V. laxmana reddy
-
‘జీరో పాలిటిక్స్‌ను మా కమిటీ స్వాగతిస్తుంది’
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు, ఏ పార్టీ కూడా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం సాహసోపేత నిర్ణయమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి. లక్ష్మణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దశల వారి మద్య నియంత్రణను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. గతంలో ఉన్న బెల్టు షాపులను సమూలంగా తొలగించారని వెల్లడించారు. ప్రైవేటు రంగలో ఉన్నమద్యం షాపులను ప్రభుత్వ రంగంలోకి తీసుకు వచ్చి వాటి పని గంటలను తగ్గించారని తెలిపారు. ‘దీన్ని కూడా రాజకీయం చేయడం బాబుకే చెల్లింది’ రాత్రి ఎనిమిది గంటలు దాటితే మద్యం దొరకని పరిస్థితి సీఎం జగన్ కల్పించారని పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలో ఏ సీఎం చెప్పని విధంగా ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రాబల్యం లేకుండా జీరో పాలిటిక్స్‌కు సీఎం జగన్ చేస్తున్న కృషిని తమ కమిటీ స్వాగతిస్తుందని తెలిపారు. ఏడు నెలల కృషి ఫలితంగా రాష్ట్రంలో మద్య వినియోగం 24 శాతం, బీరు వినియోగం 58 శాతం తగ్గించారన్నారు. దీనిపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రోడ్డుప్రమాదాలు, నేరాలు, హత్యలు అనేక దుష్పరిణామాలు తగ్గాయని తెలిపారు. స్థానిక బహుఖ ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం, ప్రచార సమయాన్ని తగ్గించడం ద్వారా ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. గతంలో ఎన్నికల వ్యయంలో అభ్యర్థులు మూడో వంతు మద్యం పంపిణీకి కేటాయించేవారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 60 నుంచి70 కోట్లు మద్యం పంపిణీకే ఖర్చు పెట్టారని తెలపారు. రూ. 200 కోట్లు ఉప ఎన్నికలకు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు ది అన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలను డబ్బు ,మద్యం మయం చేసిన పాత్ర చంద్రబాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు క్రియాశీలక రాజకీయాల్లో మద్యం, డబ్బు పాత్ర పెరిగిందన్నారు. కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ డబ్బు,మందు పాత్ర తగ్గించాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. సేవా దృక్పతం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి అలాంటి వారిని గెలిపించుకోమని చెప్పడాన్ని తమ కమిటీ స్వాగతిస్తుందని చెప్పారు. నిఘా యాప్ ద్వారా ఎన్నికల సమమయంలో మద్యం, డబ్బుల పంపిణీ జరిగితే వీడియో తీసి అధికారులకు పంపిస్తే.. సత్వరమే చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ మద్యం, డబ్బుతో ప్రలోభాలకు పాల్పడిన అభ్యర్థిని ఎన్నిక అయిన తరువాత గుర్దిస్తే వారి సభ్యత్వం రద్దు అవుతుంది తెలిపారు. కాగా రాష్ట్రంలో మద్యం, డబ్బు రహిత ఎన్నికలు జరగాలని తాము కోరుతున్నామన్నారు. గతంలో డబ్బు సంచులతో మద్యం బాటిళ్లతో ఎన్నికల్లో దిగిన రాజకీయ నాయకులకు స్వస్తి పలికి సేవా బావంతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులపై పార్టీలు దృష్టి పెట్టాయన్నారు. సేవ చేసే నాయకులను ఎన్నుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర ముఖచిత్రం మారుతుందని ఆయన అన్నారు. -
విభజనను తెలుగు జాతి అంగీకరించదు
ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను తెలుగు జాతి అంగీకరించటం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సచివాలయం ఎదుట ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద గురువారం ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక, విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్రను కోరే ప్రభుత్వంలోని వివిధ శాఖల జేఏసీల ఆధ్వర్యంలో ‘మౌన ప్రదర్శన’ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని బలవంతంగా వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ‘మౌన ప్రదర్శన’కు పూనుకుంటే.. పోలీసులు అడ్డుకోవడం అమానుషమన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను తాము అంగీకరించబోమని, తుదివరకూ సమైక్య రాష్ట్రంకోసం పోరు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి చేగొండి రామజోగయ్య, పుత్తా శివశంకర్‌రెడ్డి, రామభాస్కర్, పోతుల శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టికల్-3పై పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి
ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ లక్ష్మణరెడ్డి పిలుపు గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికిగల విశిష్ట అధికారాన్ని తొలగించేందుకు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్టికల్-3 సవరణకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, సమైక్య స్ఫూర్తిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి కోరారు. గుంటూరు లక్ష్మీపురంలోని ఏపీ కాటన్ అసోసియేషన్ హాల్లో వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ జేఏసీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఉద్యమస్ఫూర్తిని ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పేందుకు డిసెంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి, 8, 9, 10 తేదీల్లో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన రోజు లక్షలాది మందితో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, విభజనపై అసెంబ్లీ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్రపతి 45 రోజుల సమయం ఇచ్చి తీరాల్సిందేననీ తెలిపారు. -
కేంద్రం దూసుకుపోతోంటే కాలయాపనా?: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇవ్వకుండా రోజుకో ప్రకటనతో, ‘కొబ్బరికాయ’ సిద్ధాంతాలతో కాలం గడుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన చేసే పద్ధతి ఇది కాదంటూ నిత్యం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న బాబు.. అసలు తెలంగాణకు అనుకూలంగా తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. విభజన విషయంలో కాంగ్రెస్ తప్పుడు వైఖరి, విధానంతో ముందుకు వెళుతోందని నిజంగానే భావిస్తే బాబు కచ్చితంగా ఆ లేఖను వెనక్కి తీసుకునేవారని లక్ష్మణరెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌కు ఇష్టంలేని పని చేయకూడదనే ఉద్దేశంతోనే లేఖను వెనక్కి తీసుకోకుండా మిన్నకుంటున్నార నే అనుమానం కలుగుతోంద ని గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరలేదు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం చేసినప్పుడు కూడా వ్యతిరేకించకుండా సీమాంధ్ర రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలంటూ ఆ తీర్మానాన్ని సమర్థించారు. ఇప్పటికీ అదే వైఖరితో ఉంటే జీవోఎం ముందు హాజరై తన ప్రతిపాదనలేంటో చెప్పేవారే. కానీ అలా చేయలేదు. రాష్ట్రపతికి ఉత్తరం రాసి మీ పద్ధతి బాగా లేదంటారు. తాజాగా విభజన అంటే కొబ్బరికాయ కొడితే సమంగా సగానికి పగిలినట్టుగా జరగాలన్నదే తన ఉద్దేశమంటారు. ఇంతా చేస్తే ఆయన అసలు ఉద్దేశమేంటో మాత్రం అర్థం కావడం లేదు..’ అని లక్ష్మణరెడ్డి విమర్శించారు. తన కుమారుడిని ఎలా ప్రోజెక్టు చేసుకోవాలా? అన్నది తేల్చుకోలేకే చంద్రబాబు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోందని ఆయన అన్నారు. ఒకపక్క కేంద్రంలో అంతా జరిగిపోతుంటే మళ్లీ ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్ర ప్రజల ముందుకు వెళతానని చంద్రబాబు చెబుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీమాంధ్రకు అన్యాయం చేసిన విషయం స్పష్టంగా తెలిసిపోతోందని, ఈ కారణంగానే అక్కడి ప్రజల్లోఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ఆయన చెప్పారు. కొందరు పార్టీ కేడర్‌ను ముందుపెట్టుకుని యాత్రలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇప్పుడు సమన్యాయం అంటూ కొత్త వాదన తేవడంతో బాబు మరింత చులకనయ్యారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిలో స్పష్టత లేదనే విషయం రాష్ట్రానికే కాదు.. దేశమంతా తెలిసిపోయిందని చెప్పారు. వారానికోసారి ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాయడం మినహా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విషయంలోగానీ, విభజించాలన్న విషయంలోగానీ ఏదీ తేల్చకుండా నాన్చుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క చంద్రబాబేనని లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. -
అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన అసాధ్యం: వి. లక్ష్మణరెడ్డి
విజయవాడ, న్యూస్‌లైన్ : అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ ఒక్క రాష్ర్టం ఏర్పాటు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన వేదిక కృష్ణా జిల్లా శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏర్పడిన ఏ రాష్ట్రాన్ని పరిశీలించినా మాతృరాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించాకే విభజన జరిగిందన్న వాస్తవాన్ని యూపీఏ పెద్దలు గుర్తించాలని హితవు పలికారు. చివరికి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 విభజన ప్రక్రియ ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రమే స్పష్టం చేసిందని, రాష్ట్రాల విభజనకు ప్రాతిపదిక ఏమిటనేది నిర్థారించడంలేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, వెనుకబడిన ప్రాంతాలు ప్యాకేజీలు ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ సూచించినప్పటికీ ఆ దిశగా కేంద్రం అడుగులు వేయలేదన్నారు. 1956-2010 మధ్యకాలంలో అత్యంత వేగంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని కమిటీ నివేదికలో పేర్కొందని తెలిపారు. శాస్త్రీయపద్ధతిలో రూపొందించిన ఈ కమిటీ నివేదికపై చట్ట సభల్లో చర్చకు రాకుండానే బుట్ట దాఖలైందన్నారు. కేవలం టీఆర్ఎస్.. కాంగ్రెస్‌లో విలీనం కావడమే విభజనకు ప్రాతిపదిక అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్లమెంట్లో బీజేపీ ఓటు వేస్తే అది రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాష్ర్ట విభజనను ఎంఐఎం, సీపీఎం, వైఎస్సార్ సీపీ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని, మిగిలిన పార్టీలు విభేదాలు పక్కనబెట్టి అదేబాటలో నడవాలని సూచించారు. -
విభజనపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి: వి.లకష్మణ్‌రెడ్డి
నెల్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిన టీడీపీ ప్రస్తుతం తన వైఖరి స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ వి.లకష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్ర ఏర్పాటే లక్ష్యమని వైఎస్సార్ సీపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించిందని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి చురుగ్గా ఉద్యమిస్తున్నారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత సమైక్యవాదులపై ఉందన్నారు. శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతుందని తమకు నమ్మకం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలకే పరిమితం కాకుండా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తీర్మానం ప్రతులను కేంద్రానికి పంపాలని సూచించారు. ఈనెల 2న తిరుపతి, 5న గుంటూరు, 7న విశాఖపట్నంలో సమైక్యవాదుల ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విభజన ప్రక్రియ నేపథ్యంలో టీఆర్ఎస్ తమ పార్టీలో విలీనం కావాలని దిగ్విజయ్‌సింగ్ చేసిన ప్రకటనను బట్టి ఈ విభజన సీట్లు, ఓట్ల కోసం చేపట్టిన చర్యగా అర్థమవుతోందని లకష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. 5 వైభవ వేదిక.. ఎస్టీబీసీ కళాశాల మైదానం.. అరవై యేళ్ల క్రితం రాజధాని సంబరాలు ఆగకుండా మోగిన చప్పట్ల శబ్దాలు.. ఆ మైదానంలో ఇప్పటికీ నలుదిక్కులలో మార్మోగుతున్నాయి. అలనాటి ప్రసిద్ధ గాయని టంగుటూరి సూర్యకుమారి మృదుమధురంగా పాడిన వందేమాతర గీతం ఇప్పటికీ ఆ మైదానంలో నిలబడితే.. మన చెవుల్లో గింగురుమంటుంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. కర్నూలును రాజధానిగా ప్రకటిస్తూ చేసిన ప్రసంగం.. అప్పటి రాష్టప్రతి.. తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉపన్యాసంలోని గాంభీర్యం.. అలనాటి రాజధానీ వైభవపు పరిమళం ఇప్పటికీ ఆ మైదానంలోని గాలిలో గుబాళిస్తూనే ఉన్నాయి. అది అపూర్వమైన అద్వితీయమైన వేడుక.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక టంగుటూరి ప్రకాశం ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలు ప్రకటనకు, అనంతర వేడుకలకూ 1953, అక్టోబర్ 1న..ఇప్పటికి అరవై ఏళ్ల కితం కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానమే వేదిక. ఈ కళాశాల భవనమే అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉండేది. మహామహుల సభలకు అదే వేదిక... భారత దేశ తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని జనహృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు ఎందరెందరో మహామహులు పాల్గొన్న భారీ బహిరంగ సభలకు ఈ ఎస్టీబీసీ మైదానమే వేదిక. - న్యూస్‌లైన్, కర్నూలు -
సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలి : వీ లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కో-ఆర్డినేటర్ లక్ష్మణరెడ్డి పెనుమంట్ర, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని అసెంబ్లీని సమావేశపర్చి సమైక్యాంధ్రపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కో-ఆర్డినేటర్ వీ లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జన గోదావరి సభలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించాలని కోరారు. వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావాన్ని పూరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులు తక్షణమే పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి నాయకత్వం వహించాలని, రాజకీయ నాయకులు పరస్పర దూషణలు వీడి ఉద్యమంలో మమేకం కావాలని ఆయన కోరారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు సమైక్యవాదానికి మద్దతు పలకాలన్నారు. హైదరాబాద్‌లో సమైక్యవాదులు నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికను చూపించలేకపోతున్నందున విభజన జరగబోదని లక్ష్మణరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. -
11న హైదరాబాద్‌లో సమైక్య సదస్సు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకై ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో సదస్సు నిర్వహించనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది. సమైక్యవాదులంతా సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12న ఏపీఎన్జీవోస్ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తామన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులందరూ వెంటనే రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని మంత్రుల ఇళ్ల వద్ద 13న ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక వివిధ రంగాల వారితో జాయింట్ యాక్షన్ కమిటీలను నిర్మించి హైదరాబాద్‌లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని చెప్పారు. ఏకే ఆంటోనీ కమిటీ తన నివేదికను ఇచ్చేవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోస్ హైదరాబాద్‌లో చేపట్టదలచిన సమ్మెను భగ్నం చెయ్యడానికి విభజనవాదులు ప్రయత్నించడం అప్రజాస్వామికమన్నారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు పి.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా లేకపోతే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారని, విద్యార్థులు ఉపాధి సౌకర్యాలను కోల్పోతారని చెప్పారు. త్వరలో రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదాన్ని వినిపించడానికి భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సమితి నేతలు కుమార్‌చౌదరియాదవ్, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, న్యాయవాదులు వి.రామకృష్ణ, పీఏ మెల్చిసెడక్, కృష్ణమోహన్, ఉద్యోగ సంఘాల నేతలు ఇ. శివకుమారి, కె. రమాదేవి, ఎం. శ్రీరామమూర్తి, బి. హైమ, కె. సుధాకర్‌రెడ్డి, పి.జి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.