DTC bus
-
అదుపుతప్పి ఇద్దరిని ఢీకొన్న బస్సు.. కానిస్టేబుల్, మరో వ్యక్తి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి రింగ్ రోడ్‌లోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలో ఒక డీటీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. డీటీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు డ్రైవర్‌ను ఘాజీపూర్ నివాసి వినోద్ కుమార్ (57)గా గుర్తించారు. సదరు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్డులోని మఠం మీదుగా వేగంగా వచ్చిన ఈ డీటీసీ బస్సు ఒక ఇనుప స్తంభాన్ని ఢీకొని, అక్కడే ఉన్న ఒక వ్యక్తిని కూడా ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. #WATCH दिल्ली: रिंग रोड पर मोनेस्ट्री मार्केट के पास एक अनियंत्रित डीटीसी बस ने एक व्यक्ति और पीएस सिविल लाइंस के एक पुलिस कांस्टेबल को टक्कर मार दी और डिवाइडर से टकरा गई। दुर्भाग्य से, दोनों की मृत्यु हो गई है। दोनों को मृत घोषित कर दिया गया। डीटीसी बस का ड्राइवर विनोद कुमार… pic.twitter.com/R6MdWM9Gny— ANI_HindiNews (@AHindinews) November 4, 2024ఈ ప్రమాదం తరువాత కూడా బస్సు డ్రైవర్ వినోద్ బస్సును 100 మీటర్లు ముందుకు పోనిచ్చి, బారికేడ్ వద్దనున్న కానిస్టేబుల్ విక్టర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విక్టర్(27) నాగాలాండ్ నివాసి. ప్రమాదం జరిగిన సమయంలో విక్టర్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ విక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. #WATCH दिल्ली: एफएसएल टीम मोनेस्ट्री मार्केट, रिंग रोड के बाहर मौजूद है, जहां एक अनियंत्रित डीटीसी बस की चपेट में आने से एक व्यक्ति और पीएस सिविल लाइंस के एक पुलिस कांस्टेबल की मौत हो गई।डीटीसी बस का ड्राइवर विनोद कुमार (57) निवासी गाजीपुर पुलिस हिरासत में है। बस खराब स्थिति… pic.twitter.com/tJNWZBuaMl— ANI_HindiNews (@AHindinews) November 4, 2024ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
బస్‌లో మహిళ డ్యాన్స్ : సిబ్బందిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని బస్‌లో ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా బస్ సిబ్బంది ఎంచక్కా ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి బస్ డ్రైవర్‌ను ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) సస్పెండ్ చేసింది. కండక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి మార్షల్‌ను తిరిగి సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి పంపింది. జూన్ 12న జనక్‌పురిలో తీసిన ఈ వీడియో ఆ తర్వాత పలు సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొట్టింది. హర్యానీ సాంగ్‌కు చిందులేస్తూ మహిళ ఈ వీడియోలో కనిపించింది. డ్రైవర్, కండక్టర్, మార్షల్ ఆమెను అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని, డీటీసీ ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంటూ ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు. కాగా బస్‌ను ఢిల్లీలోని హరినగర్ డిపోకు చెందిన వాహనంగా గుర్తించారు. -
ఫుట్‌పాత్ షాప్‌ను ఢీకొట్టిన బస్సు.. యువకుడు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్ షాప్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పశ్చిమ ఢిల్లీలోని నంగోలయ్లో చోటు చేసుకుంది. నంగోలయ్- లజ్‌పత్ నగర్ రూట్లో నడిచే ఢిల్లీ రోడ్ రవాణసంస్థ బస్సు వేగంగా వెళ్లి ఫుట్‌పాత్ పై ఉన్న షాపును ఢీకొట్టింది. దీంతో రాజు (25) అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులని సమీప ఆసుపత్రికి తరలించామని, వీరు శంకర్ (30), రాకేశ్(26), మిథున్(33)లని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని, డ్రైవర్, కండక్టర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. -
రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం
న్యూఢిల్లీ: డీటీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన బాధితుడికి రూ. 1.6 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మోటార్ ప్రమాదాల ఫిర్యాదుల ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఆదేశించింది. డీటీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారకుడు అయినట్లు పేర్కొంది. ఈ మేరకు బస్సు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్న ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీనీ సదరు వ్యక్తికి రూ. 1,60,900ల పరిహారాన్ని చెల్లించాలని సూచించింది. 2013లో డీటీసీ బస్సు ప్రమాదానికి గురైన రాజస్థాన్‌కు చెందిన సునిల్ చౌదరికి ఈ పరిహారాన్ని చెల్లించాలని ట్రిబ్యునల్ సూచించింది. డీటీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా బస్సు నడపడం వల్లనే ప్రమాదానికి గురైనట్లు బాధితుడు సాక్షాధార పత్రాలను ట్రిబ్యునల్‌కు అందజేశాడని ఎంఏసీటీ నిర్వాహణాధికారి కేఎస్ మోహి చెప్పారు. ఎఫైఐఆర్ కాపీతోపాటు మెడికల్ రిపోర్టు పత్రాలను కూడా అందజేశాడు. డీటీసీ బస్సు నిబంధనలను ఉల్లంఘించలేదనడానికి అవసరమైన డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి చూపించలేదు. అంతేకాకుండా డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లెసైన్స్ కూడా లేదని బాధితుడు ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు. దక్షిణ ఢిల్లీలోని టాటా మోటార్స్‌లో బాధితుడు సునీల్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసు సమీపంలో సెప్టెంబర్8-9, 2013లో నిలబడి ఉండగా డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో అతడిని డీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డుపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని సమీప ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. తలకు గాయాలైన అతడు వారం రోజులపాటు చికిత్స పొందాడు. సునిల్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద జరిగిందని, డ్రైవర్ తప్పేమీ లేదని డీటీసీ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. దీంతో ఏకీభవించని కోర్టు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
సేవల్ని తగ్గించిన డీటీసీ
న్యూఢిల్లీ : 2007 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకూ 68 అంతర్రాష్ట్ర మార్గాల్లో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త న సేవలను తగ్గించింది. డీటీసీ గణాంకాల ప్రకారం 2007-08 మధ్యకాలంలో మొత్తం 80 అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సేవలను అందించాల్సి ఉంది. అయితే కేవలం 12 మార్గాలకే దీని సేవలు పరిమితమయ్యాయి. నోయిడా, ఘజియాబాద్, మీరట్, బులంద్‌షహర్, గుర్గావ్ తదితర అంతర్రాష్ట్ర మార్గాల్లో మాత్రమే డీటీసీ తన బస్సులను నడుపుతోంది. నాలుగైదు సంవత్సరాల క్రితం అనేక అంతర్రాష్ట్ర మార్గాల్లో డీటీసీ బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. ఉత్తరప్రదేశ్, హర్యా నా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు నగరం నుంచి డీటీసీ బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగించాయి.