
క్రిప్టోకరెన్సీపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23న ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం సుమారు 26 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో క్రిప్టోకరెన్సీ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 'క్రిష్టొకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు" ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
క్రిప్టోపై కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి రానుంది. మరోవైపు అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించనున్నుట్లు తెలుస్తోంది.
ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని..!
క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాగా క్రిప్టోకరెన్సీపై ఓ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు.
Crypto bill is listed for the #WinterSession #IndiaWantsCrypto https://t.co/Lr4aHdJjhl
— Nischal (WazirX) ⚡️ (@NischalShetty) November 23, 2021
చదవండి: ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట.. ఏడాదిలో రూ.25 లక్షలు లాభం!
Comments
Please login to add a commentAdd a comment