DTC
-
డీటీసీతో ‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది. ఆదాయపు పన్ను మూడు రకాలే... వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీడీటీకి మంగళం? ‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్‌పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది. -
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
ఏలూరు అర్బన్ : స్కూల్ బస్‌లు పూర్తి కండిషన్లో లేకుంటే సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కూల్ బస్‌లను తనిఖీ చేశారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్‌లను గుర్తించి సీజ్ చేశారన్నారు. సంబంధిత విద్యాసంస్థల నుంచి రూ.లక్ష వరకు అపరాధ రుసుం వసూలు చేశామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గడువు ముగి సిన అన్ని విద్యాసంస్థల బస్‌లకు విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బస్‌లు తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో ఆర్టీఓ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఏఎంవీఐలు ఎం.పౌల్‌రాజు, సిద్ధిఖ్, చైతన్యసుమ, ప్రసాద్ తనిఖీలు చేశారు. -
నోట్ల రద్దు స్కాం అన్నవారే అవకతవకలకు..
పాతనోట్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై ఆ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చార్జీల రూపంలో వసూలుచేసిన చిన్నమొత్తంలో విలువ కలిగిన నోట్లను, కాయిన్లను టీడీసీ పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తుందని పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించినట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిజంగానే పాత నోట్ల మార్పిడిలో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతుందనే తెలిస్తే, ఈ విషయంలో ప్రభుత్వం క్రిమిషన్ విచారణకైనా వెనుకాడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూలుగా డీటీసీ రూ.3కోట్లను డిపాజిట్ చేసిందని, అవన్నీ పాత కరెన్సీ నోట్లేనని ఢిల్లీ ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెవెన్యూలు ఎక్కువగా రద్దైన నోట్ల రూపంలోనే ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డీటీసీ అవతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నగదంతా ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల రూపంలో సేకరించిన మొత్తమేనని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ విరాళాలుగా సేకరించిన మొత్తాన్ని ఈ రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ కూడా లెఫ్టినెట్ గవర్నర్ నజీబ్ జంగ్కు లేఖ రాశారు. డీటీసీ బస్సులో ప్రయాణించే వారంతా దిగువ మధ్యతరగతికి చెందినవారే ఉంటారని, వారందరూ చిల్లర రూపంలోనే టిక్కెట్లను కొనుగోలుచేస్తారని ఉపాధ్యాయ చెప్పారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజాసంస్థలకు మరక అంటకముందే టీడీసీ మేనేజ్మెంట్ను మేలుకొల్పాలని ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం ప్రకటించగానే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మండిపడ్డారు. ఇది ఓ పెద్ద స్కాం అంటూ తెగ రాద్ధాంతం చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వంలోనే పాత నోట్ల మార్పిడిలో అవకతవకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
మోహన్‌రావు ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణా ఉప కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌రావు ఇంటిపై ఏసీబీ దాడులు శుక్రవారం రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 50 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మోహన్‌రావు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా మోహన్ రావు ఇంటి నుంచి 2.5 కేజీల బంగారంతోపాటు 5.5 కేజీల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే సొదాల్లో భాగంగా మోహన్‌రావు కుమార్తె పేరు మీద 9 ఎకరాలు, 6 బినామీ కంపెనీలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో మోహన్‌రావు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. మోహన్‌రావును నేడు ఏసీబీ కోర్టు కు తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు డీటీసీ మోహన్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ గురువారం దాడి చేసింది. -
ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)తో కలిసి బస్సుల ప్రమాణాల పరీక్షించి నివేదికను సమర్పించడంలో విఫలమైన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బస్సులను ఎవరు పర్యవేక్షిస్తారని, ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించిన ఒక్క బస్సు నివేదికనైనా తమకు ఇవ్వాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండడంతో వాటి మూలాలను కనుగొని అడ్డుకట్ట వేయాలని వర్ధమాన కౌశిక్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. డీటీసీ బస్సులు, గ్యాస్ ఆధారిత బస్సుల ప్రమాణాలను డీటీసీ, సీపీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యుల బృందం పరీక్షించి నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విర్ధుంగా ఉన్నవాటిని రోడ్ల మీద తిరగనివ్వద్దని 2014 నవంబరు 26న ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బస్సులన్ని ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని న్యాయవాది అవ్నిష్ అల్హావాట్ డీటీసీ తరుఫున వాదించారు. కానీ ధర్మాసనం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రవాణా శాఖ సంయుక్త కమిషనర్ 186 బస్సులు కాలుష్య నియంత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 2014 డిసెంబర్ 28న నివేదిక సమర్పించారు. దీంతో 15 ఏళ్లనాటి వాహనాలను రోడ్ల మీద తిరగకుండా నిషేధం విధించింది, ఒక వేళ అలాంటి వాహనాలు దేశ రాజధానిలో తిరిగితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘డీటీసీ’ ప్రమాదాలు తగ్గుముఖం
న్యూఢిల్లీ, డిసెంబర్ : నాలుగు సంవత్సరాల్లో మొదటిసారిగా డీటీసీ బస్సుల వల్ల కలిగే ప్రాణాంతక దుర్ఘటనల సంఖ్య దాదాపు 50 శాతం తగ్గింది. 2013లో డీటీసీ బస్సు దుర్ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరం ఈ సంఖ్య 35కి తగ్గింది. డ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు నిరంతరం అవగాహన తరగతులు నిర్వహించడంతో సత్ఫలితాలు వచ్చాయి. డీటీసీ బస్సులతో సంబంధం ఉన్న రోడ్డు ప్రమాదాల సంఖ్య గత సంసవత్సరం 253 ఉండగా ఈ సంవత్సరం అది 187కి తగ్గింది. ప్రమాదాల కారణాల వర్గీకరణ బ్లూ లైన్ బస్సులను నిషేధించిన తరువాత డీటీసీ బస్సులు కిల్లర్ వెహికిల్స్‌గా మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించడం కోసం డీటీసీ, ట్రాఫిక్ పోలీసులు కలిసి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మొదట ప్రమాదాలకు కారణాలను వర్గీకరించారు. డ్రైవరు తప్పిదం, బాధితుడి తప్పిదం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, హిట్ అండ్ రన్ అంటూ వివిధ కేటగిరీలుగా విభజించి ప్రమాదాలకు అధిక కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. వేగంగా వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం, హఠాత్తుగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా మలుపుతిప్పడం వంటివి డ్రైవర్ తప్పిదాల్లో చేర్చి వాటిపై లోతుగా అధ్యయనం చేశారు. ట్రైనింగ్ స్కూళ్ల ఏర్పాటు డ్రెవర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడం కోసం ఏడు ట్రైనింగ్ స్కూళ్లను ప్రారంభించారు. నెలన్నర శిక్షణ తరువాతనే డీటీసీ బస్సు డ్రైవర్లు విధులలో చేరడాన్ని తప్పనిసరి చేశారు, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లను వెంటనే శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు. అప్పటికీ డ్రైవర్లు తమ ప్రవర్తనను చక్కదిద్దుకోనట్లయితే వారిపై డిపార్ట్మెంటల్ చర్యలు చేపట్టడం ఆరంభించారు. డ్రైవర్లందరికీ రిఫ్రెషర్ కోర్సు తప్పనిసరి చేశారు. ఈ చర్యల ఫలితంగా ఈ సంవత్సరం దుర్ఘటనల సంఖ్య తగ్గిందని డీటీసీ అధికారులు చెప్పారు. డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల కొరడా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 283 డీటీసీ బస్సులను స్వాధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 1200 డ్రైవర్లు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తూ , 260 మంది డ్రైవర్లు సిగ్నల్ ఉల్లంఘిస్తూ, 249 మంది డ్రైవర్లు తప్పుగా ఓవర్‌టేకింగ్ చేస్తూ పట్టుబడ్డారు. అన్ని రోడ్లపై నిఘా పెట్టి ట్రాపిక్ నియమాలను ఉల్లంఘించిన డ్రైవర్లపై చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా వాహనాలను నడిపి,ప్రమాదాలకు బాధ్యులైన డ్రైవర్లను జైలుకు పంపారు. బస్సులను రెగ్యులర్‌గా తనిఖీ చేస్తూ స్పీడ్ గవర్నర్లు పనిచేయని బస్సులు గుర్తించి వాటిని సరిచేసేలా చర్యలు చేపట్టారు. కొందరు డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా స్పీడ్ గవర్నర్లు పాడుచేస్తున్నారని తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు, డీటీసీ అధికారులు అటువంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడమేకాక 171 బస్సుల పర్మిట్లు రద్దుచేశారు. -
మహిళలకు సరిపడా లేని ప్రయాణ సాధనాలు
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో లేడీస్ క్యాబ్‌లు, లేడీస్ స్పెషల్ బస్సులు ఉన్నాయన్న సంగతి తెలిసిన వారెంతమంది? వాటిని ఉపయోగించుకుంటున్న వారెంతమంది? ఆ మాటకొస్తే నగరంలో నిత్యం క్యాబ్‌లు బస్సుల్లోప్రయాణించే మహిళల సంఖ్యతో పోలిస్తే ఈ లేడీస్ స్పెషల్ ప్రయాణ సాధనాల సంఖ్య ఏ పాటిది అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. మహిళల కోసం మెట్రోలో లేడీస్ స్పెషల్ కోచ్‌లు మినహా, నగరంలో ప్రవేశపెట్టిన ఇతర ప్రయాణ సాధనాలేవీ పెద్దగా ఉపయోగపడడంలేదు. డిసెంబర్ 5 నాటి రాత్రి మహిళా ఎగ్జిక్యూటివ్ లేడీస్ క్యాబ్ తీసుకుని ఉంటే కామాంధుని బారిన పడకపోయి ఉండేదన్న అభిప్రాయం అక్కడక్కడా వినిపిస్తోంది. ప్రత్యేక బస్సులకు మహిళల ఆదరణ కరువు నగరంలో ఢిల్లీ రవాణా శాఖ (డీటీసీ) మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయినా వాటి సంఖ్య 26 మాత్రమే. ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అరకొరగానే ఉంటుంది. లేడీస్ స్పెషల్ బస్సులకు మహిళల ఆదరణ లేదని రవాణా విభాగం అంటోంది. కానీ ప్రస్తుతం ఈ బస్సులు కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే నడుస్తున్నాయి. తమ రూట్లో మహిళా స్పెషల్ బస్సు నడుస్తుందా లేదా అన్నది చాలా మందికి తెలియదు. తెలిసినవారు కూడా రోజుకు ఒకటో రెండో చొప్పున నడిచే బస్సులు ఏ వేళకొస్తాయో తెలియక వాటిపై ఆధారపడడానికి ఇష్టపడడం లేదు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ దిశగా ఆదరణ పెరగడం లేదు. ఈ కారణంగా లేడిస్ స్పెషల్ బస్సుల పెంపు ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. పింక్ ఆటోలు మాయం మహిళా ప్రయాణికుల కోసం ట్రాఫిక్ పోలీసులు 2010 డిసెం బర్లో మహిళా డ్రైవర్లతో పింక్ ఆటోలను ప్రవేశపెట్టారు. 20తో మొదలైన ఈ ఆటోల సంఖ్య తదుపరి ఏడాదికి 70కి పె గింది కానీ ఆ తరువాత సాధారణ ఆటోల నుంచి తల్తెత్తిన సమస్యల కారణంగా ఈ ఆటోలు మూలకుపడ్డాయి. డిసెంబర్ 16 ఘటన తరువాత ఈ పింక్ ఆటోలను మళ్లీ రోడ్లపైకి తెచ్చినప్పటికీ నాలుగైదు నెలల తరువాత రోడ్లపై నుంచి మాయమయ్యాయి. పరిమితంగా మహిళా క్యాబ్స్ ఇక లేడీస క్యాబ్‌ల విషయానికి వస్తే సఖా క్యాబ్, జీ క్యాబ్‌ల వంటివి కొన్ని క్యాబ్ సేవలు మహిళా డ్రైవర్లతో సేవలందిస్తున్నాయి. కానీ వాటి గురించి విృతంగా ప్రచారం జరగకపోవడం, అవసరమైన సమయంలో అవి అందుబాటులో లేకపోవడం వల్ల మహిళా ప్రయాణికులు సాధారణ క్యాబ్‌లపైనే ఆధారపడకతప్పడం లేదు. ‘క్యాబ్‌ల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల 24 గంటల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే సేవలందించగలుగుతున్నామ’ని సఖా క్యాబ్ ప్రతినిధి సరిత అంటున్నారు. జీ క్యాబ్ కూడా మహిళా డ్రైవర్లతో సేవలందిస్తోంది. ఈ మహిళా క్యాబ్ సేవలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయి. తమ వద్ద 10 మంది మాత్రమే మహిళా డ్రైవర్లు ఉన్నారని, వారి సేవలు ముందే ఫిక్స్ అయి ఉంటాయని జీ క్యాబ్‌కు చెందిన నవీన్‌కుమార్ అంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ న్యూఢిల్లీ: నగరంలో నిబంధనలు అతిక్రమిస్తున్న వివిధ క్యాబ్స్‌లపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇటీవల ఉబర్ రేప్ కేసు ఘటన నేపధ్యంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 500 క్యాబ్‌ల స్వాధీనం చేసుకొన్నారు. డ్రైవర్ల లెసైన్లులను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని 4,000 మంది డ్రైవర్లకు చలానులు విధించినట్లు సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి శనివారం మీడియాకు వెల్లడించారు. ఉబర్ కేసు నిందితుడు ఆర్టీఐ అధికారులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు చూపించి విధుల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, డ్రైవర్ల, వాహనాల అనుమతి పత్రాలను పరిశీలించారు. ఉబర్ క్యాబ్‌లపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతవారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌లను రోజూ నిర్వహిస్తున్నారు. ట్యాక్సీలు, క్యాబ్స్‌ల వివరాలను సేకరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 527 వాహనాలను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకొన్నారు. 1,073 ట్యాక్సీ స్టాండ్లను పరిశీలించి, 3,851 మంది డ్రైవర్లకు చలానాలు విధించారమని జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు. 1,423 మహిళా క్యాబ్‌ల పత్రాలు, డ్రైవర్ల లెసైన్స్‌లను పరిశీలించినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 239 మందికి చలాన్లు విధించి 193 వాహనాలను స్వాధీనం చేసుకొన్నామన్నారు. -
డీటీసీ బస్సులపై అడ్వర్టయిజ్మెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రంగురంగుల అడ్వర్టయిజ్మెంట్లతో డీటీసీ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీసే రోజులు త్వరలో రానున్నాయి. దివాళా తీసిన ఆర్థిక స్థితిని చక్కదిద్దుకోవడం కోసం డీటీసీ అడ్వర్టయిజ్మెంట్లను ఆశ్రయించనుంది. ఇందుకోసం డీటీసీ టెండర్లనుకూడా ఆహ్వానించింది. ఇప్పటి వరకు డీటీసీ బస్సుల లోపలి భాగంలో మాత్రమే వాణిజ్య ప్రకటనలు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడని బస్సుల బయటి భాగంలో కూడా ప్రకటనలు కనిపించనున్నాయి. మొదటి దశలో 500 బస్సులపై అడ్వర్టయిజ్మెంట్లు ప్రదర్శించడానికి టెండర్ జారీచేసింది. వాటిలో ఏసీ, నాన్ ఏసీ బస్సులున్నాయి. బస్సుల లోపల వాణిజ్య ప్రకటనలు ఉంచడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపడం లేదు, అటువంటప్పుడు బస్సుల బయట అడ్వర్టయిజ్మెంట్లకు ఎలాంటి ప్రతిస్పందన లభిస్తుందనేది వేచి చూడాల్సిందే. అధికారులు మాత్రం ఈ ప్రయత్నం ద్వారా తమ ఖజానాకు కాసులు రాలుతాయని ఆశిస్తున్నారు. చార్జీలు పెంచడానికి తాము పలుమార్లు ప్రతిపాదనలు పంపినా వాటికి ఆమోదం లభించలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది నష్టాలు పేరుకొనిపోతున్నాయి. రోజుకు 50 లక్షల రూపాయల నష్టం వస్తోందని అంచనా. ఈ నేపథ్యంలో లోటును పూడ్చుకోవడం కోసం వాణిజ్య ప్రకటనల మార్గం సరైనదని అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. రోహిణి, జిటికె డిపో, ఈస్ట్ వినోద్‌నగర్, ఎస్ఎన్ డిపో, హరినగర్ డిపోలకు చెందిన 100 బస్సులపై అడ్వర్టయిజ్మెంట్లు ప్రదర్శించాలని ప్రస్తుతం నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇతర బస్సుల బయటి భాగంపై అడ్వర్టయిజ్మెంట్లను ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు. జీపీఎస్ సదుపాయం కలిగిన క్లస్టర్ బస్సుల బయటి భాగంపై వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడానికి ఇదివరకే అనుమతి ఇచ్చారు. -
డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: నగరవాసులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తాజాగా 200 బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోకు చెందిన బస్సుల్లో వీటిని ఏర్పాటు చేశామని సంబంధిత అధకారి ఒకరు తెలియజేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేయగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉందన్నారు. తొలి విడతలో భాగంగా వీటిని బస్సుల్లో అమర్చామన్నారు. మలివిడతలో మరిన్ని బస్సులకు వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడత విజయవంతంగా పూర్తయిందన్నారు. తొలివిడత కింద అమర్చిన సీసీటీవీ కెమెరాల పనితీరును ప్రస్తుతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ కెమెరాలు రాత్రి వేళల్లో డీటీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళలకు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలు నమోదు చేసే దృశ్యాలను నిపుణులు ప్రతిరోజూ పరిశీ లిస్తుంటారని తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో 15 గంటలపాటు నమోదైన దృశ్యాలను ఆయా కంప్యూటర్లలో భద్రపరుస్తామని తెలిపారు. డిసెంబర్, 16నాటి సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో డీటీసీ యాజమాన్యం రాత్రివేళల్లో సేవలందించే బస్సుల్లో ఇద్దరు హోంగార్డులను నియమించిన సంగతి విదితమే. -
డీటీసీ డ్రైవర్లకు వైద్యపరీక్షలు చేపట్టాలి
న్యూఢిల్లీ: డీటీసీకి చెందిన డ్రైవర్లకు మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ని శనివారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ)కి చెందిన 600 మంది డ్రైవర్లకు క్యాట్ నాలుగోరౌండ్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. వారంతా వైద్యపరంగా విధులకు పనికిరారని,(వర్ణంధత్వం) ఉన్నదని ఇటీవల తేలింది. ఈ విషయమై జస్టిస్ ఆర్. రవీంద్ర భట్, విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం క్యాట్ తీరును తప్పుపట్టింది. డ్రైవర్ల నాలుగో రౌండ్ వైద్యపరీక్షల్లో క్యాట్ ఎలాంటి ప్రమాణాలను, మార్గదర్శకాలను జారీ చేయలేదని, మూడోసారి నిర్వహించిన పరీక్షల ఆధారంగానే కొనసాగించారని పేర్కొంది. 600 మంది డ్రైవర్లు తిరిగి ఉద్యోగాలను పొందాలంటే వంధత్వ నిర్ధారణ వైద్యపరీక్షలను మరోసారి క్యాట్ జరిపించాలని ఆదేశించింది. 2013లో వంధత్వ బాధతో ఇబ్బందులు పడుతున్న 600 మంది డ్రైవర్లను డీటీసీ ఉద్యోగాలను తొలగించింది. డ్రైవర్లకు క్యాట్ నాలుగోరౌండ్ నిర్వహించిన వైద్యపరీక్షలు అసమంజమైనవిగాతేలిందని కోర్టు అభిప్రాయపడింది. -
కొత్త డీటీసీ బసిరెడ్డి
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:రవాణాశాఖ జిల్లా ఉపకమిషనర్ (డీటీసీ) ఎస్.వెంకటేశ్వరరావుకు బదిలీ అయింది. ఆయన స్థానంలో చిత్తూరు డీటీసీ ఎం.బసిరెడ్డిని నియమించారు. ఈ మేరకు జీవో నెంబరు 734ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది డీటీసీలను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న వెంకటేశ్వరరావును విజయవాడ డీటీసీగా బదిలీ చేశారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు మార్చి 2013లో ఏలూరు నుంచి డీటీసీగా వచ్చారు. 1993లో ఆర్టీవోగా ఎంపికైన ఆయన పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు విశేష కృషి చేశారు. ఇతర ప్రభుత్వ విభాగాలను కలుపుకుపోతూ లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణలో లక్ష్యసాధన కోసం కృషి చేశారు. కాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎం.బసిరెడ్డి తొలుత ఆర్టీవోగానే ఎంపికై ఐదేళ్ల క్రితం డీటీసీగా పదోన్నతిపై చిత్తూరు వెళ్లారు. ప్రస్తుతం బసిరెడ్డిని శ్రీకాకుళం డీటీసీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వెంకటేశ్వరరావు మాత్రం తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు. -
80 డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళా ప్రయాణికుల భద్రతకోసం ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తన ఆధ్వర్యంలోని 80 బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. తొలి విడతలో భాగంగా మొత్తం 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీటీసీ నిర్ణయించిన సంగతి విదితమే. వీటిని లోఫ్లోర్ ఏసీ, నాన్ఏసీ బస్సుల్లో ఏర్పాటు చేయనుంది. ఈ విషయమై డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ మాట్లాడుతూ రాజ్‌ఘాట్ డిపోలోని 80 బస్సులకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. శుక్రవారంనాటికల్లా మొత్తం వంద బస్సులకు ఏర్పాటు చేస్తాం. ఇలా ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం డీటీసీ చరిత్రలోనే తొలిసారి. బాగా పొద్దుపోయాక ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తొలివిడత కింద రాజ్‌ఘాట్, సరోజినీనగర్ బస్సు డిపోల్లో వీటిని ఏర్పాటు చే స్తాం. ఈ రెండు డిపోల్లో మొత్తం 200 బస్సులు ఉన్నాయి. రాజ్‌ఘాట్ డిపోలో కంట్రోల్‌రూం ఏర్పాటుచేశాం. డైలీ పద్ధతిలో నిపుణులు ఈ దృశ్యాలను పరిశీలిస్తారు. ఈ కెమెరాలకు ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేసే సామర్థ్యం ఉంది. కంట్రోల్‌రూంలోని కంప్యూటర్లలో 15 గంటల నిడివిగల దృశ్యాలను భద్రపరుస్తాం.’అని అన్నారు. -
సేవల్ని తగ్గించిన డీటీసీ
న్యూఢిల్లీ : 2007 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకూ 68 అంతర్రాష్ట్ర మార్గాల్లో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త న సేవలను తగ్గించింది. డీటీసీ గణాంకాల ప్రకారం 2007-08 మధ్యకాలంలో మొత్తం 80 అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సేవలను అందించాల్సి ఉంది. అయితే కేవలం 12 మార్గాలకే దీని సేవలు పరిమితమయ్యాయి. నోయిడా, ఘజియాబాద్, మీరట్, బులంద్‌షహర్, గుర్గావ్ తదితర అంతర్రాష్ట్ర మార్గాల్లో మాత్రమే డీటీసీ తన బస్సులను నడుపుతోంది. నాలుగైదు సంవత్సరాల క్రితం అనేక అంతర్రాష్ట్ర మార్గాల్లో డీటీసీ బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. ఉత్తరప్రదేశ్, హర్యా నా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు నగరం నుంచి డీటీసీ బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగించాయి. -
డీటీసీలో ‘తీసివేత’లు..!
