
విభజనపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి: వి.లకష్మణ్‌రెడ్డి
నెల్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చిన టీడీపీ ప్రస్తుతం తన వైఖరి స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ వి.లకష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్ర ఏర్పాటే లక్ష్యమని వైఎస్సార్ సీపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించిందని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి చురుగ్గా ఉద్యమిస్తున్నారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత సమైక్యవాదులపై ఉందన్నారు. శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతుందని తమకు నమ్మకం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలకే పరిమితం కాకుండా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తీర్మానం ప్రతులను కేంద్రానికి పంపాలని సూచించారు.
ఈనెల 2న తిరుపతి, 5న గుంటూరు, 7న విశాఖపట్నంలో సమైక్యవాదుల ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విభజన ప్రక్రియ నేపథ్యంలో టీఆర్‌ఎస్ తమ పార్టీలో విలీనం కావాలని దిగ్విజయ్‌సింగ్ చేసిన ప్రకటనను బట్టి ఈ విభజన సీట్లు, ఓట్ల కోసం చేపట్టిన చర్యగా అర్థమవుతోందని లకష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. 5 వైభవ వేదిక.. ఎస్టీబీసీ కళాశాల మైదానం.. అరవై యేళ్ల క్రితం రాజధాని సంబరాలు ఆగకుండా మోగిన చప్పట్ల శబ్దాలు.. ఆ మైదానంలో ఇప్పటికీ నలుదిక్కులలో మార్మోగుతున్నాయి. అలనాటి ప్రసిద్ధ గాయని టంగుటూరి సూర్యకుమారి మృదుమధురంగా పాడిన వందేమాతర గీతం ఇప్పటికీ ఆ మైదానంలో నిలబడితే.. మన చెవుల్లో గింగురుమంటుంది.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. కర్నూలును రాజధానిగా ప్రకటిస్తూ చేసిన ప్రసంగం.. అప్పటి రాష్టప్రతి.. తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉపన్యాసంలోని గాంభీర్యం.. అలనాటి రాజధానీ వైభవపు పరిమళం ఇప్పటికీ ఆ మైదానంలోని గాలిలో గుబాళిస్తూనే ఉన్నాయి. అది అపూర్వమైన అద్వితీయమైన వేడుక.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక టంగుటూరి ప్రకాశం ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలు ప్రకటనకు, అనంతర వేడుకలకూ 1953, అక్టోబర్ 1న..ఇప్పటికి అరవై ఏళ్ల కితం కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానమే వేదిక. ఈ కళాశాల భవనమే అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉండేది.
మహామహుల సభలకు అదే వేదిక...
భారత దేశ తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని జనహృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు ఎందరెందరో మహామహులు పాల్గొన్న భారీ బహిరంగ సభలకు ఈ ఎస్టీబీసీ మైదానమే వేదిక.
- న్యూస్‌లైన్, కర్నూలు