Bangalore South
-
గెలిచి తీరుతా
బెంగళూరు : ప్రతిష్టాత్మకంగా మారిన బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ పోటీ చేస్తున్నారు. 1996 నుంచి ఈ నియోజక వర్గం నుంచి గెలుస్తున్న ఆయన, ఆరో సారి లోక్‌సభలో ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దాంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల తేది సమీపిస్తున్న నేపధ్యంలో అనంత కుమార్ సాక్షితో మాట్లాడుతూ నూటికి నూరు శాతం విజయం తనదేనని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు ఎవరూ నిలవలేరన్నారు. ఇక్కడి ఐటీ రంగంలోని వారు సంప్రదాయికంగా బీజేపీ ఓటర్లని, అందువల్ల నిలేకని లెక్కలు తప్ఫుతాయనని చెప్పారు. -
ఇద్దరు భర్తలు... ఇద్దరు భార్యలు...ఒక్క ఎంపీ సీటు
ఈ లోకసభ ఎన్నికల్లో బెంగుళూరు సౌత్ లో చాలా ఆసక్తిదాయకమైన పోటీ నెలకొంది. ఐటీ రంగ దిగ్గజం నందన్ నీలేకని, ఓటమినెరుగని బిజెపి నేత అనంతకుమార్ లు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. నీలేకని కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, అనంతకుమార్ బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. ఇద్దరు నాయకుల భార్యలు కూడా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అనంత్ కుమార్ భార్య తేజస్విని, నీలేకని భార్య రోహిణి ల ప్రచార శైలి కూడా చాలా భిన్నం. రోహిణి రాజకీయాలకు కొత్త. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లడం ఆమెకు అలవాటు లేదు. ఐటీ ఉద్యోగులతో కలిసి మాట్లాడటం కాస్త సులువుగానే ఉన్నా మిగతా ప్రజలతో ఆమె కలవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అసలు భర్త రాజకీయాల్లోకి వస్తారన్న విషయాన్ని ఆమె ఏనాడూ ఊహించలేదు. ఆమె ఇప్పటికీ జీర్ఝించుకోలేకపోతోంది. అయితే మారిన పరిస్థితులకనుగుణంగా తనను తాను మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్విని అనంత్ కుమార్ 1988 నుంచే ప్రజా జీవనంలో ఉన్నారు. ఆమెకు ప్రజలను కలవడం బాగా అలవాటు. నిజానికి అనంత్ కుమార్ కు మొదటి నుంచీ ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అసలు అనంత్ సక్సెస్ కు కారణం తేజస్వినే అని చాలా మంది చెబుతున్నారు. ఆమె గతంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ విభాగంలో పనిచేశారు. భర్త క్రియా శీల రాజకీయాల్లోకి రాగానే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిని, భర్త కార్యాలయాన్ని మేనేజ్ చేస్తున్నారు. నందన్ ఆస్తులు 770 కోట్లు. ఆయనకు ఇన్ఫోసిస్ లో 1.45 శాతం షేర్లున్నాయి. రోహిణికి కూడా 1.30 శాతం షేర్లున్నాయి. అనంత్ కుమార్ భార్యకు 4/2 కోట్ల ఆస్తి, అనంతకుమార్ కి 51.13 లక్షల విలువైన ఆస్తులున్నాయి. -
నాడు 200.. నేడు 7700 కోట్లు!!
నందన్ నీలేకని.. ఆధార్ కార్డుల పుణ్యమాని దేశం మొత్తానికి తెలిసిన పేరిది. ఒకప్పుడు నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేస్తున్న సందర్భంగా, తన ఆస్తుల విలువ 7,700 కోట్ల రూపాయలని ప్రకటించి సంచలనం సృష్టించారు. బహుశా ఈ ఎన్నికల్లో ఆయనకంటే ధనవంతుడైన అభ్యర్థి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, 1978లో ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చదవిన తర్వాత ఉద్యోగావకాశం వస్తే తనకొద్దని విదిల్చికొట్టేనాటికి ఆయన జేబులో ఉన్నవి కేవలం 200 రూపాయలే!! అక్కడినుంచి ఇప్పుడు దాదాపు 8వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించే స్థాయికి ఎదిగారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నందన్ నీలేకనికి నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన కోరమంగళ వద్ద రిసార్టు లాంటి ఇల్లు, లెక్కలేనన్ని విలాసవంతమైన కార్లు.. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. తనకు ఇప్పటికే బోలెడంత డబ్బుందని, ఇప్పుడు డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావట్లేదని నీలేకని అన్నారు. మార్పు తేవడం కోసమే వస్తున్నానన్నారు. తాను నిజాయితీగా సంపాదించానని, అంతా ప్రకటించానని చెప్పారు. నందన్ నీలేకని సంపాదనలో అత్యధిక భాగం ఆయనకు, ఆయన భార్య రోహిణికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్ల రూపంలోనే ఉంది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్‌లో వీళ్లిద్దరికీ కలిపి 3శాతం షేర్లున్నాయి. -
నందన్ నీలెకని నామినేషన్ దాఖలు.. ఆస్తి 7,770 కోట్లు!
బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న నందన్ నీలెకని.. తన ఆస్తి 7,770 కోట్లుగా ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. నందన్ నీలెకని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు అనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17 తేదిన జరిగే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలెకని శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అధికార కెబినెట్ మంత్రులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆయన భార్య రోహిణి వెంట రాగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి నీలెకని సమర్పించారు. సుమారు 5 వేల మంది నామినేషన్ కార్యక్రమానికి హజరైనారు. 'ఓట్ ఫర్ నందన్, ఓట్ ఫర్ కాంగ్రెస్' అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తనకు సంపదతోపాటు బెంగళూరులో లక్షలాది ఉద్యోగాలను ఇన్ఫోసిస్ అందించిందని.. కంపెనీ షేర్ల ద్వారా మరికొంత సంపదను ఉద్యోగులకు అందించిందని నీలెకని తెలిపారు. -
కాంగ్రెస్ టికెట్‌పై నందన్ నిలేకని పోటీ?
యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ - ఆధార్ ప్రాజెక్టు) చైర్మన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను పోటీకి దించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి నందన్‌కు పోటీకి దింపాలని సోనియా తనయుడు తలపోస్తున్నాడు. ఎన్నికల్లో పోటీపై నిలేకని స్పందించకపోయినప్పటికీ కాంగ్రెస్ వర్గాలు ఫీలర్లు వదులుతూనే ఉన్నాయి. ఆయనను తమ పార్టీ తరపున లోక్‌సభ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నాయి. నందన్ నిలేకని 2009లో ఇన్ఫోసిస్ కంపెనీ ని వదిలి యుఐడిఎఐ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చింది. బెంగళూరు సౌత్ నుంచి ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకుడు అనంతకుమార్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.