న్యూఢిల్లీ: నాగా తీవ్రవాదులతో ప్రభుత్వానికి కుదిరిన నాగా ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని హోంశాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ఆదేశించింది. ఈ ఒప్పందం పత్రాలను ఇవ్వాలంటూ దాఖలైన ఓ సమాచార హక్కు దరఖాస్తును హోంశాఖ తిరస్కరించటంపై సీఐసీ మండిపడింది.
కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్‌కు చెందిన వెంకటేశ్ నాయక్ దరఖాస్తు చేయగా.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1) (ఏ) ప్రకారం వివరాలు అందజేయటం కుదరదని హోంశాఖ తెలిపింది. దీంతో నాయక్.. ప్రధాన సమాచార కమిషనర్ ఆర్ కమిషనర్ ఆర్కే మాథుర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐసీ నాగా ఒప్పందం వివరాలను వెంటనే తమకు ఇవ్వాలని ఆదేశించింది.
నాగా ఒప్పందం ఫైళ్లు ఇవ్వండి: సీఐసీ
Published Mon, Apr 10 2017 8:01 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
Advertisement
Advertisement