న్యూఢిల్లీ: బస్సులు నడిపేందుకు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో దృష్టి లోపమున్న వ్యక్తులను డ్రైవర్లుగా ఆమోదించడంపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. డ్రైవర్లను నియమించే ందుకు ఫిట్‌నె స్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరపాలని సూచించింది. గురునానక్ కంటి విభాగం బస్సుడ్రైవర్లకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో అనేక లోపాలు ఉన్నాయని సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులుకు పంపిన ఫైల్‌లో డీటీసీ పేర్కొంది.
దృష్టి లోపం లేదని గురునానక్ కంటి విభాగం ధ్రువీకరించిన 99 మంది అభ్యర్థుల్లో 91 మందిని డీటీసీ ఆరోగ్య విభాగం అనర్హులుగా గుర్తించింది. కాగా, ఢిల్లీ జీఎన్‌సీటీ వైద్య శాఖ నియమించిన స్వతంత్ర వైద్య బోర్డు కూడా సదరు 91 మంది అభ్యర్థులూ అనర్హులేనని నిర్ధారించినట్లు ఆచార్యులు పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో అనర్హులైన డ్రైవర్లను నియమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆరోగ్య సెక్రటరీ ఎస్‌సీఎల్ దాస్‌కు డీటీసీ చైర్మన్, ఎండీ కూడా అయిన రాజీవ్ వర్మ 2013 సెప్టెంబర్ 11న లేఖ రాశారని ఆచార్యులు తెలిపారు. గురునానక్ కంటి విభాగం అర్హులని ధ్రువీకరించిన అభ్యర్థుల్లో ఒకరు భారీ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని ఆయన తన లేఖలో ఉదహరించారని ఆచార్యులు వివరించారు. కాగా, ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కమిషన్ సూచించిందని ఆయన చెప్పారు.
డ్రైవర్ల కుంభకోణంపై దర్యాప్తు
Published Thu, Feb 27 2014 11:40 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement