సోనియా గాంధీ అభ్యంతరం
దేశంలో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని అనే వాఖ్యాన్ని సీబీఎస్‌ఈ టెన్త్ ఇంగ్లిష్ పేపర్‌లో ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతవారం సీబీఎస్‌ఈ నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని క్వశ్చన్ రావడాన్ని సోనియా ఖండించారు. దీనిపై సీబీఎస్‌ఈ వెంటనే స్త్రీలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో సోమవారం ఈ అంశాన్ని సోనియా లేవెనెత్తారు. కేంద్ర విద్యాశాఖపై దీనిపై పూర్తిస్థాయి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
11: 05 AM
► లోక్‌సభలో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చించారు.
10: 55 AM
► రాజ్యసభను తాత్కాలికంగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
10: 35 AM
► రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్షపార్టీల నేతలతో సమావేశమయ్యారు. కాగా,12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని మరోసారి పార్లమెంట్‌లో చర్చిద్దామని అన్నారు.
10: 05 AM
► పార్లమెంట్ ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. అమరులు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుదన్నారు. వారి త్యాగం దేశ పౌరులకు ప్రేరణ అందిస్తూనే ఉంటుందని వారు పేర్కొన్నారు.
► పార్లమెంట్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొని అమరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.
09: 45 AM
► కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ద్రవ్యోల్బణం అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
09: 35 AM
► న్యాయమూర్తుల వేతనాలు, సేవల సవరణ బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది గతంలో లోక్‌సభలో ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సభ ప్రారంభమైంది. పార్లమెంట్‌పై ముష్కరులు దాడికి పాల్పడి 20 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో.. దాడులను తిప్పికొట్టడంలో భాగంగా అమరులైన కుటుంబాలకు ఉభయ సభలు నివాళులు అర్పించాయి. సభ్యులు అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తమ తమ స్థానాల్లో నిలబడి మౌనం పాటించారు.
లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు 2001, డిసెంబరు 13 న పార్లమెంట్‌పై దాడిచేశారు. ఆ తర్వాత.. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనిలో ఒక పౌరుడు, మరో భద్రత సిబ్బందితో పాటు 14 మంది ప్రాణాలు కొల్పోయారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పార్లమెంట్‌లో దాదాపు 100 మంది సభ్యులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment