Parliament winter sessions
-
జమిలి ఎన్నికల బిల్లు... రేపే లోక్‌సభ ముందుకు
న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సభ ముందు ఉంచనున్నారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. -
‘సారీ.. నో డేటా’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై సమగ్ర డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతోంది. ప్రకృతి వైపరిత్యాలు సహా దేశంలో పేపర్ లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో కులాల ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష వంటి కీలక అంశాలపై ఎలాంటి డేటాను నిర్వహించట్లేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంటోంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రుల నుంచి ‘నో డేటా’అన్న సమాధానమే తరుచుగా వస్తోంది. డేటా నిర్వహించట్లే.. రెండ్రోజుల కిందటే ఈ నెల 4న రాజ్యసభలో వయనాడ్ వరద బీభత్సం, ఈ విపత్తులో మరణించిన, గాయపడిన వివరాలపై రాజ్యసభ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలా ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల డేటాను ఈ మంత్రిత్వ శాఖ కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు’అని సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వయనాడ్ ప్రమాదంలో 359 మంది మరణించడం లేక తప్పిపోయారని, మరో 378 మంది గాయాల పాలయ్యారని కేరళ ప్రభుత్వం తమకు మెమొరాండం సమరి్పంచిందని వెల్లడించారు. నిజానికి వయనాడ్ దుర్ఘటన సమయంలో కేంద్రం ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపడంతో నష్టం అంచనాలు వేసినప్పటికీ అందుకు సంబంధించిన డేటా మాత్రం తాము నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటిలు, ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన కేసులపై డేటాను సైతం నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ ‘విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలలో ఎస్సీ,ఎస్టీల పట్ల వివక్షకు సంబంధించిన డేటాను కేంద్రం నిర్వహించదు’అని బదులిచ్చారు. ఇక కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్‌లపై డేటాను సైతం నిర్వహించడం లేదని ఈ నెల డిసెంబర్ 2న విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభకు తెలిపారు. ‘రిక్రూట్మెంట్తో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వివిధ సంస్థలు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. పరీక్షల నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖ నిర్వహించదు‘అని తెలిపారు. ఇక దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలు చేసుకున్న మెడికల్ ఇంటర్న్‌ల డేటాను సైతం కేంద్రం నిర్వహించడం లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ రాజ్యసభకు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన మెడికల్ ఇంటర్న్‌ల సంఖ్య గురించి సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. -
Parliament Session Updates: లోక్‌సభ శుక్రవారానికి వాయిదా
న్యూఢిల్లీ, అప్డేట్స్: రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ చేసిన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసననిషికాంత్ దూబే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్విదేశీ పెట్టుబడిదారుడికి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు ఉన్నాయన్న నిషికాంత్ దూబేమోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతిని అణగదొక్కడానికి అంతర్జాతీయ కుట్ర పన్నారని ఆరోపణదూబే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి లోక్‌సభ రేపటికి(శుక్రవారానికి) వాయిదాస్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం జీరో అవర్‌ను ప్రారంభించగా.. విపక్ష సభ్యులు లేచి నిలబడి, సంభాల్ హింసాత్మక పరిస్థితులపై సభలో చర్చించాలని పట్టుబట్టారు.దూబే తన ప్రజెంటేషన్‌ను పూర్తి చేసిన తర్వాత సంభాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ బిర్లా హామీ ఇచ్చారు.అయినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేస్తునన్నట్లు ప్రకటించారు.ప్రతిపక్ష పార్టీల తీరుతో చాలా బాధపడ్డాను: కిరన్ రిజుజుశీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల తీరుతో చాలా బాధపడ్డాను.తొలి రోజు నుంచే బిల్లులు, రాజ్యాంగంపై చర్చ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించాం. కానీ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎందుకు నిరసన చేస్తున్నాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి పార్లమెంట్ వెలుపల ఎందుకు నాటకాలాడుతున్నారు. ఇదనే సభ నడిచే తీరు; పార్లమెంట్ హౌస్ అంటే చర్చలు జరగాలి. కానీ వారు రంగురంగుల బట్టలు వేసుకుని పార్లమెంట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు.భారతదేశం వెలుపల కొన్ని గ్రూపులు పన్నిన కొన్ని కుట్రల గురించి, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత ప్రయోజనాలపై దాడి చేయడంపై నేడు మన ఎంపీలలో కొందరు చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఇవి చాలా తీవ్రమైన విషయాలుకానీ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వానికి సంబంధం లేని మరికొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సమస్యలను లేవనెత్తుతూ పార్లమెంటు ఆవరణ చుట్టూ తిరుగుతున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలతో చాలా బాధపడ్డాను’ అని రిజుజు అన్నారు. సంభాల్ హింసాకాండ, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై గందరగోళం మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.ప్రతిపక్షాలు అన్ని చోట్లా ఓడిపోతాయి: బీజేపీ ఎంపీ రవికిషన్‘హర్యానాలో ఓడిపోయారు. మహారాష్ట్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఓడిపోతారు. అందుకే వారి బాధ ఇక్కడ చూపిస్తున్నారు’ అని కిషన్ అన్నారు.మధ్యాహ్నం 12 వరకు రాజ్యసభ వాయిదాపార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం రోజు ప్రారంభమయ్యాయి. అదానీ వ్యవహారంపై లోక్‌సభ రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ విచారణ జరపలేరని అన్నారు. ఎందుకంటే అలా చేయాలంటే తనను తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు.మోదీ ఔర్ అదానీ ఏక్ హై. దో నహీ హై, ఏక్ హై(మోదీ, అదానీ ఒకటే.. ఇద్దరు కాదు)అని పేర్కొన్నారు.#WATCH | Delhi: Opposition MPs, including LoP Lok Sabha Rahul Gandhi protest over Adani matter, at the Parliament premises. pic.twitter.com/BuBDGDnT7f— ANI (@ANI) December 5, 2024కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ గురువారం లోక్‌సభలో ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రాథమిక హక్కుల తిరస్కరణ’పై చర్చను కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ.. ఇది ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఠాగూర్ పేర్కొన్నారు.మరోవైపు నేడు లోక్‌సభ రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024పై చర్చను కొనసాగించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు, 2024, విపత్తు నిర్వహణ చట్టం, 2005ని సవరించడానికి ముందుకు తీసుకురానున్నారు. ఇక భారతీయ వాయుయన్ విధేయక్, 2024పై రాజ్యసభలో చర్చ జరగనుంది. -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
పార్లమెంట్లో వాయిదాల పర్వం.. అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో,16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ వెలుపల విలేకరులతో చెప్పారు. ‘పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. రేపటి నుంచి పార్లమెంట్ సజావుగా జరిగేలా మనమందరం చేసుకున్న ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని రిజిజు పేర్కొన్నారు.అయితే అన్ని అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాని అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.కాగా గతవారం (నవంబర్25) ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ హింస, మణిపూర్ అంశం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. -
ఇండియా కూటమి ఎంపీల కీలక భేటీకి టీఎంసీ డుమ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అదానీ అవినీతి అంశం, ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ హింసాకాండ ఘటనలు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతుండటంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సమావేశమయ్యారు.ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు రాగా.. ముఖ్యంగా ఉభయసభల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.. అయితే ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ హింస అంశం వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలనుకుంటున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అదానీ వ్యవహారంపై మాత్రమే ఒత్తిడి చేయాలనుకుంటోందని.. దీంతో నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రధాన అంశాలు ఎజెండాలో లేనప్పుడు సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ నేతలు తెలిపినట్లు పేర్కొన్నాయి.మరోవైపు అదానీ గ్రీన్‌పై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలపై చర్చించే వరకు హౌస్‌లోని కార్యకలాపాలను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సోమవారం ఉదయం కూడా కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అదానీ సమస్యపై చర్చించేందుకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల ఎంపీలు ఫెంగల్ తుఫాను కారణంగా సంభవించిన నష్టం, మసీదు సర్వేపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింస, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసులను లక్ష్యంగా చేసుకోవడం, పంజాబ్‌లో వరి సేకరణలో జాప్యం వంటి అనేక ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరపాలని పట్టుబడుతున్నారు. -
పార్లమెంట్లో ఆగని రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. అదానీ అంశంతోపాటు మణిపూర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో జరిగిన హింసాకాండపైనా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించాయి. ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు నాలుగో రోజు శుక్రవారం సైతం స్తంభించాయి. లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నియంతృత్వం నశించాలి, అదానీని అరెస్ట్ చేయాలి అనే నినాదాలతో సభ మార్మోగిపోయింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కొందరు ఎంపీలు మాత్రం సభను పదేపదే అడ్డుకొంటూ ప్రజల ఆకాంక్షలు వినిపించకుండా చేస్తున్నారని స్పీకర్ ఓంబిర్లా మండిపడ్డారు. విపక్ష సభ్యుల తీరుపట్ల ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్యం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన ఆగలేదు. చేసేది లేక సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యçసభలోనూ ఇదే రీతిలో విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. అదానీ గ్రూప్‌పై వచి్చన అవినీతి ఆరోపణలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఇచి్చన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. రూల్ నెంబర్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇవ్వడాన్ని విపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాయని తప్పుపట్టారు. దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. -
నేటి నుంచే పార్లమెంట్ సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్లో సమావేశాల్లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జగదాంబికా పాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈవారం సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. దానిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుని ఆమోదించే అవకాశాలున్నాయి. 26న పాత పార్లమెంట్ భవనంలోప్రత్యేక కార్యక్రమం భారతæ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగవు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఉభయ సభల ఎంపీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ «ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు సంస్కృతం, మైథిలీ బాషలతో కూడిన భారత రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ‘అదానీ, మణిపూర్’పై చర్చించాలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతోపాటు 30 పారీ్టల నేతలు పాల్గొన్నారు. అదానీపై గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ సంక్షోభం, వాయుకాలుష్యం, రైలు ప్రమాదాలపై విస్తృతంగా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీ అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ సహకరించాలని కోరారు. -
Winter Parliament Session 2023: పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం
న్యూఢిల్లీ: ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్‌సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023ను ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్(పీఆర్బీ) చట్టం–1867 ప్రకారం పత్రికలను రిజిస్టర్ చేసుకోవాలంటే ఎనిమిదంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీనిని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునే వారు ఒకే ఒక విడతలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్ట్ 3వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. -
ఇంతకన్నా మంచి మార్గాలు లేవా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్‌సభ, రాజ్యసభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. ఈ అంతరాయాలు మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే దీన్ని చూస్తున్నారు. మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు డిమాండ్ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం, వివాదాస్పద అంశాలపై చర్చించడానికి విధానపరమైన యంత్రాంగాలు లేకపోవడమే. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుత ప్రతిష్టంభన ఫలితంగా ఇది కనివిని ఎరుగని పరిస్థితికి దారితీసింది. పార్లమెంటు శీతాకాల సమా వేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్‌సభ, రాజ్య సభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా లోపంపై హోంమంత్రి ప్రకటన చేయా లని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంటు భద్రత అనేది సున్ని తమైన అంశమనేది ప్రభుత్వ వైఖరి. ఇది లోక్‌సభ సెక్రటేరియట్ పరిధిలోకి వస్తుంది. స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ విచారిస్తోందని సభకు స్పీకర్ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశంలో వచ్చిన కొన్ని సూచనలను అమలు చేశారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. మన పార్లమెంటులో రాజకీయ పార్టీ/కూటమి పాత్రతో సంబంధం లేకుండా, చాలా సంవ త్సరాలుగా ఒక సుపరిచిత కథనం వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఒక ముఖ్యమైన అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం తప్పించుకుంటోంది. నిజానికి ఈ రోజు మనం చూస్తున్న అంత రాయాలు, క్రమశిక్షణా ప్రతిస్పందనలు... మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలు మన పార్లమెంటరీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం 1960వ దశకంలో మొదలైంది. తాము ముఖ్యమైనవిగా భావించిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడానికి సభాపతి తమకు తగిన అవకాశం ఇవ్వడం లేదని భావించిన కొందరు ఎంపీలు ఈ పనిలోకి దిగారు. మూడవ లోక్‌సభ (1962–67) సభ్యులు రామ్ సేవక్ యాదవ్, మనీరామ్ బాగ్రీ వంటి ఎంపీలు పార్లమెంటరీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పీకర్ పదేపదే హెచ్చరించేవారు. వివిధ సందర్భాల్లో పదేపదే అంతరాయం కలిగించడంతో సభ నుండి వారిని ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభ తన కార్య కలాపాల నుండి మినహాయించిన మొదటి పార్లమెంటేరియన్లు వారే కావచ్చు. మూడవ లోక్‌సభ తన పదవీకాలం ముగిసే సమయానికి, ఏకంగా ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. మన పార్లమెంటరీ చర్చలలో అంతరాయాలు ఆనవాయితీగా మారబోతున్నాయని ఇది సూచించింది. అప్పటి నుండి, ఎంపీలు పార్లమెంటు కార్యకలా పాలకు అంతరాయం కలిగించిన ఘటనలు, దాని కోసం క్రమశిక్షణకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కాలక్రమేణా, పార్లమెంటరీ అంతరాయాలు నెమ్మదిగా రాజకీయ సాధనంగా మారాయి. ఈ మారుతున్న ధోరణి గురించి పలువురు సభాపతులు నొక్కి చెప్పారు. ‘చాలా సందర్భాలలో, సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అవి యాదృచ్ఛికంగా జరగలేదు. ఉద్దేశపూర్వకంగా అరుస్తూ, సభ వెల్‌లోకి ప్రవేశించడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయడం, పార్లమెంటు పనిచేయడా నికి అనుమతించకూడదనే ఉద్దేశమే ఇక్కడ కనబడుతోంది’ అన్నారు 14వ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ. కానీ మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు సూచించవచ్చు, డిమాండ్ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. పైగా సమస్యంతా అందులోనే ఉంది. ప్రతిపక్ష ఎంపీలు సభలో మాట్లాడలేకపోతే, అది నిరంతరం అంతరాయాలకు దారి తీస్తుంది. ఇప్పటివరకు, సంస్థాగత ప్రతిస్పందన ఏమిటంటే, అంతరాయం కలిగించే ఎంపీలను శిక్షించ డమే. కానీ ఇటీవలి సంఘటనలు చూపించినట్లుగా, ఈ విధానం పనిచేయనిదిగా మారింది. పైగా, అంతరాయానికి చెందిన స్వభావం క్రమంగా పరిణామం చెందినప్పటికీ, పార్లమెంట్ సంస్థాగత ప్రతిస్పందన సరళంగానే ఉంటూ వచ్చింది. ఏమాత్రం మారలేదు. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే ఇది ఇప్పటికీ అంతరా యాలను చూస్తుంది. సమస్యలో కొంత భాగం పార్లమెంటును మనం చూసే విధానంలో కూడా ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు మన జాతీయ శాసన సభను ప్రభుత్వ వ్యవహారాల కోసం ఉద్దేశించిన ఒక సంస్థగా రూపొందించారు. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటును సమావేశపరిచే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. పార్లమెంటరీ ప్రక్రియ నియమాలు ఈ ఆలోచనా విధానాన్ని బలపరిచాయి. ఈ నియమాలు స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ మూసపై ఆధారపడి ఉన్నాయి. వలస ప్రభుత్వ వ్యవహారాలకు ప్రాధాన్యత ఉండేలా చూడటం వారి ఉద్దేశం. ఈ భావనకు అదనంగా, వెస్ట్‌మినిస్టర్ పార్ల మెంటరీ సూత్రం ప్రకారం, పార్లమెంటును సజావుగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అత్యున్నతమైన శాసన నిర్మాణం, జవాబుదారీతనం ఉన్న ప్రాతినిధ్య సంస్థను చూసే లోపభూయిష్ట మార్గం ఇది. ఇది పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారాన్ని, దానిలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. నిజానికి చట్టసభలు అనేవి సహకార స్థలాలు. ఇక్కడ ఖజానా(ప్రభుత్వం), ప్రతిపక్షాలు రెండూ కలిసి దేశానికి మంచి ఫలితం కోసం పని చేయాలి. ఎన్నికైన ప్రభుత్వ పాత్ర ఏమిటంటే శాసన, ఆర్థికపరమైన ప్రాధాన్యతలను నిర్ణయించడం. ప్రతిపక్షాల బాధ్యత ఆ ఆలోచనలను వ్యతిరేకించడం లేదా ప్రత్యామ్నాయాలను సూచించడం, అంతరాలను ఎత్తి చూపడం ద్వారా వాటిని బలోపేతం చేయడం. ఈ విధానం ఇప్పుడు ఆచరణ సాధ్యం కానిదిగా మారింది. సభను నడపటం సభాపతికి సాధ్యం కాదని 2005లో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వ్యాఖ్యానించారు. ‘సభ్యుల సమూహం సభలను నడపనివ్వకుండా మొండిగా వ్యవహరిస్తే, దానిని నియంత్రించడం చాలా కష్టం.’ పార్లమెంటు సమర్థవంతంగా పనిచేయాలంటే ఎంపీలను శిక్షించడం సరిపోదు. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. ప్రస్తుతం, ముఖ్యమైన శాసనపరమైన, విధానపరమైన అంశాలను చర్చించడానికి ప్రైవేట్ సభ్యులకు మాత్రమే ప్రతి శుక్రవారం రెండున్నర గంటల సమయం లభిస్తుంది. అయితే, పార్లమెంటులో నిర్దిష్ట చర్చ జరగాలని ఎంపీల బృందం కోరే యంత్రాంగం లేదు. చర్చను బలవంతం చేయడానికి వారికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం, అవిశ్వాస తీర్మానమే. బహుశా, పార్లమెంటు సమావేశాల క్యాలెండర్లో ప్రతి పక్షాల కోసం నిర్దిష్ట రోజులను చేర్చడం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. హౌస్ ఆఫ్ కామన్్స లాగా, ప్రతిపక్షాలు ముఖ్య మైనవిగా భావించే సమస్యలపై చర్చించడానికి ఈ రోజులను కేటాయించవచ్చు. పార్లమెంటులో ఇటీవలి అంతరాయాలు, చాలామంది ఎంపీల సామూహిక సస్పెన్షన్ మన జాతీయ శాసనసభకు మేల్కొలుపు పిలుపు అనే చెప్పాలి. అత్యున్నత చర్చా వేదికగా పార్లమెంటు ఖ్యాతి ప్రమాదంలో ఉందని ఈ సంఘటనలు నొక్కి చెబుతాయి. చర్చను పెంపొందించడానికి పార్లమెంటు మెరుగైన పరిష్కారాలను కను గొనవలసి ఉంటుంది. లేదంటే దానిపై ప్రజల విశ్వాసం నెమ్మదిగా క్షీణించే ప్రమాదం ఉంది. చక్షు రాయ్ వ్యాసకర్త పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్‌లో పనిచేస్తున్నారు. -
కాసేపట్లో రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
ఢిల్లీ: రెండో రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేట్లో ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా మరికాసేపట్లో పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి చర్చించనుంది. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, విదేశాంగ విధానం, సరిహద్దుల్లో పరిస్థితులపై ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చకు అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇప్పటికే కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య (బీఎస్) బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఈ సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. -
పార్లమెంట్ సమావేశాలు.. రాఘవ్ చద్ధా సస్పెన్షన్ ఎత్తివేత
Live Updates.. ► పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు 2023ని రాజ్యసభ సోమవారం ఆమోదించింది. 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని సవరణ చేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ► ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు. What for he is smiling & showing victory sign.. AAPtards are so shameless https://t.co/umCm6DyX5J — mic---jey 👽 (@seasurfer99) December 4, 2023 రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా. Winter Session of Parliament | Rajya Sabha adjourned till 2 pm pic.twitter.com/PkSg0oyj0F — ANI (@ANI) December 4, 2023 లోక్‌సభలో ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు.. ►సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును లోక్‌సభను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ►వరంగల్ జిల్లా ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం ►ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ►లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా Winter Session of Parliament | Lok Sabha adjourned till 12 noon amid ruckus in the House. pic.twitter.com/DBAyWiNtMJ — ANI (@ANI) December 4, 2023 ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ►లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సమావేశాలను ప్రారంభించారు. ►పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీలు మోదీ అంటూ నినాదాలు చేశారు. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మోదీ అంటూ నినదించారు. #WATCH | BJP MPs raise the slogan of "Teesri Baar Modi Sarkar" and "Baar Baar Modi Sarkar" in Lok Sabha in the presence of Prime Minister Narendra Modi, as the winter session of the Parliament commences. pic.twitter.com/nZp0YqkQMH — ANI (@ANI) December 4, 2023 ►పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలి. బీజేపీ సుపరిపాలనకు ప్రజలు ఓటు వేశారు. మూడు రాష్ట్రాల్లో విజయం బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. విపక్షాలు నెగిటివ్‌గా ఆలోచించడం మానుకోవాలని సూచనలు చేశారు. #WATCH | Winter Session of Parliament | PM Narendra Modi says, "...Rajnaitik garmi badi tezi se badh rahi hai. Yesterday, the results of the four-state elections came out. The results are very encouraging - encouraging for those who are committed to the welfare of the common… pic.twitter.com/CqzAk1AFHH — ANI (@ANI) December 4, 2023 ►పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆప్ పార్టీ మీటింగ్. రాజ్యసభలోని మల్లికార్జున్ ఖర్గే గదిలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. #WATCH | Delhi: All party meeting underway at the office of LoP in Rajya Sabha, Mallikarjun Kharge ahead of the commencement of the Winter Session of Parliament today. pic.twitter.com/uO6fVgyA9F — ANI (@ANI) December 4, 2023 ►పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ►బీజేపీ నేతల పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ విక్టరీ గుర్తు చూపించారు. BJP MPs, including JP Nadda, Pralhad Joshi and Gajendra Singh Shekhawat, show a victory sign at the Parliament. pic.twitter.com/AhwT4ju9d0 — ANI (@ANI) December 4, 2023 ►నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. ►అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజునే అంటే ఈ రోజే క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తన నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ►ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తుంది. ►అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ►అంతేకాదు IPC, CRPC , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ఈ సమావేశాలలో సమ్పర్పించనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023 , ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం
-
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు: అమిత్ షా
న్యూఢిల్లీ: సరిహద్దులో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేయటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. తవాంగ్ ఘర్షణను చూపుతూ కాంగ్రెస్ మరేదో అంశంపై ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా రాయబారుల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో ఖర్చు చేశారని ఆరోపించారు. ‘సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. 5వ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది. ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతించి ఉంటే నేను సమాధానం ఇచ్చేవాడిని. 2006-06, 2006-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ 1.35 కోట్లు అందాయి. అది ఎఫ్సీఆర్ఏ ప్రకారం సరైనది కాదు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోంశాఖ రద్దు చేసింది. నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని స్పష్టం చేస్తున్నా.’ అని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్ -
ఆ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్‌లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కల్గిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల భేటీకి హాజరై షాకిచ్చిన ఆ రెండు పార్టీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యకక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొని అందరిని ఆశ్యర్యానికి గురి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యకక్షుడైన ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో విపక్షాల నేతగా కూడా కొనసాగుతున్నారు. బుధవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదురొర్కొనేందుకు పార్లమెంట్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించడానికి, ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. వామపక్షాలతోపాటు డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీడీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ భేటీకి ఆప్, తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరవ్వడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య చర్చలకు నిలయం పార్లమెంట్ అని పేర్కొన్నారు. భావసారూప్యత గల పార్టీలతో కలిసి ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని స్పష్టం చేశారు. Parliament is the abode of democratic deliberation. We, the like-minded parties will strongly raise all the issues relevant to our people. PM @narendramodi ji, you spoke about opposition getting more chance to participate, therefore we expect the Govt to walk its talk. 1/2 pic.twitter.com/T5faKJo1j3 — Leader of Opposition, Rajya Sabha (@LoPIndia) December 7, 2022 ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇస్తామన్న ప్రధాని మోదీ, తన మాటను నిలబెట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగే అన్ని చర్చలకు తాము సహకరిస్తామన్నారు. అయితే ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంలో హడావుడి చేయకుండా పరిశీలన కోసం జాయింట్ లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆయన సూచించారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
పార్లమెంట్ సమావేశాలు: సింగరేణి బొగ్గు గనుల వేలంపై రగడ
03:400PM సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంటులో రగడ మొదలైంది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సింగరేణిలో కేంద్రం వాటాను బీజేపీ అమ్మేస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటామని అడిగినా.. తమ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సింగరేణిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ఉమ్మడి ఓనర్షిప్ ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి 51 శౠతం ఓనర్ షిప్ ఉందన్నారు. ఆక్షన్ మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, పారదర్శకంగా ఆక్షన్ వేస్తున్నానమని పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ సర్కార్‌కు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. అన్ని రాష్టట్రాల ప్రభుత్వాలు కూడా తమకు సహకరిస్తున్నాయని, ఆక్షన్ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందన్నారు. 03:00PM పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్ పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని అన్నారు. తమ వద్ద ఉన్న ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవిని ప్రభుత్వం గుంజుకున్నట్లు అధిర్ ఆరోపించారు. పార్లమెంట్లో విపక్షాలకు ఎటువంటి అధికారం దక్కకుండా చూస్తున్నారని అధిర్ విమర్శించారు. అక్టోబరులో క్యాబినెట్ ఆమోదించిన మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై గల సమస్యను కూడా అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భూభాగాన్ని ఆక్రమిస్తోందని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని. ఇది స్వయంప్రతిపత్తి, బహుళ-రాష్ట్ర సహకార సంఘాల పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. #WATCH | Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury raises the issue of denying parliamentary standing committee chairmanships to Opposition parties in Lok Sabha. (Video: Sansad TV) pic.twitter.com/pmiNMxI33F — ANI (@ANI) December 7, 2022 02:00PM ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాద సమస్యను లేవనెత్తారు. “కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మహారాష్ట్రకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. కర్ణాటకలో మహారాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని, మహారాష్ట్రపై కర్ణాటక చేస్తున్న దాడిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. 12:50PM లోక్‌సభ తిరిగి ప్రారంభమైన క్రమంలో జీరో అవర్‌లో అత్యవసర ప్రజా సమస్యలపై చర్చ చేపట్టారు సభ్యులు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు.. రాజ్యసభలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు అభినందనల తీర్మానంపై మాట్లాడుతున్నారు. 11:20AM సూపర్‌స్టార్‌కు సంతాపం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల లోక్‌సభ సంతాపం తెలిపింది. సంతాప సందేశం చదివిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు స్పీకర్. Lok Sabha adjourned till 12 pm after the reading of the obituaries, on the first day of the Winter Session of Parliament. pic.twitter.com/xit1eInltC — ANI (@ANI) December 7, 2022 ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌గా విధులు స్వీకరించిన జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారారన్నారు. 11:00AM పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభ్యులను కోరారు ప్రధాని మోదీ. Winter Session of the Parliament commences, visuals from the Lok Sabha. pic.twitter.com/UWPiLslA8t — ANI (@ANI) December 7, 2022 అన్ని పార్టీలు చర్చకు విలువనిస్తాయని విశ్వసిస్తున్నా: మోదీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాది ఆగస్టు 15, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. అలాగే.. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం లభించిన క్రమంలో జరుగుతున్న సమావేశాలని పేర్కొన్నారు. ‘గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చలకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ► సంస్మరణ ప్రకటన తర్వాత లోక్‌సభ గంటపాటు వాయిదా పడనుంది. అయితే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాత్రం సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సంస్మరణార్థం ఒక పూట వాయిదా వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022 మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఎంసీ సైతం పాల్గొంది. ► ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌పై సైబర్ దాడి జరిగిన ఘటనపై చర్చించాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఎంపీ మానికం ఠాగూర్. ► విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. ► దేశవ్యాప్తంగా నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, ఎగసిన ధరలు, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సంసిద్ధమవుతున్నాయి. ► 29వ తేదీ వరకు అంటే 23 రోజుల్లో 17 సిట్టింగ్‌లలో ఈసారి సెషన్ కొనసాగనుంది. ► ఈసారి సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ► పార్లమెంట్ సమావేశాలు మొదలైన మరుసటి రోజే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆ ఫలితాల ప్రభావం ఈ సమావేశాలపై పడనుంది. ► అయితే.. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్లలో బిజెపి తిరిగే అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. ► పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు పెరుగుతున్న జీఎస్టీ పనులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ ► దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని టీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలతో కలిసి అంశాలపై పోరాడతామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు. ► ఇక ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించించింది ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసే లక్ష్యంతో కాంగ్రెస్ చైనా సరిహద్దు వెంట పరిస్థితులు, కేంద్ర ఎన్నికల సంఘంలో ఆకస్మిక నియామకాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, పైపైకి పోతున్న ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదని వెల్లడించింది ఆ పార్టీ. ఈసారి 16 బిల్లులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్, నటుడు ఘట్టమనేని కృష్ణ, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తదితరులకు ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్చేయాలంటూ రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని బంధోపాధ్యాయ్ కోరారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన భేటీలో బంధోపాధ్యాయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ విభజన అంశాలే ప్రధాన ఎజెండా: వైఎస్ఆర్సీపీ పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు, పెరుగుతున్న జీఎస్టీ పన్నులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని, విపక్షాలతో కలిసి అన్ని అంశాలపై పోరాడతామని తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. మరోవైపు.. ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, చైనాతో ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు, దేశ ఆర్థిక స్థితిగతులు, చైనాతో సరిహద్దు సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ండటం తదిరాలను సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ శనివారం పార్టీ నాయకురాలు సోనియాగాంధీ నివాసంలో సమావేశమైంది. విపక్షాలతో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తామని పార్టీ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈసారి సమావేశాలకు దూరం కానున్నారు. నా వ్యాఖ్యల వక్రీకరణ: ఖర్గే అహ్మదాబాద్: ప్రధాని మోదీని రావణుడని తాను ప్రత్యేకంగా అనాల్సిన పని లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గుజరాత్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మోదీ ముఖమే. అలా అనేలా చేసుకుంది వాళ్లే’’ అన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఆప్ ప్రయత్నిస్తోందన్నారు. -
పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు!. ఆయనతో పాటు పలువురు సీనియర్లు సైతం సమావేశాలకు గైర్హాజరు కాబోతున్నారని సమాచారం. రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యాత్రంలో పలువురు నేతలు కూడా రాహుల్ వెంట ఉన్నారు. ఈ క్రమంలో.. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండానే యాత్రను కొనసాగించాలని రాహుల్, ఆ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారం(డిసెంబర్ 7వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎవరు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం ప్రతిపక్ష నేత ఎంపిక విషయంపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. ఎంపిక చేయబడిన ఏఐసీసీ కీలక సభ్యులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఇది వరకు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఉండేవారు. అయితే.. ఆయన అధ్యక్ష పదవి చేపట్టడంతో ఇప్పటికీ ఆయన స్థానంలో మరొకరి నియామకం జరగలేదు. దీంతో ఆయన్నే కొనసాగించాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: కవితకు నోటీసులిస్తే రాష్ట్రం ఉద్యమించాలా? -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు
-
ఇదేనా ప్రజాస్వామ్యం?
మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది. నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం. ఈ విడతలో లోక్‌సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్‌సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్‌సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం. ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్‌సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్‌నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న. భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్‌సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్‌సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది! -
వ్యక్తిగత విమర్శలు.. శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు.. అధికార పార్టీని.. ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్‌ను ఉద్దేశించి.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. సహనం కోల్పోయిన జయా బచ్చన్.. సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు.. మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి.. విమర్శించలేదు కానీ.. ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్న వారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ) ఈ సందర్భంగా భువనేశ్వర్ కల్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మీరు న్యాయంగా ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. మీ నుంచి మేం ఏం ఆశిస్తాం.. సభలో ఏం జరుగుతుందో చూస్తున్నారా.. మనం చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. దానిలో ఉన్న లోటుపాట్లను మనం చర్చించి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ జయా బచ్చన్ ప్రసంగించసాగారు. (చదవండి: మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ) జయా బచ్చన్ ఇలా మాట్లాడుతుండగా.. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా.. ఆమె కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి.. ఆరోపణలు చేశారు. పనామా పేపర్స్ వ్యవహారంలో జయా బచ్చన్ కోడలు.. ఐశ్వర్య రాయ్ ఈడీ విచారణకు హాజరైన సంఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జయా బచ్చన్.. ‘‘త్వరలోనే మీ జీవితంలోకి దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. చదవండి: సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి -
Cryptocurrency Bill: క్రిప్టో బిల్లు ఇక లేనట్లేనా?
క్రిప్టోకరెన్సీ బిల్లు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు నుంచే మొదలైన హడావిడి. ప్రైవేట్ క్రిప్టో అడ్డుకట్టవేయడం, ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలకూ ఈ సమావేశాల్లోనే లైన్ క్లియర్ అవుతుందని అంతా భావించారు. అయితే బిల్లు డ్రాఫ్ట్ సర్వం సిద్ధమైందన్న ఆర్థిక మంత్రి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం కావడం, మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బిజినెస్ న్యూస్ ఏజెన్సీ బ్లూమరాంగ్.. క్రిప్టోకరెన్సీ బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రాకపోవచ్చనే ఓ కథనం ప్రచురించింది. మరో మూడు రోజుల్లో (డిసెంబర్ 23తో) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మలమ్మ చెప్పినా కూడా.. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలు మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో ఆమధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు దాదాపు ఖరారు చేసేసుకున్నారు. కానీ, బిల్లు ఇప్పటికీ కేబినేట్ అనుమతి పొందలేదు. వేగిరపాటు వద్దనే.. సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావించారు. నిజానికి క్రిప్టో బిల్లు ప్రస్తావనను శీతాకాల సమావేశాల షెడ్యూల్లో చేర్చిన కేంద్రం.. పార్లమెంట్ వెబ్సైట్లో సైతం ఆ విషయాన్ని పేర్కొంది. కానీ, ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్గానీ, ప్రత్యేక ఆర్డర్‌గానీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక.. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం, నియంత్రణపై స్పష్టమైన చేర్పులతో కూడిన చట్టం చేయవచ్చనే(పార్లమెంట్ సమావేశాలు లేకున్నా చట్టం చేసే వెసులుబాటు ఉండడం) అంచనా. అంశాలు.. క్రిప్టోకరెన్సీ బిల్లు (నియంత్రణ)పై ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. అందులో అంశాల గురించి మాత్రం విస్తృత చర్చ జరిగింది. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది. కానీ, కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా లేదు. క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరించిందని, క్రిప్టో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇరవై నుంచి యాభై కోట్ల జరిమానా, ఏడాదిన్నర శిక్ష.. ఇలాంటి అంశాలు చేర్చిందని గతంలో బ్లూమరాంగే ఓ కథనం ప్రచురించింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ నియంత్రణను ఆర్బీఐకి, క్రిప్టో ఆస్తుల పర్యవేక్షణ(నియంత్రణ)ను సెబీకి అప్పగించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. దాదాపు కోటిన్నరమంది ఇన్వెస్టర్లు.. 45 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఆస్తుల్ని కలిగి ఉన్నారు. -
లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశాయి. నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ బిర్లా వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు. -
పార్లమెంట్‌పై దాడికి 20 ఏళ్లు.. అమరులకు ఉభయ సభల నివాళి
సోనియా గాంధీ అభ్యంతరం దేశంలో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని అనే వాఖ్యాన్ని సీబీఎస్ఈ టెన్త్ ఇంగ్లిష్ పేపర్లో ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతవారం సీబీఎస్ఈ నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని క్వశ్చన్ రావడాన్ని సోనియా ఖండించారు. దీనిపై సీబీఎస్ఈ వెంటనే స్త్రీలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్లో డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో సోమవారం ఈ అంశాన్ని సోనియా లేవెనెత్తారు. కేంద్ర విద్యాశాఖపై దీనిపై పూర్తిస్థాయి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 11: 05 AM ► లోక్‌సభలో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చించారు. 10: 55 AM ► రాజ్యసభను తాత్కాలికంగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 10: 35 AM ► రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్షపార్టీల నేతలతో సమావేశమయ్యారు. కాగా,12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో చర్చిద్దామని అన్నారు. 10: 05 AM ► పార్లమెంట్ ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. అమరులు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుదన్నారు. వారి త్యాగం దేశ పౌరులకు ప్రేరణ అందిస్తూనే ఉంటుందని వారు పేర్కొన్నారు. ► పార్లమెంట్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొని అమరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. 09: 45 AM ► కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ద్రవ్యోల్బణం అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 09: 35 AM ► న్యాయమూర్తుల వేతనాలు, సేవల సవరణ బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది గతంలో లోక్‌సభలో ఆమోదం పొందింది. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సభ ప్రారంభమైంది. పార్లమెంట్‌పై ముష్కరులు దాడికి పాల్పడి 20 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో.. దాడులను తిప్పికొట్టడంలో భాగంగా అమరులైన కుటుంబాలకు ఉభయ సభలు నివాళులు అర్పించాయి. సభ్యులు అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తమ తమ స్థానాల్లో నిలబడి మౌనం పాటించారు. లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు 2001, డిసెంబరు 13 న పార్లమెంట్‌పై దాడిచేశారు. ఆ తర్వాత.. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనిలో ఒక పౌరుడు, మరో భద్రత సిబ్బందితో పాటు 14 మంది ప్రాణాలు కొల్పోయారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పార్లమెంట్లో దాదాపు 100 మంది సభ్యులున్నారు. -
మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎన్డీఏకి చెమటలు పట్టిస్తున్నాయి. పలు అంశాలపై విపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేసి.. గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఇలాంటి సందర్భంలో పలువురు బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు.. సమావేశాలకు హాజరు కాకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చాలామంది బీజేపీ ఎంపీలు మీటింగ్‌లకు, పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం లేదని.. ఇది ఇలానే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సమాచారం. (చదవండి: Amit Shah: పొరపాటు వల్లే కాల్పులు) ఎంపీలు, మినిస్టర్లు ప్రవర్తన మార్చుకోకపోతే.. మార్చాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని మోదీ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు క్రమశిక్షణతో మెలగాలని పదే పదే సూచించే మోదీ.. ఈ సారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. క్రమశిక్షణతో మెలగాలని.. సమయపాలన పాటించాలని.. చిన్న పిల్లల మాదిరి కుంటి సాకులు చెప్పవద్దని సూచించారట. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించని బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ సమావేశాలకు, మీటింగ్‌లకు అందరూ క్రమం తప్పకుండా హాజరుకావాల్సిందే. పిల్లలకు చెప్పినట్లు.. పదే పదే దీని గురించి మీతో చర్చించడం నాకు బాగా అనిపించడం లేదు. మీరు మారకపోతే.. మార్పులు చేయాల్సి వస్తుంది’’ అని మోదీ హెచ్చరించారు. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు అమిత్ షా, పీయుష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, పార్లమెంటు వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు హాజరయ్యారు. (చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!) పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు పలు అంశాలపై మోదీ ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగాలాండ్‌లో పౌరులపై సైనిక కాల్పుల పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి సమయంలో మద్దతుగా.. ఏకతాటిపై నడవాల్సిన ఎంపీలు సమావేశాలకు డుమ్మా కొట్టడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం -
Amit Shah: పొరపాటు వల్లే కాల్పులు
న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలకు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తృణమూల్ మినహా ప్రతిపక్షాల వాకౌట్ అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాటమాత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డాయి. షా ప్రకటనను నిరసిస్తూ సభను నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్‌చేశాయి. (చదవండి: Maharashtra: ప్రేమించి, పారిపోయి పెళ్లి.. గర్భిణీ అక్క తల నరికిన తమ్ముడు.. తీసుకొని) హైదరాబాద్ నైపర్‌కు ‘జాతీయ’ హోదా బిల్లుకు లోక్‌సభ ఆమోదం హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(నైపర్)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు నైపర్(సవరణ) బిల్లు–2021ను ఆరోగ్య మంత్రిæ మాండవియా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే నైపర్‌లకు ఒకేరకమైన జాతీయ హోదా లభిస్తుందని తెలిపారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టంలో దొర్లిన తప్పిదాన్ని సరిచేయడానికి సవరణ బిల్లు–2021ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. సోమవారం కూడా ఆందోళనకు దిగాయి. దీంతో నాలుగు సార్లు సభ వాయిదాపడింది. రాజ్యసభలో నినాదాల మధ్యే నాగాలాండ్ ఘటనపై షా ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. చదవండి: నాగాలాండ్ రాష్ట్రం మోన్ జిల్లాలో దారుణం -
క్రిప్టోకరెన్సీపై అవన్నీ ఊహాగానాలే!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలన్నీ ప్రచారమవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని ఆమె పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ‘ఆర్బీఐ కరెన్సీ, డిజిటల్ కరెన్సీలకు ఆమోదం!, క్రిప్టో ఎస్సెట్’.. ఇలా రకరకాల కథనాలు కొన్ని మీడియా హౌజ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందించారు. వివిధ అవసరాలకు క్రిప్టో టెక్నాలజీని వినియోగించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం తప్ప దేశీయంగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలన్నింటిని నిషేధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయని మంత్రి సంకేతాలు అందించారు. ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీని.. అధికారిక కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేం చేయలేదంటూ ఇంతకు ముందు ఆర్థిక మంత్రి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లోబల్ క్రిప్టో మార్కెట్: ఒమిక్రాన్‌తోనూ లాభాలు.. కానీ, భారత పరిణామాలతో ఢమాల్ -
పార్లమెంట్ సమావేశాలు: రాజ్యసభ వాయిదా
LIVE UPDATES Time 04:02 PM ►దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు త్వరలో చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ మంత్రి నిషికాంత్ దూబే బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. Time 03:11 PM ►పార్లమెంట్లో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది Time 02:36 PM ► సాగు చట్టాలకు వ్యతిర్కేంగా దేశ రాజధానిలో నిర్వహించిన ఆందోళనలో ఎంత మంది రైతులు మృతి చెందారనే దానికి సంబంధించి కేంద్రం దగ్గర రికార్డులు లేకపోవడం సిగ్గుచేటని విపక్ష మంత్రి మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు. Time 12:15 PM ► 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న అంశాన్ని మరో సారి మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తడంతో సభ రసాభసగా మారింది. దీంతో సభ సజావుగా సాగని పరిస్థతి ఏర్పడేసరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. Time 11:25 AM ► లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు. సభ్యులు మాట్లాడుతుంటే నినాదాలు చేయడం సరికాదని, సభ ప్రజల గొంతు వినిపించడం కోసం ఉందని సూచించారు. సభలో గందరగోళం కొనసాగడంతో మధ్యాహ్నం గం. 12.00 వరకు స్పీకర్ వాయిదా వేశారు. Time 11:15 AM ► సభ వెల్‌లోకి విపక్ష ఎంపీలు వెళ్లడంతో సభ గందరగోళంగా మారింది. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ టిఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు కూడా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. గందరగోళం నడుమ రాజ్యసభను 12 గంటలకు వాయిదా వేశారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 3 రోజు సభ ప్రారంభమైంది. మొదటి రోజు నుంచి రాజ్యసభలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 3 రోజైన బుధవారం 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే అంశం సభను రసాభసగా మార్చింది. -
వేడెక్కిస్తున్న సభాసమయం!
ప్రజాసమస్యలు చర్చించడానికి అత్యున్నత వేదిక. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయడానికి వీలు కల్పించే పవిత్ర భూమిక. చట్టసభలకు, సభ్యులకు మహోన్నత లక్ష్యం, లక్షణాలు చాలానే! కానీ, పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం మొదలైన తీరు చూసినప్పుడు ఆవేదన కలగక మానదు. సమస్యలనూ, చేయాల్సిన చట్టాలనూ చర్చించాల్సిన వేదిక ఆ బాధ్యతలో విఫలమవు తోందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. వివాదం రేపిన నూతన సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును చర్చ లేకుండా పార్లమెంట్ ఆమోదించిన తీరు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోపక్క గడచిన వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ 12 మంది రాజ్య సభ సభ్యులను ఈ సమావేశాలు మొత్తానికీ సస్పెండ్ చేయడం సైతం చర్చనీయాంశమైంది. బల్లల మీదెక్కి, కాగితాలు చించి విసిరికొట్టి, మార్షల్స్‌తో అనుచిత ప్రవర్తనకు పాల్పడడమే కాక ఎదురు పాఠాలు చెబుతారేమిటని రాజ్యసభ ఛైర్మన్ ప్రశ్నిస్తున్నారు. సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఏకతాటి మీదకు వచ్చి, మంగళవారం రాజ్యసభను బాయ్‌కాట్ చేశాయి. క్షమాపణ చెబితే తప్ప, సస్పెన్షన్ ఎత్తివేయమన్నది ప్రభుత్వ వాదన. బిగుస్తున్న పీటముడిని చూస్తుంటే, ఈ పార్లమెంట్ సమావేశాలూ కృష్ణార్పణమేమోనన్న భయం కలుగుతోంది. చట్టసభల్లో చర్చల కన్నా వాదోపవాదాలు, గందరగోళాలే ఎక్కువ జరుగుతున్నాయన్న అప్రతిష్ఠకు ఆజ్యం పోస్తోంది. అధికారపక్షం నుంచి ప్రతిపక్షాల దాకా అందరికీ ఈ తిలాపాపం తలా పిడికెడు. గత సమావే శాల్లో పెగసస్ సహా అనేక అంశాలు సభ ముందున్నాయి. ఆ సమయంలో ఆవేశాలు పెరిగిన ఆగస్టు 11న పెద్దలసభలో సభ్యుల ప్రవర్తనకు... అప్పుడు కాక, ఈ సమావేశాల్లో కొరడా ఝళిపించడం ఏమిటన్నది ప్రశ్న. శిక్ష విధించే ముందు నిందితుల వాదనా వినడం ధర్మం. కానీ, సస్పెన్షన్ విధించే ముందు సదరు సభ్యులకు సమాచారమివ్వలేదు, వాదనను వినలేదన్నది మరో బలమైన విమర్శ. ఈ మొత్తంలో పార్లమెంటరీ పద్ధతులనే పాటించలేదన్న ఆరోపణకు జవాబులు వెతకాల్సి ఉంది. ఇక, ఏడాది పాటు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనకు కూర్చోవడానికి కారణం – కొత్త సాగు చట్టాలు. వాటిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదిస్తున్నప్పుడు జరిగిన చర్చ శూన్యం. ఇప్పుడా చట్టాల్ని రద్దు చేస్తూ సోమవారం బిల్లు ప్రవేశపెట్టినప్పుడూ, చర్చ హుళక్కి. దాదాపు 750 మంది దాకా రైతుల బలిదానానికి కారణమైన చట్టాలపై చర్చ అప్పుడూ లేదు, ఇప్పుడూ చేయలేదేమిటన్న ఆవేదన సమంజసమైనదే. బయటి వేదికలపై ఏడాదికి పైగా చర్చోపచర్చలు జరిగిన అంశంపై ప్రజా ప్రతినిధుల సభలో చర్చే లేకపోవడం దేనికి సంకేతం? చట్టాల రద్దు బిల్లునూ చర్చే లేకుండా నాలుగే నిమిషాల్లో లోక్‌సభలో ఆమోదించడం ఎలా చూసినా ప్రశ్నార్హమే. ఏకంగా 11 విడతల చర్చలు జరిపినా, రైతు నిరసనకారులను ప్రభుత్వం ఒప్పించలేకపోయిన చట్టాలవి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిన అంశం అది. జాతీయ ప్రయోజనాల రీత్యా ప్రధాని వాటిని వెనక్కితీసుకోవడం హర్షణీయమంటూ మంత్రులు సోషల్ మీడియాలో ప్రకటించారు. కానీ, ఆ ప్రయోజనాలేమిటో చట్టసభలో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? పంటలకు రైతులు కోరుతున్న కనీస మద్దతు ధర చట్టం, లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన లాంటì వాటిపై చర్చించాలన్న కోరిక న్యాయం కాదా? జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ క్షమాపణలు చెప్పడం, ట్వీట్లు పెట్టినంత మాత్రాన అవి పార్లమెంటులో జరగాల్సిన చర్చకు ప్రత్యామ్నాయం అవుతాయా? అయినా మెజారిటీ ఉంది కాబట్టి, చర్చలతో పని లేదనుకుంటే, పార్లమెంటరీ సూత్రాలకే అది దెబ్బ! ఎలాంటి చట్టమైనా చేసే ముందు దానిపై క్షుణ్ణంగా చర్చే ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ ఉన్న పెద్ద తేడా. అందుకోసమే సభలో చర్చించడమే కాక, అవసరాన్ని బట్టి సెలక్ట్ కమిటీలు, పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపే ఏర్పాటు కూడా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ, ఇప్పుడు అలా జరుగుతోందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తొలి విడత పాలనలో కేవలం 25 శాతం బిల్లులు, రెండో విడతలో 10 శాతం బిల్లులే ఆ అదృష్టానికి నోచుకున్నాయట. అందుకే రాజ్యాంగం పవిత్రం, పార్లమెంట్ దేవాలయం అనడం బాగున్నా, దాన్ని ఏ మేరకు ఆచరిస్తున్నామో అఖిలపక్ష సమావేశానికి సైతం రాని పాలకులు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఇక సహచర రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో ఈ శీతకాల సమావేశాల్ని పూర్తిగా బహిష్కరించాలని కూడా కొన్ని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు వార్త. ఇది మరింత బాధాకరం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చేమో కానీ, ప్రజా ప్రతినిధులు పదే పదే బహిష్కరణ మంత్రం పఠిస్తే... అది బాధ్యతను విస్మరించడమే. అలాగే, చట్టసభలో అనుచిత ప్రవర్తనను ఎవరూ సమర్థించరు. అలాంటివారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. అలాగని కక్ష సాధించినట్టు ఉండకూడదు. అధికారంలో ఉన్నవారే పెద్ద మనసుతో, పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, ఇరుపక్షాలూ భీష్మించుకొని పార్లమెంటరీ ప్రతిష్టంభనకు కారణమైతే, 26 బిల్లులు సభ ముందుకు రానున్న ఈ సమావేశాలూ వృథాగా ముగిసిపోతే అది మరింత శోచనీయం. దాని వల్ల ఆర్థిక నష్టం పదుల కోట్లలో ఉంటుందేమో కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కలిగే నష్టం మాత్రం కంటికి కనిపించనంత! కొలిచి చెప్పలేనంత!! అన్ని పక్షాలూ ఆలకించి తీరాల్సిన ప్రజాస్వామ్యవాదుల మొర ఇది!! -
పార్లమెంట్ సమావేశాలు: ఉభయ సభలు బుధవారానికి వాయిదా
Live Updates: ► పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది. ► పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. ► అంతకు ముందు త్వరలో డెంగ్యూ, టీబీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. Time 12:04 PM ► సభలో 93% ఎంపీలు సక్రమంగా నడపాలని కోరుకుంటుండగా, కేవలం కొంతమంది ఎంపీలు మాత్రమే అంతరాయాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. Time 12:02 PM.. ఆంధ్రప్రదేశ్‌కి తక్షణ సాయం విడుదల చేయండి ►ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో లేవనెత్తారు. నవంబర్ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయని తెలిపారు. తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Time 11:56AM.. విపక్ష పార్టీల సమావేశానికి దూరంగా టీఎంసీ ►పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రెండో రోజు జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ సహా 16 పార్టీల నేతలు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. Time 11:41AM ► ఓ పక్క విపక్షాల ఆందోళనలు, మరో పక్క కొంతమంది ఎంపీలు రాజ్యసభను నుంచి వాకౌట్ చేయడంతో సభ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు Time 11:31AM.. సస్పెన్షన్‌పై ఛైర్మన్ వెంకయ్య నాయుడు వివరణ ►12మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. సస్పెషన్ తొలగించాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. గత సమావేశాల్లో సభ్యులు విధ్వంసం సృష్టించారని .. వారిని సస్పెండ్ చేయడం న్యాయమే అన్నారు. చెయిర్‌కు క్షమాపణలు చెబితేనే.. సస్పెన్షన్ వేటును వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేశారు. అయితే క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్న కాంగ్రెస్ సహా పలు విపక్షాలు.. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. Time 11:24AM.. విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌పై చర్చ.. క్షమాపణలు చెప్పం ► సస్పెన్షన్ అంశం రాజ్యసభను వేడెక్కిస్తోంది. రాజ్యసభ నుంచి 12మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు భేటీ అయ్యాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశమైన విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌పై చర్చించారు. టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే.కేశవరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే, రాజ్యసభ సెషన్‌ను బాయ్‌కాట్ చేయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. Time 11:20AM ► పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వరుసగా రెండోరోజూ లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభలో 12మంది ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పలుమార్లు విజ్ఞప్తిచేసినా.. విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్, నేషనర్ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గందరగోళం నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. Time 11:12AM ► రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తారు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని విజప్తి చేశారు. ► సస్పెన్షన్ ఎత్తివేసే ఆలోచనే లేదని స్పష్టం చేసిన చైర్మన్ వెంకయ్య నాయుడు Time 11:00AM ► గందరగోళం నుడుమ పార్లమెంట్ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ లోక్‌సభలో డిమాండ్ చేస్తోంది. న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు రెండో రోజు సమావేశమవుతోంది. మంగళవారం లోక్‌సభ ముందుకు రీప్రొడక్టివ్ టెక్నాలజీ(రెగ్యులేషన్) బిల్లు, 2020ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు(శాలరీస్ అండ్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్) బిల్లు 2021ని సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. రాజ్యసభ నుంచి 12మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు భేటీ అయ్యాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశమైన విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌పై చర్చించారు. టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే. కేశవరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే, రాజ్యసభ సెషన్‌ను బాయ్‌కాట్ చేయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. అయితే క్షమాపణలు చెబితేనే సస్పెన్షన్ తొలగిస్తామని కేంద్రం అంటోంది. -
పోలవరంపై హైపవర్ కమిటీ భేటీ రద్దు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ రద్దయింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత హైపవర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరంతో సహా 16 జాతీయ ప్రా జెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో హైపవర్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భేటీ వర్చువల్ విధానంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ శుక్రవారం ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కావడం.. లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర జల్ శక్తి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పంకజ్‌కుమార్ వాటిలో నిమగ్నమయ్యారు. దాంతో హైపవర్ కమిటీ సమావేశాన్ని రద్దు చేశారు. -
పార్లమెంటులో హింసాత్మక ధోరణి.. 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 2021 చివరి రోజున రాజ్యసభలో హింసకు పాల్పడిన 12 మంది విపక్ష ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు విధించారు. వీరంతా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సభకు హాజరుకాకుడదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా అసాధారణ దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన కారణంగా వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేసిన వారిలో ఆరుగురు కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన నేత ప్రియాంక చతుర్వేది, అనిత్ దేశాయ్, టీఎంసీ డోలా సేన్, శాంతా ఛెత్రి, సీపీఎం నేత ఎలమరం కరీం, మరో సీపీఐ నేత ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11న లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చించాల్సిందిగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలు మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెలుగు చూశాయి. (చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!) జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేసినప్పటికీ దాన్ని ఆమోదించడంతో సభ దద్దరిల్లింది. ఇక సీసీటీవీ ఫుటేజీలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో భద్రతా సిబ్బంది మీదకు దూసుకెళ్లడం కనిపించింది. నల్లజెండాలు చేతపట్టుకున్న ఎంపీలు టేబుల్స్ పైకిఎక్కి ఫైళ్లు, పత్రాలు చెల్లాచెదురు చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. (చదవండి: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు) మహిళా మార్షల్స్‌పై విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయని ప్రభుత్వం ఆరోపించగా, ప్రతిపక్షం ఒక ఉమ్మడి ప్రకటనలో "మహిళా ఎంపీలతో సహా ప్రతిపక్ష నాయకులు, సభ్యులపై చేయి చేసుకోవడానికిగాను ప్రభుత్వం బయటి వ్యక్తులను తీసుకువచ్చింది" అని ఆరోపించింది. ఈ క్రమంలో నాటి హింసాత్మక ఘటనకు సంబంధించి 12 మంది ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్ -
మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మహిళా ఎంపీలపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఏం జరిగింది అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ నేత శశి థరూర్ తన ట్విటర్లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. Who says the Lok Sabha isn’t an attractive place to work? With six of my fellow MPs this morning: @supriya_sule @preneet_kaur @ThamizhachiTh @mimichakraborty @nusratchirps @JothimaniMP pic.twitter.com/JNFRC2QIq1 — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ‘‘బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్ కామెంట్ చేయడం ఎంత వరకు సబబు. అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి సార్’’ అంటూ ఓ రేంజ్లో శశి థరూర్‌ని ట్రోల్ చేశారు నెటిజనులు. (చదవండి: ఐటీఐఆర్.. లేదంటే అదనపు ప్రోత్సాహకం ) సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్ కావడంతో శశి థరూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. (చదవండి: శశిథరూర్ ఇంగ్లీష్‌పై ఫన్నీ వీడియో.. నెక్స్ట్ ఇమ్రాన్ ప్లీజ్!) The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ఈ సెల్ఫీలో శశి థరూర్‌తో పాటు టీఎంసీకి చెందిన నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి, తమిజాచి తంగపాండియా ఉన్నారు. చదవండి: మోదీ కన్నీళ్లపై కాంగ్రెస్ ఎంపీ ఫన్నీ కౌంటర్ -
పార్లమెంట్లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు
కోల్‌కతా: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో సమన్వయం చేసుకోవడంపై తమకు ఆసక్తి లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇతర పక్షాలకు సహకారం అందిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న నిర్వహించనున్న ప్రతిపక్షాల భేటీకి తాము హాజరుకాబోమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు శనివారం చెప్పారు. కాంగ్రెస్ ముందు అంతర్గతంగా సమన్వయం చేసుకోవాలని, సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ తర్వాతే ఇతర పార్టీలతో సమన్వయంపై ఆలోచించాలని సూచించారు. అధికార బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ నేతల్లో అంకితభావం కనిపించడం లేదని తప్పుపట్టారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అసమర్థ పార్టీ అని తృణమూల్ ఆరోపిస్తోంది. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శిస్తోంది. -
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. చదవండి: ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్ కొట్టివేత ఉభయసభల్లో చేపట్టనున్న బిల్లుల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్లాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు కూడా ఉండటం గమనార్హం. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పెంచేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా తాత్కాలికంగా దఖలుపడిన అధికారాలను చట్టరూపంలో శాశ్వతం చేయనుంది. చదవండి: సాగు చట్టాల నివేదిక విడుదల చేయండి నాలుగునెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎస్టీ, ఎస్సీ కులాల జాబితాలో మార్పుచేర్పులు చేసే చట్టాన్ని కూడా కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. త్రిపుర ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది. హైకోర్టు– సుప్రీంకోర్టు జడ్జీల (సర్వీసు నిబంధనలు, వేతనాలు) సవరణ బిల్లు–2021ను కూడా కేంద్రం రాబోయే సమావేశాల్లో ఉభయసభల ముందుంచనుంది. మనుషుల అక్రమ రవాణా (నిరోధం, రక్షణ, పునరావాసం) బిల్లు–2021 కూడా ఈ 26 బిల్లుల జాబితాలో ఉంది. నవంబరు 29న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు డిసెంబరు 23వ తేదీదాకా జరిగే విషయం తెలిసిందే. -
క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!
క్రిప్టోకరెన్సీపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23న ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం సుమారు 26 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో క్రిప్టోకరెన్సీ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 'క్రిష్టొకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు" ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. క్రిప్టోపై కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి రానుంది. మరోవైపు అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించనున్నుట్లు తెలుస్తోంది. ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని..! క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాగా క్రిప్టోకరెన్సీపై ఓ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. Crypto bill is listed for the #WinterSession #IndiaWantsCrypto https://t.co/Lr4aHdJjhl — Nischal (WazirX) ⚡️ (@NischalShetty) November 23, 2021 చదవండి: ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట.. ఏడాదిలో రూ.25 లక్షలు లాభం! -
29 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 దాకా నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(సీసీపీఏ) ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. గత ఏడాదిన్నరగా నిర్వహిస్తున్నట్లుగానే శీతాకాల సమావేశాలను కూడా కోవిడ్–19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్, వర్షాకాల సమావేశాలను కుదించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల, జమ్మూకశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదుల దాడులు, లఖీంపూర్ ఖేరిలో హింస, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం తదితర అంశాలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. -
ఎవరికీ నష్టం లేదు : సమానత్వాన్ని కాలరాస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా తన వాదనను వినిపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని, 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించిన అమిత్ షా.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికీ అన్యాయం జరగబోదని, ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయాలు, అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా నిజానికి మైనారిటీలు హక్కులు పొందుతారని, విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పౌరసత్వ సవరణ బిల్లుపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు అతి పెద్ద తప్పిదమని, ఈ అసమగ్ర బిల్లు కొన్ని వర్గాలపై వివక్ష చూపేలా ఉందన్నారు. ఆర్టికల్ 14, 15, 21, 25, 26లకు వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
నేను ఉల్లిగడ్డలు పెద్దగా తినను!
న్యూఢిల్లీ: సాధారణంగా ఉల్లిగడ్డలు కొస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ, ఇప్పుడు ఉల్లిని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధర అమాంతం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఉల్లి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లి సెగ తాజాగా పార్లమెంటును తాకింది. లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉల్లిధరలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. అయితే, ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమది ఉల్లిపాయలు ఎక్కువగా తినే కుటుంబం కాదని చెప్పుకొచ్చారు. ‘నేను ఉల్లి, వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి నేను వచ్చాను’ అని ఆమె వివరించారు. ఉల్లి ధరలు అమాంతం ఎందుకు పెరిగిపోయాయని సూప్రియా సూలె కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు చిన్న, సన్నకారు ఉల్లి రైతులను కూడా కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం భేటీలో ఆయన మాట్లాడారు. అయితే, జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం కోరింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సభా నిబంధనలు, నియమాల మేరకు అన్ని అంశాలపై చర్చించేందుకు, మాట్లాడేందుకు అన్ని పక్షాలకు అవకాశం కల్పిస్తామని, వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సమావేశాలు ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. నిర్మాణాత్మక చర్చల ద్వారానే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుందని ప్రధాని అన్నారని అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ,అమిత్‌షా, గులాంనబీ ఆజాద్, విజయసాయిరెడ్డి తదితరులు ఫరూక్ అబ్దుల్లాపై హామీ ఇవ్వని ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం నిర్బంధించిన ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ఫరూక్‌ను నిర్బంధించడంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఎంపీ హస్నైన్ మసూదీ ప్రస్తావించారు. ఫరూక్‌ను పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వానికి ఉందని మసూదీ పేర్కొన్నారు. ‘కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సభలో ఈ అంశంపై పట్టుబడతాం’ అని ఆయన తెలిపారు. ‘ఒక పార్లమెంట్ సభ్యుడిని చట్ట విరుద్ధంగా ఎలా నిర్బంధిస్తారు? ఫరూక్ అబ్దుల్లాతోపాటు జైల్లో ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కూడా పార్లమెంట్ సమావేశాలకు అనుమతించాలి’అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయన్నారు. స్టాండింగ్ కమిటీలకు పంపకుండానే అన్ని బిల్లులను ఆమోదించేలా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అన్ని అంశాలపై చర్చకు అవకాశమిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. సభలో మాత్రం మరోవిధంగా వ్యవహరిస్తుందని ఆజాద్ ఆరోపించారు. అయితే, ఫరూక్ అబ్దుల్లా విడుదలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల్లో కోత, వ్యవసాయ సంక్షోభంపై తప్పనిసరిగా చర్చించాలని సభలో కోరతామని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని పాశ్వాన్ ప్రస్తావించారు. హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి థావర్‌చంద్ గహ్లోత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధురి, గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నేత ఆనంద్ శర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వి.విజయసాయి రెడ్డి, టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సహా 27 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, ఆర్థికమాంద్యం, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగడం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో ఈసారి ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెరిగిన బలం, అయోధ్య వివాదంపై ఇటీవలి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు బీజేపీలో విశ్వాసం పెంచాయి. ఎన్డీయే కూటమి ‘ఉమ్మడి కుటుంబం’ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. మోదీ సహా హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ ఈ కూటమిని ఉమ్మడి కుటుంబంగా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నట్లే పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయన్నారు. ఈ చిన్న సమస్యల వల్ల కుటుంబం దెబ్బతినే పరిస్థితి రాకూడదన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా తోడ్పడాలని కోరారు. సభ్య పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం ప్రత్యేకంగా కన్వీనర్ లేదా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎల్జేపీ, అప్నాదళ్, జేడీయూ వంటి పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్డీయేలో సరైన సమన్వయం ఉంటే మహారాష్ట్రలో బీజేపీ–శివసేనల మధ్య ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయేదని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఎంపీల గైర్హాజరు ఆందోళనకరం: వెంకయ్య న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు ఎంపీలు గైర్హాజరవుతుండ టంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీల ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై చర్చించేందుకు పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఇటీవల సమావేశం కాగా 28 మందికి గాను నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. అందులో కమిటీ సభ్యుడిగా ఉన్న ఢిల్లీకి చెందిన ఏకైక ఎంపీ గౌతమ్ గంభీర్ ఆ భేటీకి రాకుండా ఇండోర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేస్తూ కనిపించారు’అని వెంకయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హిందూ వివాహ, విడాకుల చట్టం–1952 మొదలుకొని ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు–2019 వరకు, 1953లో ధోతీలపై అదనపు ఎౖMð్సజ్ పన్ను నుంచి 2017లో జీఎస్టీ అమల్లోకి తేవడం వరకు రాజ్యసభ పయనం సుదీర్ఘంగా సాగిందని వెంకయ్య అన్నారు. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని రూ.250 వెండి నాణెం, పోస్టల్‌స్టాంపును విడుదల చేయనున్నామ న్నారు. కాగా, రాజ్యాంగం ఆమోదం పొంది70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందన్నారు. అరుదైన సందర్భం.. 67 ఏళ్ల రాజ్యసభ చరిత్రలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న సందర్భాన్ని ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’ పుస్తకం వివరించింది. ‘మే 8, 1991న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతోంది. అధికార, విపక్షాలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో సభ డెప్యూటీ చైర్మన్‌గా ఉన్న ఎంఏ బేబీ విపక్షాలకు అనుకూలంగా ఓటేశారు’ అని వివరించింది. పౌరసత్వ బిల్లు సహా 35 బిల్లులు నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది. పౌరసత్వ బిల్లులో ఏముంది? 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హిందు, బౌద్ధ, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ మతాలకు చెందిన వారిని భారత పౌరులుగా గుర్తించేందుకు వీలు కల్పించేందుకు పౌరసత్వ సవరణ బిల్లులో వీలు కల్పించారు. దీంతోపాటు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గింపు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్ డేటా ప్రొటెక్షన్) బిల్లు, అన్ని రకాలైన వివక్ష నుంచి ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌పై నిషేధం బిల్లు, జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్టీగా కాంగ్రెస్ చీఫ్‌కు ఉన్న హోదాను రద్దు చేయడంతోపాటు ఆ ట్రస్ట్ సభ్యులను తొలగించే అధికారాలను ప్రభుత్వానికి కల్పించే బిల్లు ఉన్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో పార్లమెంట్ భవనం -
ఏపీ సమస్యల ప్రస్తావనకు సమయమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కేటాయించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీలో స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, వైఎస్సార్ సీపీ, ఫ్లోర్‌లీడర్ మిథున్‌రెడ్డి సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం మంజూరు చేయాల్సిన నిధులు, ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు, పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ దూరం పెంపు, కొత్త మెడికల్ కాలేజీల సాధనపై పోరాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా ఎంపీలు కలసికట్టుగా కృషి చేస్తారని మిథున్‌రెడ్డి మీడియాకు తెలిపారు. -
నవంబర్ 18 నుంచి పార్లమెంట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలు సమావేశాలు నవంబర్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు సంకేతాలిచ్చాయి. డిసెంబర్ 13 వరకు జరిగే అవకాశముందన్నాయి. పార్లమెంటు తేదీల ఖరారుపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం కమిటీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో భేటీ అయింది. సమావేశాల తేదీలపై వచ్చే వారంలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. పెద్దల సభలో ఇక సులువే! విపక్ష పార్టీల ఎంపీల రాజీనామాలతో ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలోనూ సానుకూల పరిస్థితి నెలకొంటోంది. బుధవారం కాంగ్రెస్‌కు మరో ఎంపీ దూరమయ్యారు. శీతాకాల సమావేశాలు మొదలయ్యేలోపు విపక్షాల నుంచి మరి కొందరూ రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నా యి. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి బుధవారం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 45కి తగ్గింది. 243 (ఇద్దరు నామినేటెడ్ సభ్యులను మినహాయించి) సభ్యుల రాజ్యసభలో ఎన్డీయేకు 106 మంది సభ్యుల మద్దతుంది. మిత్ర పక్షాలుగా భావించే అన్నాడీఎంకేకు 11 మంది, బీజేడీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో రాజ్యసభలో బిల్లులను విపక్షాలు అడ్డుకునే పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు. -
పార్లమెంటును కుదిపేసిన ‘రఫేల్’
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రఫేల్ విమానాల కొనుగోలు విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. శుక్రవారం నాలుగో రోజు సమావేశాలు వాడివేడిగా సాగాయి. రఫేల్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా, అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. రఫేల్ డీల్‌లో సుప్రీం కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయుధంగా మలుచుకుంది. రఫేల్ ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ క్షమాపణలు చెప్పాలని విదేశాంగ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. రఫేల్ ఒప్పందంపై చర్చకు పట్టుపడుతున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను నిలిపివేయాల్సిందిగా కోరారు. ‘కావేరీ’పై అన్నా డీఎంకే ఆందోళన రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టగా, అన్నా డీఎంకే ఎంపీలు కావేరీ నదీ జలాల సమస్యపై ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. రఫేల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఓ వ్యాపారికి మేలు చేసేలా రఫేల్ కొనుగోలు వ్యవహారం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ విషయంలో నష్టపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుపట్టింది. ప్రతిపక్షాలు ఆందోళనలు ఆపేయకపోవడంతో ఆఖరికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. -
11 నుంచి పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ చెప్పారు. డిసెంబర్ 11 నుంచి 2019, జనవరి 8 వరకు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమావేశాల మధ్యలో వారం రోజుల విరామం ఇస్తామన్నారు. మొత్తంమీద 20 రోజుల పాటు పార్లమెంటు జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు వీలుగా సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నామన్నారు. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అలాగే భారత వైద్య మండలి సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లు ఆర్డినెన్సులను ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 11నే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం గమనార్హం. -
‘శీతాకాల’ పార్లమెంటు
సాధారణంగా నవంబర్ మధ్యలో ప్రారంభమై దాదాపు నెల రోజులపాటు జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈసారి డిసెంబర్ 15న ప్రారంభమై సెలవు లన్నీ పోగా మొత్తం 13 రోజులపాటు కొనసాగి శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే కీలకమైన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, రాజ్యసభలో మాత్రం దానికి చుక్కెదురైంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రధాని ఆధ్వ ర్యంలో అఖిలపక్ష సమావేశం జరగడం... దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించి, వాటి పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలని అధికార, విపక్ష సభ్యులు ఏకాభిప్రాయానికి రావడం రివాజు. ఆ తర్వాత ఏదో ఒక సమస్య ముంచుకొచ్చి పెద్ద రగడ జరగడం, వాదోపవాదాలతో సభలు దద్దరిల్లడం కూడా మామూలే. ప్రతిపక్షాలు ప్రతిష్టకు పోయే సమస్య ఏర్పడితే చెప్పనవసరమే లేదు... రోజుల తరబడి నిరవధికంగా సభలు వాయిదాలతో గడిచిపోతాయి. ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ఎన్డీయే ప్రభుత్వం ఢిల్లీ వాతా వరణాన్ని కారణంగా చెప్పినా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానితో సహా అధికార పక్ష నేతలందరూ తలమునకలై ఉండటం వల్లనే ఇలా జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘దేశద్రోహం’ ఆరోపణలు ఈసారి సమావేశాలను తుడిచి పెట్టేస్తాయన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి. సమావేశాల తొలిరోజునే ఆ వివాదం ఉభయసభలనూ కుదిపేసింది. ఒక వారమంతా ఒడిదుడుకుల్లోనే గడిచి పోయింది. మన్మోహన్ పాకిస్తాన్‌తో కలిసి కుట్ర చేసినట్టు ఆధారాలుంటే అవి బయటపెట్టాలని కాంగ్రెస్ సవాల్ చేసింది. మోదీ క్షమాపణ చెబితే తప్ప శాంతిం చబోమని హెచ్చరించింది. ప్రధానిని మీరు దూషించలేదా అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగింది. బహుశా తలాక్ బిల్లు వంటి కీలకమైన బిల్లును లోక్‌సభలో ఈ సమావేశాల సమయంలోనే ఆమోదింపజేసుకోవాలన్న సంకల్పం బీజేపీకి లేకపోయి ఉంటే ఈ వివాదం అవిచ్ఛిన్నంగా కొనసాగి ఉండేది. కానీ రెండు ప్రధాన పార్టీలూ తెరవెనక ఎడతెరిపి లేకుండా పరస్పరం చర్చించుకున్నాయి. వివాదంపై ఉభయ సభల్లో తమ తమ పార్టీల తరఫున చెప్పదల్చుకున్నదేమిటన్న అంశాలకు సంబంధిం చిన ముసాయిదాను ఒకరికొకరు అందజేసుకున్నారు. వాటిపై మళ్లీ అభ్యంతరాలు, నచ్చజెప్పుకోవడం వగైరాలు పూర్తయి చివరకు అవగాహన కుదిరాక ప్రభుత్వ పక్షం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ ప్రకటనలు చేశాక వివాదం సమసిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్యత ఏర్పడి సభలు సజావుగా సాగడం హర్షించదగిందే. కానీ అందుకు అయిదారు రోజులు పట్టడం విచారకరం. మొత్తంగా ఈ వివాదం వల్ల వరసగా రెండు వారాలపాటు ఉభయ సభలూ సక్రమంగా జరగలేదు. ఏదోవిధంగా ఇదంతా సమసిందని అందరూ ఊపిరిపీల్చుకునేలోగా కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే లౌకికవాదంపై ఒక కుల సంఘం సభలో చేసిన వ్యాఖ్యలు రోజంతా లోక్‌సభనూ, రాజ్యసభనూ కుదిపేశాయి. చివరకు తన మాటల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు హెగ్డే చెప్పడంతో పరిస్థితి ఉపశమించింది. మహారాష్ట్రలో ఏటా దళితులు జరుపుకునే భీమా–కోరెగావ్ విజయోత్సవ సభల సందర్భంగా ఘర్షణలు తలెత్తడం, అవి రాష్ట్రమంతా వ్యాపించడం కూడా సమావేశా లపై ప్రభావం చూపింది. పలుమార్లు రెండు సభలూ వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాలకూ, శీతాకాల సమావేశాలకూ మధ్య దేశవ్యాప్తంగా ఎందరో రైతులు రుణభారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఎప్పటిలాగే వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం ఈసారి పార్లమెంట్లో చర్చకు రాలేదు. మొత్తంగా సమావేశాల కాలంలో లోక్‌సభ 91.58 శాతం, రాజ్యసభ మాత్రం 56.29 శాతం పనిచేసిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సమావేశాలు సక్రమంగా సాగితే మొదటగా పేరొచ్చేది పాలకపక్షానికే. సమస్యలొచ్చినప్పుడు విపక్షాలతో చర్చిం చడం, వారి వాదనల్లోని సహేతుకతను గుర్తించి తమవైపుగా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే ఆ పని చేయడం, లేనట్టయితే విపక్షాల డిమాండు సరికాదని ఓపిగ్గా నచ్చ జెప్పడం ప్రభుత్వ పక్షం బాధ్యత. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయానికి చోటివ్వా లన్న మౌలికాంశాన్ని పాలకులు గుర్తిస్తే ఏదీ సమస్యగా మారదు. పార్లమెంటు వాయిదాలతో పొద్దుపుచ్చుతుంటే మొదటగా అప్రదిష్ట కలిగేది ప్రభుత్వానికే. ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభలో సులభంగా ఆమోదం లభించినా రాజ్యసభలో అది సాధ్యపడదని ఎన్డీయే ప్రభు త్వానికి తెలుసు. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పిన భర్తను అరెస్టు చేయాలన్న నిబంధన వల్ల దంపతుల మధ్య సామరస్యత కుదిరే అవకాశాలు సన్నగిల్లుతాయని, ఇది అంతిమంగా బాధిత మహిళనే నష్టపరుస్తుందని ఆ పార్టీలు హెచ్చరించాయి. బిల్లుకు కాంగ్రెస్ సవరణలు ప్రతిపాదించినా వాటిపై పట్టు బట్టలేదు గనుక మూజువాణి ఓటుతో అది ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో విపక్షాలదే పైచేయి. సహజంగానే అక్కడ అవరోధాలు ఎదు రయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మవుతాయని శీతాకాల సమావేశాల ముగింపు రోజునే ప్రకటించారు. కనుక ఇప్పుడు తలాక్ బిల్లు ఆమోదం కోసం ఆలోగా ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారా లేక బడ్జెట్ సమావేశాలు ముగిశాక దాని సంగతి ఆలోచిస్తారా అన్నది చూడాలి. తలాక్‌పై చట్టం తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో దాన్ని ప్రధాన ప్రచారాస్త్రం చేసుకోవాలన్న ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్నట్టుంది. మొత్తానికి పార్లమెంటు వంటి అత్యున్నత చట్టసభ బలప్రదర్శనకు వేదిక కాకూడదన్న అవగాహన ఇరు పక్షాలకూ ఉండాలి. అప్పుడే పార్లమెంటు సమావేశాలు అర్ధవంతంగా సాగుతాయి. అవి ఫలప్రదమవుతాయి. -
ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు 2021 వరకు పూర్తికాదని ఓవైపు కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ చెప్తుంటే.. వాస్తవాలను కప్పిపెడుతూ వచ్చే ఏడాదే నీళ్లిస్తామంటూ మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే.. కానీ ఆ బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చెప్తున్న దానికి, వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. కాంక్రీట్ పనులు, ఎర్త్ వర్క్ పనులన్నీ నత్తనడకన నడుస్తున్నాయని వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరంపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందేదని.. ఇప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. పునవర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని, ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖకు రైల్వే జోన్ సహా విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను కేంద్రం అమలు చేయాలి. వాటితో పాటు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులపై నిలదీస్తామన్నారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. 3 నెలల్లో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి గుర్తుచేశారు. అలాగైతే ఏపీకి ఆ నిబంధన వర్తించదా..? ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా? అంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. లోక్ సభలో ఫిరాయించిన ఎంపీలపై చర్యలు తీసుకోవడం లేదని, బుట్టారేణుకపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉపరాష్ట్రపతిని స్పీకర్లు ఆదర్శంగా తీసుకోవాలి లాభాలు ఆర్జించే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 'డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లాభాల్లో నడుస్తోంది. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌పై నిలదీస్తే అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో లేవనెత్తుతాం. కేంద్రం తీసుకొస్తున్న ఎఫ్ఆర్డీఐ చట్టంతో డిపాజిటర్లకు నష్టం వాటిల్లుతుంది. ఎఫ్ఆర్డీఐ చట్టం తేవడం పూర్తిగా ప్రజా వ్యతిరేకం. ఈ చట్టంపై కేంద్రాన్ని నిలదీస్తాం. అనర్హత వ్యవహారంలో ఉపరాష్ట్రపతిని స్పీకర్లు ఆదర్శంగా తీసుకోవాలని, పార్టీ మారిన నేతలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని' విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా? -
డిసెంబర్ 15 నుంచి శీతాకాల సమరం
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే పార్లమెంట్ శీతాకాల సమరం మొదలు కానుంది. డిసెంబర్ 15న సమావేశాలు ప్రారంభమై జనవరి 5 వరకూ 14 రోజులు సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) తేదీలను నిర్థారించింది. సీసీపీఏ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. పార్లమెంట్ సమావేశాల జాప్యాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సమర్థించుకున్నారు. జనవరి 1తో పాటు అన్ని పని దినాల్లోనూ సభ్యులు సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్, ఎన్సీబీసీ తదితర కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. -
డిసెంబర్ 15 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ బుధవారం తెలిపారు. వివిధ రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు. సమావేశాలు ఆలస్యమయ్యాయని ప్రతి పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. గతంలో 2008, 2013లో డిసెంబర్లోనే నిర్వహించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రతి ఏటా నవంబర్లోనే శీతకాల సమేశాలు నిర్వహిస్తారు. ట్రిపుల్ తలాక్, ఐబీసీ దివాళ చట్టంపై చర్చించనున్నారు. ఇక మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. -
అసమర్థ ప్రభుత్వం, అధ్వానపు ప్రతిపక్షం..!
అవలోకనం ప్రస్తుతం మనం దేశంలో ఒక విచిత్రమైన రాజకీయ దశగుండా వెళుతున్నాం. ఒకవైపేమో, గత రెండున్నరేళ్ల పాలనలో మొదటిసారిగా ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. మరోవైపేమో, ప్రజల మనోభావాలను వ్యక్తపర్చగలిగే సామర్థ్యంగానీ లేదా పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకునే నైపుణ్యం గానీ ప్రతిపక్షానికి వాస్తవంగానే లోపించినట్లు కూడా కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం తలపెట్టిన పెద్ద నోట్ల రద్దు ప్రయోగం ప్రారంభమై నలభై రోజులు కావస్తోంది. కానీ బ్యాంకుల నుంచి ద్రవ్య సరఫరా నేటికీ సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. ఏటీఎంలలో ఇప్పటికీ తగినంత నగదు నిల్వ ఉంచడం లేదు. వ్యవస్థ మొత్తంగా తనను ధ్వంసం చేసినటువంటి కార్యాచరణతో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత్వాన్ని పరిష్కరించే విష యంలో కనీసస్థాయి నియంత్రణ కూడా ఉన్నట్లు కనపడటం లేదు. పెద్దనోట్ల రద్దును ప్రకటించిన వారం రోజుల తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవచ్చనే సూచనలు పొడసూపాయి. న్యాయస్థానంలో నోట్ల రద్దుపై తొలి విచారణ ప్రారంభమై, పాత కరెన్సీ చాలావరకు ఇంకా ప్రజల చేతుల్లోనే ఉంటున్నప్పుడు అది సాధ్యమేననిపించింది. కానీ ఆ దశ ముగిసిపోయింది. డబ్బు సైతం దాని భౌతిక రూపంలో అదృశ్యమై ఆర్బీఐ లేదా బ్యాంకుల ఖజానాల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో వ్యవస్థ ద్వారా కొత్త నోట్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. వ్యవస్థ స్థిరత్వం పొందాలంటే మరొక నెల సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే జనవరి మధ్యవరకు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట. డబ్బును ముద్రించినంత మాత్రాన సరిపోదు.. వ్యవస్త మొత్తంలో నగదు పంపిణీ కావాలి. దీనికి ఎంత సమయం పడుతుందన్న వాస్తవ అంచనా ఇంతవరకు లేదు. పెద్దనోట్ల రద్దు వల్ల రానున్న కాలంలో పెద్దగా బాధ ఉండదని మోదీతో సహా ఇతరులు కూడా నమ్ముతున్నారు. రాజకీయపరంగా ఇదెంత ముఖ్యమైన సమస్య అంటే, ప్రజాస్వామిక పరిధిలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే దీన్ని అనుకూలంగా మల్చుకుంటుంది. ఆర్థిక వ్యవస్థను మందగింపజేసి, కోట్లాదిమంది ప్రజలను నెలరోజులకు పైగా ప్రతి దినం భయంకరమైన అసౌకర్యానికి గురిచేస్తున్న ఈ దూకుడు చర్య ప్రతిపక్షంలోని రాజకీయనేతలకు కలలో కనిపించే లడ్డూలాంటి బహుమతి వంటిది. వాస్తవానికి ప్రభుత్వం తొలి కొద్ది వారాల్లో పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు పొందింది. మీడియా అత్యంత దృఢంగా పెద్ద నోట్ల రద్దును సమర్థిం చింది. తర్వాత జాతికి మద్దతుగా, నల్లధనానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా క్యూలలో నిలబడుతున్నందుకు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్లుగానే కని పించింది. కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దనోట్ల రద్దును సమర్థిస్తూనే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ వైఖరి ఆ పార్టీ ఆత్మవిశ్వాస లేమిని ప్రదర్శించింది. పైగా పెద్దనోట్ల రద్దు సారాంశం పట్ల అవగాహనా లేమిని అది సూచించింది. పెద్దనోట్ల రద్దు పరిణామాలు చాలాకాలం కొనసాగడంపై నిపుణులతోసహా చాలామంది ప్రజలకు అంతగా అవగాహన లేదనడం కరెక్టే కావచ్చు. కానీ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ఈ దేశాన్ని పాలించడంలో దశాబ్దాల అనుభవం కాంగ్రెస్ పార్టీ సొంతం. పెద్ద నోట్ల రద్దు విపరిణామాలపై తగినంత డేటా, సమాచారం దానికి తప్పకుండా తెలిసే ఉండాలి. ఆ పార్టీకి కూడా అది తెలియదన్నట్లయితే అది కాంగ్రెస్ అసమర్థతగానే చెప్పాలి. క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న జననేతలు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మాత్రమే మొదటినుంచే పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వచ్చారు. నోట్ల రద్దు నిర్లక్ష్యపూరితమైన చర్య అనీ, జనం మద్దతును అది కోల్పోతుందని వీరు గుర్తించి ఉండవచ్చు. అసౌకర్యం తీవ్రస్థాయిలో కొనసాగడం, ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ చర్య లక్ష్యం నల్లధనంపై దాడి చేయడం నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరత వైపునకు మారడంతో.. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం ఆస్వాదించిన తొలినాళ్ల ఉల్లాస స్థితికి క్యూలలో ఉంటున్న జనం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద నోట్ల రద్దు విషాదాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోలేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి రాహుల్ గాంధీ పేలవమైన పరిస్థితినే సూచిస్తోంది. ప్రజాకర్షక రాజకీయాల్లో నినాదాలతో జనం మద్దతు పునాదిని కూడగట్టడం చాలా అవసరం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ దీన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. మనకాలపు అత్యంత సమర్థ రాజకీయనేత మోదీ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సామర్థ్యం లేని కాంగ్రెస్.. అమూల్య మైన రాజకీయ అవకాశం తన ముందున్నప్పటికీ దాన్ని ఎలా సరైన విధంగా ఒడిసిపట్టుకోవాలో తెలియని స్థితిలో అస్పష్టపు ప్రకటనలు చేస్తోంది. ప్రస్తుత సంక్షోభం పట్ల రాహుల్ గాంధీ వైఖరి ఏమాత్రం అర్ధవంతంగా లేదనిపిస్తోంది. మొదట తాను కాస్త ప్రయత్నించారు. తర్వాత ఏకపక్ష చర్య ద్వారా ప్రతిపక్ష ఐక్యతనే అర్ధరహితంగా విచ్ఛిన్న పరిచారు. ప్రధాని వ్యక్తిగత అవినీతిని బయటపెడతానని హెచ్చరించారు. కానీ తర్వాత మాత్రం మోదీని కలుసుకున్నప్పుడు రైతుల దుస్థితి గురించి ప్రస్తావనకు ఎజెండా మార్చుకున్నారు. తన వైఖరిలో ఎలాంటి వ్యూహం కానీ, క్రమశిక్షణ కానీ లేవని ఇది సూచిస్తోంది. ప్రధాని వ్యక్తిగతంగా అవినీతిపరుడని చాలా కొద్దిమంది మాత్రమే నమ్ముతున్నారు. అలాంటప్పుడు మాటవరసకైనా అలాంటి ఆరోపణ చేసి ఉండకూడదు. మొత్తం మీద కేంద్రప్రభుత్వం తనకు తాను రూపొందించుకున్న అతి పెద్ద సంక్షోభం మధ్యలో మనం ఉన్నాం. దేశ పౌరులతో, మన జీవితాలపై కలిగిస్తున్న ప్రభావాలతో తీవ్రంగా ముడిపడి ఉన్న సంక్షోభం ఇది. నూతన సంవత్సరం తొలి వారాల్లో వ్యక్తిగత అసౌకర్యం కలిగిస్తూ, కొత్త సంవత్సరం తొలి కొన్ని నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతూ కొనసాగుతానని వాగ్దానం చేస్తున్న సంక్షోభం ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్రభుత్వం అతి పేలవంగా నిర్వహిస్తున్న, ప్రతిపక్షం అంతకంటే అధ్వానంగా వ్యవహరిస్తున్న సంక్షోభంగా ఇది అత్యంత స్పష్టంగా రుజువవుతోంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
వృథా సమావేశాలు!
మొత్తానికి అధికార పక్షం, విపక్షం రెండూ కలిసి పార్లమెంటు శీతాకాల సమా వేశాలను చెల్లని కాసుగా మార్చాయి. పెద్ద నోట్ల రద్దుతో తలకిందులైన తమ బతుకుల గురించి పార్లమెంటులో చర్చిస్తారేమో, సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తారేమోననుకున్న ప్రజానీకానికి ఇరు పక్షాలూ నిరాశే మిగిల్చాయి. గత నెల 16న ప్రారంభమైన పార్లమెంటు 22 రోజులపాటు వాయిదాల తమాషా కొన సాగించి చివరకు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినా, బీజేపీ సీనియర్ నాయకుడు అడ్వాణి రెండుసార్లు హితబోధ చేసినా ఎవరూ తలకెక్కించుకోలేదు. ప్రజల కోసం స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలన్న ధ్యాస కనబరచలేదు. గత ఆరేళ్లలో ఇంత ఘోరంగా సమావేశాలు జరగడం ఇదే ప్రథమమని విశ్లేషకులు గణాంక సహితంగా చెబుతున్నారు. 2010లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై చెలరేగిన వివాదం పర్యవసానంగా లోక్‌సభ 6 శాతం, రాజ్యస¿¶ 2 శాతం మాత్రమే పనిచేశాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఉభయ సభలూ దాదాపు అంత నాసిరకమైన పనితీరును ప్రదర్శించాయి. ఈసారి లోక్‌సభ 17.04 శాతం, రాజ్యసభ 20.61 శాతం పని చేసిందని సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చెబుతున్నారు. వందల కోట్ల ప్రజా ధనం వృథా అయింది. చిత్రమేమంటే అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమావేశాల సమయంలో పార్లమెంటు వెలుపల మాత్రమే మాట్లాడారు. తమను సభలో అవతలి పక్షం మాట్లాడనీయడం లేదని ఆరోపించి జనాన్ని అయోమయంలో పడేశారు. కనీసం ఆఖరి నిమిషంలోనైనా రెండు పక్షాలకూ జ్ఞానో దయమవుతుందేమో... ఈ సమావేశాలను మరో నాలుగైదు రోజులు పొడిగించి సక్రమంగా నిర్వహిస్తారేమోనని ఎదురుచూసినవారికి చివరకు నిరాశే మిగిలింది. సమావేశాలు సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వ పనితనానికి నిదర్శనమవు తుంది. అవి పేలవంగా సాగి విఫలమైతే బయటపడేది దాని చేతగానితనమే... దాని అప్రజాస్వామికతే. ఈ సంగతి బీజేపీ పెద్దలకు తెలియదనుకోలేం. పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అవినీతి అంతానికీ, నల్ల ధనం నిర్మూలనకూ వాటిని చిరునవ్వుతో సహిస్తున్నారని చెప్పుకుంటున్న అధికార పక్షం ఆ సంగతినే పార్లమెంటు వేదికపై ప్రకటించి, చర్చించడానికి ఎందుకు సిద్ధపడలేక పోయిందో అనూహ్యం. వివిధ నిబంధనలకింద ఓటింగ్‌తో కూడిన చర్చ జరపా లన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం నిరాకరించింది. నిజానికి లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం భయపడనవసరం లేదు. దాని వల్ల మిన్ను విరిగి మీద పడదు. పెద్ద నోట్ల రద్దు వంటి అతి పెద్ద నిర్ణయంపై చట్టసభలో చర్చిస్తే, దానిపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి అదేమీ అప్రదిష్ట కలిగించే అంశం కాదు. పైగా తన నిర్ణయంలోని సహేతుకతనూ, ఆ చర్యలోని సదుద్దేశాన్నీ చాటు కోవడానికి దాన్నొక అవకాశంగా తీసుకోవచ్చు. కానీ అధికార పక్షం అందుకు సిద్ధ పడలేదు. చివరకు విపక్షం ఒక మెట్టు దిగొచ్చి బేషరతుగా చర్చించడానికి సరేనన్నా అంగీకరించలేదు. పైగా చర్చకు ద్వారాలు మూసుకుపోయే విధంగా అంతక్రితం రెండు సమావేశాల్లో దాదాపుగా చర్చించిన అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణాన్ని ముందుకు తెచ్చి పక్కకు తప్పుకుంది. ఆ స్కాంపై చర్చించాలంటూ మంత్రి అనంత్‌కుమార్ పట్టుబట్టి ఆశ్చర్యపరిచారు. విపక్షం బేషరతు చర్చకు ముందుకొచ్చి నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సభ సజావుగా జరిగేలా సమన్వయపరచవలసిన బాధ్యత ఆయనది. అయితే ఆయనకు అంతకన్నా గతంలో చర్చకొచ్చిన అంశమే ముఖ్యమనిపించింది! పార్ల మెంటులో అత్యంత బలహీనంగా ఉన్నామని తెలిసినా ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టడం విపక్షాల తెలివితక్కువతనం. దేశ ప్రజలందరినీ పీడిస్తున్న ఒక పెను సమస్యపై పార్లమెంటులో తమ గళం వినిపించడం ముఖ్యమని అవి తెలుసుకోలేక పోయాయి. సమావేశాలు ముగింపుకొచ్చే తరుణంలో ఈ విషయంలో జ్ఞానోదయ మైనా లేశమాత్రమైనా ప్రయోజనం లేకుండాపోయింది. పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాలూ నిస్తేజమ య్యాయి. ఉపాధి దొరక్క సామాన్యులు మూగగా రోదిస్తున్నారు. ఏం చేయాలో ఎవరికీ పాలుబోవటం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడినా డబ్బు దొరుకు తుందన్న భరోసా ఉండటం లేదు. దొరికినా చేతికొచ్చిన రూ. 2,000 నోటుతో ఏమీ చేయలేక ఉస్సూరంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఈ క్యూలలో అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు వారానికి రూ. 24,000 ఇస్తామని రిజర్వ్‌బ్యాంకు హామీ ఇచ్చినా అందుకు అవసరమైన డబ్బును అది పంపిణీ చేయలేకపోయింది. దేశంలో దాదాపు అన్ని బ్యాంకుల్లో ‘నో క్యాష్’ బోర్డులే వేలాడుతూ ఖాతాదారులను వెక్కిరిస్తున్నాయి. మరోపక్క శేఖర్రెడ్డిలాంటి నల్ల కుబేరుల ఇళ్లల్లో గుట్టలకొద్దీ నోట్ల కట్టలు పోగుబడుతున్నాయి. నల్ల ధనం అరి కట్టడానికి, అవినీతిని అంతం చేయడానికి తీసుకున్నామన్న చర్య కాస్తా ఇలా తలకిందులయ్యేసరికి ఏం చేయాలో తోచని ప్రభుత్వం నల్లధన వ్యాపారుల గుట్టు మట్లు తెలిస్తే చెప్పమని పౌరుల్నే అడుగుతోంది! ఈసారి జీఎస్టీతో సహా 10 ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్టు సమావేశాలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో దివ్యాంగుల హక్కుల బిల్లు ఒక్కటే సజావుగా చర్చ సాగి సభామోదం పొందింది. గుప్తధనం వెల్లడిస్తే 60 శాతం మినహాయింపుతో అంగీకరించేందుకు వీలుకల్పించే ఆర్ధిక బిల్లు, మరో రెండు బిల్లులు మూజువాణి ఓటుతో గట్టెక్కాయి. పార్లమెంటు వంటి అత్యున్నత చట్టసభలో ప్రజల సమస్యలు చర్చించడానికి అవకాశం ఉండకపోతే... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నట్టు తాము ప్రవర్తించకపోతే సాధారణ ప్రజానీకంలో సైతం ఆ మాదిరి అప నమ్మకమే ఏర్పడుతుందని, అది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుందని అన్ని పక్షాల నాయకులూ గుర్తించాలి. -
పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం విఫలం: ఖర్గే
-
పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం విఫలం: ఖర్గే
పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. తాము పార్లమెంటులో పెద్దనోట్ల రద్దు, రైతుల సమస్యలు, చిన్న వ్యాపారుల సమస్యలపై చర్చిద్దామని అనుకున్నామని, కానీ అసలు అధికార పక్ష సభ్యులు సభను నడవనివ్వలేదని చెప్పారు. ఇవే అంశాలను వివరించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పలు పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం కలిశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దనోట్ల రద్దుపై చర్చ నుంచి ప్రభుత్వం పారిపోయిందని, అసలు దానిపై సభలో మాట్లాడే అవకాశాన్ని తమకు ఇవ్వలేదని ఖర్గే అన్నారు. -
రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
-
రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇంతకుముందే కేంద్ర మంత్రి అనంతకుమార్ వద్ద ఈ విషయం చెప్పిన ఆయన.. ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారని ఆయన చెప్పారు. ఒకవైపు ప్రతిపక్షం, వాళ్లకు దీటుగా అధికార పక్షం కూడా తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడగా రాజ్యసభ పలుమార్లు వాయిదా పడి, చివరకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏ ఒక్క అంశంపై కూడా చర్చలు జరగడం లేదు. దాంతో ఈ తీరుపై అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అదే గందరగోళం.. వాయిదా పర్వం
-
అదే గందరగోళం.. వాయిదా పర్వం
అధికార, ప్రతిపక్షాల మధ్య అదేస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా మందలించారు. అధికారపక్షమైనా, ప్రతిపక్ష సభ్యులైనా ఇలా ప్లకార్డులు ప్రదర్శించడం తగదని, ఏం కావాలో ప్రశాంతంగా చెప్పాలని సూచించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. గట్టిగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించసాగారు. సభను అదుపు చేసేందుకు స్పీకర్ ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. దాంతో ఆమె సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో కూడా సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత అదే సీన్ కనిపించింది. పెద్దనోట్ల రద్దు, కరువు పరిస్థితుల వల్ల రైతుల కష్టాలు అనే అంశంపై ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ నోటీసు ఇవ్వడంతో.. దానిపై ఆయనను మాట్లాడాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు. అయితే అదే సమయంలో అధికార పక్ష సభ్యులు అగస్టా వెస్ట్‌లాండ్ స్కాంపై చర్చకు పట్టుబట్టడంతో రెండు వైపుల నుంచి సభ్యులు తీవ్రంగా వాగ్వాదాలకు దిగారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి అధికార పక్షమే సభ జరగకుండా ఉభయ సభల్లోను అడ్డుకుంటోందని ఆజాద్ మండిపడ్డారు. మధ్యలో సీతారాం ఏచూరి ఏదో మాట్లాడుతున్నా తనకు వినిపించడం లేదని.. మళ్లీ అవకాశం ఇస్తానని చెప్పిన కురియన్.. చివరకు సభను 12 గంటలకు వాయిదా వేశారు. -
రాహుల్ ఇన్నాళ్లూ ఎందుకు బయటపెట్టలేదు?
-
రాహుల్ ఇన్నాళ్లూ ఎందుకు బయటపెట్టలేదు?
ప్రధానమంత్రి వ్యక్తిగత అవినీతి గురించి తనవద్ద పక్కా ఆధారాలున్నాయని చెబుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతకాలం దాని గురించి ఎందుకు మాట్లాడలేదని, పార్లమెంటులో ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని కేంద్ర మంత్రులు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి అనంతకుమార్ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి తాము చర్చకు సిద్ధమేనని చెబుతున్నామని.. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షం మాత్రం సభను నడవనివ్వడం లేదని ఆయన అన్నారు. నిజంగా రాహుల్ గాంధీ దగ్గర అంత భూమి బద్దలయ్యే సమాచారమే ఉంటే.. గడిచిన 20 రోజుల నుంచే ఆయన బయటపెట్టచ్చు కదా అని అనంతకుమార్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన అలా భూకంపం తెప్పించే విషయాలేవీ ప్రస్తావించలేదని.. బయటకు వచ్చి మాత్రం తనను మాట్లాడనివ్వడం లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కలిసి సభను ఎందుకు నడవనివ్వట్లేదని.. గత 15 రోజులుగా పార్లమెంటులో సరైన చర్చ జరగనివ్వట్లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలియజేయడం, మరోవైపు చర్చ జరగాలని అడగడం సరికాదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. సభ సజావుగా నడిచేందుకు ఇరు పక్షాలూ సహకరించాలని ఆమె కోరారు. -
ఇక ఉన్నది రెండు రోజులే!
ప్రభుత్వం పారిపోతోందని ప్రతిపక్షం, అసలు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, నవంబర్ 16వ తేదీ నుంచే చర్చ మొదలై దాని మీద అన్ని పార్టీలూ మాట్లాడుతున్నా.. ప్రతిపక్షమే చర్చను సజావుగా సాగనివ్వడం లేదని ప్రభుత్వం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరొక్క రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా పెద్దనోట్ల రద్దు, ఇతర అంశాల మీద చర్చ సజావుగా సాగుతుందో లేదో అనుమానంగానే కనిపిస్తోంది. వాస్తవానికి నాలుగు రోజుల విరామం తర్వాత లోక్‌సభ బుధవారం సమావేశమైనప్పుడు ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఇతర సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. ప్రధాని కూడా చర్చలో పాల్గొంటారని, ఆయన తన వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకులు ఉదయం నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ బుధవారం పార్లమెంటులో పరిస్థితి యథాతథంగా కనిపించింది. లోక్‌సభ సమావేశమైన కొద్దిసేపటికే తీవ్ర వాగ్వాదాలు, నినాదాలతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత సభను సజావుగా నిర్వహించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం వ్యవహారం తెరమీదకు రావడం, దానిపై తీవ్రస్థాయిలో వాదోపవాదలు జరగడంతో సభ వేడెక్కింది. ఈ వ్యవహారంలో వైమానిక దళ మాజీ ప్రధానాధికారి త్యాగిని అరెస్టు చేసిన విషయాన్ని అధికార పక్షం ప్రస్తావించగా.. దాన్ని రాజకీయం చేయొద్దని బీజేడీ తదితర పక్షాలు మండిపడ్డాయి. ఇంతలో.. అసలు తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని, పెద్దనోట్ల రద్దు అంశం మీద చర్చను ఎందుకు సాగనివ్వడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. అదే సమయంలో సభాధ్యక్షురాలు సుమిత్రా మహాజన్ మీద కూడా ఆయన ఆరోపణలు చేయడంతో.. మంత్రి అనంతకుమార్ తీవ్రంగా స్పందించారు. చర్చకు తాము సిద్ధమన్న విషయాన్ని ఎప్పుడో చెప్పామని.. అనవసరంగా ప్రతిపక్షమే దీనిపై గందరగోళం సృష్టిస్తూ సభను సాగనివ్వడం లేదని.. ప్రధానమంత్రి సైతం దానిపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తీవ్ర గందరగోళ పరిస్థితి సృష్టించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో .. ఆమె సభను గురువారానికి వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ముగిసిపోతాయి. అది కూడా అయిపోతే ఇక చర్చించడానికి పార్లమెంటు వేదిక అంటూ ఉండదు.. కేవలం బహిరంగ సభలు, ప్రెస్మీట్లతోనే కాలం గడిపేయాల్సి వస్తుంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి పార్లమెంటులో పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ కొనసాగనిస్తారేమో చూడాలి!! -
ఈ హితవచనాలు వింటారా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ బుధవారం చేసిన వ్యాఖ్యలతో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం పార్లమెంటులో సాగుతున్న పరిణామాల పట్ల మరో వేదికపై ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 8న పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వారం రోజులకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఆ వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఉదంతాలపై సహజంగానే ప్రతిపక్షాలు విరుచు కుపడతాయని అందరూ ఊహించారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా పెద్ద నోట్లు రద్దు చేసి, కనీసం జనం ఇబ్బందులు పడుతున్నారన్న గ్రహింపు కూడా లేనట్టు ప్రవర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీయాల్సిందే. సంజాయిషీ కోరవలసిందే. కానీ అందుకు పార్లమెంటును స్తంభింపజేయడమే ఏకైక మార్గమ న్నట్టు విపక్షాలు వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే బాగుందని పిస్తున్నట్టుంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నది గనుక కీలకమైన బిల్లులు ఆగిపోతా యన్న చింత ఎటూ లేదు. ఎవరెంత గొంతు చించుకుంటున్నా, సభలో ఎంత గంద రగోళం సాగుతున్నా అవేమీ పట్టనట్టు కావాలనుకున్న బిల్లులు సభా ప్రవేశం చేస్తు న్నాయి. మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. నామమాత్రంగా చర్చలు సాగుతున్నాయి. ఎవరికి వినబడుతుంది... వినబడదన్న విచక్షణ లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన డబ్బుపై భారీ మొత్తంలో జరిమానా విధించే పన్ను చట్టాల(రెండో సవరణ) బిల్లు ఎలాంటి చర్చకూ తావు లేకుండానే లోక్‌సభలో అయిందనిపించారు. ఒకరిద్దరు సభ్యులు బిల్లుకు సవర ణలు ప్రతిపాదించినా స్పీకర్ వాటన్నిటినీ తోసిపుచ్చారు. నిజానికి బిల్లుపై చర్చకు అవకాశం వచ్చినప్పుడు అధికార పక్షం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకపక్క పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్ల కుబేరులు తమ దగ్గరున్న అక్రమ ధనాన్ని సక్రమం చేసుకోవడానికి పాట్లు పడుతున్నారని కేంద్రం అనడమే కాదు... అలాంటివారికి లబ్ధి చేకూర్చేందుకే విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయని ఆరోపి స్తోంది. బిల్లుపై చర్చకు సిద్ధపడి ఉంటే అందులో నిజమెంతో, విపక్షాల అభ్యంతరా లేమిటో ప్రజలకు వెల్లడయ్యేది. ఇప్పుడు పార్లమెంటు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన నేతలిద్దరూ రాజకీయాల్లో తల పండినవారు. అడ్వాణీ ప్రస్తుత లోక్‌సభలో కూడా సభ్యుడు. పార్లమెంటులో ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడుతుందో, అందుకు దారితీసే పరిస్థితు లేమిటో ఇద్దరికీ తెలియందేమీ కాదు. 2012 మే నెలలో వజ్రోత్సవం సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పుడు సైతం పార్లమెంటు ప్రతిష్టం భనపై చర్చ జరిగింది. ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్ధిక మంత్రిగా యూపీఏ ప్రభుత్వంలో ఉన్నారు. అద్వానీ విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆందోళన వ్యక్తం చేయడానికి నేపథ్యం ఉంది. అంతకు కొన్ని నెలల ముందు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జాయింట్ పార్లమెం టరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో పార్లమెంటు నిరవ దిక వాయిదాలతో గడిచి, ఆ స్థితిలోనే ముగిసిపోయింది. తమ డిమాండ్‌ను అంగీ కరిస్తే తప్ప సభను సాగనీయబోమని అప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ తెగేసి చెప్పింది. ఆ విషయంలో కాస్తయినా పట్టు సడలించుకోని యూపీఏ సర్కారు బడ్జెట్ సమావేశాలకల్లా దిగొచ్చి వారి డిమాండ్‌ను అంగీకరించింది. వజ్రోత్సవ సమావేశంలో వాయిదాలు సరికాదని చెప్పిన మన్మోహన్ ఇవాళ రాజ్యసభలో ఉన్నా తమ పార్టీకి హితవు చెప్పలేకపోతున్నారు. సభ సజావుగా సాగితే ఆ విషయంలో ప్రతిష్ట దక్కేది అధికార పక్షానికే. తమ వైపు లోటుపాట్లేమీ లేనప్పుడు, దేన్నయినా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చదు. పైగా చర్చకు చోటిచ్చి ఆ డిమాండ్‌లోని నిరర్ధకతను ప్రజలకు వెల్లడయ్యేలా చేయడానికి ఉత్సాహపడు తుంది. కానీ ప్రభుత్వ వాలకం చూస్తుంటే దానికి ఆ ఉత్సాహం ఉన్నట్టు కనబడదు. అలాగని పెద్ద నోట్ల రద్దుపై మోదీ అసలు మాట్లాడటం లేదని కాదు. భిన్న వేదికల నుంచి ప్రసంగిస్తూనే ఉన్నారు. ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ ఓపిగ్గా గంటల తరబడి నించుంటున్నందుకు వారిని అభినందిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు. వారిని అవహేళన చేస్తున్నారు. సభా సమావేశాలున్నప్పుడు తీసుకునే నిర్ణయాలను ఆ సభలోనూ... అవి లేన ప్పుడు తీసుకున్న నిర్ణయాలను తదుపరి జరిగే సమావేశాల్లోనూ ప్రభుత్వం ప్రకటించాలన్న సంప్రదాయం ఉంది. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ బదులు తానే నోట్ల రద్దును ప్రకటించిన మోదీ అందుకు దారితీసిన పరిస్థితులపై సభలో మాట్లాడటా నికి ఎందుకు వెనకాడుతున్నారు? విపక్షాల డిమాండ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకో వడం సబబేనా? ఇప్పటికైనా ప్రణబ్, అడ్వాణీల హిత వచనాలను రెండు పక్షాలూ చెవి కెక్కిం చుకోవాలి. ఇరుపక్షాలూ ఆ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పేందుకు ప్రయ త్నిస్తున్నాయి. అవతలి పక్షాన్నుద్దేశించి అన్నట్టు తేల్చేస్తున్నాయి. ఇది సరికాదు. అత్యున్నత పదవిలో ఉండటం వల్ల కావొచ్చు... పార్లమెంటు సభ్యులు నినాదాలకూ, ఆందోళనలకూ దూరంగా ఉండి తమ పని తాము చేయాలని ప్రణబ్ చెప్పి ఉండొచ్చు. కానీ అడ్వాణీ మాత్రం తాను ఇరుపక్షాలనూ ఉద్దేశించి మాట్లాడుతున్నానని నేరుగా అన్నారు. స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలపై జనంలో ఉన్న అసంతృప్తికి అడ్వాణీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. దీన్ని గమ నించుకుని అధికార, విపక్షాలు రెండూ తమ తమ వైఖరులను సరిదిద్దుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిజంగా విశ్వాసం ఉంటే అందుకనుగుణంగా అవి ప్రవర్తించాలి. -
ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్
-
ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్: పారికర్
భారత సైన్యం గురించి పశ్చిమబెంగాల్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో తనకు చాలా బాధ కలిగిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది రాజకీయ ఫ్రస్ట్రేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆర్మీ చేస్తున్న రొటీన్ ఎక్సర్సైజ్ అని.. చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉందని లోక్‌సభలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ సచివాలయంలోని తన చాంబర్లోనే ధర్నా చేస్తున్నారని, ముందుగా పోలీసులకు.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వచ్చినట్లు సైన్యం చెబుతున్నా, నిజానికి అలా జరగలేదని టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించగా, దానికి సమాధానంగా పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 15 సంవత్సరాలుగా భారత సైన్యం ఇలా వెళ్తూనే ఉందని, ఇదేమీ కొత్త కాదని పారికర్ వివరించారు. గత సంవత్సరం కూడా నవంబర్ 19-21 తేదీల మధ్య ఇలా జరిగిందని అన్నారు. పశ్చిమబెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఈస్ట్రన్ కమాండ్ వెళ్తుందని, అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చిందన్నారు. వాస్తవానికి నవంబర్ నెలాఖరులో 28, 29, 30 తేదీలలో ఈ ఎక్సర్సైజ్ చేద్దామని ఆర్మీ భావించి అక్కడి పోలీసు అధికారులను సంప్రదిస్తే.. ఆ సమయంలో భారత్ బంద్ ఉన్నందున వాళ్లు తేదీలు మార్చి చెప్పారని, అందుకే సైన్యం ఇప్పుడు వెళ్లిందని పారికర్ వివరించారు. పోలీసులతో కలిసే సైన్యం సంయుక్తంగానే ఎక్సర్సైజ్ చేసిందని అన్నారు. సైన్యం చేసే రొటీన్ ఎక్సర్‌సైజును వివాదం చేయడం మాత్రం తప్పని ఆయన అన్నారు. -
మమత ప్రాణాలకు ముప్పుంది!
-
మమత ప్రాణాలకు ముప్పుంది!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌కతా విమానాశ్రయంలో దాదాపు అరగంట పాటు గాల్లోనే తిరిగిందని, ఆ సమయంలో విమానంలో ఇంధనం అయిపోతోందని చెప్పినా ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పార్లమెంటు ఉభయ సభల్లో టీఎంసీ సభ్యులు ప్రస్తావించారు. కోల్‌కతా విమానాశ్రయంలో జరిగినది ఏమాత్రం సరికాదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. (దీదీని హతమార్చేందుకు కుట్ర!) దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లో్క్సభలో సమాధానం ఇచ్చారు. కోల్‌కతా విమానాశ్రయంలో అదే సమయానికి మొత్తం మూడు విమానాలు ల్యాండింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని, మూడు విమానాల పైలట్లు కూడా దిగేందుకు అనుమతి కోరారని.. అయితే వాళ్లలో ఏ ఒక్కరూ ప్రయారిటీ ల్యాండింగ్ కావాలని మాత్రం అడగలేదని ఆయన చెప్పారు. కాగా, అసలు విమానాలు టేకాఫ్ తీసుకోడానికి ముందు అందులో తగినంత ఇంధనం ఉందా లేదా అనే విషయంపై డీజీసీఏ విచారణకు ఆదేశించిందని ఆయన అన్నారు. 30-40 నిమిషాల పాటు విమానం గాల్లో ఉందనడం మాత్రం సరికాదని... ఏడు నిమిషాల పాటు మాత్రమే అది ఆగిందని చెప్పారు. మమతా బెనర్జీతో పాటు అందులో ఉన్న అందరు ప్రయాణికుల ప్రాణాలు కూడా తమకు ముఖ్యమేనని మరో మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో మాయావతి, శరద్ యాదవ్ తదితర సభ్యులు ప్రస్తావించి, ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీలు ప్రయాణిస్తున్న విమానాలకు ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. సాధారణంగా విమానాల్లో ఇంధనం అయిపోవడం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యం పాలైనా శత్రుదేశాలు కూడా దిగేందుకు అనుమతి ఇస్తాయని.. అలాంటప్పుడు మన సొంత విమానాశ్రయాల్లో మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వరని మరికొందరు అన్నారు. అవి ప్రైవేటు విమానాలైనా, సర్వీసు విమానాలైనా వెంటనే దిగేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. -
ఎస్బీఐ అసలు వారికి రుణాలిస్తోందా?
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అసలు వ్యవసాయదారులకు, విద్యార్థులకు 2008 నుంచి రుణాలిచ్చిందా అని రాజ్యసభలో వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 70 ఏళ్ల పైబడిన వారి విషయంలో ఎస్బీఐ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుందన్నారు. కుటుంబసభ్యులకు గ్యారెంటీగా వ్యవహరిస్తున్న వితంతువులు, వృద్ధ మహిళల పిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. మహిళలు, వ్యవసాయదారులు, గిరిజనులపై క్రూరంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశాలతో ఎస్బీఐ వ్యాపారాలు నిర్వహిస్తుందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఆర్థికశాఖ స్పందించాలని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ సమాధానమిచ్చారు. ఎస్బీఐ విద్యార్థులకు, వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చిందని చెప్పారు. ఎస్బీఐ విచక్షణ, వివక్ష పూరితంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. ఎస్బీఐ పాలసీ ప్రకారం రుణాలకు గ్యారెంటీగా ఓ వ్యక్తి వయసును కాని, వైవాహిక విషయాన్ని కాని పరిగణలోకి తీసుకోవడం లేదని, ఒకవేళ ఏదైనా రుణం మొండిబకాయిగా మారితే, రుణగ్రహిత, గ్యారెంటర్ నుంచి రికవరీ చేసుకునేందుకు సాధారణ ప్రక్రియ ఉంటుందన్నారు. రుణగ్రహిత పేరుమీద లేదా గ్యారెంటర్ పేరు మీద ఇతర డిపాజిట్లు ఉంటే, 1872 కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 171 ప్రకారం తాత్కాలిక చర్యలుగా ఎస్బీఐ చేపడుతుందన్నారు. -
మోదీ లేరంటూ గందరగోళం.. రాజ్యసభ వాయిదా
మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చలో పాల్గొనేందుకు రాజ్యసభకు రాలేదంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దుపై విపక్షాల డిమాండ్ మేరకు రాజ్యసభలో గురువారం చర్చ నిర్వహించారు. ఈ చర్చలో ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. అయితే భోజన విరామానికి సభ వాయిదా పడిన తర్వాత ఆయన మళ్లీ సభకు రాలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్, సీపీఎం, ఇతర పార్టీల సభ్యులు లేవనెత్తారు. దానికి అధికారపక్షం తరఫున సభా నాయకుడు అరుణ్ జైట్లీ, మరో మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సమాధానం ఇచ్చారు. మొత్తం 25 మందికి పైగా సభ్యులు మాట్లాడాల్సి ఉన్నందున చర్చ ఇంకా ముగిసిపోలేదని, చర్చ ముగిసేలోపు ప్రధాని తప్పనిసరిగా వచ్చి, ఆయన కూడా చర్చలో పాల్గొంటారని చెప్పారు. కానీ, ప్రతిపక్ష సభ్యులు దాంతో ఏకీభవించలేదు. గతంలో 2013 ఆగస్టులో ఇలాగే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సభలోనే ఉండి తీరాలని నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మాజీ మంత్రి ఆనంద్ శర్మ మండిపడ్డారు. అనంతరం ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సభను జరగనివ్వాలని, ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదే పదే కోరినా ఎవరూ పట్టించుకోలేదు. పరిస్థితి ఎంతసేపటికీ అదుపులోకి రాకపోవడంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు. -
ప్రధాని ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే ఎలా?
పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ పదే పదే వాయిదాలతో సరిపోయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మొదటి రెండు మూడు రోజులు అసలు సభా కార్యకలాపాలే సక్రమంగా సాగలేదు. గురువారం రాజ్యసభలో చర్చకు అనుమతించడంతో.. అది మొదలైనా, అధికార.. ప్రతిపక్షాల వాగ్వాదంతో వాయిదాల పర్వం కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష నేతలు సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్ ప్రధానమంత్రి సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. సమయం చాలా అయ్యిందని, అందువల్ల ఆయన వస్తే చర్చ విని దానికి సమాధానం ఇస్తే బాగుంటుందని సీతారాం ఏచూరి సూచించారు. ప్రధాని కేవలం ప్రశ్నోత్తరాల సమయం కోసమే వచ్చారా.. అలాగైతే చర్చ జరగదని, చర్చకోసం వస్తే ఇప్పుడు కూడా ఉండాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. చర్చ మొదలైనప్పుడు వచ్చి, తర్వాత వెళ్లిపోయారని.. ఆయన వస్తే తప్ప సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజీ కురియన్.. ప్రధానమంత్రి ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే కుదరదని చెప్పారు. ఆయన వస్తారని ప్రభుత్వం చెబుతోందని, అందువల్ల సభను సజావుగా నడవనివ్వాలని కోరారు. ఇప్పటికిప్పుడే ఆయన రావాలని మీరు అడగడం సరికాదని అన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినలేదు. దాంతో సభాధ్యక్షుడు అరుణ్ జైట్లీని స్పష్టత ఇవ్వాల్సిందిగా కురియన్ కోరారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ... ''ప్రధానమంత్రి చర్చకు వస్తారా రారా అని ప్రతిపక్షం అడిగింది, ఆయన పాల్గొంటారని చెప్పాం. మాకు ఒక అనుమానం ఉంది.. అది నిజమని ఇప్పుడు అనిపిస్తోంది. ప్రతిపక్షం చర్చ నుంచి పారిపోవాలనుకుంటోంది. అందుకు కారణాలు వెతుక్కుంటోంది. ఇది ఓ కొత్త పద్ధతి. చర్చ మొదలైంది, కొనసాగుతోంది.. కొనసాగించండి. ప్రధానమంత్రి కూడా చర్చలో పాల్గొంటారు. అందులో అనుమానం ఏమీ లేదు. చర్చ కొనసాగినంత సేపూ ప్రధానమంత్రి పూర్తిగా సభలోనే ఉండటం ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. మేం మాత్రం చర్చను ఆపాలని అనుకోవడం లేదు. వాళ్లు అనుకుంటే వాళ్ల ఇష్టం'' అని అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఆయన సమాధానంతో ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రధానమంత్రి వచ్చి తీరాల్సిందేనని డిమాండు చేస్తూ, ప్రధానమంత్రి పారిపోయారని నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. -
నోట్ల రద్దు గురించి ఆర్థిక మంత్రికి తెలియదా?
న్యూఢిల్లీ: ‘వైరుధ్యం ఎలా ఉంటుందో చూడండి.. 1)నోట్ల రద్దు.. ప్రధాని వ్యక్తిగత నిర్ణయం. కనీసం ఆర్థిక మంత్రిని, రిజర్వ్ బ్యాంక్ అధికారుల్ని సంప్రదించకుండా కూడా మోదీ దుస్సాహసం చేశారు. 2) నోట్ల రద్దు నిర్ణయం బీజేపీ పెద్దలకు, వారి సన్నిహితులకు ముందే లీకైంది. దీంతో వాళ్లు జాగ్రత్త పడ్డారు. పేదలను మాత్రం రోడ్డున పడేశారు..... ఈ రెండూ వేరువేరు వ్యక్తుల అభిప్రాయాలు కావు.. ఒకే పార్టీ ఒకసారి ఒకలా, మరోసారి ఇంకోలా మాట్లాడుతోంది. మొత్తంగా మోదీ ఇచ్చిన షాక్ నుంచి విపక్షాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పట్లో తేరుకోలేవు కూడా’అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వ్యవహారంలో విపక్షాల తీరును ఆక్షేపించిన ఆయన.. ఆర్థిక మంత్రికి తెలియకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను ఖండించారు. మోదీ సాహసోపేత నిర్ణయంతో కొన్ని రోజులు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా అంతిమంగా ఎన్నో మేళ్లు జరుగుతాయని, తద్వారా పేదలు లబ్దిపొందుతారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా ‘సాధారణం’ అనుకున్న విధానాలన్నింటికీ చరమగీతం పాడుతూ మోదీ దాని(మామూలు) స్థాయిని పెంచారని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమోదించామని మంత్రి వెంకయ్య నాయుడు మీడియాకు తెలిపారు. ఇక మంగళవారం కూడా నోట్ల రద్దు వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను ఉదిపేసింది. సభలు ప్రారంభమైన వెంటనే స్పీకర్, చైర్మన్ల పోడియంలను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గందరగోళపరిస్థితిని నివారించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలు పలు మార్లు వాయిదాపడ్డాయి. -
ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు
-
ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు: ఆజాద్
పాక్ ఉగ్రవాదులు ఉడీలో సైనిక శిబిరంపై దాడిచేసి, భారత సైనికులను దారుణంగా హతమార్చిన విషయమై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేయడంలో ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల ఇప్పుడు చనిపోతున్నవారిలో సగం మంది కూడా ఉడీ ఉగ్రదాడిలో మరణించలేదని గులాం నబీ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు కొంతమంది ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో గులాం నబీ ఏమన్నారో సరిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జాతిని అవమానిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఘటనను పాక్ ఉగ్రవాద దాడులతో ఆయన పోలుస్తున్నారని.. అందుకు ఆయన క్షమాపణ చెప్పి తీరాలని, ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే తాను రికార్డులు పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని సభాధ్యక్షుడు పీజే కురియన్ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి గురైన గులాం నబీ ఆజాద్.. ''మీరు పాకిస్థాన్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లి వచ్చి, వాళ్లకు రెడ్ కార్పెట్లు పరుస్తారు, మీరు మాకు చెబుతారా.. పాకిస్థాన్ కాల్పులకు ప్రతిరోజూ గురయ్యే రాష్ట్రానికి చెందినవాడిని నేను. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆయన అన్నారు. అయితే వెంకయ్య నాయుడు మాత్రం తన వాదనకు కట్టుబడి ఉండి.. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, ఆయన క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ గందరగోళం నడుమ రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. -
రూ. 2 వేల నోటుతో మరింత అవినీతి: ఏచూరి
-
రూ. 2 వేల నోటుతో మరింత అవినీతి: ఏచూరి
కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చిందని, దాంతో అవినీతి తగ్గడం కాకుండా మరింత ఎక్కువవుతుందని సీపీఎం అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో బుధవారం మధ్యాహ్నం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. అసోంలో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ టీ కార్మికులకు మినహాయింపు ఇచ్చారని, ఇతర ప్రాంతాల్లో ఇది ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం స్వీడన్లో మాత్రమే పూర్తిగా నగదు రహిత వ్యవస్థ ఉందని, అక్కడ నూటికి నూరుశాతం ఇంటర్నెట్ విస్తృతి ఉంది కాబట్టి అందరూ తమ ఫోన్లు, ఐ ప్యాడ్ల సాయంతో చెల్లింపులు చేస్తారని.. కానీ మన దేశంలో అంత విస్తృతి ఎక్కడ ఉందని అడిగారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరినీ కరెన్సీ వాడొద్దని, అన్నిచోట్లా కార్డులే వాడాలని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని అన్నారు. 86 శాతం నగదును రద్దుచేసి.. కేవలం 14 శాతం నగదుపైనే వ్యవస్థ నడవాలంటున్నారని చెప్పారు. ధాన్యం ధర గణనీయంగా పడిపోయిందని, లక్షలాది ట్రక్కులు జాతీయ రహదారిపైనే ఉండిపోయాయని సీతారాం ఏచూరి అన్నారు. దేశం వెలుపల 90 శాతం నల్లధనం ఉందని ప్రధానమంత్రి చెప్పారని, దాన్ని వెనక్కి తీసుకొచ్చి దేశ ప్రజలు ప్రతి ఒక్కరి అకౌంటులో రూ. 15 లక్షలు వేస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం 6 శాతం బ్లాక్‌మనీ మాత్రమే నగదు రూపంలో ఉందని, మిగిలినదంతా పెట్టుబడులు, వ్యాపారాల రూపంలోనే ఉందని తెలిపారు. రైతులకు కచ్చితంగా ఉపశమనం కల్పించాలని, ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. రైతులు తమ పంటలను కూడా అమ్ముకోలేకపోతున్నారన్నారు. -
అద్వానీలాగే అరుణ్ కూడా..
- డీడీసీఏ వివాదం నుంచి అరుణ్ జైట్లీ భేషుగ్గా బయటపడతారన్న ప్రధాని - హవాలా కేసు నుంచి అద్వానీ కడిగిన ముత్యంలా బయటికొచ్చారని గుర్తుచేసిన మోదీ - బీజేపీపీపీ భేటీ వివరాలను వెల్లడించిన వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: 'హవాలా కుంభకోణం వెలుగుచూసినప్పుడు మన పార్టీ కురువృద్ధుడు అద్వానీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలు ఇలానే గోలచేశాయి. కానీ చివరికి అద్వానీజీ కడిగిన ముత్యంలా బయటికొచ్చారు. ఆయనపై మోపిన ఆరోపణలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు అరుణ్ జైట్లీ విషయంలోనూ అదే జరుగుతుంది. డీడీసీఏ వివాదం నుంచి ఆయన భేషుగ్గా, స్వచ్ఛంగా బయటపడతారనే నమ్మకం ఉంది'.. ఇదీ స్థూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో అన్న మాటలు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీపీపీ కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. హవాలా కేసు నుంచి అద్వానీ బయటపడ్డట్టే, డీసీసీ వివాదం నుంచి అరుణ్ జైట్లీ బయటపడతారని ప్రధాని అన్నారని వెంకయ్య తెలిపారు. కేవలం ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేసేందుకే విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు జైట్లీని టార్గెట్ చేసినట్లే గతంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లపై నిందారోపణలు చేశారని దుయ్యబట్టారు. -
ఈ రెండు రోజులు ఎలా?
- మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ - రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలపై చర్చ న్యూఢిల్లీ: రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ, మంగళవారం నాటి బాలనేరస్తుల చట్టం సవరణ బిల్లు తప్ప ఇతర నిర్దేశిత అంశాలపై చర్చలేకుండానే పార్లమెంట్ శీతాకాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంట్ లోని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు పార్టీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల చివరి రెండు రోజులైన మంగళ, బుధవారాల్లో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా నేడు రాజ్యసభ ముందుకు రానున్న బాలనేరస్తుల చట్టం సవరణ బిల్లుపై ఎలా స్పందించాలనేదానిపై పార్టీ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇది కాక ఉభయసభల్లో పెండింగ్ లో ఉన్న 18 బిల్లుల ఆమోదించుకునేందుకు ఏం చేయాలనేదానిపైనా చర్చించినట్లు సమాచారం. -
జైట్లీ రాజీనామాకు విపక్షాల పట్టు
న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)లో అక్రమాల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. సోమవారం ఉదయం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ విపక్షాలునినదించారు. డీడీసీఏపై చర్చించేవీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం ఏర్పడటంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై దుమారం చెలరేగింది. సభ ప్రారంభానికి ముందే విపక్ష కాంగ్రెస్ డీడీసీఏపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చైర్మన్ తీర్మానాన్ని అంగీకరించకపోవడంతో అరుణ్ జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభ 30 నిమిషాలు వాయిదాపడింది. వరుస వాయిదాల అనంతరం 12:30కు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనపై వచ్చిన ఆరోపణలపై వివరాణ ఇచ్చేందుకు ఉద్యుక్తులుకాగా, విపక్ష ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారు. ఒక సందర్భంలో ఆగ్రహానికి లోనైన జైట్లీ 'కూర్చొని వినండి' అంటూ గట్టిగా అరిచారు. దీనికి ప్రతిగా విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని జైట్లీ వివరణ ఇచ్చారు. ఏమిటీ కుంభకోణం? ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న 13ఏండ్ల కాలంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. జైట్లీ హయాంలో డీడీసీఏ ఎన్నో అక్రమాలకు పాల్పడిందనీ, అతణ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ ఆప్ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను కూడా నియమించింది ఢిల్లీ ప్రభుత్వం. 2008-12 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ. 24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మొన్నటి భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ సందర్భంలోనూ ఈ విషయం వివాదాస్పదం కావటం, డీడీసీఏ కోర్టుకెళ్లడం, ప్రభుత్వానికి తాత్కాలికంగా రూ. కోటి చెల్లించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నిర్మించిన కార్పొరేట్ బాక్సుల విషయంలో అక్రమాలు జరిగాయని బీజేపీకే చెందిన ఎంపీ కీర్తి ఆజాద్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపై సీబీఐ నిర్వహించిన సోదాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సోదాలు అరుణ్ జైట్లీని కాపాడే ఉద్దేశంతో డీడీసీఏ ఫైళ్ల కోసమే సీబీఐ హడావుడి చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ సందర్భంగా ఆరోపించారు. -
ఆప్ ఎంపీని ఆదుకున్న మోదీ
- ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చి అలసిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మన్ - మంచినీళ్లు అందించి దాహార్తి తీర్చిన ప్రధానమంత్రి న్యూఢిల్లీ: శత్రువైనాసరే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోమని చెప్పే కర్మభూమి మనది. అందుకేనేమో నరేంద్ర మోదీ.. పదవీమర్యాదలు పక్కనపెట్టిమరీ దాహంతో అల్లాడుతున్న విపక్ష ఎంపీకి మంచినీళ్లు అందించి సభ చేత శెభాష్ అనిపించుకున్నారు. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన అరగంటకు చోటుచేసుకున్న ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. సభలో అసలేం జరిగిందంటే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆఫీసుపై సీబీఐ దాడులపై చర్చించాల్సిందిగా ఆప్ ఎంపీ భగవత్ మన్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తీరును నిరసిస్తూ భగవత్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద పెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆయనకు బాసటగా నిలిచారు. దీంతో వెల్ మొత్తం విపక్ష ఎంపీలతో నిడిపోయింది. సరిగ్గా ప్రధాని కూర్చున్న స్థానానికి ముందే నిలబడి నిరసన తెలుపుతున్న భగవత్.. అలసటతో మంచినీటి కోసం అటూ ఇటూ వెదికారు. ఆయన దాహార్తిని అర్థం చేసుకున్న మోదీ.. తన టేబుల్ మీదున్న గ్లాసును భగవత్ కు అందించారు. ఆప్ ఎంపీ ఒక్క గుక్కలో గ్లాసును ఖాళీచేసి తిరిగి టేబుల్ మీద ఉంచగా, మోదీ ఆ గ్లాసుపై మూత పెట్టేశారు. అంతే, ప్రధాన మంత్రి చర్యను ప్రశంసిస్తూ బీజేపీ సభ్యులు బల్లలు చరిచారు. దాహం తీరిన భగవత్ ఆందోళన కొనసాగించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు అడ్డుండటంతో ప్రధాని టేబుల్ వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటనను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చూడలేకపోయారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. -
పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు
-
పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు
- అసహనంపై చర్చలో సర్కారుపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ: అసహనం అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని.. ఇటీవలి సంఘటనలతో కలత చెందిన వారు ఏం చెప్తున్నారో వినాలని హితవు పలికారు. అసహనంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నిరసన తెలుపుతున్న ఎంతోమందిలో నారాయణమూర్తి, రఘురామ్‌రాజన్, పి.ఎం.భార్గవ వంటి వారు ఉన్నారు. లక్షలాది మంది ఇతర జనం లాగానే వారు కూడా కలత చెందారు. వారిని గౌరవించండి.. వారిని కలతకు గురిచేస్తోందేమిటో అర్థంచేసుకోవటానికి ప్రయత్నం చేయండి. వెళ్లి వారు చెప్తున్నది వినండి’’ అని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. హరియాణాలో సజీవదహనమైన ఇద్దరు దళిత చిన్నారుల మరణాన్ని.. కుక్కపై రాయి వేయటంతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వి.కె.సింగ్ అంశాన్ని రాహుల్ ప్రస్తావించినపుడు అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి సింగ్ ఆ సమయంలో సభలో లేరు. ‘మన ప్రధానమంత్రి ఈ మనిషిని మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఆ ఇద్దరు చిన్నారులూ సజీవదహనం కాకుండా ఉండాలని.. అంబేడ్కర్ తన జీవితాన్నంతా వెచ్చించి రాజ్యాంగాన్ని రచించారు. ప్రధాని ఈ వైరుధ్యాన్ని చూడలేకపోయారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించగా.. ప్రతిపక్ష సభ్యులు ‘సిగ్గు.. సిగ్గు’ అని నినాదాలు చేశారు. ‘‘పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. సహనంతో ఉండండి. మీ ప్రజల మాటలు వినండి. మీ సొంత ప్రజలను ఆలింగనం చేసుకోండి. ప్రజలకు మహాత్మా గాంధీ గళాన్ని అందించారు. పాకిస్తాన్ విఫలమైంది ఎందుకంటే.. వారి నాయకులు ప్రజల గొంతును అణచివేశారు.. హింసాత్మకంగా ప్రవర్తించారు. మనం తప్పుడు పాఠాలు నేర్చుకోకూడదు’’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాం... అమీర్‌ఖాన్ అంశంపై బీజేపీ నేతలపై రాహుల్ విమర్శలు ఎక్కుపెడుతూ.. ‘‘ప్రధానమంత్రి ఆర్థిక ప్రగతి, పురోభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. అదే సమయంలో ఆయన సహచరులు కొంతమంది బాలీవుడ్ నటులను పాకిస్తాన్‌కు పంపించటం గురించి మాట్లాడుతుంటారు. మనం ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాం. వారిని చర్చలో భాగస్వాములను కానివ్వండి. మనం తప్పుడు పాఠం నేర్చుకోవద్దు (పాకిస్తాన్ నుంచి). వారి అతి పెద్ద బలహీనత అసహనం’’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్టీఐఐ విద్యార్థుల ఆందోళన గురించి ప్రస్తావిస్తూ.. ఎఫ్టీఐఐ విద్యార్థులు అడిగిందల్లా.. ఒక సాధారణ వ్యక్తిని సంస్థ అధిపతిగా చేయటంపై తమ అభిప్రాయం వినాలని మాత్రమే. అయినాకూడా ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది. నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గి వంటి హేతువాదులు హత్యకు గురయ్యాక కూడా ప్రధానమంత్రి ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్‌శౌరీని.. ట్విటర్లో ప్రధానమంత్రిని అనుసరించే వాళ్లు అనుచిత విమర్శలతో వేధించటాన్నీ రాహుల్ విమర్శించారు. పక్షవాతంతో బాధపడుతున్న శౌరీ కుమారుడిని కూడా వాళ్లు వదిలిపెట్టలేదని నిరసించారు. ఇది స్వప్నం కాదు.. వాస్తవం... ‘‘దాద్రీలో బీఫ్ తిన్నారన్న వదంతులపై ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ.. హతుడి కుమారుడు వైమానిక దళ సిబ్బంది అయినా కూడా ప్రధానమంత్రి మౌనంగానే ఉండిపోయారు. అతడికి రక్షణ కల్పించే బాధ్యత తుదిగా.. మౌనంగా ఉండిపోయిన ప్రధాని పైనే ఉంది’’ అని తీవ్రంగా విమర్శించారు. రచయితలు, కళాకారుల నిరసనలను కల్పిత విప్లవంగా ప్రభుత్వం కొట్టివేయడాన్ని తప్పుపడుతూ.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం ఇష్టపడలేదని విమర్శించారు. ‘‘వారు దీనిని ఎందుకు కల్పిస్తారు? అరుణ్‌జైట్లీ గారూ.. ఇది మీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లాగా స్వప్నం కాదు.. ఇది వాస్తవం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మీపై నిరసనలను సృష్టించటం కన్నా నారాయణమూర్తి, రాజన్, భార్గవలకు వేరే పని లేదా?’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం... రాజ్యాంగంపై అవగాహన పెంచేందుకు.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్యాంగాన్ని ఒక ఏనుగుపై ఉంచి దానితో కలిసి నడిచానని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన అలా నడవాలని మేం కోరుకోవటం లేదు.. (రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు) పని చేయాలని మేం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాధూరాం గాడ్సేను దేశభక్తుడని బీజేపీ సభ్యుడు సాక్షి మహరాజ్ కీర్తించారని రాహుల్ పేర్కొనగా.. సభలోనే ఉన్న సదరు సభ్యుడు విభేదించారు.