ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ లక్ష్మణరెడ్డి పిలుపు
గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికిగల విశిష్ట అధికారాన్ని తొలగించేందుకు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్టికల్-3 సవరణకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, సమైక్య స్ఫూర్తిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి కోరారు. గుంటూరు లక్ష్మీపురంలోని ఏపీ కాటన్ అసోసియేషన్ హాల్లో వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ జేఏసీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఉద్యమస్ఫూర్తిని ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పేందుకు డిసెంబర్‌లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి, 8, 9, 10 తేదీల్లో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన రోజు లక్షలాది మందితో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, విభజనపై అసెంబ్లీ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్రపతి 45 రోజుల సమయం ఇచ్చి తీరాల్సిందేననీ తెలిపారు.
ఆర్టికల్-3పై పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి
Published Thu, Nov 28 2013 2:46 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement