2007 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకూ 68 అంతర్రాష్ట్ర మార్గాల్లో...
న్యూఢిల్లీ : 2007 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకూ 68 అంతర్రాష్ట్ర మార్గాల్లో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త న సేవలను తగ్గించింది. డీటీసీ గణాంకాల ప్రకారం 2007-08 మధ్యకాలంలో మొత్తం 80 అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సేవలను అందించాల్సి ఉంది. అయితే కేవలం 12 మార్గాలకే దీని సేవలు పరిమితమయ్యాయి.
నోయిడా, ఘజియాబాద్, మీరట్, బులంద్‌షహర్, గుర్గావ్ తదితర అంతర్రాష్ట్ర మార్గాల్లో మాత్రమే డీటీసీ తన బస్సులను నడుపుతోంది. నాలుగైదు సంవత్సరాల క్రితం అనేక అంతర్రాష్ట్ర మార్గాల్లో డీటీసీ బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. ఉత్తరప్రదేశ్, హర్యా నా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు నగరం నుంచి డీటీసీ బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగించాయి.