biogas plant
-
రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రిలయన్స్ ఎనర్జీ రాష్ట్రంలో రూ.65 వేలకోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ గ్రూపు ప్రతినిధులు, ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ విజయానంద్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమైంది. రిలయన్స్ రూ.1,024 కోట్లతో తొలిదశలో ఏర్పాటు చేయనున్న ఎనిమిది ప్లాంట్లకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి సీఎం వైఎస్ జగన్ పునాది వేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఆ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రెండోదశలో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని రిలయన్స్ అప్పుడే చెప్పింది. ఇప్పుడు 500 ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు లోకేశ్ ఘనత అని మీడియాకు లీకులివ్వడం విమర్శనీయంగా మారింది. మూడేళ్లలో పూర్తిచేయాలి ఒప్పందం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్కొక్కటి రూ.130 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ల పనుల్ని మూడేళ్లలో పూర్తిచేయాలని రిలయన్స్ ప్రతినిధులను కోరారు. వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలన్నారు. వృధా భూముల్లో ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ చెత్తను పండించడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.క్లీన్ ఎనర్జీ పాలసీలో రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 8 ప్లాంట్లకు మున్సిపాలిటీల తడిచెత్తను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు రిలయన్స్ ప్రతినిధి మాట్లాడుతూ రాష్ట్రంలో కాకినాడలో మూడు, రాజమహేంద్రవరంలో రెండు, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఒక్కోప్లాంటు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. అవి వచ్చే మార్చి నుంచి నవంబర్‌లోగా ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. మంత్రులు లోకేశ్, రవికుమార్, టి.జి.భరత్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్సార్ నిధులతో ఖైథలాపూర్‌లో ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: వ్యర్థం నుంచి అర్థం సృష్టించే చర్యల్లో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే చెత్త నుంచి విద్యుత్‌తో పాటు వాహనాల ఇంధనంగా వినియోగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్ మహానగరంలో సీఎన్జీ ఉత్పత్తికి మరో ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇందుకు అవసరమైన నిధుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద బాలానగర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అందజేయనుంది. బయోవేస్ట్ నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత చేసిన విజ్ఞప్తికి హెచ్ఏఎల్ సానుకూలంగా స్పందించింది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రూ. 3 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో, పనుల పురోగతిని బట్టి మరో కోటి రూపాయలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో అందజేసేందుకు కంపెనీ మేనేజ్మెంట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీకి పంపిన ముసాయిదా ఎంఓయూలో ప్లాంట్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్జీని నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సమీపంలోని చెత్త రవాణా కేంద్రాలకు రవాణా చేస్తున్న స్వచ్ఛ ఆటోలకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది. సీఎన్జీ ఉత్పత్తి ప్రక్రియలో చివరకు మిగిలే ఎరువును జీచ్ఎంసీ నర్సరీల్లో వినియోగించడంతో పాటు కోరుకునే ప్రజలకు, రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని కోరింది. బల్దియాకు తగ్గనున్న నిర్వహణ భారం కూకట్పల్లి జోన్‌లోని ఖైథలాపూర్ చెత్త రవాణా కేంద్రంలో బయోగ్యాస్ నుంచి సీఎన్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. 20 టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. రవాణా కేంద్రానికి వచ్చే చెత్త నుంచి వేరు చేసే 200– 300 మెట్రిక్ టన్నుల మేర బయోవేస్ట్‌ను సీఎన్జీ ఉత్పత్తికి వినియోగించనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్కమిటీ ఆమోదం లభించగానే ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే.. జవహర్‌నగర్‌లోని సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్ నుంచి విద్యుత్ ఉత్పత్తితోపాటు, సీఎన్జీ ఉత్పత్తి కూడా ప్రారంభించడం తెలిసిందే. సిలిండర్లలో నింపిన సీఎన్జీని వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు. (క్లిక్: పెట్రోల్, డీజిల్ ‘కట్’కట) -
చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: పశువుల పేడ, ఇతర వ్యవసాయ వ్యర్థాల ద్వారా పెద్ద తరహా (కస్టర్ బేస్డ్) బయోగ్యాస్ తయారీ యూనిట్లను పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీతోపాటు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్–ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ , మరో 12 రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గోబర్–ధన్ పథకంలో రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ల ఏర్పాటుకు కృష్ణా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అవకాశం ఉందని గుర్తించినట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో కనీసం 50 కంటే ఎక్కువగా పశువులున్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం గుర్తించినట్టు చెప్పారు. వాటిలో మొదట పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి, తర్వాత మిగిలిన మూడు జిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో గోబర్–ధన్ పథకం కింద పశువ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్ధతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం డీపీఆర్‌లను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించామని, వారి ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకం కింద ఏర్పాటుచేసే ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్, కంపోస్ట్‌లను మార్కెట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు.. గోబర్–ధన్ పథకం కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నామని, ఇంకా అవసరమైతే 15వ ఆర్థికసంఘం నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత గృహాల మోడల్, క్లస్టర్ మోడల్, కమ్యూనిటీ మోడల్, కమర్షియల్ మోడళ్లలో ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవికాకుండా రాష్ట్రమంతటా ఘన వ్యర్థాలను శుద్ధిచేసేందుకు, సేంద్రియ ఎరువులుగా మార్చేందుకు ఉపాధిహామీ పథకం కింద 10,645 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1,042 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలైందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
విస్కీ వ్యర్థాలతో బయో ఇంధనం
రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. ఇప్పడు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనం కాకుండా మరో వాహనం మార్కెట్లోకి రానుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రముఖ స్కాచ్ విస్కీ బ్రాండ్ "గ్లెన్ ఫిడిచ్" గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పడు ఈ కంపెనీ మద్యం తయారీతో పాటు ఇంధనం తయారీలో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా తన డెలివరీ వాహనాలలో పెట్రోలకు ప్రత్యామ్నాయంగా విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ ఇంధనాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇంధనం వాహన కాలుష్యాన్ని(సీఓ2 ఉద్గారాన్ని) 95% వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. గ్లెన్ ఫిడిచ్ ఇప్పటికే తన డెలివరీ ట్రక్కులను ఈ బయోగ్యాస్ ఇంధనం ద్వారా నడపడం ప్రారంభించింది. "క్లోజ్డ్ లూప్" ధారణీయత ప్రాజెక్ట్ లో భాగంగా ఈశాన్య స్కాట్లాండ్ లోని కంపెనీ డఫ్ టౌన్ డిస్టిలరీలో ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేసింది. విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ డీజిల్ ఇతర శిలాజ ఇంధనాలతో పోలిస్తే సీఓ2 ఉద్గారాలను 95% కంటే ఎక్కువ తగ్గిస్తుందని, ఇతర హానికరమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 99% వరకు తగ్గిస్తుందని గ్లెన్ ఫిడిచ్ పేర్కొంది. ఈ ఇందనాన్ని త్వరగా మార్కెట్లోకి తీసుకొనిరావడానికి కంపెనీ యోచిస్తుంది. ఒకవేల ఈ ఇందనాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితే కార్బన్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చు అని కంపెనీ పేర్కొంది. -
బయోగ్యాస్ ప్లాంట్‌లో పేలుడు..
-
బయోగ్యాస్ ప్లాంట్‌లో పేలుడు..
కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. మైదుకూరు సమీపంలోని బయోగ్యాస్ ప్లాంట్ వద్ద సోమవారం ఉదయం పేలుడు సంభవించి అందులో పనిచేస్తున్న రాముడు, ప్రసాదరెడ్డి అనే కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతుని పేరు తెలియరాలేదు. -
యడియూరులో బయోగ్యాస్ ప్లాంట్
బనశంకరి : చెత్త సమస్యను పరిష్కరించడంలో భాగంగా బీబీ ఎంపీ పరిధిలో 19 ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎరువులు రసాయన శాఖామంత్రి అనంతకుమార్ తెలిపారు. పద్మనాభనగర విధానసభ నియోజకవర్గం లోని యడియూరు వార్డు సౌత్ఎండ్ సర్కిల్ వద్ద ఏర్పాటు బ యోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కేంద్రాల్లో చెత్త ద్వారా విద్యుత్, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారని తెలిపారు. యళ్లూరు వివాదాన్ని మహారాష్ట్ర రాజ కీయ నేతలు ఎన్నికల్లో అస్త్త్రంగా ఉపయోగించుకొని లబ్ధిపొందడానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మేయర్ కట్టేసత్యనారాయణ మాట్లాడుతూ.. కేఆర్ మార్కెట్లో ఇటీవల ఏర్పాటు చే సిన ఇలాంటి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం బాగా పనిచేస్తోందన్నారు. యలహంక, మల్లేశ్వరం వద్ద కూడా ఇలాంటి కేంద్రాల ను ప్రారంభిస్తామన్నారు. యడియూరు వార్డు కార్పొరేటర్ ఎన్ఆర్ రమేశ్ మాట్లాడుతూ... ఈ కేంద్రం ద్వారా 50 కిలో వా ట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. దీని ద్వారా ప్రతి నెలా బెస్కాంకు చెల్లించాల్సిన రూ.లక్ష 75 వేలు మిగులుతుందన్నారు. అలాగే మండూరు కు చెత్త తరలించడానికి అయ్యే రూ.4 లక్షలు మిగులుతాయన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ సభ్యుడు నాగరాజ్, బీజేపీ నేత ఎంఆర్ వెంకటేశ్ పాల్గొన్నారు.