న్యూఢిల్లీ: రకరకాల సాకులతో ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) ఒక్కో బస్సును పక్కకుపెడుతోంది. ఇలా రెండున్నరేళ్లలో ఏకంగా 900 బస్సులను పక్కకుపెట్టింది. పక్కకు పెడుతున్నవన్నీ స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులేనని, నిర్వహణ వ్యయం ఎక్కువవుతున్నందున వాటిని వదిలించుకోక తప్పడంలేదని డీటీసీ అధికారులు అంటున్నారు. నిజమే వాటి నిర్వహణ వ్యయం ఎక్కువైనందున పక్కకు పెట్టారు. మరి వాటి స్థానంలో ఎన్ని కొత్త బస్సులను రోడ్లపైకి తెచ్చారు? అని అడిగిన ప్రశ్నకు డీటీసీ అధికారుల వద్ద సమాధానమే కరువైంది. రెండున్నరేళ్లలో కనీసం ఒక్క కొత్త బస్సు కూడా రోడ్లపైకి కాలేదు. 2012 ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం జూన్ 30 వరకు 892 బస్సులను డీటీస పక్కకుపెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులే. నిర్వహణ భారం భరించలేకే వీటిని పక్కకు పెట్టామని చెబుతున్నారు. 2012-13లో 446 బస్సులను పక్కకు పెట్టారు. 2003 తర్వాత ఇంత భారీ సంఖ్యలో బస్సులను పక్కనబెట్టడం ఇదే తొలిసారి. ఇక 2013-14లో 222 బస్సులను పక్కనబెట్టారు. దీంతో ఏసీ, నాన్ ఏసీ బస్సుల సంఖ్య 5,223 ఉండగా అందులో 900 బస్సుల కోత పడింది. ఈ ఏడాది మే నెలలోనే 176 బస్సులను పక్కనబెట్టారు. జూన్‌లో మరో 48 బస్సులను డిపోలకే పరిమితం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ... రాజధానిలోని రహదారులపై తిరుగుతున్న 1,216 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సుల్లో చాలావరకు 8 సంవత్సరాలకు పైడినవేనని, దీంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, అందుకే వాటిని పక్కకు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో దశలవారీగా బస్సులను తొలగించాలని నిర్ణయించామంటున్నారు. ప్రయాణికుల ఇక్కట్లు... బస్సులను తొలగిస్తూ వస్తున్న డీటీసీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టే విషయమై మాత్రం ఆలోచించడంలేదు. దీంతో బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక్కసారిగా 900 బస్సులు తగ్గినప్పుడు వాటిలో ప్రయాణించేవారంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకవేళ డీటీసీ బస్సులో ప్రయాణించినా కిక్కిరిసిన రద్దీని భరిస్తూ ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా కొత్త బస్సులను రోడ్లపైకి తేవాలని ప్రయాణికులు కోరుతున్న మాటలు డీటీసీ అధికారుల చెవికి ఎక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
త్వరలో నగరానికి కొత్త బస్సులు
న్యూఢిల్లీ: ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో కొత్త బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త్వరలో ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ (ఐఏఎంసీ)తో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘1,380 సెమీ లో-ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలనుంచి టెండర్లను ఆహ్వానించాం. టాటా మోటార్స్ సంస్థ ఇందుకు ఆసక్తి చూపించింది. బిడ్ పత్రాన్ని పుణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు (సీఐఆర్టీ) సంస్థకు పంపాం. సాంకేతిక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థను కోరాం’ అని అన్నారు. కాగా 1,380 సెమీఫ్లోర్ శీతలేతర బస్సులు, 345 లో-ఫ్లోర్ శీతల బస్సుల కొనుగోలు కోసం డీటీసీ గతంలో టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో ఈ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని ఔటర్ ఢిల్లీతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు వీటిని వినియోగించనుంది. గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ఈసారి బస్సులను కొనుగోలు ప్రక్రియ ఆగదని డీటీసీ అధికారులు ధీమాతో ఉన్నారు. ‘సెమీ లోఫ్లోర్ బస్సులు గ్రామీణ ప్రాంతాలతోపాటు ఔటర్ ఢిల్లీవాసులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఈ రెండు ప్రాంతాల్లో రహదారులు సరిగా ఉండవు. సెమీ లో-ఫ్లోర్ బస్సులు నగర ప్రయాణికులతోపాటు గ్రామీణ, ఔటర్ ఢిల్లీవాసుల అవసరాలను తీర్చగలుగుతాయి’అని మిన్హాస్ పేర్కొన్నారు. డీటీసీ అధికారులు అందించిన వివరాల ప్రకారం మొత్తం 600 లోఫ్లోర్ బస్సులను దశలవారీగా సేవలనుంచి తప్పించనున్నారు. మరో 1,275 లోఫ్లోర్ బస్సుల నిర్వహణ కాలపరిమితి ముగిసింది. వాటి స్థానంలో కొత్త సెమీలోఫ్లోర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి డీటీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరం. డీటీసీ, ఢిల్లీ ఇంటిగ్రే టెడ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టం (డీఐఎంటీఎస్) సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు నగరవ్యాప్తంగా చెరో 5,500 బస్సులను నడపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దాదాపు 4,937 బస్సులను డీటీసీ నగరవ్యాప్తంగా నడుపుతోంది. ఇక డీఐఎంటీఎస్ వద్ద కేవలం 1,157 బస్సులే ఉన్నాయి. -
మెట్రో స్మార్ట్ కార్డు ఇక బస్సుల్లోనూ..
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో వాడే స్మార్ట్ కార్డును డీటీసీ బస్సులతోపాటు క్లస్టర్ బస్సుల్లో వాడే సదుపాయం ఢిల్లీవాసులకు త్వరలోనే లభించనుంది. ఢిల్లీ ప్రభుత్వం వద్ద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను లెప్టినెంట్ గవర్నర్ ఆమోదించి ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపారు. మెట్రో స్మార్డ్ కార్డును బస్సులలో కూడా ప్రయాణికులు ఉపయోగించడానికి అనువుగా చేయడం కోసం బస్సులలో టికెట్ జారీ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీలో మార్పులు చేయడమో లేక మెట్రో స్మార్ట్ కార్డును స్వీకరించేలా దానిని మార్పు చేయడమో చేస్తామని రవాణా విభాగం అధికారులు అంటున్నారు. 2011 డిసెంబర్లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్త కార్డును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఢిల్లీ మెట్రో 2012లో మెట్రోతో పాటు మెట్రో ఫీడర్ బస్సులలో ఉపయోగించగల మోర్ ఢిల్లీ కార్డును విడుదల చేసింది. డీటీసీ బస్సులలో కూడా స్మార్ట్ కార్డు ఉపయోగించగల సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రతిపాదన పెండింగులోనే ఉండిపోయింది. అయితే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందువల్ల రవాణా విభాగం అధికారులతో చర్చించి స్మార్ట్ కార్డును బస్సులలో కూడా ఉపయోగించే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పిస్తామని మెట్రో అధికారులు అంటున్నారు. -
డ్రైవర్ల కుంభకోణంపై దర్యాప్తు
న్యూఢిల్లీ: బస్సులు నడిపేందుకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో దృష్టి లోపమున్న వ్యక్తులను డ్రైవర్లుగా ఆమోదించడంపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. డ్రైవర్లను నియమించే ందుకు ఫిట్నె స్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరపాలని సూచించింది. గురునానక్ కంటి విభాగం బస్సుడ్రైవర్లకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో అనేక లోపాలు ఉన్నాయని సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులుకు పంపిన ఫైల్లో డీటీసీ పేర్కొంది. దృష్టి లోపం లేదని గురునానక్ కంటి విభాగం ధ్రువీకరించిన 99 మంది అభ్యర్థుల్లో 91 మందిని డీటీసీ ఆరోగ్య విభాగం అనర్హులుగా గుర్తించింది. కాగా, ఢిల్లీ జీఎన్‌సీటీ వైద్య శాఖ నియమించిన స్వతంత్ర వైద్య బోర్డు కూడా సదరు 91 మంది అభ్యర్థులూ అనర్హులేనని నిర్ధారించినట్లు ఆచార్యులు పేర్కొన్నారు. కార్పొరేషన్లో అనర్హులైన డ్రైవర్లను నియమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆరోగ్య సెక్రటరీ ఎస్సీఎల్ దాస్‌కు డీటీసీ చైర్మన్, ఎండీ కూడా అయిన రాజీవ్ వర్మ 2013 సెప్టెంబర్ 11న లేఖ రాశారని ఆచార్యులు తెలిపారు. గురునానక్ కంటి విభాగం అర్హులని ధ్రువీకరించిన అభ్యర్థుల్లో ఒకరు భారీ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని ఆయన తన లేఖలో ఉదహరించారని ఆచార్యులు వివరించారు. కాగా, ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కమిషన్ సూచించిందని ఆయన చెప్పారు. -
డ్రైవర్ల కుంభకోణంపై దర్యాప్తు
న్యూఢిల్లీ: బస్సులు నడిపేందుకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో దృష్టి లోపమున్న వ్యక్తులను డ్రైవర్లుగా ఆమోదించడంపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. డ్రైవర్లను నియమించే ందుకు ఫిట్నె స్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరపాలని సూచించింది. గురునానక్ కంటి విభాగం బస్సుడ్రైవర్లకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో అనేక లోపాలు ఉన్నాయని సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులుకు పంపిన ఫైల్లో డీటీసీ పేర్కొంది. దృష్టి లోపం లేదని గురునానక్ కంటి విభాగం ధ్రువీకరించిన 99 మంది అభ్యర్థుల్లో 91 మందిని డీటీసీ ఆరోగ్య విభాగం అనర్హులుగా గుర్తించింది. కాగా, ఢిల్లీ జీఎన్‌సీటీ వైద్య శాఖ నియమించిన స్వతంత్ర వైద్య బోర్డు కూడా సదరు 91 మంది అభ్యర్థులూ అనర్హులేనని నిర్ధారించినట్లు ఆచార్యులు పేర్కొన్నారు. కార్పొరేషన్లో అనర్హులైన డ్రైవర్లను నియమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆరోగ్య సెక్రటరీ ఎస్సీఎల్ దాస్‌కు డీటీసీ చైర్మన్, ఎండీ కూడా అయిన రాజీవ్ వర్మ 2013 సెప్టెంబర్ 11న లేఖ రాశారని ఆచార్యులు తెలిపారు. గురునానక్ కంటి విభాగం అర్హులని ధ్రువీకరించిన అభ్యర్థుల్లో ఒకరు భారీ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని ఆయన తన లేఖలో ఉదహరించారని ఆచార్యులు వివరించారు. కాగా, ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కమిషన్ సూచించిందని ఆయన చెప్పారు. -
బాధిత కుటుంబానికి రూ.34 లక్షల పరిహారం
న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.34 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డీటీసీని మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఆదేశించింది. 2011 అక్టోబర్ 14న హరిచరణ్ రామ్ అనే వ్యక్తి జహంగిర్‌పురికి నడుచుకుంటూ వస్తుండగా వెనుకగా వచ్చిన డీటీసీ బస్సు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. అదే ప్రమాదంలో గాయపడిన జగదీష్ అనే వ్యక్తి ఇచ్చిన సాక్ష్యంతో ఏకీభవించిన ట్రిబ్యునల్, బాధిత కుటుంబానికి రూ.34,13,656 నష్టపరిహారం చెల్లించాలని డీటీసీని ఆదేశించింది. -
కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
కామారెడ్డి/భిక్కనూరు, న్యూస్‌లైన్ :భిక్కనూరు మండలం పొందుర్తి చెక్‌పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవా రం తెల్లవారుజామున గంజాయి తరలిస్తున్న కారును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన కు సంబంధించి కా మారెడ్డి ఎంవీఐ పా పారావు తెలిపిన వి వరాల ప్రకారం... ఏఎంవీఐ రవీందర్ రోజులాగే చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన (ఏపీ 21 ఏఎల్ 9579) నంబరు గల టాటా ఇండిగో కారులో ప్ర యాణిస్తున్నవారు రోడ్డుపై కారును వ దిలి పారిపోయారు. అనుమానం వచ్చిన ఏఎంవీఐ, సిబ్బంది కారును తనిఖీ చే యగా డిక్కీలో గట్టాలుగా కట్టిన గంజా యి లభ్యమైంది. దీంతో కారును చెక్‌పోస్టు వద్దకు తీసుకెళ్లి పూర్తిగా పరిశీలించారు. అందులో 2 కిలోల బరువున్న 66 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయి వాసన బ యటకు రాకుండా ఉండేందుకు గాను అడోని ల్ కాయల్ను ఉంచారు. కాగా కారు నంబరు, అందులో ఉన్న ఆర్సీ ఆధారంగా విశాఖ జిల్లా గాజువాకలోని చిన్నగంట్యాలకు చెందిన జి.సత్యవతి పేరిట ఉన్నట్టు గుర్తించారు. కారు వివరాలను సేకరించిన ఆర్టీఏ అధికారులు భిక్కనూరు పోలీసులకు సమాచారం అందించగా సీఐ సర్దార్‌సింగ్, ఎస్సై గంగాధర్రావ్లు అక్కడికి చేరుకుని గంజాయితో ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని అభినందించిన డీటీసీ... కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న ఏఎంవీఐ రవీందర్, సిబ్బందిని జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాజారత్నం అభినందించారు. బుధవారం ఉదయం ఆయన పొందుర్తి చెక్‌పోస్టు వద్దకు వచ్చి కారును, గంజాయిని పరిశీలించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాం - డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ రాజారత్నం కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో రవాణాశాఖ చెక్‌పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు రవాణా శాఖ జిల్లా డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ రాజారత్నం తెలిపారు. బుధవారం పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద గంజాయితో వెళ్తున్న కారును సిబ్బంది పట్టుకున్న విషయం తెలియడంతో ఆయన చెక్‌పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న విలేకరులతో మాట్లాడుతూ... తమ సిబ్బం ది అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే గంజాయితో వెళుతున్న కారు చిక్కిందని అన్నారు. గంజాయితో వెళ్తున్న కారును పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. పట్టుకున్న కారు విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని చిన్నగంట్యాలకు చెందిన సత్యవతి పేరుతో రిజిస్టరై ఉందన్నారు. కారును తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తిం చి తమకు సమాచారం అందించారని తెలి పారు. 2 కిలోలు, ఆపైన బరువున్న ఎండు గం జాయి ప్యాకెట్లు 66 ఉన్నాయని, వాటి బరువు సుమారు 132 కిలోలు ఉండి ఉంటుందని అంచనా వేసినట్టు చెప్పారు. దాని విలువ రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారని చెప్పారు. ఆయన వెంట ఎంవీఐ పాపారావ్, ఏఎంవీఐ రవీందర్, సిబ్బంది ఉన్నారు.