నందన్ నీలెకని నామినేషన్ దాఖలు.. ఆస్తి 7,770 కోట్లు!
బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న నందన్ నీలెకని.. తన ఆస్తి 7,770 కోట్లుగా ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
నందన్ నీలెకని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు అనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17 తేదిన జరిగే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలెకని శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
అధికార కెబినెట్ మంత్రులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆయన భార్య రోహిణి వెంట రాగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి నీలెకని సమర్పించారు. సుమారు 5 వేల మంది నామినేషన్ కార్యక్రమానికి హజరైనారు.
'ఓట్ ఫర్ నందన్, ఓట్ ఫర్ కాంగ్రెస్' అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తనకు సంపదతోపాటు బెంగళూరులో లక్షలాది ఉద్యోగాలను ఇన్ఫోసిస్ అందించిందని.. కంపెనీ షేర్ల ద్వారా మరికొంత సంపదను ఉద్యోగులకు అందించిందని నీలెకని తెలిపారు.