దమ్ముంటే అరెస్ట్ చేసి చూడండి: ఇమ్రాన్
దమ్ముంటే అరెస్ట్ చేసి చూడండి: ఇమ్రాన్
Published Thu, Nov 13 2014 12:29 PM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM
ఇస్లామాబాద్: దమ్ముంటే అరెస్ట్ చేసి చూడాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి మాజీ క్రికెటర్, పాకిస్థాన తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ సవాల్ విసిరారు. పాకిస్థాన్ పార్లమెంట్, పీటీవీ భవనంపై దాడి కేసులో యాంటీ టెర్రిరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఇమ్రాన్ నిరాకరించారు. నా అరెస్ట్ వారెంట్ గురించి ఓ శుభవార్త విన్నాను. దాడి జరిగిన రోజున నేను కంటైనర్ లో నిద్ర పోతున్నాను. ఆ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాను అని పాక్ ఆన్ లైన్ న్యూస్ పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నవంబర్ 30న ఇస్లామాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి పీటీఐ చేస్తున్న ఏర్పాట్లు చూసి 'మియా సాబ్' (పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్) భయపడినట్టున్నాడు. అందుకే ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని అన్నారు.
తనకు జైలులో ఉండటం అంత కష్టమైన పని కాదని, మూడు నెలలు కంటైనర్ లో ఉన్నానని, ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే నవాజ్ భారీ మూల్యం చెల్లించుకుంటాడని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
Advertisement