు. వద్దు అంటే చిన్నబుచ్చుకుంటుందేమోనని అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నారు. మేనత్తలు, మేనమామ భార్య, పిన్ని అందరూ ‘ముంబై వెళ్లింది ఇక్కడ టైలర్ షాప్ ఓపెన్చేయడానికా? నాలుగేళ్లు మెషీన్ తొక్కుడేనా నేర్చుకుంది’ అంటూ ఎక్కసెక్కాలు ఆడినా తన కోసం సహించారు. తను మాత్రం ఏమీ పట్టించుకోకుండా శక్తియుక్తులన్నీ బొటిక్ మీద పెట్టింది. రెండేళ్లలో మంచి బిజినెస్. అంతకన్నా మంచి పేరు. ఫ్యాషన్ వీక్స్‌కి ఇన్విటేషన్స్. గ్రూప్డిజైనింగ్లో చాన్సెస్. బ్రహ్మాండమైన కెరీర్. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పుడు వచ్చింది పెళ్లి ప్రస్తావన నానమ్మ నుంచి. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో తన చాయిస్‌ను గౌరవించిన తన పెద్దలకు తనకు పెళ్లికొడుకునే వెదికే చాయిస్ ఇచ్చి తనూ వాళ్లను గౌరవించాలనుకుంది. అందుకే ‘మీరు చూసిన సంబంధం చేసుకుంటాను’ అని చెప్పింది. అమ్మమ్మ, నాన్నమ్మ వేట... ఆ బాధ్యతను జాహ్నవి అమ్మమ్మ, నాన్నమ్మ తీసుకున్నారు. పెళ్లికొడుకు కోసం వేట ప్రారంభించారు. చాలా సంబంధాలు చూసి చివరికి భరద్వాజను ఓకే చేశారు. ఆచార వ్యవహారాలు పాటిస్తున్న కుటుంబం. అబ్బాయి గవర్నమెంట్ లెక్చరర్. చూడ్డానికి కూడా చాలా బాగుంటాడు. నెమ్మదస్తుడు. మెతక మనిషి. పెళ్లి చూపుల్లో భరద్వాజ్‌ను చూస్తే వింతగా అనిపించింది తనకు. అంత నెమ్మదితనం ఉన్న అబ్బాయిని తాను ఎక్కడా చూడలేదు. తన స్వభావానికి పూర్తి విరుద్ధం. పోనీలే ఇద్దరూ దూకుడుగా ఉంటే కష్టం. ఒకరిలా... ఒకరు అలా ఉంటేనే బెటర్ అని సర్ది చెప్పుకుంది. వన్ మార్నింగ్... పైసా కట్నం లేకుండా పెళ్లి అయింది. అబ్బాయి దీక్షలో ఉన్నాడు... మొదటిరాత్రికి నలభై రోజులు ఆగాలి అని అబ్బాయి తరపు పెద్దలు అమ్మాయి తరపు పెద్దలకు చెప్పారు. చిత్రంగా అనిపించినా సరే అన్నారు. ఈలోపు తనకు, భరద్వాజకు మంచి స్నేహం కుదిరింది. ముందు భయపడ్డా కంపాటబులిటీ బాగా కుదిరినందుకు చాలా హ్యాపీగా ఫీలయింది. నలభై రోజుల తర్వాత తనకు ఆధ్యాత్మికంగా ఎదగాలనుందని చెప్పాడు. షాకింగ్‌గా ఫీలయింది. కాలేజ్ నుంచి రాగానే ధ్యానముద్రలో గడిపేవాడు. ఇంకోవైపు తన పెద్దల నుంచి అత్తామామల మీద ఒత్తిడీ ఎక్కువైంది గర్భాదాన ముహూర్తం కోసం. కాని ముహూర్తాలు కుదరట్లేదని జవాబు చెప్పసాగారు. తొమ్మిది నెలల తర్వాత... అలా దాదాపు తొమ్మిది నెలలు గడిచాయి. ఒక రోజు తను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తీర్థయాత్రలు చేయాలి. అక్కడున్న స్థల పురాణాలు, ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకోవాలంటూ ఒంటరిగా తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు. నాలుగు నెలలైనా అడ్రస్ లేదు. ఒక రోజు ఉదయం తన మామగారికి ఫోన్ వచ్చింది కొడుకు దగ్గర్నుంచి. ఎక్కడో ఉత్తర భారతంలో... ఏదో స్వామీజీ దగ్గర సన్యాసం తీసుకున్నట్టు.. ఇక తన గురించి మరచిపొమ్మన్నట్టు! నిశ్చేష్ఠురాలైంది తను. మారు మాట్లాడకుండా తల్లిగారింటికి వచ్చేసింది! జాహ్నవి నోటి వెంట ఈ కథంతా విన్న అడ్వకేట్ దీర్ఘంగా నిట్టూర్చింది. ‘ఇంత చదువుకున్న దానివి, లోకం చూసిన దానివి అతని ప్రవర్తనను ఎందుకు అంచనా వేయలేక పోయావ్? తొమ్మిది నెలల్లో కనీసం ఒక్కసారైనా ఎందుకు అనుమానం రాలేదు?’ అని అడిగింది. జాహ్నవి నుంచి ఒకే సమాధానం ‘నమ్మాను’ అని! ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి చెప్పింది లాయర్. ఫాలో అయింది జాహ్నవి. భర్త వివరాలతో కోర్టులో విడాకుల కోసం కేస్ వేసి విడాకులు పొందింది. ఎన్నో ఆశలు, కలలతో మొదలైన తన వైవాహిక జీవితం అలా ముగిసినందుకు ఎవరినీ నిందించలేదు. కాని తన లైఫ్‌కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని గుడ్డిగా కుటుంబానికే వదిలేసి... కనీసం పెళ్లి చూపులు అప్పుడన్నా భరద్వాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయని తన తెలివి తక్కువతనానికి చింతించింది. బాధపడింది. - సరస్వతి రమ మంచి కుర్రాడొస్తే బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో పెద్దవాళ్లం చూశాం. ఘోరమైన తప్పిదం జరిగిపోయింది... మమ్మల్ని క్షమించు తల్లీ.. క్షమించు’ అంటూ చెంపల మీద టపటపా కొట్టుకుంది జాహ్నవి అమ్మమ్మ. ఈ కథంతా విన్న అడ్వకేట్ దీర్ఘంగా నిట్టూర్చింది. ఇంత చదువుకున్న దానివి, లోకం చూసిన దానివి అతని ప్రవర్తనను ఎందుకు అంచనా వేయలేక పోయావ్? తొమ్మిది నెలల్లో కనీసం ఒక్కసారైనా ఎందుకు అనుమానం రాలేదు?’ చట్టం ఏం చెబుతోంది? హిందూ వివాహ చట్టం 1955, సెక్షన్ 13 ప్రకారం.. తగిన కారణాలు, సందర్భాలు ఉన్నప్పుడు కోర్టులను ఆశ్రయించి విడాకుల డిక్రీ ద్వారా తమ వివాహాన్ని రద్దు పర్చుకోవచ్చు. సరైన కారణాలు, ఆధారాలతో భార్యభర్తల్లో ఎవరైనా ఈ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు. విడాకుల కోసం ఈ చట్టం పదికిపైగా కారణాలను సూచించింది. అందులో ఒకటి.. దంపతుల్లో ఎవరైనా సంసార జీవితాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరించినప్పుడు ఆ కారణాన్ని చూపి విడాకులు తీసుకోవచ్చు. ఇక్కడ జాహ్నవి చేసింది అదే! ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
కుల వివక్షతను రూపుమాపాలి
దుర్కి(బీర్కూర్) : కుల వివక్షతను రూపు మాపడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజారం కోరారు. శనివారం మండలంలోని దుర్కిలో నిర్వహించిన సివిల్ రైట్స్‌డే సందర్భంగా ఆయన మాట్లాడారు. హోటళ్లలో రెండుగ్లాసుల పద్ధతి, జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు, వరకట్నం లాంటి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం శిక్షార్హులవుతారన్నారు. రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని, చట్టం ప్రకారం అందరూ సమానులేనని తెలిపారు. అంటరానితనం మహా పాపమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు ఆత్మన్యూనత భావాన్ని వీడి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అంతకు ముందు అధికారులు దళితులతో కలిసి మందిరంలో పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు పండ్ల మొక్కలను ఏజేసీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ కి ష్ట్యానాయక్, ఎంపీడీవో భరత్‌కుమార్, ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి, ఎంపీపీ మల్లెల మీనా, జెడ్పీటీసీ సభ్యుడు కిషన్, కో–ఆప్షన్ సభ్యులు మజీద్ తదితరులు పాల్గొన్నారు. -
దీర్ఘ సుమంగళీభవ
కటాక్షించే తిరుపతమ్మ క్షేత్రం కల్యాణ క్షేత్రాలు పెళ్లిళ్ల సీజన్లో ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కడతారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఆమె. పెళ్లిళ్లు చేసుకునే కొత్త జంటలకు అమోఘ ఆశీస్సు ఆమె. ఆ దేవత కొలువుండే క్షేత్రమే పెనుగంచిప్రోలు శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం. ఇది రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కృష్ణాజిల్లాలో శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం తరువాత రెండవ స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో, జగ్గయ్యపేట, నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో ఉండి నిత్యం ఆంధ్రా నుండే కాకుండా తెలంగాణా రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకునే క్షేత్రంగా అలరారుతోంది. ఆసక్తిదాయకం స్థల పురాణం 17వ శతాబ్దిలో పెనుగంచిప్రోలు సమీప గ్రామాల్లో సాక్షాత్తు శ్రీతిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వరప్రసాదినిగా జన్మించిన తిరుపతమ్మ బాల్యంలోనే సకల శాస్త్రపారంగమూర్తిగా పేరు గాంచింది. తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ, శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞానమార్గం బోధిస్తూ యుక్త వయస్సుకు వచ్చిన తిరుపతమ్మను పెనుగంచిప్రోలులోని సమీప బంధువులైన కాకాని వంశీయులు కృష్ణయ్య, వెంగమాంబల కుమారుడు గోపయ్యకు ఇచ్చి వివాహం చేశారు. తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోటికోడలు చంద్రమ్మ అసూయ వల్ల అత్త వెంగమాంబ మనసు మారటంతో తిరుపతమ్మకు అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కరువు ఏర్పడటంతో గోవులకు మేత కోసం భర్త గోపయ్య తన జీతగాళ్లను తీసుకొని ఆవుల మందతో ఉత్తరారణ్యాలకు వెళ్లాడు. కాలమహిమ అన్నట్లుగా తిరుపతమ్మకు కుష్ఠువ్యాధి సోకింది. దాంతో అత్త, తోటికోడళ్లు పట్టించుకోకుండా పశువుల పాకలోకి నెట్టి వేశారు. ఆ సమయంలో ముదిరాజ్ వంశానికి చెందిన పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికీ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోవుల మేత కోసం అడవులకు వెళ్లిన గోపయ్య పులి రూపంలో వచ్చిన పెద్దమ్మ తల్లితో పోరాడి వీరమరణం పొందారు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించిన తిరుపతమ్మ ప్రాయోపవేశానికి నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునసబు కర్ల ముత్యాలనాయుడు, కరణం శ్రీశైలపతి సమక్షంలోమహిమలు చూపి ప్రాయోపవేశం చేసింది. యోగాగ్నిలో తనువు చాలించిన చోట కాలక్రమంలో తన ప్రతిమతో పాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికి ముందు ఆమె పతివ్రతా ధర్మాలను బోధించినట్లు చరిత్ర చెబుతోంది. తదుపరి పెద్దల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరగగా, నేడు కోట్లాది రూపాయలతో సుందర నిర్మాణం రూపు దాల్చింది. ఆలయం పక్కనే పవిత్రమైన మునేరు, మామిడి తోటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సీజన్లో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు పెళ్లిళ్ల సీజన్లో ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారికి ఆలయంలో నిత్య కల్యాణంతో పాటు ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. యోగాగ్నిలో ప్రవేశించిన తరువాత చితిమంటల నుంచి తన భర్త ప్రతిమ తన ప్రతిమతో పాటు పసుపు-కుంకుమలు వస్తాయని, ఆరోజు నుంచి తనను కొలిచిన వారికి నిత్య సుమంగళితనం, సంతానం, సిరిసంపదలు అనుగ్రహమవుతాయని తిరుపతమ్మ చెప్పింది. అందుకు తగినట్టుగా ప్రధాన ఆలయంలోని అమ్మవారి విగ్రహం చేతిలో కుంకుమ భరిణ ఉంటుంది. అందుకే ఆమె సమక్షంలో కల్యాణం చేసుకుంటే మంచిదని భక్తుల విశ్వసిస్తున్నారు. అలాగే పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కడతారు. ఏటా ఉత్సవాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 34 కులాల వారికి సంబంధించిన క్రతువులతో, యజ్ఞయాగాదులతో అలరాలుతున్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నుండి ఐదు రోజుల పాటు, చిన్న తిరునాళ్లు ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. వీటితో పాటు ప్రతి రెండేళ్లకు ఒకసారి రంగుల ఉత్సవం వైభవంగా జరుగుతుంది. - పులికొండ సాంబశివరావు సాక్షి ప్రతినిధి, పెనుగంచిప్రోలు వసతి సదుపాయాలు శ్రీతిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులకు శ్రీతిరుపతమ్మ సదన్, శ్రీగోపయ్య సదన్ పేరుతో సత్రాల గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ, నాన్ ఏసీ గదులు కలిపి మొత్తం 100 వరకు ఉన్నాయి. అలాగే ప్రైవేటు గదులు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఎలా చేరుకోవాలి విజయవాడ నుండి; జగ్గయ్యపేట, నందిగామ నుండి ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అలాగే ట్రావెల్స్ బస్సులు, కారులు, ఆటోలు సిద్ధంగా ఉంటాయి. -
పెళ్లిళ్లు చేసే ప్రసన్నాంజనేయుడు
కల్యాణమస్తు కల్యాణ క్షేత్రాలు ప్రసన్నాంజనేయస్వామి చల్లని సన్నిధిలో ప్రతి సంవత్సరం వందలాది వివాహాలు. 1978లో ఒకే ముహూర్తానికి 85 వివాహాలు, 2006లో ఒక్కరోజు 120 వివాహాలు. ఆ తరువాత ప్రతి యేటా పెరుగుతున్న వివాహాలు. ఆంజనేయ స్వామి బ్యాచిలర్ దేవుడు. బ్యాచిలర్స్‌కు దేవుడు. బ్రహ్మచర్యం పాటించేవారు తమను తాము ఆంజనేయస్వామికి ఫీజు చెల్లించని శిష్యులుగా చెప్పుకుంటారు. కాని ఈ స్వామి శింగరకొండపై పెళ్లిళ్లకు పురోహితుడవుతున్నాడు. ప్రధాన సాక్షి అవుతున్నాడు. తన చల్లని ఆశీస్సులతో వేలాది జంటల వైవాహిక జీవితానికి వారధి అవుతున్నాడు. ఆసక్తి గొలిపే ఈ క్షేత్రం ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో, అద్దంకి - నార్కెట్‌పల్లి హైవే పక్కనే శింగరకొండపై శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ కొండకు కింద, ఉత్తర భాగంలో స్వయంభూగా వెలసిన శ్రీ సువర్చలా సహిత దక్షిణాభిముఖ ప్రసన్నాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ వివాహాలు చేసుకుంటే ఆ జంటపై స్వామి చల్లని చూపులుంటాయని ప్రతీతి. 1960 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే వివాహాల సంఖ్యం పెరుగుతూనే ఉంది. ఈ స్వామికి పొంగలి నివేదన చేసి సిందూరం, తమలపాకులతో పూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. దేవస్థానానికి ఉత్తర భాగంలో భక్తులు స్నానం చేసేందుకు పవిత్ర పుష్కరిణిలా భవనాశి చెరువు ఉంది. సింగరకొండ? శింగరకొండ? సింగర అంటే సింహం అని అర్థం, ఇక్కడి కొండపైన లక్ష్మీ సమేత నరసింహ స్వామి కొలువై ఉంటాడు. నరసింహస్వామి కొలువైన కొండ (సింహం నివసించే కొండ) కాబట్టి దీన్ని సింగరకొండగా పిలుస్తారని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో సింగర.. శింగర అయింది. స్థల పురాణం శింగరకొండను పూర్వం నరసింహాద్రిగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. అగస్త్య మహాముని ఇక్కడే తపస్సు చేసి లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం పొందాడని చెబుతారు. ప్రసన్నాంజనేయ స్వామి విషయానికొస్తే 1896 సంవత్సరంలో కొండపై నరసింహస్వామి ఉత్సవం జరుగుతున్న సమయంలో భక్తులకు కొండకు ఉత్తరభాగంలో ఒక దివ్యమైన పురుషుడు సింధూర వర్ణంలో ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చే స్తున్నట్లుగా కనిపించాడు. కిందకు దిగి చూడగా ఆ మహాపురుషుడు మాయమై అంజలి ఘటిస్తున్న ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అందుకే ఈయన్ను స్వయంభువుగా కొలుస్తారు. ఆ తరువాత ఆదెమ్మ అనే భక్తురాలు చూపు కోల్పోయిన తన కుమారుణ్ణి స్వామి సన్నిధిలో ఉంచుకుని 11 సంవత్సరాలు పూజలు చేయగా కళ్లు వచ్చాయని చెబుతారు. ఆ విషయం ఆ నోట ఆనోట నలుదిశలా పాకి.. భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చే ప్రసన్నాంజనేయ స్వామిగా పేరు పొందాడు. ఆ ఆంజనేయస్వామి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి కలిసి ఉండటంతో వారిద్దరి కరుణా కటాక్షాలు ఉండే క్షేత్రంలో వివాహం చేసుకుంటే తమ దాంపత్య జీవితం చల్లగా ఉంటుందనే భావనతో ఎందరో వధూవరులు ఇక్కడ వివాహాలు చేసుకుంటుంటారు. ఇక్కడకు రాష్ట్రం నలుమూలల నుంచి శనివారం, మంగళవారం విశేష సంఖ్యలో భక్తులు వచ్చి పొంగలి నైవేద్యం పెడతారు. మొక్కిన మొక్కులు తీరిన భక్తులచే స్వామివారికి గాలిగోపురాల నిర్మాణం జరిగిందంటే క్షేత్ర ప్రశస్త్యం గురించి మరింతగా చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం హోళికా పౌర్ణమి రోజుకు ఒక రోజు అటు ఇటుగా తిరుణాళ్ల మహోత్సవం జరుగుతుంది. దాదాపు 2 లక్షల మంది తిరునాళ్లలో కట్టే విద్యుత్ ప్రభలు, వాటిపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి వస్తారు. సువర్చలా పరిణయం ఆంజనేయస్వామికి వివాహం లేదని కొందరి వాదన. వాల్మీకి రామాయణంలోనూ ఎక్కడా ఆంజనేయ స్వామి వివాహ ప్రసక్తి లేదు. అయితే ఆంజనేయ స్వామి వివాహ ప్రస్తావన పరాశర సంహితలో కనిపిస్తుంది. దాని ప్రకారం ఆంజనేయస్వామి నవ వ్యాకరణ పండితుడు. అంటే తొమ్మిది విధాల వ్యాకరణ పండితుడన్న మాట. అయితే ఆ విద్యను సూర్యుని వద్ద నేర్చుకునే సమయంలో మొదటి ఐదు వ్యాకరణాలు నేర్పిన తర్వాత సూర్యుడు మిగిలిన నాలుగు గృహస్తులకు మాత్రమే నేర్పుతానని చెప్తాడు. తన కుమార్తె సువర్చలను వివాహమాడితే గృహస్తుగా మారడమే కాకుండా ఆ విధంగా గురుదక్షిణ చెల్లించినవాడివి కూడా అవుతావని చెప్తాడు. అందుకు స్వామి బదులిస్తూ ‘నేను అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాను కనుక వివాహం ఎలా చేసుకోగలను’ అంటాడు. దీనికి విరుగుడుగా సూర్యుడు వ్రతభంగం కాని వరం ప్రసాదిస్తాడు. అంటే ఆమెను వివాహం చేసుకున్నా ఆమెతో శారీరక సంపర్కం లేకుంటే గృహస్తువే అవుతావు అంటాడు. అప్పుడు స్వామి ‘దీనికి సువర్చల ఒప్పుకుంటే వివాహానికి నేను సమ్మతమే’ అని అంగీకరిస్తాడు. స్వామి కోరికను సువర్చల మన్నించి వివాహం చేసుకుందనేది పురాణగాథ. వీలుకాని పరిస్థితుల్లో కూడా విజయవంతగా వివాహం చేసుకున్న ఈ దంపతుల సమక్షంలో పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితంలో ఏ ఆటంకాలు ఉండవని భక్తుల నమ్మిక. ఆ నమ్మికకు ఊతం ఇస్తూ అక్కడ దశాబ్దాలుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. - అడుసుమల్లి సోమ శ్రీనివాసరావు సాక్షి ప్రతినిధి, అద్దంకి ఎలా వెళ్లాలి? బస్సు మార్గం: శింగరకొండకు బస్సులో చేరుకోవాలంటే రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మార్గాలున్నాయి విజయవాడ నుంచి అద్దంకి డిపోకు చేరుకుంటే అక్కడ నుంచి నేరుగా శింగరకొండకు బస్సులున్నాయి హైదరాబాదు నుంచి అయితే అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో ప్రయాణించి నేరుగా శింగ రకొండలో దిగవచ్చు. 278 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైలు మార్గం: విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ఒంగోలు రైల్యే స్టేషన్ నుంచి శింగరకొండ 41 కి.మీ. దూరంలో ఉంది నరసరావుపేట, వినుకొండ, గుంటూరు, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ల నుంచి శింగరకొండ సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమాన మార్గం: గన్నవరం విమానాశ్రయం నుంచి 155 కిలోమీటర్లు రేణిగుంట విమానాశ్రయం నుంచి 250 కిలోమీటర్లు దూరం ఉంటుంది. బస: శింగరకొండలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సత్రాలు ఉన్నాయి అదేవిధంగా మారుతి భవన్, దామరచర్ల గెస్ట్ హోస్లో సూట్లు అద్దెకు ఇస్తారు క్షేత్రంలో నిత్య అన్నదానం ఉంటుంది. శని, మంగళవారాల్లో 150 మందికి, మిగిలిన వారాల్లో రోజుకు 50 మందికి దేవస్థానం తరుఫున అన్నదానం చేస్తారు. -
అందమైన మూడు ముళ్లు
మంచి ఆనవాయితీ ఆధునిక కాలం పెళ్లిళ్లు మరింత అర్థవంతమవుతున్నాయి. వెనుకబాటుతనాన్ని వదులుకుంటున్నాయి. అందుకు దేశంలో జరిగిన ఈ మూడు ఉదంతాలే మూడు ముళ్లుగా నిలుస్తున్నాయి. ‘పెళ్లికి ఏం నగలు కావాలి.. ఎన్ని చీరలు కొనాలి?’అని కాబోయే అత్తమామలు అడిగితే ఎవరైనా ఎగిరిగంతేసి తమకు ఏమేమి కావాలో చాంతాడంత జాబితా చదువుతారు. కాని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పర్యావరణ ప్రేమికురాలు మాత్రం ‘నాకు అవేవీ వద్దు, ఓ పదివేల మొక్కలు కొని ఇస్తే చాలు అంది. మొక్కే కానుక... మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని కిసిపురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల సైన్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంకా భదోరియాకి బాల్యం నుంచి పర్యావరణమన్నా, పచ్చదనమన్నా పిచ్చప్రేమ. ప్రకృతి పదికాలాలపాటు పచ్చగా పరిఢవిల్లాలన్నా, సకాలంలో వర్షాలు పడాలన్నా, కాలుష్యం కోరల నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నా అడవులను పెంచటమే ఉత్తమ మార్గం అని విశ్వసించింది. ఇక్కడి ప్రజలు వివిధ అవసరాల కోసం విచ్చలవిడిగా చెట్లను కొట్టేస్తుండటం వల్ల భూములు బీళ్లుపడి నిస్సారంగా మారిపోతున్నాయని, వర్షాభావ పరిస్థితులు అలుముకుంటున్నాయని, మరికొంతకాలంపాటు ఇలాగే కొనసాగితే తమ గ్రామం కూడా బీడుపడిపోతుందని భయపడింది. ఈ పరిస్థితిని నివారించడం కోసమే ఆమె తన పెళ్లి సందర్భంగా ఓ పదివేల మొక్కలను కొనిమ్మని కోరింది. కాబోయే కోడలి వింతకోరికకు ముందు ఆశ్చర్యపడ్డా తర్వాత చాలా ఆనందపడ్డారు అత్తమామలు. ఇక పెళ్లికొడుకు రవి చౌహాన్ అయితే తన కాబోయే భార్య పర్యావరణ ప్రేమకు మురిసిపోయాడు. ఆమె కావాలని కోరిన మొక్కల్లో ఓ అయిదువేల మొక్కలు ఆమె పుట్టింట్లోనూ, మరో ఐదువేల మొక్కల్ని తమ పొలంలోనూ నాటించి నవ వధువు ముచ్చట తీర్చాడు పెళ్లికొడుకు. గురువుకు వందనం ఇలాంటి కొత్త ఆలోచనల పెళ్లి కూతురే నిషాద్‌బాను కూడా. గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి చెందిన 22 ఏళ్ల నిషాద్బానుకు పెళ్లి నిశ్చయమైంది. అయితే తన పెళ్లి సందర్భంగా వివాహ వేదికను రకరకాల పూలతో, విద్యుద్దీపాలతో అలంకరించడం, పెళ్లి విందుకోసం వివిధ రకాల పదార్థాలను వండించడం తదితర వృధా ఖర్చుకు బదులుగా ఓ అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకుంది నిషాద్. అదేమంటే తనచేత ఓనమాలు దిద్దించినవారి నుంచి, కళాశాలలో ఉన్నతవిద్య బోధించిన వారివరకు గురువులందరినీ గుర్తుపెట్టుకుని, సన్మానించాలనుకుంది. ఓ రైతుకుటుంబంలో పుట్టిన నిషాద్‌బాను ఎంసిఎ చదివాక అదే గ్రామానికి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ రమీజ్ మహమ్మద్‌ను పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే పెళ్లి కొడుకును ముందుగానే కలిసి అందరిలా కాకుండా అందరికీ చిరకాలం గుర్తుండిపోయేలా వినూత్న రీతిలో పెళ్లి చేసుకుందామని ఒప్పించింది. చదువును ప్రేమించే బాను తలిదండ్రులు కూడా అందుకు ఆనందంగా అంగీకరించి, పదిలక్షల రూపాయలు ఇచ్చి, నీకు నచ్చినట్లుగా చేయమంటూ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. తలిదండ్రులిచ్చిన డబ్బుకు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు బహమతిగా ఇచ్చిన మొత్తాన్ని కూడా జత చేసి కేజీ నుంచి, పీజీ వరకు తనకు చదువు చెప్పిన గురువులలో 75మంది విశ్రాంత ఉపాధ్యాయులను పేరుపేరునా పెళ్లికి పిలిచి, కడుపునిండా విందుభోజనం పెట్టి, జ్ఞాపిక, శాలువా, కొంత నగదు ఇచ్చి, వారికి భక్తిశ్రద్ధలతో గురుద క్షిణ చెల్లించింది. వృద్ధాప్యం వల్ల లేదా ఇతర కారణాల వల్ల పెళ్లికి రాలేకపోయిన గురువుల వద్దకు భర్తను వెంటబెట్టుకుని స్వయంగా వెళ్లి మరీ సన్మానించి వచ్చింది. బాను పెళ్లికి వచ్చిన వారిలో చాలామంది అవివాహితులు తాము కూడా తమ పెళ్లికి ఇలానే చేస్తామని ఆమెకు మాట ఇవ్వడం గమనార్హం. బాల్య వివాహమా.. అయితే టెంట్లు అద్దెకిచ్చేది లేదు రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడితేనే ఈ దురాచారం అంతమవుతుంది. ఈ మాటే ఆలోచించిన రాజస్థాన్‌లోని దాదాపు 47,000 మంది టెంట్ డీలర్లు బాల్యవివాహాలకయితే టెంట్లు, వంట సామగ్రి అద్దెకివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి టెంట్లు, వంటసామగ్రి తదితరాలను అద్దెకు కావాలని వచ్చే వారి దగ్గర వధూవరుల బర్త్ సర్టిఫికెట్లను పరిశీలించి, వారు మేజర్లని నిర్థారణ అయితే కానీ వారి ఇంట టెంట్లు వేసేదిలేదని వారు నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకవేళ తమ పరిశీలనలో అది బాల్యవివాహమని తేలితే గుట్టుచప్పుడు కాకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మా ఆడపిల్లల మంచి భవిష్యత్తుకు మా నిరాకరణే ఒక కానుక అని వీరు అంటున్నారు. ఏప్రిల్ ఆఖరివారం ఉంచి మే మొదటివారం వరకు రాజస్థాన్‌లో పెళ్లిళ్ల సీజన్ అట. ఈ సీజన్లోనే బాల్యవివాహాలు జరిగే అవకాశం మెండుగా ఉందట. తమ లాభాలను సైతం కాదనుకుని, బాల్యవివాహాలను కనీసం ఈ విధంగానైనా ఆపాలని వీరంతా కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. -
3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..
మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకునే జంటలకు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మరో పదిరోజులు మాత్రమే మిగిలాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఈ నెల 21, 22, 24, 29 తేదీల్లో వేల జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నాయి. 29వ తేదీ అనంతరం 116 రోజులు వివాహాలు, శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. * నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు * ఏప్రిల్ 30 నుంచి ఆగస్టు 30 వరకు బ్రేక్ * జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం రూరల్ : ఈ నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు ఉండడంతో జిల్లా అంతటా పెళ్లిళ్ల సందడి నెలకొంది. 30వ తేదీ నుంచి మూఢం రావడంతో పాటు దాదాపు 116 రోజుల వరకు వివాహ, శుభకార్యాలలకు విరామం కల గనుంది. దీంతో ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు అందుకున్న జంటల తల్లిదండ్రులు ఈ పదిరోజుల్లో ఉన్న ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఈనెల 21, 24, 29 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో వే లాది జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు పురోహితులు తెలిపారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఆగస్టు 6 వరకు వేచి ఉండాల్సిందేనని అంటున్నా రు. పుష్కరాలు జరిగే కృష్ణానది పరివాహక ప్రాంతాల వారికైతే ఈ గడువు ఆగస్టు 23 వరకు ఉందని చెబుతున్నారు. శ్రీవారి క్షేత్రంలో సందడి ఈనెలాఖరు వరకు జరుగనున్న వివాహాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల (చిన్నతిరుపతి) శ్రీవారి క్షేత్రం వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి బృందాలు క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు, కాటేజీలు, గదులను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దీంతో వెనుక వచ్చే వారికి కష్టాలు తప్పనట్టే. శేషాచలకొండపైన, దిగువన ఈనెల 21, 22, 24, 29 తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి కల్యాణ మండపాలకు విద్యుద్దీపాలంకారాలు, అలాగే పచ్చిపూల మండపాలు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నెలలో ముహూర్తాలు కొన్నే ఉండటంతో పెళ్లి సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పురోహితులకు, ట్రావెల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. వివాహాన్ని అట్టహాసంగా జరుపుకోదలచిన వారు ఖర్చును సైతం లెక్కచేయడం లేదు. ఇప్పటికే చిన్నతిరుపతి క్షేత్రంలో వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 6 వరకు వివాహాలకు బ్రేక్ ప్రస్తుతం చైత్రమాసం కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి శ్రావణంలో సగభాగం ముగిసే వరకు ముహూర్తాలు లేవు. ఈనెల 30 నుంచి జూలై 13 వరకు శుక్రమౌఢ్యం ఉందని పురోహితులు చెబుతున్నారు. ఆ వెంటనే ఆషాఢమాసం వస్తుందని, దాన్ని శూన్యమాసంగా భావించి వివాహాలు జరపరని పండితులు తెలిపారు. ఆ తర్వాత వచ్చే శ్రావణం శుభప్రదం కావడంతో ఆగస్టు 6 నుంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయన్నారు. పురోహితులు.. వివాహ సామగ్రికి డిమాండ్ జిల్లాలో వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో వివాహ సామగ్రికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ కాగా పురోహితులు, షామియానా, లైటింగ్, పూలకు, పూల వేదికలు సెట్టింగ్‌లకు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ నెలకొంది. నెలల వారీగా ముహూర్తాలు ఇలా ఏప్రిల్ : 20, 21, 22, 24 27, 29 తేదీల్లో ముహూర్తాలు మే : శుక్లమౌడ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూన్ : గురుమౌఢ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూలై : ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు ఆగస్టు : శ్రావణమాసంలో 6 నుంచి 27వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి సెప్టెంబర్ : భాద్రపదం కావడంతో ముహర్తాలు ఉండవు అక్టోబర్ : ఆశ్వీయుజంలో 5 నుంచి 21 వరకు ముహూర్తాలు ఉన్నాయి నవంబర్ : కార్తీకంలో 2 నుంచి 24వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్ : మార్గశిరంలో 3 నుంచి 22 వరకు ముహూర్తాలు ఉన్నాయి. -
పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ధ్రువీకరణ పత్రంతో లాభాలెన్నో.. నెట్వర్క్ : వివాహానికి చట్టబద్ధత కల్పించడం కోసేమే రిజిస్ట్రేషన్. గతంలో పెళ్లి పత్రికలు, ఫొటోలు మాత్రమే వివాహాలకు ఆధారంగా ఉండేవి. అలాకాకుండా వివాహాలు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. జరిగిన వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పెళ్లి నమోదు పత్రం భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని 2002 మే లో రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా 2006 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని కూలాలు, మతాలు, వర్గాలకు వర్తించనుంది. ఈ చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. అన్ని జిల్లాలకు జిల్లా రిజిస్ట్రార్ ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్‌కు లోబడి జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత సబ్ రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహం నమోదు ఇలా.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరి తల్లితండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందించాలి. దరఖాస్తులు వధూవరుల వయస్సు తెలియజేసే ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు. వీటిని ఏదైనా గెజిటెడ్ అధికారితో ఎటాస్టడ్ చేయించుకోవాల్సి ఉంది. వీటితోపాటు శుభలేక, ఒక ఫొటో, కల్యాణ మండపంలో జరిగితే అద్దె రసీదు, దేవాలయంలో జరిగితే ఫీజు రసీదులు జత చెయ్యాలి. వధూవరులు తరుపున ముగ్గురు సాక్షులు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చెయ్యాల్సి ఉంటుంది. సాక్షుల ఆధార్ లేదా గుర్తింపు కార్డులు జత చెయ్యాలి. రిజిస్ట్రార్ ఈ సమాచారాన్ని రిజిస్ట్రర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే ప్రదేశంలోను, మన ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్)పై ధ్రువీకరణ అధికారి సంతకం సీలు వేసి దంపతులకు అందిస్తారు. ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ.210 ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏడాది దాటితే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి కోసం పంపేవారమని నేడు స్థానిక సబ్ రిజిస్ట్రార్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు గుణదల సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. ఎందుకు నమోదు చేసుకోవాలంటే.. ⇒ఈ విధంగా నమోదు చేసుకుంటే జరిగిన వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. ⇒కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేందుకు ఉపయోగపడుతుంది. ⇒భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది. ⇒వరకట్నం కేసులో నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది. ⇒విడాకులుకోరే భార్య లేదా భర్త కూడా వివాహం జరిగినట్టు ఆధారం చూపించాల్సి ఉంటుంది. ⇒రెండవ వివాహాలను అడ్డుకోవాడనికి మహిళలు లేదా పురుషులకు ఇది ముఖ్యమైన సాక్షంగా ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారమిస్తే శిక్ష వివాహ నమోదు పత్రంలో మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి జరిమానా, లేదా ఈ రెండు అమలు చేస్తారు. ఉద్దేశ పూర్వకరంగా అధికారి వివాహ నమోదు చెయ్యలేదని దరఖాస్తు దారుని ఫిర్యాదు రుజువైతే ఆఅధికారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా, లేదా రెండు శిక్షలు అమలు చేస్తారు. -
దుర్గమ్మ సన్నిధిలో పెళ్లిళ్లకు అనుమతి
విజయవాడ (ఇంద్రకీలాద్రి): విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో యథావిధిగా పెళ్లిళ్లు చేసుకోవచ్చని దుర్గగుడి ఈవో ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ప్రకటించారు. గతంలో ఆలయ ప్రాంగణంలో పెట్టిన అన్ని నిబంధనలను రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేశారు. అమ్మవారి సన్నిధిలో వివాహం జరుపుకున్నవారు పసుపు బట్టలతో అమ్మవారి దర్శనానికి వస్తే వారితోపాటు మరో నలుగురికి ఉచితంగా అంతరాలయ దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మ సన్నిధిలో వివాహాలు జరుపుకొనేవారు సన్నాయి మేళంతోనే చేసుకోవాలని, పూర్తి బ్యాండ్ పెట్టవద్దని సూచించారు. అమ్మవారి మెట్ల పూజలు యథావిధిగా చేసుకోవచ్చునని ప్రకటించారు. -
ఇక మనదేశంలోనూ ఆ తరహా పెళ్లిళ్లు
ఆహ్లాదకరమైన వాతావరణంలో, జీవితాంతం గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుక జరుపుకోవాలని అనుకోవడం మామూలే. కాసులకు వెరవకుండా.. నింగిపై.. నేలపై అంటూ విభిన్నంగా ఆలోచించే జంటలకు కూడా మన దేశంలో కొదవలేదు. ఈ ఆలోచనలనే మన ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అందుకే నడి సముద్రంలో ముచ్చటగా మూడు ముళ్ల తంతును అత్యంత రొమాంటిక్‌గా జరిపించడానికి కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విదేశాల్లో కాసులు కురిపిస్తున్న ఈ తరహా పెళ్లిళ్లను త్వరలో మన దేశంలో కూడా పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. సముద్రంలో విహారానికి వినియోగించే విహార ఓడలను వివాహ వేదికలుగా అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సముద్రంలోను, ఆకాశమార్గాన విహరించేందుకు సీ ప్లేన్ సేవలను కూడా ప్రారంభించనున్నామని వెల్లడించారు. నడి సముద్రంలో ఓడలపై కొత్త తరహా పెళ్లి వేదికలకు శ్రీకారం చుట్టునున్నామని ఆయన తెలిపారు. వీటి ఆమోదం కోసం పౌరవిమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్‌కు పంపామన్నారు. దీంతోపాటు అదనంగా విందు, వినోదం లాంటి సకల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అంటే ఇక హిందూ మహాసముద్రంపైనో.. బంగాళాఖాతం నట్ట నడిమధ్యనో లేదా అరేబియా సముద్రంపైనో విలాసంగా వధూవరులు విహరించవచ్చన్నమాట. అయితే మొదట కొచ్చిన్ , చెన్నై, ముంబైలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా షిప్పింగ్, పర్యాటకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త పర్యాటక విధానాలను రూపొందించనున్నట్టు తెలిపారు. భూమి మీద, నీటి మీద కూడా ల్యాండయ్యే విమానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, సముద్ర విమానాల లాంటి సేవలతో పాటు ఈ క్రూయిజ్ పర్యాటక పెట్టుబడిలో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఇప్పటికే 101 జలమార్గాలలో ఇలాంటి 25 విమానాలను నడిపేందుకు ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉన్నా.. భారతదేశంలో ఈ తరహా పర్యాటక అభివృద్ధి తక్కువగా ఉందన్నారు. అందుకే ఈ తరహా అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. -
కల్యాణ వైభోగమే..!
విశాఖలో పెద్ద సంఖ్యలో వివాహాలు ఎక్కడ చూసినా సందడే చైత్రమాసం వరకు ఇదే ఒరవడి పెళ్లంటే పందిళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు... ఇపుడు జిల్లా అంతటా ఇదే సందడి. సన్నాయి మేళం గొంతెత్తింది. పెళ్లిబాజా చిందులేస్తోంది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ముహూర్తాలు పెట్టే పురోహితుల గృహాల్లో సందడి నెలకొంది. విందుల రద్దీలో వంటమేస్త్రీలు దొరకడం లేదు. వస్త్ర, కిరాణా, పూల వ్యాపారాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పసిడి ధర పెరిగిపోయింది. మొత్తంగా జిల్లాలో పెళ్లిళ్ల సందడి స్పష్టంగా కన్పిస్తోంది. యలమంచిలి : పచ్చని తోరణాలతో, విరబూసిన పూల తో, విద్యుత్ కాంతులతో మండపాలు ముస్తాబవుతున్నాయి. వధూవరుల ఇంట బంధువుల, మిత్రుల కలయికలతో సందడి వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుత మాఘమాసం ప్రారం భం నుంచే పెళ్లిల్లకు మంచిరోజులు కావడంతో ఇప్పటి వరకు శుభముహూర్తం కోసం ఎదురు చూస్తున్నవారి ఇళ్లల్లో ఇపుడు బాజాలు మోగుతున్నాయి. ప్రధానంగా కార్తీకమాసంలో సం బంధాలు కుదుర్చుకున్నవారితో పాటు కొత్తగా కుదుర్చుకునేవారు కూడా చైత్రమాసంలోగానే వివాహాలు జరిపేందుకు శుభముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ముహూర్తాలు మొదలయ్యాయి. 17, 25, 26, 28 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్య లో వివాహాలు జరిగినట్టు పండితులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లోనూ అక్కడక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పాల్గుణమాసం, చైత్రమాసా ల్లో అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత శూన్యమాసం, మూఢం వంటివి వరుసగా రావడంతో జూలై నెల వరకు ముహూర్తాలు లేవు. శ్రావణమాసం ఆగస్టు 4వ తేదీ నుంచి మళ్లీ ముహూర్తాలు మొదలవుతాయి. ఇదే నెలలో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కావడంతో చాలా మంది వివాహాలకు దూరంగా ఉంటారు. గత ఏడాది గోదావరి పుష్కరాల వలన కూడా కొం దరు వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపలేరు. దీనికితోడు శూన్యమాసం, అమావాస్య తదితర కారణాలతో వివాహాలు పెద్దగా జరగలేదు. కార్తీకమాసంలో అక్కడక్కడా మాత్రం జరిగాయి. ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో వివాహాలకు మంచిరోజులు. దీంతో జిల్లాలో పెళ్లి వాతావరణం స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటికే కొందరు ముహూర్తాలు నిర్ణయించుకుని పెళ్లికి సిద్ధమవుతుండగా మరికొందరు పెళ్లి కుదుర్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి ముహూర్తం ఖరారైన వధూవరుల కుటుంబ సభ్యులంతా పెళ్లి పిలుపుల పనుల్లో ఉన్నారు. వివాహాలతో పాటు ఈ మూడు నెలల్లో గృహ ప్రవేశాలు, ఉపనయనం, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు కూడా పెద్ద సంఖ్యలోనే చేపడుతున్నారు. అన్నింటికీ డిమాండే... పెళ్లి ముహూర్తాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు సైతం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీంతో చిన్నచిన్న సత్రాలు కూడా ముందుగానే పెళ్లిళ్లకు బుక్ చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతవాసులు ఇళ్లముందే మండపాలు ఏర్పాటు చేసుకుని వివాహాలు జరిపించుకుంటున్నారు. మరికొందరు ఆలయాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల అవి కూడా ఖాళీ లేకపోవడంతో సామాజిక భవనాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల వైపే ఆధారపడాల్సి వస్తోంది. కల్యాణ మండపాలతో పాటు పురోహితులు కూడా దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఒక్కసారిగా జరగడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. పెళ్లిళ్లలో అతిముఖ్యమైన వంట నిర్వాహకులు, బాజాభజంత్రీలు దొరకడంలేదు. దీంతో వివాహాలు చేసుకునేవారికి తంటాలు తప్పడంలేదు. పసిడి, వస్త్రదుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. బంగారం ధర కూడా పెరిగింది. పెళ్లికి ముఖ్యమైన మంగళసూత్రాలు, తాడు ఇతర ఆభరణాలు కొనుగోలు చేసేవారితో దుకాణాలు రద్దీగా కన్పిస్తున్నాయి. . -
అభిమానం వెల్లువ
⇒ రోజంతా బిజీబిజీగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ⇒ వివాహాలు, పరామర్శలు, నూతన జంటలకు ఆశీర్వాదం ⇒ కృష్ణమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శ ⇒ ఎర్రగుంట్ల, బద్వేలు, పోరుమామిళ్లలో ఘన స్వాగతం ⇒ అడుగడుగునా కాన్వాయ్‌ని ఆపి.. కరచాలనం చేసిన అభిమానులు ⇒ ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామంటూ నేతలు, కార్యకర్తలకు భరోసా ⇒ పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ⇒ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో మాటా మంతి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారం చూపుతూ.. కార్యకర్తల పట్ల అభిమానాన్ని చాటుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారు. పండుటాకులపై ప్రేమ కురిపిస్తూ.. అడుగడుగునా అభిమానులు కాన్వాయ్‌ని ఆపుతున్నా ఏమాత్రం విసుగు చెందకుండా అందరినీ ఆప్యాయంగా పలుకరించారు. కడప : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నాటి జిల్లా పర్యటనలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన పర్యటనలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడప, ఎర్రగుంట్ల, మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, ఆలంఖాన్‌పల్లె ఇలా అన్నిచోట్ల వేలాది మంది జనానికి అభివాదం చేస్తూ.. అభిమానులతో కరచాలనం చేస్తూ.. వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ ఆయన ముందుకు సాగారు. వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి నేనున్నాంటూ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. ఆశీర్వాదాలు.. పరామర్శలు ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్న నేపధ్యంలో గురువారం ఉదయాన్నే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎర్రగుంట్లలో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పోట్లదుర్తికి వెళ్లి ఇటీవలే వివాహమైన రాజేంద్రనాథ్‌రెడ్డి కుమారుడు మహేంద్రనాథ్‌రెడ్డి, కీర్తిలతలను ఆశీర్వదించారు. ఆ తర్వాత చాపాడు మండలంలోని నాగులపల్లెకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి వెళ్లారు. ఇటీవలే వివాహమైన మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి కుమారుడు విద్యాసాగర్‌రెడ్డి, మౌనికలను ఆశీర్వదించారు. అట్లూరు వైఎస్సార్ సీపీ నాయకుడు గోవిళ్ల చిన్న సూరారెడ్డి కుమారుడు ఆదిత్యనాథ్‌రెడ్డి వివాహం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో బద్వేలులోని వారి ఇంటికి వెళ్లారు. ఆదిత్యను ఆశీర్వదించారు. అనంతరం పోరుమామిళ్లలోని ఎంపీపీ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత మహిళా ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్ పర్సన్ క ృష్ణమ్మ, ఆమె కుమారుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జునరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. (ఇటీవలే క ృష్ణమ్మ భర్త పోతిరెడ్డి భాస్కర్‌రెడ్డి మృతి చెందారు) అనంతరం ఆలంఖాన్‌పల్లెలో చెన్నూరు వైఎస్సార్సీపీ నేత రాజేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల వారు గ ృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. కడప నగరంలోని 3వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మిదేవి, వీరారెడ్డిల కుమారుడు బ్రహ్మనందరెడ్డి, శివకుమారిలను (ఇటీవలే వివాహం అయ్యింది) ఆశీర్వదించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ తల్లి రెడ్డెమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు ఇంటికి వెళ్లి ఇటీవలే వివాహమైన కుమార్తె ప్రియాంక, అల్లుడు శ్రీకాంత్‌రెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం హజరత్ మౌలానా సయ్యద్‌షా యూసుఫ్ బొగ్దాది సాహెబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పెద్దదర్గాకు వెళ్లి ఉరుసు ఉత్సవంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని పీఠాధిపతి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ముస్లిం మైనార్టీలు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. అక్కడి నుంచి నేరుగా వైఎస్ జగన్ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త, దివంగత సీఎం వైఎస్ తోడల్లుడు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అడుగడుగునా కాన్వాయ్‌ను ఆపి కరచాలనం పులివెందుల నుంచి కడప వరకు బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా వస్తున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేత కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేశారు. వ ృద్దులు, యువకులు, మహిళలతోపాటు చాలాచోట్ల చిన్నారులు కూడా వైఎస్ జగన్‌ను పలుకరించారు. అన్ని గ్రామాల్లో స్థానికులు రోడ్డుపైకి వచ్చి జగన్‌తో కరచాలనం చేసేందుకు కాన్వాయ్‌ను ఆపుతూ వచ్చారు. దీంతో పర్యటన ఆలస్యంగా సాగింది. వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెంట ఉండగా, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అనంతపురం జిల్లా కదరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు సుధీర్‌రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, వేల్పుల రాము, బద్వేలు నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వైఎస్ జగన్‌ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన తన పర్యటన ముగించుకుని రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరబాద్‌కు బయలుదేరి వెళ్లారు. -
మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!
భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు. ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు. వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని, మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు. -
శ్రీరస్తూ... శుభమస్తూ...
-
శ్రీరస్తూ.. శుభమస్తూ..
తిరుమలలో రెండు రోజులుగా పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. మాఘమాసం ఉత్తరాభాద్ర కన్యలగ్నమయిన గురువారం రాత్రి 9.13 గంటలకు అధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఇక్కడి టీటీడీ పౌరోహిత సంఘంలోనూ, కాటేజీల కల్యాణ మండపాలు, ప్రైవేట్ మండపాల్లోనూ సుమారు వంద దాకా పెళ్లిళ్లు జరిగాయి. ఇక శుక్రవారం తెల్లవారుజాము 4.11 ధనుర్లగ్నంలోనూ, రాత్రి 9.09 గంటలకు రేవతి నక్షత్రం కన్యాలగ్నంలోనూ పెళ్లి ముహూర్తాలున్నాయి. శనివారం తెల్లవారుజామున 4.07 గంటల ధనుర్లగ్నంలోనూ పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ మండపాలతోపాటు పౌరోహితులు, నాయీబ్రాహ్మణులు, పెళ్లి సామగ్రికి గిరాకీ పెరిగింది. - సాక్షి, తిరుమల -
వారి ప్రేమను అ‘లా’ గెలిపించుకున్నారు!
కేస్ స్టడీ సలీం, సుభాషిణి గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురూ ఉన్నత విద్యావంతులు, ఆధునిక భావాలు కలవారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఏ బాధ్యతలూ లేని జీవితం గడుపుతున్నవారు. ఇటీవలే వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, వివాహానికి అనుమతి కోరారు. ఇరువురి తలిదండ్రులూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మతాంతర వివాహానికి ససేమిరా అన్నారు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు సుభాషిణి, సలీం. సుభాషిణి తలిదండ్రులు దిగి రాలేదు. బెదిరించినా, ప్రాధేయపడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. సలీం తలిదండ్రులు కాస్త మెత్తబడ్డారు. కానీ ఒక బాంబ్ పేల్చారు. అదేమంటే ఒక ముస్లిమ్ యువకుడు హిందూ మహిళను వివాహమాడాలంటే ఆమె తప్పనిసరిగా ముస్లిం మతాన్ని స్వీకరించాలని చెప్పారు. అంతేకాకుండా వారి ‘లా’ మతాంతర వివాహాలను అంగీకరించదని, హిందువులను వివాహమాడాలంటే మతమార్పిడి తప్పనిసరి అని చెప్పారు. ఎంత ఆధునిక భావాలున్నా, సుభాషిణి సనాతన కుటుంబం నుండి వచ్చింది. మతమార్పిడి ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఇరువురూ బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించినా, పరిష్కారం కనిపించలేదు. చివరకు స్నేహితుల సలహాతో ఓ న్యాయవాదిని సంప్రదించారు. న్యాయవాది వారికి ప్రత్యేక వివాహ చట్టం 1954 గురించి వివరించారు. దానినే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారనీ, దీనిననుసరించి జరిగే వివాహాలను రిజిస్టర్ వివాహాలని సామాన్య పరిభాషలో అంటారని వివరించారు. ఈ చట్టాన్ననుసరించి భిన్నమతాలకు చెందిన వారు వివాహాలు చేసుకోవచ్చనీ, వివాహాలకు లౌకిక లక్షణం కల్పించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యమని చెప్పారు. కులం, మతం, ఆచారాలతో సంబంధం లేకుండా వివాహం చేసుకోవచ్చనీ, ఈ వివాహాలకు చట్టబద్ధత ఉందని, అంతేగాక న్యాయపరంగా కూడా అన్ని హక్కులు, రక్షణలూ లభిస్తాయని హామీ ఇచ్చారు. ఈ వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిస్తారని చెప్పారు. సుభాషిణి, సలీం ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రేమను సుసంసన్నం చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. వారి ప్రేమ కథ ఆ విధంగా సుఖాంతం అయింది. -
పిల్లల భవిత చల్లగా!
* ఉన్నత విద్య, వివాహాలకు పొదుపు తప్పనిసరి * పలు సాధనాల్లో మదుపు చేయటమే మంచిది మీకే కాదు! ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే ప్రపంచం. ఆ ప్రపంచం చుట్టూ కలలు అల్లుకునేది కూడా తల్లిదండ్రులే. మరి ఈ కలల్ని నిజం చేసుకోవాలంటే..? ఇతరత్రా అంశాలతో పాటు ఆర్థికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ వారి నిత్యావసరాల నుంచి చదువు దాకా అన్నీ ముడిపడి ఉన్నది డబ్బుతోనే. విద్యా సంబంధమైన ఖర్చులు పెరుగుతున్న తీరు మనకు తెలియంది కూడా కాదు. అసోచామ్ అంచనా ప్రకారం... గడిచిన పదేళ్లలో విద్యా సంబంధ ఖర్చులు ఏకంగా 150 శాతం పెరిగాయి. మున్ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల మాట. దీనర్థం... మీ పిల్లలకోసం ఇన్వెస్ట్ చేయటమన్నది తప్పనిసరి ప్రాధాన్యం. సరే! మరి ఈ పొదుపు, పెట్టుబడికి సరైన పథకాలేంటి? నిజానికిది ఎప్పటికీ చిక్కు ప్రశ్నే. ఒకో సమయంలో ఒకో రకమైన సాధనాలు అందుబాటులోకి వస్తుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలను విశ్లేషించినపుడు ఏఏ పథకాలు మెరుగైనవిగా తేలాయంటే... బంగారంపై పెట్టుబడి మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్న తరుణంలో బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులనేవి సురక్షిత సాధనంగా పనికొస్తాయి. ‘‘బంగారంలో పెట్టుబడులను ఈటీఎఫ్‌ల ద్వారా, గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల ద్వారా, ఈ-గోల్డ్ ద్వారా చేయొచ్చు. అయితే భౌతికంగా బంగారం కొనటం మాత్రం సరైన పెట్టుబడి మార్గం కాదనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని దాచటం సమస్యే. పెపైచ్చు తరుగు కూడా పోతుంటుంది. పేపర్ గోల్డ్ గనక కొంటే అది మార్కెట్ ధరకే దొరుకుతుంది కనక అది కూడా బంగారాన్ని కొన్నట్టే. గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినా అంతే’’ అని ‘జెన్ మనీ’ కమాడిటీ నిపుణుడు ఆర్.నమశ్శివాయ తెలియజేశారు. కాగా మీ పోర్టుఫోలియోలో బంగారంపై పెట్టే మొత్తం 10 నుంచి 15 శాతం మించకుండా చూసుకోవటం ఉత్తమం’’ అని ఆయన వివరించారు. భవిష్యత్తు లక్ష్యాల రక్షణ తప్పనిసరి! అనుకోని దుర్ఘటనలు జరిగినా కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇబ్బంది రాకూడదని భావిస్తే అందుకు తగ్గ బీమా రిస్కు కవరేజీ కూడా తీసుకోవాలని జెన్ మనీకి చెందిన ఫైనాన్షియల్ అనలిస్టు జాగర్లమూడి వేణుగోపాల్ చెప్పారు. ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లు నిజానికి ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లనేవి ప్రాధాన్యంలో ఎప్పుడూ ముందే ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణాలేంటంటే... ఇన్వెస్ట్‌మెంట్‌కు పది నుంచి 15 ఏళ్ల దీర్ఘ కాలం వ్యవధి ఉండటం. రెండు... క్రమంగా పెట్టుబడి పెట్టేందుకు సిప్ వంటి విధానం అందుబాటులో ఉండటం. ‘‘నెలకు రూ.5వేల చొప్పున వరసగా 18 ఏళ్ల పాటు సిప్ పద్ధతిలో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏకంగా రూ.33 లక్షలయ్యే అవకాశం ఉంటుంది. ఏడాదికి 12 శాతం రాబడిని అంచనా వేయటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కూడా. ఏడాదికి 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణం పెరుగుతుందని అనుకున్నా... ఈ మొత్తం దాన్ని అధిగమిస్తుంది. కాకపోతే ఇందులో ప్రధానమైనది ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నామనేది కాదు. ఎన్నాళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తున్నామనేది. కాంపౌండింగ్‌కు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రాబడులనిచ్చిన చరిత్ర ఈక్విటీ ఫండ్లకుంది. పెపైచ్చు దీర్ఘకాలంలో మీ ఖర్చును యావరేజ్ చేయడానికి సిప్‌ను మించిన విధానం లేదు కూడా’’ అని హైదరాబాద్‌లోని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవీరెడ్డి వివరించారు. పీపీఎఫ్ చాలామంది నిపుణులు దీన్నే తమకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనంగా పేర్కొన్నారు. ఎందుకంటే దీనికి వేలు పెట్టడానికి వీల్లేని ‘ఇఇఇ’ ఫీచర్ ఉంది. ట్రిపుల్ ఇ... అంటే ఇన్వెస్ట్ చేసేటపుడు గానీ, వడ్డీపై గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ ఎక్కడా పన్ను లేకపోవటమన్న మాట. పెపైచ్చు దీని కాల వ్యవధి 15 సంవత్సరాలు. అంటే.. పిల్లల చదువుకు గానీ, వివాహానికి గానీ సరిగ్గా సరిపోయే సమయం. దీన్లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే... సరళమైన పెట్టుబడి విధానం. కనిష్ఠంగా ఏడాదికి రూ.500 కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అది కూడా మీకు కుదిరిన సమయంలో. కాకపోతే ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలకు మించి మాత్రం పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. పిల్లల పేరుతో పాటు మీ ఖాతా నుంచి మీ పేరిట కూడా పెట్టుబడి పెట్టిన పక్షంలో... రెండు ఖాతాల కింద రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు. స్వల్పకాలానికి డెట్ సాధనాలు... స్వల్ప, మధ్యకాలిక అవసరాల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకంటే అక్కడ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. ‘‘మార్కెట్ రిస్కుకు దూరంగా ఉండటానికి స్వల్పకాలిక ఫండ్లు, ఇన్కమ్ ఫండ్లు, బాండ్ ఫండ్లు (తక్కువ వ్యవధి) వంటి డెట్ సాధనాల్ని పరిశీలించవచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల రాబడి శాతం 6 నుంచి 8 మించకపోవచ్చు. కాకపోతే రిస్కు కూడా చాలా తక్కువగా ఉంటుంది’’ అని వేణుగోపాల్ వివరించారు. వీటన్నిటితో పాటు మీ పిల్లలకు డబ్బు ప్రాధాన్యం గురించి తెలియజేయండం ఎంతో ప్రయోజనకరం. సుకన్య సమృద్ధి పథకం... ఆడపిల్లల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన పథకమిది. ఈ పథకాన్ని మీ అమ్మాయి పుట్టినప్పటి నుంచి తనకు పదేళ్ల వయసు వచ్చేదాకా ఎప్పుడైనా ఆరంభించొచ్చు. పదేళ్లు దాటిన అమ్మాయిలున్నా, లేకపోతే అబ్బాయిల తల్లిదండ్రులైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కుదరదు. ఏడాదికి కనీసం రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా వరసగా 14 ఏళ్లపాటు చేయొచ్చు. ఈ పథకం కింద ఖాతా తె రిచిన 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ సొమ్ము చేతికొస్తుంది. ఏడాదికి 9.2 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు. కాకపోతే పీపీఎఫ్ మాదిరిగా దీనిపై కూడా వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన పక్షంలో పాక్షికంగా విత్‌డ్రాయల్ చేసుకోవటానికి అనుమతి ఉంటుంది. -
చదువులు, పెళ్లిళ్లూ కారణమే
* రైతు ఆత్మహత్యలపై సర్కారు * వాటి వల్లే అప్పులంటూ హైకోర్టులో కౌంటర్ సాక్షి, హైదరాబాద్: రైతులు వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్చడానికి, పెళ్లిళ్లు చేయడానికి అధికంగా ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారని...వారి ఆత్మహత్యలకు ఇదీ ఓ కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అలాగే విచక్షణారహితంగా బోర్లు తవ్వడం, భూముల లీజు, కుటుంబ తగాదాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ప్రైవేటు వ్యక్తుల రుణాల వల్ల కూడా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. రైతుల ఆత్మహత్యల నివారణకు తాము ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు, వారి సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తమను నిందించడానికే పిటిషనర్లు ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తన కౌంటర్లో పేర్కొన్నారు. పిటిషనర్లు తమను నిందించే బదులు అర్థవంతమైన సలహాలు ఇస్తే బాగుండేదన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తాము బాధ్యతల నుంచి పారిపోవట్లేదని వివరించారు. ఎప్పటినుంచో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు మరింత లబ్ది చేకూర్చేందుకు ప్రస్తుత పథకాలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు ప్రారంభించామని అన్నారు. కౌంటర్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే... ‘‘రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యంగా పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకున్నాం. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయాలని నిర్ణయించి రూ. 4,250 కోట్లు విడుదల చేసి 35,29,944 రైతు ఖాతాల్లో రూ. 4,039.98 కోట్లు జమ చేశాం. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రెండో దశ రుణ మాఫీ కింద రూ.4086 కోట్లు విడుదల చేశాం. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా రైతులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. 2015 సెప్టెంబర్‌లో జరిగిన రైతు ఆత్మహత్యల ఆధారంగా అధ్యయనం చేయగా 154 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పత్రికలు, టీవీల్లో కథనాల ద్వారా వెల్లడైంది. ఇందులో 94 కేసులు వ్యవసాయ సమస్యలకు సంబంధించినవని జిల్లా అధికారులు పేర్కొన్నారు. కానీ 41 కేసులు వ్యవసాయానికి చెందినవి కావు, మరో 12 కేసులు ఆత్మహత్యలు కావు. మిగిలిన 7 కేసుల్లో ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం. ఆ ఆత్మహత్యలపై మేం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేపడుతుంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలకు పంపుతున్నాం. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాక ప్రైవేటు అప్పులు, పెళ్లిళ్లు, చదువులు, బోర్ల తవ్వకాలపై విచక్షణారహితంగా ఖర్చు చేస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కుటుంబ వివాదాలు, గల్ఫ్‌కు వెళ్లేందుకు భారీగా అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యలకు కారణాలు’’ అని సర్కారు తన కౌంటర్లో పేర్కొంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నాం... ‘‘రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించలేదు. చీప్ పబ్లిసిటీ కోసమే పిటిషనర్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని మేము రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాం. లోన్ సెటిల్మెంట్ సీలింగ్‌ను రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేశాం. దీనికితోడు పలు అదనపు ప్రయోజనాలు కూడా వర్తింప చేస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో 1,347 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనడంలో వాస్తవం లేదు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 782 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 342 కేసులు అసలైనవి. నేషనల్ క్రైమ్ రికార్డుల ప్రకారం గతేడాది 898 ఆత్మహత్యలు జరిగితే అందులో కేవలం 295 ఆత్మహత్యలు వ్యవసాయ సంబంధితమైనవి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నాం. ఏ సిఫారసును అమలు చేయలేదో పిటిషనర్లు నిరిష్టంగా చెప్పట్లేదు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టేయండి’’ అని ప్రభుత్వం కోర్టును కోరింది. -
భారత్‌లో పసిడి డిమాండ్ కళకళ!
సెప్టెంబర్ క్వార్టర్లో 13% అప్ * 268 టన్నులుగా పేర్కొన్న డబ్ల్యూజీసీ నివేదిక * ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం పెరుగుదల ముంబై: భారత్‌లో పసిడి డిమాండ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగింది. ఈ పరిమాణాన్ని 268 టన్నులుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. త్రైమాసికం ప్రారంభంలో ధరలు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణమని గోల్డ్ డిమాండ్ ధోరణులపై విడుదల చేసిన ఒక నివేదికలో డబ్ల్యూజీసీ పేర్కొంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కూడా డిమాండ్ పెరగడానికి కారణం. గత ఏడాది క్యూ3లో భారత్ పసిడి డిమాండ్ 238 టన్నులు. కాగా ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ మూడవ త్రైమాసికంలో 7.3 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. పరిమాణంలో చూస్తే... ఇది 1,121 టన్నులు. గత ఏడాది 1,042 టన్నులు. డబ్ల్యూజీసీ భారత్ విభాగం మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరం తెలిపిన నివేదిక అంశాల్లో ముఖ్యమైనవి... * గతేడాది ఇదే కాలంలో భారత్ పసిడి డిమాండ్ 238 టన్నులు. విలువ రూపంలో.. డిమాండ్ 5.8% వృద్ధితోరూ.59,480 కోట్ల నుంచి రూ. 62,939 కోట్లకు ఎగసింది. * ఒక్క ఆభరణాల విషయంలో డిమాండ్ 15 శాతం పెరిగి 211 టన్నులుగా నమోదయ్యింది. విలువ 7.7% పెరిగి రూ.49,558 కోట్లుగా నమోదయ్యింది. ఒక్క త్రైమాసికాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే... ఆభరణాలకు భారీ డిమాండ్ 2008 క్యూ3లో చోటుచేసుకుంది. అప్పట్లో ఈ డిమాండ్ 213 టన్నులు. అటు తర్వాత ఈ స్థాయి డిమాండ్ ఇదే తొలిసారి. ఆభరణాలకు పసిడి డిమాండ్ భారీగానే ఉన్న విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. * సెప్టెంబర్ త్రైమాసికంలో పెట్టుబడుల డిమాండ్ 6 శాతం వృద్ధితో 57 టన్నులుగా ఉంది. అయితే విలువల్లో మాత్రం అసలు వృద్ధి నమోదుకాకపోగా - 0.8 శాతం క్షీణించింది. రూ.13,484 కోట్ల నుంచి రూ.13,381 కోట్లకు పడింది. * ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో దిగుమతులు 24 శాతం వృద్ధితో 243 టన్నుల నుంచి 301 టన్నులకు పెరిగింది. * దసరా, ధన్‌తెరాస్, దీపావళి పండుగల నేపథ్యంలో నాల్గవ త్రైమాసికంలోనూ డిమాండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఏడాదికి డిమాండ్ 850-950 టన్నులు ఉండొచ్చు. గత ఏడాది డిమాండ్ 811 టన్నులు. మనదే మొదటి స్థానం... డిమాండ్ విషయంలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. చైనా రెండవ స్థానంలో ఉంది. ముగిసిన త్రైమాసికంలో ఈ దేశంలో డిమాండ్ 212 టన్నుల నుంచి 239 టన్నులకు ఎగసింది. మూడవ స్థానంలో ఉన్న అమెరికాలో డిమాండ్ 36 టన్నుల నుంచి 59 టన్నులు ఎగసింది. జర్మనీ (25 టన్నుల నుంచి 33 టన్నులకు), థాయ్‌లాండ్ (23 టన్నులు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్త 1,121 టన్నుల డిమాండ్‌లో ఆభరణాలు, నాణేలు, కడ్డీలుసహా వినియోగ డిమాండ్ మొత్తం 14 శాతం పెరుగుదలతో 816 టన్నుల నుంచి 927 టన్నులకు ఎగసింది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వరుసగా 19వ త్రైమాసికంలో నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీటి నుంచి ఈ త్రైమాసికంలో డిమాండ్ 175 టన్నులుగా ఉంది. -
బెడ్రూమ్లోకి ఎంట్రీ ..
సమ్‌థింగ్ స్పెషల్ పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. మరి ఆచారాలో.. అవి మనుషులు వారికి అనుగుణంగా తమ ఇంటి రాజ్యాంగంలో రాసుకున్నారు. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. అంతేకాదండోయ్.. ఆ ఆచారాల్లో కొన్ని వింత చేష్టలూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉండే వివాహ ఆచారాలు చదవండి. తప్పకుండా ముక్కు మీద వేలు వేసుకుంటారు. నెల రోజుల కఠిన పరీక్ష : చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచి ఆ పెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. పెళ్లి చేయాలంటే బ్యాంక్‌కు కన్నం వేయాల్సిందే! ఫిజీ దేశంలో పెళ్లి కొడుకు అడిగే లాంఛనాలే వేరు. ఎక్కడైనా అమ్మాయితో పాటు నగోనట్రో పంపమంటారు. కానీ అక్కడి పెళ్లి కొడుకు పిల్లనిచ్చే మామను అమ్మాయితో పాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడట. మరి దాన్ని ఇచ్చి పిల్లకు పెళ్లి చేయాలంటే అమ్మాయి తండ్రి ఆస్తి మొత్తం అమ్మడంతో పాటు దొంగతనాలూ చేయక తప్పదు. ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు : స్వీడన్ దేశంలో ఓ వింత ఆచారం ఉంది. వివాహ రిసెప్షన్లో నవ దంపతులు కూర్చున్న చోటు నుంచి పక్కకు వెళితే చాలు. వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట. అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్రూమ్కు వెళ్లినా సరే. అమ్మాయినైతే అక్కడి పురుషులు, అబ్బాయినైతే మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట. బెడ్రూమ్లోకి ఎంట్రీ : పెళ్లైనాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా ఓ పెద్దావిడను బెడ్రూమ్లోకి పంపుతారట. ఈ వింత ఆచారం ఆఫ్రికాలోని కొన్ని పల్లెటూళ్లలో ఉంది. ఆ పెద్దావిడ పెళ్లి కూతురు తల్లి అయినా కావచ్చట. నవ్వితే నో మ్యారేజ్ : కాంగోలో పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. -
చిమ్మ చీకట్లో కాంతి కిరణం!
స్పృహ పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. అయితే అక్కడి ఆడపిల్లలు మాత్రం ‘స్వర్గం’లో కాదు ‘నరకం’లో జరిగినట్లే వణికిపోతారు. పెళ్లి అనేది ఒక అందమైన కల. అయితే వారికి మాత్రం కలల విధ్వంసం. ఒక అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటుంది. చదువుకునే ప్రతిభ ఉంటుంది. సౌకర్యాలు ఉంటాయి. అయినా కాలేకపోతుంది. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటుంది. ఆ కల తన కళ్ల ముందే నిలువెల్లా చెదిరిపోతుంది. ‘కల కనండి... ఆ కలను నిజం చేసుకోండి’ అనే మాట ఒడిషాలోని చాలా గ్రామాల్లో అపహాస్యం పాలవుతుంటుంది. దీనికి కారణం బాల్య వివాహం. బాల్యవివాహాలు ముక్కుపచ్చలారని ఎందరో ఆడపిల్లల కాళ్లకు బంధనాలు వేస్తుంటాయి. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే ‘కిషోరి కళ్యాణ సమితి’ సుజాతకు నిండా పదహారు సంవత్సరాలు కూడా లేవు. కందమాల్ జిల్లా డంకెనీ అనే మారుమూల కుగ్రామానికి చెందిన ఈ అమ్మాయికి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్దపడ్డారు. తొందర పెట్టారు. ‘‘నాకు చదువుకోవాలని ఉంది’’ అనే సుజాత ఆవేదనను వాళ్లు పెద్దగా ఖాతరు చేయలేదు. తమ చుట్టాలు, పక్కాలలో ఎవరెవరికి ఏ వయసులో పెళ్లి అయిందో లిస్ట్ చదువుకుంటూ పోయారు వాళ్లు. బాగా చదువుకొని, పెద్ద ఉద్యోగమేదో చేయాలనే సుజాత కల మసకబారడం మొదలుపెట్టింది. ఎటు చూసినా చీకటి. చనిపోదామనే ఆలోచన ఆమెకు ఎప్పుడూ రాలేదు...తొలిసారిగా మృత్యుప్రేమ! కలను నిజం చేసుకోలేని బతుకెందుకు అనే వైరాగ్యం!! ఒక వైపు పెళ్లి కార్డులు ప్రింటవుతున్నాయి. మరోవైపు కన్నీటి ప్రవాహాలు ఉరకలెత్తుతున్నాయి. పెళ్లికి ఒక వారం మాత్రమే టైమ్ ఉంది. తన చావుకు ఇంకొక రోజు మాత్రమే బాకీ ఉంది అనుకుంది ఆ అమ్మాయి. ఈలోపే ఎవరో ‘కిశోరి కళ్యాణ్ సమితి’ గురించి చెప్పారు. చిమ్మచీకటిలో కాంతికిరణం జాడ దొరికినట్లయింది సుజాతకు. ఆలస్యం చేయకుండా స్నేహితుల సహాయంతో రహస్యంగా వెళ్లి సంస్థ ప్రతినిధులను కలిసి తన బాధ చెప్పింది. సుజాత ఇలాంటి సంస్థ దగ్గరకి వెళ్లడం కొత్త కావచ్చు. కానీ సంస్థకు మాత్రం సుజాతలాంటి అమ్మాయిల కన్నీటి గాథను వినడం కొత్తేమీ కాదు! ‘పెళ్లి అడ్డుకోవడానికి మీరెవర్రా’ అని ‘కెకెయస్’పై కన్నెర్ర చేసి కత్తులు దూశారు సుజాత చుట్టాలు పక్కాలు. ఆవేశం సమయం... నిమిషం. ఆలోచన సమయం... అనంతం. ‘అయ్యా... బాల్య వివాహం చేయడం ఎందుకు తప్పంటే...’ అని సంస్థ ప్రతినిధులు ఒకరి తరువాత ఒకరు చెప్పడం ప్రారంభించారు. అంతెత్తుకు ఎగిరిన వాళ్ల ఆవేశం నిమిషాల వ్యవధిలో ముగిసిపోయింది. ఆలోచన మాత్రం వాళ్లకు కొత్తదారి చూపింది. ‘‘అవును... మా అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేయాలనుకోవడం తప్పు’’ అనే స్పృహ వారిలో వచ్చేలా చేసింది. ఆమె పేరు సుజాత కావచ్చు. కవిత కావచ్చు... కల్పన కావచ్చు... ఇలా ఎందరో ఆడపిల్లల కళ్లలో వెలుగు నింపింది కిశోరి కళ్యాణ్. ఈ సంస్థలోని సభ్యులు ఏ ఆకాశం నుంచో దిగి రాలేదు. భూమి మీద సుజాతలా ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లు కావచ్చు. సుజాతలాంటి అమ్మాయిల సమస్యను చూసి చలించిన వాళ్లు కావచ్చు. వాళ్లు కిశోరి కళ్యాణ్‌లో క్రియాశీల సభ్యులు. ‘పెళ్లి చేసి చూడు... ఇల్లు కట్టి చూడు’ అనేది సామెత. పెళ్లి ఆపడం అనేది కూడా ఎంత కష్టమో కిశోరి కళ్యాణ్ సామాజిక సంస్థను చూస్తే అర్థమవుతుంది. కొన్ని పెళ్ళిళ్లు జరగడం లోకకళ్యాణం కోసం... కొన్ని పెళ్లిళ్లు ఆగడం కూడా లోక కళ్యాణం కోసమే కావచ్చు! -
నాలుగు నెలలు.. ముహూర్తాల్లేవ్..!
* అప్పటి వరకూ పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నీ బంద్ * గోదావరి తీర ప్రాంతాల్లో 2016 ఆగస్ట్ వరకూ కరువే * జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేవంటున్న పండితులు సాక్షి, హైదరాబాద్: మీ అమ్మాయికో.. అబ్బాయికో త్వరలో పెళ్లి చేయాలని భావిస్తున్నారా.. అయితే మరో నాలుగు మాసాలు ఆగాల్సిందే. పెళ్లి అనేకాదు.. ఏ శుభకార్యం చేయాలన్నా వేచిచూడక తప్పని పరిస్థితి. జూన్ 11 దాటితే మంచి ముహూర్తాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు రెండు ఆషాఢాలు(అధిక, నిజ ఆషాఢం).. మరోవైపు గోదావరి పుష్కరాలు.. తరుముకొస్తుండటంతో శుభకార్యాల కోసం కనీసం నాలుగు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఏటా ఒకటే ఆషాఢ మాసం ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. అయితే ఈసారి రెండు ఆషాడాలు(అధిక, నిజ ఆషాఢం) వస్తున్నాయి. దీంతో రెండు నెలలు ముహూర్తాలు ఉండవు. ఇక జూలై 14న గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే రోజూ గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అంతా పెద్దల్ని స్మరించుకుంటూ తర్పణం సమర్పిస్తారు. ఇలా పుష్కరాలు ప్రారంభమైన నాలుగైదు మాసాల వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఇక గోదావరి నదీ తీరప్రాంతంలోని వారైతే 2016 ఆగస్ట్ వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయకూడదట. మిగిలిన వారు మాత్రం దసరా తర్వాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని దోషాలున్నా పర్లేదు ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు దాటిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి ముహూర్తాలూ ఉండవు. అయితే ఉత్తమ పక్షం లేకపోయినప్పటికీ.. కొన్ని దోషాలు ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో ముహూర్తాలు అంగీకారమే అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, ప్రముఖ జోతిష్య పండితుడు డాక్టర్ సీవీబీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. గోదావరి తీరప్రాంత వాసులకే.. జూన్ 11 తర్వాత ఆగస్టు 2016 వరకూ మంచి రోజులు లేవని కొంతమంది పండితులు చెపుతుంటే.. అలాంటిదేమీ లేదు నవంబర్ నుంచి ముహూర్తాలు పెట్టుకోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇది గోదావరి తీరప్రాంత వాసులకే వర్తిస్తుందని, మిగతా వారు దసరా తర్వాత శుభకార్యాలు చేసుకోవచ్చని ప్రముఖ జోతిష్య పండితుడు సింహంభట్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు. 11 రోజులూ.. వేలాదిగా పెళ్లిళ్లు.. మరోవైపు జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో ఈ 11 రోజుల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసేందుకు వేలాదిమంది సిద్ధమయ్యారు. వరుసగా పెళ్లిళ్లు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, పురోహితులకు మాంచి డిమాండ్ ఏర్పడింది. నగరంలో మూడు వేలకుపైగా ఫంక్షన్‌హాళ్లు ఉండగా అన్నీ ఇప్పటికే బుక్కయ్యాయి. ఫంక్షన్‌హాళ్లు బుక్కైపోవడంతో బస్తీల్లో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు మండపం వేసేస్తున్నారు. ఇక పురోహితులకు సామాన్య, మధ్యతరగతి వారు వివాహానికి రూ.1,116 నుంచి రూ.10,116 వరకూ, ధనికులైతే బంగారాన్ని, ఎన్ఆర్ఐలైతే డాలర్లను సంభావనగా సమర్పించుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాండ్ బాజాలు, వంటవాళ్లు, డెకరేటర్లు, ఈవెంట్‌మేనేజర్లు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. -
సీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ‘ప్రత్యేక’ ఉద్యమం
కర్నూలు(అర్బన్) : రాయలసీమ అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శనివారం రాయలసీమ హక్కుల ఐక్య వేదిక 12వ వార్షికోత్సవం స్థానిక మౌర్యా ఇన్ హోటల్లోని శ్రీ ఆర్య వైశ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదికగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే రాయలసీమలో సమ్మర్, ఉత్తరాంధ్రలో వింటర్ రాజధానులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.రాయలసీమలోని నాలుగు జిల్లాలను 8, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను 6 జిల్లాలుగా పెంచాలన్నారు. కార్యక్రమానికి రాయలసీ మ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, మదనగోపాల్, వరదరాజులురెడ్డి (కడప),మాజీ మేయర్ ఎస్. రఘురామిరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బీజేపీ కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి నక్కలమిట్ట శ్రీనివాసులు, జిల్లా ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంగళ్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేతలు వి. జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, రిటైర్డు డీఎస్పీ రామ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక వివాహాలు... వార్షికోత్సవం సందర్భంగా సామూహిక వివాహాలు జరిపించారు. మౌర్య హోటల్ 27 హిందువులు, 3 ముస్లిం, 11 క్రిస్టియన్ జంటలకు వివాహం జరిపించారు. టీజీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డా.కేజీ గోవిందరెడ్డి హాజరయ్యారు. -
శుభకార్యాలు చేస్తున్నారా... బహుపరాక్!
చిన్నారుల పంపి బంగారు ఆభరణాలను మాయం చేస్తున్న ముఠా సాక్షి, ముంబై: ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సందెట్లో సడేమీయా అన్నట్లు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ముఠా సభ్యులు శుభకార్యాలు జరుగుతున్న ఫంక్షన్ హాళ్లలోకి చొరబడి పథకం ప్రకారం చేతికందిన విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. ఇలాంటి పనులకు చిన్నపిల్లలను వాడుకుంటుండడంతో ఎవరికీ అనుమానం కలగడం లేదు. పెళ్లి హడావుడిలో ఇరువర్గాల వారు నిమగ్నమై ఉన్న సమయంలో బంధువులు సమర్పించిన కానుకలు, వధూవరుల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. ఇందుకోసం సదరు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తులపై కన్నేసి ఉంచాలని వధూవరుల తరఫు బంధువులకు స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. గత పెళ్లిళ్ల సీజన్లో ఫంక్షన్ హాళ్ల నుంచి విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు అనేక ఫిర్యాదులందాయి. దీంతో నేర నిరోధక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. చోరీ ఘటనలు జరిగినచోట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. అందులో ఖరీదైన దుస్తులు ధరించిన కొందరు పిల్లలు అటే ఇటూపరుగులు తీయడం కనిపించింది. ఇందులో ఓ పిల్లాడి కదలికలు అనుమానాస్పదంగా తోచాయి. పిల్లలతో కలిసిపోయి వేదికపైకి ఎక్కి ఏకంగా వధూవరులతో ఫొటోలు దిగాడు. అతడిపై ఎవరికి అనుమానం రాలేదు. ఆ తర్వాత అదను చూసుకుని బంధువులు సమర్పించిన కానుకల ప్యాకెట్లు తీసుకుని మెల్లిగా జారుకుంటున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇదే తరహాలో రెండు, మూడు ఫంక్షన్ హాళ్లవద్ద పలువురు పిల్లలు చోరీ చేసినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. దీంతో పోలీసులు వేటలో పడ్డారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లికి పోలీసులు మారువేషాల్లో హాజరయ్యారు. అక్కడ ఓ బాలుడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అతనిపై నిఘా వేయగా ఎప్పటిలాగే విలువైన వస్తువులు చోరీ చేసేందుకు యత్నించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు అతనిని ఆరా తీశారు. తన తల్లి ఫంక్షన్ హాలు బయట ప్రవేశద్వారం వద్ద బెలూన్లు విక్రయిస్తోందని చెప్పాడు. దీంతో వెంటనే అతని తల్లిని కూడా పట్టుకున్నారు. తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి, నేరాలకు పాల్పడుతున్నట్టు వారు అంగీకరించారు. -
రెండు చోట్ల ఆగిన పెళ్లి
పెళ్లి కొడుకులు పారిపోవడమే కారణం బెంగళూరు : రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన రెండు ఘటనలు గురువారం వెలుగు చూశాయి. స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మండ్యా జిల్లా శ్రీరంగపట్టణ తాలూక మరలేగాల గ్రామానికి చెందిన నవీన్‌కు మైసూరుకు చెందిన రాధిక (పేరు మార్చాం) తో డిసెంబర్1న పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు జరిగిన నిశ్చితార్థం రోజు వరుడుకు రూ.లక్షల నగదు, వందగ్రాముల బంగారు ఆభరణాలు వరకట్నంగా అందించారు. అయితే పెళ్లికి ముందే నవీన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వరుడు తల్లి బయటికి పొక్కనీయలేదు. అయితే పెళ్లిరోజు మాత్రం తనకు కొడుకు గురించి తెలియది మాత్రం చెప్పారు. రెండు రోజులు వెదికిన తర్వాత ఎక్కడా పెళ్లికుమారుడి జాడ తెలియకపోవడంతో గురువారం నాడు మైసూరులోని కేఆర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవీన్‌తల్లి విజయలక్ష్మమ్మతో పాటు పెళ్లిని కుదిర్చిన (మ్యారేజ్ బ్రోకర్) కృష్ణప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోపెళ్లికి సిద్ధపడుతూ! గతంలో తనకు జరిగిన పెళ్లిని దాచి మరోపెళ్లికి సిద్ధపడి చివరి నిమిషంలో పెళ్లికొడుకు పారిపోయిన ఘటన బెంగళూరులో గురువారం జరిగింది. మూలతహా చెన్నైకు చెందిన భాస్కర్ అన్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి బెంగళూరులోని ఇందిరానగర్‌కు చెందిన సత్య (పేరుమార్చాం) వివాహం జరగాల్సి ఉంది. ఈ మేరకు నగరంలోని రాజాజీనగర్‌లోని కదంబ హోటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే గురువారం ఉదయం నుంచి భాస్కర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషయమై స్థానిక మహాలక్ష్మీ పోలీస్‌స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, గతంలోనే భాస్కర్‌కు చెన్నైకు చెందిన యువతితో పెళ్లి జరిగిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
యాడ చూసినా 3+7=100 సందడే..
జిల్లాలో ఏ ఊళ్లో చూసినా ‘మూడు+ఏడు= నూరు’ సందడే. అవును.. మూడు ముళ్లతో ముడిపడి, ఏడడుగులతో బలపడి‘నూరేళ్ల పంట’కు సాగే ఏరువాకే పెళ్లంటే. అలాంటి నూరేళ్ల పంటను పండించుకోవడానికి.. గురువారం రాత్రి వేల జంటలు శ్రీకారం చుట్టాయి. మంచి ముహూర్తం కుదరడంతో జిల్లావ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలోనే 600 పైగా జంటలు కల్యాణబంధాన్ని పెనవేసుకున్నాయి. అన్నవరం :శ్రావణమాసంలోనే అత్యంత విశేషమైన వివాహ ముహూర్తాలు గల గురువారం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో సుమారు 600 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. రాత్రి 7.54 గంటలు, రాత్రి 12.23 గంటలు, తెల్లవారుజామున 3.21 గంటలకు ఈ వివాహాలు జరిగాయి. గురువారం సాయంత్రం నుంచే రత్నగిరికి వివాహబృందాల రాక ప్రారంభమైంది. రాత్రి 7.54 గంటల ముహూర్తంలో స్వామివారి సన్నిధిలో వివాహాలు చేసుకునేందుకు వచ్చినవారు, వాటికి హాజరైన బంధుమిత్రగణంతో రత్నగిరిపై ఎటు చూసినా పెళ్లిసందడే కనిపించింది. ఆలయ ప్రాంగణం, స్వామివారి ప్రధానాలయం చుట్టూ గల ఆవరణ, సీతారామ సత్రం, ప్రకాష్ సదన్, సత్యగిరిపై హరిహరసదన్, విష్ణుసదన్ తదితర ప్రదేశాలలో వివాహాలు జరిగాయి. పెళ్లిబృందాలను తీసుకువచ్చే వాహనాలను కొండదిగువన కాలేజీ మైదానంలోను, దాని పక్కన గల ఖాళీ స్థలంలోను నిలిపివేశారు. టాక్సీ, వ్యాన్, ఆటోలను మాత్రమే రత్నగిరి మీదకు అనుమతించారు. ఆటోలను కూడా ఘాట్‌రోడ్డు వై జంక్షన్ వరకే అనుమతించారు. దాంతో రత్నగిరి ఘాట్రోడ్లో కొంతవరకూ ట్రాఫిక్ క్లియర్ అయింది. గురువారం మిగిలిన రూవ్ులు 30 వీఐపీల సందేశాల మేరకు వారికోసం రిజర్వు చేసిన సత్రం గదులు సుమారు 30 వరకు గురువారం కూడా మిగిలి పోయాయి. బుధవారం రాత్రి సత్రాల్లో సుమారు 120 గదులు ఖాళీగా ఉండి పోయిన విషయం ‘సాక్షి’ దినపత్రికలో రావడంతో గురువారం ఆపొరపాటు జరగ కుండా అధికారులుసరిదిద్దుకున్నారు. రాత్రి పదిగంటల తర్వాత ఖాళీగా ఉన్న గదులను అప్పటికప్పుడుపెళ్లిబృందాలకుఅద్దెకిచ్చారు. వ్రతాలాచరించిన 800 నూతన జంటలు సత్యదేవుని సన్నిధిలో బుధవారం రాత్రి జరిగిన వివాహాలలో 500 జంటలు ఒక్కటయ్యాయి. వీరితో బాటు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మరో 300 కొత్త జంటలు గురువారం ఆలయానికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించుకున్నాయి. శ్రీ గోకులంలోని ఆవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. గురువారం 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,572, కల్యాణాలు తొమ్మిది నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.14 లక్షల ఆదాయం సమకూరింది. శుక్రవారం 500 వివాహాలు ఇదిలా ఉండగా రత్నగిరిపై శుక్రవారం ఉదయం 7.24, రాత్రి 9.40, 12.27, తెల్లవారుజామున 3.15 గంటల ముహూర్తాలలో సుమారు 500 వివాహాలు జరుగనున్నాయి. కల్యాణ వైభోగమే అమలాపురం టౌన్ : ‘పెళ్లి కళ వచ్చేసింది బాలా...’ అనే సినిమా పాటకు పేరడీగా ‘పెళ్లి కళ వచ్చేసిందే జిల్లా...’అని పాడుకునేలా జిల్లా అంతటా గురువారం పెళ్లిళ్ల సందడి నెలకొంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని చాలా ఇళ్లు పెళ్లిళ్ల లోగిళ్లుగా మారిపోయాయి. ఈనెలలో 13,14,15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉండగా గురువారం మరీ బలమైన ముహూర్తాలు ఉండడంతో ఈ ఒక్క రోజే జిల్లాలో దాదాపు ఆరు వేల పెళ్లిళ్లు జరిగినట్టు ఓ అంచనా. 13వ తేదీన జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా పెళ్లిళ్లు జరగ్గా 15వ తేదీన మరో రెండు వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయి. దేవాలయాలు వేదికగా... జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ గురువారం వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం ఒక్క రోజే దాదాపు 600 పెళ్లిళ్లు జరిగాయి. బుధవారం అక్కడ దాదాపు 500కు పైగా పెళ్లిళ్లు జరగగా శుక్రవారం మరో 500 పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే అంతర్వేది, మురమళ్ల, వాడపల్లి, అమలాపురంలలోని ఆలయాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే జిల్లాలోని పలు ప్రమఖ దేవాలయాలు, సాధారణ దేవాలయాల్లో దాదాపు రెండు వేలకు పైగా వివాహాలు జరిగాయి. ఇక ఇళ్ల వద్ద... కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో సుమారు నాలుగు వేల వరకూ వివాహాలు జరిగాయి. ఆయా దేవాలయాలు పెళ్లి జనంతో కిటకిటలాడాయి. బస్సులు, ఆటోలు, రోడ్లు జనంతో కిక్కిరిశాయి. సినిమా సెట్టింగ్‌లను తలపించే వివాహ వేదికలు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, తుని, సామర్లకోట, మండపేట, రావులపాలెం, అనపర్తి, రాజోలు, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వివాహ వేదికలు సినిమా సెట్టింగ్‌లను తలపించాయి. అమలాపురం పట్టణంలోనే గురువారం దాదాపు 200కి పైగా వివాహాలు జరిగాయి. ఇక అమలాపురంలోని కల్యాణ వెంకన్న పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో దాదాపు 60 వివాహాలు జరిగాయి. -
గ్రేట్ ముహూర్తం
బలమైన లగ్నాలు కుదిరాయి.. తిథులు, నక్షత్రాలు కలిశాయి.. వారాలు కలిసొచ్చాయి.. వివాహఘడియలకు శుభసూచకంగా మారాయి.. వీటికి తోడు శ్రావణ మాసం.. ఇలాంటి తరుణంలో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి.. వరుసగా మూడు రోజులు వివాహాలకు అనువుగా ఉండడంతో గ్రేటర్‌కు పెళ్లిక ళ వచ్చేసింది. మండపాలు, ఫంక్షన్ హాళ్లు, గృహాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. - మూడు రోజులూ సందడే - వేల సంఖ్యలో వివాహాలు - ముస్తాబవుతున్న ఫంక్షన్‌హాళ్లు, మండపాలు - భారీగా పెరిగిన ధరలు - రెట్టింపైన పెళ్లి బడ్జెట్ సాక్షి, సిటీబ్యూరో/కంటోన్మెంట్, చంపాపేట్, హస్తినాపురం, నాగోల్: శ్రావణమాసం.. పెళ్లిళ్లకు అనుకూలం.. అందునా మంచి ముహూర్తాలు కలిసొస్తే ఇక పెళ్లి సందడే. బుధ, గురు, శుక్రవారాలు ఉన్నతమైన గ్రహస్థితి, చక్కటి తిథులు, వేళలు అన్నీ శుభసూచికంగా మారాయి. ఈ అద్భుత ఘడియల్లో వేలాది జంటలను ఒక్కటి చేసేందుకు మండపాలు, ఫంక్షన్‌హాళ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. నగరంలో ఏ గల్లీ చూసినా పెళ్లి సందడే. వస్త్ర, బంగారు దుకాణాలు రద్దీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్న సందర్భంగా ఫంక్షన్ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ధరలకు రెక్కలు... ఈ శ్రావణ మాసం అన్నీ మంచి రోజులే. అయితే ఈ నెల 13, 14, 15 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. మండపాలను అలంకరించే ఆర్టిస్టులు మొదలుకొని సన్నాయి వాద్యకారులు, పురోహితులు, కేటరింగ్ వాళ్లు అందరికీ డిమాండ్ పెరిగింది. కిందటే డాది కంటే ఈసారి చార్జీలు భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వ్యయం అయ్యే పెళ్లి బడ్జెట్ ఏకంగా రూ. 10 లక్షలకు చేరుకోనుంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో రూ. 2 లక్షలు మాత్రమే ఉండే ఓ ఫంక్షన్ హాలు అద్దె రూ. 3 లక్షలకు పెంచేశారు. ఎల్బీనగర్, చంపాపేట్, నాగోల్, సాగర్ రింగురోడ్డు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు సాధారణ రోజుల్లో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలుండగా ప్రస్తుతం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెరిగాయి. ఫంక్షన్ హాళ్లు లభించని వారు బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఇంటి ముందు సెట్టింగులతో ఉన్నంతలో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘డెకరేషన్’ ఎక్కువైంది! పెళ్లి మండపాలు, ఆహ్వాన వేదిక, సెట్టింగుల ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇందుకోసమే ఖర్చుచేస్తున్నారు. డెకరేషన్లకు జర్బరా, కార్నేషన్, ఆర్కిడ్, ఆంథోరియమ్ వంటి పూలను వాడుతారు. సాధారణ రోజుల్లో జర్బరా బంచ్ (పది పూల కట్ట)కు సగటున రూ. 50 ఉంటే ప్రస్తుతం అది రూ. 200 లకు పెరిగింది. కార్నేషన్ ధరలు రూ. 150 నుంచి రూ. 300 వరకు, ఆర్కిడ్ రేట్లు రూ. 200 నుంచి రూ. 400కు పెరిగాయి. - సాధారణ రోజుల్లో రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకునే వీడియోగ్రాఫర్లు ప్రస్తుతం రూ. 2 లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నారు. - ఒకే సమయంలో ఎక్కువ ముహూర్తాలు రావడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వేద పాఠశాలల్లో ఉండే పండితులు, దేవాలయ అర్చకులు సైతం రంగంలోకి దిగారు. - నాదస్వర విద్యాంసులకు సైతం డిమాండ్ నెలకొంది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 15,000 నుంచి రూ. 25,000 తీసుకునే ఐదుగురు సభ్యుల బృందం ప్రస్తుతం రూ. 30,000కు పైగా డిమాండ్ చేస్తున్నారు. మూసుకున్న హాళ్లూ తెరుచుకుంటున్నాయ్! కంటోన్మెంట్లో బీ-3 కేటగిరీకి చెందిన ఓల్డ్ గ్రాంట్ బంగళా స్థలాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లను గతేడాది బోర్డు అధికారులు మూసేయగా, మరికొందరు నిర్వహణ భారం మోయలేక మరికొందరు హాళ్లను మూసేశారు. మల్కాజ్‌గిరిలోని మల్లారెడ్డి గార్డెన్‌ను ఎనిమిది నెలల కిందట మూసేశారు. ప్రస్తుతం షెడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పెళ్లిళ్లకు సిద్ధం చేస్తున్నారు. -
నగరం పెళ్లి ‘టూరు’
రైళ్లు, బస్సుల్లో సీట్లు ఫుల్ అదనపు సదుపాయాలు కల్పించని ఆయా శాఖలు ఆందోళన చెందుతున్న ప్రయాణికులు సాక్షి,సిటీబ్యూరో: నగరం ‘పెళ్లి’ టూరుకు సిద్ధమైంది. ఉభయ రాష్ట్రాల్లోని సొంత ఊళ్లలో సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న పెళ్లిళ్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 850 ఆర్టీసీ బస్సుల్లో ఒక్క 13వ తేదీ నాటికే 80 శాతానికి పైగా సీట్లు బుక్ అయ్యాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో అవకాశం లభించని వారు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడంతో వాటికి కూడా డిమాండ్ పెరిగింది. మరోవైపు అన్ని ప్రధాన రైళ్లలోనూ బుకింగ్‌లు నిండిపోయి చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. వరుస సెలవులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక బస్సులు, రైళ్లు నడిపే ఆర్టీసీ, ద.మ.రైల్వే శాఖలు అటువంటి ఏర్పాట్లు చేపట్టకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు కిటకిట... శ్రావణ మాసంతో పాటే దివ్యమైన ముహూర్తాలు రావడంతో రెండు మూడు నెలలుగా ఎదురు చూస్తున్న వారికి ఈ మాసం బాగా కలిసి వచ్చింది. ఈనెల 22 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ 13,14,15 తేదీల్లోనే ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. దీంతో ఫంక్షన్‌హాళ్లు, మండపాలు, పూలు, తదితర వస్తువులకు డిమాండ్ పెరిగింది. రవాణా సదుపాయాలకు సైతం భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలోని మహాత్మగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాపూల్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల కు అడ్వాన్స్ బుకింగ్ తాకిడి బాగా పెరిగింది. విజయవాడ, గుంటూరు, కాకినాడ, అమలాపురం, విశాఖ, చిత్తూరు, కడప, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల కు డిమాండ్ భారీగా వచ్చేసింది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అటు వైపు నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడిపేందుకు అక్కడి ఆర్టీసీ అధికారులు సాహసం చేయలేకపోతున్నట్టు తెలిసింది. వందల్లో వెయిటింగ్ లిస్టు... పెళ్లి ముహూర్తాలతో రైళ్లలోనూ రద్దీ నెలకొంది. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో చేరింది. బెంగళూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నింటిలోనూ సీట్ల రిజర్వేషన్లు అయిపోయాయి. ఈనెల 13,14,15 తేదీల్లో పలు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అత్యధిక మంది ప్రయాణించే స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్టు ఈ విధంగా ఉంది. -
పెళ్లి కళ వచ్చేసిందే బాలా..
ఈనెలలో వేలాది వివాహాలు ముస్తాబవుతున్న వేదికలు పరిమిత ముహూర్తాలతో పెళ్లి ఏర్పాట్లకు భారీ డిమాండ్ మూడు ముళ్లు.. ఏడడుగులు.. పెళ్లంటే రెండు మనసులు ఒక్కటయ్యే శుభ ఘడియలు. అందుకే అంత ఆనందం. చూసిన వారికి సైతం ముచ్చట గొలిపే వేడుకది. అందుకే అంత వైభోగం. శ్రావణం మాసం రావడంతో సుముహూర్తాలు సమీపించాయి. వేదికలు సిద్ధమవుతున్నాయి. పట్టు చీరల రెపరెపలు.. సుగంధ పరిమళాలు.. పిండి వంటల ఘుమఘుమలు.. వివాహ మహోత్సవానికి శోభను చేకూర్చే విషయాలు. పెళ్లి సందడిపై ప్రత్యేక కథనం.. విశాఖపట్నం-కల్చరల్ : శ్రావణ మాసం వచ్చింది.. మంచి ముహూర్తాలెన్నో తెచ్చింది. కల్యాణ మండపాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. మూఢం ముగిశాక ఈనెల 13, 14, 15 తేదీల్లో సుముహూర్తాలు ఉండటంతో పెద్దలు పెళ్లి పనుల్లో బిజీబిజీ అయిపోయారు. 19వ తేదీన బలమైన ముహూర్తం కావడంతో ఆరోజు వెయ్యికిపైగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెప్పారు. ఈ రోజుల్లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో నగరంలోని కల్యాణ మండపాలతోపాటు క్యాటరింగ్, వీడియో తీసే వారికి డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు చిన్న, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ఫ్లవర్ డెకరేషన్ ట్రూప్స్‌ను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద హోటల్ రూమ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. నగరంలో 500లకు పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు. ముచ్చటైన వేదికలు పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పెద్దపెద్ద గ్రౌండ్స్‌లో అపురూపమైన సెట్టింగ్‌లు వేసి, ఇంకెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. సెట్టింగులు వేయడానికి చెన్నై నుంచి ఆర్ట్ డెరైక్టర్లను కూడా రప్పిస్తున్నారు. ది పార్క్ హోటల్ లాన్లో ఓపెన్ ఫంక్షన్ హాల్‌ను కళ్లు చెదిరేలా రూపొందిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్నవారు సైతం క్లోజ్‌గా వీక్షించడనాకి ప్రొజెక్టర్తోపాటుగా వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో 270 ఫంక్షన్ హాల్స్‌ను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జీవీఎంసీ.ఓఆర్జీ.ఇన్) ఇక ప్రైవేటుగా సుమారు 1500కుపైగా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ..అందుకే శ్రావణమంటే క్రేజ్ శ్రావణంలో పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సహజంగానే ఈ మాసంలో పెళ్లిని సుముహూర్తంగా భావిస్తారు. అందుకే శ్రావణమంటే క్రేజ్. చాలా అడ్వాన్సుగా శ్రావణం సీజన్ ముహూర్తాలకు వివాహ వేదికలన్నీ బుక్ అయిపోయాయి. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఫంక్షన్ హాళ్లు పెరిగాయి. అయితే కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు ఉండటం లేదు. అవసరం కోసం జనం అడ్జస్టయిపోతున్నారు. వాహనాల పార్కింగు సదుపాయం లేని ఫంక్షన్ హాళ్లకు అనుమతించరాదనే నిబంధన అధికారులు అమలుచేయాలి. - యు.నాగభూషణం, వైశాఖి జల ఉద్యానవనం -
జిల్లాకు పెళ్లికళ
నిజామాబాద్ కల్చరల్ : జిల్లాలో ఆదివారం ద్వాదశి రోజున దాదాపు రెండువేలకుపైగా జంటలు వివాహబంధంతో ఒక్కటవుతున్నాయి. ఈ ఏడాది చైత్రమాసంలో(ఏప్రిల్ 30 నుంచి) శుభ కార్యాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జూన్ 22వరకు శుభతిథులు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభోత్సవాలు జోరుగా సాగాయి. ఆదివారంతో శుభముహూర్తాలు ముగియనున్నాయి. చివరిరోజున జిల్లావ్యాప్తంగా రెండువేల వరకు వివాహాలు జరుగనున్నట్లు వేదపండితులు మధుసూదనశర్మ, పురోహితులు చిరంజీవాచార్యులు తెలిపారు. జూన్ 23నుంచి ఆగస్టు 8వర కు మూడాలున్నట్లు వారు పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు శుభముహుర్తాలు లేవని చెప్పారు. డిసెంబర్లో కూడా కొన్ని మంచిదినాలే ఉన్నాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే శుభకార్యాలు ప్రారంభమవుతాయని వారు వివరించారు. -
శ్రీ జయ నామ సంవత్సరం - శుభముహూర్తాలు 2014 -15
చైత్ర మాసం ఏప్రిల్ 4 శుక్ర, శు.పంచమి, రోహిణి నక్షత్రం, మిథున లగ్నం ప.11.54కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 5 శని, షష్టి తత్కాల సప్తమి, మృగశిర నక్షత్రం మకర లగ్నం రా.2.12కు వివాహాలు. 9 బుధ, దశమి, పుష్యమి నక్షత్రం, వృషభలగ్నం ఉ.8.53కు అన్నప్రాశన, శంకుస్థాపన, ఉపనయన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 10 గురు, దశమి తత్కాల ఏకాదశి, మఖ నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.9.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు, 11 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి మఖ నక్షత్రం, మిథున లగ్నం ప.11.31కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 17 గురు, బ.విదియ తత్కాల తదియ, అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.11.53కు వివాహ, గృహప్రవేశాలు. 20 ఆది, పంచమి తత్కాల షష్టి , మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ప.11.54కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, సాధారణ పనులు. 21 సోమ, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, రా.11.34కు గర్భాదాన, గృహప్రవేశాలు. 22 గురు, దశమి, ధనిష్ట నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.50కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు. తిరిగి రా.11.22కు శతభిషం నక్షత్రం, ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 25 శుక్ర, ఏకాదశి, శతభిషం నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.45కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, దేవతాప్రతిష్ఠలు. వైశాఖ మాసం మే 1 గురు,శు.విదియ తత్కాల తదియ, రోహిణి నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు., రా.12.34కు మకరలగ్నంలో వివాహాలు. 2 శుక్ర, తదియ తత్కాల చవితి, మృగశిర నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.7.40కు వివాహ, గృహప్రవేశాలు, మకర లగ్నం రా.12.21కు వివాహాలు. 5 సోమ, షష్టి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, దేవతాప్రతిష్ట, క్రయవిక్రయాలు. పుష్యమి నక్షత్రం, వృశ్చికలగ్నంలో రా.7.29కు గర్భాదానం. 7 బుధ, అష్టమి తత్కాల నవమి, మఖ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.32కు వివాహ, గర్భాదానాలు. 8 గురు, నవమి, మఖ నక్షత్రం, వృశ్చికలగ్నం రా.7.16కు వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 10 శని, ఏకాదశి, ఉత్తర నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.34కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 12 సోమ, త్రయోదశి, చిత్త నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.36కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 15 గురు, బ.పాడ్యమి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.18కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. రా.9.59కు ధనుస్సు, రా.11.28కు మకరలగ్నాలలో వివాహ, గర్భాదానాలు. 17 శని, తదియ, మూల నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు. రా.11.24కు మకరలగ్నంలో వివాహాలు. 19 సోమ, పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 22 గురు, అష్టమి తత్కాల న వమి, శతభిషం నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు. 23 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం రా.10.58కు వివాహాలు, గర్భాదానాలు. జ్యేష్ఠ మాసం జూన్ 1 ఆది, శు.చవితి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 2 సోమ, పంచమి, పుష్యమి నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.06కు అన్నప్రాశ న, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, దేవతాప్రతిష్ట, ఉపనయనాలు. తిరిగి రా.10.18కు మకరలగ్నంలో గృహప్రవేశాలు. 4 బుధ, షష్టి తత్కాల సప్తమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.52కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహ, ఉపనయనాలు. 12 గురు, చతుర్దశి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.7.29, కర్కాటక లగ్నం 8.26కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 13 శుక్ర, పౌర్ణమి తత్కాల బ.పాడ్యమి, మూల నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.8.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. 14 శని,బ. పాడ్యమి తత్కాల విదియ, మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. 16 సోమ, చవితి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటకలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 20 శుక్ర అష్టమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, సింహలగ్నం ఉ.11.09కు అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, వివాహాలు. తె.4.05కు రేవతి నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, శంకుస్థాపనలు. 21 శని, నవమి, రేవతి నక్షత్రం, సింహలగ్నం ఉ.11.02కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. తె.4.03కు అశ్వని నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు. 22 ఆది, దశమి, అశ్వని నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.7.44కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, దేవతా ప్రతిష్టలు, క్రయవిక్రయాలు. ఆషాఢమాసం జూలై 2 బుధ,శు.పంచమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం, ఉ.7.09కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 4 గురు, సప్తమి, ఉత్తర నక్షత్రం, సింహ లగ్నం ఉ.10.10కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, ప.3.34కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు. 7 సోమ, దశమి, స్వాతి నక్షత్రం, సింహలగ్నం ఉ.9.57కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు. 13 ఆది, బ.పాడ్యమి, ఉత్తరాషాఢ నక్ష త్రం, కర్కాటక లగ్నం ఉ.6.24కు సాధారణ కార్యాలు, ప.2.58కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 14 సోమ, విదియ, శ్రవణం నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.6.19కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 18 శుక్ర, సప్తమి, రేవతి నక్షత్రం, వృశ్చికలగ్నం ప.2.42కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. రిజిస్ట్రేషన్లు. శ్రావణమాసం ఆగస్టు 1 శుక్ర, శు.పంచమి తత్కాల షష్టి, హస్త నక్షత్రం, ధనుస్సు లగ్నం సా.4.56కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 10 ఆది, పౌర్ణమి, శ్రవణం నక్షత్రం, కుంభలగ్నం రా.8.10కు సాధారణ కార్యాలు, శుభకార్యాల ప్రస్తావన. 11 సోమ, బ.పాడ్యమి, ధనిష్ఠ నక్షత్రం, సింహలగ్నం ఉ.7.43కు అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.12.44కు వృషభలగ్నంలో గృహప్రవేశాలు. 13 బుధ, చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. రా.12.32కు వృషభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. 14 గురు, చవితి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు, వృషభలగ్నం రా.12.32కు, మిథున లగ్నం తె.3.21కు వివాహ, గృహప్రవేశాలు, 15 శుక్ర, పంచమి, రేవతి నక్షత్రం ధనుస్సు లగ్నం సా.4.03 క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, సాధారణ కార్యాలు. తె.3.17 మిథునలగ్నం వివాహాలు. 20 బుధ, దశమి, మృగశిర నక్షత్రం, కన్యాలగ్నం ఉ.8.43కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. భాద్రపద మాసం సెప్టెంబర్ 1 సోమ, శు.సప్తమి, అనూరాధ నక్షత్రం, మకరలగ్నం సా.4.24కు వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు. 5 శుక్ర, ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం మకరలగ్నం సా.4.18కు సాధారణ కార్యాలు, వ్యాపారాలు. 6 శని, ద్వాదశి, శ్రవణం నక్షత్రం, వృశ్చికలగ్నం ప.11.23కు అన్నప్రాశన, వ్యాపారాలు, ఆర్ధిక వ్యవహారాలు. 10 బుధ, బ.పాడ్యమి తత్కాల విదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం ప.3.49కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 12 శుక్ర, చవితి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.3.42కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 26 శుక్ర, శు.విదియ తత్కాల తదియ, చిత్త నక్షత్రం, మకరలగ్నం ప.2.47కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 27 శని, తదియ, స్వాతి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.1.12కు వ్యాపార, సాధారణ కార్యాలు. ఆర్థిక లావాదేవీలు. అక్టోబర్ 1 బుధ, ఆశ్వయుజ శు.సప్తమి, మూల నక్షత్రం, మకరలగ్నం ప.2.27కు వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 3 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం సా.4.35కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 ఆది, ద్వాదశి, ధనిష్ఠ నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.12.40కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 8 బుధ, పౌర్ణమి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం సా.4.17కు వ్యాపారాలు, ఆర్థిక లావాదే వీలు. 9 గురు, బ.పాడ్యమి, ఆశ్వని నక్షత్రం, ధనుస్సులగ్నం ప.12.24కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 17 శుక్ర, నవమి, పుష్యమి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.11.54కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 19 ఆది, ఏకాదశి, మఖ నక్షత్రం, మకర లగ్నం ప.1.16కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. కార్తీక మాసం అక్టోబర్ 26 ఆది, శు.తదియ, అనూరాధ నక్షత్రం, మకర లగ్నం ప.12.48కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 30 గురు, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, వృశ్చికలగ్నం ఉ.7.48కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. నవంబర్ 1 శని, కార్తీక శు.నవమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.2.43కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 బుధ, త్రయోదశి, రేవతి నక్షత్రం, మీన లగ్నం ప.3.09కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 6 గురు, పౌర్ణమి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.12.04కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. రిజిస్ట్రేషన్లు. 9 ఆది, బ.తదియ, రోహిణి నక్ష త్రం, మకరలగ్నం ప.11.50కు సాధారణ కార్యాలు, ఆర్థిక, వ్యాపార లావాదేవీలు. 13 గురు, సప్తమి, పుష్యమి నక్షత్రం మకరలగ్నం ప.11.36కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 17 సోమ, దశమి, ఉత్తర నక్షత్రం, మకరలగ్నం ఉ.11.17కు సాధారణ కార్యాలు, అన్నప్రాశనలు, వ్యాపారాలు. మార్గశిర మాసం డిసెంబర్ 3 బుధ, శు.ద్వాదశి, అశ్వని నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 7 ఆది, బ.పాడ్యమి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.32కు అన్నప్రాశన, గృహప్రవేశ, వివాహ, వ్యాపారాలు. సింహలగ్నంలో రా.11.55కు వివాహ, గృహప్రవేశాలు. 10 బుధ, చవితి, పుష్యమి నక్షత్రం ధనుస్సు లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, గృహప్రవేశాలు, వ్యాపార లావాదేవీలు. తులాలగ్నం తె.4.12కు గృహప్రవేశాలు. 12 శుక్ర, షష్టి, మఖ నక్షత్రం, తులాలగ్నం తె.4.07కు వివాహ, గృహప్రవేశాలు. 13 శని, సప్తమి, పుబ్బ నక్షత్రం, కుంభలగ్నం ప.11.54కు సాధారణ కార్యాలు. 14 సోమ, నవమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సులగ్నం ఉ.7.57కు, కుంభలగ్నం ఉ.11.46కు అన్నప్రాశన, గృహప్రవేశాలు,క్రయవిక్రయాలు. 17 బుధ, దశమి, తత్కాల ఏకాదశి, చిత్త నక్షత్రం, మేషలగ్నం ప.2.54కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. పుష్యమాసం డిసెంబర్ 24 బుధ, శు.తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం ప.11.14కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 26 శుక్ర, పంచమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.11.06కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 27 శని, షష్టి, శతభిషం నక్షత్రం, కుంభలగ్నం ప.11.03కు అన్నప్రాశన, వ్యాపార లావాదేవీలు. 28 ఆది, సప్తమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మేషలగ్నం ప.2.10కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. జనవరి - 2015 7 బుధ, బ.విదియ, పుష్యమి నక్షత్రం, మకరలగ్నం ఉ.8.02 అన్నప్రాశన, వ్యాపారాదులు. 11 ఆది, షష్టి, ఉత్తర నక్షత్రం, మీనలగ్నం ఉ.10.44కు సాధారణ కార్యాలు. మాఘమాసం జనవరి 22 గురు, శు.తదియ, ధనిష్ఠ నక్షత్రం,, మిథునలగ్నం సా.4.44కు క్రయవిక్రయాలు, వ్యాపారాదులు. ధనుస్సు లగ్నం తె.5.30గంటలకు వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 24 శని, చవితి తత్కాల పంచమి,ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.1.15 వివాహాలు. 25 ఆది, పంచమి, రేవతి నక్షత్రం తులాలగ్నం రా.1.11 వివాహాలు. 29 గురు, దశమి, రోహిణిన క్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.02 వివాహాలు, గృహప్రవేశాలు. 30 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.01 వివాహాలు, గృహప్రవేశాలు. 31 శని, ద్వాదశి, మృగశిర నక్షత్రం, మేషలగ్నం ఉ.11.53 ఉపనయనం, వివాహ, గృహ ప్రవేశాలు. ఫిబ్రవరి 2 సోమ, చతుర్దశి, పుష్యమి నక్షత్రం, తులాలగ్నం రా.12.41 గృహప్రవేశాలు. 4 బుధ, బ.పాడ్యమి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.12.34 వివాహాలు,ధనుస్సు లగ్నం తె.4.41 వివాహాలు, గృహప్రవేశాలు. 6 శుక్ర, బ.విదియ తత్కాల తదియ, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.32 వివాహాలు, గృహప్రవేశాలు. 9 సోమ, బ.పంచమి, చిత్త నక్షత్రం,, మేషలగ్నం ఉ.11.22 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 11 బుధ, బ.సప్తమి, స్వాతి నక్షత్రం, మేషలగ్నం ఉ.11.11 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. 12 గురు, అష్టమి తత్కాల నవమి అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.09 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 14 శని, దశమి తత్కాల ఏకాదశి, మూల నక్షత్రం, మకర లగ్నం తె.5.31 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 15 ఆది, ఏకాదశి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.10.54 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. ఫాల్గుణమాసం ఫిబ్రవరి 21 శని, శు.తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.11.26 వివాహాలు, ధనుస్సులగ్నం తె.3.33 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 22 ఆది, శు.చవితి, రేవతి నక్షత్రం, తులాలగ్నం రా.11.22 వివాహాలు, గర్భాదానాలు. 25 బుధ, శు.సప్తమి తత్కాల అష్టమి, రోహిణి నక్షత్రం, తులాలగ్నం రా.11.10 వివాహాలు. మార్చి 1 ఆది, శు.ఏకాదశి తత్కాల ద్వాదశి, పునర్వసు నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.49 శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 2 సోమ, ద్వాదశి తత్కాల త్రయోదశి, పుష్యమి నక్షత్రం,, ధనుస్సు లగ్నం రా.2.57 శంకుస్థాపన, గృహప్రవేశాలు. 4 బుధ, చతుర్దశి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.10.41 వివాహాలు, ధనుస్సు లగ్నం రా.2.48 వివాహాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 6 శుక్ర, బహుళ పాడ్యమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.2.39 వివాహాలు,శంకుస్థాపన, గృహప్రవేశాలు. 7 శని, విదియ, ఉత్తర నక్షత్రం మేష లగ్నం ఉ.9.35 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, శంకుస్థాపనలు. ధనుస్సు లగ్నం రా.2.37 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 8 ఆది, తదియ, హస్త నక్షత్రం, మేషలగ్నం ఉ.9.30 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. రా.10.24 చిత్త నక్షత్రం, తులా లగ్నంలో వివాహాలు. 9 సోమ, చవితి, చిత్త నక్షత్రం, మేష లగ్నం ఉ.9.26 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, వ్యాపారాలు. 11 బుధ, పంచమి తత్కాల షష్టి, అనూరాధ నక్షత్రం తులాలగ్నం రా.10.12 వివాహాలు. 12 గురు, షష్టి తత్కాల సప్తమి, అనూరాధ నక్షత్రం మేష లగ్నం ఉ.9.15 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు, ఉపనయనం, శంకుస్థాపనలు. 14 శని, నవమి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.9.07 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు ఉపనయనం శంకుస్థాపనలు. 15 ఆది, దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు లగ్నం రా.2.03 వివాహ, గృహప్రవేశాలు. -
పెళ్లిళ్లకు ఉద్యమ ఎఫెక్ట్ ?
అన్నవరం, న్యూస్‌లైన్ :ఈ నెల పదోతేదీ నుంచి శ్రావణ మాసం పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. రత్నగిరి, సత్యదేవుని సన్నిధి పెళ్లిళ్లకు సిద్ధమవుతోంది. ఏటా శ్రావణమాసంలో రత్నగిరిపై సుమారు 300 వివాహాలు జరుగుతాయనేది ఓ అంచనా. ఈనెల పదో తేదీ నుంచి వివాహాలు ప్రారంభం కానున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో రత్నగిరికి వచ్చే భక్తుల రాక తగ్గింది. ఆలయంలో వివాహాలు కూడా తక్కువ జరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంటున్నాయి. రెండు నెలల విరామం అనంతరం మరలా ఈనెల పదో తేదీ శ్రావణ శుద్ధ చవితి ఉత్తర నక్షత్రం, వృషభ లగ్నంలో వివాహ ముహూర్తంతో ఈ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. వరుసగా 11,12,15,16,17,21,23,25,29 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, బంద్ ప్రభావంతో ఈ ముహూర్తాల్లో జరిగే వివాహాలను వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముహూర్తాలలో పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నట్టు వివాహ బృందాలు సమాచారం అందించాయని క్యాటరింగ్, డెకరేషన్ కార్మికులు తెలిపారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో వివాహాలు నిర్వహిస్తామని వారు చెప్పినట్టు సమాచారం. సత్యదేవుని ఆలయానికి ఏటా కార్తీక, వైశాఖం తర్వాత శ్రావణమాసంలోనే భక్తులు ఎక్కువగా వస్తారు. సుమారు 5 లక్షల మంది భక్తులు రత్నగిరికి వచ్చే అవకాశం ఉందని అంచనాతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేసారు. ఆదాయం శ్రావణ మాసంలో రూ.మూడు కోట్లు వరకూ రాగలదని అంచనా వేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ అంచనాలు నిజమవుతాయా అనేది ఆలయ వర్గాల్లో సందేహం నెలకొని ఉంది. ఏర్పాట్లపై ఈఓ సమీక్ష ఈఓ పి. వేంకటేశ్వర్లు, దేవస్థానం అధికార్లతో బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రావణ శుక్రవారం, శని, ఆది వారాల్లోనూ, దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. సత్యగిరిపై గల హరిహర సదన్, విష్ణు సదన్ సత్రాల్లో బస చేసే భక్తుల కొరకు దేవస్థానం బస్‌ను సత్రం గదుల రిజర్వేషన్ కార్యాలయం నుంచి సత్యగిరికి ఉచితంగా నడుపనున్నారు.పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఈఓ ఆదేశించారు.