పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం బుధవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించి.. ఎంపీలను భయాందోళను గురిచేసిన ఈ ఘటన ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
అయితే.. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ విజిటర్ గ్యాలరీకి అనుమతి సిఫార్స్ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహకు నిందితుల్లో ఓ వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వెంటనే ఆయన్ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
सत्ता परिवर्तन or regime change is a phrase Congress leaders often use.
— Amit Malviya (@amitmalviya) December 13, 2023
Meet Neelam Azad, the lady who breached Parliament’s security today. She is an active Congress/I.N.D.I Alliance supporter. She is an आंदोलनजीवी, who has been seen at several protests.
Question is who sent… pic.twitter.com/9pilzFUgZZ
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అమిత్ మాల్వియా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నిందితుల్లో ఒకరైన నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’ అని అన్నారు. అంతే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ మద్దతురాలు అంటూ వ్యాఖ్యానించారు. భదత్ర వైఫల్యం వల్లనే పార్లమెంట్‌లో ఆగంతకులు చొరబడి కలకంలో రేపారని కాంగ్రెస్ మండిపడుతున్న క్రమంలో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో బీజేపీ అమిత్ మాల్వియా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అమోల్ షిండే, నీలం ఆజాద్ పార్లమెంట్ ప్రాగణంలో రంగు గ్యాస్ గొట్టాలు వెదజల్లినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ నిర్వహించిన పలు ఆందోళనల్లో నీలం అజాద్ కీయాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. ఆమె ఒక ‘ఆందోళన జీవి’ మండిపడ్డారు. ఆమె ఇండియా కూటిమి, కాంగ్రెస్ పార్టీ మద్దతురాలని ఆరోపణలు చేశారు. పలు నిరసనల్లో ఆమె కనిపించిన వీడియోను సైతం తన ‘ఎక్స్’ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వారిని పార్లమెంట్‌కు ఎవరు పంపారు?. వారీలో మైసూరుకు చెందిన వారు ఉండటానికి గల కారణం ఏంటీ? అని అమిత్ మాల్వియా సూటిగా ప్రశ్నించారు. పవిత్ర ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ అపవిత్రం చేస్తోందని మండిపడ్డారు. ఇక మరో నిందితుడు మనోరంజన్ కూడా కాంగ్రెస్ చెందిన వాడా?. రాహుల్ గాంధీ.. ‘భారత్ జోడా యాత్ర’లో పాల్గొన్నాడా? వంటి అనుమానాలు వస్తున్నాయని అమిత్ మాల్వియా ఆరోపించారు.
చదవండి: Parliament Issue: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment