Prime Minister Narendra Modi Deeply Concerned About Brazil Riots - Sakshi
Sakshi News home page

‘ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించాలి’.. బ్రెజిల్‌ అల్లర్లపై ప్రధాని మోదీ

Published Mon, Jan 9 2023 9:38 AM | Last Updated on Mon, Jan 9 2023 10:01 AM

Prime Minister Narendra Modi Deeply Concerned About Brazil Riots - Sakshi

న్యూఢిల్లీ: బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్‌, సుప్రీం కోర్టుపై మెరుపుదాడికి దిగారు. ఈ క్రమంలో బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్రెజిల్‌ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తూ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 

‘బ్రెసిలియాలోని ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేయడం, అల్లర్లు సృష్టించిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిలియన్‌ అధికారులకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఇదీ చదవండి: బ్రెజిల్‌లో రణరంగం.. ఫాసిస్ట్‌ ఎటాక్‌గా అధ్యక్షుడి అభివర్ణన.. సంబంధం లేదన్న బోల్సోనారో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement