సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ బుధవారం తెలిపారు. వివిధ రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు. సమావేశాలు ఆలస్యమయ్యాయని ప్రతి పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. గతంలో 2008, 2013లో డిసెంబర్‌లోనే నిర్వహించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
అయితే ప్రతి ఏటా నవంబర్‌లోనే శీతకాల సమేశాలు నిర్వహిస్తారు. ట్రిపుల్ తలాక్, ఐబీసీ దివాళ చట్టంపై చర్చించనున్నారు. ఇక మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment