బనశంకరి : చెత్త సమస్యను పరిష్కరించడంలో భాగంగా బీబీ ఎంపీ పరిధిలో 19 ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎరువులు రసాయన శాఖామంత్రి అనంతకుమార్ తెలిపారు. పద్మనాభనగర విధానసభ నియోజకవర్గం లోని యడియూరు వార్డు సౌత్‌ఎండ్ సర్కిల్ వద్ద ఏర్పాటు బ యోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కేంద్రాల్లో చెత్త ద్వారా విద్యుత్, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారని తెలిపారు.
యళ్లూరు వివాదాన్ని మహారాష్ట్ర రాజ కీయ నేతలు ఎన్నికల్లో అస్త్త్రంగా ఉపయోగించుకొని లబ్ధిపొందడానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మేయర్ కట్టేసత్యనారాయణ మాట్లాడుతూ.. కేఆర్ మార్కెట్లో ఇటీవల ఏర్పాటు చే సిన ఇలాంటి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం బాగా పనిచేస్తోందన్నారు. యలహంక, మల్లేశ్వరం వద్ద కూడా ఇలాంటి కేంద్రాల ను ప్రారంభిస్తామన్నారు.
యడియూరు వార్డు కార్పొరేటర్ ఎన్‌ఆర్ రమేశ్ మాట్లాడుతూ... ఈ కేంద్రం ద్వారా 50 కిలో వా ట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. దీని ద్వారా ప్రతి నెలా బెస్కాంకు చెల్లించాల్సిన రూ.లక్ష 75 వేలు మిగులుతుందన్నారు. అలాగే మండూరు కు చెత్త తరలించడానికి అయ్యే రూ.4 లక్షలు మిగులుతాయన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ సభ్యుడు నాగరాజ్, బీజేపీ నేత ఎంఆర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
యడియూరులో బయోగ్యాస్ ప్లాంట్
Published Sun, Aug 3 2014 3:47 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement