
న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సభ ముందు ఉంచనున్నారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేయడం తెలిసిందే.