
న్యూఢిల్లీ: ఉచితంగా ఇచ్చిన ఐస్‌క్రీమ్‌ను కాదన్నాడన్న కారణంతో నలుగురు యువకులు మరో యువకున్ని చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన లక్ష్యయ్ (27) మిత్రులు ధీరజ్ (26), కరణ్ (29), అవినాశ్‌లతో విందు చేసుకున్నాడు. ఆపై ఐస్‌క్రీములు కొనుక్కుని తమకు ఎదురైన అమిత్ (25), రాహుల్, ఇశాంత్‌లకు వాటిని ఇవ్వబోగా తిరస్కరించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న లక్ష్యయ్ బృందం వారిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అమిత్ ప్రాణాలు విడిచాడు. అతడి మిత్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment