Parliament Session Updates: లోక్‌సభ శుక్రవారానికి వాయిదా | Parliament session live Updates Lok Sabha Rajya Sabha Congress Protest BJP | Sakshi
Sakshi News home page

Parliament Session Updates: మధ్యాహ్నం 2 వరకు లోక్‌సభ వాయిదా

Published Thu, Dec 5 2024 11:26 AM | Last Updated on Thu, Dec 5 2024 4:13 PM

Parliament session live Updates Lok Sabha Rajya Sabha Congress Protest BJP

న్యూఢిల్లీ, అప్‌డేట్స్‌: 

  • రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్‌ చేసిన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నిరసన
  • నిషికాంత్ దూబే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
  • విదేశీ పెట్టుబడిదారుడికి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు ఉన్నాయన్న నిషికాంత్‌ దూబే
  • మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతిని అణగదొక్కడానికి అంతర్జాతీయ కుట్ర  పన్నారని ఆరోపణ
  • దూబే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి

 

  • లోక్‌సభ రేపటికి(శుక్రవారానికి) వాయిదా
  • స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం జీరో అవర్‌ను ప్రారంభించగా..  విపక్ష సభ్యులు లేచి నిలబడి, సంభాల్ హింసాత్మక పరిస్థితులపై సభలో చర్చించాలని పట్టుబట్టారు.
  • దూబే తన ప్రజెంటేషన్‌ను పూర్తి చేసిన తర్వాత సంభాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ బిర్లా హామీ ఇచ్చారు.
    అయినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేస్తునన్నట్లు ప్రకటించారు.

ప్రతిపక్ష పార్టీల తీరుతో  చాలా బాధపడ్డాను: కిరన్ రిజుజు

  • శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల తీరుతో  చాలా బాధపడ్డాను.
  • తొలి రోజు నుంచే బిల్లులు,  రాజ్యాంగంపై చర్చ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించాం. 
  • కానీ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎందుకు నిరసన చేస్తున్నాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి పార్లమెంట్‌ వెలుపల ఎందుకు నాటకాలాడుతున్నారు. ఇదనే సభ నడిచే తీరు;
  •  పార్లమెంట్ హౌస్ అంటే  చర్చలు జరగాలి. కానీ వారు రంగురంగుల బట్టలు వేసుకుని పార్లమెంట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు.
  • భారతదేశం వెలుపల కొన్ని గ్రూపులు పన్నిన కొన్ని కుట్రల గురించి, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత ప్రయోజనాలపై దాడి చేయడంపై నేడు మన ఎంపీలలో కొందరు చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఇవి చాలా తీవ్రమైన విషయాలు
  • కానీ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వానికి సంబంధం లేని మరికొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సమస్యలను లేవనెత్తుతూ పార్లమెంటు ఆవరణ చుట్టూ తిరుగుతున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలతో చాలా బాధపడ్డాను’  అని రిజుజు అన్నారు.
     
  • సంభాల్ హింసాకాండ, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై గందరగోళం మధ్య లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.
  • ప్రతిపక్షాలు అన్ని చోట్లా ఓడిపోతాయి: బీజేపీ ఎంపీ రవికిషన్
  • ‘హర్యానాలో ఓడిపోయారు. మహారాష్ట్రలో  ఘోర  పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఓడిపోతారు. అందుకే వారి  బాధ ఇక్కడ చూపిస్తున్నారు’ అని కిషన్‌ అన్నారు.
  • మధ్యాహ్నం 12 వరకు రాజ్యసభ వాయిదా
  • పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు గురువారం రోజు ప్రారంభమయ్యాయి. 

  • అదానీ వ్యవహారంపై లోక్‌సభ రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. 

  • ఈ మేరకు పార్లమెంట్‌ ఆవరణలో రాహుల్‌ మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ విచారణ జరపలేరని అన్నారు. ఎందుకంటే అలా చేయాలంటే తనను తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు.మోదీ ఔర్ అదానీ ఏక్ హై. దో నహీ హై, ఏక్ హై(మోదీ, అదానీ ఒకటే.. ఇద్దరు కాదు)అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ గురువారం లోక్‌సభలో ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రాథమిక హక్కుల తిరస్కరణ’పై చర్చను కోరుతూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ.. ఇది ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఠాగూర్‌ పేర్కొన్నారు.

మరోవైపు నేడు లోక్‌సభ రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024పై చర్చను కొనసాగించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు, 2024, విపత్తు నిర్వహణ చట్టం, 2005ని సవరించడానికి ముందుకు తీసుకురానున్నారు. ఇక భారతీయ వాయుయన్ విధేయక్, 2024పై రాజ్యసభలో చర్చ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement