న్యూఢిల్లీ: సరిహద్దులో సైనికుల ఘర్షణపై పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన చేయటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. తవాంగ్ ఘర్షణను చూపుతూ కాంగ్రెస్ మరేదో అంశంపై ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా రాయబారుల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో ఖర్చు చేశారని ఆరోపించారు.
‘సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. 5వ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది. ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతించి ఉంటే నేను సమాధానం ఇచ్చేవాడిని. 2006-06, 2006-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ 1.35 కోట్లు అందాయి. అది ఎఫ్‌సీఆర్‌ఏ ప్రకారం సరైనది కాదు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోంశాఖ రద్దు చేసింది. నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని స్పష్టం చేస్తున్నా.’ అని తెలిపారు హోంమంత్రి అమిత్ షా.
తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద యాంగ్‌త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది.
ఇదీ చదవండి: చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్
Comments
Please login to add a commentAdd a comment