
బయోగ్యాస్ ప్లాంట్‌లో పేలుడు..
కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. మైదుకూరు సమీపంలోని బయోగ్యాస్ ప్లాంట్ వద‍్ద సోమవారం ఉదయం పేలుడు సంభవించి అందులో పనిచేస్తున‍్న రాముడు, ప్రసాదరెడ్డి అనే కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు కూడా ఆస‍్పత్రికి తరలిస్తుండగా మార‍్గమధ‍్యంలో మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతుని పేరు తెలియరాలేదు.