
న్యూఢిల్లీ: మంచి ముహూర్తాలు ఉండటంతో దేశ రాజధానిలో సోమవారం ఒక్క రోజే 5వేల వరకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే, అక్కడక్కడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. పెళ్లిళ్ల నేపథ్యంలోనే పోలీసు శాఖ అదనంగా వెయ్యి మందికి పైగా సిబ్బందిని విధుల్లో ఉంచింది. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా రూట్లలో ఉన్న రద్దీని వాహనదారులకు తెలియజేస్తూ సూచనలిచ్చింది. సిబ్బంది మోటారు సైకిళ్లపై తిరుగుతూ రాకపోకలను క్రమబద్ధీకరించారు. అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment