concerned
-
ముందు ప్యాకేజీ తేల్చండి
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడేపల్లి రూరల్: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం రైతులతో సీఆర్డీఏ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగడంతో సమావేశం వాయిదా పడింది. భూసేకరణకు ప్యాకేజీ ఎంత ఇస్తారో తే ల్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని రైతులు కరాఖండిగా చెప్పడంతో సీఆర్డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు నోటీసులు ఇవ్వగా భూములు కోల్పోయే రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. దీంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో సీడ్ యాక్సెస్ రోడ్లు నిర్మాణానికి సీఆర్డీఏ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా శనివారం ఉండవల్లి సచివాలయం–2లో రోడ్డు నిర్మాణంలో పొలాలు కోల్పోయే రైతులతో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఆరంభంలోనే రైతులు సీఆర్డీఏ అధికారులను నిలదీశారు. ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ఎందుకు తెలియజేయలేదని, ఒక్క పేపరు ప్రకటన ఇస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. ముందుగానే సమాచారం ఇచ్చామని డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు చెప్పారు. రోడ్డు కోసం రైతుల భూములను సర్వే చేస్తామని, అనంతరం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని ఆయన చెబుతుండగా రైతులు తిరగబడ్డారు. సర్వే కాదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రైతులకు ఎంత ప్రకటిస్తారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకుడు దాసరి కృష్ణ కల్పించుకొని, మనకు రాజధాని వద్దు, మన భూములు ఇవ్వవద్దు.. గత ప్రభుత్వంలో రైతులకు కౌలు కూడా ఇవ్వనప్పుడు ఎవరూ మాట్లాడలేదంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో మిగతా రైతులు ఆయనపై తిరగబడ్డారు. గత ప్రభుత్వంలో కరకట్ట విస్తరణకు భూ సేకరణ నోటీసు ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామని, సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట విస్తరణ రెండింటి మీదా హైకోర్టు స్టే ఇచ్చిందని, మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటేనని, రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు – విజయవాడ మహా నగరాల మధ్య ఉన్న వారికి, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి ఒకే ప్యాకేజీ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం రైతు సంఘం నాయకులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగింది. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నష్టపోవడానికి సిద్ధంగా లేమని, సీఎం చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తే మా కష్టాలు తెలుపుతామని అన్నారు. మళ్లీ టీడీపీ రైతు సంఘం నాయకులు కల్పించుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో సీఆర్డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశానికి సీడ్ యాక్సెస్ రోడ్డులో భూములు కోల్పోయే రైతులు మాత్రమే హాజరు కావాలని డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు స్పష్టం చేశారు. -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్‌రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
రెచ్చిపోయిన పీకే బ్యాచ్.. మహిళా పోలీసులపైన పాలు
సాక్షి, విశాఖపట్నం/జగదాంబ: నిస్వార్థంగా సేవలందిస్తున్న వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ 35వ వార్డు పూర్ణామార్కెట్ జంక్షన్లో బుధవారం నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో జనసైనికుల పేరుతో కొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ప్రదర్శనలో అల్లకల్లోలం సృష్టించారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వలంటీర్లను అడ్డుకునేందుకు వీధిరౌడీల్లా ఎగబడ్డారు. వలంటీర్లు, మహిళలు, సాధారణ ప్రజలు, పోలీసులు అని చూడకుండా.. ఎవరు ఎదురుగా ఉంటే వారిపై తిరగబడ్డారు. చివరికి మహిళా పోలీసుల పట్లా దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు సంయమనం పాటించి వారిని నిలువరిస్తున్నా.. మద్యం మత్తులో జోగుతున్న జనసైనికులు వారిపై పాలు చల్లారు. మంటలంటుకొని ఉన్న పవన్ దిష్టిబొమ్మని మహిళా వలంటీర్లపైకి విసిరారు. దీంతో ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దిష్టిబొమ్మ ముక్కలు పడిపోవడంతో కండిపిల్లి వరలక్ష్మి చీరకు నిప్పంటుకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపు చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది. దాడికి పాల్పడ్డ 14 మంది జనసైనికులను టూ టౌన్పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 35వ వార్డు వలంటీర్లు, దుర్గాలమ్మ దేవస్థానం చైర్మన్ నాయిని మల్లిబాబు, మంగరాజు, కండిపల్లి వరలక్ష్మి, రమణమ్మ, నీలకంఠం, గౌరిశంకర్ పాల్గొన్నారు. -
భారత్ ఐడ్రాప్స్‌పై యూఎస్ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ
భారత్ కంపెనీ తయారు చేసిన ఆర్టిఫిషియల్ టియర్స్ అనే ఐడ్రాప్స్ పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఐ డ్రాప్స్ వాడటం వల్ల అత్యంత శక్తిమంతమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతవరకు ఇలాంటి బ్యాక్టీరియా జాతిని అమెరికాలో గుర్తించలేదని, ఇది ఏ యాంటి బయోటిక్స్‌కి లొంగదని యూఎస్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తన నివేదికలో పేర్కొంది. ఈ ఐ డ్రాప్స్‌ని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ కంపెనీ ఎజ్రీకేర్ బ్రాండ్ పేరుతో తయారు చేస్తోంది. ఐతే ఈ ఐడ్రాప్స్ కారణంగా ముగ్గురు మృతి చెందారని, ఎనిమిది మందికి అంధత్వం వచ్చిందని, డజన్ల కొద్దీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని సీడీసీ వెల్లడించింది. దీంతో అమెరికా ఆ ఉత్పత్తులన్నింటిని వెంటనే నిలిపేసింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ ఈ డ్రాప్స్‌లో కలుషితమైన కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల కంటి ఇన్షెక్షన్లు వస్తాయని, అది అంధత్వానికి లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ బ్యాక్టీరియా కారణంగా రక్తం, ఊపిరితిత్తులు ఇన్ఫక్షన్ అవుతాయని, దీని యాంటి బయోటిక్ రెసిస్టన్స్ కారణంగా చికిత్స చేయడం కష్టతరంగా మారిందని అమెరికా నివేదికలో తెలిపింది. ఈ ఐ డ్రాప్స్‌ని ఉపయోగించిన రోగులు, కంటి ఇన్ఫ్క్షన్లు వచ్చినా, అందుకు సంబంధించిన లక్షణాలు ఏమైనా తలెత్తిని వెంటనే వైద్యులను సంప్రదించాలని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్సీడీసీ స్పష్టం చేసింది. స్పందించిన గ్లోబల్ ఫార్మా కంపెనీ: ఈ మేరకు ఐ డ్రాప్స్‌ను తయారు చేసే గ్లోబల్ ఫార్మా కంటపెనీ డైరెక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. అమెరికా చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. ఆ ఐ డ్రాప్స్‌లో వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాలేదని, కలుషితమైన కృత్రిమైన నీటిని వినియోగించలేదని వెల్లడించారు. ప్రమాణాల అనుగుణంగానే ఈ డ్రగ్‌ని రూపొందించినట్లు తెలిపారు. దశల వారిగా జరిపిన పరిశోధనల్లో తమకు ఐ డ్రాప్స్‌లో అలాంటివేమి కనిపించలేదని, కలుషితమైన వాటిని ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. అమెరికా చేసిన ఆరోపణలను ఖండించారు. కూడా. ఈ ఐ డ్రాప్ తయారు చేసే డ్రగ్ ప్లాంట్ వద్ద కూడా కలుషిత నీటిని వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె నొక్కి చెప్పారు (చదవండి: యూకేలో పాస్‌పోర్ట్ సిబ్బంది సమ్మె) -
బ్రెజిల్ అల్లర్లపై ప్రధాని మోదీ ఆందోళన
న్యూఢిల్లీ: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీం కోర్టుపై మెరుపుదాడికి దిగారు. ఈ క్రమంలో బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘బ్రెసిలియాలోని ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేయడం, అల్లర్లు సృష్టించిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిలియన్ అధికారులకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial — Narendra Modi (@narendramodi) January 9, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్లో రణరంగం.. ఫాసిస్ట్ ఎటాక్‌గా అధ్యక్షుడి అభివర్ణన.. సంబంధం లేదన్న బోల్సోనారో -
దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో వాణిజ్యలోటు సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది (2021 జూన్‌లో ఈ విలువ 9.61 బిలియన్ డాలర్లు). దిగుమతుల బిల్లుపై క్రూడ్ ఆయిల్, బంగారం భారం పడుతుండడం గమనార్హం. ఈ పరిమాణం ఫారెక్స్ నిల్వలు తగ్గడంసహా కరెంట్ అకౌంట్ లోటు మరింత తీవ్రతకు (భారత్‌కు వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం), రూపాయి మరింత బలహీనతకు దారితీసే అంశం కావడం గమనార్హం. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తొలి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఎగుమతుల విభాగం ఇలా... ► నెలవారీ, వార్షికంగా చూసినా ఎగుమతుల వృద్ధి స్పీడ్ (17 శాతం) జూన్‌లో తగ్గడం గమనార్హం. 2022 మేలో ఎగుమతుల వృద్ధి 20.55 శాతం. 2021 జూన్‌లో ఈ రేటు ఏకంగా 48.34 శాతం. ► సమీక్షా నెల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. హై బేస్ కూడా దీనికి కారణమన్నది విశ్లేషణ. ► కాగా పెట్రోలియం ప్రొడక్టుల విలువ 98% ఎగసి 7.82 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.41% ఎగసి 3.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. దిగుమతుల తీరిది ► క్రూడ్ దిగుమతుల విలువ జూన్‌లో 94 శాతం పెరిగి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► బొగ్గు, కోక్ దిగుమతుల విలువ 1.88 బిలియన్ డాలర్ల నుంచి 6.41 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► పసిడి దిగుమతుల విలువ 169.5 శాతం ఎగసి 2.61 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతుల భారీ పెరుగుదల నేపథ్యంలో కేంద్రం వీటిపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బంగారం దిగుమతుల కట్టడి దీని లక్ష్యం. మొదటి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 47 శాతం పెరిగి 187.02 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 70.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 31.42 బిలియన్ డాలర్లు. రెట్టింపు కరెంట్ అకౌంట్ వాణిజ్యలోటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కరెంట్ అకౌంట్‌లోటు 13 బిలియన్ డాలర్లు. అయితే ఇది జూన్ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. 2022–23లో క్యాడ్ 100 నుంచి 105 బిలియన్ డాలర్లు నమోదుకావచ్చు. 2022లో ప్రతి నెలా 20 డాలర్లపైనే వస్తువులకు సంబంధించి వాణిజ్యలోటు కొనసాగుతుందని భావిస్తున్నాం. అయితే సేవల రంగం నుంచి ఎగుమతుల పురోగమనం కొంత ఊరటనిచ్చే అంశం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
అమలాపురానికి అదనపు బలగాలు.. నిలిచిపోయిన బస్సులు
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! ‘సాక్షి’తో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. -
ఎలుకలు పట్టాలా.. వైద్యం చేయాలా
ఎంజీఎం: ‘ఎలుకలు పట్టమంటారా.. లేకపోతే రోగులకు చికిత్స చేయమంటారా. మేమే పనిచేయాలో చెప్పండి’.. అంటూ ఎంజీఎం వైద్యులు ఎలుకల బోన్లను పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో వైద్యులపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీడీఏ) ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ప్రదర్శించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో నిజమైన బాధ్యులను వదిలేసి వైద్యులను అభద్రతాభావానికి గురిచేసేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైద్యులపై చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీడీఏ అధ్యక్షుడు రాజ్‌మోహన్, కార్యదర్శి హరిదేవ్, వైద్యులు పవన్, చంద్రబాను, అన్వర్‌మియా పాల్గొన్నారు. -
5జీ సేవలతో నెట్వర్క్.. భద్రతకు సవాళ్లు ?
న్యూఢిల్లీ: 5జీ సర్వీసులకు సంబంధించి నెట్వర్క్ భద్రత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతమున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సెన్సార్లు ఏవీ కూడా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2021 సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. ఈ నేపథ్యంలో 5జీని అందుబాటులోకి తేవడంలో సైబర్ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం, ఆపరేటర్లు అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సింగ్ పేర్కొన్నారు. 5జీ సేవలను విజయవంతంగా అందుబాటులోకి తేవాలంటే స్పెక్ట్రం ధర సముచితంగా అవసరమన్నారు. చదవండి: జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్’ -
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ధర్నా చేశారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంద శాతం అమ్మేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది, స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు. -
భారత్‌లో మతస్వేచ్ఛ; అమెరికా ఆందోళన
వాషింగ్టన్: యుగాలుగా అన్ని పరమత సహనం పాటిస్తూ వచ్చిన భారతదేశంలో మతస్వేచ్ఛ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు అమెరికా దౌత్యవేత్త సామ్యూల్ బ్రౌన్‌బాక్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మతస్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలను రికార్డు చేసి తయారు చేసిన ‘2019 అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం విడుదల చేశారు. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్ సోదరుడి ఆవేదన) ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే ‘ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్’ సంస్థకు అంబాసిడర్ అట్‌లార్జ్‌గా వ్యవహరిస్తున్న సామ్యూల్ బ్రౌన్‌బాక్ కొంతమంది విదేశీ విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘భారత్‌లో పరిణామాలు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నాయి. మేము ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులను చక్కదిద్దడానికి ఉన్నత స్థాయిలో భారత్ అంతర్గత చర్చలు ప్రారంభించాలి. మత స్వేచ్ఛపై భారత్ ప్రధానంగా దృష్టి సారించకపోతే హింస మరింతగా పెరిగి విపరిణామాలకు దారితీస్తుంద’ని సామ్యూల్ బ్రౌన్‌బాక్ అన్నారు. గతంలోనూ అమెరికా ఇదే తరహా ఆరోపణ చేయగా భారత్ దాన్ని తిరస్కరించింది. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్) -
వారంలో మూడుగంటలే!
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలైన మొదటి వారంలో రాజ్యసభ మూడు గంటలు మాత్రమే సవ్యంగా సాగింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతోనే సమయమంతా గడిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం సభ 28.30 గంటలపాటు జరగాల్సి ఉండగా 26 గంటలపాటు అంతరాయం కలిగిందని, కేవలం 2.42 గంటలపాటు మాత్రమే కార్యకలాపాలు సాగాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సమావేశాలు 9.50 శాతమే ఫలప్రదమ య్యాయని పేర్కొన్నాయి. దీంతోపాటు, ఫిబ్రవరి 12, మార్చి 1వ తేదీల మధ్య జరిగిన స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగం మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. -
ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పీలేరులో అధికారుల నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి యధావిథిగా పరీక్షలు జరగాల్సి ఉండగా, ఇప్పుడు కూడా పరీక్ష కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించడంతో 399 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
విశాఖలో ఆశ వర్కర్లు ఆందోళన
-
పంచామృత ప్రవాహం
ఒకానొకనాడు దక్షిణ భారతదేశం అంతటా సంగీతం ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే... కేవలం రాజులమీద పాటలు చెప్పడం... ఇంకా ఎంత హీనస్థితికి దిగజారిపోయిందంటే... రాజుల ప్రియురాళ్లు, ఆ స్థానాలలో నృత్యం చేసే రాజనర్తకులైన వాళ్లమీద పాటలు కట్టి రాజులు ఇచ్చే పడుపు కూడు తిని సంతోషించే స్థాయికి సంగీతకారులు వెళ్లిపోయారు. ఇది నాదోపాసన. ఇలా భ్రష్టుపట్టకూడదన్నది దైవ చింతన కాబోలు.ఇలాభోగం స్థలాభోగం–అని ఆ తిరువాయూరు చేసుకున్న అదృష్టమేమో గానీ అక్కడ ముగ్గురు వాగ్గేయకారులు ఒకే కాలంలో ఐదేసి సంవత్సరాల వ్యవధిలో జన్మించారు. వీరిలో మొదట జన్మించినవారు శ్యామ శాస్త్రిగారు. గొప్ప శ్రీవిద్యోపాసకుడు. అమ్మవారి దగ్గరకెళ్లి ఒక్కో కీర్తన చేస్తుంటే... ఆ తల్లి బుగ్గలు ఎరుపెక్కిపోయి కొడుకుని చూసుకుని మురిసిపోయేదట. అటువంటి శ్యామ శాస్త్రిగారి దగ్గర పాదుకాంత దీక్ష పుచ్చుకున్న వారు ముత్తుస్వామి దీక్షితులు. వీరు మూడవవారు. మధ్యలో వారు త్యాగరాజు. త్యాగరాజు తల్లిదండ్రులు రామబ్రహ్మం, సీతాదేవి. వారికి మొదట ఇద్దరు కుమారులు జన్మించారు. వారిద్దరూ సమాజం నుండి ప్రశంసలందుకున్నవారు కాదు. అదే ఊరి కోవెలలో వెలిసి ఉన్న పరమేశ్వరుడిని త్యాగరాజుగా అక్కడి భక్తజనులు సేవిస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పుత్ర సంతానాన్ని కటాక్షిస్తే ‘నీ పేరు పెట్టుకుంటాం’ అని ఆ తల్లిదండ్రులు మొక్కుకునేవారు. ఆయన అనుగ్రహం కలిగి వారికి మూడవ సంతానంగా కుమారుడు కలిగితే ‘త్యాగరాజు’ అని పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తల్లికి సంగీతంలో ప్రవేశం ఉంది. ఆమె పురంధరదాసు, అన్నమయ్య కీర్తనలు పాడుతుండేవారు. చిన్నతనం నుండీ త్యాగరాజు అమ్మ వెనకే తిరుగుతూ తను కూడా తల్లి గొంతుతో గొంతు కలిపి పాడుతుండేవాడు. అది తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు. అలా ఉండగా ఒకనాడు ఆయన ఒక కీర్తన రాశారు. అంటే కూర్చుని రాసింది కాదు. అమ్మ పాడుతూ ఉంటే, ఆ పాట విని ప్రేరణ పొంది, ఆ సీతారాముల పాదాలను మనసులో తలచుకోవడంవల్ల కలిగిన ఆనందం లోపల ఆగలేక.. నిండిపోయిన బిందె అంచుల వెంట నీరు కారిపోయినట్టు.. వారి నోటి వెంట అలవోకగా పంచామృత ప్రవాహమై ప్రవహించి కీర్తనయింది. అదే..‘రఘురామ...స్వామీ, నీకు జయమగుగాక..’. ఇదే ఆయన మొట్టమొదటి కీర్తన. ఆశ్చర్యపోయిన తండ్రి దానిని పండితులకు చూపితే, వారు కూడా మెచ్చుకోవడంతో ఎంత బంగారపు పళ్లెమయినా గోడ చేరుపు కావాలన్నట్లు ఒక గురువుగారి దగ్గర సుశిక్షితుడైతే బాగుంటుందనిపించి శొంఠి వేంకటరమణయ్య దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పెట్టారు. అలా ఉండగా త్యాగరాజుకు కలిగిన ఆర్తి... ఆ పరమేశ్వరుడికి వినపడింది. సాక్షాత్తూ సంగీతంలో దిట్టయిన నారద మహర్షి రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చి ఆ పిల్లవాడికి రామ మంత్రాన్ని ఉపదేశించారు. బాల త్యాగరాజు ఎంత నిష్ఠగా చేసేవాడంటే.. రోజుకు లక్షా 25వేల సార్లు రామ మంత్రాన్ని జపం చేయడంతో శరీరమంతా మంత్రపుటమైపోయింది. శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీత పాఠాలు ఎంత అభ్యసించినా కొన్ని కొన్ని సార్లు అనేకానేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతుండేవి. దీనిని తీర్చడానికా అన్నట్లు రామకృష్ణానంద స్వామివారే మరల వచ్చి స్వరార్ణవమనే గ్రంథాన్ని ఆయనకు బహూకరించారు. అలా మరే ధ్యాస లేకుండా త్యాగరాజు సంగీత సాధన సాగింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పార్లమెంట్లో తృణమూల్ ఎంపీల ఆందోళన
-
నిద్రలేమి వేధిస్తోంది...పరిష్కారం చెప్పండి
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 34 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నేను షిఫ్ట్‌లలో పనిచేస్తుంటాను. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. నాకు రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. హోమియోలో నా సమస్యకు పరిష్కారం ఉందా? ఉంటే దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – డి. వెంకటరమణ, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండిలాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రుళ్లు మళ్లీ మళ్లీ మెలకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్య పరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికీమాటికీ కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు : ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స : హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ నా వయసు 38 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం లభిస్తుందా? – డి. కొండల్రావు, సాలూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు : ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు : ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఈ కడుపునొప్పి తగ్గుతుందా? నా వయసు 42 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్ధకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – సూర్యకుమారి, నెల్లూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
గుంటూరులో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన
-
తిరుపతిలో డీఎస్సీ అభర్థులు ఆందోళన
-
రాపూరు ఎస్సైను అరెస్ట్ చేయాలి: దళితులు ఆందోళన
-
‘మూకదాడులపై నిర్లక్ష్యం’
న్యూఢిల్లీ: దేశంలో వరసగా వెలుగుచూస్తున్న మూకదాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో బూటకపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలతో ప్రభావితులై వ్యక్తులను కొట్టి చంపుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆక్షేపించింది. లైంగిక నేరాల వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌ల బెంచ్ శుక్రవారం పైవిధంగా స్పందించింది. ‘ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చాలా జరుగుతున్నాయి. ప్రజలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధులు ఆందోళన
-
ఇదేం లెక్క
అక్కన్నపేట(హుస్నాబాద్): అవి మూరుమూల గిరిజన తండాలు.. ఆపై కనీస సౌకర్యాలు లేవు. కొండల్లో, గుట్టల నడుమ ఉన్న తండాలపై ఇంత నిర్లక్ష్యమా!? అడవిలో నివసించేటోళ్లు అడవి లోనే ఉండాలా.. అని ఆ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఏ తండాకు వెళ్లాలన్నా కాళ్లు తడవాల్సిన పరిస్థితి. అక్కన్నపేట మండల కేంద్రానికి నాలుగు కిలో మీట ర్ల దూరంలోని బోదరవాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలు నేటికి కనీస సౌకర్యాలు లేక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ మూడు తండాల్లో దాదాపు 450కి పైగా జనాభా ఉంటుంది. కానీ ఈ తండాలు మండలం పరిధిలోనే లేవన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. తమ తం డాలన్నీ కలుపుకొని గ్రామ పంచాయతీ గా మార్చాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తండాలను గ్రామ పం చాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చెరువులు, కొండలు, గుట్ట లు, వాగులు ఉన్న తండాల్లో 300 నుంచి 400 వరకు జనాభా ఉంటే గ్రామపంచా యతీగా గుర్తించవచ్చని ప్రభుత్వం చెబు తోంది. కానీ ఆ తండాలను గుర్తించడం అటుంచి కనీసం ఆ వైపు కన్నెత్తి చూసే వారు లేక కనీస సౌకర్యాలు కరువై గిరి జనులు నరకయాతన పడుతున్నారు. ప్రతిపాదనలో కేశనాయక్ తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానున్న కేశనాయక్ తండాలో బోదర్ వాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలను కలిపితే చెరువుదాటి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మండల కేంద్రంలో కొనసాగిస్తే వాగు దాటి రావాల్సి ఉంది. గిరిజనులు ఏటు వెళ్లాలన్నా వాగైనా, చెరువైనా దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే పంచాయతీ పరిధిలో మూడింటికి ప్రతిపాదనలు హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వంగరామయ్యపల్లి, బల్లునాయక్ తండా, పూల్నాయక్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి గ్రామ పంచాయతీకి అర కిలో మీటర్ దూరంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో మూడు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేయడం రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు తమ తండాలపై దృష్టిసారించి కనీస సౌకర్యాల కల్పనతోపాటు గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి ఆలోచించాలని గిరిజనులు కోరుతున్నారు. పంచాయతీలుగా గుర్తించాలి బోదరవాగు తం డా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలవాసులు ఎటు వెళ్లాలన్నా చెరువైనా, వాగైనా దాటాల్సిన పరి స్థితి. ఆ తండాల చుట్టూ వాగు లు ఉన్నాయి. నేటికీ రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేవు. ఈ మూడు తండాలను కలిపి గ్రామపంచాయతీగా గు ర్తించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆం దోళనకు దిగుతాం. –బీమాసాహెబ్, గిరిజన జేఏసీ చైర్మన్ -
‘హెచ్–1బీ’ ప్రతిపాదన సరికాదు: యూఎస్‌సీసీ
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల గడువును పొడిగించకూడదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తుండటం సరైనది కాదని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్‌సీసీ) శనివారం పేర్కొంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రతిభాధారిత వలస వ్యవస్థ లక్ష్యాన్ని నీరుగారుస్తుందని యూఎస్‌సీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఎన్నో ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తూ, ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే ప్రతిభావంతులకు తమ దేశంలో స్థానం లేదనడం ఏ మాత్రం సరైనది కాదు’ అని యూఎస్‌సీసీ అధికార ప్రతినిధి అన్నారు. హెచ్–1బీ వీసాల గడువు పొడిగించకుండా, ఆ వీసాదారులను తిరిగి స్వదేశాలకు పంపేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారానికి, మొత్తంగా దేశానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. -
అసెంబ్లీ నడిపే తీరు గౌరవంగా లేదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల తీరుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ సభ నడిపే తీరు గౌరవంగా లేదంటూ ఆయన చాంబర్‌కు వెళ్లి నిరసన తెలిపారు. ఈ పరిస్థితి మారకపోతే తాము శాసనసభకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభాపతి మధుసూదనాచారితో కాంగ్రెస్ సభ్యులు భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో కలసి స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వకపోవడంతో సభకు హుందాతనం పోతోందని స్పీకర్‌కు విన్నవించారు. సభా నాయకుడికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మధ్య సమన్వయం చేయాలని సూచించారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదన్నారు. స్పీకర్, శాసనసభ గురించి మాట్లాడే పరిస్థితి రావటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నిర్వహణ సజావుగా లేకపోతే బాధ్యత స్పీకర్దేనని, ఇది మీ గౌరవానికి కూడా మంచిదికాదని స్పీకర్‌కు విన్నవించారు. అసెంబ్లీ ప్రభుత్వ సచివాలయం కాదని, అన్ని రాజకీయ పార్టీలకు వేదిక లాంటిదని విపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. -
ప్రేమించి మోసం చేశాడని..
గుడివాడ: ప్రేమించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుడివాడ పట్టణం నాగవరప్పాడుకు చెందిన లీలాపుష్పానికి టీచర్స్ కాలనీకి చెందిన ఎరుకపాటి సుదర్శన్‌తో ఆరేళ్ల క్రితం ప్రేమాయణం నడిచింది. అయితే వీరు నాలుగేళ్ల క్రితమే విడిపోయినట్లు సమాచారం. కాగా సుదర్శన్‌కు ఈనెల 21న వేరొక యువతితో వివాహం జరుగుతుందని తెలిసిన లీలాపుష్పం శుక్రవారం ఉదయం సుదర్శన్ ఇంటికి వెళ్లి గొడవకు దిగింది. అయితే సుదర్శన్‌కు వివాహం జరుగుతుందని ఈనెల 18నే ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో లీలాపుష్పం ఫిర్యాదు చేసిందని సీఐ దుర్గారావు తెలిపారు. యువతితోపాటు యువతి తల్లి, యువతి చెల్లి అక్కడ గొడవకు దిగిన వారిలో ఉన్నారు. సుదర్శన్ ఇంటివద్ద ఎటువంటి వివాహం జరగడం లేదని, గృహ ప్రవేశానికి విందు ఏర్పాటు చేసుకున్నారని సీఐ దుర్గారావు తెలిపారు. అయితే సుదర్శన్ అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని, వారి కోసం వెతుకుతున్నామని సీఐ తెలిపారు. -
ఆగ్రహజ్వాల
► మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు ► నిరాశలో ధూళిపాళ్ల, మోదుగుల, యరపతినేని ► రావెలను తొలగించడంపై దళిత సంఘాల ఆందోళన ► మోదుగుల కార్యాలయంలో కార్యకర్తల సమావేశం మంత్రి పదవులు ఆశించినపలువురు అధికార పార్టీ నేతలు భంగపడ్డారు. పార్టీకి విధేయులుగా ఉన్నా సీఎం చంద్రబాబు తమకు మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను నిర్లక్ష్యం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన చెందుతుండగా.. పల్నాడులోనే సీనియర్‌నైన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది.. సాక్షి, గుంటూరు: మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని బలమైన లాబీయింగ్ సాగించిన సొంత సామాజికవర్గ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు గట్టిగా షాక్ ఇచ్చారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు అమాత్య యోగం దక్కి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముఖ్యనేతలు కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంగంలో దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినట్లు సమాచారం. ‘ఆనంద’మానందమాయే.. వేమూరు నుంచి రెండు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనంద్‌బాబుకు మంత్రి పదవి దక్కింది. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా లాబీయింగ్, ఎస్సీల్లో సీనియర్ ఎమ్మెల్యే కావడం.. రెండు అంశాలూ నక్కా ఆనంద్‌బాబుకు కలిసి వచ్చాయి. దీంతో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సొంత సామాజికవర్గంలోనే.. అధికార పార్టీ సొంత సామాజికవర్గంలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు మంత్రి పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అన్యాయం జరిగిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పల్నాడులోనే సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతలపూడిలో ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. రెండు రోజుల్లో సీఎంను కలిసి సమస్యను అక్కడే పరిష్కరించుకుంటామని శ్రేణులకు ఆలపాటి చెప్పినట్లు సమాచారం. ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించే క్రమంలోరాయపాటి బలమైన లాబీయింగ్ చేశారు. చివరి నిమిషంలో పదవి చేజారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావును తొలగిస్తారని బలంగా ప్రచారం సాగింది. చివర్లో పరిస్థితి మారిపోవడంతో ప్రత్తిపాటి తన స్థానాన్ని కాపాడుకున్నారు. దీంతో జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన వారెవరికీ చోటు దక్కలేదు. రావెల తీవ్ర అసంతృప్తి మంత్రి పదవి నుంచి తొలగించడంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రాలేదు. ఉదయం రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు నేతలు రావెలను కలిసి మాట్లాడారు. మరోవైపు రావెలను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడులోని పాత మద్రాసు రోడ్డులో దళిత సంఘాలు ధర్నా నిర్వహించి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తాయి. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మరో జాతీయ పార్టీలో చేరే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. మోదుగులకు మొండి చేయి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత రెండో పర్యాయం ఎంపీ రాయపాటి సాంబశివరావు కోసం సీఎం చంద్రబాబు సూచనతో నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వదులుకుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంగీకరించి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్‌లు హామీ ఇచ్చారు. అయితే రెండు పర్యాయాలు పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్ బలంగా ప్రయత్నించి విఫలం అయ్యారు. -
అవిశ్వాసులపై దండయాత్ర!
ప్రవక్త జీవితం ఒక్క అబూ లహబ్ తప్ప, అందరూ అబూ తాలిబ్ మాటలతో ఏకీభవించారు. ముహమ్మద్ (స)ను ఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ‘ఇన్నాళ్ళూ సహించి ఊరకున్నాం. ఇక సహించే ప్రసక్తే లేదు’ అన్నారందరూ ముక్తకంఠంతో. అబూ లహబ్ మాత్రం కుటుంబ సభ్యులతో విభేదించి, శతృపక్షంలో చేరిపోయాడు.ఈ విషయం ముహమ్మద్‌కు చెబుదామని చాలా సంతోషంగా బయలుదేరారు అబూ తాలిబ్. కానీ ఆయన ఇంట్లో లేరు. ఎటువెళ్ళారో తెలియదన్నారు ఇంట్లోవాళ్ళు. అబూ తాలిబ్ మనసు కీడు శంకించింది. దుర్మార్గులు అబ్బాయికి ఏమైనా కీడు తలపెట్టారేమో అని తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే యువకులందర్నీ ఆయన సమీకరించి, కరవాలాలు తీసుకొని తన వెంట బయలుదేరమన్నారు. క్షణాల్లో యువకులంతా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. అబూ తాలిబ్ సూచన మేరకు అవి కనబడకుండా చొక్కాల లోపల దాచుకున్నారు. అబూ తాలిబ్ నేరుగా కాబా వైపు దారితీశారు. దారిలో ప్రవక్త పెంపుడు కొడుకు జైద్ బిన్ హారిసా (ర) ఎదురుపడి, ఏమిటీ విషయమని ఆరా తీశారు. ‘ముహమ్మద్ (స) హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి’ అని బదులిచ్చారు అబూ తాలిబ్. ‘అదేమిటీ! ఆయన నిక్షేపంగా కాబాలో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గర నుండే వస్తున్నాను’ అన్నారు జైద్. జైద్ మాటలతో అబూతాలిబ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయన మనసుకు ప్రశాంతత చేకూరింది. అయినా కాబా ఆలయానికి వెళ్ళి, అబ్బాయిని కళ్ళారా చూసుకోవాలని ముందుకు సాగారు.అకస్మాత్తుగా బనూహాషిం యువకుల్ని వెంటబెట్టుకొని అబూతాలిబ్ రావడం చూసి అవిశ్వాసులు ఆశ్చర్యపోయారు. ప్రశ్నార్థకంగా వాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. అది చూసి, అబూ తాలిబ్ ‘ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?’ అని ప్రశ్నించారు. ‘దేవుని తోడు. మాకు అసలు ఏమీ తెలియదు’ అన్నారు వారంతా ముక్తకంఠంతో. అప్పుడు అబూ తాలిబ్ విషయం వివరించి, యువకుల వైపు సైగ చేశారు. వెంటనే బనూహాషిం యువకిశోరాలు తాము లోపల దాచిన ఆయుధాలు బయటికి ప్రదర్శించారు.అప్పుడు అబూతాలిబ్, ‘దైవసాక్షిగా చెబుతున్నాను. మీరు గనక మా ముహమ్మద్‌కు హాని కలిగించి ఉన్నట్లయితే, మిమ్మల్ని కత్తికో కండగా కోసి, కుక్కల పాలు చేసేవాణ్ణి. ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేవాణ్ణి కాదు. మా ప్రాణాలు పోయినా సరే, చివరి రక్తపుబొట్టు వరకు మీతో పోరాడేవాణ్ణి’ అన్నారు.యువకుల ఖడ్గప్రదర్శన, అబూ తాలిబ్ ఉగ్రరూప వాగ్ధాటిని చూసి అవిశ్వాసుల గుండెలు జారిపోయాయి. బిత్తరపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోవడం ప్రారంభించారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వేతనాలు పెంచాలని హమాలి కార్మికులు ఆందోళన
-
కామన్ మెస్ ఎదుట విద్యార్థుల ఆందోళన
నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ వీసీ సాయన్న హామీతో విరమణ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ వద్ద హాస్టళ్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలనే డిమాండ్లతో ధర్నాకు దిగారు. ఈనెల 20న భోజనంలో ఇనుప మొలలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి కామన్ మెస్‌కు తాళం వేసి.. కేయూ వీసీ సాయన్న తమ వద్దకు రావాలని పట్టుబట్టారు. ‘ఇదే మి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం, పెరుగన్నం మీకు పురుగుల అన్నం మాకా’ అంటూ నినాదాలు చేశారు. వీసీ తమవద్దకు వచ్చేవరకు భోజనం చేసేది లేదని భీష్మించారు. సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేన్ సిబ్బంది వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థులు ఒప్పుకోలేదు. ఆందోళన విషయాన్ని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎన్ ప్రసాద్, వీసీ సాయన్న దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సూచన మేరకు మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు, అకడిమక్ ఆడిట్ డీన్ టి.రమేష్, ప్రొఫెసర్ బి. దిగంబర్‌రావు, ప్రొఫెసర్ దయాకర్‌రావు, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎన్ . ప్రసాద్ కామన్ మెస్వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చే వరకు ఆందోళన విరమించమని ప్రొఫెసర్లతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే కామన్ మెస్ గేట్ తాళం తీసినా విద్యార్థులు లోపలకు వెళ్లలేదు. పోలీసులు గోబ్యాక్, విద్యార్థి సంఘాల నాయకులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వీసీ సాయన్న కామన్ మెస్ వద్దకు వచ్చారు. విద్యార్థులు వీసీతోనూ వాగ్వాదానికి దిగారు. కామన్ మెస్‌లో సకాలంలో భోజనం అందడం లేదని, నాణ్యమైన భోజనం కావాలని, హాస్టళ్లలో వసతులు కల్పించాలని, ప్రతాపరుద్ర మెస్‌ను కూడా తెరిపించాలని డిమాండ్ చేశారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని వీసీ హామీ ఇచ్చారు. వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి 5–30 గంటల ప్రాంతంలో భోజనం చేశారు. కామన్ మెస్‌లో సుమారు 960 మంది విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు ప్రతాపరుద్ర మెస్‌లో, సెకండియర్ విద్యార్థులకు కామన్ మెస్‌లో భోజన సౌకర్యం కల్పించారు. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు కామన్ మెస్‌లోకి వెళితే ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఫస్టియర్, సెకండియర్ వారికి వేర్వేరుగా మెస్ సౌర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా, ఆందోళన నేపథ్యంలో భోజనం చేయకపోవటంతో గురువారం మధ్యాహ్నం ఓ విద్యార్థి నీరసించిపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారని సమాచారం. బియ్యంలో మొలలు వచ్చాయని విద్యార్థులు ఈనెల 20న ఆందోళన చేసిన నేపథ్యంలో బియ్యాన్ని మార్చామని హాస్టళ్ల డైరెక్టర్ తెలిపారు. -
ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళన
-
అందరికీ వసతి కల్పించాలని ఆందోళన
ఎస్కేయూ: విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం నాయకులు విద్యార్థులతో కలిసి ఎస్కేయూలో నిరసన తెలిపారు. ఆధునికీకరణ పనులు పూర్తి కాకుండానే హాస్టల్స్ పునఃప్రారంభిస్తున్నట్లు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. మెస్ బిల్లులు పూర్తీగా చెల్లించలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నార ని, కేవలం 10 శాతం మాత్రమే ఇపుడు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్కిన మొత్తాలు తరువాత కట్టేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతి కిరణ్, జయ చంద్రారెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేశులు, శ్రీధర్ గౌడ్, సుబ్బరాయుడు, ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చిరుతల కట్టడికి భరోసా
తిరుమల: తిరుమలలో చిరుతల సంచారంతో శ్రీవారి భక్తులు, స్థానికుల్లో తీవ్ర ఆందోళన పెరిగింది. దీనిపై వరుస కథనాలు, చిరుతల లైవ్ చిత్రాలతో సమస్య తీవ్రతను సాక్షి ఎత్తిచూపింది. దీనిపై టీటీడీ యాజమాన్యం స్పందించింది. చిరుతల్ని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు. ఎవ్వరూ భయపడవద్దని, రక్షణ చర్యలు వేగవంతం చేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భరోసా ఇచ్చారు. గోగర్భం డ్యాము నుంచి బాలాజీనగర్ మీదుగా జీఎన్సీ టోల్గేట్ వరకు సంచరిస్తున్న నాలుగు చిరుతల్ని బంధించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. వైల్డ్‌లైఫ్ విభాగంతో సంప్రదింపు జరిపించింది. అనుమతి రావంతో రెండు బోన్లు తెప్పించారు. బాలాజీ నగర్ శ్మశాన అటవీప్రాంతం, మరొకటి తూర్పు బాలాజీనగర్‌లో అమర్చారు. రాకుండా కట్టడి చేస్తాం చిరుతలు సాధారణంగా దాడి చేయవు. ఆహారన్వేషణలో దారి తప్పి సంచరిస్తుంటాయి. పరిస్థితి తీవ్రంగా కావటంతో బోన్లు ఏర్పాటు చేశాం. వాటిని బంధించటం కంటే, జనావాసాల్లో రాకుండా కట్టడి చేస్తాం. ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. - ఎన్వీ శివరామ్‌ప్రసాద్, డీఎఫ్‌వో, టీటీడీ భద్రతా సిబ్బందితో గస్తీ బృందాలు చిరుతల సంచారంపై టీటీడీ విజిలెన్స్ పరంగా చర్యలు తీసుకున్నాం. శివారు ప్రాంతాల్లో విజిలెన్స్ బృందాలతో గస్తీ పెంచాం. మొబైల్ వాహనాలతో గాలింపు చర్యలు చేపట్టాం. - రవీంద్రారెడ్డి, వీఎస్వో , టీటీడీ -
ఫిరాయింపులపై కాంగ్రెస్ ఆందోళన
వలసలకు అడ్డుకట్టపై నేడు నేతల భేటీ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ వీడిపోతుండటంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతోంది. వల సలను నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి ఆ పార్టీ శాసనసభాపక్షం గురువారం అసెంబ్లీలోని కమిటీహాలులో సమావేశం కానుం ది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిరాయింపులపై సీఎల్పీని ఏఐసీసీ వివరణ అడిగినట్టుగా సమాచారం. దీంతో సీఎల్పీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది. -
వీకే సింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన
-
కార్బైడ్‌ను ఎలా నిరోధిస్తారు?
-
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ రాజ్యసభలో బుధవారం ఉదయం జీరో అవర్ నడుస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఏపీకి చెందిన జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ సభ్యులు వి.హనుమంతరావు, ఎం.ఎ.ఖాన్ తమ స్థానాల నుంచి లేచి నినాదాలు చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు నోటీసులు ఇచ్చానని, చర్చకు అవకాశం ఇవ్వాలని జేడీ శీలం పట్టుబట్టారు. -
‘గాంధీ’ ఫార్మసీకి తాళం
* ఉద్యోగుల మధ్య గొడవే కారణం! * మందుల కోసం ఆందోళనకు దిగిన రోగులు గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇరువురు ఉద్యోగుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఫార్మసీకి తాళం పడింది. దీంతో మందుల కోసం రోగులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వృద్ధురాలు సోమవారం ఉదయం ఓపీ విభాగంలో వైద్యపరీక్షలు చేయించుకుంది. ైవైద్యుడు ఉచితంగా ఇచ్చే మందులను ఫార్మసీలో తీసుకొమ్మని చీటీ రాసి ఇచ్చాడు. దాన్ని వృద్ధురాలు పోగొట్టుకుంది. గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగంలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జగదీష్ వృద్ధురాలి పరిస్థితి గమనించి కంప్యూటరీ ఓపీ చిట్టీపై ఉన్న మందులను మరో కాగితంపై రాసిచ్చాడు. దీనికి ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాగ్వివాదం జరిగింది. ఈదశలో నవీన్ ఫార్మసీకి తాళం వేసి సూరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. రోగులకు మందులు అందక ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు వెంటనే ఫార్మసీని తెరిపించి మందులు ఇప్పించారు. రోగుల మధ్య తొక్కిసలాట జరగడంతో అవుట్‌పోస్ట్, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్ధారు. ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బాధితుల పరేషన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్కారు వైఫల్యం, అధికారుల ప్రణాళిక లోపం కలిసి తుపాను, వరద బాధితులను మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. తుపాను వచ్చి 12 రోజులైంది. ఆ వెంటనే నాగావళి వరదలతో జిల్లాలో 11 మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ఆర్భాటంగా సహాయం ప్రకటించినా.. సరైన వసతి, రవాణా సదుపాయాలు కల్పించకుండా పంపిణీ వేగవంతం చేయాలని ఒత్తిళ్లు పెంచుతున్నారు. తీరప్రాం తాలకు సరుకులు అందుతున్నా మైదాన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తీర మండలాలు మినహా మిగిలిన మండలాల్లో బియ్యం, ఉల్లి, బంగాళాదుంపలు, పామాయిల్, కారం, ఉప్పు వంటి సరుకులు అందడంలేదు. పంపిణీ జరుగుతున్న ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో లేకపోవడంతో రేషన్ షాపుల వద్ద బాధితులు బారులుతీరి సరుకుల కోసం ఎగబడుతున్నారు. గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. కమిటీలకు పంపిణీ బాధ్యతలు సరుకుల పంపిణీ బాధ్యతను జన్మభూమి-మాఊరు గ్రామ కమిటీలకు అప్పగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పడిన ఈ కమిటీలపై పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు విషయంలో పక్షపాతం చూపారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ కమిటీలకు సరుకుల పంపిణీని కూడా అప్పగించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో సుమారు 8.40 లక్షల రేషన్ కార్డులు(తెలుపు, గులాబీ, ఆంత్యోదయా, అన్నపూర్ణ) ఉన్నాయి. కాగా తుపాన్, అనంతరం వచ్చిన నాగావళి, వంశధార వరదల కారణంగా 22 మండలాల్లో 196 గ్రామాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 13 వార్డుల్లోనూ కలిపి మొత్తం 57,127 కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో మత్య్సకార కుటుంబాలు 33 వేలు ఉన్నాయి. తుపాను సాయం, సరుకులు మత్స్యకారులకు చాలా వరకు అందగా, మిగిలిన బాధితులకు మాత్రం అరకొరగానే అందింది. మత్య్సకారులకు, చేనేత కార్మికులకు {పత్యేక ప్యాకేజీ తుపాన్, వరదల్లో నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, లీటరు పామాయిల్, కందిపప్పు, పంచదార, కారం, ఉప్పు, ఇతర సరుకులతోపాటు ఉల్లిపాయలు, దుంపలు అంద జేయాలి. వీరు కాకుండా మిగిలిన బాధితులకు కుటుంబానికి 25 కేజీల బియ్యం, పామాయిల్, పంచదార, కారం, ఉప్పు కందిపప్పు, తదితర సరుకులు అందజేయాలి. మిగిలిన 7.80 లక్షల కార్డుదారులకు పింక్, తెలుపు అన్న తేడా లేకుండా కార్డుకు 10 కిలోల బియ్యం, పంచదార, పామాయిల్, కారంతోపాటుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. సరఫరాలో జాప్యం ఇప్పటివరకు జిల్లాకు 30 లారీల్లో సుబారు 480 మెట్రిక్ టన్నుల సరుకలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు ఉన్నాయి. అయితే వీటిని మండలాలకు చేరవేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కలాసీలు, రవాణా సదుపాయం లేకపోవడం కారణంగా చెబుతున్నారు. ఆదే విధంగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరిపడినంతగా బియ్యం నిల్వలు లేవు. దీంతో తహశీల్దార్లు మంజూరు చేసిన ఆర్ఓలు పట్టుకొని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
అగ్రి గోల్డ్ డిపాజిటర్ల ఆందోళన
రాయదుర్గంటౌన్: గడువు ముగిసినా డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించక పోవడంతో ఆగ్రహించిన గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన డిపాజిటర్లు బుధవారం రాయదుర్గంలోని అగ్రి గోల్డ్ ప్రైవేటు ఫైనాన్స్ క ంపెనీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఆపై సదరు సిబ్బందిని నిర్బంధించారు. డిపాజిట్ చెల్లించేంత వరకు కార్యాలయంలోనే ఉంటామంటూ తెగేసి చెప్పి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. ఆ గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఒక్కొక్కరు రూ.20 వేలలోపు దాదాపు రూ.5 లక్షలను డిపాజిట్ చేశారని వాపోయారు. గత జూన్ 30 నాటికే మెచ్యూరిటీ గడువు ముగిసినా ఇప్పటికీ మొత్తాన్ని చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. డిపాజిట్‌దారులు గోవిందు, అశ్వత్థమ్మ, వెంకటేశులు, హనుమంతరాయుడు, ఆంజనేయులు, లక్ష్మణ్ణ, సతీష్, రాజు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వకుండా ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, మేనేజర్ స్పందించక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని చెప్పారు. మేనేజర్ రాఘవేంద్ర గుప్త మాట్లాడుతూ విజయవాడలోని ప్రధాన కార్యాలయ అధికారులతో చర్చిస్తున్నామని, 15 రోజుల్లోగా డిపాజిట్లు చెల్లిస్తామని అన్నారు. అయితే ఇలాగే నమ్మించి తిప్పుకుంటున్నారని, తమ సొమ్ము చెల్లించే వరకు కదలబోమని డిపాజిటర్లు మేనేజర్ చాంబర్లో బైఠాయించారు. కూలీ, నాలీ చేసుకుంటూ చెల్లించిన డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమేమిటని ప్రశ్నించారు. -
రైతన్న కన్నెర్ర
బొంరాస్‌పేట: గింజగట్టిపడే దశలో నీళ్లందక పంటలు ఎండిపోవడం చూసి అన్నదాతలు ఆవేదన చెందారు. కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఉదాసీనవైఖరిపై మండి పడ్డారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో ఆందోళనకు గురైన అన్నదాతలు మంగళవారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో హైదరాబాద్- బీజాపూర్ అం తర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. సరఫరాలో వేళలు పాటించి కనీసం రోజుకు ఆరుగంటల కరెంట్ల పాటు సరఫరా చేయాలని డి మాండ్‌చేశారు. గంటపాటు జరిగిన ఆందోళన లో తమగోడును వినిపించారు. మండలంలోని కొత్తూరు, బడిచర్ల, మహంతీపూర్, నాగిరెడ్డిపల్లి, ఏనెమీదితండా, కట్టుకాల్వతండా, ఊరెనికితండా, రాంనాయక్‌తండాలతోపాటు మరి కొన్ని తండాలు, గ్రామాలకు విద్యుత్ సరఫరాచేసేందుకు మంజూరైన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు పూర్తికాకపోవడంతోనే కరెం ట్ సమస్యతలెత్తింది.కాగా,ఎస్సైశ్రీనివాస్ రైతు లను సముదాయించి ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు. అనంతరం రైతులు మం డల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యను తీర్చేందుకు ఉపతహశీల్దార్ కిష్ట్యానాయక్, ట్రాన్స్‌కో ఏఈ హరినాథాచారి భరోసాఇచ్చారు. ‘కొత్తూరు శివారులో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు లైన్ ఏర్పాటుదశకు వచ్చాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తవుతాయి. ఆ తరువాత 22 గ్రామాలకు కరెంట్‌సమస్య తీరుతుంది..’అని ట్రాన్స్‌కో ఏఈ హరినాథచారి తెలిపారు. -
ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు
బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరుకు రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు... జోరువానలోనూ రోడ్డెక్కి నినదించారు. పార్వతీపురం డివిజన్లోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో దాదాపుగా అన్ని మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున శనివారం రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు. రైతు సంఘ నాయకులు బయట ఉంటే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందన్న ఉద్దేశ్యంతో శుక్రవారం అర్థరాత్రి నలుగురు చెరకు రైతు సంఘ నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పార్వతీపురంలో రెడ్డి శ్రీరాంమూర్తిని, సాలూరులో గేదెల సత్యనారాయణను, సీతానగరంలో రెడ్డి ఈశ్వరరావును, రెడ్డియ్యవలసలో రెడ్డి లక్ష్ముంనాయుడులను ఇళ్ల వద్ద నుంచి తీసుకు వెళ్లి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా తడుస్తూనే పోరాటాన్ని కొనసాగించారు. ఆరు గంటల నుంచే ఆందోళన డివిజన్లోని బొబ్బిలి, బలిజిపేట, సీతానగరం, మక్కువ, బాడంగి, తెర్లాం తదితర మండలాల్లో రైతులంతా ఏపీ చెరకు రైతు సంఘం ఇచ్చిన పిలుపుమేరకు శనివారం ఉదయమే నాటుబళ్ల, టైరు బళ్లతో రహదారులపైకి రావడం మొదలుపెట్టారు. పక్కి, చింతాడ, కోమటిపల్లి, కారాడ, అలజంగి, పణుకుపేట, అంటిపేట, కాశయ్యపేట, పిరిడి, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో నాటుబళ్లనురోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనలు చేశారు. బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన రైతులు టైరుబళ్లను తీసుకొని బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఏపీచెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటియు నాయకుడు రెడ్డి వేణు,పి శంకరరావు తదితరుల ఆధ్వర్యంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పార్వతీపురం న్యాయమూర్తి కారును అడ్డుకున్నారు. న్యాయమూర్తి వాహనానికి దారి ఇవ్వాలని పోలీసులు కోరినా మాకే న్యాయం లేదని మేం రోడ్డుమీదకు వస్తే మీకు దారికావాలా అంటూ ఆ వాహనం ముందుకు వెళ్లి నినాదాలు చేశారు..దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నుంచి మొదలైంది.. నాయకుల అరెస్టు... పోలీసులతో వాగ్వాదం బొబ్బిలి కాంప్లెక్స్ జంక్షనులో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులనుడీఎస్పీ ఇషాక్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా అరెస్టు చేశారు.. అప్పటివరకూ మీడియాతో మాట్లాడుతున్న నాయకులను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. రైతు సంఘ నాయకుడు మర్రాపు సూర్యనారాయణతో పాటు సీఐటీయూ నాయకుడు రెడ్డి నాయకుడు, రైతు సంఘ నాయకులు ఉడుముల భూషణరావు, తాళ్లపూడి వెంకటరమణలను అరెస్టు చేసి రామభద్రపురం పోలీస్ స్టేషనుకు తరలించారు. దీంతో అక్కడ పోలీసులకు, రైతులకు మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం జరిగింది. ‘‘మాకు రావలసిన బిల్లులు అడగడం కోసం ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని, అదే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన వారి ఆస్తులకు కాపాలా కాసి, వారికి రాచమర్యాదలు చేస్తున్నారంటూ’’ దుయ్యబట్టారు. రోడ్డుపై బైఠాయించి మేం అందోళనను విరమించము. ఎంతమందిని పట్టుకెళ్తారో పట్టుకెళ్లండంటూ ఎదురుతిరిగారు.. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పుతుందనుకున్నారు. అయితే పోలీసులే ఒక అడుగు వెనక్కి వేసి గంట కాలం ఆందోళన చేసుకోమని అనుమతి ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ రైతులు ఆందోళనను చేశారు. అప్పటివరకూ వాహనాలు ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితులపై ఆస్పత్త్రి వెళ్లే వారి వాహనాలను రైతులు విడిచిపెట్టారు. ఇక్కడ బందోబస్తు నిర్వహించేందుక ఆరు వందల మందికి అదనంగా మరికొంత మంది పోలీసులను విశాఖ జిల్ల నుంచి రప్పించారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం క్రైం : గృహ నిర్మాణ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆ ఉద్యోగులు గురువారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. చంద్రబాబు వస్తే ఇంటికొక ఉద్యోగమని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తొలగిస్తోందని ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పలసూరి విమర్శించారు. గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్‌లను కొనసాగించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. దర్నానుద్దేశించి మాట్లాడిన ఆయన బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేసి నేడు ఉన్న ఉద్యోగులను తొలగించడం సరికాదని విమర్శించారు. ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందన్నారు. 146 జీఓ ప్రకారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేసి ఒక్క గృహ నిర్మాణ శాఖలోనే ఉద్యోగులను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. గృహ నిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని ఈ నెల 20 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు పి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అవుట్ సోర్సింగ్ విభాగంలో 2007 నుంచి ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వర్కు ఇన్ స్పెక్టర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు, అటెం డర్లు పని చేస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి ఇప్పుడు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇతర శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ఉద్యోగుల వలె కొనసాగిం పు ఉత్వర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.విష్ణువర్ధన్, కోశాధికారి జి. రాంబాబు, పి.శ్రీహరినాయుడు, జారుుంట్ సెక్రటరీలు ఎస్.రాధాకృష్ణ, ఎస్.వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఆఫర్లకోసం మీరాచోప్రా అగచాట్లు
-
ఆందోళన బాటలో ఉపాధ్యాయులు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలోని ఉపాధ్యాయులను టెక్కలి డివిజన్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని అధికారులు యోచిస్తుండడమే ఇందుకు కారణం. రెండు రోజుల క్రితం కలెక్టర్ సౌరభ్ గౌర్, విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్ష జరుపుతూ టెక్కలి డివిజన్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, అక్కడకు డిప్యుటేషన్లు వేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యుటేషన్ల ప్రతిపాదనను ఉపాధ్యాయ సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఓ సారి సడీచప్పుడు లేకుండా డిప్యుటేషన్లు వేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని సంఘాల నేతలు పేర్కొన్నారు. మండల పరిధిలో మాత్రమే డిప్యుటేషన్లు వేయాలని ఉత్తర్వులు చెబుతుండగా, డివిజన్నే మార్చాలని యోచించడం తగదని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం చివర్లో డిప్యుటేషన్లు వేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మొండిగా వేస్తే ఆందోళన చేయకతప్పదని హెచ్చరించారు. ఈ మేరకు సంఘాలు చేసిన తీర్మానం ప్రతిని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారికి అందజేశారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ నాయకులు వి.హరిశ్చంద్రుడు, భైరి అప్పారావు, ఏపీటీఎఫ్ నేతలు సన్నశెట్టి రాజశేఖర్, కొప్పల భానుమూర్తి, యూటీఎఫ్ నేతలు గొంటి గిరిధర్, చౌదరి రవీంద్ర, ఎస్టీయూ నాయకులు పేడాడ ప్రభాకరరావు, డీటీఎఫ్ నాయకులు పి.కృష్ణారావు, హెచ్ఎంల అసోసియేషన్ నేత ఎ.బలరామకృష్ణారావు, ఆపస్ నాయకుడు దుప్పల శివరామప్రసాద్, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు పి.సూర్యనారాయణ, కె.కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ పీఈటీలు కూడా.. శ్రీకాకుళం మున్సిపాలిటీ: కేజీబీవీల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల పనివేళల సమస్యను ఈ నెలాఖరులోగా పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నేత మోహన్ చెప్పారు. దీనికి పీఈటీలందరూ సిద్ధం కావాలన్నారు. పట్టణంలోని శారద డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమతో 24 గంటలూ పనిచేయించుకోవడం దారుణమన్నారు. దీనిపై పునరాలోచన చేయాలని ఎన్నోసార్లు కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం నేతలు సీహెచ్.శ్రీనివాసరావు, ఎస్.అప్పలరాజు, వై.రామారావు, ఎల్.ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మా పిల్లల భవిష్యత్తు బలిచేస్తారా?
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాధికారి నిర్లక్ష్యంతో తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు సంఘీభావం తెలిపారు. ఈ సం దర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మెదక్ మండల విద్యాశాఖ కార్యాలయంలో నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష నిమిత్తం సుమారు 400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 74 దరఖాస్తులు ఎంఈఓ కార్యాలయంలోనే మూలన పడేశారని ఆరోపించారు. గడువు ముగిసిన నెల రోజుల తరువాత దరఖాస్తులు వర్గల్ నవోదయ విద్యాలయానికి పంపడం తో తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. మెదక్ ఎంఈఓ కార్యాలయంలో నిర్ణీత గడువులోనే అందజేసినప్పటికీ.. అప్పట్లో ఇన్చార్జ్ ఎంఈఓ సాయిబాబా అనారోగ్య పరిస్థితి వల్ల సెలవులో ఉన్నారన్నారు. దీంతో గడువు ముగిసే వరకు కూడా మెదక్ ఎంఈఓ కార్యాలయంలోనే దరఖాస్తులు పడేశారని ఆరోపించారు. కానీ ఉపాధ్యాయుల జీతాలు, మధ్యా హ్న భోజన బిల్లులు ఎలా వచ్చాయంటూ వారు ప్రశ్నించారు. ఈ విషయమై డీఈఓ రమేష్‌కు ఫోన్లో తమ గోడును విన్నవించు కోగా తాను షటిల్ ఆడుతున్నానంటూ ఫోన్ పెట్టేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిం చారు. అనారోగ్య కారణంగా ఎంఈఓ సాయిబాబా సెలవు పెట్టిన వెంటనే మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. ఇందుకు ప్రధాన కారకుడు డీఈఓనేనని వారు ఆరోపించారు. తమ పిల్లల భవిష్యత్‌తో ఆడుకున్న డీఈఓను వెంటనే సస్పెండ్ చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వి నతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, నాగరాజు, బంగారయ్య, సిద్దిరాంలు, అప్పారావు, కిష్టయ్య, శ్రీధర్, నర్సింలు, మల్లేశం, పోచయ్య, రాంచందర్, రమేష్, కొండల్‌రెడ్డి, భూపాల్, లక్ష్మణ్‌గౌడ్, ైశె లేంద్ర, విద్యార్థి నాయకుడు దత్తు ఉన్నారు. -
భారీ వర్షం: రైతులు ఆందోళన
-
ఆందోళనలో అన్నదాతలు
నిర్మల్, న్యూస్‌లైన్ : వరుణుడు కరుణించాడని ఆనందపడాలో.. అధిక వర్షాలతో పంటలు తెగుళ్ల బారి న పడుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి రైతన్నది. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక రైతులు నష్టపోయారు. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి సరాసరిగా 558.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 1056.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే సాధారణం కంటే 90 శాతం అధికం. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి రైతులు నష్టపోయారు. జిల్లాలో ఈ ఏడాది 5,23,273 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయగా అందులో వర్షాల కారణంగా 1.14 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. తెగుళ్లను నివారించడానికి రైతులు ఆర్థిక కష్టాలు పడే అవకాశం ఉంది. అయితే ఆశించిన తెగుళ్లను ఎలా నివారించాలో నిర్మల్ ఏడీఏ వినయ్‌బాబు ‘న్యూస్‌లైన్’కు వివరించారు. దుంప తెగుళ్ల బారిన పసుపు పసుపు సాగు రైతన్నకు ఆదిలోనే కష్టాలు తెచ్చిపెట్టింది. జిల్లాలో పసుపు 5,028 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పసుపు చేనులో నీరు నిల్వ ఉండటంతో దుంప తెగులు సోకింది. ఈ దుంప తెగులు నివారించడానికి చేనులో నీరు నిలువ లేకుండా చూడాలి. రిడోమిల్ ఒక గ్రాము లేదా క్రాప్టాన్ రెండు గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పక్షం రోజుల్లో రెండు సార్లు చేసినట్లయితే తెగుళ్లను నివారించవచ్చు. పత్తికి కుళ్లు జిల్లావ్యాప్తంగా పత్తి 3,10,500 హెక్టార్లలో సాగైంది. అధిక వర్షాలతో కుళ్లు తెగుళ్లు ఆశిస్తుండడంతో పంట ఎదుగుదల లోపిస్తోంది. దీనిని నివారించడానికి మొదటగా చేనులోని నీటిని బయటకు పంపించాలి. అనంతరం ఎకరానికి 25 నుంచి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలి. కుళ్లు తెగుళ్లు రాకుండా ఉండేందుకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును ఒక లీటరు నీటిలో కలిపి పంటపైన, మొక్క మొదళ్లలో 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పంట వేసి 40 రోజుల నంచి 45 రోజుల సమయం అయితే దానిపై రసం పీల్చే పురుగులు ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా కాండం పూత పద్ధతి పాటించాలి. ఇందుకోసం పావు లీటరు మోనోక్రోటోఫాస్‌ను లీటరు నీటిలో కలిపి కాండంపై పూత పూయాలి. ఇది రెండు నుంచి మూడు ఎకరాలకు సరిపోతుంది. అయితే పిచికారి చేస్తే మిత్ర పురుగులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే కాండం పూత పూయాలి. ఇది 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు చేస్తే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. సోయాబీన్‌కు లద్దె పురుగు జిల్లాలో సోయా పంట 1,19,907 హెక్టార్లలో సాగైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లద్దె పురుగు ఆశించే ప్రమాదం ఉంది. లద్దె పురుగు ప్రధానంగా ఆకు అడుగున పెట్టే గుడ్ల నుంచి పిల్ల పురుగులు వందల సంఖ్యలో పెరిగి ఆకులను తినడంతో ఆకులు పూర్తిగా పోయి ఈనెలు మాత్రమే మిగులుతాయి. ప్రధానంగా ఈ ప్రభావం అధిక వర్షాల వల్లే ఉంటుంది. దీనికి ప్రధానంగా 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే లద్దె పెరుగు ప్రభావం ఉండదు. అలాగే లద్దె పురుగులు పంట పొలంలోని సాళ్లలో రాత్రివేళలో నివాసం ఉంటాయి. వాటిని అరికట్టేందుకు తౌడు, బెల్లం, మంచినూనె, మోనోక్రోటోఫాస్, క్లోరోఫైరిపాస్ను గానీ కలిపి సాళ్లలో వేస్తే అవి చనిపోతాయి. వర్షం లేని సమయాన్ని చూసి వేయాలి. నీరు పట్టిన మొక్కజొన్న జిల్లాలో మొక్కజొన్న 8,200 హెక్టార్లలో సాగైంది. ప్రధానంగా మోగి పురుగు ఆశిస్తోంది. మోగి పురుగు ఆశిస్తే దానికి కార్బొఫ్యూరాన్ గుళికలు రెండు నుంచి మూడు గ్రామాలు వేయాలి. ముందుగా మొక్కజొన్న పంట పొలంలో ఉన్న నీటిని తీసివేయాలి. ఆ తర్వాత ఈ గుళికలు వేస్తే మోగిపురుగును నివారించవచ్చు. నెల రోజులుగా పంట నీళ్లలోనే.. - సల్ల ప్రకాశ్‌రెడ్డి, రైతు, దిలావర్పూర్ నేను రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాను. అయితే కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూర్తిగా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో పంట అంతా నీళ్లలో మునిగింది. ఆ నీళ్లు పోయాయో లేదో మళ్లీ వర్షాలు కురస్తుండడంతో నెల రోజులుగా పంటంతా నీళ్లలోనే ఉంది. దీంతో తెగుళ్లు ఆశించాయి. నేను ఇప్పటిదాక రూ.25వేల పైనే ఖర్చు పెట్టాను. ఈ తెగుళ్ల కోసం మరింత ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది.