CIC
-
రూ.2000 నోట్ల ఎఫెక్ట్! పడిపోయిన కరెన్సీ వృద్ధి
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి పడిపోయిందని వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. ఏడాది క్రితం ఇది 8.2 శాతంగా ఉండేది. కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ (CiC) అనేది చెలామణిలో ఉన్న నోట్లు, నాణేలను సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం కారణంగా కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీనికి కూడా రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణే కారణమని చెప్పవచ్చు. ఇక రిజర్వ్ మనీ (RM) వృద్ధి విషయానికి వస్తే ఏడాది క్రితం ఉన్న 11.2 శాతం నుంచి ఈ ఫిబ్రవరి 9 నాటికి 5.8 శాతానికి క్షీణించింది. చలామణిలో ఉన్న కరెన్సీ, ఆర్బీఐలో బ్యాంకుల డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు ఈ రిజర్వ్ మనీలో భాగంగా ఉంటాయి. రిజర్వ్ మనీలో అతిపెద్ద భాగం అయిన కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ వృద్ధి ఏడాది క్రితం నాటి 8.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించడం రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ప్రతిబింబిస్తోంది. ఆర్బీఐ 2032 మే 19న రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 31 నాటికి రూ. 2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. దాదాపు రూ. 8,897 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. 2023 మే 19న నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. రూ.2000 నోట్లు ఉన్న వ్యక్తులు, సంస్థలు వాటిని 2023 సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని మొదట్లో ఆర్బీఐ గడువు విధించింది. ఆ తర్వాత గడువు 2023 అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 నోట్ల డిపాజిట్‌కి వీలుంది. కాగా 2016 నవంబర్‌లో రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టారు. -
సీఐసీపై వేధింపు కేసులేంటి?
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటయిన స్వతంత్ర వ్యవస్థ. సమాచార అభ్యర్థనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తున్నదా? ప్రభుత్వ అధికారి మీద వచ్చిన అక్రమాల ఆరోపణల ఫిర్యాదులు, వాటి విచారణ వివరాలు ఇవ్వమంటే అది వ్యక్తిగత సమాచారమనీ ఇవ్వరాదని పీఐఓలు నిర్ణయించుకున్నట్టుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సాగించిన పనుల పర్యవసానాన్ని వ్యక్తిగత సమాచారం అని ఏ విధంగా అంటారు. యజమాని ప్రభుత్వం అయినపుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధుల హోదాలో లేదా ప్రజాసేవకుల హోదాలో పనిచేస్తున్నప్పుడు యజమానులైన ప్రజలకు వారి సమాచారం ఎందుకు ఇవ్వరు? అనేవి మౌలికమయిన ప్రశ్నలు. కానీ ప్రజాసమాచార అధికారి ఇవేవీ ఆలోచించకుండానే నిరాకరిస్తాడు. మొదటి అప్పీలులో పై అధికారి కూడా ఆలోచించడం లేదు. అప్పుడు విధి లేక రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు రావాల్సి ఉంటుంది. కమిషన్ స్వతంత్రంగా అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా రాజకీయ నాయకులకు భయపడకుండా సమాచారం ఇవ్వాలో వద్దో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా తీర్పులు చెప్పింది కూడా. ఉదాహరణకు పైన ఉదహరించినట్టు ఉద్యోగిపైన వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వ్యక్తిగత సమాచారం కాదని, ఆ సమాచారం ఇవ్వవలసిందే అని ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనం ఉంటే ఇవ్వవచ్చునని ఒక షరతు విధించింది. నిజానికి ఈ షరతు వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు మాత్రమే వర్తిస్తుందని చట్టం చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ దురదృష్టవశాత్తూ బొంబాయ్ హైకోర్టు సమాచార చట్ట వ్యతిరేక తీర్పు ఇచ్చింది. దానిపైన అప్పీలు అనుమతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అప్పీలు అనుమతి తిరస్కరణను సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా భావించి సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది సమాచార హక్కును నీరుగార్చే ప్రయత్నం. కొన్నిసార్లు కమిషనర్ అనుకూల తీర్పు ఇచ్చినా, బలంగా ఉన్న అవినీతి అధికారి తరఫున ప్రభుత్వమే రిట్ పిటిషన్ వేస్తున్నది. హైకోర్టులు వందలాది స్టే ఉత్తర్వులు ఇస్తున్నాయి. ఇప్పటికి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన వెల్లడి ఉత్తర్వులపైన 1700 రిట్ పిటిషన్లు ఉన్నాయని అంచనా. రాష్ట్ర సమాచార కమిషనర్ల ఉత్తర్వులపైన కొన్ని వందల కేసులైనా ఉంటాయి. పదిరూపాయల ఫీజుతో సమాచారం అడగడం ద్వారా సమస్య పరిష్కరించుకున్న వారు లక్షలాది మంది ఉంటారు. అక్కడ అధికారులు కూడా సహకరిస్తారు. కానీ సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేధిం పులకు గురయ్యే వారు కూడా లక్షలాది మంది ఉంటారు. వారికి సమాచారం ఇవ్వనక్కరలేదని కమిషనర్లుగా ఉన్న మాజీ ఉన్నతాధికారుల్లో కొందరు భావిస్తారు. వారు తమకు ఇన్నాళ్లూ అధికారం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించిన ప్రభుత్వ రహస్యాలను రక్షించే బాధ్యత ఉందనే భావనలో ఉంటారు. రాజకీయంగా తమను ఆదుకుని, పదవీ విరమణ తరువాత ఇంత గొప్ప పదవినిచ్చి, అయిదేళ్లపాటు అందలంలో ఉండి పల్లకీ ఊరేగే అవకాశం ఇచ్చిన నాయకుడికి కృతజ్ఞతతో ఉండటం కోసం సమాచారం ఇవ్వకుండా కాపాడుతూ ఉంటారు. వీరిమీద రిట్ పిటిషన్ వేసేంత తీరిక, డబ్బు సామాన్యుడికి ఉండదు. కేంద్ర కమిషన్ భారత ప్రభుత్వానికి చెందిన సర్వోన్నత న్యాయస్థానం వంటి సంస్థ. అది ప్రభుత్వ విభాగం కాదు. అక్కడ ఉన్నది సమాచార అధికారి కాదు కమిషన్. నిజానికి అది ట్రిబ్యునల్ వలె కోర్టువలె పని చేస్తున్నది. పని చేయాలి. పనిచేయనీయాలి. చట్టం ప్రకారం ఏర్పడిన ఒక నిర్ణాయక సంస్థ, చట్టం కింద నిర్ణయం ప్రకటిస్తే, ఆ నిర్ణయం చట్టం ప్రకారం ఉందో లేదో పరిశీలించడానికి హైకోర్టుకు వెళ్లవచ్చు. కానీ అందులో సీఐసీని పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరయినా కమిషన్ మీద కేసు వేస్తే రక్షించడానికి ప్రభుత్వం లాయర్‌ను నియమించాల్సింది పోయి, ప్రభుత్వమే కేసు వేయడం ఎంత అన్యాయం. కింది కోర్టు తీర్పు మీద ప్రభుత్వం హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. కానీ అందులో కింది కోర్టును ప్రతివాదిగా చేర్చదు. కమిషన్‌పైన ప్రభుత్వం స్వయంగా కేసులు వేయడం ఎందుకు? పార్లమెంటు చేసిన చట్టాన్ని ప్రభుత్వం వంచించడం ఎందుకు? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అప్పుడు ఎన్ని నోట్లు ముద్రించారో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్ల ముద్రణ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఆర్బీఐ అనుబంధ నోట్ల ముద్రణ విభాగం నిరాకరించింది. 2016 నవంబర్ 9 నుంచి అదే నెల 30వ తేదీ మధ్య ఎన్ని రూ.2,000 నోట్లు, రూ.500 నోట్లను ముద్రించారో సమాచారమివ్వాలని కోరుతూ హరీందర్ దింగ్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సరైన స్పందన రాకపోవడంతో ఆయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు (సీఐసీ) అప్పీలు చేసుకున్నాడు. ఆర్బీఐకి చెందిన ‘భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ లిమిటెడ్’ సీఐసీకి తన వాదనలు వినిపిస్తూ... కరెన్సీ నోట్ల ముద్రణ, సంబంధిత వివరాలను ప్రజలతో పంచుకోరాదని, ఇది నకిలీ కరెన్సీ వ్యాప్తి, ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని చెప్పింది. ఇది పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారంగా పేర్కొంది. ఈ సమాచారాన్ని వెల్లడిస్తే అది దేశ సమగ్రతకు, సౌర్వభౌమత్వం, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ) కింద ఈ సమాచారానికి మినహాయింపు ఉందని తెలియజేసింది. అయితే ఈ వాదనలను సీఐసీ భార్గవ తోసిపుచ్చారు. రోజువారీగా ఎన్ని నోట్లను ముద్రించారన్న సమాచారం అంత సున్నితమైనదేమీ కాదని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించారు. -
బ్లాక్‌మనీ వివరాల వెల్లడికి పీఎంవో ‘నో’
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన నల్లధన వివరాలు వెల్లడించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నిరాకరించింది. ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వివరాలు బహిర్గతమైతే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వెల్లడించలేమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్ 8 (1) (హెచ్) ప్రకారం దర్యాప్తునకు ఆటంకం కలిగే సమాచార వెల్లడికి మినహాయింపు ఉందంటూ.. ఈ విషయమై తమ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు సాగిస్తున్నట్లు వివరించింది. అక్టోబర్ 16న సీఐసీ జారీ చేసిన ఆదేశాలకు పీఎంవో ఈ మేరకు సమాధానం ఇచ్చింది. అయితే, అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) సంస్థ అధ్యయనం ప్రకారం.. 2005–14 మధ్య రూ.5.44 లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా దేశంలోకి రాగా, రూ.1.16 లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయింది. -
సీఐసీలో లుకలుకలు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్, కమిషనర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్‌ను కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. దీనిపై ప్రధాన కమిషనర్ రాధాకృష్ణ మాథుర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీధర్ ఆచార్యులు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాథుర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రుణ ఎగవేతదారులపై బ్యాంకుల తనిఖీ నివేదికలను బహిర్గతం చేయాలని అప్పటి కమిషనర్ శైలేష్ గాంధీ జారీచేసిన ఆదేశాల్ని రిజర్వ్ బ్యాంకు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సమాచార కమిషన్ చర్యల్ని కోర్టు సమర్థించి, ఆ సమాచారం వెల్లడించాలని ఆదేశించినా ఆర్బీఐ స్పందించలేదు. పదవి నుంచి దిగిపోయిన తరువాత శైలేష్ గాంధీ సామాన్యుడిగా ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఆయన అభ్యర్థనను కేంద్ర సమాచార కమిషన్ తిరస్కరించింది. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు తన వద్దకు రాగా, సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని శ్రీధర్ ఆచార్యులు ఆర్బీఐని ఆదేశించినట్లు తెలిసింది. అలిఖిత నియమం బేఖాతరు!: అప్పీలులో ఆర్బీఐ సంబంధిత అంశాలు ఉన్నప్పుడు ఆ అప్పీళ్లు వినే కమిషనర్‌కు పంపాలనే అలిఖిత నియమం ఉల్లంఘించారని శ్రీధర్ ఆచార్యుల నిర్ణయంపై మాథుర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీని వల్ల సదరు అప్పీళ్లు విచారించే కమిషనర్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారని, కమిషనర్ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చేలా చేశారని మాథుర్ పేర్కొన్నట్లు తెలిసింది. సీఐసీ నిబంధనావళిలో అలాంటి అలిఖిత నియమం ఏదీ లేదని శ్రీధర్ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. సుప్రీం తీర్పును గౌరవిస్తూ ఆర్బీఐ చట్టానికి అనుగుణంగానే తాను ఆదేశాలు జారీచేసినట్లు శ్రీధర్ తెలిపారు. ఆ దుర్మార్గుల పేర్లను గోప్యంగా ఉంచాలా? ‘2017 జూన్ నాటికి రూ. 9.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని భారతీయ బ్యాంకుల ద్వారా కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు. 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు పెడితే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7 వేల మంది ఘరానా ప్రముఖులు వారు. మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? చిన్నపాటి అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక రైతులు పొలాల్లోనే ప్రాణాలు వదిలేస్తుంటే, బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను గోప్యంగా ఉంచాలని మనం ప్రమాణం చేశామా? భారత రాజ్యాంగంతో పాటు అంతరాత్మకు లోబడి తీర్పు చెప్పాను’ అని శ్రీధర్ ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. -
విదేశాలకు మోదీతో ఎవరెవరు వెళ్లారు?
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీతో పాటు ప్రయాణించిన ప్రైవేటు వ్యక్తుల పేర్లను వెల్లడించాలని విదేశీ వ్యవహారాల శాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. 2015–16, 2016–17 వార్షిక సంవత్సరాల్లో మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులు, మోదీతో ప్రయాణించిన ప్రైవేటు వ్యక్తుల వివరాలను ఇవ్వాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు కరాబీ దాస్ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకున్నారు. శాఖ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఇవ్వాలంటే రూ.224 చెల్లించాలని ఆ శాఖ డిమాండ్ చేసిందని, ఆ విధంగానే కరాబీ చెల్లించాడని అయితే ప్రధాని విదేశీ పర్యటనల తేదీలు, దేశాల వివరాలు, చార్టర్డ్ విమానాలకయ్యే ఖర్చుల వివరాలు తప్ప మరేమీ ఇవ్వలేదని కరాబీ తరఫున ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కేంద్ర సమాచార కమిషనర్ ఆర్కే మాథూర్‌కు వివరించారు. -
డిఫాల్టర్లపై ఏ చర్యలు తీసుకున్నారు?
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ. 50 కోట్ల పైబడి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారిపై (డిఫాల్టర్లు) ఏమేం చర్యలు తీసుకున్నారో బహిర్గతం చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, గణాంకాలు.. పథకాల అమలు శాఖను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో డిఫాల్టర్ల పేర్లు బయటపెట్టాలని ఎందుకు ఆదేశించకూడదో సెప్టెంబర్ 20లోగా తగిన వివరణనివ్వాలని సూచించింది. ఒకవైపు స్వల్ప రుణాలను కట్టలేని పరిస్థితుల్లో ఉన్న చిన్న రైతులను బహిరంగంగా పరువు తీస్తూ.. మరోవైపు కోట్ల రూపాయలు ఎగవేసిన డిఫాల్టర్లకు మాత్రం కావాల్సినంత సహకారం అందించడం జరుగుతోందని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు విమర్శించారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) (సీ) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు, విధానాలన్నింటి గురించి ప్రభుత్వ విభాగాలన్నీ సమగ్రమైన వివరాలను ప్రచురించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూ. 50 కోట్ల పైబడిన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన డిఫాల్టర్లపై ఏమేం చర్యలు తీసుకున్నారు, ప్రజాధనాన్ని.. ఎకానమీని కాపాడటానికి తీసుకుంటున్న చర్య లేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక శాఖ, గణాంకాల శాఖ, ఆర్బీఐకి ఉంటుందని ఆచార్యులు చెప్పారు. కార్పొరేట్లకో రూలు.. రైతులకో రూలా? రుణాలు చెల్లించలేక పరువు పోగొట్టుకున్నామన్న అవమానభారంతో 1998 నుంచి 2018 దాకా దేశవ్యాప్తంగా 30,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆచార్యులు పేర్కొన్నారు. మరోవైపు, రూ. 50 కోట్ల పైబడి రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన డిఫాల్టర్లకు వన్‌టైమ్ సెటిల్మెంట్లు, వడ్డీ మాఫీ వంటి మినహాయింపులతో పాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, వారి ప్రతిష్ట దెబ్బతినకుండా ఎక్కడా పేర్లను కూడా బైటికి రానివ్వడం లేదని ఘాటుగా విమర్శించారు. -
సీఐసీలో పోస్టుల భర్తీకి ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లోని ఖాళీల భర్తీకి కేంద్రం ప్రకటన విడుదల చేసింది. సమాచార కమిషనర్ పోస్టుకు ఆసక్తి గల 65 ఏళ్లలోపు అభ్యర్థులు ప్రొఫార్మా ప్రకారం వివరాలను పంపాలని కోరింది. అభ్యర్థులు ప్రజా జీవితంలో ఉండి విస్తృత పరిజ్ఞానం, అనుభవంతోపాటు చట్టాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, జర్నలిజం, మేనేజ్మెంట్, పరిపాలన తదితర రంగాల్లో నిపుణులై ఉండాలని తెలిపింది. వేతనం, అలవెన్సు, ఇతర సదుపాయాలు, నిబంధనలను నియామక సమయంలో వెల్లడిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సీఐసీలో 10 మంది కమిషనర్లకు గాను ప్రధాన సమాచార కమిషనర్ రాథా కృష్ణ మాథుర్ సహా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సమాచార కమిషనర్ల వేతనాలు, అలవెన్సులు, ఇతర నియమ నిబంధనలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఉండాలి. వారి పదవీ కాలం ఐదేళ్లు కాకుండా ప్రభుత్వం సూచించిన కాలానికే పరిమితం కావాలి.. వంటివి కూడా ఉన్నాయి. ఇటువంటి మార్పులతో ఈ చట్టాన్ని బలహీన పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామంటున్నారు. -
ఆర్టీఐ సవరణ బిల్లుపై సీఐసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005లో తీసుకురావాలని సంకల్పించిన సవరణలపై కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపర్చేలా ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై చర్చించేందుకు అందరు కమిషనర్లతో వెంటనే సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు అత్యంత సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌కు లేఖ రాశారు. ఈ వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కమిషనర్లందరికీ లేఖలో విజ్ఞప్తి చేశారు. కొత్త సవరణ బిల్లుతో సమాచార హక్కు చట్టం మౌలిక ఉద్దేశం దెబ్బతింటుందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
12 ఏళ్ల తర్వాత నూతన భవనంలోకి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉనికిలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మంగళవారం సొంత భవనంలోకి మారనుంది. అత్యాధునిక హంగులతో కూడిన సీఐఐ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభిస్తారు. ఇప్పటివరకూ ఆగస్ట్ క్రాంతిభవన్, పాత జేఎన్‌యూ బిల్డింగ్‌ల నుంచి సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించారు. త మ కేసుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పిటిషనర్లు తరలివస్తున్న క్రమంలో పాత కార్యాలయం రద్దీని అధిగమించకపోవడంతో నూతన భవనాన్ని నిర్మించారు. మునిర్కాలో కొలువుతీరిన సీఐసీ భవనంలో అత్యాధునిక సాంకేతక సదుపాయాలున్నాయని..దీని నిర్మాణాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ర్టక్షన్ కార్పొరేషన్ రికార్డు సమయంలో పూర్తిచేసిందని సీఐసీ వర్గాలు పేర్కొన్నాయి. ఐదంతస్తులతో కూడిన ఈ భవనంలో ఐటీ, వీడియో కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలున్న హియరింగ్ రూమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. -
ఎన్జీవోలు లెక్కలు చెప్పాల్సిందే
విశ్లేషణ ఎన్జీవో గానీ లేదా రాజకీయ పార్టీ గానీ పాన్ కార్డును, ఐటీ నివేదికలను దాచుకోవడం సరికాదు. ఈ వివరాలు ఇవ్వడం వల్ల ఎన్జీవోల విశ్వసనీయత పెరుగుతుంది. వాటిని దాచడం అనుమానాలను రేకెత్తిస్తుంది. జమ్మూకశ్మీర్‌లోని ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) రాజీవ్ గాంధీ జాతీయ బాలల పోషక పథకం కింద కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు నుంచి సాయం పొందుతున్నదనీ, ఆ సంస్థ వివరాలు కావాలని అశోక్ కుమార్ ఆర్టీఐ కింద కోరారు. ఆ ఎన్జీవో రిజిస్ట్రేషన్ ప్రతి, పాన్ (ఆదాయపు పన్నుకు సంబంధించిన గుర్తింపు) కార్డు, ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 12ఎ ఎ, రిజిస్ట్రేషన్, 80జి రిజిస్ట్రేషన్, మేనేజింగ్ కమిటీ సభ్యుల పేర్లు, వారి ఆదాయవ్యయాల వార్షిక నివేదికలు, ఆదాయం పన్ను అంచనా వివరాలను అడిగారు. ఈ సమాచారం మూడో వ్యక్తికి చెందినదంటూ డిప్యుటీ డైరెక్టర్ అందుకు నిరాకరించారు. ఆ రాష్ట్రంలో ఎన్నో ఎన్జీవోలు ఆదాయం పన్ను రిటర్న్‌లను దాఖలుచేయడం లేదనీ, వాటి ఆదాయం పన్ను మదింపు ఎలా జరుగుతున్నదో తెలియడం లేదని, ఆదాయం పన్ను చట్టం సవరణ తరువాత సంస్థలు రూ. 2,000 కన్నా ఎక్కువ డబ్బును నగదు రూపంలో విరాళంగా తీసుకోవడానికి వీల్లేదు. వారు తీసుకున్న విరాళాల వివరాలను ఇవ్వాలని దరఖాస్తుదారు కోరారు. ఆయన అడిగిన సమాచారం మూడో వ్యక్తి సమాచారం ఎందుకయిందో, అది వ్యక్తిగత సమాచారమే అయినా అందులో ప్రజాప్రయోజనం ఉందో లేదో విచారించారా? అనే అంశాలపై∙ప్రజా సమాచార అధికారి ఏ వివరణా ఇవ్వలేదు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికి «థర్డ్ పార్టీ అనే సాకును ప్రభుత్వ విభాగాలు విరివిగా వాడుకుంటూ ఎడా పెడా పీఐఓలను నిరాకరిస్తున్నారు. ఐటీ రిటర్న్‌లు తప్ప అశోక్ కుమార్ అడిగిన ఏ సమాచారమూ ప్రైవేటుది కాదు. ప్రజాప్రయోజనం ఉంటే ఐటీ రిటర్న్‌లను కూడా వెల్ల డించాలని ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 138 (1)(బి) వివరిస్తున్నది. అదే విధంగా ఆర్టీఐ చట్టం కూడా సెక్షన్ 8(1)(జె)లో మినహాయింపు కూడా వివరిస్తున్నది. ప్రజాప్రయోజనం ఏదైనా ఉందా లేదా అనేదాన్ని పరిశీలించాల్సిన బాధ్యతను ఆదాయం పన్ను అధికారిపైన, ఆర్టీఐకింద పనిచేసే ప్రజాసంబంధ అధికారిపైన ఉందని ఈ రెండు చట్టాలు నిర్దేశిస్తున్నాయి. విదేశీ ఎన్జీవోల కార్యకలాపాలు దేశ ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతున్నాయని ఇటీవల పలు ఇంటెలిజెన్సు బ్యూరో నివేదికలు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 2016లో ఒక కేసు విచారణ సందర్భంగా ఎన్జీవోల జవాబుదారీని శాసించే చట్టమేదీ లేదని, వాటిని నియంత్రించే చట్టాన్ని చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదని అన్నారు. 30 లక్షల ఎన్జీవోల ఆదాయవ్యయాల లెక్కలను కనీసం మార్చి 31, 2017 వరకైనా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ కేహర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఎన్జీవోల నియంత్రణకు మార్గదర్శకాలనైనా కనీసం రూపొందించాలని ఇటీవల సూచిం చింది. ఈ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారుచేసింది. నీతి ఆయోగ్ అంతర్జాల వేదికలో, ఎన్జీవో దర్పణ్ అనే పోర్టల్ రిజిస్టర్ చేసిన ఎన్జీవోలకు మాత్రమే విదేశీ దాతలనుంచి విరాళాలను సేకరించే అనుమతి లభిస్తుంది. ఎన్జీవోల ముఖ్యపదాధికారుల ఆధార్ కార్డు నంబర్లు, పాన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచాలి. ఈ మార్గదర్శకాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కాని ఈ నియమాలు సరిపోవని అది అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్జీవోలకు అందే ప్రజాధనానికి సంబంధించి అన్ని లెక్కలు చెప్పవలసిన బాధ్యతను చట్టపరంగా నిర్దేశించడానికి పార్లమెంటు ఒక శాసనం చేయాలని భావిస్తున్నది. ఒకవేళ ఎన్జీవోను ఆదాయపు పన్ను చట్టం కింద రిజిస్టర్ చేస్తే ప్రజలకు అది తమ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పి తీరాలి. అదే విధంగా మినహాయిం పులు ప్రయోజనాలు పొందడానికి సెక్షన్ 80జి, 12ఎ ఎ వంటి నియమాల కింద రిజిస్ట్రేషన్ చేస్తే ఆ వివరాలు కూడా అందించాల్సిందే. ఎన్జీవో గానీ లేదా రాజకీయ పార్టీ గానీ పాన్ కార్డును, ఐటీ నివేదికలను దాచుకోవడం సరికాదు. ఈ వివరాలు ఇవ్వడం వల్ల ఎన్జీవోల విశ్వసనీయత పెరుగుతుంది. వాటిని దాచడం అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎన్జీవోకు పాన్ కార్డు ఉందా, వారి ఐటీæ వార్షిక నివేదికలు ఏమిటి అని విచారించవలసిన బాధ్యత కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిపై ఉంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలు, సంస్థలు తమ పాన్ కార్డు వివరాలు, ఆదాయంపన్ను రిటర్న్‌లు వెల్లడించాలని సీఐసీ ఇదివరకు ఒక కేసులో నిర్దేశించింది. ఎన్జీవోల ఆదాయం పన్ను నివేదికలను వ్యక్తిగత విషయాలుగా పరిగణించడం న్యాయం కాదు. మూడో వ్యక్తి సమాచారం అనడం సరికాదు. సెక్షన్ 4(1)(బి) కింద ఇవ్వవలసి ఉంది. (సీఐసీ, సీఎస్ డబ్ల్యూబీ ఓ, ఎ, 2017, 109115 అశోక్ కుమార్ వర్సెస్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కేసులో 17.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
నాగా ఒప్పందం ఫైళ్లు ఇవ్వండి: సీఐసీ
న్యూఢిల్లీ: నాగా తీవ్రవాదులతో ప్రభుత్వానికి కుదిరిన నాగా ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని హోంశాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ఆదేశించింది. ఈ ఒప్పందం పత్రాలను ఇవ్వాలంటూ దాఖలైన ఓ సమాచార హక్కు దరఖాస్తును హోంశాఖ తిరస్కరించటంపై సీఐసీ మండిపడింది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్‌కు చెందిన వెంకటేశ్ నాయక్ దరఖాస్తు చేయగా.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1) (ఏ) ప్రకారం వివరాలు అందజేయటం కుదరదని హోంశాఖ తెలిపింది. దీంతో నాయక్.. ప్రధాన సమాచార కమిషనర్ ఆర్ కమిషనర్ ఆర్కే మాథుర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐసీ నాగా ఒప్పందం వివరాలను వెంటనే తమకు ఇవ్వాలని ఆదేశించింది. -
పేజీ జిరాక్స్‌కు రూ.750!
న్యూఢిల్లీ: సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద రైల్వేను వివరాలు కోరే వారి వద్ద నుంచి ఒక్క పేజీ జిరాక్స్ కోసం ఏకంగా రూ.750లను వసూలు చేయడాన్ని ఆపేయాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఆర్టీఐ నిబంధనలకు లోబడి పేజీకి రూ.2 మాత్రమే తీసుకోవాలంది. రాయ్‌పూర్‌వాసి ప్రశాంత్ కాటెల ఫిర్యాదును విచారిస్తూ ముఖ్య సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాథుర్ ఈ ఆదేశాలిచ్చారు. టిక్కెట్టుతో ప్రయాణించిన వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల ట్రావల్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా రైల్వేను ప్రశాంత్ కోరాడు. అయితే పేజీకి రూ. 750 చెల్లించాలని కోరడంతో అప్పీలెట్ అథారిటీని ఆశ్రయించాడు. దీంతో కేంద్ర సమాచార కమిషన్ కు వెళ్లాడు. -
సీవీసీ, సీఐసీ బాస్‌ల ఎంపిక కోసం కసరత్తు
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) చీఫ్ పదవుల భర్తీపై ఇటీవలి లోక్ సభ సమావేశాల్లో దుమారం రేగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం సమావేశం కానుంది. సీఐసీ, సీవీసీ బాస్‌ల నియామకాలను ఖరారు చేసేందుకు ఈ సమావేశం జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జన ఖర్గే హాజరు కానున్నారు.సెంట్రల్ ఇనఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లోని కమిషనర్ల ఎంపిక కూడా ఈ సమావేశంలోనే జరగనుందని తెలిపాయి. సీవీసీ, సీఐసీలోని కొంతమంది అధికారుల పదవీ కాలం ముగియనుండటం, మరికొన్ని కమిషనర్ల పదవులు ఖాళీల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. కాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) లోక్‌పాల్‌ను నాశనం చేయటానికి పథకం ప్రకారం కుట్రచేస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. పారదర్శక పాలన అని డబ్బాలు కొట్టుకునే మోదీ సర్కార్ అత్యంత కీలకమైన కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్, సీఐసీ, లోక్‌పాల్ పదవులను నెలల తరబడి ఖాళీగా ఉంచటంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే కోర్టు వివాదాల కారణంగానే ఆయా పదవుల భర్తీలో ఆలస్యం జరుగుతోందని సోనియా విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. పారదర్శకతతో బహిరంగంగా సీఐసీ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించామని, సెర్చ్ కమిటీ రూపొందించిన తుది జాబితా పరిశీలన జరుగుతోందిని కేంద్ర సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుందని సమాచారం. -
కోర్టు ఉత్తర్వులు పాటించని ఆస్పత్రులపై చర్యలేవి?: సీఐసీ
న్యూఢిల్లీ: నిరుపేదలకు వైద్యసేవలు అందించని ప్రయివేటు ఆస్పత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఆరోగ్యశాఖ అధికారులను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు 2007లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీలతో భూములు పొందిన ప్రయివేటు ఆస్పత్రులు ఆర్థికంగా బలహీనులైన (నెలసరి ఆదాయం రూ. 4,000 కంటే తక్కువ) వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలోని మొత్తం పడకల్లో 10 శాతం వాటిని పేదలకు కేటాయించాలి. అలాగే ఔట్ పేషంట్ విభాగంలోని(ఓపీడీ) రోగుల్లో 25 శాతం మంది పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి. అయితే కోర్టు ఆదేశాన్ని అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సీఐసీ గుర్తించింది. ఇందుకు బాధ్యులైన ఆరోగ్య శాఖ సమాచార అధికారులైన ఆర్ఎన్.దాస్, లిలీ గాంగ్మైయికి రూ. 25 వేల మేర జరిమానా విధించింది. పిటిషినర్, బాధిత అధికారుల వాదన విన్న తర్వాత ఈ ఆలస్యం వెనుక స్వార్ధపూరిత ఆసక్తి, అవినీతి జరిగి ఉండవచ్చని సీఐసీ అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పింది. భవిష్యత్తులో కూడా కోర్టు తీర్పు అమలు జరుగుతుందనే ఆశ కలగడం లేదని సీఐసీ కమిషనర్ ఆచార్యులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రయివేటు ఆస్పత్రులకు లాభాలు చేకూర్చడానికి కాకుండా పేదవారికి సేవచేసేందుకు ఆరోగ్య శాఖ పనిచేయాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈ ఆస్పత్రుల నుంచి పన్ను వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నానన్నారు. వీటిని వసూలు చేయడంలో ఆలస్యం జరిగితే అది ప్రజలపై ప్రభావానికి కారణమవుతుందని, తద్వారా అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని ఆచార్యులు పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును రికవరీ చేయాలి ఢిల్లీ హైకోర్టు 2007లో ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రయివేటు ఆస్పత్రులు అక్రమంగా సంపాదించిన డబ్బును హెల్త్ డెరైక్టరేట్ రికవరీ చేయాలని రాకేశ్ కుమార్ గుప్తా సీఐసీలో ఫిర్యాదు చేశారు. ‘ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు వరుసగా ట్రాన్స్పరెన్సీ ప్యానల్ షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ వారు వాటిని పట్టించుకోలేదు. సమాచారాన్ని అందించాల్సిన అధికారులు ఆలస్యం చేస్తున్నారు’ అని పిటిషనర్ గుప్తా ఆరోపించారు. అంతేకాకుండా కొన్ని ఆస్పత్రులకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని, కానీ వాటి నుంచి డబ్బును రికవరీ చేయడానికి అధికారులు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల నుంచి అధికారులు పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని వారిపై సరైన చర్యలు చేపట్టడం లేదనే అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీఐ ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఉండడానికి అధికారులు కొత్త దారులు వెతుకుంటున్నారనే సంగతిని సీఐసీ కమిషనర్ ఆచార్యులు దృష్టికి పిటిషినర్ తీసుకెళ్లారు. ఇది ‘స్పెషల్ కమిటీ అధీనంలో ఉందని, కేసు పురోగతిపై తాము సమాధానం ఇవ్వాల్సిన పనిలేదని’ వారు చెబుతున్నారన్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంద నే దానికి సంబంధించిన కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఆరోగ్య సేవల విభాగం డెరైక్టర్ ఎన్వీ కామత్‌ను సీఐసీ ఆదేశించినట్లు రాకేష్ తెలిపారు. నివేదిక సమర్పించడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు అమలుకు సంబంధించిన ఫైలును అకారణంగా వివిధ విభాగాలు ఎందుకు అట్టిపెట్టుకున్నాయో చెప్పాలని ఆరోగ్య శాఖను సీఐసీ కోరినట్లు పిటిషినర్ తెలియజేశారు. -
సీఐసీ తొలి కమిషనర్ రాజీనామా ఫైళ్లు మాయం
న్యూఢిల్లీ: కేంద్ర సవూచార కమిషన్ (సీఐసీ)కి దాదాపు ఐదేళ్లపాటు సారథ్యం వహించిన తొలి సమాచార ప్రధాన కమిషనర్ వజాహట్ హబీబుల్లా రాజీనామాకు సంబంధించిన ఫైళ్లే సీఐసీ కార్యాలయుంలో మాయమయ్యూయి. ప్రభుత్వ సంస్థల్లో రికార్డులను, ఫైళ్ల సమచారాన్ని పర్యవేక్షించవలసిన సీఐసీ రికార్డుల రక్షణ వ్యవస్థ పనితీరునే ప్రశ్నార్థకంగా మార్చిన పరిణామం ఇది. తొలి చీఫ్ కమిషనర్ హబీహుల్లా రాజీనామాకు సంబంధించిన ఫైళ్లు పోయూయని, అవి దొరకలేదని సీఐసీ, సవూచార హక్కు చట్టం (ఆర్టీఐ)కింద దాఖలైన దరఖాస్తుకు స్పందనగా సమధానమిచ్చింది. పైళ్లు దొరకగానే వాటిగురించిన సవూచారం తెలియజేస్తామని సీఐసీ డిప్యూటీ కార్యదర్శి సుశీల్ తెలిపారు. -
డ్రైవర్ల కుంభకోణంపై దర్యాప్తు
న్యూఢిల్లీ: బస్సులు నడిపేందుకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో దృష్టి లోపమున్న వ్యక్తులను డ్రైవర్లుగా ఆమోదించడంపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. డ్రైవర్లను నియమించే ందుకు ఫిట్నె స్ సర్టిఫికెట్ ఇచ్చిన సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరపాలని సూచించింది. గురునానక్ కంటి విభాగం బస్సుడ్రైవర్లకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో అనేక లోపాలు ఉన్నాయని సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులుకు పంపిన ఫైల్లో డీటీసీ పేర్కొంది. దృష్టి లోపం లేదని గురునానక్ కంటి విభాగం ధ్రువీకరించిన 99 మంది అభ్యర్థుల్లో 91 మందిని డీటీసీ ఆరోగ్య విభాగం అనర్హులుగా గుర్తించింది. కాగా, ఢిల్లీ జీఎన్‌సీటీ వైద్య శాఖ నియమించిన స్వతంత్ర వైద్య బోర్డు కూడా సదరు 91 మంది అభ్యర్థులూ అనర్హులేనని నిర్ధారించినట్లు ఆచార్యులు పేర్కొన్నారు. కార్పొరేషన్లో అనర్హులైన డ్రైవర్లను నియమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ ఆరోగ్య సెక్రటరీ ఎస్సీఎల్ దాస్‌కు డీటీసీ చైర్మన్, ఎండీ కూడా అయిన రాజీవ్ వర్మ 2013 సెప్టెంబర్ 11న లేఖ రాశారని ఆచార్యులు తెలిపారు. గురునానక్ కంటి విభాగం అర్హులని ధ్రువీకరించిన అభ్యర్థుల్లో ఒకరు భారీ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని ఆయన తన లేఖలో ఉదహరించారని ఆచార్యులు వివరించారు. కాగా, ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కమిషన్ సూచించిందని ఆయన చెప్పారు. -
తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్‌గా దీపక్ సంధు
గత నాలుగేళ్లలో తొలిసారిగా ప్రధాన సమాచార కమిషనర్ స్థానానికి ఒక మహిళ ఎంపికయ్యారు. 1971 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణి అయిన దీపక్ సంధు ఈ గౌరవాన్ని పొందారు. రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణం చేయించగా, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. గతంలో ఆమె ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గాను, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గాను, ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గాను సేవలందించారు. 2009లో సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేన్స్, బెర్లిన్, వెనిస్, టోక్యో నగరాల్లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివళ్లలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే పలు అంశాలపై వివిధ దేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ సదస్సులలో కూడా ఆమె దేశం తరఫున పాల్గొన్నారు. 2005 నుంచే తాను సమాచార హక్కు కోసం పోరాడానని, అప్పట్లో ఈ అంశంపై పలువురితో చర్చించానని ఆమె తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడమే తన తొలి ప్రాధాన్యమని ఆమె చెప్పారు. అయితే, ఇప్పటికే ఆమె వయసు 64 సంవత్సరాలు కావడంతో మరో మూడునెలలు మాత్రమే ఆమెకు పదవీ కాలం ఉంది. కొత్త కమిషనర్లు నియమితులైతే పని త్వరగా జరుగుతుందని ఆమె చెప్పారు.