
ఢిల్లీ: రెండో రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేట్లో ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా మరికాసేపట్లో పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి చర్చించనుంది. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, విదేశాంగ విధానం, సరిహద్దుల్లో పరిస్థితులపై ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చకు అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇండియా కూటమి భావిస్తోంది.
ఇప్పటికే కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య (బీఎస్) బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఈ సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment