
సాక్షి, ఆసిఫాబాద్: ఒకే ముహూర్తాన 131 జంటలు మూడు ముడులు, ఏడు అడుగుల బంధంతో ఏకమయ్యాయి. ఇందులో 91 ఆదివాసీ జంటలున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్ వేది కైంది. బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల యువతీ యువకుల వివాహాలను ఘనంగా జరిపించారు.
ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటలకు కోనేరు ట్రస్టు ద్వారా ఉచితంగా పుస్తె మట్టెలు, వస్త్రాలు, ఫ్యాను, బీరువా తదితర సామగ్రిని కోనప్ప అందజేశారు. జంటలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment