
ఢిల్లీలో జాతీయ నేతలను కలుస్తాం: అశోక్‌బాబు
గతంలో తాము కలవలేకపోయిన జాతీయ పార్టీల నేతలను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లి కలవనున్నట్టు, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరనున్నట్టు ఏపీఏన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.
7న గుంటూరు భేటీ వాయిదా.. 9న హైదరాబాద్‌లో నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: గతంలో తాము కలవలేకపోయిన జాతీయ పార్టీల నేతలను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లి కలవనున్నట్టు, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరనున్నట్టు ఏపీఏన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీ-బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా గళం విప్పాలని కోరుతూ ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిశామని, వైఎస్సార్ కాంగ్రెస్, మజ్లిస్, లోక్‌సత్తా పార్టీల నేతలను బుధవారం కలుస్తామని అశోక్‌బాబు చెప్పారు.
ఈ నెల ఏడున గుంటూరులో తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేశామని, దానిని తొమ్మిదిన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను రూపొందించుకున్నట్టు అశోక్‌బాబు చెప్పారు. డిసెంబర్ 22న నామినేషన్ల ప్రక్రియ, జనవరి 5న ఎన్నికలు జరుగుతాయన్నారు.