గెలిచి తీరుతా | Ananta Kumar confidence | Sakshi
Sakshi News home page

గెలిచి తీరుతా

Published Mon, Apr 14 2014 6:47 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

అనంత కుమార్ - Sakshi

అనంత కుమార్

బెంగళూరు :  ప్రతిష్టాత్మకంగా మారిన బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ పోటీ చేస్తున్నారు. 1996 నుంచి ఈ నియోజక వర్గం నుంచి గెలుస్తున్న ఆయన, ఆరో సారి లోక్‌సభలో ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దాంతో  పోటీ రసవత్తరంగా మారింది.

ఎన్నికల తేది సమీపిస్తున్న నేపధ్యంలో  అనంత కుమార్ సాక్షితో మాట్లాడుతూ నూటికి నూరు శాతం విజయం తనదేనని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు ఎవరూ నిలవలేరన్నారు.  ఇక్కడి ఐటీ రంగంలోని వారు  సంప్రదాయికంగా బీజేపీ ఓటర్లని, అందువల్ల  నిలేకని లెక్కలు తప్ఫుతాయనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement