అదుపుతప్పి ఇద్దరిని ఢీకొన్న బస్సు.. కానిస్టేబుల్‌, మరో వ్యక్తి మృతి | Delhi Uncontrolled DTC Bus Hit A Person And A Police Constable Brought Dead, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి ఇద్దరిని ఢీకొన్న బస్సు.. కానిస్టేబుల్‌, మరో వ్యక్తి మృతి

Published Tue, Nov 5 2024 7:30 AM | Last Updated on Tue, Nov 5 2024 8:54 AM

Uncontrolled DTC bus hit a Person and a Police Constable

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం  చోటుచేసుకుంది. ఇక్కడి రింగ్ రోడ్‌లోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలో ఒక డీటీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. డీటీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు డ్రైవర్‌ను ఘాజీపూర్‌ నివాసి వినోద్ కుమార్ (57)గా గుర్తించారు. సదరు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్డులోని మఠం మీదుగా వేగంగా వచ్చిన ఈ డీటీసీ బస్సు  ఒక ఇనుప స్తంభాన్ని ఢీకొని, అక్కడే ఉన్న ఒక వ్యక్తిని కూడా ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
 

ఈ ప్రమాదం తరువాత కూడా బస్సు డ్రైవర్‌ వినోద్‌ బస్సును 100 మీటర్లు ముందుకు పోనిచ్చి, బారికేడ్‌ వద్దనున్న కానిస్టేబుల్ విక్టర్‌ను ఢీకొన్నాడు.  ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విక్టర్‌(27) నాగాలాండ్‌ నివాసి. ప్రమాదం జరిగిన సమయంలో విక్టర్‌ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌  విక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో సూపర్‌ యాప్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement