ananta kumar
-
కేంద్ర మంత్రి అనంతకుమార్‌ను అరెస్టు చేయాలి
వైట్‌ఫీల్డ్ (బెంగుళూరు) : ఎస్సీల విషయంలో రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వైట్‌ఫీల్డ్ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇన్నర్ సర్కిల్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లూరుహళ్ళి నాగేష్ నాయకత్వంలో ర్యాలీగా స్థానిక వైట్‌ఫీల్డ్ డీసీపీ కార్యాలయం వరకు వెళ్ళారు. అక్కడ మంత్రి అనంతకుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రిని వెంటనే అరెస్టు చేయాలని... మంత్రి తన పదవికి రాజీనామా చేయలంటూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లూరుహళ్ళి నాగేష్ మంత్రి మాట్లాడిన సీడీని, కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు అందజేశారు. ఈసందర్భంగా నల్లూరుహళ్ళి నాగేష్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నత పదవిలోవున్న మంత్రి అనంతకుమార్ ఎస్సీలను అసహనానికి గురిచేసే విధంగా ఒక బహిరంగ సభలో మాట్లాడడం సరికాదని ఖండించారు. ఈ విషయమై భారతీయ జనతాపార్టీలోవున్న ఎస్సీ విభాగం నాయకులు సైతం వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి వ్యక్తిపై కేసు నమోదుచేసి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ నాయకులు కృష్ణప్ప, వెంకటేష్, హరీష్, పృద్వీ, రాజకుమార్, శివ, భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. -
డిసెంబర్ 15 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ బుధవారం తెలిపారు. వివిధ రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు. సమావేశాలు ఆలస్యమయ్యాయని ప్రతి పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. గతంలో 2008, 2013లో డిసెంబర్లోనే నిర్వహించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రతి ఏటా నవంబర్లోనే శీతకాల సమేశాలు నిర్వహిస్తారు. ట్రిపుల్ తలాక్, ఐబీసీ దివాళ చట్టంపై చర్చించనున్నారు. ఇక మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. -
మోడీ పాలన భేష్
కేంద్ర మంత్రి అనంత కుమార్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ఎంతో సాధించారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ కితాబునిచ్చారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన బెంగళూరు నగర జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. యూపీఏ హయాంలో వంట గ్యాస్‌కు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లు అందేలా చూస్తున్నదని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల హయాంలో దేశానికి లభించని అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను కేవలం వంద రోజుల్లోనే మోడీ సాధించగలిగారని ప్రశంసించారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి అపూర్వ స్వాగతం పలకడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 23న సాయంత్రం అయిదు గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వస్తున్న మోడీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సత్కరించనునున్నట్లు చెప్పారు. కనుక నగరంలోని ప్రతి వార్డూ, నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. నగరానికి వచ్చిన వెంటనే ప్రధాని తొలుత ఇస్రోను సందర్శిస్తారని, మార్గ మధ్యంలో కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. 24న ఉదయం పది గంటలకు తుమకూరులో ఇండియా ఫుడ్ పార్కుకు శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ మంత్రులు ఆర్. అశోక్, అరవింద లింబావళి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
‘మేయర్’ ఎంపికపై ఉత్కంఠ
బరిలో నలుగురు ముందంజలో రవీంద్ర, పద్మరాజ్ అశోక్ నేతృత్వంలో చర్చలు అనంతకుమార్ నిర్ణయమే ఫైనల్? బెంగళూరు : బీబీఎంపీ కొత్త మేయర్ ఎంపికలో ఉత్కంఠ నెలకొంది. కాబోయే మేయర్ అవధి కేవలం ఏడు నెలలే ఉండటంతో సమర్థవంతమైన వ్యక్తిని నియమించి మళ్లీ పాలికె ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు వ్యూహా లు రచిస్తున్నారు. అందులో భాగంగా గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ నేతృత్వంలో పార్టీ నాయకులు, బీబీఎంపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఆ పదవిని తమకు కట్టబెట్టాలంటూ పార్టీపై పలువురు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఆ పదవి కోసం సుమారు 10 మందికి పైగా పోటీపడ్డారు. అయితే చివరకు సీనియర్ కార్పొరేటర్లు నంజుండప్ప, రవీంద్ర, శాంతకుమార్, హెచ్ఎస్ పద్మరాజ్ మిగిలారు. వారిలో రవీంద్ర, పద్మరాజ్ ముందంజలో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం బాగా పని చేశారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వద్ద రవీంద్ర మార్కులు కొట్టేశారు. అంతేకాకుండా ఆయనకు అశోక్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక సమాజ సేవ కుడు, సీనియర్ కార్పొరేటర్ పద్మరాజ్‌కు మాజీ మంత్రి సురేష్ కుమార్ అండ ఉంది. వీరిద్దరి కాని పక్షంలో నంజుండప్ప, శాంతకుమారిలో ఒకరికి ఆ అవకాశం ఇవ్వాలని కమలనాథుల ఆలోచన. డిప్యూటీ మేయర్ రేసులో ఇద్దరు ఉన్నారు. శుక్రవారం నూతన మేయర్‌కు ఎన్నిక జరగాల్సి ఉంది. సమావేశం అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ ఢిల్లీ వెళ్లారని, ఆయన వచ్చిన తర్వాత కోర్ కమిటీతో, పార్టీ కార్పొరేటర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
యడియూరులో బయోగ్యాస్ ప్లాంట్
బనశంకరి : చెత్త సమస్యను పరిష్కరించడంలో భాగంగా బీబీ ఎంపీ పరిధిలో 19 ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎరువులు రసాయన శాఖామంత్రి అనంతకుమార్ తెలిపారు. పద్మనాభనగర విధానసభ నియోజకవర్గం లోని యడియూరు వార్డు సౌత్ఎండ్ సర్కిల్ వద్ద ఏర్పాటు బ యోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కేంద్రాల్లో చెత్త ద్వారా విద్యుత్, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారని తెలిపారు. యళ్లూరు వివాదాన్ని మహారాష్ట్ర రాజ కీయ నేతలు ఎన్నికల్లో అస్త్త్రంగా ఉపయోగించుకొని లబ్ధిపొందడానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మేయర్ కట్టేసత్యనారాయణ మాట్లాడుతూ.. కేఆర్ మార్కెట్లో ఇటీవల ఏర్పాటు చే సిన ఇలాంటి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం బాగా పనిచేస్తోందన్నారు. యలహంక, మల్లేశ్వరం వద్ద కూడా ఇలాంటి కేంద్రాల ను ప్రారంభిస్తామన్నారు. యడియూరు వార్డు కార్పొరేటర్ ఎన్ఆర్ రమేశ్ మాట్లాడుతూ... ఈ కేంద్రం ద్వారా 50 కిలో వా ట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. దీని ద్వారా ప్రతి నెలా బెస్కాంకు చెల్లించాల్సిన రూ.లక్ష 75 వేలు మిగులుతుందన్నారు. అలాగే మండూరు కు చెత్త తరలించడానికి అయ్యే రూ.4 లక్షలు మిగులుతాయన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ సభ్యుడు నాగరాజ్, బీజేపీ నేత ఎంఆర్ వెంకటేశ్ పాల్గొన్నారు. -
గెలిచి తీరుతా
బెంగళూరు : ప్రతిష్టాత్మకంగా మారిన బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ పోటీ చేస్తున్నారు. 1996 నుంచి ఈ నియోజక వర్గం నుంచి గెలుస్తున్న ఆయన, ఆరో సారి లోక్‌సభలో ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దాంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల తేది సమీపిస్తున్న నేపధ్యంలో అనంత కుమార్ సాక్షితో మాట్లాడుతూ నూటికి నూరు శాతం విజయం తనదేనని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు ఎవరూ నిలవలేరన్నారు. ఇక్కడి ఐటీ రంగంలోని వారు సంప్రదాయికంగా బీజేపీ ఓటర్లని, అందువల్ల నిలేకని లెక్కలు తప్ఫుతాయనని చెప్పారు. -
మోడీ ప్రధాని అయితే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
సాక్షి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయితే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్’ బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వస్తుందని ఎంపీ అనంతకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళామోర్చ ఆధ్వర్యంలో నగరంలోని శిక్షకర సదన్‌లో శనివారం రాష్ట్ర స్థాయి ‘మహిళా న్యాయవాదుల సమావేశం’ జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ... రాజకీయంగా మహిళలు ఎదిగినప్పుడు మాత్రమే సమాజంలో వివిధ తారతమ్యాలు తగ్గిపోతాయన్నారు. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన వెంటనే మహిళలకు రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించబడిన బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వ చ్చి తీరుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ కరువవుతోందన్నారు. పోలీసు వ్యవస్థలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం ద్వారా సమస్యను కొంతవరకూ పరష్కరించవచ్చన్నారు. అదేవిధంగా ‘మహిళ హొయసల’, ‘మహిళ చీత’ వంటి ప్రత్యేక విభాగాల ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం పోలీసు సిబ్బందిలో కేవలం 5 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారన్నారు. దీనిని 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్లో మహిళల సమస్యలను పరిష్కరించడానికి నారీ అదాలత్‌లు అక్కడి ప్రభుత్వం తరుచుగా నిర్వహిస్తోందన్నారు. అలాంటి వ్యవస్థ రాష్ట్రంలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని అనంతకుమార్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ మహిళమోర్చ అధ్యక్షురాలు శశికళ, సీనియర్ న్యాయవాది ప్రమీళ నెసర్గీ తదితరులు పాల్గొన్నారు.