parliament attack
-
పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఘటనలోని దోషి అఫ్జల్‌గురుకు మరణశిక్ష విధించటంలో ఎటువంటి ప్రయాజనం లేదని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శిక్ష విధించాల్సి ఉండేది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయటంపై వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరులేదని నమ్ముతున్నా. ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కోర్టులు సైతం వందశాతం సరైన తీర్పులు వెల్లడిస్తాయని భావించలేము. మాకు సాక్ష్యాలను పదేపదే చూపించారు. ఇలా ఉరి శిక్ష విధించటాన్ని మాత్రం ఇతర దేశాలు సమర్థించలేదు’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్, బుద్గామ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలోను విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.డిసెంబర్13, 2001న పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు.దీంతో ఫిబ్రవరి 9, 2013న ఢిల్లీలోని తిహార్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలుచేశారు. -
‘పార్లమెంట్లో భద్రతను ప్రశ్నిస్తే ఎంపీలకు సస్పెండ్ చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాసులు వచ్చాయని, వారిని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పొన్నం ఆరోపించారు. పార్లమెంట్.. రాజ్యాంగాన్ని అమలుచేసే వేదిక అని, అక్కడ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు అంటూ బీజేపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. పార్లమెంట్ భద్రతపై విచారణ జరపాలని, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పొన్నం డిమాండ్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ నేతలకు పొన్నం కౌంటరిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలి. గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా నెరవేస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు అని కామెంట్స్ చేశారు. -
‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెగూసరాయ్: ‘సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఈ విషయమై సింగ్ సోమవారం బీహార్‌లోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని సింగ్ తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడి రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపించారు. ‘పార్లమెంట్లో దాడి ఘటనపై విచారణ జరుపుతున్నాం.దీనికి కారణమైన వాళ్లు ఎవరో త్వరలో తేలుతుంది. రైతుల ఉద్యమ సమయంలో టూల్‌కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో తెలుస్తుంది’అని గిరిరాజ్ అన్నారు. ఇదీచదవండి..పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్. -
Parliament security breach: ఆత్మాహుతికి ప్లాన్ వేశారు!
న్యూఢిల్లీ: లోక్‌సభలో అలజడి సృష్టించిన నిందితులు తొలుత సులువుగా మంటలంటుకునే జెల్ వంటిది ఒంటినిండా పూసుకుని తమను తాము తగలబెట్టుకుందామని అనుకున్నారట. పార్లమెంటు లోపలికి చొచ్చుకెళ్లి సభ్యులందరికీ అందేలా కరపత్రాలు విసిరితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారట. ‘‘తమ నిరసనను, తాము ఇవ్వదలచిన సందేశాన్ని వీలైనంత ప్రభావవంతంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చేందుకు ఇలాంటి పలు అవకాశాలను పరిశీలించారు. చివరికి లోక్‌సభలోకి దూకి పొగ గొట్టాలు విసిరి అలజడి సృష్టించాలని నిర్ణయించుకుని అమలు చేశారు’’అని నిందితులను విచారిస్తున్న పోలీసు బృందంలోని అధికారి ఒకరు వెల్లడించారు. గత బుధవారం లోక్‌సభ లోపల, బయట పొగ గొట్టాలు విసిరిన కలకలం రేపిన సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లనున్నారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు. పార్లమెంటు భద్రతపై సమీక్షకు కమిటీ: స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు భద్రతపై తాను కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్టు లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఇలాంటి భద్రతా వైఫల్యాలు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించి దాన్ని కట్టుదిట్టం చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ సూచిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ సభ్యులకు ఆయన లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోం శాఖ నియమించిన విచారణ కమిటీ నివేదికను కూడా సభ ముందుంచుతామని తెలిపారు. ఇల్లు వదిలి వెళ్లకండి మైసూరు: పార్లమెంటులో అలజడి సృష్టించిన కేసులో నిందితుడు మనోరంజన్ కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని కేంద్ర నిఘా విభాగం అధికారులు ఆదేశించారు. మైసూరు విజయనగరలోని మనోరంజన్ ఇంటిని నిఘా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి విప్లవ సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మనోరంజన్ కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని ఆదేశించారు. అత్యçవసర పరిస్థితి వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బంధువులు, ఇతరులెవరూ ఆ ఇంటికి వెళ్లరాదని, ఎవరైనా ఫోన్లు చేస్తే సంబంధిత వివరాలను అందజేయాలని సూచించారు. మహేశ్‌కు ఏడు రోజుల కస్టడీ ఈ కేసులో అరెస్టయిన ఆరో నిందితుడు మహేశ్ కుమావత్‌ను ఢిల్లీ కోర్టు శనివారం ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అతడు కనీసం రెండేళ్లుగా ఈ కుట్రలో నిందితులకు సహకరిస్తున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీన్ని పూర్తిగా ఛేదించాలంటే అతన్ని లోతుగా విచారించాల్సి ఉందన్నారు. దాంతో ప్రత్యేక జడ్జి హర్దీప్ కౌర్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై మహేశ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్‌తో పాటు అతను తనంత తానుగా లొంగిపోవడం తెలిసిందే. -
పార్లమెంట్‌పై దాడి..కారణాలు చెప్పిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణాల వల్లే పార్లమెంట్‌పై కలర్‌స్మోక్ దాడి జరిగిందని తెలిపారు. ‘అసలు పార్లమెంట్‌పై దాడి ఎందుకు ఎజరిగింది. నిరుద్యోగం ఈ దేశంలో పెద్ద సమస్య. ఈ సమస్యతో దేశం అట్టుడుకుతోంది. ప్రధాని మోదీ పాలసీ వల్లే యువతకు ఉద్యోగాలు లేవు’అని శనివారం రాహుల్ మీడియాతో వ్యాఖ్యానించారు. డిసెంబర్13న మధ్యాహ్నం నీలం సింగ్, అమోల్ షిండే అనే ఇద్దరు వ్యక్తులు కలర్‌స్మోక్‌తో లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలపైకి దూకిన విషయం తెలిసిందే. దేశంలోని నిరుద్యోగంపై నిరసన తెలిపేందుకే ఈ దాడికి పాల్పడ్డారని నిందితుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదీచదవండి..మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ -
‘పార్లమెంట్ ఘటనకు మోదీ విధానాలే కారణం’
న్యూఢిల్లీ: దేశంలోని పెరిగిపోయిన యువత నిరుద్యోగానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మొదటి సారీ పార్లమెంట్ భద్రత వైఫల్యంపై మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ భద్రత వైఫల్యం వంటి ఘటనలు జరగడానికి కారణం యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడమని అన్నారు. దేశంలో నిరుద్యోగమనే అతిపెద్ద సమస్యను ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మోదీ పాలసీలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం జరిగింది నిజమేనని.. అయితే లోక్ సభలో ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారిందని అన్నారు. కేవలం యువత నిరుద్యోగం ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాల వల్లనే పెరిగిందని ధ్వజమెత్తారు. దీంతో దేశంలోని యువత ఉద్యోగాలను పొందలేకపోతున్నారని అన్నారు. మోదీ విధానాల వల్ల దేశంలో పెరుగుతున్న.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పార్లమెంట్ భద్రతా వైఫల్యం వెనకాల ప్రధాన కారణాలుగా ఉన్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ ఘటనకు సంబంధించిన అరెస్టు అయిన నిందితుల్లో ముగ్గురూ నిరుద్యోగ బాధితులు ఉన్నారు. నిందితులు ఉద్యోగాలు రాక చాలా నిరుత్సాహంతో ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. VIDEO | "Security breach happened in Lok Sabha. The reason behind this is unemployment and inflation due to PM Modi's policies," says Congress leader @RahulGandhi. pic.twitter.com/BFkEAjoZwI — Press Trust of India (@PTI_News) December 16, 2023 -
జాతికి జవాబు కావాలి!
దేశం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన అది. ప్రధాని సహా పార్లమెంటరీ ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యే ప్రాంగణంలోని పెను భద్రతా వైఫల్యాలను బుధవారం టీవీల సాక్షిగా కళ్ళకు కట్టిన ఉదంతమది. 2001 నాటి చేదు జ్ఞాపకాలను ఈ దురంతం మళ్ళీ గుర్తుచేసింది. అప్పట్లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మన పార్లమెంట్‌పై తుపాకులతో దాడికి తెగబడితే, ఈసారి సందర్శకులుగా వచ్చిన ఇద్దరు భారతీయ సాధారణ యువకులు పదుల అడుగుల ఎత్తులోని లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ పై నుంచి సభాంగణంలోకి దూకి, రహస్యంగా తెచ్చిన పొగగొట్టాలతో అలజడి రేపారు. సభ వెలుపల రంగుల పొగతో మరో ఇద్దరు నిరసన పూర్వక నినాదాలు చేశారు. నలుగురినీ అరెస్ట్ చేసి, కఠినమైన ‘ఉపా’ చట్టం కింద కేసు పెట్టి పోలీస్ కస్టడీకి పంపారు. సూత్రధారుల కోసం గాలింపు సాగుతోంది. ప్రస్తుతానికి 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు కానీ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇదేదో అప్పటికప్పుడు ఈ యువతీ యువకులు సృష్టించిన హంగామా కాదు. ఇరవై రెండేళ్ళ క్రితం పార్లమెంట్‌పై పాక్ తీవ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్ 13నే... తమ దుశ్చర్యకు వారు ఎంచుకున్నారంటే ఎంత ఆలోచన, ప్రణాళిక ఉండివుంటుంది! ఒక్కపక్క అమెరికా గడ్డ మీద నుంచి హూంకరిస్తున్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఈ నెలాఖరులోగా పార్లమెంట్‌పై దాడి చేస్తామని చాలా రోజుల క్రితమే హెచ్చరించారు. మరోపక్క పార్లమెంట్‌పై మునుపటి దాడిలో పలువురు బలైన ఘటనకు 22వ వార్షిక సంస్మరణ దినం. ఈ నేపథ్యంలో బుధవారం పార్లమెంట్ వద్ద ఎంత పారాహుషార్‌గా ఉండాలి! అంచెలంచెల తనిఖీని దాటుకొని, ఆ నలుగురూ కాలిజోళ్ళలో పొగగొట్టాలు పెట్టుకొని, లోపలికి వచ్చారంటే మన తనిఖీ, నిఘా వ్యవస్థలు నిద్రిస్తున్నట్టేగా! ప్రాథమిక సమాచారం మేరకు... పార్లమెంట్లో అలజడి రేపిన నలుగురిలో ఎవరూ తీవ్ర వాదులు కారు. మధ్య, దిగువ తరగతి నిరుద్యోగులు. భగత్ సింగ్ అభిమానులంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు భౌగోళిక ప్రాంతాల నుంచి ఫేస్బుక్ పేజీ ద్వారా ఎలా ఒక్కటయ్యారు, ఎలా ఈ నిరసన దుశ్చర్యకు దిగారన్నది ఇంకా లోతుగా ఆరా తీయాలి. ఆరు డిగ్రీలు చేసి, లెక్చరర్ ఉద్యోగా నికి ‘నెట్’ సైతం పాసైన నిరుద్యోగ హర్యానా యువతి నీలమ్. కంప్యూటర్ ఇంజనీరైన నిరుద్యోగ మైసూరీ మధ్యవయస్కుడు మనోరంజన్. ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన కుర్రాడు అమోల్. లక్నోకు చెందిన ఇ–రిక్షా కార్మికుడు సాగర్ శర్మ. ఇలాంటి సామాన్యులు ఏ నిస్పృహలో, ఎవరి ప్రేరేపణతో చెడుదోవ పట్టి ఇంతటి దుస్సాహసానికి దిగినట్టు? వీరిని ఆడించిన అసలు నాయకుడు ఎవరు? ఇంటి దొంగలా, లేక దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్న విదేశీ శక్తులా? ఏడాదిగా ఈ పథకరచన సాగుతోందట. ఈ మార్చి, జూలైల్లోనూ పార్లమెంట్లో భద్రతపై రెక్కీ నిర్వహించారట. ఇది దిగ్భ్రాంతికరం. ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన దుస్సాహసంపై ప్రజా ప్రతినిధులంతా ఏకమై పిడికిలి బిగించాల్సిన వేళ దురదృష్టవశాత్తూ రాజకీయాలు రేగుతున్నాయి. అధికారపార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడు తున్నాయి. పార్లమెంట్ సహా ఢిల్లీ భద్రత మొత్తం చేతిలో ఉండే హోమ్ మంత్రి ఈ మొత్తం ఘటనపై సభలో ప్రకటన చేయాలని కోరుతున్నాయి. జవాబివ్వాల్సిన అధికార పక్షం మొండికేయడం, రచ్చ పెరగడంతో ప్రతిపక్షానికి చెందిన 14 మందిని లోక్‌సభ నుంచి, ఒకరిని రాజ్యసభ నుంచి శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దీనికి పరాకాష్ఠ. సభలోనే కాదు ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం సస్పెండైన వారి పేర్లలో పేర్కొనడం విడ్డూరం. ఆ వాస్తవం రచ్చకెక్కేసరికి ‘అది క్లరికల్ మిస్టేక్’ అని సింపుల్‌గా తేల్చేస్తూ, 13మందే సస్పెండయ్యారని గురువారం పొద్దుపోయాక వివరణ నిచ్చుకోవాల్సి వచ్చింది. భద్రత విషయంలోనే కాదు... చివరకు సభా నిర్వహణలోనూ సర్కారీ నిర్లక్ష్యాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. నిరసన తెలిపే ప్రతిపక్షాలను పరోక్షంగా వెక్కిరిస్తూ, వచ్చి అరెస్టయినవారు ‘ఆందోళన్ జీవు’లంటూ అధి కారపక్షం తేలిగ్గా ముద్ర వేస్తోంది. ఒకవేళ వచ్చింది ‘ఆతంకవాదులై’ ఉంటేనో? వారు పొగగొట్టాలు కాక గ్రెనేడ్లు, ఐఈడీలు తేగలిగితేనో? ఏమై ఉండేది? భీతిగొలిపే ఆలోచన అది. అందుకే సర్వోన్నత పార్లమెంట్‌లోనే సభ్యుల రక్షణను వెక్కిరిస్తున్న ఘటనను ఆరోపణలపర్వంగా మారిస్తే లాభం లేదు. తీవ్రమైన ఈ భద్రతా వైఫల్యంపై జాతీయ భద్రతా ఏజెన్సీ సహా అత్యున్నత వ్యవస్థలతో దర్యాప్తు జరిపించాలి. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తోనూ పరిస్థితిని మదుపు చేయిస్తే, భద్రతా ఏర్పాట్లను పునస్సమీక్షిస్తే సభ్యులకు భరోసా కలుగుతుంది. దుర్భేద్యమని పదేపదే చెప్పిన కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇంతటి ఘటన జరిగినందున అందరూ ఒకే గేటు నుంచి రాకపోకలు సాగించడం లాంటి పద్ధతులు మార్చాలి. మెటల్ డిటెక్టర్లతో ప్లాస్టిక్‌ను గుర్తించలేనందున తనిఖీ విధానాల్ని ఆధునికీకరించి, పటిష్ఠపరచాలి. పార్లమెంటరీ సెక్యూరిటీలో నేటికీ వందకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయట. అదీ పట్టించుకోక కళ్ళు తెరిచి నిద్రపోతే నష్టం దేశానికి! అలాగే, ప్రభుత్వ గుర్తింపున్న పాత్రికేయుల్ని సైతం పార్లమెంట్‌లోకి రానివ్వని పాలకులు మహిళా రిజర్వేషన్ లాంటి కీలక బిల్లుల వేళ బస్సుల్లో జనాన్ని తరలించుకొచ్చి, గ్యాలరీ నుంచి నినాదాలిప్పిస్తున్న సంస్కృతిని విడ నాడాలి. పార్లమెంట్ ప్రాంగణం ప్రజాపాలనకై తప్ప, ప్రచార ఆర్భాటానికి కాదని గుర్తించాలి. మణి పూర్ మొదలు జాతీయ భద్రత దాకా ప్రతిదానిపైనా ప్రభుత్వ జవాబు కోసం, జవాబుదారీతనం కోసం ఇంతగా పట్టుబట్టాల్సి రావడం మాత్రం ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదని గ్రహించాలి. -
Parliament : టీఎంసీ ఎంపీ సస్పెండ్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో బుధవారం చోటచేసుకున్న ఘటనపై కేంద్ర మంత్రి ఆమిత్ షా స్పందించాలని రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు పట్టుబాట్టారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభలో ‘వికృతమైన ప్రవర్తన’కు గాను ఎంపీ డెరెక్‌ను ఈ పార్లమెంట్ శీతాకాల సమాశాలకు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు. అమిత్ షా జవాబు ఇవ్వాలని.. ఆందోళన చేపట్టిన డెరెక్ ఓబ్రెయిన్ వెంటనే రాజ్యసభను వదిలి వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు. ఎంపీ డెరెక్... రాజ్యసభ చైర్‌ను ధిక్కరించారని, సభ నియమ నిబంధనలు ఉల్లంగించారని అన్నారు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని.. సిగ్గు పడాల్సిన ఘటన అని ఆయన్ను సెస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఈ సస్పెన్షన్ వేటు.. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతోందని తెలిపారు. Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" pic.twitter.com/A3MVk0Top9 — ANI (@ANI) December 14, 2023 మరోవైపు.. పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు విధించారు. లోక్‌సభలో పార్లమెంట్ భద్రత వైఫల్యంతో సిబ్బంది.. ప్రతిబంధకాలు విధించింది. పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ, పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార ఏర్పాటు చేశారు. సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు చేశారు. ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని పార్లమెంట్ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: Parliament: నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’: బీజేపీ ఎంపీ -
Parliament: నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’: బీజేపీ ఎంపీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం బుధవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించి.. ఎంపీలను భయాందోళను గురిచేసిన ఈ ఘటన ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ విజిటర్ గ్యాలరీకి అనుమతి సిఫార్స్ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహకు నిందితుల్లో ఓ వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వెంటనే ఆయన్ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. सत्ता परिवर्तन or regime change is a phrase Congress leaders often use. Meet Neelam Azad, the lady who breached Parliament’s security today. She is an active Congress/I.N.D.I Alliance supporter. She is an आंदोलनजीवी, who has been seen at several protests. Question is who sent… pic.twitter.com/9pilzFUgZZ — Amit Malviya (@amitmalviya) December 13, 2023 ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అమిత్ మాల్వియా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నిందితుల్లో ఒకరైన నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’ అని అన్నారు. అంతే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ మద్దతురాలు అంటూ వ్యాఖ్యానించారు. భదత్ర వైఫల్యం వల్లనే పార్లమెంట్లో ఆగంతకులు చొరబడి కలకంలో రేపారని కాంగ్రెస్ మండిపడుతున్న క్రమంలో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో బీజేపీ అమిత్ మాల్వియా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అమోల్ షిండే, నీలం ఆజాద్ పార్లమెంట్ ప్రాగణంలో రంగు గ్యాస్ గొట్టాలు వెదజల్లినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నిర్వహించిన పలు ఆందోళనల్లో నీలం అజాద్ కీయాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. ఆమె ఒక ‘ఆందోళన జీవి’ మండిపడ్డారు. ఆమె ఇండియా కూటిమి, కాంగ్రెస్ పార్టీ మద్దతురాలని ఆరోపణలు చేశారు. పలు నిరసనల్లో ఆమె కనిపించిన వీడియోను సైతం తన ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. వారిని పార్లమెంట్‌కు ఎవరు పంపారు?. వారీలో మైసూరుకు చెందిన వారు ఉండటానికి గల కారణం ఏంటీ? అని అమిత్ మాల్వియా సూటిగా ప్రశ్నించారు. పవిత్ర ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ అపవిత్రం చేస్తోందని మండిపడ్డారు. ఇక మరో నిందితుడు మనోరంజన్ కూడా కాంగ్రెస్ చెందిన వాడా?. రాహుల్ గాంధీ.. ‘భారత్ జోడా యాత్ర’లో పాల్గొన్నాడా? వంటి అనుమానాలు వస్తున్నాయని అమిత్ మాల్వియా ఆరోపించారు. చదవండి: Parliament Issue: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
లోక్‌సభ ఘటన నిందితులకు కస్టడీ
Live Updates.. లోక్‌సభ ఘటన నిందితులకు కస్టడీ నలుగురు నిందితులకు కస్టడీ విధింపు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన కోర్టు పార్లమెంట్ సమావేశాల్లో.. బుధవారం మధ్యాహ్నాం అలజడి సృష్టించిన ఇద్దరు బయట నినాదాలతో మరో ఇద్దరి నిరసన లోక్‌సభ రేపటికి వాయిదా సభ్యుల నిరసనలతో లోక్‌సభ రేపటికి వాయిదా ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన స్పీకర్ ఓం బిర్లా సభా నియమాలను ఉల్లంఘన, సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారనే ఈ నిర్ణయం తిరిగి శుక్రవారం ఉదయం 11గం. ప్రారంభం కానున్న లోక్‌సభ రాజ్యసభ మళ్లీ వాయిదా సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ 3గం. ప్రారంభమైన రాజ్యసభ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ సస్పెన్షన్ ప్రకటన తర్వాత వాయిదా పడ్డ సభ ఓ'బ్రియన్ చేష్టలు సిగ్గుచేటుగా అభివర్ణించిన చైర్మన్ ధన్కడ్ చైర్మన్ ఆదేశాల్ని ధిక్కరించారని మండిపాటు గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ.. 4గం. ప్రారంభం అయ్యే ఛాన్స్ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు సస్పెండ్ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెండ్ అయిన ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్ ఈ రకమైన దురదృష్టకర సంఘటనలు మొదటి నుండి జరుగుతున్నాయి: ప్రహ్లాద్ జోషి నినాదాలు చేయడం, కాగితాలు విసిరివేయడం గ్యాలరీ నుంచి దూకడం కొందరు చేస్తున్నారు: ప్రహ్లాద్ జోషి లోక్ సభా నియమాలను ఉల్లంఘించినందుకు, సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్లో ఫుల్ ఆంక్షలు పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు లోక్‌సభలో నిన్నటి భద్రత వైఫల్యంతో ప్రతిబంధకాలు విధించిన సిబ్బంది పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ , పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని సస్పెండ్ చేసిన పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ రాజ్యసభలో టీఎంసీ పక్ష నేత డెరెక్ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినందుకు సస్పెన్షన్ వేటు ఒబ్రెయిన్ సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన సభా కార్యక్రమాలు మధ్యాహ్నానికి వాయిదా Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" As per the Rajya Sabha Chairman, Derek O' Brien had entered the well of the House, shouted slogans and disrupted the proceedings of the House… pic.twitter.com/bXmFL8W5Vv — ANI (@ANI) December 14, 2023 ►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over yesterday's security breach incident. The opposition MPs also demanded the resignation of Union Home Minister Amit Shah over the incident Lok Sabha Speaker Om Birla said "all of us are concerned" about what… pic.twitter.com/P20jMqEfO9 — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటనపై లోక్‌సభలో గందరగోళం ►దాడి ఘటనపై లోక్‌సభలో అమిత్ షా మాట్లాడాలని విపక్షాల డిమాండ్. దాడి బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు. ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. పార్లమెంట్ భద్రతా సిబ్బంది సస్పెండ్ పార్లమెంట్లో దాడి నేపథ్యంలో కేంద్రం సీరియస్ పార్లమెంట్ సిబ్బందిపై చర్యలు పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణమైన ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ Lok Sabha Secretariat has suspended total eight security personnel in yesterday's security breach incident. — ANI (@ANI) December 14, 2023 ►కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్‌తో మోదీ భేటీ. Prime Minister Modi holds meeting with senior ministers. Union Home Minister Amit Shah, BJP National President JP Nadda, Union Ministers Prahlad Joshi and Anurag Thakur present. — ANI (@ANI) December 14, 2023 ►ఖర్గే చాంబర్లో సమావేశమైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. లోక్‌సభలో దాడి నేపథ్యంలో సభలో వ్యహరించాల్సిన వ్యూహంపై చర్చ. #WATCH | Opposition leaders meet in the chamber of Leader of Opposition in Rajya Sabha Mallikarjun Kharge, in Parliament pic.twitter.com/dPU8tdeAn9 — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు. భద్రత ఉల్లంఘనపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చిన ఎంపీ రాజీవ్ శుక్లా. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి. Congress MP Rajeev Shukla gives Suspension of Business Notice in Rajya Sabha under rule 267 and demands a discussion on Dec 13 security breach incident in Parliament — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ►కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఘటన జరిగింది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ఎటువంటి ప్రకటనలు లేవు, ఈ ఘటనపై సభలో చర్చ జరగాలన్నారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury on December 13 Parliament security breach incident "Such a big incident has happened and till now there have been no statements from the PM and the Union Home Minister. There should be a discussion on this incident..." pic.twitter.com/H8T6Qm9wc4 — ANI (@ANI) December 14, 2023 ►ఈ ఘటనపై ఇండియా కూటమి పార్లమెంటరీ పక్షనేతల సమావేశం ►పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతల చర్చ ►లోక్‌సభలో దాడి ఘటనను వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన కూటమి నేతలు ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు Congress MP Manickam Tagore gives Adjournment Motion notice in Lok Sabha demanding a discussion on the Parliament security breach incident and a reply from the Union Home Minister on the issue — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతను పెంచారు. ►నూతన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు ఉండగా.. పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. ►పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury on December 13 Parliament security breach incident "Such a big incident has happened and till now there have been no statements from the PM and the Union Home Minister. There should be a discussion on this incident..." pic.twitter.com/H8T6Qm9wc4 — ANI (@ANI) December 14, 2023 -
Parliament: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి
ఢిల్లీ: నూతన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు . అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో, ఈ ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ పార్లమెంట్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాజాగా దేవరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. తన కొడుకు చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు. ఇక తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లైతే అతడిని ఉరితీయాలని కామెంట్స్ చేశారు. తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని.. కానీ ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని అన్నారు. In #Karnataka's #Mysuru, Devraj, father of Manoranjan who caused a security breach inside the Lok Sabha today, says, "This is wrong, nobody should do anything like that... If my son has done anything good, of course, I support him but If he has done something wrong I strongly… pic.twitter.com/5DTbNhJyG2 — Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2023 నిందితుల వివరాలు ఇలా.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు పోలీసులు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. After breaking the law herself, she says, save the Constitution, 😂😂#ParliamentAttack#SecurityBreach #LokSabha pic.twitter.com/BF1uo5rvhj — Prabha Rawat🕉️🇮🇳 (@Rawat_1199) December 13, 2023 అయితే వీరందరూ భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఆన్లైన్లో పరిచయం చేసుకున్నట్టు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే పార్లమెంట్లో అలజడి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్‌లతోనే పార్లమెంట్‌లోకి వచ్చినట్టు వివరించారు. మరోవైపు.. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లో నీలం దేవి కౌర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల్లో పాల్గొందని.. కానీ ఏ రాజకీయ పార్టీతో ఆమెకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు. ఇక, వీరంతా లలిత్ ఝా ఇంట్లోనే బస చేసినట్టు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. BJP MP Pratap Simha, who gave passes to Sagar Sharma for entering #LokSabha leading to a significant #SecurityBreach #ParliamentAttack2023, shud be suspended and his house shud be bulldozed. His alleged role in aiding Sagar shud be probed. #BJPFailsIndia #AmitShah… pic.twitter.com/Je3TDeXGmM — Faheem (@stoppression) December 13, 2023 ఇదిలా ఉండగా.. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. Parliament security breach | A case under Sections 120-B (criminal conspiracy), 452 (trespassing), Section 153 (want only giving provocation with an intent to cause riot), 186 (obstructing public servant in discharge of public functions), 353 (assault or criminal force to deter… — ANI (@ANI) December 14, 2023 Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 -
పార్లమెంట్ భద్రత ఎవరి బాధ్యతో తెలుసా?
అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్‌కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ దాడి జరిగింది లోక్‌సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్‌సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. మొత్తం దానిదే! తాజా పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(Parliament Security Services..PSS). పీఎస్ఎస్ సీఆర్‌పీఎఫ్‌గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు పీఎస్ఎస్ ఎలా పని చేస్తుందంటే.. పీఎస్ఎస్ చరిత్ర పెద్దదే.. 1929 ఏప్రిల్ 8వ తేదీన అప్పటి పార్లమెంట్ భవనం సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్‌ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్‌భాయ్ పటేల్ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్ నెలలో ‘వాచ్ అండ్ వార్డ్’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ సర్ జేమ్స్ క్రెరార్ ‘డోర్ కీపర్ అండ్ మెసేంజర్స్’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్‌లో నియమించాలని ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. ఆ ప్రతిపాదనకు తగ్గట్లే అప్పటి ఢిల్లీ మెట్రోపాలిటన్ పోలీస్ వ్యవస్థ నుంచి పాతిక మందిని సిబ్బందిగా, వాళ్లను పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమించారు. అలా ఏర్పడిన భద్రతా విభాగం.. ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ దశాబ్దాల తరబడి కొనసాగింది. క్రమక్రమంగా అందులో సిబ్బంది సంఖ్య పెరగడం, ఇతర బలగాలతో సమన్వయం వాచ్ అండ్ వార్డ్ తన విధుల్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు.. అన్నింటా కీలకంగా.. .. 2009 ఏప్రిల్ 19వ తేదీన వాచ్ అండ్ వార్డ్‌ను పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్‌గా పేరు మార్చారు. భారతదేశ చట్ట సభ పార్లమెంట్ భవనం భద్రతను పూర్తిగా పర్యవేక్షించేది పీఎస్ఎస్. పార్లమెంట్ లోపలికి వచ్చే వాహనాలను.. వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం దగ్గరి నుంచి బయటకు వెళ్లేదాకా పూర్తి పనులు కూడా ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో భారత సైన్యం, ఢిల్లీ పోలీసులతో కలిసి పీఎస్ఎస్ భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతుల ప్రమాణ స్వీకార సమయంలో రాష్ట్రపతి భవన్ వద్ద.. అలాగే ఎట్ హోమ్ కార్యక్రమాలకు భద్రత ఇచ్చేది పీఎస్ఎస్సే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దీని పాత్ర గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం, విమానాయన శాఖ(చట్ట సభ్యుల రాకపోకలు.. బ్యాలెట్ బాక్సుల తరలింపు), భద్రతా బలగాలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పీఎస్ఎస్దే కీలక పాత్ర. అలాగే.. ఎంపీలతో పాటు పార్లమెంట్‌కు వచ్చే వీఐపీలు, వీవీఐపీల భద్రత, స్టడీ టూర్ల మీద వచ్చే విద్యార్థులు, సందర్శించే విదేశీయులు, సాధారణ సందర్శకుల భద్రత కూడా పీఎస్ఎస్ చూసుకుంటుంది. స్వతంత్రంగా పని చేయదు.. పీఎస్ఎస్ అనేది పార్లమెంట్ భవనం పూర్తి కాంప్లెక్స్ భద్రతను పర్యవేక్షించే ఒక నోడల్ భద్రతా సంస్థ. ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్/సీఆర్పీఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ, ఎన్ఎస్జీలు పార్లమెంట్ పరిధిలో పీఎస్ఎస్ సమన్వయంతోనే పని చేస్తుంటాయి. అలాగని ఇది స్వతంత్రంగా పని చేయదు. పార్లమెంట్ భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి పీఎస్ఎస్కు హెడ్‌గా ఉంటారు. లోక్‌సభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ (సెక్యూరిటీ), రాజ్యసభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ(సెక్యూరిటీ) విడివిడిగా వాళ్ల వాళ్ల పరిధిలో పీఎస్ఎస్ పనితీరును పర్యేవేక్షిస్తారు. పీఎస్‌ఎస్‌లో సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇతర విధులకు కూడా పంపిస్తుంటారు. అయితే అది పార్లమెంట్ పరిధిలోనే. పార్లమెంట్ విరామ సమయాల్లో సందర్శన కోసం వచ్చే విద్యార్థులకు, విదేశీయులకు పార్లమెంట్ చరిత్ర, గొప్పదనం గురించి, అలాగే అక్కడ ఏర్పాటు చేసే మహోన్నత వ్యక్తుల విగ్రహాల(వాళ్ల గురించి..) వివరించడం లాంటి బాధ్యతలు అప్పగిస్తుంటుంది. పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్‌తో పాటు సభ లోపలి మార్షల్స్ కూడా పీఎస్ఎస్ పరిధిలోకే వస్తారు. మూడంచెల తనిఖీలు.. పార్లమెంట్ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్ వద్ద మరోసారి చెకింగ్స్ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో మూడోసారి తనిఖీలు చేస్తారు. ఇక, పార్లమెంట్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. ఇక, సమయానుసారం సిబ్బందికి కూడా భద్రతా తనిఖీలు చేస్తారు. ఇక మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, బాడీ స్కానర్ల వంటి అధునాతన గ్యాడ్జెట్స్‌తో పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. అలా ఎలా..? సాధారణ విజిటర్ పాస్‌ల మీదే సందర్శకులు పార్లమెంట్‌కు వస్తుంటారు. ఈ పాస్‌లు జారీ చేసేముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్ కచ్చితంగా జరుగుతుంది. అందులో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా పాస్‌లు జారీ చేయరు. ప్రస్తుత దాడి ఘటనలో ఓ ఎంపీ పేరు మీద ఒక నిందితుడి పాస్ తీసుకున్నట్లు తేలింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్ భవనం లోపల సెక్యూరిటీ చెకింగ్లు, స్కానర్లు ఉండనే ఉంటాయి. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండే పార్లమెంట్ భవనం అన్ని వైపులా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. మరి ఇన్నీ దాటుకుని ఆ ఇద్దరు స్మోక్ షెల్స్‌తో ఎలా రాగలిగారనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. నాడు జరిగింది ఇదే.. 2001 డిసెంబర్ 13వ తేదీ గుర్తుందా?.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన రోజు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. అప్పటి నుంచి పార్లమెంట్ భవనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటోంది. అయితే డిసెంబర్ 13, 2023 నాటి ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. అదీ హైటెక్ హంగులతో, అత్యాధునిక సెక్యూరిటీ ఏర్పాట్లతో ఉంది. అయినా ఈ దాడి జరగడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
భద్రతా వైఫల్యంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది
-
సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైనది కాదు: స్పీకర్
-
బ్రెజిల్ అల్లర్లపై ప్రధాని మోదీ ఆందోళన
న్యూఢిల్లీ: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీం కోర్టుపై మెరుపుదాడికి దిగారు. ఈ క్రమంలో బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘బ్రెసిలియాలోని ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేయడం, అల్లర్లు సృష్టించిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిలియన్ అధికారులకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial — Narendra Modi (@narendramodi) January 9, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్లో రణరంగం.. ఫాసిస్ట్ ఎటాక్‌గా అధ్యక్షుడి అభివర్ణన.. సంబంధం లేదన్న బోల్సోనారో -
రణరంగంగా బ్రెజిల్.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన
రియో డీ జనీరియో: బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసంచేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చొనే ప్రధాన బల్లాను ధ్వంసంచేశారు. కోర్టు ఆవరణలోని పురాతన విగ్రహాన్ని కూలదోశారు. ‘‘బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలి. డ సిల్వాను దింపేయాలి’’ అని డిమాండ్చేస్తున్నారు. భవనాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లనూ ధ్వంసంచేశారు. వారాంతం కావడంతో భవనాల్లో సిబ్బంది అంతగా లేరు.ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన సైన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది. భవనాల ప్రాంగణాల్లోని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌లను ప్రయోగించింది. 300 మందిని అరెస్ట్‌చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని బోల్సోనారో ఒప్పుకోక మద్దతుదారులను ఉసిగొల్పడం ఇంతటి ఆందోళనకు కారణమైంది. రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంట్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన గుర్తుకుతెచ్చింది. ఫాసిస్టు శక్తుల విలయం: డసిల్వా ఆందోళనలపై డ సిల్వా ఆగ్రహించారు. ‘‘ఫాసిస్ట్ శక్తులు చెలరేగిపోయాయి. దీనిపై సత్వరం స్పందించని పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు. ఇలాంటి ఘటన జరిగే ప్రమాదముందని కొన్నినెలలుగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుండటం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 30న డ సిల్వా గెలుపు తర్వాత మొదలైన నిరసనలు ఆనాటి నుంచి ఆగలేదు. రోడ్ల దిగ్బంధం, వాహనాల దగ్ధం, సైన్యం జోక్యంచేసుకోవాలంటూ సైనిక కార్యాలయాల వద్ద ఆందోళనకారుల బైఠాయింపులతో నిరసనలు దేశమంతటా కొనసాగుతుండటం తెల్సిందే. ప్రపంచ దేశాధినేతల ఆందోళన బ్రెజిల్లో అధికార కేంద్రాలైన ప్రధాన భవనాలపై దాడిని పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రతి చర్యనూ ఖండిస్తాం. పాలనలో అధ్యక్షుడు డ సిల్వాకు సాయంగా ఉంటాం’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల ద్వారా డ సిల్వా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజాభిష్టాన్ని గౌరవించాలి’ అంటూ దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళనకారులనుద్దేశిస్తూ.. ‘ఎన్నికలు అనే ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందే. ఈ విషయంలో డ సిల్వా సర్కార్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని మోదీ అన్నారు. ⚠️#BREAKING | 📍#BRAZIL THE NATIONAL CONGRESS BUILDING IS BEING TOTALLY OCCUPIED BY PROTESTERS pic.twitter.com/tDKIMcIkiR — Direto da América (@DiretoDaAmerica) January 8, 2023 Some police officers of Rio de Janeiro refuse to disperse Bolsonaro supporters and clearly express their support for the protestors, according to the Clash Report. #Brazil pic.twitter.com/lLkduuBvPD — Stephiereine28🇺🇲🍊 (@stephiereine) January 9, 2023 -
పార్లమెంట్‌పై దాడికి 20 ఏళ్లు.. అమరులకు ఉభయ సభల నివాళి
సోనియా గాంధీ అభ్యంతరం దేశంలో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని అనే వాఖ్యాన్ని సీబీఎస్ఈ టెన్త్ ఇంగ్లిష్ పేపర్లో ఇవ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతవారం సీబీఎస్ఈ నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని క్వశ్చన్ రావడాన్ని సోనియా ఖండించారు. దీనిపై సీబీఎస్ఈ వెంటనే స్త్రీలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్లో డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో సోమవారం ఈ అంశాన్ని సోనియా లేవెనెత్తారు. కేంద్ర విద్యాశాఖపై దీనిపై పూర్తిస్థాయి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 11: 05 AM ► లోక్‌సభలో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చించారు. 10: 55 AM ► రాజ్యసభను తాత్కాలికంగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 10: 35 AM ► రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్షపార్టీల నేతలతో సమావేశమయ్యారు. కాగా,12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో చర్చిద్దామని అన్నారు. 10: 05 AM ► పార్లమెంట్ ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. అమరులు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుదన్నారు. వారి త్యాగం దేశ పౌరులకు ప్రేరణ అందిస్తూనే ఉంటుందని వారు పేర్కొన్నారు. ► పార్లమెంట్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొని అమరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. 09: 45 AM ► కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ద్రవ్యోల్బణం అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 09: 35 AM ► న్యాయమూర్తుల వేతనాలు, సేవల సవరణ బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది గతంలో లోక్‌సభలో ఆమోదం పొందింది. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సభ ప్రారంభమైంది. పార్లమెంట్‌పై ముష్కరులు దాడికి పాల్పడి 20 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో.. దాడులను తిప్పికొట్టడంలో భాగంగా అమరులైన కుటుంబాలకు ఉభయ సభలు నివాళులు అర్పించాయి. సభ్యులు అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తమ తమ స్థానాల్లో నిలబడి మౌనం పాటించారు. లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు 2001, డిసెంబరు 13 న పార్లమెంట్‌పై దాడిచేశారు. ఆ తర్వాత.. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనిలో ఒక పౌరుడు, మరో భద్రత సిబ్బందితో పాటు 14 మంది ప్రాణాలు కొల్పోయారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పార్లమెంట్లో దాదాపు 100 మంది సభ్యులున్నారు. -
ఉగ్రవాదులకు పోలీసు సాయం..
శ్రీనగర్: ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్ శనివారం ఇద్దరు ఉగ్రవాదులను కారులో తీసుకెళుతూ పట్టుబడ్డాడని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. డీఎస్పీ స్థాయిలో ఉండి, ఉగ్రవాదులకు సహాయం చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. వీరిలోని మరో ఉగ్రవాది నవీద్ కూడా కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 2017లో పోలీసు వృత్తిని వదలి హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. పలువురు పోలీసులను, పౌరులను చంపినట్లు ఇతడిపై 17 కేసులున్నాయని తెలిపారు. పార్లమెంటు దాడి కేసులో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఐజీపీ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఏ సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయం గురించి వారిని విచారిస్తామని చెప్పారు. దొరికారిలా.. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ఇద్దరు ఉగ్రవాదులు ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారని సోపియన్ ఎస్పీకి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఆ ఎస్పీ ఐజీపీకి, ఐజీపీ డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాపు కాసి వారి కారును ఆపి తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం విచారణ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్ఏడబ్ల్యూ, సీఐడీ వంటి ఇంటెలిజెన్స్ వర్గాలన్నింటికీ సమాచారం ఇచ్చామని ఐజీపీ చెప్పారు. ఉగ్రవాదులను తరలిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగానే పరిగణించి విచారిస్తున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఒక పోలీస్ ఉగ్రవాదులకు సాయపడినంత మాత్రాన కశ్మీర్ పోలీసులంతా అంతేననే ఆలోచన సరికాదని చెప్పారు. కీలక మిలిటెంట్లు హతం.. జమ్మూకశ్మీర్‌లోని ట్రాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్లని చెప్పారు. మృతులను ఉమర్ ఫయాజ్ లోనె , ఫైజాన్ హమిద్, అదిల్ బాషిర్ మిర్ అలియాస్ అబు దుజనగా గుర్తించారు. ఇందులో ఫయాజ్ లోనెపై 16 కేసులు ఉన్నట్లు చెప్పారు. -
పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 16 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 16 ఏళ్లు. దేశ అత్యున్నత చట్టసభపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. 2001 డిసెంబర్ 13న జరిగిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు, తొమ్మిది మంది భద్రతాసిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బుధవారం పార్లమెంట్ ఆవరణలో అమరుల ఫొటో వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుమిత్రా మహజన్, రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు...అమరులకు నివాళులు అర్పించారు. -
ఉగ్రదాడి మృతులకు ప్రధాని మోదీ నివాళి
-
వాళ్లను చంపేయాలి... మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఒకవైపు జేఎన్‌యూ వివాదం రగులుతూ ఉండగానే ఈ కేసును విచారించిన జడ్జి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎస్ దింగ్రా... అఫ్జల్ గురును వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను చంపేయాలంటూ వివాదానికి తెర లేపారు. ఈ వివాదం నేపథ్యంలో ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్య్వూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పార్లమెంటుపై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని ఖండిస్తున్న జేఎన్‌యూ విద్యార్థులను ఆయన తప్పు బట్టారు. ‘జ్యుడిషియల్ కిల్లింగ్’ అంటూ ఆరోపించడంపై ఎస్ఎస్ దింగ్రా మండిపడ్డారు. పార్లమెంటుపై దాడి సందర్భంగా 40,50 మంది ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటని వారిని వెనకేసుకొస్తున్న పార్లమెంటు సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. అపుడు పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. సమాజానికి ప్రమాదంగా పరిణమించిన వ్యక్తులను శిక్షించే అధికారం మన న్యాయ వ్యవస్థకు ఉంటుందని ఎస్ఎస్ దింగ్రా స్పష్టం చేశారు. భారతీయ శిక్షా స్మృతిలో అలాంటి నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు హత్యలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. 2002లో పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా 15 మంది మృతికి కారణమైన వ్యక్తి బలిదానం చేశాడంటూ సంతాపం వ్యక్తం చేయడం సరైంది కాదని దింగ్రా మండిపడ్డారు. అఫ్జల్‌గురుని ఉరితీసిన రోజును సంతాప దినంగా వ్యవహరిస్తూ జేఎన్‌యూలో విద్యార్థులు ర్యాలీ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనిపై దుమారం చెలరేగుతోంది. -
'వారికి సెల్యూట్ చేస్తూనే ఉంటాను'
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగిన ఘటనలో పాకిస్థాన్ ముష్కరులకు ఎదురొడ్డి పోరాడి అమరులైనవారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరవీరులకు అంజలి ఘటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి సమయంలో ధీటుగా పోరాడి పార్లమెంటులోకి ఉగ్రవాదులను అడుగుపెట్టకుండా చేసి ప్రాణాలు తృణపాయంగా వదిలేసిన వారి త్యాగాలకు తానెప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉంటానని అన్నారు. వారి త్యాగం భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తమ ప్రభుత్వం దేశంలో అసహనాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు నిరంతరం కృశిచేస్తుందని అన్నారు. భారత్ ను మరింత సురక్షితమైన దేశంగా మార్చేందుకు, మరింత లౌకిక రాజ్యంగా తీర్చి దిద్దేందుకు అనునిత్యం ప్రయత్నిస్తామని అన్నారు. -
నాటి వీరులకు ఘన నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంటుపై 2001, డిసెంబర్ 13న పాకిస్థాన్ ముష్కరులు జరిపిన దాడిని ధీటుగా ఎదుర్కొని అమరవీరులైన వారికి దేశం ఆదివారం ఘన నివాళి అర్పించింది. ఆదివారం పార్లమెంటు భవన్ వద్ద అమరవీరుల చిత్రపటాలకు ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, రాజ్యసభ స్పీకర్ కురియన్ తోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, గులాంనబీ అజాద్, ఇతర బీజేపీ, కాంగ్రెస్ నేతలు అమరుల చిత్రపటాలపై పూలు జల్లి నివాళులు అర్పించారు. బీజేపీ నేత అద్వానీ కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్బంగా నాటి మృతవీరుల కుటుంబాల సభ్యులు అద్వానీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
మీ హక్కులపై పోరాడండి:ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాకిస్థాన్ లో పాలనే లేదని.. ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని ఎప్పుడో తిరస్కరించారని ఇమ్రాన్ అభిప్రాయపడ్డాడు. పీటీఐ ఆధ్వర్యంలో ఈనెల 30 వ తేదీన జరప తలపెట్టిన భారీ ర్యాలీకి జన సమీకరణలో భాగంగా ప్రజల ముందుకొచ్చిన ఇమ్రాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్ ప్రజలు వారి హక్కులపై నిలబడాలి. ప్రజల హక్కులను విస్మరిస్తున్న ప్రభుత్వంపై ప్రజలు పోరాడాలి' అని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశానికి దిశా నిర్దేశం చేసేది మహిళలు, యువతేనని ఇమ్రాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. పాకిస్తాన్ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. తాను చేపట్టబోయే ర్యాలీని సక్సెస్ చేసి సరికొత్త కొత్త పాకిస్థాన్ కు నాంది పలకాలన్నాడు.